Brahmapuranamu    Chapters   

చతుస్త్రింశో7ధ్యాయః

రుద్రాఖ్యానమ్‌

బ్రహ్మోవాచ

యో7సౌ సర్వగతో దేవ స్త్రిపురారి స్త్రిలోచనః | ఉమాప్రియకరో రుద్ర శ్చంద్రార్ధకృతశేఖరః || 1

విద్రావ్య విబుధా న్సర్వాన్‌ సిద్ధవిద్యాధరా నృషీన్‌ | గంధర్వయక్షనాగాంశ్చ తథాన్యాంశ్చ సమాగతాన్‌ || 2

జఘాన పూర్వం దక్షస్య యజతో ధరణీతలే | యజ్ఞం సమృద్ధం రత్నాఢ్యం సర్వసంభారసంభృతమ్‌ || 3

యస్య ప్రతాపసంత్రస్తాః శక్రాద్యా స్త్రిదివౌకసః | శాంతిం న లేభిరే విప్రాః కైలాసం శరణం గతాః || 4

స ఆస్తే యత్ర వరద శ్శూలపాణి ర్వృషధ్వజః | పినాకపాణి ర్భగవాన్‌ దక్షయజ్ఞవినాశనః || 5

మహాదేవో 7కలే దేశే కృత్తివాసా వృషధ్వజః | ఏకామ్రకే మునిశ్రేష్ఠాః సర్వకామప్రదో హరః || 6

సర్వాంతర్యామియైన రుద్రుడు ఉమాదేవికి ప్రియము చేయువాడై సర్వదేవతలను సిద్ధవిద్యాధరులను ఋషులను గంధర్వ నాగ యక్షాదులను మఱి యజ్ఞమునకు వచ్చిన యందఱిని పారద్రోలి సర్వశ్రేష్ఠపదార్థములతో నిండిన యజ్ఞమును సర్వసంభారములతో నశింపజేసెను. స్వామిప్రతాపమున కడలి యింద్రాదులు శాంతికరవై కైలాసమున కేగి వరదుడైన యా శూలపాణిని దక్షయజ్ఞ ధ్వంసకుడైన భగవంతుని శరణందిరి. అప్పుడు పరమశివు డేకామ్రక (కాంచీ) క్షేత్రమందు సర్వకామ ప్రదుడై యుండెను.

మునయఊచుః

కిమర్థం స భవో దేవః సర్వభూతహితే రతః | జఘాన యజ్ఞం దక్షస్య దేవై స్సర్వై రలంకృతమ్‌ || 7

న హ్యల్పం కారణం తత్ర ప్రభో మన్యామహే వయం|శ్రోతు మిచ్ఛామహే బ్రూహి పరం కౌతూహలం హియ నః

మును లిట్లనిరి.

సర్వభూతహితాభిలాషియైన శివు డేల యాయజ్ఞమును సంహరించెను. సర్వదేవతలు నందలంకరించియున్నారు గదా స్వల్పకారణమున నట్లు జరిగినదని మేమనుకొనము. మీ వలన విన మిక్కిలి గుతూహల మగుచున్నది.

బ్రహ్మోవాచ

దక్షస్యా స న్నష్ట కన్యా యాశ్చైవం పతిసంగతాః | స్వేభ్యో గృహేభ్య శ్చానీయ తాః పితా7 భ్యర్చయ ద్గృహే

తతస్త్వభ్యర్చితా విప్రాః! న్యవసం స్తాః పితుర్‌గృహే|తాసాం జ్యేష్ఠా సతీనామ పత్నీ యా త్ర్యంబకస్యవై || 10

నా 7జుహావా త్మజాం తాం వై దక్షో రుద్ర మభిద్విషన్‌|అకరో త్సన్నతిం దక్షే నచ కాంచి న్మహేశ్వరః || 11

జామాతా శ్వశురే తస్మిన్‌ స్వభావా త్తేజసి స్థితః|తతో జ్ఞాత్వా సతీ సర్వాస్తాస్తు ప్రాప్తాః పితుర్గృహమ్‌ || 12

జగామ సా 7ప్యనాహూతా సతీతు స్వపితుర్‌ గృహం|తాభ్యో హీనాం పితా చక్రే సత్యాఃపూజా మసంమతామ్‌ ||

తతో 7బ్రవీ త్సా పితరం దేవీ క్రోధసమాకులా || 13

బ్రహ్మయనియె

దక్షుని కెనమండుగురు కూతుండ్రు. వారందరు వివాహితులు. వారిని తండ్రి రావించి తనయింట సత్కరించెను. వారును బుట్టింట నాదరమంది వసించిరి. వారిలో బెద్దదియగు సతి యను శివుని భార్యను దక్షుడు రుద్రుని ద్వేషించి పిలువడయ్యెను. అందుల కల్లుడు పరమేశ్వరుడు నైజముగ దనప్రభావమున దానున్నవాడు గావున నామామగారియెడ నేకొంచెము వినయముచూపడయ్యెను. సతీదేవి తండ్రి గృహమునకు జెల్లెండ్రందరు వచ్చిరని యెఱింగి తానును బిలువకున్నను నట కేగెను. తండ్రి అందరు కూతురుల కంటె నామెను హీనముగ జూచి వారికంటె తక్కువగ నాదరించెను. అంతట సతీదేవి కినుక గొని తండ్రితో నిట్లనియె.

సత్యువాచ

యవీయసీభ్య శ్శ్రేష్ఠా 7హం కిం న పూజయసి ప్రభో|అసత్కృతా మవస్థాం యః కృతవా నసి గర్హితామ్‌

అహం జ్యేష్ఠా వరిష్ఠాచ మాం త్వం సత్కర్తు మర్హసి || 14

నాకన్న నీ కన్యలు చిన్నలు. నేను పెద్ద ఆడపడుచును. నన్ను బూజింపవైతివి. అంతేకాదు అలుసుసేసితివి. నేనిందఱిలో పెద్దను యోగ్యతలోను బెద్దను. నన్ను సత్కరింప దగినవాడవు.

ఏవ ముక్తో 7బ్రవీ దేనాం దక్ష స్పంరక్తలోచసః || 15

అని సతీదేవి యన విని దక్షుడు కన్నెఱ్ఱ చేసియిట్లనియె.

త్వత్తః శ్రేష్ఠా వరిష్ఠాశ్చ పూజ్యా బాలాః సుతా మమ|తాసాం యే చైవ భర్తారః తే మే బహుమతా స్సతి || 16

బ్రహ్మిష్ఠాశ్చ వ్రతస్థాశ్చ మహాయోగాః సుధార్మికాః|గుణౖ శ్చైవాధికాః శ్లాఘ్యాః సర్వే తే త్య్రంబకా త్సతి || 17

వశిష్ఠో 7త్రిః పులస్త్యశ్చ అంగిరాః పులహః క్రతుః | భృగు ర్మరీచిశ్చ తథా శ్రేష్ఠా జామాతరో మమ || 18

తైశ్చా7పి స్పర్ధతే శర్వః సర్వే తే చైవ తం ప్రతి|తేన త్వాం న బుభూషామి ప్రతికూలో హి మే భవః || 19

ఇత్యుక్తవాం స్తదా దక్షః సంప్రమూఢేన చేతసా|శాపార్థ మాత్మన శ్చైవ యేనోక్తా వై మహరక్షయః ||

తథోక్తా పితరం సావై క్రుద్ధా దేవీ త మబ్రవీత్‌ || 20

ఆనాకన్నియలు నీకన్న నన్నివిధములు మిన్నలు. యోగ్యలు. వారి భర్తలుగూడ నాకెంతేని గూర్తురు. బ్రహ్మిష్ఠులు వ్రతనిష్ఠులు ధర్మిష్ఠులు. యోగ నిష్ఠులు గుణగరిష్ఠులు నిటలాక్షునికంటె పలువిధముల నందఱు మెచ్చదగినవారు. వారు వశిష్ఠుడు అత్రి పులస్త్యుడు అంగిరుడు పులహుడు క్రతువు భృగువు మరీచి అనువారు. పశుపతి వారితోగూడ స్పర్థ గొనును. వారును నాతనిని ద్వేషింతురు. అందువలన నిన్ను నేను గౌరవింపను. నాకు శివుడు ప్రతికూలుడని మూఢ బుద్ధియైన దక్షు డామెతో ననెను. శాపమునకు దాను గురికావలసిన విధి ననుసరించి యిట్లు ఋషులను నల్లుని దూలనాడెను. అంత నా దేవి కోపము దెచ్చికొని తండ్రితో నిట్లనియె.

సత్యువాచ

వాఙ్మనఃకర్మభి ర్యస్మా దదుష్టాం మాం విగర్హసి|తస్మాత్త్యజా మ్యహం దేహ మిమం తాత తవా 7త్మజం || 21

సతి పలికెను

త్రికరణములచేత పరిశుద్ధురాలనైన నన్ను గర్హించితివి. కావున నీ వలన వచ్చిన యీ దేహము నిదిగో విడుచు చున్నాననెను.

బ్రహ్మోవాచ

తత స్తేనావమానేన సతీ దుఃఖా దమర్షితా|ఆబ్రవీ ద్వచనం దేవీ సమస్కృత్య స్వయంభువమ్‌ || 22

అని ఆ యవమానము సైవనేరక దుఃఖముతో నాదేవి దక్షున కిట్లనియె

యేనా హ మపదేహా వై పున ర్దేహేన భాస్వతా|తత్రా ప్యహ మసంమూఢా సంభూతా ధార్మికీ పునః

గచ్ఛేయం ధర్మపత్నీత్వం త్ర్యంబకసై#్యవ ధీమతః || 23

ఈ మేనువిడిచి మఱియొక్క ఉపాధితో వెలుగొందుచు నేను పొరపాటుపడనిదాననై ధర్మనిష్ఠనై పరమేశ్వరునికి ధర్మపత్ని నయ్యెదనుగాక.

బ్రహ్మోవాచ

తత్రై వాథ సమాసీనా రుష్టా7 7త్మానం సమాదధే|ధారయామాస చాగ్నేయీం ధారణా మాత్మనా 77త్మని|| 24

అని యక్కడనే కూర్చుండి, దుష్టుడగు దక్షుని సాధించుటకు తాన తనయందగ్ని ధారణ చేసెను.

తతః స్వాత్మాన ముత్థాప్య వాయునా సముదీరితః|సర్వాంగేభ్యో వినిఃసృత్య వహ్ని ర్భస్మ చకార తామ్‌ || 25

త దుపశ్రుత్య విధనం సత్యా దేవ్యాః స శూలధృక్‌|సంవాదంచ తయో ర్బుద్థ్వా యాథాతథ్యేన శంకరః ||

దక్షస్య చ వినాశాయ చుకోప భగవాన్‌ ప్రభుః || 26

ఆ అగ్ని వాయుప్రేరితుడై యామె అన్నియవయములందుండి వెలువడి యామెను భస్మ మొనరించెను. శూలపాణి యామె నిర్యాణ వార్తవిని తండ్రి కూతుండ్ర యా సంవాదము నున్నదున్నట్లు దెలిసికొని భగవంతుడా శంకరుడు దక్షవినాశమునకై కుపితుడయ్యెను.

శ్రీశంకర ఉవాచ

యస్మా దవమతా దక్ష సహసై77వా గతా సతీ|ప్రశస్తా శ్చేతరా స్సర్వాః త్వత్సుతా భర్తృభిస్సహ || 27

తస్మా ద్వైవస్వతే ప్రాప్తే పున రేతే మహర్షయః ఉత్పత్స్యంతి ద్వితీయే వై తవ యజ్ఞే హ్యయోనిజాః || 28

హుతే వై బ్రహ్మణ స్సత్రే చాక్షుష స్యాంతరే మనోః | అభివ్యాహృత్య సప్తర్షీన్‌ దక్షం సో 7భ్యశప త్పునః || 29

భవితా మానుషో రాజా చాక్షుష స్యాంతరే మనోః|ప్రాచీనబర్హిషః పౌత్రః పుత్ర శ్చా7పి ప్రచేతసః || 30

దక్ష ఇత్యేవనామ్నా త్వం మారిషాయాం జనిష్యసి|కన్యాయాం శాఖినాం చైవ ప్రాప్తే వై చాక్షుషాంతరే || 31

అహం తత్రాపి తే విఘ్న మాచరిష్యామి తుర్మతే|ధర్మకామార్థయుక్తేషు కర్మ స్విహ పునఃపునః || 32

తతో వై వ్యాహృతో దక్షో రుద్రం సో 7భ్యశప త్పునః || 33

అట్లు కోపించి శంకరు డిట్లనియె. ఓ దక్షా! పిలువని పేరంటముగ వచ్చి సతీదేవి నీచే నవమానితురాలైనది కావున నీ తక్కిన కూతుళ్లు మగలతో నుత్తమరాండ్రు గావున వైవస్వత ద్వితీయ మన్వంతరమున నీ మహర్షులు అయోనిజులై నీ యజ్ఞమునకు వత్తురు. చాక్షుష మన్వంతరమున బ్రహ్మ గావించు సత్రయాగమందు హోమము జరుగగా నిట్లు జరుగును. అని సప్తర్షులను శపించి రుద్రుడు దక్షునికిట్లు శాపమిచ్చెను. చాక్షుషమన్వంతరమున ప్రాచీన బర్హిపౌత్రుడు ప్రచేతసుని పుత్రుడు వైదక్షుడను నీ పేరుతోనే మారిషయందు నీవు జనింతువు ఆమారిష వృక్షములకు కన్యయై జనించును. నే నక్కడగూడ దుర్బుద్ధివగు నీకు ధర్మకామార్థయుక్తములయిన నీ కర్మాచరణములందు మఱి మఱి విఘ్నములు గావింతును ఇట్లు శప్తుడై యాదక్షుడును రుద్రునకెట్లు ప్రతిశాపమిచ్చెను.

యస్మా త్త్వం మత్కృతే క్రూర ఋషీన్‌ వ్యాహృతవానసి | తస్మా త్సార్ధం సురై ర్యజ్ఞే న త్వాం యక్ష్యంతి వైద్విజాః || 34

కృత్వా೭೭హుతిం తవ క్రూర అపః స్పృశతి కర్మసు|ఇహైవ వత్స్యసే లోకే దివం హిత్వా ೭೭యుగక్షయాత్‌

తతో దేవై స్తుతే సార్ధం న తు పూజా భవిష్యతి || 35

ఓ క్రూరుడా! నా కొఱకు ఈమహర్షులనుగూడ తూలనాడితివి. కావున యజ్ఞములందు దేవతలతోబాటు నిన్నెవ్వరును యజింపరు. ఒకవేళ నీకాహుతి యిచ్చినను, (రుద్రుని కిచ్చిన యాహుతి యనంతరము) పవిత్రులగుట కుదక స్పర్శ గావింతురు. యుగాంతము వరకీ లోకముననే నీవుందువు. దేవతలతోబాటు పూజ నీ కుండదనెను.

రుద్రఉవాచ

చాతుర్వర్ణ్యం తు దేవానాం తే చాప్యేకత్ర భుంజతే|నభోక్ష్యే సహిత సైస్తు తతో భోక్ష్యా మ్యహం పృథక్‌ || 36

సర్వేషాం చైవ లోకానా మాది ర్భూ ర్లోక ఉచ్యతే|త మహం ధారయా మ్యేకః స్వేచ్ఛయా న తవా೭೭జ్ఞయా || 37

తస్మిన్‌ ధృతే సర్వలోకా నూనం తిష్ఠంతి శాశ్వతాః|తస్మా దహం వసామీహ సతతం న తవాజ్ఞయా || 38

దేవతలు తమలోగల చతుర్వర్ణములవారితో గలిసి భుజింతురు. వారితో గలిసి నేను భుజింపను. వేరే భుంజితును. అన్నిలోకములకు మొదటిది భూలోక మందురు. ఆ లోకమును నాయంతట నేనొక్కడనే ధరింతును. నీ యాజ్ఞతో గాదు. (నీ యాన అక్కరలేదు) ఈ కర్మభూమిని ధరించినంతట నెల్లలోకములు శాశ్వతముగ సుస్థిరములై నిలువగలవు. అందుచే నే నీ భూలోకమందే యుందును. అదియు నీ యాజ్ఞచేత గాదు. అని రుద్రుడనెను.

బ్రహ్మోవాచ

తతో భివ్యాహృతో దక్షో రుద్రే ణామితతేజసా|స్వాయంభవీం తనుం త్యక్త్వా ఉత్పన్నో మానుషే ష్విహ || 39

యదా గృహపతి ర్దక్షో యజ్ఞానా మీశ్వరః ప్రభుః|నమస్తే నేహ యజ్ఞేన సో యజు ద్దైవతైః సహ || 40

అమితతేజోమూర్తి యగు రుద్రునిచే నిట్లు దక్షుడు నొవ్వనాడ బడి స్వాయంభువమూర్తిని విడిచి (ప్రజాపతత్వము గోల్పోయి) మనుజులం దిక్కడ మానవలోకమున జనించి దక్షుడనుపేరుతోనే గృహస్థుడై యజ్ఞములందు యజమానుడై దేవతలతో గూడ నెల్ల యజ్ఞముల నాచరించెను.

ఆథ దేవీ సతీ జజ్ఞే ప్రాప్తే వైవస్వతే ంతరే|మేనాయాం తా ముమాం దేవీం జనయామాస శైలరాట్‌ || 41

సా తు దేవీ సతీ పూర్వ మాసీ త్పశ్చా దుమా భవత్‌|సహవ్రతా భవసై#్యషా నైతయా ముచ్యతే భవః || 42

యావదిచ్ఛతి సంస్థానం ప్రభు ర్మన్వంతరే ష్విహ|మారీచం కశ్యపం దేవీ యథాదితి రనువ్తరా || 43

సార్ధం నారాయణం శ్రీస్తు మఘవంతం శచీ యథా|విష్ణుం కీర్తి రుషా సూర్యం వశిష్ఠం చా ప్యరుంధతీ || 44

నైతాం స్తు విజహ త్యేతా భర్తౄన్‌ దేవ్యః కథంచన|ఏవం ప్రాచేతసో దక్షో జజ్ఞే వై చాక్షుషా ంతరే || 45

ప్రాచీనబర్హిషః పౌత్రః పుత్ర శ్చాపి ప్రచేతసాం|దశభ్య స్తుప్రచేతోభ్యో మారిషాయీం పున ర్నృప || 46

జజ్ఞే రుద్రాభిశాపేన ద్వితీయ మితి న శ్శ్రుతం | భృగ్వాదయ స్తు తే సర్వే జిజ్ఞిరే వై మహర్షయః || 47

ఆద్యే త్రేతాయుగే పూర్వం మనో ర్వైవస్వతస్య హ|దేవస్య మహతో యజ్ఞే వారుణీం బిభ్రత స్తనుమ్‌ || 48

ఇత్యేషో నుశయో హ్యాసీ త్తయో ర్జాత్యంతరం గతః|ప్రజాపతేశ్చ దక్షస్య త్య్రంబకస్య చ ధీమతః || 49

తస్మా న్నానుశయః కార్యో వరే ష్విహ కదాచన|జాత్యంతరగతస్యా పి భావితస్య శుభాశుభైః ||

జింతో ర్న భూతయే ఖ్యాతి స్తన్నకార్యం విజానతా || 50

ఆ మీదట సతీదేవి వైవస్వత మన్వంతరమురాగానే హిమవంతునికి మేనక యందు ''ఉమా|| నామ్నియై అవతరించెను. ముందు సతియను పేరంది యా మీద ''ఉమ'' అను నామమందెను. శంభుని కీమె సహధర్మచారిణి. ఆయన యీమె నెన్నడును విడిచి యుండడు. మరీచి కుమారుడైన కశ్యపుని అదితి నారాయణుని శ్రీదేవి. ఇంద్రుని శచీదేవి విష్ణుని కీర్తి సూర్యుని ఉష వశిష్ఠు నరుంధతియు నట్లు శంకరు నీమె యెన్నడును విడువదు. పరమేశ్వరున కీమె నిత్యానపాయిని.

మున్నిట్లాదక్షుడును చాక్షుషమన్వంతరమందు బ్రహ్మ గావించిన యజ్ఞమునందు ప్రాచీనబర్హికి పౌత్రుడుగను బ్రచేతసులకు పుత్రుడుగనునై మారిషయందు జనించెను. ఇది మునుపు త్రేతాయుగమున వైవస్వత మనువు కాలమున బ్రహ్మ వరుణదేవతాకమైన మూర్తిధరించి గావించిన యజ్ఞమునందు దక్షుని జన్మము జరిగినది. అల్లుడు మామలకు కలిగిన యీ విరోధము జన్మాంతరమును పొందినది. కావున నుత్తము లొండొరులు విరోధము పెట్టుకొనగూడదు. శుభా శుభకర్మ ఫలములచే భావితుడై (అనగా ప్రారబ్ధమునకు అధీనుడై) యుండు జీవుడు ఆకారణముచే జాత్యంతరమందు పుట్టినపుడు వానికిని పూర్వజన్మ ఖ్యాతి (యోగ్యత) రాదు. ఆపుట్టువులో కార్యాకార్య విఛక్షణతయున్నను తొల్లిటి కర్మానుభవమెంత వారికిని దప్పదన్నమాట.

మునయ ఊచుః

కథం రోషేణ సా పూర్వం దక్షస్య దుహితా సతీ|త్యక్త్వా దేహం పున ర్జాతా గిరిరాజగృహే ప్రభో || 51

దేహాంతరే కథం తస్యాః పూర్వదేహో బభూవ హ|భ##వేన సహ సంయోగ స్సంవాదశ్చ తయోః కథమ్‌ || 52

స్వయంవరః కథం వృత్త స్తస్మిన్‌ మహతి జన్మని|వివాహశ్చ జగన్నాథ సర్వాశ్చర్య సమన్వితః || 53

తత్సర్వం విస్తరా ద్ర్బహ్మన్‌ వక్తు మర్హసి సాంప్రతమ్‌|శ్రోతు మిచ్ఛామహే పుణ్యాం కథాం చాతిమనోహరామ్‌ || 54

బ్రహ్మోవాచ

శృణుధ్వం మునిశార్దూలాః కథాం పాపప్రణాశినీం|ఉమాశంకరయోః పుణ్యాం సర్వకామఫలప్రదామ్‌ || 55

కదాచి త్స్వగృహా త్ప్రాప్తం కశ్యపం ద్విపదాంవరం| అపృచ్ఛ ద్ధిమవాన్‌ వృత్తం లోకే ఖ్యాతికరం హితమ్‌ || 56

కే నాక్షయాశ్చ లోకా స్ప్యుః ఖ్యాతిశ్చ పరమా మునే|తథైవ చార్చనీయత్వం సత్సు తత్కథయస్వ మే || 57

కశ్యప ఉవాచ

అపత్యేన మహాబాహో సర్వ మేత దవాప్యతే|మయా ఖ్యాతి రపత్యేన బ్రహ్మణా ఋషిభి స్సహ || 58

కిం న పశ్యసి శైలేంద్ర యన్మాం త్వం పరిపృచ్ఛసి|వర్తయిష్యామి యచ్చాపి యథాదృష్టంపురా7చల|| 59

వారణాసీ మహం గచ్ఛ న్నపశ్యం సంస్థితం దివి|విమానం సునవం దివ్య మనౌపమ్యం మహర్ధిమత్‌ || 60

తస్యాధస్తా దార్తనాదం గర్తస్థానే శృణో మ్యహం|త మహం తపసా జ్ఞాత్వా తత్రై వాంతర్హితః స్థితః || 61

ఆథాగా త్తత్ర శైలేంద్ర విప్రో నియమవాం చ్ఛుచిః|తీర్థాభిషేక పూతాత్మా పరే తపసి సంస్థితః || 62

ఆథ స వ్రజమానస్తు వ్యాఘ్రే ణా77భీషితో ద్విజః|వివేశ తం తథా దేశం స గర్తో యత్ర భూధర || 63

గర్తాయాం వీరణస్తమ్బే లంబమానా న్మునీంస్తదా|అపశ్య దార్తో దుఃఖార్తాం స్తా నపృచ్ఛ చ్చ స ద్విజః || 64

కే యూయం వీరణస్తంబే లంబమానా హ్యథోముఖాః|దుఃఖితాః కేన మోక్ష శ్చ యుష్మాకం భవితా 7నఘాః || 65

బ్రహ్మ పలుకులు విని మును లిట్లనిరి. దక్షకన్య సతీదేవి రోషముగొని మేరువిడిచి పర్వతరాజింట జనించెగదా ! అపుడు మఱల నా భవానికి భపునితో సమావేశ మెట్లయినది. వారికా ఘట్టమునందు జరిగిన సంవాదమేమి ? ఆ మహాపుణ్య జన్మ మందు స్వయంవర మెట్లయ్యె వారి కల్యాణ మహోత్సవమచ్చెరువు గొల్పునది గదా ! అదెల్ల సవిస్తరముగ నానతీయ దగుదువు. అపుణ్యకథ మనోహరము మేము విన గుతూహలపడుచున్నామన బ్రహ్మ యిట్లనియె.

ఓ ముని వర్యులార ! పాపహరమగు నా ఉమా శంకర కల్యాణము పవిత్రము. కామ ఫలదము. ఒకప్పుడు తన యింటి కరుదెంచిన కశ్యపమహర్షిని హిమవంతుడు పుణ్యయశఃకరమగు నొక వృత్తాంతము నిట్లడిగెను. మునీ! ఏమి చేసిన నక్షయపుణ్యలోకములు గల్గును? పరమోత్తమఖ్యాతిదేనివలన వచ్చును? సత్పురుషు లెవ్వరెట్లు పూజింప వలసి యుందురది యానతిమ్మన కశ్యపు డిట్లనియె.

నీ తెల్పిన భాగ్యమెల్ల సంతానమువలనగలుగును. నేను(చతుర్ముఖ బ్రహ్మ)పరమర్షు లెల్లరు సంతానలాభముచే ఖ్యాతి గన్నారము. గిరీంద్ర ! నీవు చూచుట లేదా ! మఱి యడిగెదవేమి ? మున్ను నేను గన్న వృత్తాంతమిదె చెప్పెద వినుము. వారణాసికేగుచు నాకాశమందున్నయొకనూతన దివ్యవిమానము గాంచితిని. దానికిగ్రిందుగ నొక గుంట నుండి యొక యేడుపుధ్వని విన్నాను. నా తపశ్శక్తిచే దానినెఱింగి యచటకేగి దాగి నిలిచితిని. అటనొక పవిత్రమూర్తి తపస్వి తీర్థముల సేవించి యభిషేకము గావించుకొని యాదారినేగుచు నొక బెబ్బులికి బెదరి యాగుంట దరికి పరువిడి వచ్చెను. అక్కడ నొక అవురుగడ్డికాడనుబట్టుకొని వ్రేలాడు మునుల గాంచెను. అట్లుగని యార్తుడై దుఃఖించుచున్నవారల నెవ్వరు మీరు ఈగడ్డి దుబ్బు నూతగొని మొగములు క్రిందికి వాల్చి వ్రేలాడుచున్నారు. మీ దుఃఖమునకు విముక్తిగలుగగలదు చెప్పుడు. అన పితరులిట్లనిరి.

పితర ఊచుః

వయం తే కృతపుణ్యస్య పితర స్సపితామహాః|ప్రపితామహాశ్చ క్లిశ్యామ స్తవ దుష్టేన కర్మణా || 66

నరకో 7యం మహాభాగ గర్తరూనేణ సంస్థితః|త్వం చాపి వీరణస్తంబ స్త్వయి లంబామహే వయమ్‌ || 67

యావ త్త్వం జీవసే విప్ర తావదేవ వయం స్థితాః | మృతే త్వయి గమిష్యామో నరకం పాపచేతసః || 68

యది త్వం దారసంయోగం కృత్వా7పత్యం గుణోత్తరం|ఉత్పాదయసి తే నాస్మాన్ముచ్యేమ వయ మేనసః || 69

నా 7న్యేన తపసా పుత్ర తీర్థానాం చ ఫలేన చ|ఏత త్కురు మహాబుద్ధే తారయస్వ పితౄ న్భయాత్‌ || 70

మేము పుణ్యకర్ముడవగు నీ తండ్రులము, తాతలము, ముత్తాతలమును. నీపాపకర్మముచే మేమిట్లు క్లేశపడు చున్నాము. ఈ గుంట గుంటగాదు నరకమే. నీవే యీఅవురుగడ్డిదుబ్బు. నిన్నే యూతచేసికొని వ్రేలాడుచున్నాము. నీవు బ్రతికినన్నాళ్ళు మేమిచ్చట నిట్లుందుము. నీవు మరణించినంతట మేము నరకము పాలగుదుము. నీవు పెండ్లి సేసికొని గుణవంతుని పుత్రుని గంటివేని మే మీపాపమునుండి ముక్తులగుదుము. మఱి యే తపస్సుయొక్క తీర్థములయొక్క ఫలమునను మాకు విముక్తి రాదు. బుద్ధిమంతుడవు గావున నీపితరులను మమ్మీ నరక భయము నుండి తరింపజేయుము. అన గశ్యపు డనియె.

కశ్యప ఉవాచ

స తథేతి ప్రతిజ్ఞాయ ఆరాధ్య వృషభద్వజం|పితౄ న్గర్తా త్పముద్ధృత్య గణపాంశ్చచకారహ || 71

స్వయం రుద్రస్య దయితః సువేశోనామ నామతః|సమ్మతో బలవాం శ్చైవ రుద్రస్య గణపో 7భవత్‌ || 72

తస్మా త్కృత్వా తపో ఘోర మపత్యం గుణవ ద్భృశం|ఉత్పాదయస్వ శైలేంద్ర సుతాం త్వం వరవర్ణినీమ్‌ || 73

బ్రహ్మోవాచ

స ఏవ ముక్తో ఋషిణా శైలేంద్రో నియమస్థితః|తప శ్చకారాప్యతులం తేన తుష్టి రభూ న్మమ || 74

తదా తముత్పపాతాహం వరదో 7స్మీతి చా బ్రువం|బ్రూహి తుష్టో 7స్మి శైలేంద్ర తపసా7నేన సువ్రత || 75

హిమవా నువాచ

భగవ న్పుత్ర మిచ్ఛామి గుణౖ స్సర్వై రలంకృతం|ఏవం వరం ప్రయచ్ఛస్వ యది తుష్టొ7సి మే ప్రభో || 76

అట్ల చేసెదనని యాతడు వృషభవాహను నారాధించి యాగర్తమునుండి పితరులనుద్ధరించి శివుని ప్రమథగణముల నాయకులం గావించెను. తాను సువేశుడనుపేర బలశాలియై రుద్రుని గణనాయకుండయ్యె. కావున నో శైలేంద్ర! తీవ్రతపస్సు సేసి గుణశాలియైన సంతానముం గనుము. పరమసుందరిని గూతురుం గాంచుము.

బ్రహ్మ యిట్లనియె. ఇట్లాఋషిచే దెలుపబడి కొండఱడు నియమమూని అనుపమమయిన తపస్సు గావించెను. దాన నాకు సంతుష్టి గల్గినది. వెంటనే నేనాతని కడ వ్రాలితిని. నీ తపమ్మునకు మెచ్చితిని. వరమిచ్చెద నడుగుమంటిని. సర్వ గుణాలంకారుం గుమారుం గోరెవ నాయెడ సంతుష్టుడైతివేని అనుగ్రహింపుమని శైలరాజనియె.

బ్రహ్మోవాచ

తస్య తద్వచనం శ్రుత్వా గిరిరాజస్య భోద్విజాః|తదా తసై#్మ వరం చాహం దత్తవా న్మన సేప్సితమ్‌ || 77

కన్యా భవిత్రీ శైలేంద్ర తపసా 7నేన సువ్రత|ప్రభావా త్సర్వత్ర కీర్తి మాప్స్యసి శోభనామ్‌ || 78

అర్చిత స్సర్వదేవానాం తీర్థకోటి సమావృతః|పావన శ్చైవ పుణ్యన దేవానా మపి సర్వతః || 79

జ్యేష్టాచ సా భవిత్రీ తే అన్యే చాత్ర తత శ్శుభే || 80

ఆతని మాటవిని యాతని మదికనువైన వరమిచ్చితిని. ఓ శైలరాజ! ఈ తపః ప్రభావమున నీకొక కన్య యుదయించును. దాన నీవు పరమశోభనమైన కీర్తి నొందెదవు. ఎల్లవేల్పులు నిన్నర్చింప కోటి తీర్థములకు నెలవై పావనుడవై దేవతలకెల్ల పూజనీయుడవయ్యెదవు. ఆ కన్నియ నీకు పెద్ద కూతురగును. మరి ఇద్దఱు కన్యలు కలుగుదురు.

సో7పి కాలేన శైలేంద్రో మేనాయా ముదపాదయత్‌|అపర్ణా మేకపర్ణాం చ తథా చై వైకపాటలామ్‌ || 81

న్యగ్రోధ మేకపర్ణంతు పాటలం చైకపాటలాం|అశిత్వా త్వేకపర్ణంతు అనికేత స్తపో 7చరత్‌ || 82

శతం వర్షసహస్రాణాం దుశ్చరం దేవదానవైః|ఆహార మేక పర్ణంతు ఏకపర్ణా సమాచరత్‌ || 83

పాటలేన తథైకేన విధధే చైకపాటలా | పూర్ణే వర్షసహస్రేతు ఆహారం తాః ప్రచక్రతుః || 84

అపర్ణాతు నిరాహారా తాం మాతా ప్రత్యభాషత | నిషేధయంతీ చోమేతి మాతృస్నే హేన దుఃఖితా || 85

సా తథోక్తా తయా మాత్రా దేవీ దుశ్చరచారిణీ | తేనైవ నామ్నా లోకేషు విఖ్యాతా సురపూజితా || 86

ఏతత్తు త్రికుమారీకం జగత్‌ స్థావర జంగమం | ఏతాసాం తపసాం వృత్తం యావద్భూమి ర్ధరిష్యతి || 87

తపశ్చరీరా స్తాస్సర్వా స్త్రిస్రో యోగం సమాశ్రితాః | సర్వా శ్చైవ మహాభాగా స్తథాచ స్థిర¸°వనాః || 88

తా లోకమాతరశ్చైవ బ్రహ్మచారిణ్య ఏవచ | అనుగృహ్ణంతి లోకాంశ్చ తపసా స్వేన సర్వదా || 89

ఉమా తాసాం వరిష్ఠాచ జ్యేష్ఠా చ వరవర్ణినీ | మహాయోగబలోపేతా మహాదేవ ముపస్థితా || 90

బ్రహ్మయన్నట్లు హిమవంతుడు మేన యందు కన్యకం గాంచెను. మేనాదేవి యందు హిమవంతుడు మఱి కొంత కాలమునకు అపర్ణ ఏకపాటల ఏకపర్ణ అనుకన్యల వడసెను. ఆకుకూడ తినక అపర్ణయు మఱ్ఱియాకు నొక దానిని తిని యేకపర్ణయు పాటలమను చెట్టునాకొకటి తిని నీడను నిలువకఏకపాటలయు తపస్సు చేసిరి. ఇట్లు వారు వే యేండ్లు తపస్సు గావించిరి. అప్పుడు తల్లి మేనమాతృప్రేమతో ఉ+మా తపస్సు వద్దు చాలింపు మనియె. అట్లు తనను నిషేధించుచున్నను దీవ్రతపంబు గావించినందున అదేపేరుతో అనగా ''ఉమా'' అనుపేరుతో దేవతలకు బూజనీయయై ప్రఖ్యాతి నందెను.

చరాచరాత్మకమైన యీజగత్తు త్రికుమారీకము అనగా నీ ముగ్గురు కుమార్తెలతో (శక్తులతో) నిండినది. వీరి తపో వృత్తాంతమును భూమి యెంతవఱకు ధరించునో అనగా ఈ చరిత్ర భూలోకమునందు వాడబడినంతకాలము తపోమూర్తులైన యీముగ్గుర శక్తులు యోగభూమికయందుండి స్థిర¸°వనులై లోకమాతృకలయి బ్రహ్మచారిణులై తమ తపస్సుచే నెల్లప్పుడు లోకముల ననుగ్రహింతురు. వారిలో జ్యేష్ఠురాలు (పెద్దది) శ్రేష్ఠురాలు గూడ. మహా యోగబలముతో గూడి మహేశ్వరుని బొందినది.

దత్తక శ్చోశనా స్తస్య పుత్ర స్స భృగునందనః|ఆసీ త్తసై#్యకపర్ణాతు దేవలం సుషువే సుతమ్‌ || 91

యాతు తాసాం కుమారీణాం తృతీయా హ్యేకపాటలా|పుత్రం పా త మలర్కస్య జైగీషవ్య ముపస్థితా || 92

తస్యా శ్చ శంఖలిఖితౌ స్మృతౌ పుత్రా వయోనిజౌ|ఉమాతు యా మయా తుభ్యం కీర్తితా వరవర్ణినీ || 93

అథ తస్యా స్తపోయోగా త్త్రైలోక్య మఖిలం తదా|ప్రధూపిత మథాలక్ష్య వచ స్తా మహ మబ్రవమ్‌ || 94

దేవి కింతపసా లోకాం స్తాపయిష్యసి శోభ##నే| త్వయా సృష్ట మిదం సర్వం మా కృత్వా త ద్వినాశయ || 95

త్వం హి ధారయసే లోకా నిమా న్సర్వాన్‌ స్వతేజసా|బ్రూహి కింతే జగన్మాతః ప్రార్థితం సంప్రతీహ నః || 96

యదర్థం తపసో హ్యస్య చరణం మే పితామహ|త్వమేవ త ద్విజానీషే తతః పృచ్ఛసి కిం పునః || 97

భృగుకుమారునికి ఏకపర్ణ భార్యయయ్యె. ఆమె దేవలుడను పుత్రునిం గనియె. ఆ మువ్వురు కుమారికలలో మూడవ యామె ఏకపాటల అలర్కుని కుమారుడగు జైగీషవ్యునిం బెండ్లాడినది. ఆమెకు శంఖలిఖితులను నిద్దరు పుత్రులు అయోనిజులు గల్గిరి. నేకేను దెల్పిన ఉమాదేవి పరమసుందరి. ఆమె తపన్తీవ్రత చేత ముల్లోకములు పొగలుగ్రమ్ముట చూచి నేను (బ్రహ్మ) ఆమెతో దేవీ కళ్యాణివి నీవు తపస్సుచే లోకములనేల తపింపజేయుదువు. నీచేత నీ జగత్తు సృష్టింపబడినది. నీవదానిం బట్టించినదానవు. నీవు దీనిని నశింపజేయదగదు. నీ తేజముచే నీ లోకముల నన్నిటిని ధరించుచున్నావు. ఓ జగన్నాతా! నీవు కోరునదేమో మా కిపుడిక్కడ తెలు మన దేవి నేనెందుల కీ తపస్సు చేయుచున్నానో నీవే యెఱుంగుదువు. మఱి నన్నేల ప్రశ్నింతువనెను.

బ్రహ్మోవాచ

తత స్తా మబ్రవం చాహం యదర్థం తప్యసే శుభే|స త్వాం స్వయ ముపాగమ్య ఇహైవ వరయిష్యతి || 98

శర్వ ఏవ పతి శ్శ్రేష్ఠ స్సర్వలోకేశ్వరేశ్వరః|వయం సదైవ యస్యేమే వశ్యావై కింకరా ళ్ళుభే || 99

స దేవదేవః పరమేశ్వర స్స్వయం స్వయంభు రాయాస్యతి దేవి తే7ంతికం|

ఉదారరూపో వికృతాదిరూప స్సమాన రూపో7పి నయస్య కస్యచిత్‌ || 100

మహేశ్వరః పర్వతలోకవాసీ చరాచరేశః ప్రథమో 7ప్రమేయః |

వినేందునా హీంద్రసమానవర్చసా విభీషణం రూప మివాస్థితో యః || 101

ఇతిశ్రీ ఆది బ్రాహ్మే మహాపురాణ స్వయంభుఋషిసంవాదే రుద్రాఖ్యానం నామ చతుస్త్రింశో7ధ్యాయః

బ్రహ్మ యిట్లనియె

అంతట నేనామె కిట్లంటిని. ఎవని కొఱకు నీవీ తపస్సు చేయుచున్నావో యాతడు తానేవచ్చి యిచట నిన్ను వరింపగలడు. నీకు దగిన వాడాశర్వుడు. సర్వలోకేశ్వరుల కీశ్వరుడు. మే మాయన వశములోని కింకరులము. ఆదేవదేవుడు స్వయంభువు. ఆయన ఉదారరూపుడు. విలక్షణ రూపుడును. ఆయనకు సమానరూపుడు మఱిలేరు. కొండలమీద వసించు వాడతడు. చరాచర సృష్టి కీశ్వరుడాయన. మొట్టమొదటి వాడు. ఊహకందనివాడు. ఇంద్రుని కీడగు వర్చస్సుతో నిందు బింబము భరింపకుండ ఆదిశేషసమానమైన వర్చస్సుతో భీకరమగురూపముతో నీదరికి తాన రాగలడు.

ఇది బ్రహ్మపురాణమున రుద్రాఖ్యానమను ముప్పదినాల్గవ యధ్యాయము

Brahmapuranamu    Chapters