Brahmapuranamu    Chapters   

ద్వాత్రింశో7ధ్యాయః

మార్తాండజన్మ శరీరలిఖనవర్ణనమ్‌

మునయః ఊచుః

శ్లో|| నిర్గుణ శ్శాశ్వతో దేవ స్త్వయా ప్రోక్తో దివాకరః| పున ర్ద్వాదశధా జాతః శ్రుతో7స్మాభి స్త్వయోదితః|| 1

సకధం తేజసో రశ్మిః స్త్రియాగర్భే మహాద్యుతిః| సంభూతో భాస్కరో దేవ స్తత్ర న స్సంశయో మహాన్‌|| 2

దివాకరుడు-శాశ్వతుడు-నిర్గుణుడు నని తెల్పితివి. తరువాత పండ్రెండు మూర్తులతో జన్మించినట్లు తెల్పితివి. తేజోరాశియైన యా వెల్గు స్త్రీ గర్భమందెట్లున్నది. ఎట్లు పుట్టెను. ఇది మాకు పెద్ద సంశయము. తీర్పుమని మునులడుగ బ్రహ్మయిట్లనియె.

దక్షస్య హి సుతా ష్షష్టి ర్భభూవు స్తా స్తుశోభనాః| అదితి ర్దితి ర్దనుశ్చైవ వినతాద్యా స్తథైవచ|| 3

దక్ష స్తాః ప్రదదౌ కన్యాః కశ్యపాయ త్రయోదశ | అదితి ర్జనయామాస దేవాం స్త్రిభువనేశ్వరాన్‌|| 4

దైత్యా న్దితి ర్దను శ్చోగ్రా న్దానవా న్బలదర్పితాన్‌| వినతాద్యా స్తథా చాన్యాః సుషువుః స్థాణుజజ్గమాన్‌|| 5

తస్యాథ పుత్రదౌహిత్రైః పౌత్రడౌహిత్ర కాదిభిః| వ్యాప్త మేతజ్జగ త్సర్వం తేషాం తాసాంచ వై మునే|| 6

తేషాం కశ్యప పుత్రాణాం ప్రధానా దేవతాగణాః| సాత్వికా రాజసా శ్చాన్యే తామసాశ్చ గణాః స్మృతాః|| 7

దేవా న్యజ్ఞభుజ శ్చక్రే తథా త్రిభువనేశ్వరాన్‌| స్రష్టా బ్రహ్మవిదాం శ్రేష్ఠః పరమేష్ఠీ ప్రజాపతిః|| 8

తానబాధంత సహితా స్సాపత్న్యాద్దైత్యదానవాః| తతో నిరాకృతాన్‌ పుత్రా న్దైతేయై ర్దానవై స్తథా|| 9

వ్యాప్తం త్రిభువనం దృష్ట్వా అదితి ర్ముని సత్తమాః| ఆచ్ఛిన ద్యజ్ఞభాగాంశ్చ క్షుథా సంపీడితాన్‌ భృశమ్‌|| 10

ఆరాధనాయ సవితుః వరం యత్నం ప్రచక్రమే| ఏకాగ్రా నియతాహారా పరం నియమ మాస్థితా| తుష్టావ తేజసాం రాశిం గగనస్థం దివాకరమ్‌|| 11

దక్షునకు సౌందర్యవతులు ప్రసిద్ధలు నయిన అరువది మంది కుమారైలుండిరి. వారు అదితి-దితి-దనువు వినత మొదలైనవారు. అందు పదముగ్గురను గశ్యపునకిచ్చెను. వారి పుత్ర పౌత్ర దౌహిత్ర సంతతి యనంతము. అదితి సంతతి దేవతలు దితి సంతానము దైత్యులు. వారన్యోన్యము గలహించిరి. దాన ముల్లోకములు నాకుల మగుటకు వగచి యదితి సూర్యునారాధించెను. ఆమె సూర్యునిట్లు స్తుతించెను.

-: ఆది కృత సూర్యస్తుతి :-

నమస్తుభ్యం పరం సూక్ష్మం సుపుణ్యం బిభ్రతే7తులమ్‌| ధామ ధామవతా మీశం ధామాధారంచ శాశ్వతం|| 12

జగతా ముపకారాయ త్వామహం స్తౌమి గోపతే| ఆదదానస్య యద్రూపం తీవ్రం తసై#్మ నమామ్యహమ్‌|| 13

గ్రహీతు ముష్టమాసేన కాలేనాంబుమయం రసమ్‌| బిభ్రతస్తవ యద్రూప మతితీవ్రం నతా7స్మితత్‌|| 14

సమేత మగ్నీ షోమాభ్యాం నమస్తసై#్శగుణాత్మనే| యద్రూప మృగ్యజుః సామ్నా మైక్యేన తపతే తవ|| 15

విశ్వమేతత్త్రయీ సంజ్ఞం నమస్తసై#్మ విఖావసో| యత్తు తస్మాత్పరం రూప మో మిత్యుక్త్వా 7భి సంహితమ్‌||

అస్థూలం స్థూల మమలం సమస్తసై#్మ సనాతన|| 16

సూక్ష్మము పుణ్యము స్వచ్ఛమునైన పరమతేజస్సును ధరించు నీకు నమస్కారము. తేజోవంతులకు నీశ్వరుడును దేజస్సులకు నాధారభూతుడు శాశ్వతుడునై జగదుపకారమునకై తీవ్రరూపము దాల్చిన నిన్ను స్తుతించెదను. ఓ గ్రహావతి! ఎనిమిదిమాసములు (ఆదాన మాసములు) జలరూపమయిన రసమును గ్రహించుటకు దీవ్రరూపముం దాల్చు నీకు వినత నయ్యెదను. అగ్నీషోములతో గూడి త్రిగుణాత్మకమై ఋగ్వజుసామ రూపవేదత్రయీ రూపమైన నీ స్వరూప మీ విశ్వమును తపించుచున్నది. అట్టి నీకు నమస్కారములు. ఓ సనాతన మూర్తి! నీ త్రయీరూపము కంటె పరమై ఓం కారము చేత అభినంహితమైన (వర్ణింపబడిన) స్థూలము సూక్ష్మమునైన యా నీ రూపమునకు నమస్కారము.

బ్రహ్మోవాచ

ఏవం సానియతా దేవీ చక్రే స్తోత్ర మహర్నిశమ్‌| నిరాహారా వివస్వంత మారిరాథయిఘ ర్ధ్విజాః! || 17

తతఃకాలేన మహతా భగవాం స్తపనో ద్విజాః| ప్రత్యక్షతా మగాత్తస్యా ధాక్షాయణ్యా ద్విజోత్తమాః! || 18

సా దదర్శ మహాకూటం తేజసో7మ్బర సంవృతమ్‌| భూమౌచ సంస్థితం భాస్వజ్జ్వాలాభి రతిదుర్థృశమ్‌ || 19

తం దృష్ట్వా చ తతో దేవీ సాధ్వసం వరమం గతా||

ఇట్లు నిరాహారమై యహర్నిశము నాభగవానుని స్తుతించెను. చిరకాలమున కా సూర్యభగవానుడామెకు ప్రత్యక్ష మయ్యెను. ఆమె యాక సమంతట నాపరించి పుడమి కవతరించిన యా జ్వాలామయమూర్తిని జూచి మిక్కిలి జడుపంది స్తుతించెను.

ఆదితిరువాచ

జగదాద్య ప్రసీదేతి నత్వాం పశ్యామి గోపతే | ప్రసాదం కురు వశ్యేయం యద్రూపం తే దివాకర || 20

భక్తానుకంపక విభో త్వద్భక్తా న్పాహి మే సుతాన్‌ || 21

ఓ దివాకర! జగత్తునకెల్ల మొదటివాడా! నీ స్వరూపము చూడలేకున్నాను. నేను చూడగల్గునట్లు ప్రసన్నుడ వగుము. నీ భక్తులగు నాటీడ్డలను రక్షింపుము.

బ్రహ్మోవాచ

తతః స తేజసస్తస్మా దావిర్భూతో విభావముః! అదృశ్యత తదా77దిత్య స్తప్త తామ్రోపమః ప్రభుః || 22

తతఃస్తాం ప్రణతాం దేవీ మాత్మదర్శనహర్షితాం| ప్రాహ భాస్వాన్‌ వృణుషై#్వకం వరం మత్తోయ మిచ్ఛసి || 23

ప్రణతా శిరసా సాతు జానుపీడిత మేదినీ| ప్రత్యువాచ వివస్వంతం వరదం సముపస్థితమ్‌ || 24

అంతట సూర్యభగవాను డాతోజోమండలము నుండి వెలువడి అగ్నితప్తమైన రాగివలె నెఱ్ఱగా సాకారముగ దర్శనమిచ్చి నమస్కరించు నామెతో నభీష్టవరము కోరుమనియె. ఆమె శిరసు వంచి మోకాళ్ళమీదవ్రాలి నమస్కరించి వరదుడయిన స్వామినిట్లు కోరెను.

అదితి రువాచ

దేవ ప్రసీద పుత్రాణాం హృతం త్రిభువనం మమ | యజ్ఞభాగా శ్చ దైతేయై ర్దానవైశ్చ బలాధికైః 25

త న్నిమిత్తం ప్రసాదం త్వం కురుష్వ మమ గోపతే| అంశేన తేషాం భ్రాతృత్వం గత్వా తా న్నాశ##యే రిపూన్‌ 26

యథామే తనయా భూయో యజ్ఞభాగభుజః ప్రభో | భ##వేయు రధిపాశ్చైవ త్రైలోక్యస్య దివాకర 27

తథానుకల్పం పుత్రాణాం సుప్రసన్నో రవే మమ | కురు ప్రపన్నార్తిహర కార్యం కర్తాత్వ ముచ్యతే || 28

శ్లో|| తత స్తా మాహ భగవా న్భాస్కరో వారితస్కరః | ప్రణతా మదితిం విప్రాః ప్రసాదసుముఖో విభుః || 29

గ్రహరాజా! నా యెడను నా పుత్రులయెడను ప్రసన్నుడవుగమ్ము. ప్రబలురైన దైత్యదానవులు త్రిభువనములను హరించి యజ్ఞభాగములను తామే యనుభవించుచున్నారు. అందుచే మాయెడల ప్రసన్నుడవై నీ యంశమున వారికి భ్రాతవై జన్మించి యా శత్రువులను నశింపజేయుము. నా కుమారులు మరల యజ్ఞభాగముల ననుభవించి ముల్లోకములకు ప్రభువులగు నట్లనుగ్రహింపుము. శరణన్నవారి దుఃఖమును హరించువాడవు. వారి కార్యము జక్కబెట్టువాడవునని పేరొందితివి. ఉదకములను హరించు సూర్యభగవానుడు ప్రపన్నుడై యామెతో నిట్లనియె.

సహస్రాంశేన తేగర్భః సంభూయాహ మశేషతః|త్వత్పుత్రశత్రూ న్దక్షో7హం నాళయా మ్యాశు నిర్వృతః||

బ్రహ్మోవాచ

ఇత్యుక్త్వా భగవా న్భాస్వా నంతర్థాన ముపాగతః | నివృత్తా సా7పి తపసః సంప్రాప్తాఖిలవాఞ్ఛితా || 31

నేను నీ తపస్సునకు సంతోషించితిని. నీకు వేయియపవంతు తేజస్సుతో కుమారుడనై జనించి నీ బిడ్డలకు శత్రువు లయినవారి నందరను నశింపజేసెదను. అని సూర్యభగవానుడంతర్ధాన మందెను. ఆమె కోరిక సఫలమై తపస్సును చాలించెను.

తతో రశ్మిసహస్రాత్తు సుషుమ్నాఖ్యో రవేః కరః | వివేశ తస్యాఉదరం కామానాం పూరణాయ చ || 32

నివాసం సవితా చక్రే దేవమాతు స్తదోదరే | కృచ్ఛచాంద్రాయణాదీంశ్చ సా చక్రే సుసమాహితా || 33

శ్లో|| శుచినా థారయా మ్యేనం దివ్యం గర్భమితి ద్విజాః | కిం మారయసి గర్భాండ మితి-నిత్యోపవాసినీ| తతస్తాం కశ్యపః ప్రాహ కించిత్కోప ప్లుతాక్షరమ్‌ ||

అవ్వల నొక సంవత్సరమునకునుషుమ్న యనుకిరణరూపమున నదితి గర్భమందు నామె కోర్కె సఫలమొనర్ప సూర్యుడు ప్రవేశించెను. అమె కృచ్ఛ్రచాంద్రాయణాది వ్రతముల నాచరించెను. అంతట కశ్యపుడు కుపితుడై ''నిత్యోప వాసములం జేసి నీగర్భమారణము చేసికొందువా'' యన నామె యిట్లనియె.

సాచతం ప్రాహ గర్భాండ మేత త్పశ్యేతి కోపనా | నమారితం విపక్షాథాం మృత్యుదేవ భవిష్యతి || 35

ఇత్యుక్త్వా తం తధా గర్భముత్ససర్జ సురారణిః | జాజ్వల్యమానం తేజోభిః పత్యు ర్వచన కోపితా || 36

తం దృష్ట్వా కశ్యపో గర్భముద్యద్భాస్కర వర్చసమ్‌ | తుష్టావ ప్రణతో భూత్వా వాగ్భి రాద్యాభి రాదరాత్‌ || 37

సంస్తూయమానః స తదా గర్భాండాత్ప్రకటో7భవత్‌ | పద్మపత్ర సవర్ణాభ స్తేజసా వ్యాప్త దిఙ్ముఖః || 38

అథాంతరిక్షా దాభాష్య కశ్యపం మునిసత్తమం | సతోయ మేఘగంభీరా వాగువాచాశరీరిణీ || 39

అంత నామెయు కుపితయై ఈ గర్భాండముం జూడుము. ఇది మారితము కాలేదు. గాక శత్రుమారకము గాగలదు. అనిపలికి గర్భమును పనివడి విసర్జించెను. అట్లు జారిన యామెగర్భము తేజస్సులచే జాజ్వల్యమాన మయ్యెను. కశ్యపుడు భాస్కరవర్చస్వియగు నామూర్తింగని ప్రణతుడై యాదరముతో తొలిపల్కుల స్తుతించెను. అంతట నాగర్భాండము వెలువడి పద్మపత్రమట్టి యరుణ ప్రభల దీపించుచు నలుదెసలుద్దీపింప జేయుచునొకమూర్తి ప్రత్యక్షమయ్యెను. అవ్వల నంతరిక్షమునుండి యమ్మునిసత్తముం గూర్చి యశరీరవాణి సజలజలదగంభీరమ్ముగా నిట్లు పలికెను.

మారితం తే యతః ప్రోక్త మేత దండం త్వయా7దితేః|తస్మాన్మునే సుతస్తేయం మార్తండాఖ్యో భవిష్యతి 40

హనిష్య త్యసురాం శ్చాయం యజ్ఞభాగహరా నరీన్‌ | దేవా నిశ##మ్యేతి వచో గగనా త్సముపాగతమ్‌ || 41

ప్రహర్ష మతులం యాతా దానవాశ్చ హతౌజసః | తతో యుద్ధాయ దైతేయా నాఙుహావ శతక్రతుః || 42

సహదేవైర్ముదా యుక్తా దానవాశ్చ త మభ్యయుః | తేషాం యుత్ధ మభూ ద్ఘోరం దేవానా మసురైః సహ|| 43

శస్త్రాస్త్రవృష్టిసందీప్తసమస్తభువనా న్తరమ్‌ | తస్మి న్యుద్ధే భగవతా మార్తాండేన నిరీక్షితాః || 44

తేజసా దహ్యమానాన్తే భస్మీభూతాః మహాసురాః | తతః ప్రహర్ష మతులం ప్రాప్తాః సర్వేదివౌకసః || 45

తుష్టువు స్తేజసాం యోనిం మార్తాండ మదితిం తథా|స్వాధికారాం స్తతః ప్రాప్తా యజ్ఞభాగాంశ్చ పూర్వవత్‌|| 46

భగవానపి మార్తండ స్స్వాధికార మథా7కరోత్‌

కదంబ పుష్పవద్భాస్వా నధశ్చోర్ధ్వం చ రశ్మిభిః | వృతో7గ్నిపిండసదృశో దధ్రే నాతిస్ఫుటం వపుః || 47

తా|| ఈ యండము మారితమని నీవంటివి. ఓ కశ్యపు మునీంద్రా! అందువలన నీ మూర్తి మార్తండుడను బేరం బరగును. ఇతడు యజ్ఞభాగముల హరించుచున్న నసురులను సంహరించును. ఆ యాకాశవాణి వాణినాలించి గీర్వాణులు హర్షించిరి. దానవులు దిగులొందిరి. శతక్రతువంతట నసురుల యుద్ధమునకు పిలిచెను. మార్తాండునిచే జూడబడిన దానవుల్లెల నిస్తేజస్కులై దహింపబడి భస్మమైపోయిరి. దేవతలు మార్తాండుని పెక్కుభంగుల వినుతించిరి. నురలు మార్తండుడు స్వాధికారముం బడసి యజ్ఞభాగములందిరి. ఇనుండు క్రిందుమీదును దనకిరణములచే కడిమిపూవువలె భాసించుచు నగ్నిగోళమట్లు పెలుంగుచు నస్ఫుటమైనయాకారము దాల్చెను.

మునయః ఊచుః

కథం కాంతతరం పశ్చా ద్రూపం సంలబ్ధవా న్రవిః | కధంబగోళకాకారం తన్మే బ్రూహి జగత్పతే || 48

అంత మునులు కదంబముకుళమట్లెఱ్ఱగ కన్నెఱ్ఱయైన యమ్మూర్తి యెట్లు దర్శనీయమయ్యె నానతిమ్మన బ్రహ్మయిట్లనియె.

బ్రహ్మోవాచ

త్వష్టా తసై#్మ దదౌకన్యాం సంజ్ఞాంనామ వివస్వతే | ప్రసాద్య ప్రణతో భూత్వా విశ్వకర్మా ప్రజాపతిః || 49

త్రీణ్య పత్యా న్యసౌ తస్యాం జనయామాస గోపతిః | ద్వౌపుత్రౌ సుమహాభాగౌ కన్యాం చ యమునాం తథా || 50

యత్తేజో7భ్యధికం తస్య మార్తాండస్య వివస్వతః | తేనాతితాపయామాన త్రీన్లోకా న్సచరాచరాన్‌ || 51

తద్రూపం గోలకాకారం దృష్ట్వా సంజ్ఞా వివస్వతః|అసహంతీ మహత్తేజః స్వాం భాయాం వాక్య మబ్రవీత్‌ || 52

సంజ్ఞా ఉవాచ

అహం యాస్యామి భద్రంతే స్వమేవ భవనం పితుః| నిర్వికారం త్వయా7త్రైవ స్థేయం మచ్ఛాసనా చ్ఛుభే 53

మౌచ బాలకౌ మహ్యం కన్యాచ వరవర్ణినీ|సంభావ్యా నైవ చా77ఖ్యేయ మిదం భగవతే త్వయా || 54

ఛాయోవాచ

ఆకచగ్రహణా ద్దేవి ఆశాపా న్నైవ కర్హిచిత్‌ | ఆఖ్యాస్యామి మతం యత్తే గమ్యతాం యత్ర వాంఛితమ్‌ || 55

ఇక్కడ 49వ శ్లోకమునుండి 81వ శ్లోకమువరకు గల కథ ఈ పురాణములో నాఱవ యధ్యాయమునందు చూడవచ్చును. కావున నిచట తాత్పర్యము వ్రాయబడలేదు.

ఇత్యుక్తా వ్రీడితా సంజ్ఞా జగామ పితృమందిరమ్‌ | వత్సరాణాం సహస్రంతు వసమానా పితుర్గృహే | 56

భర్తుః సమీపం యాహీతి పిత్రోక్తా సాపునః పునః | ఆగచ్ఛ ద్వడబా భూత్వా కురూ నథోత్తరాం స్తతః || 57

తత్ర తేపే తపః సాధ్వీ నిరాహారా ద్విజోత్తమాః | పితుః సమీపం యాతాయాం సంజ్ఞాయాం వాక్యతత్పరా || 58

తద్రూపధారిణీ ఛాయా భాస్కరం సముపస్థితా | తస్యాం చ భగవాన్పూర్యః సంజ్ఞేయ మితి చిన్తయన్‌ || 59

తథైవ జనయామాస ద్వౌ పుత్రౌ కన్యకాం తథా | సంజ్ఞాతు పార్థివీ తేషా మాత్మజానాం తథా7కరోత్‌ || 60

స్నేహం నపూర్వజాతానాం తథా కృతవతీ తు సా | మనుస్త తాక్షంతవాం సస్యా యమసస్యా న చక్షమే || 61

బహుథా పీడ్యమానస్తు పితుః పత్న్యా సుదుఃఖితః | సవైకోపాచ్చ బాల్యాచ్చ భావినో7ర్థస్య వైబలాత్‌ ||

పదా సంతర్జయామాస నతు దేహే న్యపాతయత్‌ || 62

ఛాయోవాచ

పదా తర్జయసే యస్మా త్పితుర్భార్యాం గరీయసీమ్‌ | తస్మాత్తవైష చరణః పతిష్యతి న సంశయః || 63

బ్రహ్మోవాచ

యమస్తు తేన శాపేన భృశం పీడితమానసః | మనునా సహ ధర్మాత్మా పిత్రే సర్వం న్యవేదయత్‌ || 64

యమ ఉవాచ

స్నేహేన తుల్యమస్మాసు మాతా దేవ నవర్తతే | విసృజ్య జ్యాయసం భక్త్యా కనీయాంసం బుభూషతి || 65

తస్యాం మయోద్యతః పాదో నతు దేహే నిపాతితః || బాల్యాద్వా యది వా మోహా త్తద్భవాన్‌ క్షంతుమర్హసి|| 66

శప్తోహం తాత కోపేన జనన్యా తనయో యతః | తతో మన్యే న జననీ మిమాం వైతపతాంవర || 67

తవ ప్రసాదాచ్చరణో భగవ న్న పతేద్యథా | మాతృశాపాదయం మే7ద్య తథా చింతయ గోపతే || 68

రవిరువాచ

అసంశయం మహత్పుత్ర భవిష్యత్యత్ర కారణమ్‌ | యేన త్వామావిశ త్క్రోథో ధర్మజ్ఞం ధర్మశీలినమ్‌ || 69

సర్వేషామేవ శాపానాం ప్రతిఘాతో హి విద్యతే | నతు మాత్రాభిశప్తానాం క్వచిచ్ఛాపనివర్తనమ్‌ ||70

నశక్య మేతన్మిథ్యా తు కర్తుం మాతుర్వచ స్తవ | కించిత్తే7హం విథాస్యామి పుత్రస్నేహా దనుగ్రహమ్‌ || 71

కృమయో మాంసమాదాయ ప్రయాస్యంతి మహీతలమ్‌|కృతం తస్యా పచః సత్యం త్వంచత్రాతో భవిష్యసి || 72

బ్రహ్మోవాచ

ఆదిత్య స్త్వబ్రవీ చ్ఛాయాం కిమర్థం తనయేషువై | తుల్యేష్వ ప్యధికః స్నేహ ఏకం ప్రతి కృతస్త్వయా|| 73

నూనం నైషాం త్వం జసనీ సంజ్ఞా కా7పి త్వమాగతా | నిర్గుణష్వ ప్యపత్యేషు మాతా శాపం సదాస్యతి || 74

సా తత్పరిహరంతీ చ శాపాద్భీతా తదారవేః | కథయామాస వృత్తాంతం సశ్రుత్వా శ్వశురం య¸° || 75

సచాపి తం యథా న్యాయ మర్చయిత్వా తదా రవిమ్‌ | నిర్దగ్థుకామం రోషేణ సాంత్వయాన స్తమబ్రవీత్‌ || 76

విశ్వకర్మోవాచ

తవాతి తేజసా వ్యాప్తమిదం రూపం సుదుస్సహహ్‌ | అసహంతీ తు తత్సంజ్ఞా వనే చరతి వైతపః ||వ 77

ద్రక్ష్యతే తాం భవానద్య స్వాం భార్యాం శుభచారిణీమ్‌ | రూపార్థం భవతో7రణ్య చరంతీం సుమహత్తపః || 78

శ్రుతం మే బ్రహ్మణోవాక్యం తవతే జోవరోధనే | రూపం నివర్తయామ్యద్య తవ కాంతం దివస్పతే || 79

బ్రహ్మోవాచ

తతస్తధేతి తంప్రాహ త్వష్టారం భగవా న్రవిః | తతో వివస్వతో రూపం ప్రాగాసీ త్పరిమండలమ్‌ || 80

విశ్వకర్మా త్వనుజ్ఞాతః శాకద్వేపే వివస్వతా | భ్రమి మారోప్య తత్తేజః శాతనా యోపచక్రమే || 81

భ్రమతా7శేష జగతాం నాభి భూతేన భాస్వతా | సముద్రాద్రివనోపేతా త్వారురోహ మహీ నభః || 82

గగనం చాఖిలం విప్రాః సచంద్రగ్రహ తారకమ్‌ | అధోగతం మహాభాగా బభూవా77క్షిప్త మాకులం|| 83

విక్షిప్త సలిలాః సర్వే బభూవుశ్చ తథా7ర్ణవాః | వ్యభిద్యంత మహాశైలాః శీర్ణసానునిబంధనాః || 84

ధ్రువాధారాణ్యశేషాణి ధిష్ణ్యాని మునిసత్తమాః | త్రుట్యద్రశ్మినిబంధీని బంధనాని అధో యయుః || 85

వేగభ్రమణసంపాత వాయుక్షిప్తాః సహ్రస్రశః | వ్యశీర్యంత మహామేఘా ఘోరారావవిరావిణః 86

భాస్వద్‌ భ్రమణవిభ్రాంతభూమ్యాకాశరసాతలమ్‌ | జగదాకుల మత్యర్థం తదా77సీ న్మునిసత్తమాః || 87

త్రైలోక్య మాకులం వీక్ష్య భ్రమమాణం సురర్షయః | దేవాశ్చ బ్రహ్మణా సార్థం భాస్వంత మభితుష్టువుః || 88

ఆదిదేవో7సి దేవానాం జాతస్త్వం భూతయే భువః | సర్గస్థిత్యంతకాలేషు త్రిధా భేదేన తిష్ఠసి || 89

స్వస్తి తే7స్తు జగన్నాథ ఘర్మవర్ష దివాకర | ఇంద్రాదయస్తదా దేవా లిఖ్యమాన మథాస్తువన్‌ || 90

జయ దేవ జగత్‌స్వామిన్‌ జయాశేషజగత్పతే | ఋషయశ్చ తతః సప్త వశిష్ఠాత్రిపురోగమాః || 91

తుష్టువు ర్వివిధైః స్తోత్రైః స్వస్తిస్వస్తీతివాదినః | వేదోక్తిభి రథార్థ్యాభి ర్వాలఖిల్యాశ్చ తుష్టువుః || 92

అగ్నిరాద్యాశ్చ భాస్వంతం లిఖ్యమానం ముదాయుతాః | త్వం నాధ మోక్షిణాం మోక్షో ధ్యేయస్త్వం ధ్యానినాం పరః || 93

త్వం గతిః సర్వభూతానాం కర్మకాండ వివర్తినామ్‌ | సంపూజ్యస్త్వంతు దేవేశ శం నో7 స్తు జగతాం పతే|| 94

శం నో7స్తు ద్విపదే నిత్యం శం న శ్చాస్తు చతుష్పదే | తతో విద్యాధరగణా యక్షరాక్షసపన్నగాః || 95

కృతాంజలిపుటాః సర్వే శిరోభిః ప్రణతా రవిమ్‌ | ఊచుస్తే వివిధా వాచో మనఃశ్రోత్రసుఖావహాః || 96

సహ్యం భవతు తేజస్తే భూతానాం భూతభావన | తతో హాహాహూహూ శ్చైవ నారద స్తుంబరు స్తథా | 97

ఉపగాయితు మారబ్థా గాంధర్వకుశలా రవిమ్‌ | షడ్జమధ్యమ గాంధార గానత్రయవిశారదాః || 98

మూర్ఛనాభిశ్చ తాలైశ్చ సంప్రయోగైః సుఖప్రదమ్‌ | విశ్వాచీ చ ఘృతాచీ చ ఊర్వశ్యథ తిలోత్తమా || 99

మేనకా సహజన్యా చ రంభా చాప్సరసాం వరా | ననృతు ర్జగతా మీశే లిఖ్యమానే విభావసౌ || 100

భావ హాస విలాసాద్యా న్కుర్వత్యో7భినయాన్భహూన్‌ | ప్రవాద్యంత తత స్తత్ర వీణావేణ్వాదిఝర్ఝరాః|| 101

పణవాః వుష్కరాశ్చైవ మృదంగాః పటహానకాః ః దేవదుందుభయ శ్శంఖా శ్శతశో7థ సహస్రశః || 102

గాయద్భిశ్చైప నృత్యద్భి ర్గంధర్వై రప్సరోగణౖః | తూర్యవాదిత్ర ఘోషైశ్చ సర్వం కోలాహలీకృతమ్‌ || 103

తతః కృతాంజలిపుటా భక్తినమ్రాత్మమూర్తయః | లిఖ్యమానం సహస్రాంశుం ప్రణఘు స్సర్వ దేవతాః || 104

తతః కోలాహలే తస్మి న్సర్వదేవసమాగమే | తేజసః శాతనం చక్రే విశ్వకర్మా శ##నైః శ##సైః || 105

ఆజానులిఖిత శ్చాసౌ నిపుణం విశ్వకర్మణా | నాభ్యనందత్తు లిఖనం తత స్తేనావతారితః || 106

నతు నిర్భర్త్సితం రూపం తేజసో హననేనతు | కాంతా త్కాంతతరం రూప మధికం శుశుభే తతః || 107

ఇతి హిమజలఘర్మకాలహేతో ర్హరకమలాసనవిష్ణుసంస్తుతస్య|తదుపరి లిఖనం నిశమ్య భానోర్ర్వజతి దివాకర లోక మాయుషో7స్తే || 108

వం జన్మ రవేః పూర్వం బభూవ మునిసత్తమాః | రూవం చ పరమం తస్య మయా సంపరికీర్తితమ్‌ || 109

ఇతి శ్రీబ్రహ్మపురాణ మార్తండశరీరలిఖనంనామ ద్వాత్రింశో7ధ్యాయ.

82వ శ్లోకమునుండి తాత్పర్యము.

సర్వలోకములకు నాభిస్థానమైన సూర్యుడు తరణి పట్టునప్పుడు పరిభ్రమించుటవలన సముద్రములు పర్వతములు పనములతో గూడిన భూమి యాకాశమంటెను. చంద్రాదిగ్రహానక్షత్రసహితమైన యాకాశ##మెల్ల చిమ్మబడి వ్యాకులమై భూమికి దిగిపోయెను. సముద్ర జలము సంక్షోభించెను. చరియలు పగిలి మహాపర్వతములు బ్రద్దలై పోయెను. ధ్రువునాధారముగాగొన్న యఖిలజ్యోతిర్నివాసములు (లోకములు) రశ్మి (కిరణము శ్లేష రజ్జువు) బంధములు తెగి క్రిందబడినవి. చక్రభ్రమణవేగమున బుట్టిన వాయువులచే జెదరి మహామేఘములు గర్జిల్లుచు విడిపోయెను. సూర్యభ్రమణము వలన విక్షిప్తములైన భూమ్యాకాశ పాతాళ ప్రపంచము మిక్కిలి వ్యాకుల మయ్యెను. ఇట్లు ముల్లోక మాకులమగుటగని బ్రహ్మతోగూడ దేవతలు భాస్కరు నిట్లు స్తుతించిరి.

- సూర్యభగవత్త్సుతి -

దేవతలకాదిదేవుడవై యావిర్బవించితివి. భూమియొక్క విభూతికెల్ల నీవాధారము. నీవే సృష్టిస్థితిలయకార్యము లందు ముమ్మూర్తు లగుదువు. జగత్పతీ నీకు మంగళమగుగాక! నీవు తాపమువర్షింతువు. జగత్‌పతీ! జయము జయమని యింద్రాదులు సప్తర్షులు వివిధ స్తోత్రములచే వాలఖిల్యాదులు వేదసూక్తములచే స్తుతించిరి. దేవతలకెల్ల మొదటివాడు (దేవతలకు ముఖస్థానీయుడు) అగు నగ్ని భగవానుడు సంతోషముతో తరణిబట్టు బడుచున్న తరణిని నాథ! మోక్షమందినవారికి నీవు మోక్షస్వరూపుడవు. ధ్యాననిష్ఠులకు పరమ ధ్యేయమైన వస్తువవు. సర్వభూతములకు నీవు పరమగతివి. కర్మకాండ ప్రవర్తనులకు నీవే గతివి. పూజ్యుడవు. దేవేశ! మాకు శం = సుఖము అస్తు = కలుగుగాక! ద్విపదే = రెండు పాదాలుగల జీవకోటికి మాకు సుఖమగుత. చతుష్పదే. నాలుగు పాదములు గలపశుజాతికు సుఖమగుగాక అని వేదసూక్తార్ధములతో విద్యాధర గణములు యక్షరాక్షసనాగకులములు తలలు వంచి చేతులు జోడించి మనసునకును వీనులకును నింపుగ స్తుతులం బలికిరి. సర్వభూతాధార నీ తేజస్సు భూతజాలము సహింపగలదగుగాక! అవ్వల హాహా హూహూ నామకగంధర్వులు నారద తుంబురులు షడ్జమధ్యకుమగాంధారరూప గానత్రయ విశారదులు గావున సూర్య పరమాత్మను గాంధర్వ విధితో సంకీర్తనము సేయ నారంభించిరి.

తానమూర్ఛనాది వివిధసంగీతప్రయోగములచే బహుసుఖముగ వారు పాడిరి. విశ్వాచి ఘృతాచి ఊర్వశి తిలోత్తమ మేనక సహజన్య రంభ మొదలైన యప్సర స్త్రీమణులు నర్తనము సేసిరి. హావభావవిలాసములచే సభినయించిరి. వీణావేణుమృదంగఝర్ఝరపణవపుష్కరపటహ ఆనక దేవదుందుభిశంఖాదివివిధ వాద్యములు శతముసహస్రముల మ్రోయించిరి. పాటలుపాడుగంధర్వులచే నాటలాడు నప్సరోగణములచే తూర్యవాదిత్రఘోషములచే సర్వ కోలాహల మయ్యెను. ఆసమయమున వేల్ఫులెల్లరు జేతులు మొగిచి భక్తితో వంగి సహస్రాంశునకు బ్రణామములు సేసిరి.

అంతట సర్వస్వర్గసమావేశమునం దాకోలాహలమందు విశ్వకర్మ (దేవశిల్పి) మెలమెల్లన రవిబింబమును యంత్ర మెక్కించి చెక్కనారంభించెను. ఆయనచే భానుడాజానువుగ (మోకాళ్ళ దనుక) నిపుణముగ లేఖనము సేయబడి తసయభినందనము లేనందున యంత్రమునుండి దింపబడెను. తేజోహానివలనగలిగిన రూపమును నిషేధింపలేదు. అందువలన నాయన రూపము చక్కనివానికెల్ల చక్కనిదై మిక్కిలి శోభించెను. హేనుంతవర్షగ్రీష్మ ఋతువులకు హేతువైన వాడును త్రిమూర్తులచే స్తుతింపబడువాడునగు భానుమూర్తియొక్క ఈ స్వరూపతక్షణములు (చెక్కుటను) విన్న యాతడు ఆయుస్సమాప్తిలో సూర్యసాలోక్యము నందును. ఓ మునిసత్తములార! సూర్యునిజన్మవృత్తాంతము ఆయనపరమోత్తమ రూపమును నేను సంకీర్తించితిని.

ఇది శ్రీబ్రహ్మపురాణమునందు ''మార్తాండశరీరలిఖనము'' అను ముప్పదిరెండవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters