Brahmapuranamu    Chapters   

అథద్విషష్ఠితమోధ్యాయః

సముద్రస్నానమాహాత్మ్యం

బ్రహ్మోవాచ

ఏవం సంపూజ్యవిధివ ద్భక్త్యా తం పురుషోత్తమమ్‌ | ప్రణమ్య శిరసాపశ్చ త్సాగరం చ ప్రసాదయేత్‌ || 1

ప్రాణస్త్వం సర్వభూతానాం యోనిశ్చ సరితాం పతే | తీర్థరాజ నమస్తే7స్తు త్రాహిమా మచ్యుతప్రియ || 2

స్నాత్వైవ సాగరే సమ్య క్తస్మినేక్షత్రవరే ద్విజాః | తీరే చాభ్యర్చ్య విధివ న్నారాయణమనామయమ్‌ || 3

రామం కృష్ణం సుభద్రాంచ ప్రణిపత్యచసాగరమ్‌ | శతానామశ్వమేధానాం ఫలం ప్రాప్నోతి మానవః || 4

సర్వపాపవినిర్ముక్తః సర్వదుఃఖవివర్జితః | బృందారకవశ్రీమా న్రూప¸°సవగర్వితః || 5

విమానేనార్కవర్ణేన దివ్యగంధర్వనాదినా | కులైకవింశముద్ధృత్య విష్ణులోకం స గచ్ఛతి || 6

భుక్త్వా తత్ర వరాన్భోగా న్క్రీడిత్వాచాప్సరైః సహ | మన్వంతర శతం సాగ్రం జరామృత్యువివర్జితః || 7

పుణ్యక్షయాదిహా77యాతః కులే సర్వగుణాన్వితే | రూపవాన్సుభగః శ్రీమా న్సత్యవాదీ జితేంద్రియః || 8

వేదశాస్త్రార్థవిద్విప్రో భ##వేద్యజ్వా తువైష్ణవః | యోగం చ వైష్ణవం ప్రాప్య తతో మోక్షమవాప్నుయాత్‌ || 9

గ్రహోపరాగే సంక్రాంత్యా మయనే విషువేతథా | యుగాదిషు షడశీత్యాం వ్యతీపాతే దినక్షయే || 10

ఆషాఢ్యాం చైవ కార్తిక్యాం మాఘ్యాం వాన్యే7ష్యూంస్యశుభేతిథౌ| యే తత్రదానంవిప్రేభ్యఃప్రయచ్ఛంతిసుమేధసః || 11

ఫలం సహస్రగుణిత మన్యతీర్ధాల్లభంతి తే | పితౄణాం యే ప్రయచ్ఛంతి పిండం తత్ర విధానతః || 12

అక్షయాం పితరస్తేషాం తృప్తిం సంప్రాప్నువంతివై | ఏవం స్నానఫలం సమ్య క్సాగరస్య మయోదితమ్‌ || 13

దానస్య చ ఫలం విప్రాః పిండదానస్య చైవ హి | ధర్మార్థమోక్షఫలద మాయుష్కీర్తియశస్కరమ్‌ || 14

భుక్తిముక్తిఫలం నౄణాం ధన్యం దుఃస్వప్ననాశనమ్‌ | సర్వపాపహరం పుణ్యం సర్వకామఫలప్రదమ్‌ || 15

నాస్తికాయ నవక్తవ్యం పురాణం చ ద్విజోత్తమాః | తావద్గర్జంతి తీర్థాని మాహాత్మ్యైః సై#్వః పృథక్పృథక్‌ || 16

యావన్నతీర్థరాజస్య మాహాత్మ్యం వర్ణ్యతే ద్విజాః | పుష్కరాదీని తీర్థాని ప్రయచ్ఛంతి స్వకం ఫలమ్‌|| 17

తీర్థరాజస్తు స పునః సర్వతీర్థఫలప్రదః | భూతలే యాని తీర్థాని సరితశ్చ సరాంసి చ || 18

విశంతి సాగరే తాని తేనాసౌ శ్రేష్ఠతాం గతః | రాజా సమస్తతీర్థానాం సాగరః కసరితాం పతిః || 19

తస్మాత్సమస్తతీర్ధేభ్యః శ్రేష్ఠో7సౌ సర్వకామదః | తమోనాశం యథాభ్యేతి భాస్కరే7భ్యుదితే ద్విజాః || 20

స్నానేన తీర్థరాజస్య తథాపాపస్య సంక్షయః | తీర్ధరాజసమం తీర్థం న భూతం న భవిష్యతి || 21

అధిష్ఠానం యదా యత్ర ప్రభోర్నారాయణస్య వై | కః శక్నోతి గుణాన్వక్తుం తీర్థరాజస్య భో ద్విజాః || 22

కోట్యో నవనవత్యస్తు యత్ర తీర్థాని సంతివై | తస్మాత్స్నానం చ దానం చ హోమం జప్యం సురార్చనమ్‌ ||

యత్కించిత్క్రియతే తత్ర చాక్షయం క్రియతే ద్విజాః || 23

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభుఋషి సంవాదే సముద్రస్నానమాహాత్మ్యవర్ణనంనామ ద్విషష్టితమో7ధ్యాయః

బ్రహ్మ యిట్లనియె.

ఇట్లు నారాయణుని యథావిధి పూజించి సముద్రునకు నమస్కరించవలెను. అపుడు 'ప్రాణస్త్వం' అను మంత్రమును జపింపవలెను. స్నానము చేసివచ్చి యొడ్డున నారాయణుని బూజించి బలరాముని కృష్ణుని సుభద్రను సముద్రుని గూర్చి నమస్కారము సేసి యశ్వమేధఫలమును మానవుడు పొందును. అంతియే కాక సూర్యప్రభ##మైన విమానమెక్కి గంధర్వాప్సరసలు సేవింప నిరువదియొక్క తరముల వారి నుద్ధరించి విష్ణులోకమున కేగును. నూరు మన్వంతరములు విష్ణులోక భోగముల ననుభవించి యీ భారత భూమియందు శ్రీమంతుడై సర్వైశ్వర్యసంపన్నుడయి వేదశాస్త్ర వేత్తయై వర్తించి వైష్ణవ యోగమున మోక్షమును బొందును. ఈ సముద్రమున పుణ్యకాలమందు ననగా గ్రహణ సంక్రాంతి అయన విఘవ యుగాది షడశీతి వ్యతీపాతముదినక్షయ ఆషాఢీ కార్తికీ వైశాఖీ పూర్ణిమల యందు స్నానదానాదులు చేసి పితృతర్పణ పిండప్రదానాదులు చేసి యనంతపుణ్యనిధి యగును. పిండ ప్రదానము వలన నాయువు, కీర్తి భుక్తి ముక్తి సిద్ధించును. ఈ వార్త నాస్తికులకు జెప్పరాదు. పుష్కర తీర్థములు తమ తమ చెప్పబడిన ఫలముల నీయగలవు. ఈ తీర్థరాజము సర్వతీర్థ ఫలప్రదము. సాగరుడు సర్వతీర్థ రాజు. సూర్యోదయమందు జీకటి విరిసినట్లు ఈ తీర్థరాజసేవనమున పాపమెల్ల విరియును. స్నాన దాన తపో హోమాదు లిచట నక్షయఫలప్రదములు.

ఇది బ్రహ్మపురాణమున సముద్రస్నాన మాహాతమ్యవర్ణనమును నఱువదిరెండవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters