Brahmapuranamu    Chapters   

అథఅష్టషష్ఠితమోధ్యాయః

విష్ణులోకవర్ణనమ్‌

మునయ ఊచుః :-

శ్రోతు మిచ్ఛామహే దేవ విష్ణులోక మనామయమ్‌| లోకానందకరం కాంతం సర్వాశ్చర్య సమన్వితమ్‌|| 1

ప్రమాణం తస్య లోకస్య భోగం కాంతిం బలం ప్రభో| కర్మణా కేన గచ్ఛంతి తత్ర ధర్మపరాయణాః|| 2

దర్శనాత్స్పర్శనాద్వ్యాపి తీర్థస్నానాదినా7పివా| విస్తరాద్బ్రూహి తత్త్వేన పరం కౌతుహలం హినః| | 3

బ్రహ్మోవాచ

శృణుధ్వం మునయః సర్వే యత్పరం పరమం పదమ్‌| భక్తానామీహితం ధన్యం పుణ్యం సంసారనాశనమ్‌|| 4

ప్రవరం సర్వలోకానాం విష్ణా ఖ్యం వదతో మమ| సర్వాశ్చర్యమయం పుణ్యం స్థానం త్రైలోక్యపూజితమ్‌|| 5

అశోకైః పారిజాతై శ్చ మందారైశ్చంపకద్రుమైః| మాలతీ మల్లికాకుందై ర్వకుళై ర్నాగకేసరైః|| 6

పున్నాగై రతిముక్తైశ్చ ప్రియంగతగరార్జునైః| పాటలాచూతఖదిరైః కర్ణికార వనోజ్జ్వలైః||7

నారంగైః పనసైల్లోధ్రై ర్నింబదాడిమసర్జకైః| ద్రాక్షా లకుదఖర్జూరై ర్మధుకేంద్ర ఫలైర్ద్రుమైః|| 8

కపిత్థై ర్నారికేళైశ్చ తాళైః శ్రీఫలసంభ##వైః| కల్పవృక్షైరసంఖ్యైశ్చ వన్యైరన్యైః సుశోభ##నైః|| 9

సరళైశ్చందనై ర్నీపై ర్దేవదారు శుభాంజనైః| జాతీలవంగకంకోళైః కర్పూరామోద వాపిభిః||10

తాంబూలపత్రనిచయై స్తథా పూగీఫలద్రుమైః| ఆన్యైశ్చ వివిధైర్వృక్షైః సర్వర్తుఫలశోభితైః|| 11

ఫుషై#్పర్నానావిధైశ్చైవ లతాగుచ్ఛసముద్భవైః| నానాజలాశ##యైః పుణ్యౖ ర్నానాపక్షిరుతైర్వరైః| 12

దీర్ఘికాశతసంఘాతై స్తోయపూర్ణైర్మనోహరైః| కుముదైఃశతపత్రైశ్చ పుషై#్పః కోకనదైర్వరైః|| 13

రక్తనీలోత్పలైః కాంతైః కల్హారైశ్చ సుగంధిభిః| జన్యైశ్చ జలజైః పుషై#్ప ర్నానావర్ణైః సుశోభ##నైః || 14

హంసకారండవాకీర్ణై శ్చక్రవాకోపశోభితైః| కోయష్టికైశ్చ దాత్యూహైః కారండవ రవాకులైః|| 15

చాతకైః ప్రియపుత్రైశ్చ జీవంజీవక జాతిభిః| అన్యై ర్దివ్యైర్జలచరై ర్విహార మధురస్వనైః||16

ఏవం నానావిధై ర్దివ్యై ర్నానాశ్చర్య సమన్వితైః| వృక్షైర్జలాశ##యైః పుణ్యౖ ర్భూషితం సుమనోహరైః || 17

తత్ర దివ్యైర్విమానైశ్చ నానారత్నవిభూషితైః| కామగైః కాంచనైః శుభ్రైః దివ్యగంధర్వనాదితైః || 18

తరుణాదిత్యసంకాశై రప్సరోభి రలం కృతైః| హేమశయ్యాసనయుతై ర్నానా భోగసమన్వితైః || 19

ఖేచరైః సపతాకైశ్చ ముక్తాహారావలంబిభిః| నానావర్ణై రసంఖ్యాతై ర్జాతరూపపరిచ్ఛదైః||20

నానా కుసుమగంధాఢ్యై శ్చందనాగురుభూషితైః| సుఖప్రదారబహళై ర్నానావాదిత్రని స్వనైః|| 21

మనోమారుతతుల్యైశ్చ కింకిణీ స్తబకాకులైః| విహరంతి పురే తస్మి న్వైష్ణవే లోకపూజితే||22

నానాంగనాభిః సతతం గంధర్వాప్సరసాదిభిః| చంద్రాననాభిః కాంతాభి ర్యోషిద్భిః సుమనోహరైః|| 23

పీనోన్నతకుదాగ్రాభిః సుమధ్యాభిః సమంతతః| శ్యామావదాత వర్ణాభి ర్మత్తమాతంగ గామిభిః|| 24

పరివార్య నరశ్రేష్ఠం వీజయంతి స్మ తాః స్త్రియః| చామరైః రుక్మదండైశ్ఛ నానారత్న విభూషితైః|| 25

గీతనృత్యైస్తథా వాద్యై ర్మోదమానైర్మదాలసైః| యక్షవిద్యాధరై స్సిద్ధై ర్గంధర్వై రప్సరోగణౖః|| 26

సురసంఘైశ్చ ఋషిభిః శుశుభే భువనోత్తమమ్‌| తత్రప్రాప్య మహాభోగా న్ప్రాప్నువంతి మనీషిణః|| 27

విష్ణులోకవర్ణనము

మునులు ఇట్లనిరి.

విష్ణులోక ప్రమాణము అచటి భోగములు కాంతి బలము తెల్పుము. ఏ ధర్మాచరణము వలన విష్ణులోకము లభించునో తెల్పుమన బ్రహ్మయిట్లనియె.

విష్ణులోకము సంసార నాశకము. సర్వాశ్చర్య స్థానము. అశోకాది సర్వవృక్ష సంకులము. కల్పవృక్షస్థానము. సర్వర్తు పుష్ప ఫలసుందరము. పద్మములు కలువలు నానావిధ జలపక్షులు గల దిగుడు బావులు, సరస్సులు నందు గలవు. కామగములైన బంగారు విమానములపై వేల్పులు విహరింతురు. అవి వాయువుకంటె మనస్సు కంటె మించిన వేగము గలవి. పరమ సుందరులైన దేవతాస్త్రీలు అటకేగిన పుణ్యాత్ములను చుట్టుకొని వారు ఛత్ర చామరములు పట్టి సంగీత నృత్యాదులచే నానందింప చేయుదురు.

వటరాజ సమీ పేతు దక్షిణస్యోదధేస్తటే| దృష్టో యై ర్భగవాన్కృష్ణః పుష్కరాక్షో జగత్పతిః|| 28

క్రీడంత్య ప్సరసైః సార్ధం యావద్ద్యౌశ్చంద్రతారకమ్‌| ప్రతిప్తహేమసంకాశా జరామరణవర్జితాః|| 29

సర్వదుఃఖవిహీనాశ్చ తృష్టాగ్లాని వివర్జితాః| చతుర్భుజా మహావీర్యా వనమాలా విభూషితాః|| 30

శ్రీవత్సలాంభ##నై ర్యుక్తాః శంఖచక్ర గదాధరాః| కేచిన్నీలోత్ఫలశ్యామాః కేచిత్కాంచన సంనిభాః|| 31

కేచిన్మరకతప్రఖ్యాః కేచిద్వైఢూర్యసంనిభాః| శ్యామవర్ణాః కుండలిన స్త7థాన్యే వజ్రసంనిభాః|| 32

నతాదృక్సర్వదేవానాం భాంతి లోకా ద్విజోత్తమాః| యాదృగ్భాతి హరేర్లోకః సర్వాశ్చర్య సమన్వితః|| 33

న తత్ర పునరావృత్తి ర్గమనాజ్జాయతే ద్విజాః | ప్రభావాత్తస్య దేవస్య యావదాభూత సంప్లవమ్‌ || 34

నిచరంతి పురేదివ్యే రూప¸°వన గర్వితాః | కృష్ణం రామం సుభద్రాంచ పశ్యంతి పురుషోత్తమే || 35

దక్షిణ సముద్ర తీరమున పెద్దమఱ్ఱిచెట్టు దగ్గరగల కృష్ణభగవానుడు అప్సరసలతో దర్శన మిచ్చును. కృష్ణ సారూప్యము నందిన కృష్ణ భక్త బృందము విష్ణుపురమునందు దర్శన మిత్తురు.

ప్రతప్తహేమ సంకాశం తరుణాదిత్యసంనిభమ్‌ | పురమధ్యే హరేర్భాతి మందిరం రత్నభూషితమ్‌ || 36

అనేకశతసాహస్త్రెః పతాకైః సమలంకృతమ్‌ | యోజనాయత విస్తీర్ణం హేమ ప్రాకారవేష్టితమ్‌ || 37

నానావర్ణైర్ధ్వజై శ్చిత్రైః కల్పితైః సుమనోహరైః || విభాతి శారదోయద్వ న్నక్షత్రైః సహచంద్రమాః || 38

చతుర్ద్వారం సువిస్తీర్ణం కంచుకీభిః సురక్షితమ్‌ | పురసప్తకసంయుక్తం మహోత్సేకం మనోహరమ్‌ || 39

ప్రథమం కాంచనం తత్ర ద్వితీయం మరకతై ర్యుతమ్‌| ఇంద్రనీలం తృతీయందు మహానీలం తతః పరమ్‌ || 40

పురంతు పంచమం దీప్తం పద్మరాగమయం పురమ్‌| షష్ఠం వజ్రమయం విప్రా వైఢూర్యం సప్తమం పురమ్‌|| 41

నానారత్నమయైర్హేమ ప్రవాళాంకురభూషితైః | స్తంఖై రద్భుత సంకాశై ర్భాతి తద్భవనం మహత్‌ || 42

దృశ్యంతే తత్ర సిద్ధాశ్చ భాసయంతి దిశోదశ | పౌర్ణ మాస్యాం స నక్షత్రో యథా భాతి నిశాకరః || 43

ఆరూఢస్తత్ర భగవా న్సలక్ష్మీకో జనార్దనః | పీతాంబరధరః శ్యామః శ్రీవత్సలక్ష్మసంయుతః || 44

జ్వలత్సుదర్శనం చక్రం ఘోరం సర్వస్త్రనాయకమ్‌ | దధారదక్షిణ హన్తే సర్వతేజోమయం హరిః || 45

కుందేందురజత ప్రఖ్యం హారగోక్షీర సంనిభమ్‌ | ఆదాయ తం మునిశ్రేష్ఠాః సవ్యహస్తేన కేశవః || 46

యస్యశ##బ్దేన సకలం సంక్షభం జాయతే జగత్‌ | విశ్రుతం పాంచజన్యేతి సహస్రావర్త భూషితమ్‌ || 47

దుష్కృతాంతకరీం రౌద్రాం దైత్యదానవనాశినీమ్‌ | జ్వలద్వహ్ని శిఖాకారాం దుఃసహాం త్రిదశైరపి || 48

కౌమోదకీం గదాం చాసౌ ధృతవాన్దక్షిణకరే | వామే విస్ఫురత్యిహస్య శార్ఞం సూర్యసమప్రభమ్‌ || 49

శ##రైరాదిత్య సంకాశై ర్జ్వాలమాలాకులైర్వరైః | యో7సౌ సంహరతే దేవ సై#్త్రలోక్యం సచరాచరమ్‌|| 50

సర్వానందకరః శ్రీమా న్సర్వశాస్త్రవిశారదః | సర్వలోక గురుర్దేవః సర్వైర్దేవైర్న మస్కృతః || 51

సహస్రమూర్ధా దేవేశః సహస్ర చరణక్షణః | సహస్రాఖ్యః సహస్రాంగః సహస్ర భుజవాన్ప్రభుః || 52

సింహాసనగతో దేవః పద్మపత్రాయతేక్షణః | విద్యుద్విస్పష్టసంకాశో జగన్నాథో జగద్గురుః || 53

పరీతః సురసిద్ధైశ్చ గంధర్వాప్సరసాం గణౖః | యక్షవిద్యాధరైర్నాగై ర్మునిసిద్ధైః సచారణౖః || 54

సుపర్ణైర్దానవైర్దైత్యై రాక్షసైర్గుహ్యకిం సరైః | అన్యైర్దేవగణౖర్దివ్యైః స్తూయమానో విరాజతే || 55

తత్రస్థా సతతం కీర్తిః ప్రజ్ఞామేధా సరస్వతీ | బుద్ధిర్మతి స్తథా క్షాంతిః సిద్ధిర్మూర్తిస్తథా ద్యుతిః || 56

గాయత్రీ చైవ సావిత్రీ మంగళా సర్వమంగళా సర్వమంగళా ప్రభామతిస్తథా కాంతి స్తత్ర నారాయణీ స్థితా || 57

శ్రద్ధా చ కౌశికీ దేవీ విద్యుత్సౌదామినీ తథా | నిద్రా రాత్రిస్తథా మాయా తథా7న్యా7మరయోషితః || 58

వాసుదేవస్య సర్వాస్తా భవనే సంప్రతిష్ఠితాః | అథ కిం బహునోక్తేన సర్వం తత్ర ప్రతిష్ఠితమ్‌ || 59

ఘృతాచీ మేనకా రంభా సహజన్యా తిలోత్తమా | ఊర్వశీచైవ నివ్లూెచా తథా7న్యా వామనాపరా || 60

మండోదరీ చ సుభగా విశ్వాచీ విపులాననా | భద్రాంగీ చిత్రసేనాచ ప్రవ్లూెచా సుమనోహరా || 61

మునిసంమోహనీ రామా చంద్ర మధ్యా శుభాననా | సుకేశీ నీలకేశాచ తథా మన్మథదీపినీ || 62

అలంబుషా మిశ్రకేశీ తథా7న్యా ముంజికస్థలా | క్రతుస్థలా వరాంగీచ పూర్వచిత్తిస్తథా పరా || 63

పరావతీ మహారూపా శశిలేఖా శుభాననా | హంసలీలానుగామిన్యో మత్తవారణగామినీ ||64

బింబోష్ఠీ నవగర్భా చ విఖ్యాతాః సురయోషితః | ఏతాశ్చాన్యా అప్సరసో రూప¸°వన గర్వితాః || 65

సుమధ్యాశ్చారువదనాః సర్వాలంకారభూషితాః | గీత మాధుర్యసంయుక్తాః సర్వలక్షణ సంయుతాః || 66

గీతవాద్యే చ కుశలాః సురగంధర్వయోషితః | నృత్యంత్యనుదినం తత్ర యత్రాసౌ పురుషోత్తమః || 67

న తత్ర రోగో నో గ్లాని ర్న మృత్యుర్న హిమాతపౌ| న క్షుత్పిపానా చ జరా న వైరూప్యం న చాసుఖమ్‌|| 68

పరమానంద జననం సర్వకామఫలప్రదమ్‌ | విష్ణులోకాత్పరం లోకం నాత్ర పశ్యామి భోద్విజాః || 69

యే లోకాః స్వర్గలోకే తు శ్రూయంతే పుణ్యకర్మణామ్‌| విష్ణులోకస్య తే విప్రాః కళాం నార్హంతి షోడశీమ్‌ || 70

ఏవం హరేః పురస్థానం సర్వభోగగుణాన్వితమ్‌ | సర్వ సౌఖ్యకరం పుణ్యం సర్వాశ్చర్యమయం ద్విజాః || 71

న తత్ర నాస్తికా యాంతి పురుషా విషయాత్మకాః | న కృతఘ్నా న పిశునా నోస్తేనా నాజితేంద్రియాః || 72

యే7ర్చయంతి సదా భక్త్యా వాసుదేవం జగద్గురుమ్‌ | తే తత్ర వైష్ణవాయాంతి విష్ణులోకం న సంశయః || 73

దక్షిణస్యో7దధేస్తీరే క్షేత్రే పరమదుర్లభే | దృష్ట్వా కృష్ణం చ రామంచ సుభద్రాంచ ద్విజోత్తమాః || 74

కల్పవృక్షసమీపే తు యే త్యజంతి కళేబరమ్‌ | తే తత్ర మనుజా యాంతి మృతా యే పురుషోత్తమే || 75

వటసాగరయోర్మధ్యే యః స్మరేత్పురుషోత్తమమ్‌ | తే7పి తత్ర నరాయాంతి యేమృతాః పురుషోత్తమే || 76

తే7పి తత్ర పరం స్థానం యాంతి నాస్త్యత్ర సంశయః | ఏవం మయా మునిశ్రేష్ఠా విష్ణులోకః సనాతనః ||

సర్వానందకరః ప్రోక్తో భుక్తిముక్తి ఫలప్రదః || 77

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభ్వృషిసంవాదే విష్ణులోకానుకీర్తనం నామ అష్టషష్టితమో7ధ్యాయః

మేలిమి బంగారము రంగుగల్గి యనేక రత్నభూషితమై బహుపతాకసమలంకృతమై బంగారు ప్రాకారమున జుట్టుకొని యోజసవిస్తారమైన హరిమందిర మావిష్ణువురమధ్య మందుభాసిల్లుచుండును. చుక్కల నడుమనున్న శరశ్చంద్రునివలె యది ప్రకాశించు చుండును. కంచు కధారులైన ద్వారపాలకులు ఆపురమునకు గల నాలుగు ద్వారములకు రక్ష యిచ్చుచుందురు. ఆలోపల స్వర్ణమయము. మరకత మణిమయము ఇంద్రనీలము మహానీలము పద్మరాగ మణిమయము వజ్రమయము వైఢూర్య మయమునైన యేడు పురములు వైకుంఠలోకములోనున్నవి. అందలి స్తంభములు రత్నమయములు. పవడపు కర్రతో తయారు చేసినవి. అచట మహాసిద్ధులు తమతేజస్సుచేత దశదిశలను వెల్గింతురు. వారి నడుమ నక్షత్రములు నడుమనున్న పున్నమి చంద్రుని వలె మేఘశ్యాముడు పీతాంబరధారి శ్రీవత్సాంకితుడు నైస శ్రీహరి శ్రీదేవితో ప్రకాశించుచుండును. ఆయన కుడిచేతిలో సుదర్శన చక్రము ఎడమచేత యచ్చము తెల్లనైన శంఖము విలసిల్లు చుండును. ఆశంఖమువేయిసుడులు గలది. పాంచజన్యమను పేరుగలది. ఆశంఖ నాథ మున నకల జనము సంక్షోభించును. ఆయన యొక్క కుడిచేతిలోని దైత్య దానవ నాశకము జ్వలదగ్ని ప్రకాశము. సర్వపాపవినాశకమునైన కౌమోదకి యను గద రాణించు చుండును. ఎడమ చేత సూర్యునట్లు వెల్గు శార్జమను ధనువు అగ్నిజ్వాలలను చిమ్ము బాణములును దీపించుచుండును. ఆస్వామి సర్వలోక సృష్టిస్థితి సంహారకుడు సర్వశాస్త్ర నిపుణుడు. సర్వజగద్గురువు. సహస్రశీర్షుడు. సహస్రపాదుడు. ఆప్రభువు సింహాసన మందు ఆసీనుడై యుండును. ఆయన కనులు తామరరేకులు. ఆయన మేని తళుకు మెఱపుతీగ సొంపుగులుకుచుండును. సురసిద్ధ గంధర్వాదులతో మునులతో సుపర్ణులతో మరిగల సురాసుర ప్రభువు లందరితో పేరోలగముండి వారుచేయు స్తుతుల నవధరించు చుండును. అచట కీర్తి మొదలుకొని మాయ వఱకు గల ఆయాశక్త్యధిష్ఠాన దేవతలు ఆయన భవనమున కొలువు చేయుచుందురు. ఘృతాచి మొదలు నవగర్భ వరకు గల యప్సరసలు రూప¸°వన శాలినులు స్వామి పేరోలగమునందు నాడుచు పాడుచు హరిని సేవించుచుందురు. అటగలవారికి రోగము నీరసము మృత్యువు యెండ చలి ఆకలి దప్పిక దుఃఖము విరూపము కలుగవు. విష్ణుభువనము పరమానంద బనకము. సర్వాభీష్ట ప్రదము. పుణ్యులు పొందుత్తమలోకములన్నియు విష్ణులోకముయొక్క పదునా వ కళకు కూడ సరితూగవు. ఇట్టి పుణ్యలోకమునకు నాస్తికులు విషయలంపటులు కృతఘ్నులు పిసినారులు దొంగలు ఆజితేంద్రియులు చేరలే. విష్ణుభక్తులై దక్షిణసముద్ర తీరమందలి క్షేత్రమును సేవించి సుభద్రా రామకృష్ణుల నర్చించిన ధన్యులే పొందగలరు. పురుషోత్మ క్షేత్రమందు కల్ప వటవృక్ష సముద్ర మధ్యమందు మరణించినవారు ఈపర మోత్తమ స్థానమున కేగుదురు. సనాతనము సర్వానందకరము. భుక్తిముక్తి ప్రదమునైన హరిలోకమును గురించి మీకు తెలిపితిని.

ఇది బ్రహ్మపురాణమునందు విష్ణులోకవర్ణనమను నఱువదెనిమిదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters