Brahmapuranamu    Chapters   

అథ త్రిషష్ఠితమోధ్యాయః

పంచతీర్థమాహాతమ్యం

బ్రహ్మోవాచ

తతో గచ్ఛేద్విజశ్రేష్ఠా స్తీర్థం యజ్ఞాంగ సంభవమ్‌| ఇంద్రద్యుమ్నసరో నామ యత్రా7స్తేపావనం శుభమ్‌|| 1

గత్వా తత్ర శుచిర్ధీమా నాచమ్య మనసా హరిమ్‌| ధ్యాత్యోపస్థాయ చ జల మిమం మంత్రముదీరయేత్‌|| 2

అశ్వమేధాంగసంభూత తీర్ధ సర్వాఘనాశన | స్నానం త్వయి కరోమ్యద్య పాపం హర నమో7స్తుతే|| 3

ఏవముచ్చార్య విధివ త్స్నాత్వా దేవానృషీన్పితౄన్‌| తిలోదకేన చాన్యాంశ్చ సంతర్వ్యా77చమ్య వాగ్యతః|| 4

దత్త్వా పితృభ్యః పిండాంశ్చ సంపూజ్య పురుషోత్తమమ్‌| దశాశ్వమేధికం సమ్య క్ఫలం ప్రాప్నోతిమానవః|| 5

సప్తావరాన్యప్త పరా న్వంశానుద్ధృత్య దేవవత్‌| కామగేన విమానేన విష్ణులోకం స గచ్ఛతి|| 6

భుక్త్వాతత్ర సుఖాన్భోగా న్యావచ్చంద్రార్కతారకమ్‌| చ్యుతస్తస్మాదిహాయాతో మోక్షం చ లభ##తే ధ్రువమ్‌|| 7

ఏవం కృత్వాపంచతీర్థీ మేకాదశ్యాముపోషితః| జ్యేష్ఠశుక్లపంచదశ్యాం యః పశ్యేత్పురుషోత్తమమ్‌|| 8

సపూర్వోక్తం ఫలం ప్రాప్య క్రీడిత్వా చాచ్యుతాలయే| ప్రయాతి పరమం స్థానం యస్మాన్నా77వర్తతేపునః|| 9

బ్రహ్మ యిట్లనియె.

సముద్ర స్నానానంతరము యజ్ఞ పురుషుని శరీరమందావిర్భవించిన తీర్థము ఇంద్రద్యుమ్న సరస్సును సేవింపవలెను. ఆ తీర్థసేవనమందు ''అశ్వమేధాంగ సంభూత''యను మంత్రము నుచ్చరించవలెను. ఇట దేవర్షి పితృతర్పణము జేసి దశాశ్వమేధయాగఫలమొందవచ్చును. వెనుక యేడు తరముల రాగలయేడు తరముల వారిని నీ పుణ్యమాచరించు నాతడుద్ధరింపగలడు. కామగవిమానమున విష్ణులోకమున కేగగలడు. ఏకాదశి యుపవాసముండి పంచతీర్థములను సేవించి జ్యేష్ఠశుద్ధ పూర్ణిమనాడు పురుషోత్తముని దర్శించునాతడు పునరావృత్తిరహిత పుణ్యస్థానమందును.

మునయ ఊచుః

మాసానన్యా న్పరిత్యజ్య మాఘాదీన్ప్రపితామహ| ప్రశంససి కథం జ్యేష్ఠం బ్రూహి తత్కారణం ప్రభో|| 10

బ్రహ్మోవాచ

శృణుధ్వం మునిశార్దూలాః ప్రవక్ష్యామి సమాసతః| జ్యేష్ఠం మాసం తథా తేభ్యః ప్రశంసామి పునః పునః|| 11

పృథివ్యాం యాని తీర్థాని సరితశ్చ సరాంసి చ| పుష్కరిణ్యస్తడాగాని వాప్యః కూపాస్తథా హ్రదాః|| 12

నానానద్యః సముద్రాశ్చ సప్తాహం పురుషోత్తమే| జ్యేష్ఠశుక్లదశమ్యాది ప్రత్యక్షం యాంతి సర్వదా|| 13

స్నానదానాదికం తస్మా ద్దేవతా ప్రేక్షణం ద్విజాః| యత్కించి త్క్రియతే తత్ర తస్మిన్కాలే7క్షయం భ##వేత్‌|| 14

మును లిట్లనిరి.

మాఘాది మాసములను వదలి జ్యేష్ఠమాసమునే ప్రసంశించితివేలయని మునులడుగ బ్రహ్మయిట్లనియె. జ్యేష్ఠ శుక్ల దశమిమొదలు ఏడురోజులు సర్వతీర్థములు పురుషోత్తమ క్షేత్రమందుండుగు. కావున నేకొంచెము పుణ్యమేని నిచట యక్షయ మగును.

శుక్లపక్షస్య దశమీ జ్యేష్ఠే మాసి ద్విజోత్తమాః| హరతే దశపాపాని తస్మాద్దశహరా స్మృతా|| 15

యస్తస్యాం హలినం కృష్ణం పశ్యేద్భద్రాం సుసంయతః| సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం వ్రజేన్నరః|| 16

నరో దోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమమ్‌| ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్యపురం వ్రజేత్‌|| 17

విఘవద్దివసేప్రాప్తే పంచతీర్థవిధానతః| కృత్వాసంకర్షణం కృష్ణం దృష్ట్వా భద్రాంచభోద్విజాః|| 18

సరః సమస్త యజ్ఞానాం ఫలం ప్రాప్నోతి దుర్లభమ్‌| విముక్తః సర్వపాపేభ్యోవిష్ణులోకం స గచ్ఛతి|| 19

యః పశ్యతి తృతీయాయాం కృష్ణం చందనరూషితమ్‌| వైశాఖస్యాసితే పక్షే స యాత్యచ్యుతమందిరమ్‌|| 20

జ్యైష్ఠ్యాం జ్యేష్ఠరక్షయుక్తాయాం యః పశ్యేత్పురుషోత్తమమ్‌| కులైకవింశముద్ధృత్య విష్ణులోకం సగచ్ఛతి 21

ఇతి శ్రీ మహాపురాణ ఆది బ్రాహ్మే స్వయంభ్వృషిసంవాదే పంచతీర్థ మహాత్మ్య నిరూపణం నామ త్రిషష్టితమో7ధ్యాయః

జ్యేష్ఠ శుక్లపక్ష దశమి పదిరకముల పాపములను హరించును. కనుక దశహర యనబడును. ఆనాడు బలరామకృష్ణ సుభద్రల దర్శనము విష్ణులోకప్రదము. పాల్గుణ పూర్ణిమనాడుయ్యెలయందున్నగోవిందుని ఆడోలోత్సవమును జూచునతడు గోవిందపురమేగును. విషువత్తులందు పంచతీర్థసేవనమొనరించి యామూడుమూర్తులను సేవించునతడు సర్వయజ్ఞఫలభాజనుడగును. విష్ణులోకగమనము చేయును. వైశాఖ కృష్ణతృతీయతిధియందు కృష్ణునకుచందనోత్సవముజరుగును. అదిచూచునతడు. విష్ణులోకమందును. జ్యేష్ఠానక్షత్రముతోనున్న జ్యేష్ఠపూర్ణిమయందు బురుషోత్తమ దర్శనము చేసిన యతడు ఇరువది యొక్క తరముల నుద్ధరించి విష్ణుపదమందును.

ఇది బ్రహ్మపురాణమున పంచతీర్థ మాహాత్మ్యమను నఱువది మూడువ అధ్యాయము.

Brahmapuranamu    Chapters