Brahmapuranamu    Chapters   

చతుర్థోధ్యాయః

పృథుప్రభృతి సర్వదేవాదీనాం రాజ్యాభిషేక వర్ణనమ్‌

లోమహర్షణ ఉవాచ-

అభిషి చ్యాథ రాజేంద్రం పృథుం వైన్యం పితామహః | తతః క్రమేణ రాజ్యాని వ్యాదేష్టు ముప చక్రమే || 1

ద్విజానాం వీరుధాం చైవ నక్షత్రగ్రహయోస్తథా| యజ్ఞానాం తపసాం చైవ సోమం రాజ్యేభ్యషేచయత్‌|| 2

అపాంతు వరుణం రాజ్యే రాజ్ఞాం వైశ్రవణం పతిమ్‌ | ఆదిత్యానాం తథా విష్ణుం వసూనా మథ పావకమ్‌ || 3

ప్రజాపతీనాం దక్షంతు మరుతా మథ వాసవమ్‌ | దైత్యానాం దానవానాం వై ప్రహ్లాద మమితౌజసమ్‌ || 4

వైవస్వతం పితౄణాంచ యమం రాజ్యేభ్యషేచయత్‌ | యక్షాణాం రాక్షసానాంచ పార్థివానాం తథైవచ || 5

సర్వభూత పిశాచానాం గిరీశం శూలపాణినమ్‌ | శైలానాం హిమవంతం చ నదీనా మథ సాగరం || 6

గంధర్వాణా మధిపతిం చక్రే చిత్రరథం ప్రభుమ్‌ | నాగానాం వాసుకిం చక్రే సర్పణా మథ తక్షకం || 7

వారణానాం తు రాజాన మైరావత మథాదిశత్‌| ఉచ్చైః శ్రవస మశ్వానాం గరుడం చైవ పక్షిణాం || 8

మృగాణా మథ శార్దూలం గోనృషం తు గవాం పతిమ్‌ | వనస్పతీనాం రాజానాం ప్లక్ష మేవాభ్యషేచయత్‌ || 9

ఏవం విభజ్య రాజ్యాని క్రమేణౖవ పితామహః | దిశాం పాలా నథ తతః స్థాపయామాస స ప్రభుః || 10

పూర్వస్యాం దిశి పుత్రం తు వైరాజస్య ప్రజాపతేః| దిశః పాలం సుధన్వానం రాజానంసోభ్యషేచయత్‌ || 11

దక్షణస్యాం దిశి తథా కర్దమస్య ప్రజాపతేః | పుత్రం శంఖపదం నామ రాజానం సోభ్యషేచయేత్‌ || 12

పశ్చిమస్యాం దిశి తథా రజసః పుత్ర మచ్యుతం | కేతుమంతం మహాత్మానాం రాజానం సోభ్యషేచయేత్‌ || 13

తథా హిరణ్య రోమాణం పర్జన్యస్య ప్రజాపతేః | ఉదీ చ్యాం దిశి దుర్ధర్షం రాజానం సోభ్యషేచయేత్‌ || 14

తై రియం పృథివీ సర్వా సప్తద్వీపా సపత్తనా | యథాప్రదేశ మద్యాపి ధర్మేణ ప్రతిపాల్యతే || 15

రాజసూయాభిషిక్త స్తు పృథు రేతై ర్నరాధిపైః | వేదదృష్టేన విధినా రాజా రాజ్యే నరాధిపః || 16

తతో మన్వంతరేతీతే చాక్షుషేమిత తేజసి | వైవస్వతాయ మనవే పృథివ్యాం రాజ్య మాదిశత్‌ || 17

తస్య విస్తార మాఖ్యాస్యే మనోర్వైవస్వతస్య హ | భవతాం చానుకూల్యాయ యది శ్రోతు మిహేచ్ఛథ || 18

మహదేత దధిష్ఠానం పురాణ తదధిష్ఠితమ్‌

లోమహర్షుడు ఇట్లనియె. . .

బ్రహ్మ వేనకుమారుని పృథుని చక్రవర్తిగా నభిషేకించి క్రమముగా వారివారికి రాజ్యములను నిర్ణయించియిచ్చెను. ద్విజులు ధాన్యములు నక్షత్రములు గ్రహములు యజ్ఞములు తపస్సులు అను వాని రాజ్యాధికారమందు సోమునకు పట్టాభిషేకము చేసెను. అప్పులకు వరుణుని, రాజులకు రాజరాజును, (కుబేరుని) అదిత్యులకు విష్ణుని, వసువుల కగ్నిని, ప్రజాపతులకు దక్షుని, మరుత్తలకు వాసవుని, దైత్యదానవులకు ప్రహ్లాదుని, పితరులకు వైవస్వతుని, (యముని) యక్ష రాక్షస పార్థివ సర్వ భూత పిశాచములకు శూలపాణియైన గిరీశుని, (శివుని) శైలమునకు హిమవంతుని, నదులకు సాగరుని, గంధర్వులకు చిత్రరథుని, నాగులకు వాసుకిని, సర్పములకు తక్షకుని, ఏనుగులకు ఐరావతుని, అశ్వములకు ఉచ్చైఃశ్రవసమును, పక్షులకు గరుడుని, మృగములకు శార్దూలమును, గోవులకు గోవృషమును, వనస్పతులకు జువ్విచెట్టును, రాజు గావించెను.

తూర్పు దిశకు వైరాజ ప్రజాపతి కుమారుని సుధన్వుని, దక్షిణ దిశకు కర్దమ ప్రజాపతి కొడుకు శంఖపదుని, పడమటిదిశకు రజస్సు కుమారుని (అచ్యుతుని) కేతుమంతుని, ఉత్తర దిశకు వర్జన్య ప్రజాపతి తనయిని హిరణ్యరోముని అధిపతులనుగానభిషేకించెను.

సప్తద్వీప పరివృతమయిన యీ పృథ్వి పట్టణములతోc గూడి వారివారిచేత నిపుడును ధర్మముతో పాలించబడుచున్నది. ఈ నరపతులచే వేదవిహితముగ రాజసూయాభిషిక్తుడునై - రాజ్యాభిషిక్తుడవై పృథువు చక్రవర్తియై యిమ్మేదినినేలను, చాక్షుషమన్వంతరము గడచి వైవస్వంతమన్వంతర మారంభమయ్యెను. అమ్మన్వంతర వృత్తాంతము వినిపింతును వినుండు. (1-18)

విస్తారేణ పృథౌ రన్మ లోమహర్షణ కీర్తయ! యథా మహాత్మనాతేన దుగ్ధావేయం వసుంధరా || 19

యథా వా పినృభి ర్దుగ్ధా యథాదేవై ర్మహర్షిభిః | యథా దైత్యైశ్చ నాగైశ్చ యథాయక్షైర్యథా ద్రుమైః 20

యథా శైలైః పిశాచైశ్చ గంధర్వైశ్చ ద్విజోత్తమైః | రాక్షసైశ్చ మహాసత్త్వైర్యథా దుగ్ధా వసుంధరా || 21

తేషాం పాత్ర విశేషాంశ్చ వక్తు మర్హసి సువ్రత | వత్సక్షీర విశేషాంశ్చ దోగ్ధారం చాను పూర్వశః || 22

యస్మాచ్ఛ కారణా త్పాణి ర్వేనస్య మథితః పురా | క్రుద్ధై ర్మహర్షిభిస్తాత కారణం తచ్చ కీర్తయ || 23

మునులనిరి. . .

లోమహర్షణ! పృథు చక్రవర్తి మహానుభావుడు. ఇవ్వసుంధరను గోవునొనరించి వస్తుసారమును పిదికెనందురు. నర నరాసుర నాగ యక్ష ద్రుమ శైల పిశాచ గంధర్వ ద్విజ రాక్షసాది మహాసత్వ జాతులచే నీభూమి ఎట్లు పిదుకబడినది. వారువారు పిదికిన పాత్ర విశేషములేవి? దూడలెవరు? దోగ్ధ ఎవరు? దుగ్ధము (పాలు) ఎట్టిది? ఆనతిమ్ము. కుపితులైన మహర్షులెట్లు వేనుని హస్తము మథించిరి? దానికి కారణమేమి? అదియుం గీర్తింపుము. ఆన- (19-23)

లోమహర్షణ ఉవాచ-

శృణుధ్వం కీర్త యిష్యామి పృథో ర్వైన్యస్య విస్తరమ్‌ | ఏకాగ్రాః ప్రయతాశ్చైవ పుణ్యార్థం వై ద్విజర్షభాః || 24

నాశుచేః క్షుద్రమనసో నాశిష్య స్యాప్రతస్యచ | కీర్తయేయ మిదం విప్రాః కృతఘ్నా యాహితాయచ || 25

స్వర్గ్యం యశస్య మాయుష్యం ధన్యం వేదైశ్చ సంమితమ్‌ | రహస్య మృషిభిః ప్రోక్తం శృణుద్వం వై యథాతథమ్‌ || 26

యశ్చేమం కీర్తయేన్నిత్యం పృథో ర్వైస్యస్యవిస్తరమ్‌ | బ్రాహ్మణభ్యో నమస్కృత్య న స శోచేత్‌ కృతాకృతమ్‌ || 27

లోమహర్షణుడిట్లనియె. . .

ఏకాగ్ర మనస్కులై యాలింపుడు. అశుచికి నీచ మనస్కునకు శిష్యుడుకానివానికి వ్రతదూరునికి కృతఘ్నునికి అహితునకు నిది నేను తెలుపను. ఇక్కడ స్వర్గప్రదము, కీర్తిదము, ఆయుష్యము, ధన్యము, వేదసమ్మితము, ఋషులు రహస్యముగా నానతిచ్చినది. వినుండు. బ్రాహ్మణులకు నమస్కరించినచో నిది కార్యము. ఇది అకార్యమునని విచారింప బని యుండదు. (24-27)

అసీ ద్ధర్మస్య సంగోప్తా పూర్వ మత్రిసమః ప్రభుః అత్రివంశే సముత్పన్న స్త్వంగో నామ ప్రజాపతిః య || 28

తస్య పుత్రో భవ ద్ద్వేనో నాత్యర్థం ధర్మకోవిదః | జాతో మృత్యుసపుతాయాం వై సునీథాయాం ప్రజాపతిః || 29

నమాతామహదోషేణ తేన కాలాత్మజాత్మజః | స్వధర్మం పృష్ఠతః కృత్వా కామలోభే ష్వవర్తత|| 30

మర్యాదాం భేదయామాస ధర్మోపేతాం ససార్థివః | వేదధర్మా నతిక్రమ్య పోధర్మనిరతోభవత్‌ || 31

నిఃస్వాధ్యాయ వషట్కారాః ప్రజాస్తస్మి స్ప్రజాపతౌ | ప్రవృత్తం న వపుః పోమం హుతం యజ్ఞేషు దేవతాః || 32

నయష్టవ్యం న హోతవ్య మితి తస్య ప్రజాపతేః | అసీ త్ప్రతిజా! క్రూరేయం వినాశే ప్రత్యుపస్థితే || 33

అహ మిజ్యశ్చ యష్టా చ యజ్ఞ శ్చేతి భృగూద్వహ| మయి యజ్ఞో విధాతవ్యో షుయి హోతవ్య మిత్యపి || 34

తమతి క్రాంత మర్యాద మాదదాన మసాంవ్రతమ్‌ | ఊచు ర్మహర్షయ స్సర్వే మరీచిప్రముఖా స్తదా || 35

వయం దీక్షాం ప్రవేక్ష్యామః సంవత్సరగణాన్‌ బహూన్‌ | అధర్మం కురు మా వేన ఏషధర్మ స్సనాతనః || 36

నిధనే త్రేః ప్రసూత స్త్వం ప్రజాపతి రసంశయమ్‌ | ప్రజాశ్చ పాలయిష్యేహ మితీహ సమయః కృతః || 37

తాం స్తథా బ్రువతః సర్వా న్మహర్షీ నబ్రవీ త్తదా | వేనః స్రహస్య దుర్బుద్ధి రిమ మర్థ మనర్థవిత్‌ || 38

మున్నత్రి వంశమున ధర్మ ప్రభువు అత్రిసమానుడు. అంగుడను ప్రజాపతియుదయించెను. వాని సుతుండు వేనుడు. మృత్యువు కూతురగునునీధయందు కలిగినవాడు. మాతామహ దోషముచే నాతడు స్వధర్మమును వెనుకcబెట్టి కామలోభియైప్రవర్తించెను. ధర్మము యొక్క హద్దులను దారుమారు సేసెను. వేదధర్మమునతిక్రమించెను. వానిరాజ్యమున స్వాధ్యాయము వషట్కారమును వినరాదయ్యెను దేవతలు యజ్ఞములందు సోమముం ద్రావిమెఱుంగరు. హవిస్సుల నారగింపరు. ఆ నరపతికి వినశకాలము దాపురించె గావలయు దేవతలు యజ్ఞము వలదు హోమములు వలదని శాసించెను. క్రూర బ్రతిజ్ఞ చేసెను. నేను యజ్ఞేశ్వరుడను యజ్ఞకర్తను, యజ్ఞమును నన్ను గూర్చి యజింపనగును. నాకై హోమములాచరింపవలెనని వాడు శాసించెను. మర్యాదనతిక్రమించి ఉత్పధగామియైయున్న వానింగని మరీచిప్రముఖులైన ఋషులు వేన| మేము పెక్కు సంవత్సరములు దీక్షా ప్రవేశము గావించెదను. అధర్మము సేయకు, ఇది సనాతన ధర్మము. అత్రి తరువాత నీవు ప్రజాపతియను నవతరించినాడవు. ప్రజలనుబాలింతులని ప్రతిజ్ఞచేసికద రాజైతివి. అన విని వాడు వారన పరిహసించి దుర్బుద్ధి యనర్ధపరుడుగాన యిట్లనియె. (28-35)

వేన ఉవాచ---

స్రష్టా ధర్మస్య కశ్చాన్యః శ్రోతవ్యం కస్యవా మయా | శ్రుతవీర్యతవస్సత్యై ర్మయా వా కఃసమో భువి || 39

ప్రభవం సర్వభూతానాం ధర్మాణాం చ విశేషతః | సంమూఢా న విదు ర్నూనం భవంతో మాం విశేషతః || 40

ఇచ్ఛన్‌ దహేయం పృథివీం ప్లావయేయం జలై స్తథా | ద్యాం వై భువంచ రుంధేయం నాత్రకార్యా విచారణా || 41

యదా న శక్యతే మోహా దవలేపాచ్చ పార్థివః | అపనేతుం తదా వేన స్తతః కృద్ధా మహర్షయః || 42

వేనుడు పలికెను . . .

ధర్మమునకు నాకంటే కర్తయెవ్వడు? నేనెవ్వనిమాట వినవలయును? శ్రుతమున (పాండిత్యమున) వీర్యమందు తపస్సులో సత్యములో నాతో సముడెవ్వరు? సర్వభూతముల యొక్కయు,ధర్మముయొక్కయు మొదలుతుదియ తెలియనిమూర్ఖులుమీరు. నిజముగ నన్నెఱుగరు. తలచితినేని యీ యిలాతలమునంతను దహించి వేయగలను. నీటి వెల్లువల ముంచెత్త వేయగలను. భూమ్యాకాశముల దారులను బంధించగలను. అనవిని పొగరెక్కి మూర్ఖుడైయున్న వానిని సరిచేయుట యసంభమని మహర్షులు క్రుద్ధులైరి. (39-42)

తం నిగృహ్య మహాత్మానో విస్ఫురంతం మహాబలమ్‌ | తతోస్య సవ్యమూరుం తే మమంథు ర్జాతమన్యవః || 43

తస్మి న్ని మథ్యమానే వైరాజ్ఞ ఊరౌతు జజ్ఞివాన్‌ | హ్రస్వోతిమాత్రః పురుషః కృష్ణశ్చేతి బభూవహ || 44

న భీతః ప్రాంజలి ర్భూత్వా తస్థివా న్ద్విజసత్తమాః | తమత్రి ర్విహ్వలం దృష్ఠ్యా నిషీదే త్యబ్రవీత్తదా || 45

నిషాద వంశకర్తాసౌ బభూవ వదతాంపరాః | ధీవరా నసృజ చ్చాపి వేనకల్మషసంభవాన్‌ || 46

యే చాన్యే వింధ్యనిలయా స్తథా పర్వతసంశ్రయాః | అధర్మరుచయో విప్రాస్తే తువై వేనకల్మషాః || 47

వానిని బట్టి కట్టివైచి వాని యెడను తొడను మథించిరి. అందుండి నల్లనివాడు, పొట్టివాడు జనించి భయపడుచు దోసిలొగ్గి నిలువబడెను. బెదురుచున్న వానిని జూచి అత్రి మహర్షి ''నిషీద'' (గూర్చుండుము) అనెను. అందుచే వాడు నిషాద వంశమునకు (బోయలకు) మూలపురుషుడయ్యెను. ఆ మీదట ''ధీవరులు'' చేపలుపట్టు వారిని మేనికల్మషమున వాడుకనెను. వానివలన కోయలు మొదలగు కొండజాతులవాండ్రు జనించిరి. వేనుని కల్మషముచే బొడమిన వారందరు నధర్మప్రియులైరి. (43-47)

తతః పునర్హహాత్మానః పాణిం వేనస్య దక్షిణమ్‌ | అరణీమివ సంరబ్ధా మమంథు ర్జాత మన్యవః || 48

పృథు స్తస్మా త్సముత్పన్నః కరా జ్వలనసంనిభః | దీప్యమానః స్వవపుషా సాక్షాదగ్నిరివ జ్వలన్‌ || 49

అథ సోజగవం నామ ధను ర్గృహ్య మహారవమ్‌ | శరాంశ్చ దావ్యా న్రక్షార్ధం కవచం చ మహాప్రభమ్‌ || 50

తస్మి జాతేధ భూతాని సంప్రహృష్టాని సర్వశః | సమాసేతు ర్మహాభాగా వేస్తు త్రిదివం య¸° || 51

సముత్పన్నేన భో విప్రాః సత్పుత్రేణ మహాత్మనా | త్రాత స్స పురుషవ్యాఘ్రః పుంనామ్నో నరకాత్తదా || 52

తం సముద్రాశ్చ నద్యశ్చ రత్నా న్యాదాయ సర్వశః | తోయాని చాభిషేకార్ధం సర్వ ఏవోప తస్థిరే || 53

పితామహశ్చ భగవా న్దేవై రాంగిరసైః సహ | స్థావరాణి చ భూతాని జంగమాని చ సర్వశః || 54

సమాగమ్య తదా వైన్య మభ్యషించ న్నరాధిపమ్‌ | మహతా రాజరాజేన ప్రజాస్తే నానురంజితాః || 55

సోభిషిక్తో మహాతేజా విధవ ద్ధర్మ కోవిదైః | అధిరాజ్యంతదా రాజ్ఞాం పృథుర్వైస్యః ప్రతాపవాన్‌ || 56

పిత్రాపరంజితా స్తస్య ప్రజాస్తేనానురంజితాః | అనురాగా త్తత స్తస్య నామ రాజాభ్యజాయత || 57

ఆప స్తస్తంభిరే తస్య సముద్ర మభియాన్యతః || పర్వతాశ్చ దదు ర్మార్గం ధ్వజభంగశ్చ నాభవత్‌ || 58

అకృష్టపచ్యా పృథివీ సిధ్యాన్త్యన్నాని చింతనాత్‌ | సర్వకామదుఘా గావః పుటకే పుటకే మధు || 59

ఏతస్మిన్నేవ కాలేతు యజ్ఞే పైతామహే శుభే | సూతః సూత్యాం సముత్పన్నః సౌత్యేహని మహామతిః || 60

తస్మిన్నేవ మహాయజ్ఞే జజ్ఞే ప్రాజ్ఞోథ మాగధః | పృథో స్త వార్థం తౌ తత్ర సమాహూతౌ మహర్షిభిః || 61

తావూచు రృషయ సర్వే స్తూయతా మేష పార్థివః | కర్మైతదనుదూపం వా పాత్రంచాయం నరాధిపః || 62

ఆ మీదట వేనుని కుడిచేయిని అరణినట్లు మథింపగా నందుండి ''అజగవమ'' ను ధనువును దివ్యబాణములనుగొని కవచముల దాల్చి పృథువు అగ్నివోలె వెలుంగుచు నుదయించెను. అయ్యెడ సర్వభూతములు సంతుష్టములయ్యెను. వేనుడాక్షణము స్వర్గ మలంకరించెను. మహానుభావుడయిన పుత్రునివలన పుంనామనరకము నుండి రక్షింప బడెను. ఆ పృథుని సన్నిధికి రత్నములుగొని సముద్రము నదులు వచ్చి పవిత్రోదకముల నభిషేకించినవి. బ్రహ్మయు నంగిరసుడు మొదలగు దేవతలతో నేతెంచెను. స్థావరజంగమములయిన భూతములుc గూడవచ్చినవి, అందరు నతనికి పట్టాభిషేకము గావించిరి. యధావిధిగ ధర్మ నిపుణులచే నభిషిక్తుడయిన యాచక్రవర్తి తండ్రిచే బాధితులయిన ప్రజల ననురాగముచే రంజింపcజేసెను. దాన నతడు 'రాజు' యను పేరంచెను. అతడు సముద్రమున కరుగ నుదకములు స్థంభించి నడక కనుకూలమయ్యెను. పర్వతములాతని టెక్కెమునకు భంగమురాకుండ దారి యిచ్చెను. తలచుకొన్న మాత్రమున ధరణి దున్నకయే సర్వసస్యములను బండెను. గోవులు కామధేనువులయ్యెను. పట్టుపట్టునం దేనియులు కురిసెను. ఈ సమయమందొక యజ్ఞమున సుత్యాహస్సునందు సూచియందు మహా మేధావి సూతుడవతరించెను. అయ్యజ్ఞమందు ప్రాజ్ఞుడయిన మాగధుడును కలిగెను. వారిర్వురును పృథుచక్రవర్తిని స్తుతించుటకై మునులు బిలువగా నేతెంచిన మహానుభావులు. ఋషులు పృథు చక్రవర్తిని మీరిద్దరు స్తుతింపుడని యాదేశించిరి. అప్పుడు సర్వఋషులనుగూర్చి యా సూతమాగధులిట్లు పలికిరి. (48-62)

తా పూచతు స్తదా సర్వాం స్తా నృషీ న్సూతమాగధౌ|అవాం దేవా నృషీంశ్చైవ ప్రీణయావః స్వకర్మభిః || 63

న చాస్య విద్మో వై కర్మ నామ వా లక్షణం యశః | స్తోత్రం యేనాస్య కుర్యవ రాజ్ఞస్తే జస్వినో ద్విజాః || 64

ఋషిభి స్తౌనియుక్తౌతు భవిషై#్యః స్తూయతామితి | యాని కర్మాణి కృతవా న్పృథుః పశ్చా న్మహాబలః || 65

తతః ప్రభృతి వైలోకే స్తవేషు మునిసత్తమాః | ఆశీర్వాదాః ప్రయుజ్యంతే సూత మాగధవందిభిః || 66

తయోః స్తవంతే సుప్రీతః పృథుః ప్రాదా త్ప్రజేశ్వరః | అనూపదేశం సూతాయ మగధం మాగధాయ చ || 67

తం దృష్ట్వా పరమప్రీతాః ప్రజాః ప్రోచు ర్మనీషిణః | వృత్తీనా మేష వో దాతా భవిష్యతి నరాధిపః || 68

తతో వైన్యం మహాత్మానాం ప్రజాః జమభిదుద్రువుః | త్వం నో వృత్తిం విధత్స్వేతి మహర్షివచనా త్తదా || 69

అనూతమాగధులు మేము దేవతలను ఋషులను కీర్తించి సంతుష్టుల నొనరించువారము. ఇతడెవడో యీతని పేరేమో చేసిన చేతయేమో లక్షణమెట్టిదో కీర్తి యెలాటిదో యెఱుంగుము. చూచుటకు మహా తేజస్వియై కనిపించుచున్నాడు. కాని యేమని యీతని నుతింతుము. అన మునులు జరుగబోవునీతని సత్కార్యములను భావించి గానము సేయుమనిరి. వారు నాతనిపిమ్మటిc చరితమునూహించి కొనియాడిరి. అది మొదలు లోకమునందు జరుగున్తవములు ఆశీర్వాద ప్రధానములయి సూతమాగధవందిజన ముఖమున ప్రవర్తింపజొచ్చెను. వారి స్తుతికి మిక్కిలి సంతసించి పృథుచక్రవర్తి సూతునకు (అనూపదేశము) సముద్రతీర ప్రాంతమును మాగధునకు మగధదేశమును బహుమానమిచ్చెను. అవ్వల మహర్షులందరు పరమ ప్రీతులయి ప్రజలనుద్దేశించి ఈ ఱడు మీకందరకు వృత్తుల నొసంగ గలడనిరి. అది విని ప్రజలు వేదసుతుని దరికి పరుగులెత్తిరి. (63-69)

సోభిద్రుతః ప్రజాభిస్తు ప్రజాహితచికీర్షయా | ధనుర్గృహ్య పృషత్కాంశ్చ పృథివీ మాద్రవద్బలీ || 70

తతో వైన్యభయత్రస్తా గౌ ర్భూత్వా ప్రాద్రవన్మహీ | తాం పృథు ర్ధనురాదాయ ద్రవంతీ మన్వధావత || 71

సాలోకా న్బ్రహ్మలోకాదీ న్గతా%్‌వ వైన్యభయాత్తదా| ప్రదదర్శాగ్రతో? వైన్యం ప్రగృహీత శరాసనమ్‌ || 72

జ్వలద్భిర్నిశితై ర్బాణౖ ర్దీప్త తేజస మంతతః | మహాయోగం మహాత్మానం దుర్ధర్ష మమరై రపి || 73

ఆలభంతీ తు సా త్రాణం వైన్యమే వాన్వపద్యత|కృతాంజలి పుటా భూత్వా పూజ్యాలోకై

స్త్రీభిస్తదా || 74

ఉవాచ వైన్యం నా ధర్మం స్త్రీ వధే పరిపశ్యసి | కథం ధారయితా చాసి ప్రజా రాజ న్వినా మయా || 75

మయి లోకా స్థితా రాజ న్మయోదం ధార్యతే జగత్‌ | మద్వినాశే వినశ్యేయుః ప్రజాః పార్థివ విద్ధి తత్‌ || 76

న మామర్హసి హంతుంవై శ్రేయ శ్చేత్త్వం చికీర్షసి|ప్రజానాం పృథివీపాల!శృణు చేదం వచో మమ || 77

ఉపాయతః సమారబ్ధా స్సర్వే సిద్ధ్యం త్యుప్రకమాః | ఉపాయం పశ్య యేన త్వం ధారయేథాః ప్రజాఇమాః 78

హత్వా7పి మాం నశక్తస్త్వం ప్రజానాం పోషణ నృప|అనుకూలా భవిష్యామి యచ్ఛ కోపం మహామతే|| 79

అవధ్యాం చ స్త్రియం ప్రాహుస్తిర్య గ్యోనిగతే ష్యపి|యద్యేవం పృథివీపాల న ధర్మం త్యక్తు మర్హసి|| 80

ఏవం బహువిధం వాక్యం శ్రుత్వా రాజా మహామనాః | కోపం నిగృహ్య ధర్మాత్మా వసుధా మిద మబ్రవీత్‌ || 81

అత్తఱి నా రాజు విల్లు నమ్ములుదాల్చి భూమింగూర్చి బరువెత్తిన నామె పెఱగంది పారిపోయిన నాతడు వెంబడించి యామెం దఱుమజొచ్చెను. ఆమె పృథునికిం జడిసి లోకములవెంట బరువులు వెట్టి వెట్టి తానేగిన చోటనెల్ల యెట్టయెదుట ధనుర్భాణపాణియై జ్వతితాగ్నివలెనున్న యాఱనింగని అమరులకేని ఓర్వరాని వాడనికని దిక్కుతోపక యాతనినే శరణందెను. త్రిభువనపూజ్యయైన వసుంధర యంజలించి ''స్త్రీ''వధ ఆధర్మమని కానవే? నేను లేకుండ ప్రజానెట్లు ధరింతువు ? లోకమలెల్ల నాయందున్నవి. నా చేతన యీ జగము ధరింపcబడుచున్నది. నేనుపోయిన ప్రజలెల్లరు వోదురు. అది యెఱుంగుము. నీవు ప్రజా శ్రేయస్సు చేయనెంతువేని ననుదుదముట్టింపcదగదు. మరియు నొకమాటయు వినుము. నిరపాయమైన యుపాయమున సర్వ కార్యములు సిద్దించును. ఈ ప్రజల ధరింపనేనొక యుపాయము సెప్పెద వినుము. నన్ను సంహరించిన నీవు ప్రజలను బోషింపజాలవు. నేను నీకనుకూలనయ్యెద. కోపముపసంహరింపుము. పశుపక్షులందేని అడుది అవధ్యురాలని యందురు. నీవు ధర్మమును వీడుటతగదు. అని పెక్కు విధముల పలికిన ధరిత్రి పలుకులాలించి మహామతి కావున యానృపతి కోపమును నిగ్రహించి వసుమతిం జూచి యిట్టనియె (70-81)

పృథు రువాచ :-

ఏకస్యార్థేతు యో హన్యా దాత్మనోవా పరస్యవా | బహూన్వా ప్రాణినో7నంతం భ##వేత్త స్యేహ పాతకమ్‌ || 82

సుఖ మేధంతి బహవో యస్మింస్తు నిహతే7శుఖే | తస్మిన్హతేనాస్తి భ##ద్రేః పాతకం చోపపాతకమ్‌ || 83

సో7హం ప్రజానిమిత్తం త్వాం హనిష్యామి వసుంధరే | యది మే వచనా న్నాద్య కరిష్యసి జగద్ధితమ్‌ || 84

త్వాం నిహత్యాద్య బాణన మచ్ఛాసన పరాజ్మఖీమ్‌|ఆత్మానం ప్రథయిత్వా7హం ప్రజాధారయితా స్వయమ్‌|| 85

సా త్వం శాసన మాస్థాయ మమ ధర్మభృతాం వరె| సంజీవయ ప్రజా స్సర్వా స్సమర్థా హ్యసి ధారణ || 86

దుహితృత్వం చ మే గచ్ఛ తత ఏన మహం శరమ్‌ | నియచ్ఛేయం త్వద్వధార్థ ముద్యతం ఘోరదర్శనమ్‌ || 87

తనకుగాని యితరునికి గాని యెక్కనికి మాత్రము క్షేమముగల్గుటకు పెక్కుప్రాణులను సంహరించినవానికంతులేని పాపము గల్గును. ఏ యొక దుష్టుడు సంహరింపబడుటవలన పెక్కుమంది జీవుల సుఖమునందుదురో అట్టివాని సంహరించుటవలన పాతకము ఉపపాతకముననునేవియు గలుగవు. వసుంధరా ! నా చెప్పినట్లు జగద్ధితము సేయవేని నిన్ను పెక్కుమంది ప్రజలసేమము నిమిత్తమై ఇదిగోఇపుడు సంహరించెను. నాశాసనమునకు పెడమొగమయిన నిన్ను నాబాణముచే నిప్పుడుc గూల్చి మెప్పుcగౌని ప్రజల గాపాడెదను. ధర్మశీలురకెల్ల నుత్తమురాలవు నీవు నాశానమునకు గట్టువడి ప్రజల బ్రతికింపుము. ప్రజాధారణమందు నీవు సమర్థురాలవు గద ! నాకు కుమార్తెవు గమ్ము. అపుడీభయంకరమైన బాణము నుపసంహరించెదను. అని రాజనెను ( 82-87)

వసుధోవాచ -

సర్వమేత దహం వీర విధాస్యామి న సంశయః | వత్సంతు మమ సంపశ్య క్షరేయం యేన వత్సలా || 88

సమాంచ కురు సర్వత్ర మాం త్వం ధర్మభృతాంవర | యథా నిష్యందమానం మే క్షీరం సర్వత్ర భావయేత్‌ 89

లోమ హర్షణ ఉవాచ -

తత ఉత్సారయామాస శైలాన్‌ శతసహస్రశః | ధనుష్కోట్యా తదా వైన్య స్తేన శైలా వివర్ధితాః|| 90

న హి పూర్వవిసర్గే వై విషమే పృథివీతలే | సంవిభాగః పురాణాం వా గ్రామాణాం వా7భవత్తదా || 91

న సస్యాని న గోరక్షం న కృషిర్నవణిక్పథః | నై వ సత్యానృతం చా77 సీన్న లోభో న చ మత్సర ః 92

వైవస్వతే7ంతరే తస్మిన్‌ సాప్రతం సముపస్థితే | వైన్యా త్ర్పభృతి వై విప్రాః సర్వసై#్యతస్య సంభవ ః || 93

యత్రయత్ర సమం త్వస్యాభూమే రాసీత్తదా ద్విజాః | తత్రతత్ర ప్రజాః సర్వా నివాసం సమరోచయన్‌ || 94

ఆహారః ఫలమూలాని ప్రజానా మభవత్తదా | కృచ్ఛ్రేణ మహతా యుక్త ఇత్యేవ మనుశుశ్రుమ || 95

స కల్పయిత్వా వత్సంతు మనుం స్వాయంభువం ప్రభుమ్‌ | స్వ పాణౌ పురుషవ్యాఘ్రో దు దోహ పృథివీం తతః || 96

సస్యజాతాని సర్వాణి పృథుర్వై న్యః ప్రతాపవాన్‌ | తేనాన్నేన ప్రజాః సర్వా వర్తంతే7ద్యాపి సర్వశః || 97

ఋషయశ్చ తదా దేవాః పితరో7థ సరీసృపాః | దైత్యా యక్షాః పుణ్యజనా గంధర్వా ః పర్వతానగాః || 98

ఏతే పురా ద్విజ శ్రేష్ఠా దుదుహు ర్ధరణీం కిల | క్షీరం వత్సశ్చ పాత్రం చ తేషా దోగ్ధా పృథక్పృథక్‌ || 99

అన వసుధ యిట్లనియె -

ఇది యెల్ల సేనొనరించెదను. సంశయము లేదు. కాని నాకొక దూడను సంపాదించ యత్నింపుము. దాని మూలమున నేను పాలుచేపెదను. ఆదిగాక నన్ను మెట్టవల్లములు లేనట్లొనరింపుము. అపుడు నా చేపిన క్షీరము నలుమూలల సమముగా జాల్వారును. నావిని పృథుచక్రవర్తి ధనుష్కోటిచే వేలకొలది కొండలను మీదికి లేవగొట్టెను. ఇంతకుముందటి సృష్టియందు | భూతలము విషమముగనుండెను. ఆయెగుడుదిగుడు నేలయందు పురములు గ్రామములను, విభాగమే లేకుండెను. పంటలు లేవు. గోరక్షణ లేదు. కృషి లేదు. వర్తకముదారి లేదు. సత్యానృతము (వాణిజ్యము) లేదు. లోభము లేదు. మత్సరము లేదు. పైవస్వతమనువు తరమట్లునడిచినది. ఇప్పుడు పృథుచక్రవర్తి మొదిలిదియెల్ల యేర్పడినది. ఎక్కడెక్కడ యీ ధరిత్రి సమముగ నుండిన నక్కడ ప్రజలు నివాసమేర్పరచcగొన గోరిరి. ఆనాటికి కందమూలము లాహారము. అది మిగుల కష్టజీవనమని విందుము. పృథువు స్వాయంభువ మనుపును దూడనొసరించి తన హస్తమే పాత్రముగ భూమిని పిదికెను. ఆపిదికిన క్షీరము సర్వసస్యస్వరూపము ఆ అన్నము చేతనే యీ నాటికిని ప్రజలు నుఖజీవనులగుచున్నారు. ఋష్యాదులు తమ తమ యాహారరూపమైన క్షీరమును తమతమ కభిమతమైన పాత్రములందు పిదుకుకొనిరి. (88-89)

ఋషీణామభవ త్సోమో వత్సోదోగ్ధా బృహస్పతిః | క్షీరం తేషాం తపో బ్రహ్మ పాత్రం ఛందాంసి భో ద్విజా ః || 100

దేవానాం కాంచనం పాత్రం వత్స స్తేషాం శతక్రతుః | క్షీరమోజస్కరం చైవ ద్దోగ్ధా చ భగవాన్‌ రవిః || 101

పితౄణాం రాజతం పాత్రం యమో వత్సఃప్రతాపవాన్‌ | అంతక శ్చాభవ ద్దోగ్ధా క్షీరం తేషాం సుధా స్మృతా || 102

నాగానాం తక్షకో వత్సః పాత్రం చాలాబుసంజ్ఞకమ్‌ | దోగ్ధా త్వైరావతో నాగ స్తేషాం క్షీరం విపంస్మృతమ్‌ || 103

అసురాణాం మధు ర్దోగ్ధా క్షీరం మాయామయం స్మృతమ్‌|విరోచనస్తుపత్సోభూ7దాయసం పాత్రమేవచ || 104

యక్షాణా మామపాత్రంతు వత్సోవై శ్రవణః ప్రభుః దోగ్ధా రజతనాభస్తు క్షీరమంతర్థి రేవచ || 105

సుమాలీ రాక్షాసేంద్రాణాం వత్సఃక్షిరం చ శోణితమ్‌ | దోగ్ఢా రజతనాభస్తు కపాలం పాత్రమేవచ || 106

గంధర్వాణాం చిత్రరథోవత్సః పాత్రంచ పంకజమ్‌|దోగ్ధాచ సురుచిః క్షిరం తేషాం గంధః శుచిః స్మృతః || 107

శైలం పాత్రం పర్వతానాం క్షిరం రత్నౌషధీ స్తథా | వత్సస్తు హిమవా నాసీ ద్దోగ్ధా మేరు ర్మహాగిరి ః || 108

ప్లక్షో వత్ససు వృక్షాణాం దోగ్ధా సాలస్తు పుప్పితః | పాలాశపాత్రం క్షీరం చ చ్ఛిన్న దగ్ధ ప్రరోహణమ్‌ || 109

సేయం ధాత్రీ విధాత్రీ చ పావనీ చ వసుంధరా | చరాచరస్య సర్వస్య ప్రతిష్ఠా యోని రేవచ || 110

సర్వకామదుఘా దోగ్ధ్రీ సర్వసస్యప్రరోహణీ | అసీ దియం సముద్రాంతా మేదినీ పరివిశ్రుతా || 111

మధుకైటభ##యైః కృత్స్న మేదసా సమభిప్లుతా | తేనేయం మేదినీ దేవీ ఉచ్యతే బ్రహ్మవాదిభిః|| 112

తతో7 భ్యుపగమాద్రాజ్ఞఃపృథో ర్వైన్వస్యభోద్విజాః| దుహితృత్వ మను ప్రాప్తా దేవీ పృథ్వీతి చోచ్యతే || 113

ఆక్రమ మిట్టిది -

ఋషులకు సోముడు వత్సము (దూడ) దోగ్ధ(పిదుకువాడు) బృహస్పతి. క్షీరము తపోబ్రహ్మము పాత్రము ఛందోమయము దేవతల కింద్రుడు దూడ దోగ్ధ రవి, పాలు ఓజస్సు (తేజస్సు) పాత్రము కాంచనము. పితృదేవతలకు దూడ యముడు, దోగ్ధ అంతకుడు. పాలు సుధ (స్వధ). పాత్రము రాజతము (వెండిగిన్నె) నాగులకు తక్షకుడు దూడ దోగ్ధ ఐరావతుడను నాగుడు. క్షీరము విషము పాత్రము సొరకాయ. అసురులకు విరోచనుడు వత్సము (దూడ) దోగ్ధ మధువు. పాలు మాయామయము. పాత్ర ఆయసము ఇనుపగిన్నె (అయోమయము) యక్షులకు దూడ వైశ్రవణుడు. దోగ్ధ రజతనాభుడు. పాలు అంతర్ధానము పాత్ర. మట్టికుండ రాక్షసేంద్రులకు దూడ సుమాలి దోగ్ధ రజతనాభుడు, పాలు శోణితము (రక్తము) పాత్ర కపాలము. గంధర్వులకు దూడ చిత్రరథుడు పిదుకువాడు సురుచి పాలు సుగంధము. పాత్రపద్మము పర్వతములకు దూడ హిమనంతుడు దోగ్ధ మేరువు పాలు రత్నౌషధులు పాత్రము శైలము వృక్షములకు దూడ ప్లక్షము (జువ్వి) దోగ్ధ పుష్పించిన శాలము. వృద్ధి పాలు తెగిన కాలిన చోట మొలపించుశక్తియనునది. పాత్రము మోదుగాకుల దొన్నె (పాలాశ పత్రము) ఈ విధముగ నీధాత్రి నిజముగ ధాత్రియో (పాలిచ్చి పెంచెడి దాదియే) విధాత్రి (జీవనవిధాత్రి బ్రతుకుతెఱవు చూపెడి తల్లి) పావని. చరారచభూతములకు నిలుచు నాదరుపు. (యోని కారణము) సర్వ కామ దోగ్థ్రి సర్వసస్య ప్రరోహణి. ఆసముద్రపర్యంతయైన యీభూమి మధుకైటభుల మేదస్సుచే (మెదడుచే) మేదిని యన ప్రఖాతి గొన్నది. ఈ పేరు వేదవాదులు పెట్టినది. ఈ వల నీమె పృథునృపతికి కన్నకూతురయ్యెను గావున పృథివియను ఖ్యాతి గన్నది.(100-113)

పృథునా సువిభక్తాచ శోథితా చ వసుంధరా | సస్యాకరవతీ స్ఫీతా పురపత్తవశాలినీ || 114

ఏవంప్రభావో వైన్య స్సరాజా77సీద్రాజసత్తమః|నమస్యశ్చైవ పూజ్యశ్చభూతగ్రామై ర్నసంశయః || 115

బ్రాహ్మణౖశ్చ మహాబాగై ర్వేదవేదాంగపారగైః |పృథురేవ నమస్కార్యో బ్రహ్మయోని ః సనాతనః || 116

పార్థివైశ్చ మహాభాగైః పార్థివత్వ మిహేచ్ఛుభిః|ఆదిరాజో నమస్కార్యః పృథుర్వైన్యః ప్రతాపవాన్‌|| 117

యోధైరపి చ విక్రాంతైః ప్రాప్తుకామైర్జయం యుధి | ఆదిరాజో నమస్కార్యో యోధానాం ప్రథమో నృపః || 118

యోహి యోద్ధా రణం యాతి కీర్తయిత్వా పృథుం నృపమ్‌ | ఘోరరూపాత్సంగ్రామా త్జేమీ భవతి కీర్తిమాన్‌ || 119

వైశ్యైరపి చ విత్తాఢ్యైర్యైశ్యవృత్తివిధాయిభిః|పృథు రేవ నమస్కార్యో వ్యత్తిదాతా మహాయశా ః || 120

తథైవ శూదైః శుచిభి స్త్రివర్ణపరిచారిభిః | పృ థు రేవ నమస్కార్యః శ్రేయః పర మిహేప్పుభిః || 121

ఏతే వత్స విశేషాశ్చ దోగ్ఢారః క్షీరమేవచ | పాత్రాణి చ మయోక్తాని కిం భూయో వర్ణయామి వః || 122

ఇతి శ్రీ మహాపురాణ బ్రాహ్మే పృథోర్జన్మమాహాత్మ్యకథనం నామ చతుర్థో7ధ్యాయః

అతనిచే వసుంధర సువిభక్త యయినది సువిశోధిత యయి సస్యములుగనులు గల్గి, పురపట్టణ గ్రామాదులచే నిండుదనము సంతరించుకొన్నది. వైన్యరాజస్య చూడామణి యిట్టి యసామాన్య ప్రభావుడు రాజసత్తముడు, భూత - గ్రామములకెల్ల నమస్కరింపcదగినవాడు.పూజింపనర్హుడు. వేదవేదాంగపారగులైన బ్రాహ్మణులకుc గూడ పృథుచక్రవర్తి నమస్కార్యుడు. పార్థివత్వమును గోరు రాజుకు మహానుభావులకు ఆదిరాజుగ నభివంద్యుడు. ప్రతాపశాలి శ్రీపృథువు. విక్రమశీలురైన యోధులకు జయాక్షాంక్షలయిన వారికి యోధులకెల్ల ప్రథముడైన పృథువు వంద్యుడు. పృథుని ధ్యానించి - కీర్తించిన యోధుడు ఘోరమయిన సంగ్రామరంగము నుండి క్షేమముగ మరలి రాగల్గును వాణిజ్య వృత్తినను సరించు వైశ్యులకు విత్తసమృద్ధికై వృత్తిదాతయైన పృథువు వందనీయుడు. శుచివర్తనులై త్రివర్ణముల నుపచరించు శూద్రులకును పృథుచక్రవర్తి నమస్కారార్హుడు. దానవారు పరమ శ్రేయస్సు నందగలరు మహర్షులార ! మహానుభావులార! మఱియేమి వినదలతురు? సెలవిండు. (114-122)

ఇది శ్రీ బ్రహ్మ మహాపురాణమునందు పృథుజన్మ మాహాత్మ్యకథన మను నాలుగవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters