Brahmapuranamu    Chapters   

సప్తమోధ్యాయః

సూర్యవంశ నిరూపణమ్‌

లోమహర్షణ ఉవాచ -

మనోర్వైవస్వతస్యాన న్పుత్రావై నవ తత్సమాః | ఇక్ష్యాకుశ్చైవ నాభాగో ధృష్టః శర్యాతి రేవ చ || 1

నరిష్యంతశ్చ షష్ఠో వై ప్రాంశూ రిష్టశ్చ సప్తమః | కరూశశ్చ పృషధ్రశ్చ నవైతే ముని సత్తమా ః || 2

అకరో త్పుత్రకామస్తు మను రిష్టిం ప్రజాపతిః | మిత్రావరుణయోర్విప్రాః పూర్వమేవ మహామతిః || 3

అనుత్పన్నేషు బహుషు పుత్రేష్వేతేషు భోద్విజాః | తస్యాం చ వర్తమానాయా మిష్ట్యాంచ ద్విజసత్తమాః ||4

మిత్రావరుణయోరంశే మను రాహుతిమావహత్‌ | తత్ర దివ్యాంబరధరా దివ్యాభరణభూషితా || 5

దివ్యసంహననాచైవ ఇలా జజ్ఞ ఇతి శ్రుతిః | తా మిలే త్యేవ హోవాచ మను ర్దండధర స్తదా || 6

అనుగచ్ఛస్య మాం భ##ద్రే తమిలా ప్రత్యువాచహ|ధర్మయు క్తమిదం వాక్యం పుత్రకామం ప్రజాపతిమ్‌|| 7

లోమహర్షణుడు పలికెను - వైవస్వతమనువునకు తొమ్మండ్రు కుమారులు గల్గిరి. వారు తండ్రియంతవారు. ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, రిష్టుడు, కరూశుడు, పృషధృడు యనువారు. వారుకల్గకముందు మనువు మిత్రావరుణులనుద్దేశించి పుత్రకామేష్టినొనసరించెను. అందతుడు మిత్రావరుణులనెంచి యాహతులిచ్చెను. అక్కడ దివ్యాంబరా భరణములుదాల్చి దివ్యశరీరముతో ఇల యను నంగన యావిర్భవించెనని వినికిడి. మనువు దండధరుడై యామెను ఇలా ఇలాయని పేర్కొని ఓ కల్యాణి నావెంటరమ్మని పిలిచెను. పుత్రకామియైన యాప్రజాపతింగని ధర్మయుక్తముగ నిట్లుపల్కెను.

మిత్రావరుణయోరంశే జాతాస్మి వదతాం వర | తయోః సకాశం యాస్యామి నమాం ధర్మహతాం కురు || 8

సైవముక్త్వా మనుం దేవం మిత్రావరుణయో రిలా|గత్వాంతికం వరారోహా ప్రాంజలి ర్వాక్య మబ్రవీత్‌ || 9

నేను మిత్రావరుణులయంశమున బుట్టినదానను. వారిసన్నిధికేగెదను. నన్ను ధర్మదూరురాలింగావింపకుమని పలికి వారికడ కేగి ప్రాంజలియై యిట్లనియె.

అంశేస్మి యువయో ర్జాతా దేవౌ కిం కిరవాణి వామ్‌ | మనునా చాహ ముక్తా వా అనుగచ్చస్వ మామితి || 10

తౌ తథావాదినీం సాధ్వీమిలాం ధర్మపరాయణామ్‌| మిత్రశ్చవరుణ శ్చోభా వూచతు స్తాం ద్విజోత్తమాః||11

ఓ మిత్రావరుణ దేవతలార ! మీ యంశముచే జనించినదాన. మీకేమి సేయుదును. మనువు తన నమవర్తింపుమన్నాడని యిల పలికినంతవారు ధర్మపరాయణయగు నాసాధ్వింగూర్చి యిట్లపలికిరి.

అనేన తవ ధర్మేణ ప్రశ్రయేణ దమేన చ | సత్యేనచైవ సుశ్రోణి ప్రీతౌ స్వో వరవర్ణిని || 12

అవయోస్త్వం మహాభాగే ఖ్యాతిం కన్యేతి యాస్యసి | మనో ర్వంశకరః పుత్ర స్త్వమేవ చ భవిష్యసి || 13

సుద్యుమ్న ఇతి విఖ్యాత స్త్రిషు లోకేషు శోభ##నే | జగత్ర్పియో ధర్మశీలో మనో ర్వంశవివర్ధనః || 14

మానిని ! నీ ధర్మము వినయము ఇంద్రియనిగ్రహము సత్యమనువానికిం బ్రీతులైతిమి. ఓ సుందరి ! మహానుభావయగు నీవు మా కన్యవుగా ఖ్యాతినందుదువు. మనువునకు వంశకరుండగు కుమారుడవు గూడ నీవ యయ్యెదవు. జగత్ర్పియుడవు ధర్మశీలుడవు. మనువంశ వర్ధనుడ వయ్యెదవు. నుద్యుమ్నుడను పేర ముల్లోకములందు ప్రసిద్ధుడవయ్యెదవు.

నివృత్తా సాతు త చ్ఛ్రత్యా గచ్చంతీ పితు రంతికాత్‌|బుధే నాంతర మాసాద్య మైథువా యోపమంత్రితా || 15

సోమపుత్రాద్భుధా ద్విప్రాస్తస్యాం జజ్ఞే పురూరవాః | జనయిత్వా తతః సా త మిలా సుద్యుమ్నతాం గతా || 16

సుద్యుమ్నస్యతు దాయాదా స్త్రయః పరమధార్మికా ః | 17

అంతనామె వారిమాటలు విని వెనుదిరిగిపోవుచు దారిలో బుధునిచే గామింపబడి సంగమమువడసి సోమపుత్రుడగు నాతని వలన పురూరవుడను కొడుకుంగనియెను. అవ్వల నామె సుద్యుమ్నుడను పేర మగవాడయ్యెను. సుద్యుమ్నుని దాయాదులు పరమ ధార్మికులు ముగ్గురు.

ఉత్కలశ్చ గయశ్చైవ వినతాశ్వశ్చ భోద్విజాః | ఉత్కలస్యోత్కలా విప్రా వినతాశ్వస్య పశ్చిమా || 18

దిక్పూర్వా మునిశార్దూలా గయస్యతు గయా స్మృతా | ప్రవిష్టే తు మనౌ విప్రా దివాకర మరిందమమ్‌ || 19

దశధా తత్పునః క్షత్రమకరో త్పృథివీ మిమామ్‌|ఇక్ష్వాకుర్జ్యేష్ఠ దాయాదో మధ్యదేశ మవాప్తవాన్‌ || 20

కన్యాభావాత్తు సుద్యుమ్నో నైతద్రాజ్య మవాప్తవాన్‌| వశిష్ఠవచనా త్త్వాసీత్ప్రతిష్ఠానే మహాత్మనః||21

ప్రతిష్ఠా ధర్మరాజస్య సుద్యుమ్నస్య ద్విజోత్తమాః| తత్పురువనే ప్రాదాద్రాజ్యం ప్రాప్య మహాయశాః 22

మానవేయో ముని శ్రేష్ఠా ః స్త్రీపుంసోర్లక్షణౖ ర్యుతః |ధృతవాం స్తా మిలేత్యేవం సుద్యుమ్నేతి చవిశ్రుతః ||23

ఉత్కలుడు, గయుడు, వినతాశ్వుడు ననువారు ఉత్కలుని భార్య ఉత్కల, వినతాశ్వుని వల్లభ పశ్చిమదిక్కు, గయుని భార్య ప్రాగ్దిక్కు గయ యను పేర్లందినది మనువు సూర్యునందు జొచ్చినంతట నీతని దాయాదులు క్షత్రజాతివారీ పృథివిని బదిభాగము లొనరించిరి. జ్యేష్ఠుడు 'ఇక్ష్వాకువు' మధ్యదేశమును బడసెను. సుద్యుమ్నుడు మున్ను కన్యయై యున్నందున రాజ్యభాగములేని వాడయ్యెను. వశిష్టవచనముచే ప్రతిష్ఠానమందు ధార్మికుడైన సుద్యుమ్నునకి ప్రతిష్ఠ (ఉనికి) లభించెను. దానినితడు పురూరపున కొసంగెను. సుద్యుమ్నుడు మనువుకుమారుడయ్య స్త్రీ పుంసలక్షణములు గలవాడై (ఇల-సుద్యుముడునని పిలువcబడుచు) పృథివిం ధరించెను.

నారిష్యంతా ః శకాః నాభాగస్యతు భో ద్విజాః | అంబరీషోభవత్పుత్రః పార్థి వర్షభసత్తమా ః 24

ధృష్టస్య ధార్షకం క్షత్రం రణదృప్తం బభూవ హ | కరూశస్యచ కారూశాః క్షత్రియా యుద్ధదుర్మదాః|| 25

నాభాగధృష్టపుత్రాశ్చ క్షత్రియా వైశ్యతాం గతాః | ప్రాంశోరేకోభవత్పుత్రః ప్రజాపతి రితి స్మృతః 26

నరిష్యంతష్య దాయాదో రాజా దండధరో యమః| శర్యాతే ర్మిథునం త్వాసీదానర్తో నామ విశ్రుత ః || 27

పుత్రః కన్యా సుకన్యా చ యా పత్నీ చ్యవనస్యహ | ఆనర్త స్యతు దాయాదో రైవో నామ మహాద్యుతి ః 28

అనర విషయశ్చైవ పురీ చాస్య కుశస్థలీ | రైవన్య రైవతః పుత్రః కకుద్మీ నామ ధార్మికంః || 29

జ్యేష్ఠః పుత్రః స తస్యా೭೭ సీద్రాజ్యం ప్రాప్య కుశస్థలీం సకన్యా సహితః కృత్వా గాంధర్వం బ్రహ్మణోతికే ||

ముహూర్తభూతం దేవస్య తస్థౌ మభుయుగం ద్విజాః | అజగామ స చైవాథ స్వాం పురీం యాదవై ర్వృతామ్‌ ||

కృతాం ద్వారవతీం నామ బహుద్వారాం మనోరమామ్‌ | భోజవృష్ణ్యంధకై ర్గుప్తాం వసుదేవవురోగమైః||32

తత్త్రైవరైవతో జ్ఞాత్వా యథాతత్త్వం ద్విజోత్తమాః | కన్యాం తాం బలదేవాయ సుభద్రాం నామరేవతీమ్‌ || 33

దత్త్వా జగామ శిఖరం మేరో స్తపసి సంస్థితః | రేమే రామోపి ధర్మాత్మా రేవత్యా సహితః సుఖీ || 34

నాభాగుని కొడుకులు నరిష్యంతులు శకులు ననువారు. అతనికి అంబరీషుడును పుత్రుడై జనించెను. ధృష్టునికి రణదృప్తమయిన క్షత్రజాతి ధార్షికమనుపేర నుదయించినది. కరూశునికి కారూశులు కల్గిరి. వారును యుద్ధమునం దుద్ధతులు. నాభాగధృష్టసంతానమైన క్షత్రియులు వైశ్యత్వమునందిరి. ప్రాంశువునకు ప్రజాపతియును కుమారుడుగల్గెను. నరిష్యంతునిదాయాది దతంధరుడు. శర్యాతికి ఆనర్తుడను కుమారుడు సుకన్యయను కన్యయు మిథునముదయుంచెను. సుకన్య చ్యవనమహర్షి కిల్లాలయ్యెను అనర్తుని దేశ మానర్తము. అతనిరాజధాని కుశస్థలి. ఆనర్తునిదాయాది రైవుడని నాతడు మహాతేజస్వి. రైవుని పెద్దకొడుకు (రైవతుడు కకుద్మియను పేరుగలవాడు ధార్మికుడు. కుశస్థలి రాజధానిగా రాజ్యమేలినవాడు. తన కన్యకతోనేగి బ్రహ్మసన్నిధి నొక్క ముహూర్తకాలముండి గాంధర్వమును (సంగీతమును) విన్నవాడు. అమ్ముహూర్తకాలము పుడమిపై పెక్కు యుగమ్ములయ్యెను. అతడు తన రాజధానికిc దిరిగివచ్చెను. అప్పుడా నగరమును యాదవు లావరించియుండిరి. పెక్కుద్వారములు గలదియై యప్పుడది ద్వారకయను పేర మనోహరమయ్యెను. అది భోజనవృష్ణ్యంధకకులమువారగు వసుదేవాదుల పాలనమందుండెను. రైవతుడది తెలిసికొని బలదేవునకు దన కన్యను (రేవతిని) సుభద్రయను పేరు గలదానిని నొసంగెను. ఆ మీద మేరుశిఖరమునకేగి తపస్సు నందుండెను. ధర్మాత్ముడగు బలరాముడును రేవతీదేవితో సుఖముగ విలసించెను. (24-34)

మునయ ఊచు ః-

కథం బహుయుగే కాలే సమతీతే మహామతే | న జరా రేవతీం ప్రాప్తా రైవతం చ కకుద్మినమ్‌ || 35

మేరుం గతస్య వా తస్య శర్యాతే ః సంతతిః కథమ్‌ | స్థితా పృథివ్యా మద్యాపి శ్రోతు మిచ్ఛామతత్త్వత ః || 36

మునులడిగిరి - పెక్కుయుగములు గడచెగదా ? రేవతికి కకుద్మికి (రేవతుని కుమారునికి) ముదిమిరాలేదేమి? మేరుపునకేగిన శర్యాలికిని గల్గిన సంతతి యిప్పటికిని పృథివియంచెట్లున్నది. ఈ విషయము స్పష్టముగ వినగోరుచున్నాము (35-36)

లోమహర్షణ ఉవాచ -

న జరా క్షుత్పిపాసా వా న మృత్యు ర్మునిసత్తమా ః | ఋతుచక్రం ప్రభవతి బ్రహ్మలోకే సదానఘా ః || 37

కకుద్మినస్తు స్వర్లోకం రై వతస్య గతస్య హి | హృతా

పుణ్యజనైర్విప్రా రాక్షసై సా కుశస్థలీ | తస్య భ్రాతృశతం త్వాసీ ద్ధార్మికస్య మహాత్మన ః || 38

తద్వధ్యమానం రక్షోభి ర్దిశః ప్రాక్రామ దప్యుత | విద్రుతస్య చ విప్రేంద్రాస్తస్య భ్రాతృశతస్యవై || 39

అన్వవాయస్తు సుమహాం స్తత్ర తత్ర ద్విజోత్తమాః | తేషాం హ్యేతే మునిశ్రేష్ఠాః శర్యాతా ఇతి విశ్రుతా ః || 40

క్షత్రియా గుణసంపన్యా దిక్షు సర్వాసు విశ్రుతాః | సర్వశః సర్వగహనం ప్రవిష్టాస్తే మహౌజనః|| 41

నాభాగరిష్ఠపుత్రౌ ద్వౌ వై శ్యౌ బ్రాహ్మణతాం గతౌ | కరూశస్య తుకారూశాః క్షత్రియా యుద్ధదుర్మదాః||42

పృషధ్రో హింసయిత్వా తు గురోర్గాం ద్విజసత్తమాః| శాపాచ్చూ ద్రత్వమాపన్నో నవైతే పరికీర్తితాః || 43

మహర్షుడిట్లనియె-

అనఘులార ! బ్రహ్మలోకమున ముదిమి యుండదు. అకలిదప్పికలుండవు మృత్యువుండదు. ఋతు చక్రము తిఱుగదు స్వర్లోకమేగిన రేవత కుమారుడగు కక్కుద్మియొక్క రాజధాని కుశస్థలి రాక్షసులచే హరింపబడెను. అతనికి సోదరులు నూరుగురుండిరి. కాని వారు రక్షగణముబారిబడి చావుదప్పి నలుదెసలకు బారిపోయిరి. వారి వంశమందందు చెల్లాచెదరైనది. వారి పరంపర వారు శర్వాతులను పేరందిరి. గుణవంతులయిన యాక్షత్రియులు సర్వదిక్కులంటిపోయి గహనములంజొచ్చిరి. నాభాగునియొక్కయు నరిష్టునియొక్కయు కొడుకు లిర్వురు వైశ్యులు బ్రాహ్మణత్వముం బడసిరి. కరూశుని సంతతి కారూశులు. వృషదుడను వాడు గురుధేనువును హింసించి, గురుశాపముచే శూద్రత్వమందెను. ఇది యా తొమ్మండ్ర చరిత్ర.(37-43)

వైవస్వతస్య తనయా మునేర్వై మునిసత్తమాః | క్షువతస్తు మనోర్విప్రా ఇక్ష్వాకు రభవ త్సుత ః || 44

తస్య పుత్రశతం త్వాసీ దిక్ష్వాకో ర్భూరి దక్షిణమ్‌| తేషాం వికుక్షి ర్జ్యేష్ఠస్తు వికుక్షిత్వా దయోధతామ్‌ || 45

ప్రాప్తః పరమధర్మజ్ఞ సోయోధ్యాధిపతిః | ప్రభుః శకుని ప్రముఖాస్తస్య పుత్రాః పంచశతం స్మృతాః||46

ఉత్తరాపథదేశస్య రక్షితారో మహాబలాః | చత్వారింశద్దశాష్టౌచ దక్షిణస్యాం తథా దిశి || 47

వశాతిప్రముఖా శ్చాన్యే రక్షితారో ద్విజోత్తమా ః | ఇక్ష్వాకుస్తు వికుక్షిం వా అష్టకాయా మథా೭೭దిశత్‌ || 48

మాంసమానయ శ్రాద్ధార్థం మృగాన్హత్వా మహాబల | శ్రాద్ధకర్మణి చోద్దిష్టో అకృతే శ్రాద్ధకర్మణి || 49

భక్షయిత్వా శశం విప్రాః శశాదో మృగయాం గతః ఇక్ష్వాకునా పరిత్యక్తో వశిష్ఠవచనా త్ర్బభు ః || 50

వైవస్వతమనువు మునియే. అతడు తుమ్మగా నందుండి ఇక్ష్వాకువు పుట్టెను, అతనికి నూర్గురు పుత్రులు పుట్టిరి. వారు భూరిదక్షిణలిచ్చి యజ్ఞములు గావించినవారు, వారు వికుక్షి పెద్దవాడు . కుక్షిలేని వాడగుటచే అయోధ్యత్వమును పొందెను ( ఎదిరి యుద్ధముచేయ నశక్యము గాని వాడయ్యెను.) అందుచేతనే యతని రాజధాని అయోధ్య యనబడెను. అయన పుత్రులు శకుని మొదలయిన వారయిదువందలమంది ఉత్తరాపథము నేలు వారైరి. మహా బలశాలురు. యేబడి ఎనిమిదిమంది దక్షిణదిశను బాలించిరి. ఇక్ష్వాకువు వికుక్షిని అష్టకా శ్రాద్ధమందు మాంసము తెమ్మని పంపెను. శ్రాద్ధనిమిత్ము గనుక శశమును (కుందేటిజాతి) జంపి యతడామాంసమును తానే దిని శశాదుడను పేరంది, వశిష్ఠు మాటంబట్టి ఇక్ష్వాకుచే పరిత్యక్తుడై వేటకు బోయెను. (44-50)

ఇక్ష్వాకౌ సంస్థితే విప్రాః శశాదస్తు నృపోభవత్‌ | శశాదస్య తు దాయాదః కకుత్థ్సోనామ వీర్యవాన్‌ || 51

అనేనాస్తు కకుత్థ్సస్య పృథు శ్చానేనసః స్మృతః | విష్టరాశ్వః పృథోః పుత్రస్త స్మాదార్ద్ర స్త్వజాయత || 52

అర్దృస్య యువనాశ్వస్తు శ్రావస్త స్త త్సుతో ద్విజాః | జజ్ఞే శ్రావస్తకో రాజా శ్రావస్తీ యేన నిర్మితా || 53

శ్రావస్తస్య తు దాయాదో బృహదశ్వో మహీపతిః | కువలాశ్వఃసుతస్తస్య రాజా పరమధార్మికః || 54

ఇక్ష్వాకువుండగనే శశాదుడు రాజయ్యెను. శశాదుని దాయాదుడు కకుత్థ్సుడు. మంచి బలశాలి. ఆయన కొడుకు అనేనుడు. (ఏనస్సు పాపము ఆదిలేనివాడు అనేనస్సు) అతిని కొడుకు ప్భథుడు. వానికి విష్టరాశ్వుడు. వానికార్ట్రుcడు. వానికి యువనాశ్వుడు, వానికి శ్రావుడు, గల్గిరి. శ్రావస్తకుడు శ్రావుని కుమారుడు శ్రావస్తి నగర నిర్మాత. వాని కొడుకు బృహదశ్వుడు వాని సుతుడు కువలాశ్వుడు. పరమధర్మమూర్తి. ధుంధువను వానివ సంహరించి ధుంధుమారు డననయ్యె (51-55)

మునయ ఊచు ః -

ధుంధోర్వధం మహాప్రాజ్ఞ శ్రోతుమిచ్ఛామ తత్త్వతః | యద్వధా త్కువలాశ్వోసౌ ధుంధుమారత్వ మాగతః ||

మునులడిగిరి | ఓ నూత ! ఎవని కువలాశ్వుడు ధుంధుమారుడయ్యెనో అధుంధువధను గూర్చి వినగోరుచున్నాము. (56)

లోమహర్షణ ఉవాచ :-

కువలాశ్వస్య పుత్రాణాం శత ముత్తమధన్వినామ్‌ | సర్వే విద్యాసు నిష్ణాతా బలవంతో దురాసదాః || 57

బభూవు ర్ధార్మికాః సర్వే యజ్వానో భూరిదక్షిణాః | కువలాశ్వం పితా రాజ్యే బృహదశ్వోన్యయోజయత్‌ || 58

పుత్ర సంక్రామితశ్రీస్తు వనం రాజా వివేశహ | త ముత్తంకోథ విప్రర్షిః ప్రయాంతం ప్రత్యవారయత్‌ || 59

నూతిడిట్లు చెప్పదొడంగె- కువలాశ్వునికి నూర్గురు కొడుకులు ఉత్తమధానుష్కులు అందరు విద్వాంసులు. అజయ్యులు ధార్మికులు. ఎల్లరు భూరిదక్షిణులయిన యజ్వలు. బృహదశ్వుడు కువలాశ్వుని రాజ్యమందుంచి వనమునకు ప్రస్థానము సేయబోగా యతని నుత్తంక మహర్షి పోవలదని వారించెను. (57-59)

ఉత్తంక ఉవాచ-

భవతా రక్షణం కార్యం తచ్చ కర్తుం త్వ మర్హసి | నిరుద్విగ్న స్తపశ్చర్తుం నహి శక్నోమి పార్థివ || 60

మామా೭೭ శ్రమసమీపే వై సమేషు మరుధన్వసు | సముద్రోవాలుకాపూర్ణ ఉద్దాలక ఇతి స్మృతః || 61

దేవతానామ వధ్యశ్చ మహాకాయో మహాబలః | అంతర్భూమిగత స్తత్ర వాలుకాంతర్హితో మహాన్‌ || 62

రాక్షసస్య మధోః పుత్రో ధుంధుర్నామ మహాసురః | శేతే లోకవినాశాయ తప ఆస్థాయ దారుణమ్‌ || 63

సంవత్సరస్య పర్యంతే స విశ్వాసం విముంచతి |యదా తదా మహీ తత్ర చలతిస్మ సరాధిప || 64

తస్య నిశ్వాసవాతేస రజ ఉద్దూయతే మహత్‌ | అదిత్యపథమావృత్య సప్తాహం భూమికంపనమ్‌ || 65

స విస్ఫులింగం సాంగారం సధూమ మతిదారుణమ్‌ | తేన తాత నశక్నోమి తస్మిం స్థాతు స్వఆశ్రమే || 66

తం మారయ మహాకాయం లోకానాం హితకామ్యమా | లోకాః స్వస్థా భవంత్యద్య తస్మిన్వినిహతే త్వయా || 67

త్వం హి తస్య వధాయైకః సమర్థః పృథివీపతే | విష్ణువా చ వరో దత్తో మహ్యం పూర్వయుగే నృప || 68

యస్తం మహాసురం రౌద్రం హనిష్యతి మహాబలమ్‌ | తస్యం త్వం వరదానేన తేజశ్చాఖ్యాపయిష్యసి || 69

నహి ధుంధు ర్మహాతేజా స్తేజసా ల్పేన శక్యతే | నిర్దగ్ధుం పృథివీపాల చిరం యుగశ##తైరపి ||

వీర్యం చ సుమహ త్తస్య దేవైరపి దురాసదమ్‌ || 70

స ఏవముక్తో రాజర్షి రుత్తంకేన మహాత్మనా | కువలాశ్వం సుతం ప్రాదా త్తసై#్మ ధుంధునిబర్హణ || 71

బృహదశ్వ ఉవాచ -

భతవన్న్యస్తశస్త్రోహ మయం తు తనయో మమ | భవిష్యతి ద్విజ శ్రేష్ఠ ధుంధుమారో న సంశయః || 72

స తం వ్యాదిశ్య తనయం రాజర్షి ర్ధుంధుమారణ | జగామ పర్వతాయైవ నృపతిః సంశితవ్రతః || 73

ఉత్తంకు డిట్లనియో - నీవు రక్షణ సేయవలసినవాడవు అందలకర్హుడవు. నేను ఆందోళనము లేకుండ తపస్సుc జేయుటకుచాలను నా ఆశ్రమ సమీపమున చదునైన మరుధన్వములనెడి ప్రదేశములందు సముద్రుడు వాలుకాపూర్ణుడై (ఇసుక మేటలు వేసినది) ఉద్దాకుడని పిలవబడును. ఆ సుముద్రమందు దేవతలకేని యవధ్యుడు మహాకాయుడు బలశాలి ఇసుకలోన శయనించియుండు మధు పుత్రుడగు ధుందుడను మహాసురుడు. లోకనాశనమునకు దారుణతపమొనరించుచుండును. సంవత్సరము చివర వాడొకసారి నిట్టూర్పుపుచ్చును. అప్పుడు భూకంపము వచ్చును. వాని నిఃశ్వాసవాయువుచే నిసుకలేచి ఏడురోజులు ఆదిత్యమండలము దాక కప్పివైచును. మిణుగురులతో, నిప్పులతో, పొగతో నది యతి దారుణము నగనుండును. నేనచట తపమొనరింపC నిలువలేకుంటిని. లోక క్షేమమున కీవువాని సంహరింపుము. తన్మారణమొనరింప లోకములు స్వస్థములగును. నొవొక్కడవ వాని సంహరింప సమర్ధుడవు. వానం జంపిన వానికి వరములిచ్చి వాని ప్రతాపఖ్యాతి గావింపుమని విష్ణువు నాకు వరమిచ్చెను. వాడు మహాతేజస్వి. అల్పతేజస్వి చేత మడియడు అన నా ఉత్తంకుని పలుకువు విని తన సుతుని కువలాశ్వుని జూపి స్వామి ! నేనస్త్రత్యాగము చేసితిని. ఈతడు ధుంధు వధ యొనరింపCజాలునని చెప్పి తీవ్రతపోనిష్ఠకై పర్వతమున కేగెను. (60 -73)

లోమహర్షణ ఉవాచ -

కువలాశ్వస్తు పుత్రాణాం శ##తేనసహ భోద్విజాః | ప్రాయా దుత్తంసహితో ధుంధో స్తస్య నిబర్హణ || 74

తమావిశ త్తదా విష్ణు స్తేజసా భగవా న్ప్రభుః | ఉత్తంకస్య నియోగాద్వై లోకానాం హితకామ్యయా || 75

తస్మిన్ప్రయాతే దుర్ధర్షే దివి శబ్దో మహానభూత్‌ | ఏష శ్రీమా నవధ్యోద్య ధుంధుమారో భవిష్యతి ||76

దివ్యైర్గంధైశ్చ మాలైశ్చ తం దేవాః సమవాకిరన్‌ | దేవదుందుభయశ్చైవ ప్రణదు ర్ద్విజసత్తమా || 77

స గత్వా జయతాం శ్రేష్ఠ స్తనయైః సహా వీర్యవాన్‌ | సముద్రం ఖానయామాస వాలుకాంతర మవ్యయమ్‌ || 78

తస్య పుత్రైః ఖనద్భిశ్చ వాలుకాంతర్హిత స్తదా | ధుంధు రాసాదితో విప్రా దిశ మావృత్య పశ్చిమామ్‌||79

ముఖజే నాగ్నినా క్రోధా ల్లోకా నుధ్వర్తయన్నివ | వారి సుస్రావ వేగేన మహోదధి రివోదయే || 80

సోమస్య మునిశార్దూలా వరోర్మికలిలో మహాన్‌ | తస్య పుత్రశతం దగ్ధం త్రిభి రూనం తు రక్షసా || 81

తతః స రాజా ద్యుతిమా న్రాక్షసం తం మహాబలమ్‌ | ఆససాద మహాతేజా ధుంధుం ధుంధు వినాశనః || 82

తస్య వారిమయం వేగ మాపీయ స నరాధిపః | యోగీ యోగేన వహ్నించ శమయామాస వారిణా || 83

నిహత్య తం మహాకారం బలే నోదకరాక్షసమ్‌ | ఉత్తంకం దర్శయామాస కృతకర్మా నరాధిపః || 84

ఉత్తంకస్తు వరం ప్రాదా త్తస్త్మె రాజ్ఞే మహాత్మనే |

దదౌ తస్యాక్షయం విత్తం శత్రుభి శ్చాపరాజితమ్‌ | ధర్మేరతిం సతతం చ స్వర్గే వాసం తథా క్షయమ్‌ || 85

పుత్రాణాం చాక్షయాన్‌ లోకాన్‌ స్వర్గే యే రాక్షసా హతాః || 86

లోమహర్షణు డిట్లనియొ - ఓ బ్రాహ్మణులారా ! కువలాశ్వుడు నూర్గురు కొడుకులతో ధుంధుని పైకి దండెత్తెను. ఉత్తంకుడాతని వెంటనుండెను. అప్పుడు విష్ణుభగవాను డాతని నావేశించెను. అతడెత్తి చసువేళ ''నీతడు శ్రీమంతుడు. అవధ్యుడు. తప్పక ధుంధువును జంపగలడ'' ను శబ్దము నింగిని వినబడెను. అతనినిదేవతలు దివ్యగంధమాల్యములచే ముంచెత్తిరి. దేవ దుందుభులు మ్రోగెను. అతడు సుతులతోనేగి సముద్రమును మూలమట్టుగా త్రవ్వించెను. పడమటి దిశ నారక్కసుడు బయలువడి వారినెదిరించెను. వాని ముఖాగ్ని పెనుగాలితో రేగి లోకముల దహించినట్లయ్యెను. వెల్లువలై నీరుబికెను. మువ్వురు దక్క తక్కినవారెల్లరు దగ్ధులయిరి. అవ్వల రాజు వానిపైకెత్తెను. యోగిగావున యోగబలమున జలమునించి యగ్నిని శమింపజేసెను. ఉదక రాక్షసుడగు వానిని గూల్చి యుత్తంకునికి జూపెను. అక్షయధనము - అరి విజయము ధర్మమందాసక్తి అక్షయస్వర్గవాసమను వరములుత్తంకుడాఱని కిచ్చెను. రాక్షసునిచేc గూలిన కుమారులక క్షయలోకములు గలుగునట్లును వరమిచ్చెను. (74 - 86)

తస్యపుత్రాస్త్రయః శిష్టా ధృడాశ్వో జ్యేష్ఠ ఉచ్యతే | చంద్రాశ్వకపిలాశ్వౌ తు కనీయాం సౌ కుమారకౌ || 87

ధౌంధుమారేర్దృఢాశ్వస్య హర్యశ్వశ్చా೭೭ త్మజః స్మృతః | హర్యశ్వస్య నికుంభో భూతత్ర ధర్మరతః సదా || 88

సంహతాశ్వో నికుంభస్య సుతో రణవిశారదః | ఆకృశాశ్వకృశాశ్వౌ తు సంహతాశ్వసుతౌ ద్విజాః || 89

తస్య హైమవతీ కన్యా సతాం మన్యా దృషద్వతీ | విఖ్యాతా త్రిషు లోకేషు పుత్ర శ్చాస్యాః ప్రశేనజిత్‌ || 90

లేభే ప్రసేన జిద్భార్యాం గౌరీం నామ పతివ్రతామ్‌ | అభిశస్తాతు సా బర్త్రా నదీవై బాహుదా భ##వేత్‌ || 91

తస్యపుత్ర్యో మహానాసీ ద్యువనాశ్వో నరాధిపః మాంధాతా యువనాశ్వస్వ త్రిలోక విజయీ సుతః || 92

తస్య చై త్ర రథీ భార్యా శశిబిందోః సుతా భవత్‌ | సాధ్వీ బిందుమతీ నామ రూపేణాసదృశీ భువి || 93

ప్రతివ్రతా చ జ్యేష్టా చ భ్రాతౄణా మయుతస్యవై | తస్యా ముత్పాదయామాస మాంధాతా ద్వౌ సుతౌ ద్విజాః || 94

పురుకుత్సంచ ధర్మజ్ఞం ముచుకుందం చ పార్థివమ్‌ | పురుకుత్స సుతస్త్వాసీత్త్రదస్యు ర్మహీపతిః || 95

నర్మదాయా మథోత్పన్నః సంభూత స్తస్య చా೭೭ త్మజః | సంభూతస్య తు దాయాద స్త్రిధన్వా రిపుమర్దనః || 96

రాజ్ఞ స్త్రిధన్వన స్త్వాసీ ద్విద్వాం స్త్రయ్యారుణః ప్రభుః | తస్య సత్య వ్రతోనామ కుమారో భూ న్మహాబలః|| 97

పరిగ్రహణ మంత్రాణాం విఘ్నం చక్రే సుదుర్మతిః | యేన భార్యా కృతోద్వాహా హృతా చైవ పరస్య హ || 98

బాల్యా త్కా మాచ్చ మోహాచ్చ సాహసా చ్చాపలేన చ | జహార కన్యాం కామార్తః కన్యచి త్పుర వాసినః || 99

అధర్మశంకునా తేన తం త్రయ్యారుణో త్యజత్‌ | అపధ్వంనేతి బహుశో వద న్క్రోధ సమన్వితః || 100

సో బ్రవీత్పితరం త్యక్తః క్వ గచ్ఛామీతి వై ముహుః | పితా చ తమథోవాచ శ్వపాకైః సహవర్తయ || 101

నాహం పుత్రేణ పుత్రార్థీ త్వయా ద కులపాంపస | ఇత్యుక్తః స నిరాక్రామ న్నగరా ద్వచనా త్పితుః 102

న చ తం వారయామాస వశిష్ఠో భగవానృషిః | సతు సత్యవ్రతో విప్రాః శ్వపాకావసథాంతికే || 103

పిత్రా త్యక్తో వసద్వీరః పితా ప్యస్య వనం య¸° | తత స్తస్మింస్తు విషయే నావర్షత్పాకశాసనః || 104

సమా ద్వాదశ భో విప్రా స్తేనాధర్మేణ వై తదా | దారాంస్తు తస్య విషయే విశ్వామిత్రో మహాతపాః || 105

సంన్యస్య సాగరాంతే తు చకార విపులం తపః | తస్య పత్నీ గలే బద్ధ్వా మధ్యమం పుత్ర మౌరసమ్‌ || 106

శేషస్య భరణారార్థాయ వ్యక్రీణా ద్గోశ##తేన వై | తం చ బద్ధం గలే దృష్ట్వా విక్రయార్ధం నృపాత్మజః || 107

మహర్షిపుత్రం ధర్మాత్మా మోక్షయామాస భో ద్విజాః | సత్యవ్రతో మహాబాహు ర్భరణం తస్య చాకరోత్‌ || 108

విశ్యామిత్రస్య తుష్ట్యర్థ మనుకంపార్థ మేవ చ|

సో భవ ద్గా లవో నామ గలే బంధా న్మహాతపాః | మహర్షిః కౌశికో ధీమాం స్తే న వీరేణ మోక్షితః || 109

ఇతి శ్రీ మహా పురాణ బ్రాహ్మే సూర్యవంశనిరూపణం నామ సప్తమోధ్యాయః

వానికి మిగిలిన కుమారులు ముగ్గురు. పెద్దవాడు దృఢాశ్వుడు చంద్రాశ్వ - కపిలాశ్వులు తరువాతి వారు. ధుంధుమార కుమారుడైన దృఢాశ్వునికి హర్యశ్వడనువాడు కలిగెను. వానికి నికుంభుడుదయించే. అతడు క్షత్రధర్మపరుcడు. అతని కొడుకు సంహతాశ్వుడు. రణవిశారదుడు. వాని తనయులు అకృశాశ్వకృశాశ్వులు. కూతురు హైమవతి, దృషద్వతి అనిఖ్యాతిగాంచెను. ఆమె కొడుకు ప్రసేనజిత్తు.అతడు గౌరియను భార్యనుబడసెను. ఆమె మహాసాధ్వి. భర్తృ శాపముచే నామె బాహుదయనునదియయ్యె. అతని కొడుకు యువనాశ్వుడు వాని కొడుకు మాంధాత. త్రిలోక విజయి యాయన. అతని భార్య చైత్రరథి. శశిబిందుని కూతురు సాధ్వి. బిందుమతియనుపేరుకలది. పరమసుందరి పదివేలమంది కామె యప్పగారు. ఆమె యందు మాంధాత యిర్వురు కుమారుల గనెను. పురుకుత్సుడు ముచికుందు డనువారు వారలు. పురుకుత్సుని సుతుడు త్రసదస్యుడు. నర్మదయందుc గలిగినవాడు. వానికొడుకు సంభూతుడు. వాని కుమారుడు త్రిధన్వుడు. శత్రుమర్దనము జేసినవాడు. ఆయనతనయుడు విద్వాంసుడు త్రయ్యారుణుడు ప్రభువు. వాని కుమారుడు సత్యవ్రతుడు మహాబలాశాలిక్రూరుడు. పరిగ్రహణ మంత్రములకు విఘ్నముల కల్పించి మరొక్కని భార్యను హరించినవాడు. బాల్యము చేత కామముచే మోహముచే సాహసముచే చాపల్యముచే వాడంతః పురమున నివసించు నొక గృహస్థుని కన్యను హరించెను. త్రయ్యారుణుడు అ యధర్మశంకచేత క్రోధసమన్వితుడై అతనిని నిందించి పరిత్యజించెను. నేనెక్కడకుc బోదునని వాడనెను. నీవు శ్వపచులతోc గూడియుండుమని తండ్రియనెను. నీవు కులపాంసనుడవు. నీచే సేను పుత్రవంతుడ గాననియె. వాడు తండ్రిమాటను బట్టి నగరమును వీడిపోయెను. ఋషియైన వశిష్ఠ భగవానుడు పోవలదని వానిని వారింపడయ్యె. ఆ సత్యవ్రతుడు శ్వపాకుల పాకలదరి వసించుచుండెను. కొన్నాళ్ళకుc దండ్రియు నవ్వనంబున కరిగెను. అంతట నింద్రుడా రాజ్యమున వర్షింపడయ్యె. ద్వాదశవర్ష క్షామమేర్పడెను. విశ్వామిత్రుడు తన భార్య నాతని దేశమున వదలి సాగరాంతమున విపులత పమ్మెనరించెను. ఆయన భార్య నడిమి కొడుకును గలమందు బంధించి కొనపోయి తక్కినc బిడ్డలను బోషించుటకై నూరుగోవుల వెలకమ్మెను. అట్లు గలమందు బంధితుడైన వాని జూచి సత్యవ్రతుడు (రాజకుమారుడు) విడిపించి యాతనిం దాను భరించెను. విశ్వామిత్రుని సంతోషపెట్టుటకు, అతని యనుగ్రహముc బొందుటకు నతడట్లు సేసెను. గలబంధనమందిన కతన నాతడు 'గాలపుడు' అనంబరcగెను. కౌశిక మహర్షి యావీరునివలననటు విముక్తిc బడసెను. ( 87-109)

ఇది శ్రీబ్రహ్మమహాపురాణమునందు సూర్యవంశనిరూపణమను ఏడవయధ్యాయము

Brahmapuranamu    Chapters