Brahmapuranamu    Chapters   

అథేఏకపంచాశత్తమో7ధ్యాయః

పురుషోత్తవర్ణనమ్‌

శ్రీ భగవానువాచ

నాహం దేవో న యక్షో వా నదైత్యో నచదేవరాట్‌ | నబ్రహ్మ నచరుద్రో7హం విద్ది మాం పురుషోత్తమమ్‌ || 1

ఆర్తిహా సర్వలోకానా మనంతబలపౌరుషః | అరాధనీయో భూతానా మంతో యస్య న విద్యతే || 2

పఠ్యతే సర్వశాస్త్రేషు వేదాంతేషు నిగద్యతే | య మాహుర్‌ జ్ఞానగమ్యేతి వాసుదేవేతి యోగినః || 3

అహమేవస్వయం బ్రహ్మా అహంవిష్ణుశ్శివో7ప్యహమ్‌ | ఇంద్రో7హం దేవరాజశ్చజగత్సంయమనోయమః || 4

పృథివ్యాదీని భూతాని త్రేతాగ్ని ర్హృతభు జ్నృప | వరుణో 7పాంపతిశ్చాహం ధరిత్రీచ మహీధరః || 5

యత్కించి ద్వాజ్మయం లోకే జగత్థ్సావరజంగమమ్‌ | చరాచరం చ యద్విశ్వం మదన్యన్నాన్తికంచన || 6

ప్రీతో7హం తే నృపశ్రేష్ఠ ! పరం వరయ సవ్రత | యదిష్టం తత్ర్పయచ్ఛామి హృది యత్తే వ్యవస్థితమ్‌ || 7

మద్దర్శన మపుణ్యానాంస్వప్నాంతే7పిన జాయతే | త్వంపున ర్దృఢభక్తిత్వా త్ర్పత్యక్షం దృష్టవానసి || 8

శ్రుత్ర్వైవం వాసుదేవస్య వచనం తస్య భోద్విజాః | రోమాంచితతను ర్భూత్వా ఇదం స్తోత్రం జగౌనృపః || 9

ఇంద్రద్యుమ్నునితోపరమేశ్వరుడిట్లనియె. రాజా! యక్ష గంధర్వాదులు మహేంద్రబ్రహ్మారుద్రాదులలో నే నెవ్వడను గాను, పురుషోత్తమునిగా నన్నె ఱుంగుము. సకల పాపములు హరించు ననంతబలపౌరుషములుగలవాడను. అనంతడును అశేషభూతకోటికి నారాధనీయుడను. ఎవరిని జ్ఞానమ్యుడని వాసుదేవుడని యోగులుపేర్కొందురో. వేదాంతములు వెల్పునో యట్టి యోగగమ్యమగు వస్తువును నేను త్రిముర్తులు నేనై యున్నాను. దిక్పాలులందురు. నేనే. అఖిల చరాచర జగత్తును నేను. నాకంటె సన్యము లేదు. నీ యెడల సంప్రీతిం గంటిని. వర మర్ధింపుము నా దర్శనము పుణ్యముచేయనివానికి కలనైన గాదు. నీవుధృఢభక్తిసంపన్నుడగుటచే ప్రత్యక్షము నన్నుజూచిలచి. అని స్వా యన భూమిపతి మేనుపులకింపనా దేవుని పలువిధంబుల స్తుతించెను.

రాజోవాచ-

శ్రియః కాంత నమస్తే7స్తు శ్రీపతే పీతావాసనే | శ్రీద శ్రీశశ్రీనివాస నమస్తే శ్రీవికేతన || 10

ఆద్యం పురుష మీశానం సర్వేశం సర్వతోముఖమ్‌ | విష్కలం పరమం దేవం ప్రణతో7స్మి సనాతనమ్‌ || 11

శబ్దాతీతం గుణాతీతం భావాభావవిర్జితమ్‌ | నిర్లేపం నిర్గుణం సూక్ష్మం సర్వజ్ఞం సర్వభావనమ్‌ || 12

ప్రావృణ్మఘప్రతీకాశం గోబ్రాహ్మణహితే రతమ్‌ | సర్వేషా మేవ గోప్తారం వ్యాపినం సర్వభావినమ్‌ || 13

శంఖచక్రధరం దేవం గదాముసలధారిణమ్‌ | నమస్త్యే వరదం దేవం నీలోత్పలదలచ్ఛవిమ్‌ || 14

నాగపర్యంకశయనం క్షీరోదార్ణవశాయినమ్‌ | నమస్యే7హం హృషీకేశం సర్వపాపహరం హరిమ్‌ || 15

పునస్త్వాం దేవదేవేశం నమస్త్యే వరదం విభుమ్‌ | సర్వలోకేశ్వరం విష్ణుం మోక్షకారణ మవ్యయమ్‌ || 16

ఓ లక్ష్మీనాథా ! పీతాంబరధారీ ! శ్రీనివాసా ! నమస్కారము. ఆదిపురుషుడు సర్వేశ్వరుడు సర్వతోముఖుడు సనాతనుడు నగు విష్ణుదేవుని నమస్కరించెద. శబ్దములకు అతీతుడు గుణాతీతుడు భావాతీతుడు నిర్లిప్తుడు నిర్గుణుడు సూక్ష్మమైనవాడు. సర్వజ్ఞుడు శంఖచక్ర గధాముసలధారియు నీలోత్పలదళశ్యాముడు. వరప్రదాత. శేషశాయియు క్షీరసాగరశయనుడు, సర్వపాపహారియు నగు హృషీకేశుని నమస్కరించెద. మోక్షకారణభూతుడవు వ్యాపకుడవు, నాశరహితుడవు దేవదేవుడవునగు నిన్ను నమస్కరించెద.

ఏవం స్తుత్వా తు తం దేవం ప్రణిపత్య కృతాంజలిః | ఉవాచ ప్రణతో భూత్వా నిపత్య ధరణీతలే || 17

ప్రీతో7సి యది మే నాథ వృణొమి వరముత్తమమ్‌ | దేవాసురాః సగంధర్వా యక్షరక్షోమహోరగాః || 18

సిద్దవిద్యాధరాః సాధ్యాః కింనరా గుహ్యాకా స్తథా | ఋషయో యే మహాభాగా నానాశాస్త్రవిశారదాః || 19

పరివ్రాడ్యోగయుక్తాశ్చ వేదతత్త్వార్థచింతకాః | మోక్షమార్గవిదో యే7న్యే ధ్యాయంతి పరమం పదమ్‌ || 20

నిర్గుణం నిర్మలం శాంతం యత్పశ్యంతి మనీషిణః | తత్పదం గంతు మిఛ్ఛమి త్వత్ర్పసాదా త్సుదుర్లభమ్‌ || 21

ప్రాంజిలియై ప్రణామ మాచరించి వినయమున రాజిట్లు పలికెను. ''జగన్నాధ! దేవానుర గంధర్వ యక్షరక్ష స్సిద్ద సాధ్య విద్యాధర నాగ గుహ్యక కిన్నరాదులు సర్వశాస్త్ర పారగులు సన్యాసులు యోగులు వేదార్థచింతనులు మోక్షమార్గవిదులు ఏ వరమపదుమును ధ్యానింతురో నిర్గుణము నిర్మలము శాంతమునైన దేనిని బొంద గోరుదురో యట్టి పదమును నీ ప్రసాదమున నందగోరుదును.

శ్రీ భగవానువాచ

సర్వంభవతు భద్రం తే యథేష్టం సర్వ మాప్నుహి | భవిష్యతి యథాకామం మత్ర్పసాదాన్న సంసయః || 22

దశవర్షసహస్రాణి తథా నవశతాని చ | అవిచ్ఛిన్నం మహారాజ్యం కురు త్వం నృపసత్తమ || 23

ప్రయాస్యసి పదం దివ్యం దుర్లభం యత్సురాసురైః | పూర్ణంమనోరథం శాంతం గుహ్య మవ్యక్త మవ్యయమ్‌ || 24

పరాత్పరతరం సూక్ష్మం నిర్లేపం నిష్కలం ధ్రువమ్‌ | చింతాశోకవినిర్ముక్తం క్రియాకారణవర్జితమ్‌ || 25

తదహం దర్శయిష్యామి జ్ఞేయాఖ్యం పరమం పదమ్‌ | యం ప్రాప్య పరమానందం ప్రాప్ప్యసి త్వం పరాంగతిమ్‌ || 26

కీర్తి శ్చ తవ రాజేంద్ర భవ త్యత్ర మహీతలే | యావద్ఘనా నభో యావద్యా వచ్చంద్రార్కతారకమ్‌ || 27

యావత్సముద్రాః సపైవ యావన్మేర్వాదిపర్వతాః | తిష్టంతి దివి దేవాశ్చ తావ త్సర్వత్ర చావ్యయా || 28

ఇంద్రద్యుమ్నసరోనామ తీర్థం యజ్ఞాంగసంభవమ్‌ | యత్ర స్నాత్వా సకృల్లోకః శక్రలోక మవాప్నుయాత్‌ || 29

దాపయిష్యతి యంః పిండాం స్తటే7స్మి న్సరస్యశ్శుభే | కులైకవింశ ముద్ధృత్య శక్రలోకం గమిష్యతి || 30

పూజ్యమానో7ప్సరోభిశ్చ గంధర్వైర్గీతనిస్వనైః | విమానేన వసే త్తత్ర యావదింద్రా శ్చతుర్దశ || 31

సరసో దక్షిణ భాగే నైరృత్యాం తు సమాశ్రితే | న్య గ్రోధ స్తిష్ఠతే తత్ర తత్సమీపే తు మండపః || 32

కేతకీవనసంఛన్నో నానాపాదపసంకులః | నారికేళైరసంఖ్యేయై శ్చంపకై ర్వకుళావృత్తైః || 33

అశోకైః కర్ణికారైశ్చ పుంనాగై ర్నాగకేసరైః | పాటలామ్రాతసరళై శ్చందనై ర్దేవదారుభిః 34

న్యగ్రోధాశ్వత్థఖధిరైః పారిజాతై స్సహార్జునైః | హింతాళై శ్చైవ తాళై శ్చ శింశ##పై ర్బదరై స్తథా || 35

కరంజైర్లకుచైః ప్లక్షైః పనసై ర్బిల్వధాతుకైః | అన్యై ర్బహువిధై ర్వృక్షైః శోభిత స్సర్వతః పరమ్‌ || 36

ఆషాడస్య సితే పక్షే పంచమ్యాం పితృదైవతే | ఋక్షే నేష్యంతి న స్తత్ర నీత్వా సప్త దినానివై || 37

మండపే స్థాపయిష్యంతి సువేశ్యాభిః స్సుశోభ##నైః | క్రీడావిశేషబహుళైర్నృత్యగీతమనోహరైః || 38

చామరై స్వర్ణదండైశ్చ వ్యజనైః రత్నభూషణౖః || వీజయంత స్తథా7స్మభ్యం స్థాపయిష్యంతి మంగళాః || 39

బ్రహ్మచారీ యతిశ్చైవ స్నాతకాశ్చ ద్విజోత్తమాః | వానప్రస్థా గృహస్థాశ్చ సిద్ధా శ్చాన్యేచ బ్రహ్మణాః || 40

నానావర్ణపదై స్త్సోత్రైరృగ్యజుస్సామ నిస్వనైః | కరిష్యంతి స్తుతిం రాజ న్రామకేశవయః పునః || 41

తతఃస్తు త్వాచదృష్ట్వాచ సంప్రణమ్యచభక్తితః | నరో వర్షాయుతం దివ్యం శ్రీమద్ధరిపురే వసేత్‌ || 42

పూజ్యమానో 7ప్సరోభిశ్చ గంధర్వై ర్గీతనిస్వనైః | హరే రనుచర స్తత్ర క్రీడతే కేశ##వేన వై || 43

విమానే నార్కవర్ణేన రత్నహారేణ భ్రాజతా | సర్వకామై ర్మహాభోగై స్తిష్ఠతే భువనోత్తమే || 44

తపః క్షయా దిహా77గత్య మనుష్యోబ్రాహ్మణోభ##వేత్‌ | కోటీధనపతిః శ్రీమాంశ్చతుర్వేదీ భ##వే ద్ధ్రువమ్‌ || 45

అంత భగవంతుడు '' ఓ రాజా! మంచిది నీకు శుభముగుగాక. నీ కోరిన స్థానము నందుము. నా అను గ్రహమున నది నీకు లభించును. సందేహము వలదు. పదివేల తొమ్మిది వందలేండ్లు నీవు రాజ్యమేలుదువు గాక. ఆ మీద నా దివ్యపదము గాంతువు. నీకీర్తి శాశ్వతమగును.''ఇంద్రద్యుమ్న సరస్సు'' అను పేరు నీ తీర్థము యజ్ఞాంగ సంభవము. ఇందు స్నానము చేసిన జీవి యింద్రలోకము వడయును. ఇచ్చట పిండప్రదానము చేసిన నిరువది తరములవారు స్వర్గముం గాంతురు. అచ్చట నప్సరసలచే గంధర్వ గాన మాలాపించు బూజింపబడి పదునల్గురింద్రులు పాలించునంతకాలము విమాన మధివసించి నీవు విహరింతువు. ఈ సరస్సునకు దక్షిణదిశ నైఋతి మూల నొక మఱ్ఱి చెట్టున్నది. దాని దరి నిక మండపము కలదు. దాని చుట్టు మొగలిపొదలున్నవి. వివిధ తరుసంకుల మట కొబ్బరి మొదలగు తోటలుసంపెంగ పూలతోటలుచాల గలవు. ఆషాడశుక్లపంచమి పితృదేవతాకమ1యినమఘానక్షత్రమందు మండపమున వేంచేవు జేసి యేడురోజులు నిలిపి నృత్యగీత క్రీడావినోదములచే నర్చించిసువర్ణదండములగు చామరములచే నీచోపులిచ్చుచు రత్నభూషిత వ్యజనములచేవీచుచు నొక స్తంభమునట ప్రతిష్ఠించి బ్రహ్మచారి యతిస్నాతకులు గృహస్థులు వానప్రస్థులు నానావిధ స్తోత్రపాఠములచే ఋగ్యజుస్సా మములచే మమ్ము(బలరామకృష్ణులను) స్తుతింతురు. ఇట్లు మమ్ము దర్శంచి భక్తితో మ్రొక్కినభక్తులు పదివేలేండ్లు వైకుంఠమున వసించును. సర్వభోగములందును నా పుణ్యము ననుభవించి తిఱిగి ఈయిలపై విప్రులై జనించి కోటీశ్వరులై చతుర్వేదులై విరాజిల్లుదురు.

ఏవం తసై#్మ వరం దత్వా కృత్వా చ సమయం హరిః | జగా మాదర్శనం విప్రాః సహితో విశ్వకర్మణా || 46

సతు రాజా తదా హృష్టో రోమాంచిత తమారుహః | కృతకృత్య మివాత్మానం మేనే సందర్మనాద్ధరేః || 47

తతః కృష్ణంచ రామంచ సుభద్రాం చ వరప్రదామ్‌ | రథై ర్విమాన సంకాశై ర్మణి కాంచన చిత్రతైః || 48

సంవాహ్య తా స్తదా రాజా మహామంగళనిఃస్వనైః | ఆనయామాస మతిమా న్సామాత్య స్సపురోహితః || 49

నానావాదిత్ర నిర్ఘోషై ర్నానావేదస్వనై శ్శుభైః | సంస్థాప్య చ శుభే దేశే పవిత్రే సుమనోహరే || 50

తత శ్శుభతిథౌ కాలే నక్షత్రే శుభలక్షణ | ప్రతిష్ఠాం కారయామాస సుముహూర్తే ద్విజై స్సహ || 51

యథోక్తేన విధానేన విధిదృష్టేన కర్మణా ఆచార్యనుమతేనైవ సర్వం కృత్వా మహీపతిః || 52

ఆచార్యాయ తదా దత్త్వా దక్షిణాం విధివత్ర్పభుః | ఋత్విగ్భ్యశ్చ విధానేన తథా7న్యేభ్యో ధనం దదౌ || 53

కృత్వా ప్రతిష్ఠాం విధివ త్ర్పాసాదే భువనోత్తమే | స్థావయామస తాన్సర్వా న్విధిదృష్టేన కర్మణా || 54

తత స్సంపూజ్య విధినా నానాపుషై#్పస్సు గంధిభిః | సువర్ణమణిముక్తాద్యై ర్నానావసై#్ర స్సుశోభ##నైః || 55

రత్నైశ్చ వివిధై ర్దివ్యై రాసనై ర్గ్రామపత్తనైః | దదౌ చాన్యా న్స విషయా న్పురాణి నగరాణి చ || 56

ఏవం బహువిధం దత్త్వా రాజ్యం చారు యథోచితమ్‌ | ఇష్ట్వా చ వివిధై ర్యజ్ఞైర్దత్వా దానా న్యనేకశః || 57

కృతకృత్య స్తతోరాజా త్యక్తసర్వపరిగ్రహః ! జగామ పరమం స్థానం తద్విష్ణోః పరమం పదమ్‌ || 58

ఏవం మయా మునిశ్రేష్టాః కథితో వో నృపోత్తమాః | క్షేత్రస్య చైవ మాహాత్మ్యం కిమన్యచ్ఛ్రోతుమిచ్ఛథ || 59

శ్రుత్వైవం వచనం తస్య బ్రహ్మణో7వ్యక్త జన్మనః | అశ్చర్యం మేనిరే విప్రాః పప్రచ్ఛుశ్చ పునర్ముదా || 60

అని యిట్లు హరి యాతనికి వరమిచ్చి విశ్వకర్మతో కనుమఱుగయ్యెను. అ ఱడానందభరితుడై కృతార్థుడనైతి ననుకొని బలరామకృష్ణులను సుభద్రను దేవ విమానమట్టిరథమునెక్కించి యూరేగించి పురోహితమంత్రి సామంతాదులతో చక్కని పవిత్రప్రదేశమందు శుభలగ్నమున ప్రతిష్టించి యథావిధిగ నర్చించి యాచర్యఋత్విగ్జనంబులను భూరిదక్షిణలచే సత్కరించెను. ఆ మీద బెక్కు జన్నములు చేసెను. కృతకృత్యుడై ఐహికభోగములను విడిచి విష్ణుపదమంచెను. ఇది ఈ పురుషోత్తమ క్షేత్రమహిమ. మఱి యేమి వినవలతురన మును లిట్లనిరి. పురుషోత్తమ క్షేత్రయాత్ర యేపుదెట్లు చేయవలెను! పంచతీర్థ విశేష మేమి! అందొక్కొక్క తీర్థస్నానంబు వలనను, దానములవలను దేవదా దర్శనంబు వలన నేయే ఫలము లభించును? దెలుపుమని వేడిరి.

కస్మిన్కాలే సురశ్రేష్ఠ గంతవ్యం పురుషోత్తమమ్‌ | విధినా కేన కర్తవ్యం పంచతీర్థమితి ప్రభో || 61

ఏకై కస్య చ తీర్థస్య స్నానదానాదియత్ఫలమ్‌ | దేవతా ప్రేక్షణ చైవ బ్రూహి సర్వం పృథక్పృథక్‌ || 62

బ్రహ్మోవాచ

నిరాహారః కురుక్షేత్రే పాదేనై కేన యస్తపేత్‌ జితేంద్రియో జితక్రోధస్సప్తసంవత్సరాయుతమ్‌ || 63

దృష్ట్వా సదా జ్యేష్ఠశుక్ల ద్వాదశ్యాం పురుషోత్తమమ్‌ | కృతోపవాసః ప్రాప్నోతి తతో7ధికతరం ఫలమ్‌ || 64

తస్మాజ్జ్యేష్టే మునిశ్రేష్టాః ప్రయత్నేన మసంయతేః |స్వర్గలోకేప్పువిప్రాద్యైర్ధృష్ఠవ్యః పురుషోత్తమః || 65

పంచతీర్థం తు విధివ త్కృత్వాజ్యేష్టే నరోత్తమః | శుక్ల పక్షస్య ద్వాదశ్యాం పశ్యే త్తం పురుషోత్తమమ్‌ || 66

యే పశ్యంత్యవ్యయం దేవం ద్వాదశ్యాం పురుషోత్తమమ్‌ | తే విష్ణులోక మాసాద్య నచ్యవంతే కదాచన || 67

తస్మాజ్జ్యేష్టే ప్రయత్నేన గంతవ్యం భో ద్విజోత్తమాః | కృత్వా తస్మిన్పంచతీర్థం ద్రష్టవ్యఃపురుషోత్తమః || 68

సుదూరస్థో7పి భో భక్త్యా కీర్తయే తురుషోత్తమమ్‌ | అహన్యహని శుద్ధాత్మ సో7సి విష్ణుపురం వజ్రేత్‌ || 69

యాత్రాం కరోతి కృష్ణస్య శ్రద్దయాయః సమాహితః | సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం వ్రజేన్నరః || 70

చక్రం దృష్ట్వా హరేర్దూరా త్ప్రాపాదోపరి సంస్థితమ్‌| సహసా ముచ్యతే పాపాన్నరో భక్త్యాప్రణమ్య తత్‌ || 71

ఇతి శ్రీ మహాపురాణ అది బ్రాహ్మే స్వయంభుఋషి నంవాదే పురుషోత్తమవర్ణసంనామ ఏకపంచాశత్తమో7ధ్యాయః ||

అంత బ్రహ్మయిట్లనియె. కురుక్షేత్రమందు నిరాహారియై యెంటికాలపై నిల్చి చెబ్బదివేలేండ్లు చేసిన తపస్సు యొక్కఫలమీ క్షేత్రమునందు జ్యేష్ఠ శుద్ద దశమినా డుపవాసముండి జగన్నాథు దర్శించినంతమాత్రాన గల్గును జ్యేష్ఠమందే పంచతీర్థయాత్రసేసి శుద్దద్వాదశినాడు పురుషోత్తముని దర్శంచవలెను. దానిచే విష్ణులోకమును శాశ్వతముగ పొందును. దూరముననుండియేని పురుషోత్తముని దినదినము కీర్తించిన జాలును. విష్ణుపురము నందును హరి చేతిలోని చక్రము నల్లంత దూరమందుండి యేని ఆలయమనుపరి భాగమందున్నదానిని జూచి నమస్కరించిన యాతడు పాపా విముక్తుడగును.

ఇది బ్రహ్మపురాణమున పురుషోత్తమవర్ణన మను నేబదియెకటవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters