Brahmapuranamu    Chapters   

షడ్వింశో7 ధ్యాయః

స్వయంభూ బ్రహ్మర్షి సంవాదః

మునయః ఊచుః -

పృథివ్యా ముత్తమాం భూమిం ధర్మకామార్థమోక్షదామ్‌ | తీర్థానా ముత్తమం తీర్థం బ్రూహీ నో వదతాం వర || 1

లోమహర్షణ ఉవాచ -

ఇమం ప్రశ్నం మమగురుం పప్రచ్ఛు ర్మునయః పురా|తమహం సంప్రవక్ష్యామి యత్పృచ్ఛద్వం ద్విజో త్తమాః 2

ప్రవచననిపుణా! పృథివియందుత్తమ మయినది ధర్మార్థకామమోక్షముల నొసంగునదియగు భూమిని తీర్థములకెల్ల నుత్తమ తీర్థమును వెల్పుమని మునులడుగ సూతుడిట్లు చెప్పదొడంగె, మున్ను మును లీప్రశ్నమును మాగురువుల నడిగిరి.

స్వాశ్రమే సుమహాపుణ్య నానాపుష్పోపశోభితే | నానాద్రుమ లతా కీర్ణే నానామృగగణౖర్యుతే || 3

పున్నాగై ః కర్ణికారైశ్చ సరలై ర్ధేవదారుభిః | శాలైస్తాలైప్తమాలైశ్చ పనసై ర్ధవ ఖాదిరైః || 4

పాటలాశోక వకులై ః కరవీరై ః స చంపకై|| అసైశ్చ వివిధైర్వృక్షైః నానాపుష్పోపశోభితై ః || 5

కురుక్షేత్రే సమాసీనం వ్యాసం మతి మతాం వారమ్‌ | మహా భారత కర్తారం సర్వశాస్త్రవిశారధమ్‌ || 6

ఆధ్యాత్మనిష్ఠం సర్వజ్ఞం సర్వభూతహితేరతమ్‌ | పురాణాగమవక్తారం వేదవేదాంగపారగమ్‌ || 7

పరాశరసుతం శాంతం పద్మపత్రాయతేక్షణమ్‌ | ద్రష్టు మభ్యాయయుః ప్రీత్యా మునయః సంశిత వ్రతాః || 8

కశ్యపో జమదగ్నిశ్చ భరద్వాజో7థ గౌతమః | వశిష్ఠో జైమిని ర్థౌమ్యో మార్కండేయోథ నాకుజః || 9

విశ్వామిత్రః శతానందో వాత్స్యో గార్గ్యో7థ అసురిః | సుమంతు ర్భార్గవోనామ కణ్వో మేథాతిథిర్గురుః || 10

మాండవ్య శ్చ్యవనో ధూమ్రో హ్యసితో దేవలస్తథా | మౌద్గల్య స్తృణయజ్ఞశ్చ పిప్పలాదో7కృత వ్రణః || 11

సంవర్తః కౌశికో రై భ్యో మైత్రేయో హరిత స్తధా || 12

శాండిల్యశ్చ విభాండశ్చ దుర్వాసా లోమశ స్తధా | నారదః పర్వతశ్చైవ వైశంపాయనగాలవౌ || 13

భాస్కరిః పూరణః సూతః పులస్త్యః కపిల స్తధా | ఉలూకః పులహో వాయు ర్దేవస్థాన శ్చతుర్భుజః|| 14

సనత్కుమారః పైలశ్చ కృష్ణః కృష్ణానుభౌతికః | ఏతై ర్మునివరైశ్చాన్యై ర్వృత స్సత్యవతీసుతః 15

రరాజ సమునిః శ్రీమా న్నక్షత్రైరివ చంద్రమాః | తా నాగతా న్మునీ న్సర్వా న్పూజయామాస వేదవిత్‌ || 16

తే7పి తం ప్రతిపూజ్యైవ కథాం చక్రుః పరస్పరం | కథాంతే తే మునిశ్రేష్ఠాః కృష్ణం సత్యవతీసుతమ్‌ || 17

పప్రచ్చుః సంశయం సర్వే తపోవననివాసినః |

కురుక్షేత్రమున నానాతరులతాపుష్పఫలోపశోభితమైన తన యాశ్రమమునం దాసీనుడైయున్న మహాభారతకర్తను సర్వశాస్త్ర విశారదుని ఆధ్యాత్మనిష్ఠుని సర్వజ్ఞుని స్వభూతహితాభిరతుని పురాణాగమనక్తను వేదవేదాంగపారగుని శాంతుని మతిమంతులకెల్ల సగ్రేసరుని పద్మపత్రాయతేక్షణుని శ్రీ వేదవ్యాసుని దర్శించువేడుకతో నిశితవ్రతపరాయణులైన మునులేతెంచిరి. ఆ వచ్చినవారు కశ్యపుని మొదలు కృష్ణానుభౌతుకునిదాకగల పేర్లవారు. నక్షత్రములలో చంద్రునివలె వారిలో పరాశరసూనుడు శ్రీమంతుడు వ్యాసుడు మిక్కిలిగా దేజరిల్లెను. వేదవేత్తయగు సమ్ముని యా మునివరులను బూజించెను. వారును నతనికి ప్రతిపూజసల్పి కుశల ప్రశ్నములయిన తరువాత సాత్యవతేయునిట్లడిగిరి.

మునయఊచుః

మునే వేదాంశ్చ శాస్త్రాణి పురాణాగమభారతమ్‌ | భూతం భవ్యం భవిష్యంచ సర్వం జానాసి వాజ్మయమ్‌ || 18

కష్టే7స్మి న్దుఃఖబహుళే నిస్పారే భవసాగరే | రాగగ్రహాకులే రౌద్రే విషయోదకసంప్లవే || 19

ఇంద్రియావర్తకలితే తృష్టోర్మిశతవంకులే | మోహపంకావిలే దుర్గే లోభగంభీరదుస్తరే||

లోభగంభీరదుస్తరే || 20

నిమజ్జ జ్జగ దాలోక్య నిరాలంబ మచేతనమ్‌ | పృచ్ఛామ స్త్వాం మహాభాగం బ్రూహివో మునిసత్తమ || 21

శ్రేయః కిమత్ర సంసారే భైరవే లోమహర్షణ | ఉపదేశ ప్రదానేన లోకా నుద్ధర్తు మర్హసి || 22

దుర్లభం పరమంక్షేత్రం వక్తు మర్హసి మోక్షదమ్‌ | పృథివ్యాం కర్మభూమించశ్రోతు మిచ్ఛామహే వయమ్‌ || 23

కృత్వా కిల నర స్సమ్య క్కర్మభూమౌ యథోదితమ్‌ | ప్రాప్నోతి పరమాం సిద్ధిం నరకం చ వికర్మతః | 24

మోక్షక్షేత్రే తథా మోక్షం ప్రాప్నోతి పురుష స్సుధీః| తస్మా ద్భ్రహి మహా ప్రాజ్ఞయత్పృష్టో7సి ద్విజోత్తమః | 25

శ్రుత్వాతు వచనం తేషాం ముసీనాం భావితాత్మనామ్‌ | వ్యాసః ప్రోవాచ భగవా న్భూతభవ్యభవిష్యవిత్‌ || 26

ఓ మునివరా! వేదశాస్త్ర పురాణాగమాదిసర్వసారస్వతమును భూత భవిష్యద్వర్త మానములను నెరుంగుదువు. మునిసత్తమా! రాగమును మొసళ్ళు విషయములను నుప్పునీరు ఇంద్రియములను సుళ్ళు గలిగి దురాశయను కెరటముల నిండి లోభగంభీరము దుస్తరము మోహమును రొంపియుగల్గి దుఃఖబహుళము కష్టతరము నిస్సారమైన సంసారసాగరమందు మునిగి నిరాలంబమైయచేతనమై యున్న జగత్తును జూచి మహానుభావుడవగు నిన్నడుగు చున్నాము. ఈ భయంకర సంసారమందేది సాధింపవలె? ఏది శ్రేయస్సాధనము? ఉపదేశించి జగముల నుద్ధరింపుము. ఈ యవనియందు దుర్లభము మోక్షదమునైన పవిత్రక్షేత్రమును చెప్పడు. ఈ మేదినియందు గర్మభూమి యేదియో నీ వలన వినదలచితిని. కర్మభూమియందు నరుడు యధావిధిగా గర్మ మొనరించి పరమసిద్ధిని బొందును. వికర్మవలన నరకమును బొందును. మోక్షభూమియందు మోక్షమందును గావున మాకీ విషయములు వినిపింపుమన, త్రికాలజ్ఞుడగు వ్యాసమహర్షి వారి కిట్లానతిచ్చెను.

వ్యాస ఉవాచ -

శృణుధ్వం మునయ స్సర్వే వక్ష్యామి యది పృచ్ఛత|యః సంవాదో 7భవ త్పూర్వ మృషీణాం బ్రహ్మణాసహ|| 27

మేరుపృష్టే తు విస్తీర్ణే నానారత్న విభూషితే | నానాద్రుమలతాకీర్ణే నానాపుషోపశోభితే || 28

నానాపక్షిరుతే రమ్యే నానాప్రసవణాకులే| నానా నత్త్వసమాకీర్ణే నానాశ్చర్యసమన్వితే || 29

నానావర్ణ శిలాకీర్ణే నానాధాతువిభూషితే | నానాసత్వసమాకీర్ణే నానాశ్రమసమన్వితే || 30

తత్రా77 సీనం జగన్నాథం జగద్యోనిం చతుర్ముఖం | జగత్పతిం జగద్వంద్యం జగదాధార మీశ్వరమ్‌ || 31

దేవదానవగధరెవ్య ర్యక్షవిద్యాధరోరగైః | మునిసిధ్ధాప్సరోభిశ్చ వృత మన్యై ర్దివాలయైః || 32

కేచిత్త్సువంతి తం దేవం కే చిద్గాయంతి చాగ్రతః | కేచి ద్వాద్యాని వాద్యంతే కేచి న్నృత్యంతి చాపరే || 33

ఏవం ప్రముదితే కాలే సర్వభూత సమాగమే | నానాకుసుమ గంధాడ్యే దక్షిణానిలసేవితే || 34

భృగ్వా ద్యాస్తం తదాదేవం ప్రణిపత్య పితామహమ్‌ | ఇమమర్థ మృషివరాః పప్రచ్చుః పితరం ద్విజాః || 35

మున్ను మేరుపృష్టమందు నానారత్నద్రుమలతాకుసుమపల్లవ లలితమై నానామృగఖగకలకలమై నానావర్ణ శిలాధాతు రంజితమై నానా మునిజనాశ్రమ సమన్వితమై రమ్యమునైన ప్రదేశమునందా సీనుడైయున్నవాడు.

ఋషయః ఊచుః

భగవన్‌శ్రోతు మిచ్ఛామః కర్మభూమిం మహీతలే | వక్తుమర్హసి దేవేశ మోక్ష క్షెత్రంచ దుర్లభమ్‌ || 33

తేషాం వచన మాకర్ణ్య ప్రాహ బ్రహ్మా సురేశ్వరః | పప్రచ్ఛుస్తే యథా ప్రశ్నం తత్సర్వం మునిసత్తమా ః 34

ఇతి శ్రీబ్రహ్మపురాణ స్వయంభు బ్రహ్మర్షి సంవాదే షడ్వింశోధ్యాయః.

జగన్నాథుడు, జగద్యోని, చతుర్ముఖుడు, జగన్నాథుడు, జగద్వంద్యుడు జగదాధారుడు ఈశ్వరుడు, జగత్పతి, దేవదానవాదులచే వివిధ రీతుల సేవింపబడుచున్న బ్రహ్మను భృగ్వాది మునులు దర్శించి మ్రొక్కి యిదే యంశము నడిగిరి.

భగవంతుడా| భూతలమున కర్మభూమిని దుర్లభ##మైన మోక్ష ప్రదక్షేత్రమును తెలుపుడనగా సురేశ్వరుండిట్లు తెలుపబూనెను.

ఇది బ్రహ్మ పురాణమున స్వయంభు బ్రహ్మర్షి సంవాదమును ఇరువది యాఱవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters