Brahmapuranamu    Chapters   

ద్విచత్వారింశో7ధ్యాయః

ఉత్కల క్షేత్రవర్ణనమ్‌

బ్రహ్మోవాచ

విరజే విరజా మాతా బ్రహ్మాణీ సంప్రతిష్ఠితాః యస్యాఃసందర్శనా స్మర్త్యః పునాత్యాసప్తమం కులమ్‌|| 1

సకృ ద్దృష్ట్వాతు తాందేవీం భక్త్యా77 పూజ్య ప్రణమ్యచ | నరః స్వవంశ ముద్దృత్య మమలోకం స గచ్ఛతి|| 2

అన్యాశ్చ తత్ర తిష్ఠంతి విరజే లోకమాతరః| సర్వపాపహరా దేవ్యో వరదా భక్తవత్సలాః|| 3

ఆస్తే వైతరణీ తత్ర సర్వ పాపహరా నదీ| యస్యాం స్నాత్వా నరశ్రేష్ఠ స్సర్వ పాపైః ప్రముచ్యతే|| 4

ఆస్తేస్వయంభూ స్తత్రైవ క్రోడరూపీ పరిః స్వయమ్‌| దృష్ట్వా ప్రణమ్య తం భక్త్యా పరం విష్ణుం వ్రజంతితే|| 5

కాపిలే గోగ్రహే సోమే తీర్థే చాలాబుపంజ్ఞితే| మృత్యుంజయే క్రోడతీర్థే వాసుకే

సిద్ధకేశ్వరే|| 6

తీర్థేష్వేతేషు మతిమా న్విరజే సంయతేంద్రియః | గత్వా7ష్టతీర్థం విధివత్‌స్నాత్వా దేవా స్ర్పణమ్యచ|| 7

సర్వపాప వినిర్ముక్తో విమానవరమాస్థితః |ఉపగీయమానో గంధర్వైర్మమ లోకే

మహీయతే|| 8

విరజమనుక్షేత్రమందు విరజయను తల్లి సరస్వతీదేవి సుప్రతిష్ఠింపబడినది. ఆమెను దర్శించి మనుజుడేడు తరముల వారిని బవిత్రులను జేయగలడు. ఆ దేవి నొక్కమారేని దర్శించి పూజించి మ్రొక్కినవాడు దనవంశము నుద్ధరించి నాలోకమున కేగును. ఆవిరజక్షేత్రమున లోకమాత లింకనెందఱోయున్నారు. వారు సర్వపాపహారిణులు భక్తవత్సలలు, వరప్రదాత్రులు. అక్కడ సర్వపాపహారిణి వైతరిణీనదియున్నది. అందు స్నానముచేసిన నరోత్తముడు సర్వపాపవిముక్తుడగును. అక్కడనే వరాహమూర్తియై హరి తనకూదా వెలసియున్నాడు. ఆయనను భక్తితో దర్శించి మ్రొక్కి విష్ణు పరమాత్మం బొందుదురు.

విరజక్షేత్రమందున్న కపిలతీర్థము గోగ్రహము సోమము ఆలాబుతీర్థము మృత్యుంజయము క్రోడము (వరాహము) వాసుకము సిద్ధకేశ్వరమునను పేరుగల యీ యెనిమిది తీర్థములందు బుద్ధిమంతుడు ఇంద్రియముల నిగ్రహించి యధావిధిగ స్నానము చేసి దేవతలకుమ్రొక్కి సర్వపాపముక్తుడై దివ్యవిమానమొక్కి గంధర్వులు గానము సేయుచు గీర్తింప నేగి నాలోకమందు పూజ్యుడగును.

విరజే యో మమ క్షేత్రే పిండదానం కరోతివై || స కరోత్యక్షయాం తృప్తిం పితౄణాం నాత్ర సంశయః|| 9

మమక్షేత్రే మునిశ్రేష్ఠావిరజే యే కళేబరమ్‌ | పరిత్యజంతి పురుషా స్తే మోక్షం ప్రాప్నువంతివై|| 10

స్నాత్వా యః సాగరే మర్త్యో దృష్ట్వా చ కపిలం హరిమ్‌|పశ్యేద్దేవీం వారాహీం సయాతి త్రిదశాలయమ్‌|| 11

సంతి చాన్యాని తీర్థాని పుణ్యా న్యాయతనానిచ | తత్కాలేతు మునిశ్రేష్ఠా

వేదితవ్యానితానివై|| 12

సముద్రస్యోత్తరే తీరేతస్మిన్‌ దేశే ద్విజోత్తమాః|ఆస్తేగుహ్యం పరం క్షేత్రం ముక్తిదమ్‌ పాపనాశనమ్‌|| 13

సర్వత్రవాలుకాకీర్ణం పవిత్రమ్‌ సర్వకామదమ్‌| దశయోజనవిస్తీర్ణం క్షేత్రం

పరమదుర్లభమ్‌|| 14

అశోకార్జునపున్నాగై ర్వకుళైః సరళద్రుమైః| పనసైర్నాకేళై శ్చ శాలైస్తాలైః కపిత్థకైః || 15

చంపకై కర్ణికారైశ్చ చూతబిల్వైః సపాటలైః | కదంబైః కోవిదారైశ్చ లకుచై ర్నాగకేసరైః|| 16

ప్రాచీనామలకై ర్లోధ్రై ర్నారంగై ర్ధవఖాదిరైః | సర్జబూర్జాశ్వకర్ణైశ్చ తమాలైర్దేవదారుభిః|| 17

మందారైః పారిజాతైశ్చ న్యగ్రోధాగురు చందనైః | ఖర్జూరామ్రాతకైః సిద్దైర్ముచుకుందైః సకింశుకైః|| 18

అశ్వత్థైః సప్తపర్ణైశ్చ మధుధార శుభాంజనైః| శింశపామలకై ర్నీపైర్నింబతిందు విభీతకైః || 19

సర్వర్తు ఫలగంధాఢ్యైః సర్వర్తు కుసుమోజ్వలైః || మనోహ్లాదకరైః శుభ్రైర్నానా నిహగనాదితైః ||20

శ్రోత్రరమ్యైః సుమధురై ర్బలనిర్మదనేరితైః | మనసః ప్రీతిజనకై శ##బ్దైః ఖగముఖేరితైః|| 21

చకోరైః శతపత్రైశ్చ భృంగరాజై స్తథాశుకైః | కోకిలైః కలవింకైంశ్చ హారీతై ర్జ్వీజీవకైః || 22

ప్రియపుత్రైశ్చాతకైశ్చ తథా7న్యై ర్మధురస్వరైః|శ్రోత్రరమ్యైః ప్రియకరైః కూజద్భిశ్చార్వధిష్ఠితైః|| 23

కేతకీవనఖండై శ్చ అతిముక్తైః సకుబ్జకైః| మాలతీకుంద బాణౖశ్చ కరవీరైః సితేతరైః || 24

జంబీరకరుణాంకోలై ర్దాడిమైర్బీజ పూరకైః | మాతులుంగైః పూగఫలై ర్హింతాలైః కదళీవనైః||25

అన్యైశ్చ వివిధైర్వృక్షైః పుషై#్యశ్చాన్యై ర్మనోహరైః | లతావితాన గుల్మైశ్చ వివిధైశ్చ జలాశ##యైః || 26

దీర్ఘికాభి స్తటాకైశ్చ పుష్కరిణీభిశ్చ వాపిభిః || నానాజలాశ##యైః పుణ్యౖః పద్మినీఖండమండితైః|| 27

సరసాంచమనోజ్ఞాని ప్రసన్న సలిలానిచ | కుముదైః పుండరీకై శ్చ తథానీలోత్పలైః శుభైః || 28

కల్హారైః కమలై శ్చాపి ఆచితాని సమంతతః | కాదంబైశ్చక్రవాకై శ్చ తథైవ జలకుక్కుటైః|| 29

కారండవైః ప్లవైర్హంసైః కూర్మైర్మత్స్యైశ్చ మద్గుభిః|దాత్యూహసారసాకీర్ణేః కోయష్టి బక శోభితై||30

ఏతైశ్చాన్యైశ్చ కూజద్భిః సమంతా జ్జలచారిభిః | ఖగైర్జలచరైశ్చాన్యైః కుసుమైశ్చ జలోద్భవైః|| 31

ఏవం నానావిధై ర్వృక్షైః పుషై#్పః స్థలజలోద్భవైః|

బ్రహ్మచారిగృహస్థైశ్చ వానప్రస్థైశ్చ భిక్షుభిః|| 32

స్వదర్మ నిరతైర్వర్ణై స్థతా7న్యైః సమలంకృతమ్‌ | హృష్టపుష్ట జనాకీర్ణం నరనారీ సమాకులమ్‌|| 33

అశేష విద్యానిలయం సర్వదర్మ గుణాకరమ్‌|ఏవం సర్వగుణోపేతం క్షేత్రం పరమదుర్లభమ్‌ః|| 34

విరజక్షేత్రమున పితరులకు బిండదానముచేసిన నది యక్షయ తృప్తికరమగును. ఈ నాక్షేత్రమందు శరీరము విచిడినవారు ముక్తులగుదురు. ఇచట సముద్రస్నానము సేసి కపిలుడనుపేరనున్న విష్టువును వారాహియను దేవతను దర్శించి స్వర్గమందును. ఇచట పుణ్యతీర్థములు ఆలయములు పెక్కులున్నవి. అవి ఆ యాత్రాసమయమందు తెలిసి కొని సేవింపదగును. సముద్రము నుత్తరపు టొడ్డునగల ప్రదేశమందు గుహ్యమైన ముక్తిక్షేత్రమున్నది. అందంతట నినుకమేటలు నున్నవి. పదియోజనముల వైశాల్యముగలది. అశోకాది నానాఫలవృక్షములు మందారాదులు పూలచెట్లు ఖర్జూరాదులు సర్వర్తుఫల కుసుమగంధభరితములు పక్షికూజిత మనోహరములెన్నోకలవు. దిగుడుబావులు పుష్కరిణులు తామరకొలనులు లెక్కేలేదు. స్థలజలచరములగు పక్షులు పెక్కులున్నవి. స్వవర్ణధర్మానుసారులు గృహస్థాద్యాశ్రమముల వారక్కడనున్నారు. స్త్రీలు పురుషులు హృష్ణులును పుష్టులును. అది సర్వ విద్యాసదనము. సర్వ ధర్మగుణాకరము. అట్టి క్షేత్రము మఱిదుర్లభము.

అస్తేతత్ర మునిశ్రేష్ఠా విఖ్యాతః పురుషోత్తమః | యావదుత్కళమర్యాదా దిక్‌ క్రమేణ ప్రకీర్తితా||35

వ త్కృష్ణప్రసాదేన దేశః పుణజ్యతమోహి సః | యత్ర తిష్ఠతి విశ్వాత్మా దేశేస పురుషోత్తమః||36

గద్వ్యాపీ జగన్నాథ స్తత్ర సర్వం ప్రతిష్ఠితమ్‌ | అహంరుద్రశ్చ శక్రశ్చ దేవా శ్చాగ్ని పురోగమాః|| 37

నివసామో మునిశ్రేష్ఠా స్తస్మిన్‌దేశే సదావయమ్‌ | గంథర్వాప్సరసః సర్వాః పితరో దేవమానుషాః|| 38

యక్ష విద్యాధరాః సిద్ధా మునయః సంశితవ్రతాః| ఋషయో వాలఖిల్యాశ్చ కశ్యపాధ్యాః ప్రజేశ్వరాః || 39

నుపర్ణాః కిన్నరా నాగా స్తథా7న్యే స్వర్గవాసివః | సాంగాశ్చ చతురోవేదాః శాస్త్రాణి వివిధానిచ|| 40

ఇతిహాస పురాణాని యజ్ఞాశ్చ వరదక్షిణాః | నద్యశ్చవివిధాః పుణ్యా స్తీర్థా

న్యాయతనానిచ|| 41

సాగరాశ్చ తథా శైలా స్తసిన్ద్మేశే వ్యవస్థితాః | ఏవం పుణ్యతమే దేశే దేవర్షి పితృసేవితే|| 42

సర్వోపభోగ సహితే వాసః కస్యనరోచతే| శ్రేష్ఠత్వం కస్యదేశస్య కించాన్యదధికం తతః||43

ఆస్తేయత్ర స్వయం దేవో ముక్తిదః పురుషోత్తమః | దన్యాస్తే విబుధప్రఖ్యా యే వసంత్యుత్క ళే నరాః||44

అక్కడ పురుషోత్తముడను పేర విష్ణువున్నాడు. ఉత్కశ##దేశము సరిహద్దువరకుగల దేశమా కృష్ణానుగ్రహముచే పుణ్యతమము. నేను రుద్రుడు ఇంద్రుడు అగ్నిముఖులగు దేవతలునచ్చటనే యెల్లవేళల వసింతుము. గంధర్వు లప్సరసలు పితరులు మనుష్యులు మునులు వాలఖిల్యాదులు కశ్యపాదులు గరుడలు కిన్నరులు నాగులు సాంగములైన వేదములు సర్వశాస్త్రములు ఇతిహాసపురాణాదులు యజ్ఞములు పుణ్యనదులు తీర్థములు గిరులు సాగరములు నక్కడనే యున్నవి. ఇట్లు దేవఋషి పితృసేవితమై సమస్తోపభోగములతో గూడిన పవిత్రతమమైన దేశమున నివాసమెవనికి రుచింపదు? దానికంటె అథికమైన శ్రేష్ఠత్వ మేదేశమున నుండును? బ్రాహ్మణులారా| ముక్తిప్రదుడైన పురుషోత్తముడు స్వయముగ సన్నిహిడుతై యున్న యుత్కళ##దేశవాసులు ధన్యులు.

తీర్థరాజజలే స్నాత్వా పశ్యంతి పురుషోత్తమమ్‌ | స్వర్గేవసంతి తే మర్త్యా నతే యాంతి యమాలయమ్‌|| 45

యే వసన్త్యుత్క ళే క్షేత్రే పుణ్య శ్రీపురుషోత్తమే | సఫలం జీవితం తేషా ముత్కలానాం సుమేధసామ్‌|| 46

యే పశ్యంతి సురశ్రేష్టం ప్రసన్నాయతలోచనమ్హ్‌ | చారుభ్రూకేశ ముకుటం చారుకర్ణావతంసకమ్‌|| 47

చారుస్మితం చారుదంతం చారుకుండలమండితమ్‌ | సునాసం సుకపోలం చ సులలాటం సులక్షణమ్‌|| 48

త్రైలోక్యానందజననం కృష్ణస్యముఖపంకజమ్‌|| 49

ఇతి బ్రహ్మపురాణ ఉత్కళ##క్షేత్రవర్ణనం నామ ద్విచత్వారింశో7ధ్యాయః

అక్కడ తీర్థస్నానముచేసి పురుషోత్తముని సేవించినవారు స్వర్గమున కేగుదురు. వారు యమాలయమునకు బోరు. ఉత్కలదేశమునందలి పురుషోత్తమక్షేత్రనివాసుల జీవితము ధన్యము. ప్రసనములై విశాలనేత్రములు చక్కనికనుబొమలు కేశపాశము కిరీటము నింపైన చెవికమ్మలు చిఱునవ్వు చక్కని పలువరుసయుగల్గి కిరీటాలంకృతుడైన యా కృష్ణపరమాత్మయొక్క ముఖపద్మము త్రిలోకానంద జనకము.

ఇది బ్రహ్మపురాణమునందు ఉత్కళ##క్షేత్ర వర్ణనమను నలుబదిరెండవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters