Brahmapuranamu    Chapters   

అథసప్తపంచాశత్తమో7ధ్యాయః

పంచతీర్థవిధివర్ణనమ్‌

బ్రహోవాచ

అతఃపరం ప్రవక్ష్యామి పంచతీర్థవిధిం ద్విజాః | యత్ఫలం స్నానదానాభ్యాం దేవతాప్రేక్షణనచ || 1

ఇక పంచతీర్థములదు స్నానము దానములు చేయుట అచటి దేవతలను దర్శించుటవలన గల్గు ఫలమును దెల్పెదను.

మార్కండేయహ్రదం గత్వా నరశ్చోదఙ్ముఖ శ్శుచిః | నిమజ్జేత్తత్ర వారాంస్త్రీ నిమం మంత్ర ముదీరయేత్‌ || 2

సంసారసాగరే మగ్నం పాపగ్రస్త మచేతనం | త్రాహిమాం భగనేత్రఘ్న త్రిపురారే నమో7స్తుతే || 3

నమశ్శివాయ శాంతాయ సర్వపాపహరాయచ | స్నానం కరోమి దేవేశ మమ నశ్యతు పాతకమ్‌ || 4

మార్కండేయమను మడుగున నుత్తరముగ దిరిగి శుచియై ముమ్మారు నీ మంత్రముం జెప్పుచు స్నానము సేయవలెను. సంసారసాగరమందు మునిగి పాపగ్రస్తుడనై తెలివిదప్పియున్న నన్ను ఓ త్రిపురహర! రక్షింపుము. మంగళ స్వరూపుడు శాంతుడు సర్వపాపహరుడు నగు నీకు నమస్కారము. ఈశ్వర! ఇదిగో స్నానము సేయుచున్నాను. నా పాతకము నశించుగాక!

నాభిమాత్రే జలే స్నాత్వా విధివ ద్థేవతా ఋషీన్‌ | తిలోదకేన మతిమాన్‌ పితౄంశ్చాన్యాంశ్చ తర్పయేత్‌ || 5

స్నాత్వాతథైవ చాచమ్య తతోగచ్ఛే చ్ఛివాలయం | ప్రవిశ్యదేవతాగారం కృత్వా తం త్రః ప్రదక్షిణం || 6

మూలమంత్రేణ సంపూజ్య మార్కండేయస్యచేశ్వరం | అఘోరేణచ భోవిప్రాః ప్రణిపత్య ప్రసాదయేత్‌ || 7

బొడ్డులోతున స్నాన మొనరించి యథావిధిగ దేవతలకు ఋషులకు పితరులకు మొదలగువారికి తిలోదక తర్పణములు గావింపవలెను. అవ్వల దేవాలయమందు మూడుమారులు ప్రదక్షిణము నేసి మూలమంత్రముతో అఘోర మంత్రముతోను మార్కండేయేశ్వరుని పూజించి సాష్టాంగనమస్కారము గావించి ఈ విధముగా స్తుతించి ప్రసన్నునిం జేసికొనవలెను.

త్రిలోచన నమస్తే7స్తు నమస్తే శశిభూషణ | త్రాహిమాం త్వం విరూపాక్ష మహాదేవ నమో7స్తుతే|| 8

ఓ త్రినేత్ర చంద్రభూషణ ఓ విరూపాక్ష నన్ను రక్షింపుము. ఓ మహాదేవ నీకు నమస్కారము.

మార్కండేయహ్రదే త్వేవం స్నాత్వా దృష్ట్వాచ శంకరం | దశానా మశ్వమేధానాం ఫలం ప్రాప్నోతిమానవః || 9

పాపై న్సర్వైర్వినిర్ముక్తః శివలోకం సగచ్ఛతి | తత్రభుక్త్వా వరాన్‌భోగాన్‌ యావదాభూతసంప్లవం || 10

ఇహలోకం సమాసాద్య భ##వేద్విప్రో బహుశ్రుతః | శాంకరం యోగమాసాద్య తతో మోక్షమవాప్నుయాత్‌ || 11

మార్కండేయ హ్రదమందిట్లు స్నానమాడి శంకరుని దర్శించిన యతడు పదియశ్వమేధములు గావించిన ఫలమందును. సర్వపాప విముక్తుడై ళివలోకమేగును. అచ్చట మహాభోగముల నావ్రళయ మనుభవించి యీలోకమందు (కర్మభూమియందు) విప్రుడై జనించి వేదవేదాంగ విద్యాసంపన్నుడై శంకర సాలోక్య సారూప్య యోగమునంది యవ్వల మోక్షముల బడయును.

కల్పవృక్షం తతోగత్వా కృత్వాతం త్రిః ప్రదక్షిణం | పూజయేత్పరయాభక్త్యా మంత్రేణానేన తంవటమ్‌ || 12

ఓం నమో వ్యక్తరూపాయ మహాప్రలయకారిణ | మహద్రసోపవిష్టాయ న్యగ్రోధాయ నమో స్తుతే 13

అమరస్త్వం సదాకల్పే హరే శ్చాయతనం వట | న్యగ్రోధ హరమే పాపం కల్పవృక్ష నమోస్తుతే||14

కల్పవృక్షము (మఱ్ఱిచెట్టు) దరికేగి ఈ మంత్రము జపించుచు పూజించి ముమ్మారులు ప్రదక్షిణము సేయవలెను. అవ్యక్తమయిన పరమాత్మయెక్క వ్యక్తరూపము నీవు. మహా ప్రలయకర్తవు. అనగా ముక్తినిచ్చు వాడవు. అమృతమయుడవు. కల్పాంతము నశింపవు. హరికి నివాసమవు నాపాపము హరింపుము. నీకిదే నమస్కారము.

భక్త్యా ప్రదక్షిణం కృత్వా నత్వా కల్పవటం నరః | సహసా ముచ్యతే పాపాజ్జీర్ణత్వచ మివోరగః || 15

ఛాయాం తస్య నమాక్రమ్య కల్పవృక్షస్య భోద్విజాః | బ్రహ్మహత్యాం నరో జహ్యా త్పాపేష్వన్యేషు కా కథా || 16

దృష్ట్వా కృష్ణాంగ సంభూతం బ్రహ్మతేజోమయం పరం | న్యగ్రోధాకృతికం విష్ణుం ప్రణిపత్యచ భోద్విజాః 17

రాజసూయాశ్వమేధాభ్యాం ఫలం ప్రాప్నోతి చాధికం | తథా స్వవంశముద్ధృత్య విష్ణులోకం సగచ్ఛతి || 18

భక్తితో బ్రదక్షిణముసేసి కల్పవృక్షమునకు మ్రొక్కినయతడు పాము కుబుసమును విడిచినట్లు పాపమునుండి విడివడును. ఆ కల్పము నీడ వసించి బ్రహ్మ హత్యాపాపమునే విడుచునే మఱి యితర పాపముల మాట చెప్పనేల? కృష్ణ శరీరమునుండి జనించి బ్రహ్మతేజస్సుతో నిండిన వటవృక్ష స్వరూపముననున్న విష్ణువునకు మ్రొక్కి రాజసూయాశ్వమేధయాగఫలము నందును. అట్లు స్వవంశమునుధ్ధరించి విష్ణులోకముం బొందును.

వైనతేయం నమస్కృత్య కృష్ణస్య పురతః స్థితం | సర్వపాపవినిర్ముక్త స్తతోవిష్ణుపురం వ్రజేత్‌ || 19

దృష్ట్వావటం వైనతేయం యః పశ్యే త్పురుషోత్తమం | సంకర్షణం సుభద్రాంచ స యాతి పరమాంగతిమ్‌||20

ప్రవిశ్యాయతనం విష్ణోః కృత్వాతం త్రిః ప్రదక్షిణం | సంకర్షణం స్వమంత్రేణ భక్త్యా೭೭పూజ్య ప్రసాదయేత్‌ || 21

కృష్ణుని కెదుటనున్న గరుడ మూర్తికి మ్రొక్కి సర్వపాపము వెడలి విష్ణులోకముం బడయును. వటవృక్షమును గరుడుని దర్శించి పురుషోత్తముని సంకర్షణుని సుభద్రను దర్శించినవాడు. పరమోత్తమగతి కేగును. విష్ణ్వాలయముంజొచ్చి ముమ్మారు ప్రదక్షిణ మాచరించి సంకర్షణ మంత్రముచే నామూర్తిని బూజించి యిట్లు ప్రసన్నుని జేసికొనవలెను.

నమస్తే హలధృగ్రామ నమస్తేముసలాయుధ | నమస్తే రేవతీకాంత నమస్తే భక్తవత్సల || 22

నమస్తే బలినాంశ్రేష్ఠ నమస్తే ధరణీధర | ప్రలంబారే నమస్తేస్తు త్రాహిమాం కృష్ణపూర్వజ || 23

నాగలిందాల్చిన నీకు నమస్కారము. రోకలిచేకొనిన నీకునమస్కారము. రేవతీప్రియ భక్తవత్సల నీకు నమస్కారము. బలశాటరకెల్ల మిన్నయగు నీకు నమస్కారము. ధరణింధరించు నీకు నమస్కారము. ప్రలంబాసురుని సంహరించిని నీకు నమస్కారము. కృష్ణుని కన్నగారైన నీకు నమస్కారము.

ఏవం ప్రసాద్య చానంతమజేయం త్రిదశార్చితం | కైలాసశిఖరాకారం చంద్రకాంతతరాననమ్‌ || 24

నీలవస్త్రధరం దేవం ఫణా వికటమస్తకం | మహాబలం హలధరం కుండలైక విభూషితమ్‌ || 25

రౌహిణయం నరో భక్త్యా లభే దభిమతం ఫలం | సర్వపాపవినిర్మక్తో విష్ణులోకం స గచ్చతి|| 26

ఆ భూత సంప్లవం యావద్‌ భుక్త్వా తత్రసుఖంనరః | పుణ్యక్షయా దిహాగత్య ప్రవరే యోగినాంకులే || 27

బ్రాహ్మణప్రవరోభూత్వా సర్వ శాస్త్రార్థపారగః | జ్ఞానం తత్ర సమాసాద్య ముక్తిం ప్రాప్నోతి దుర్లభామ్‌ || 28

ఏవ మభ్యర్చ్య హలినం తతః కృష్ణం విచక్షణః | ద్వాదశాక్షరమంత్రేణ పూజయే త్సుసమాహితః || 29

ద్విషట్కవర్ణ మంత్రేణ భక్త్యాయే పురుషోత్తమం | పూజయంతి సదా ధీరాస్తే మోక్షం ప్రాప్నువంతివై || 30

నతాంగతిం సురాయాన్తి యాగీనోనైవ సోమపాః | యాం గతిం యాన్తిభోవిప్రా ద్వాదశాక్షర తత్పరాః || 31

తస్మాత్తేనైవమంత్రేణ భక్త్యా కృష్ణం జగద్గురుం | సంపూజ్యగంధపుష్పాద్యైః ప్రణిపత్య ప్రసాదయేత్‌ || 32

జయకృష్ణ జగన్నాథ జయసర్వాఘనాశన | జయచాణూర కేశిఘ్న జయకంసనిషూదన || 33

జయ పద్మపలాశాక్ష జయచక్రగబాధర | జయ నీలాంబుదశ్యామ జయసర్వసుఖప్రద || 34

జయదేవ జగత్పూజ్య జయసంసారనాశన | జయలోకపతే నాథ జయవాంఛాఫలప్రద || 35

సంసారసాగరేఘోరే నిస్సారేదుఃఖఫేనిలే | క్రోధగ్రాహాకులే రౌద్రే విషయోదక సంప్లవే || 36

నానారోగోర్మికలిలే మోహావర్తసుదుస్తరే | నిమగ్నోహం సురశ్రేష్ఠ త్రాహిమాంపురుషోత్తమః 37

ఏవంప్రసాద్య దేవేశం వరదం భక్తవత్సలం | సర్వపాపహరం దేవం సర్వకామఫలప్రదమ్‌ || 38

పీనాంసం ద్విభుజం కృష్ణం పద్మపత్రాయతేక్షణం | మహోరస్కం మహాబాహుం పీతవస్త్రం శుభాననమ్‌ || 39

శంఖచక్రగదాపాణిం మకుటాంగదభూషణం | సర్వలక్షన సంయుక్తం వనమాలావిభూషితమ్‌ || 40

దృష్ట్వానరోంజలిం కృత్వా దండవత్ర్పణిపత్యచ | అశ్వమేధ సహస్రాణాంఫలం ప్రాప్నోతి వైద్విజాః || 41

యత్ఫలం సర్వతీర్థేషు స్నానేదానే ప్రకీర్తితం | నరస్తత్ఫలమాప్నోతి దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ || 42

యత్ఫలం సర్వరత్నాద్యైరిష్టే బహుసువర్ణకే | నరస్తత్ఫలమాప్నోతి దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ || 43

యత్ఫలం సర్వవేదేషు సర్వయజ్ఞేషు యత్ఫషలం | తత్ఫలం సమవాప్నోతి నరః కృష్ణం ప్రణమ్యచ || 44

యత్ఫలం సర్వదానేన వ్రతేన నియమేన చ | నర స్తత్ఫలమాప్నోతి దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ || 45

తపోభిర్వివిధైరుగ్రై ర్యత్ఫలం సముదాహృతం | నరస్తత్ఫలమాప్నోతి దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ || 46

యత్ఫలం బ్రహ్మచర్యేణ సమ్యక్‌ చీర్ణేన తత్కృతం | నరస్తత్ఫలమాప్నోతి దృష్ట్వాకృష్ణం ప్రణమ్యచ || 47

యత్ఫలంతు గృహస్థస్య యథోక్తాచారవర్తినః | నరస్తత్ఫలమాప్నోతి దృష్ట్మా కృష్ణం ప్రణమ్యచ || 48

యత్ఫలం వనవాసేన వానప్రస్థస్య కీర్తితం | నరస్తత్ఫలమాప్నోతి దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ || 49

సన్యాసేన యథోక్తేన యత్పలం సముదాహృతం | నరస్తత్ఫలమాప్నోతి దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ || 50

కించాత్రబహునో క్తేన మహాత్మ్యే తస్యభోద్విజాః | దృష్ట్వా కృష్ణం నరోభక్త్యా మోక్షం ప్రాప్నోతి దుర్లభమ్‌ || 51

ఇట్లు హరిని ప్రసన్నుని జేసికొని నీలాంబరుడైన యేకకుండలునిబలరాముని రోహిణీ కుమారుని యనుగ్రహింప జేసికొని, యాతడు పాపము వాసి విష్ణులోకమున కేగును. ప్రలయముదాక నట సుఖములంది పుణ్యానుభవానంతరము భువికివచ్చి యోగికులమందు విప్రుడై జనించి సర్వశాస్త్ర పారంగుడై జ్ఞానమంది ముక్తినందును. ఆమీద హరిని ద్వాదశాక్షరమంత్రముచే బూజించి సద్గతి నందును. గంధ పుష్పాదులచే కృష్ణునర్చించి జయజయయని స్వామి నా ములను గీర్తించి నిస్సార సంసార సాగరమందు మునిగితిని. ఇది దుఃఖమను నురుగు క్రోధమను మొసళ్లు విషయములను నుదకము నానారోగములనెడి కెరటములు మోహమను సుళ్ళు గలది. ఈమహాభయంకర స్థితినుండి నన్ను పురుషోత్తమా! కాపాడుమని స్వామిమూర్తిని పద్మ పత్రాయ తేక్షణాది కల్యాణ లక్షణములు గలదానిని ధ్యానించి మ్రొక్కిన యతడశ్వమేధములు వేయి సేసిన పుణ్యమునందును.

పాపైర్విముక్త శ్శుద్ధాత్మా కల్పకోటిసమద్భవైః | శ్రియాపరమయాయుక్తః సర్వైస్వముదితోగుణౖః || 52

సర్వకామ సమృద్ధేన విమానేన సువర్చసా | త్రిసప్త కులముద్దృత్య నరో విష్ణుపురం వ్రజేత్‌ || 53

తత్రకల్పశతం యావత్‌ భుక్త్వాభోగాన్మనోరమాన్‌ | గంధర్వాప్సరసైస్సర్థం యథా విష్ణుశ్చతుర్భుజం || 54

చ్యుతస్తస్మాదిహాయాతో విప్రాణాం ప్రవరేకులే | సర్వజ్ఞస్సర్వవేదీచ జాయతే గతమత్సరః || 55

స్వధర్మనిరతశ్శాంతో దాతా భూతహితేరతః | ఆసాద్యవైష్ణవం జ్ఞానం తతోముక్తిమవాప్నుయాత్‌ || 56

తతస్సంపూజ్య మంత్రేణ సుభద్రాం భక్సవత్సలాం | ప్రసాదయేత్తో విప్రాః ప్రణిపత్యకృతాంజలిః || 57

నమస్తే సర్వగే దేవి నమస్తే శుభసౌఖ్యదే | త్రాహిమాం పద్మాపత్రాక్షి కాత్యాయని నమోస్తుతే || 58

ఏవం ప్రసాద్య తాం దేవీం జగద్ధాత్రీం జగద్ధితాం | ఒకదేవస్య భగినీం సుభద్రాం వరదాం శివాం || 59

కామగేన విమానేన నరోవిష్ణు పదం వ్రజేత్‌ | ఆభూతసంప్లవం యావత్‌ క్రీడిత్వాతత్ర దేవవత్‌ || 60

ఇహ మానుషతాం ప్రాప్తః బ్రాహ్మణో వేదవిద్భవేత్‌ | ప్రాప్యయోగం హరే స్తత్ర మోక్షం చ లభ##తే ధ్రువం || 61

ఇతి శ్రీ బ్రహ్మపురాణ ఆదిబ్రహ్మే పంచతీర్థవిధివర్ణనం కృష్ణసందర్శన

మాహాత్మ్యంనామ సప్తపంచాశత్తమోధ్యాయః

సర్వతీర్థ స్నానదానఫలమును కృష్ణదర్శనము చేసి పొందును. ఇటనుండి 51వ శ్లోకముదాక ఫలశ్రుతి సులభముగ నర్థమగును. ఇట్లు కృష్ణదర్శనము సేయునతడు పాపరహితుడయి ఐశ్వర్యవంతుడు గుణవంతుడునై కల్పశత మఖిల భోగముల ననుభవించి గంధర్వాప్సరసలు అనుగమింప విష్ణులోకమంది యిటకు తిరిగివచ్చి విప్రుడై జనించి సర్వవేది సర్వజ్ఞుడునై స్వధర్మనిష్ఠుడై శాంతుడై సర్వభూతహితముం గోరుచు వైష్ణవజ్ఞానంబడసి ముక్తినందును.

ఆమీద మంత్రపురస్సరముగా భక్తవత్సలను సుభద్ర నర్చించి నమస్తే సర్వగే అన్న యీమంత్రముచే నమస్కరించి కామగ విమానమున విష్ణుపురమేగి వ్రలయముదాక నటక్రీడించి బ్రాహ్మణుడై వేదవేత్తయే విష్ణుయోగమంది ముక్తినందును.

ఇతి ఆదిబ్రహ్మపురాణమున పంచతీర్థవిధివర్ణనమను ఏబదియేడవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters