Brahmapuranamu    Chapters   

అథ పంచవింశో7ధ్యాయః

సర్వతీర్థమాహాత్మ్యమ్‌

మునయః ఊచుః-

పృథివ్యాం యాని తీర్థాని పుణ్యా న్యాయతనానిచ | వక్తు మర్హసి ధర్మజ్ఞ శ్రోతుం నో వర్తతే మనః || 1

లోమహర్షణ ఉవాచ-

యస్య హస్తౌచ పాదౌచ మనశ్చైవ సుసంయతమ్‌ | విద్యా తపశ్చ కీ ర్తిశ్చ స తీర్థఫల మశ్నుతే || 2

మనో విశుద్ధం పురుషస్య తీర్థం వాచాం తథా చేంద్రియనిగ్రహశ్చ |

ఏతాని తీర్థాని శరీరజాని స్వర్గస్య మార్గం ప్రతిబోధయంతి || 3

చిత్త మంతర్గతం దుష్టం తీర్థస్నానైర్నశుధ్యతి | శతశో7పి జలై ర్ధౌతం సురాభాండమివాశుచి || 4

న తీర్థాని న దానాని న వ్రతాని న చా77శ్రమాః | దుష్టాశయం దంభరుచిం పునంతి వ్యుత్థితేంద్రియమ్‌ || 5

ఇంద్రియాణి వశే కృత్వా యత్రయత్ర వసేన్నరః | తత్ర తత్ర కురుక్షేత్రం ప్రయాగం పుష్కరం తథా 6

తస్మాచ్ఛృణుధ్వం వక్ష్యామి తీర్థా న్యాయతనానిచ | సంక్షేపేణ మునిశ్రేష్ఠాః పృథివ్యాం యాని కానివై || 7

మును లిట్లనిరి. ధర్మజ్ఞా| భూమియం దెన్ని పుణ్యతీర్థములు క్షేత్రములునున్నవో వినవలతు మెఱింగింపుము!

సూతుడిట్లనియె. ఎవనిచేతులు పాదములు మనస్సు స్వాధీనములు చేయబడునో, జ్ఞానము తపస్సు కీర్తియు నెవ్వనికి గల్గునో ఆతడు సర్వతీర్థముల సేవించిన ఫలమందును. ఎవని మనస్సు మాట, ఇంద్రియములు పరిశుద్ధములో అవి వానిశరీర మందున్న తీర్థములే, అవి స్వర్గమార్గమును జూపగలవు. అంతఃకరణము దుష్టమైనయెడల తీర్థములందెన్నింట మునిగినను ఆశుచియైన కల్లుకుండ నూరుమారులు నీటగడగినను శుచిగానట్లు పరిశుద్ధము గానేరదు. తీర్థములు దానములు వ్రతములు ఆశ్రమములు దుస్స్వభావుని దాంభికుని విశృంఖల నంచారములయినయింద్రియములుగలవానిని బవిత్రుని జేయలేవు. ఇంద్రియముల నొదిగించికొని మనుజు డెందెందున్నను అదియది వానికి కురుక్షేత్రము ప్రయాగ పుష్కరమును. కావున భూమింగల తీర్థ క్షేత్రములనుగురించి క్లుప్తముగ దెల్పెదను వినుడు.

విస్తరేణ నశక్యంతే వక్తుం వర్షశ##తైరపి | ప్రథమం పుష్కరం తీర్థం నై మిశారణ్యమేవచ || 8

ప్రయాగంచ ప్రవక్ష్యామి ధర్మారణ్యం ద్విజో త్తమాః | ధేనుకం చంపకారణ్యం సైంథవారణ్య మేవచ || 9

పుణ్యంచ మగధారణ్యం దండకారణ్యమేవచ | గయా ప్రభాసం శ్రీ తీర్థం దివ్యం కనఖలం తథా || 10

భృగుతుంగం హిరణ్యాక్షం భీమారణ్యం కుశస్థలీ | లోహాకులం సకేదారం మందరారణ్యమేవచ || 11

మహాబలం కోటితీర్థం సర్వపాపహరం తథా | రూపతీర్థం శూకరవం చక్రతీర్ధం మహాఫలమ్‌ || 12

యోగతీర్ధం సోమతీర్థం తీర్థం సాహోటకం తధా | తీర్థం కోకాముఖం వుణ్యం బదరీశైలమేవచ || 13

సోమతీర్థం తుంగకూటం తీర్థం స్కందాశ్రమంతథా | కోటితీర్థం చాగ్నిపదం తీర్థం పంచశిఖం తథా || 14

ధర్మోధ్భవం కోటి తీర్ధం తీర్ధం బాధప్రయోచనమ్‌ | గంగాద్వారం పంచకూటం మధ్య కేసర మేవచ || 15

చక్రప్రభం మతంగం చ కృశదండంచ విశ్రుతమ్‌ | దంష్ట్రాకుండం విష్ణుతీర్ధం సార్వకామిక మేవచ || 16

తీర్ధం మత్య్సతిలం చైవ బదరీ సుప్రభం తథా | బ్రహ్మకుండం వహ్ని కుండం తీర్ధం సత్యపథం తథా || 17

చతుఃస్రోతశ్చతుఃశృంగం శైలం ద్వాదశధారకమ్‌|మానసం స్థూలశృంగంచ స్థూలదండం తథోర్వశీ || 18

లోకపాలం మనువరం సోమాహ్వం శైలమేవచ | సదాప్రభం మేరుకుండం తీర్ధం సోమాభిషేచనమ్‌ || 19

మహాస్రోతం కోటరకం పంచధారం త్రిధారకమ్‌ | సప్తధారైకధారంచ తీర్థం చామరకంటకమ్‌ || 20

శాలగ్రామం చక్రతీర్ధం కోటిద్రుమ మనుత్తమమ్‌| బిల్వప్రభం దేవహ్రదం తీర్ధం విష్ణుహ్రదం తథా || 21

శంఖప్రభం దేవకుండం తీర్ధం పజ్రాయుధం తథా | అగ్నిప్రభంచ పున్నాగం దేవప్రభ మనుత్తమమ్‌ || 22

విద్యాధరం సగాంధర్వం శ్రీతీర్ధం బ్రహ్మణోహ్రదమ్‌ | సాతీర్ధం లోకపాలాఖ్యం మణిపూరగిరిం తథా || 23

తీర్ధం పంచహ్రదం చై వ పుణ్యం పిండారకం తథా | మాలవ్యం గోప్రభావంచ గోవరం వటమూలకమ్‌ || 24

స్నానదండం ప్రయాగంచ గుహ్యం విష్ణుపదం తథా|కన్యాశ్రమం వాయుకుండం జంబూమార్గం తథోత్తమమ్‌ || 25

గభ స్తితీర్ధం చ తథా యయాతిపతనం శుచి| కోటితీర్ధం భద్రవటం మహాకాలవనం తథా || 26

నర్మదాతీర్ధమపరం తీర్ధవజ్రం తథా7ర్బుదమ్‌ | పింగుతీర్ధం సవాశిష్ఠం తీర్ధంచ పృథుసంగమమ్‌ || 27

తీర్ధం దౌర్వాసికం నామ తథా పింజరకం శుభమ్‌ | ఋషితీర్ధం బ్రహ్మతుంగం వసుతీర్ధం కుమారికమ్‌ || 28

శక్రతీర్ధమ్‌ పంచనదం రేణుకాతీర్ధమేవ చ | పై తామహం చ విమలం రుద్రపాదమ్‌ తథో త్తమమ్‌ || 29

మణిమత్తంచ కామాఖ్యం కృష్ణతీర్ధం కుశావిలమ్‌ | యజనం యాజనంచైవ తథైవ బ్రహ్మవాలుకమ్‌ || 30

పుష్పన్యాసం పుండరీకం మణిపూరం తథోత్తమమ్‌ | దీర్ఘసత్రం హయపదం తీర్ధం చానశనం తథా || 31

గంగోద్భేదం శివోద్భేదం నర్మదోద్భేదమేవ చ | వస్త్రాపదం దారుబలం ఛాయారోహణ మేవ చ || 32

సిద్ధేశ్వరం మిత్రబలం కాళికాశ్రమ మేవ చ | వటావటం భద్రవటం కౌశాంబీ చ దివాకరమ్‌ || 33

ద్వీపం సారస్వతం చైవ విజయం కామదం తధా | రుద్రకోటిం సుమనసం తీర్థం సద్రావనామితమ్‌ || 34

శ్యమంతపంచకం తీర్థం బ్రహ్మతీర్థం సుదర్శనమ్‌| సతతం పృథివీసర్వం పారిప్లవ పృధూదకౌ || 35

దశాశ్వమేధికం తీర్ధం సర్పిజం విషయాంతికమ్‌ | కోటితీర్ధం పంచనదం వారాహం యక్షిణీహ్రదమ్‌ || 36

పుండరీకం సోమతీర్ధం ముంజవాటం తధోత్తమమ్‌ | బదరీవన మాసీనం రత్నమూలక మేవచ || 37

లోకద్వారం పంచతీర్ధం కపిలాతీర్ధ మేవచ | సూర్యతీర్ధం శంఖినీ చ గవాం భవనమేవచ || 38

తీర్ధంచయక్షరాజస్య బ్రహ్మావర్తం సుతీర్ధకమ్‌ | కామేశ్వరం మాతృతీర్ధం తీర్ధం శీతవనం తధా || 39

స్నానలోమాపహం చైవ మాససంసరకం తథా | దశాశ్వమేధం కేదారం బ్రహ్మోదుంబర మేవచ || 40

సప్తర్షికుండం చ తథా తీర్ధం దేవ్యాః సజంబుకమ్‌ | ఈ హాస్పదం కోటికూటం కిందానం కింజపం తథా || 41

కారండవం చావేథ్యంచ త్రివిష్టప మథా పరమ్‌ | పాణిఖాతం మిశ్రకం చ మధూవటమనోజవౌ || 42

కౌశికీ దేవతీర్ధం చ తీర్ధం చ ఋణమోచనం | దివ్యం చ నృగధూమాఖ్యం తీర్ధం విష్ణుపదం తధా || 43

అమరాణాంహ్రదం వుణ్యం కోటి తీర్ధం తధా7వరమ్‌| శ్రీకుంజం శాలితీర్ధంచ నైమి శేయంచ విశ్రుతమ్‌ 44

బ్రహ్మస్థానం సోమతీర్ధం కన్యాతీర్ధం తధైవ చ | బ్రహ్మతీర్ధం మనస్తీర్ధం తీర్ధం వై కారుపావనమ్‌ || 45

సౌగంధిరవనం చైవ మణితీర్థం నరస్వతీ | ఈ శానతీర్థం ప్రవరం పావనం పాఞ్చయజ్ఞికమ్‌ || 46

త్రిశూలధారం మాహేంద్రం దేవస్ధానం కృతాలయం | శాకంభరీ దేవతీర్ధం సువర్ణాక్షం కలిహ్రదం || 47

క్షీరస్రవం విరూపాక్షం భృగుతీర్థం కుశోద్బవం | బ్రహ్మతీర్థం బ్రహ్మయోనిం నీలపర్వత మేవచ || 48

కుబ్జాంబకం భద్రవటం వశిష్ఠపదమేవచ | స్వర్గద్వారం ప్రజాద్వారం కాలికాశ్రమ మేవచ || 49

రుద్రావర్తం సుగంధాశ్వం కపిలావన మేవచ | భద్రకర్ణహ్రదం చైవ శంకుకర్ణహ్రదం తథా || 50

సప్తసారస్వతం చైవ తీర్థ మౌశనసం తథా | కపాలమోచనం చైవ అవకీర్ణంచ కామ్యకమ్‌ || 51

చతుస్సాముద్రికం చైవ శతకం చ సహస్రకమ్‌ | రేణుకమ్‌ పంచవటకం విమోచన మధౌజసమ్‌ || 52

స్ధాణుతీర్థం కురోస్తీర్థం స్వర్గద్వారం కుశధ్వజమ్‌ | విశ్వేశ్వరం మానవకం కూపం నారాయణాశ్రయమ్‌ || 53

గంగాహ్రదం వటం చైవ బదరీపాటనం తథా | ఇంద్ర మార్గ మేకరాత్రం క్షీరకావాస మేవచ || 54

సోమతీర్థం దధీచం చ శ్రుతతీర్థం చ భో ధ్విజాః | కోటి తీర్థ స్ధలీం చై వ భద్రకాళీహ్రదం తథా || 55

అరుంధతీవనం చైవ బ్రహ్మావర్తం తథో త్తమమ్‌ | అశ్వవేదీ కుబ్చావనం యమునాప్రాభవమ్‌ తధా || 56

వీరప్రమోక్షం సింధూత్థ మృషికుల్యా సకృత్తికమ్‌ | ఉర్వీసంక్రమణం చైవ మాయావిద్యోద్భవం తథా || 57

బాహుతీర్ధం చారునదం విమలాశోక మేవచ | మహాశ్రమో వై తసికారూపం సుందరికాశ్రమం |

తీర్థం పంచనదం చైవ మార్కండేయస్య ధీమతః || 58

సోమతీర్థం సితోదంచ తీర్థం మత్స్యోదరీ తధా | సూర్యప్రభం నూర్యతీర్థ మశోకవన మేవచ || 59

అరుణాస్పదం కామదంచ శుక్రతీర్థం సవాలుకమ్‌ | పిశాచమోచనం చైవ సుభద్రాహ్రద మేవచ || 60

కుండం విమల దండస్య తీర్థం చండేశ్వరస్యచ | జ్యేష్ఠస్థాన హ్రదం చైవ పుణ్యం బ్రహ్మసరం తధా || 61

జై గీషవ్యగుహా చైవ హరికేశవనం తథా | 62

ఆజాముఖసరం చైవ ఘంటాకర్ణహ్రదం తధా | పుండరీకహ్రదంచైవ వాపీ కర్కోటకస్యచ || 63

సుపర్ణస్యోదపాసం చ శ్వేతతీర్థహ్రదం తధా | కుండం ఘర్ఘరికాయాశ్చ శ్యామాకూపం చ చంద్రికా || 64

శ్మశానస్తంభకూపంచ వినాయకహ్రదం తధా | కూపం సింధూద్భవం చైవ పుణ్యం బ్రహ్మసరం తథా || 65

రుద్రవాసం తధా తీర్థం నాగతీర్థం పులోమకం | భక్త హ్రదం క్షీరసరః ప్రేతాధారం కుమారకమ్‌ || 66

బ్రహ్మావ ర్తం కుశావ ర్తం దధికర్ణోదపానకమ్‌ | శృంగతీర్థం మహాతీర్థం తీర్థశ్రేష్ఠా మహానదీ || 67

దివ్యం బ్రహ్మసరం పుణ్యం గయాశీర్షాక్షయం వటం | దక్షిణం చోత్తరం చై వ గోమయం రూపశీతికమ్‌ || 68

కపిలాహ్రదం గృద్రవటం సావిత్రీహ్రదమేవచ | ప్రభాసనం సీతవనం యోనిద్వారంచ ధేనుకమ్‌ || 69

ధస్యకం కోకిలాఖ్యం చ మతంగహ్రద మేవచ | పితృకూపం రుద్రతీర్ధం శక్రతీర్థం సుమాలినమ్‌ || 70

బహ్మస్థానం సప్తకుండం మణిరత్న హ్రదం తథా | కౌశిక్యం భరతంచై వ తీర్థం జ్యేష్టాలికా తథా || 71

విశ్వేశ్వరం కల్పసరః కన్యాసంవేద్య మేవచ | నిశ్చీవా ప్రభవశ్చైవ వశిష్ఠాశ్రమ మేవచ || 72

దేవకూటం చ కూపం చ వశిష్ఠాశ్రమ మేవచ | వీరాశ్రమం బ్రహ్మసరో బ్రహ్మవీరావకాపిలీ || 73

కుమారధారా శ్రీధారా గౌరీశిఖర మేవచ | శునఃకుండో7ధ తీర్థంచ నందితీర్ధం తథై వచ || 74

కుమారవాసం శ్రీ వాస మౌర్వశీతీర్థమేవచ | కుంభకర్ణహ్రదశ్చైవ కౌశికీహ్రద మేవచ || 75

ధర్మతీర్ధం కామతీర్ధం తీర్ధ ముద్దాలకం తథా | సంధ్యాతీర్ధం కారతోయం కపిలం లోహితార్ణవమ్‌ || 76

శోణోద్భవం వంశగుల్మ మృషభం కలతీర్ధకం | పుణ్యావతీహ్రదమ్‌ తీర్థం తీర్థం బదరికాశ్రమమ్‌ || 77

రామతీర్ధం పితృవనం విరజాతీర్థ మేవచ | మార్కండేయవనం చైవ కృష్ణతీర్ధం తథావటమ్‌ || 78

రోహిణీకూపప్రవర మింద్ర ద్యుమ్నసరంచ యత్‌ | సానుగర్తం సమాహేంద్రం శ్రీతీర్ధం శ్రీసదం తథా || 79

ఇషుతీర్ధం వార్షభంచ కావేరీహ్రదమేవచ | కన్యాతీర్ధం చ గోకర్ణం గాయత్రీ స్థానమేపచ || 80

బదరీహ్రద మన్యచ్చ మధ్యస్ధానం వికర్ణకమ్‌ | జాతీహ్రదమ్‌ దేవకూపం కుశప్రవణ మేవచ || 81

సర్వదేవవ్రతం చైవ కన్యాశ్రమ హ్రదం తథా | తధా7స్య ద్వాలఖిల్యానాం నపూర్వాణాం తధాపరమ్‌ || 82

తథా7స్యచ్చ మహర్షీనా మఖండిత హ్రదం తథా | తీర్ధే ష్వేతేషు విధివ త్సమ్యక్‌ శ్రద్ధాసమన్వితః || 83

స్నానం కరోతి యో మర్త్యః సోపవాసో జితేంద్రియః|దేవా నృషీ న్మనుషాంశ్చ పితౄన్సంతర్ప్యచక్రమాత్‌ || 84

ఆభ్యర్చ్య దేవతా స్తత్ర స్థత్వా చ రజనీత్రయమ్‌ | పృథక్పృధక్ఫలం తేషు ప్రతి తీరేషు భోద్విజాః || 85

ప్రాప్నోతి హయమేథస్య నరో నాస్త్యత్ర సంశయః|య స్త్విదం శృణుయాన్నిత్యంతీర్ధమహాత్మ్య ముత్తమమ్‌ || 86

పఠేచ్చ శ్రావయేధ్వాపి సర్వపాపై ః ప్రముచ్యతే || 87

ఇతి శ్రీబ్రహ్మ పురాణ ఋషిసంవాదే సర్వతీర్ధ మాహాత్మ్య వర్ణనం నామ పంచవింశో7ధ్యాయః

బ్రాహ్మణులారా !

మొదటిది పుష్కరతీర్థము. నైమిశారణ్యము ప్రయాగ ధర్మారణ్యము ధేనుకము చంపకారణ్యము సైంధవారణ్యము పవిత్రమైన మగధారణ్యము దండకారణ్యము గయ ప్రభాసతీర్థము శ్రీతీర్ధము దివ్యమైన కనఖలము భృగుతుంగము హిరణ్యాక్షము భీమారణ్యము కుశస్థలి లోహాకులము కేదారము మందరారణ్యము మహాబలము కోటితీర్థము సర్వపాపహరతీర్థము రూపతీర్థము శూకరవతీర్థము మహాఫలదాయకచక్ర తీర్థము యోగతీర్ధము సోమతీఠ్ధము సాహోటకతీర్థము కోకాముఖతీర్ధము పవిత్రమైన బదరీపర్వతము సోమతీర్థము తుంగకూటము స్కందాశ్రమము కోటితీర్ధము అగ్ని పదతీర్థము పందశిఖము ధర్మోద్భవము కోటితీర్థము బాధప్రమోచనతీర్ధము గంగాద్వారము పంచకూటము మధ్యకేసరము చక్రప్రభ మతంగతీరము కుశదండతీర్థము దంష్ట్రాకుండము విష్ణుతీర్ధము సార్వకామికతీర్ధము మత్స్యతిలతీర్ధము బదరీ సుప్రభ బ్రహ్మకుండము వహ్నికుండము సత్యపద తీర్ధము చతుస్స్రోత స్తీర్ధము చతుశ్శృంగము ద్వాదశధారకశైలము మానసము స్థూలశృంగము స్థూలదండము ఊర్వశీతీర్ధము లోకపాలము మనువరము సోమశైలము సదాప్రభ మేరుకుండము సోమాభిషేచనతీర్ధము మహాస్రోత స్తీర్ధము కోటరకము పంచధార త్రిధారక సప్తధార ఏకధార అమరకంటకతీర్థము శాలగ్రామతీర్ధము చక్రతీర్ధము కోటిద్రుమతీర్ధము బిల్వప్రభము దేవహ్రదము విష్ణుహ్రదము శంఖప్రభ పున్నాగతీర్ధము దేపప్రభ విద్యాధరము గాంధర్వము ళ్రీతీర్ధము బ్రహ్మహ్రదము సాతీర్ధము లోకపాలతీర్ధము మణిపూరగిరి పంచహ్రదము పుణ్యమైన పిండారకతీర్ధము మాలవ్యతీర్థము గోప్రభావ గోవరతీర్థము వటమూలకతీర్ధము స్నానదండము ప్రయాగ గుహ్య విష్ణుపద కన్యాశ్రమ వాయుకుండ జంబూమార్గ గభస్తితీర్ధ యయాతిపతన కోటితీర్థ భద్రపట తీర్థప్రజ అర్బుద మహాకాలవన నర్మదాతీర్థ పింగుతీర్థ వాశిష్ఠ వృధునంగమ దౌర్వాసిక పిఞ్జరక ఋషితీర్థ బ్రహ్మ తుంగ వనుతీర్ధ కుమారిక శత్రుతీర్ధ పఞ్చనద రేణుకాతీర్ధ పైతామహవిమలరుద్రపాదమణిమ త్తకామతీర్ధ కృష్ణతీర్ధకుశావిల యజన యాజన బ్రహ్మవాలుక పుష్పన్యాన పుండరీక మణిపూర దీర్ఘసత్ర హయపద అనశన గంగోద్భేద శివోద్భేద నర్మదోద్భేద వస్త్రాపద దారుబల ఛాయారోహణ సిద్ధేశ్వర మిత్రబల కాలికాశ్రమ వటాపట భద్రవట కౌశాంబి దివాకర సారస్వత ద్వీవ విజయ కామద రుద్రకోట సుమనస నద్రావనామిత స్యమంతపంచక బ్రహ్మతీర్థ సుదర్శన సతత పృధివీసర్వ పారిప్లవ పృధూదక దశాశ్వమేధిక సర్పిజ విషయాంతిక కోటితీర్థ - పంచనద - వారాహ - యక్షిణీహ్రదతీర్ధ వుండరీక సోమతీర్థముఞ్ఞవాట బదరీవన ఆసీన రత్నమూలక లోకద్వార పఞ్చతీర్థ కపిలాతీర్థ సూర్య శంఖినీ గోభవన యక్షరాజ బ్రహ్మావర్త సుతీర్థ కామేశ్వర మాతృతీర్థ ళీతవన స్నానలోమాపహ మాన నంసరక దశాశ్వమేధ కేదార బ్రహ్మోదుంబర నప్తర్షికుండ దేవీతీర్థ సుజమ్బుక ఈహాస్పద కోటికూట కిందాన కింజప కారండవ అవేద్యన త్రివిష్టప పాణిఖాత మిశ్రక మధూవట మనోజవ కేశికీ దేవలోక ఋణమోచన దివ్య నృగధూమ విష్ణువద అమరహ్రద కోటితీర శ్రీకుంజ శాలితీర్థనై మిశేయ బ్రహ్మస్థాన సోమకన్యాలోక బ్రహ్మతీర్థమనస్తీర్థ కారుపావన సౌగంధికవనమణి సరస్వతి ఈశాన వ్రవర పావన పాఞ్చయజ్ఞిక త్రిశూలధర మాహేంద్ర దేపస్థాన కృతాలయ శాకంభరి దేవతీర్ధ సువర్ణాక్ష కలిహ్రద క్షీరస్రవ విరూపాక్ష భృగు కుశోద్భవ బ్రహ్మతీర్థ బ్రహ్మయోని నీలపర్వత కుబ్జాంబ భద్రవట వశిష్ఠపద స్వర్గద్వార ప్రజాద్వార కాళికాశ్రమ రుద్రావర్త సుగంధాశ్వ కపిలావన భద్రకర్ణహ్రద శంకుకర్ణహ్రద సప్తసారస్వత ఔశనన కపాలమోచనఅవకీర్ణ కామ్యక చతుస్సాముద్రిక శతిక సహస్రికరేణుక పంచవటక విమోచన ఔజసస్థాణు కురుతీర్ధ స్వర్గద్వార కుశధ్వజ విశ్వేశ్వర మాణవక కూప నారాయణాశ్రను గంగాహ్రదవట బదరీపాటన ఇంద్రమార్గ ఏక రాత్ర క్షీరకావాస సోమ దధీచ శ్రుత కోటితీర్ధన్థలీ భద్రకాళీ అరుంధతీ వనబ్రహ్మావ ర్త అశ్వవేదికుబ్జావన యమునా ప్రభవ వీరప్రమోక్ష సింధూత్థ ఋషి కుల్యా సకృత్తిక ఉర్వీసంక్రమణ మాయావిద్యోద్భవ మహాశ్రమ వైతసికారూప సుందరికాశ్రమ బాహుతీర్థ చారుసదీ విమలాశోక పంచనద మార్కండేయ సోమ సితోద మత్స్యోదరి సూర్యప్రభ సూర్యతీర్ధ అశోకవన అరుణాస్పద కామద సవాలుక శుక్ర పిశాచమోచన సుభద్రాహ్రద విమల దండకుండ చండీశ్వర జ్యేష్ఠస్థానహ్రద బ్రహ్మసర జై గీషవ్యగుహా హరికేశవన అజాముఖనర ఘంటాకర్ణహ్రద పుండరీకహ్రద కర్కోటకవాపీ సుపర్ణోదపాన శ్వేతతీర్ధహ్రద ఘర్ఘరికాకుండ శ్యామాకూప చంద్రికా శ్మశానస్తంభకూప వినాయకహ్రద, సింధూద్బవమాప బ్రహ్మనర రుద్రావాన నాగతీర్థ పులోమక భక్తహ్రద క్షీరసర ప్రేతాధార కుమారక బ్రహ్మావర్త కుశావర్త దధికర్ణోధపాసశృంగమహాతీర్ధ మహానదీ బ్రహ్మసరగయాశీర్ష అక్షయవట దక్షిణగోమయఉత్తరగోమయ రూపశీతిక కపిలాహ్రద గృధ్రవట సావిత్రీహ్రద ప్రభాసనసీతవన యోనిద్వారధేనుక ధన్యక కోకిలా మతజ్గహ్రద పితృకూప రుద్రతీర్థ శక్రతీర్థ సుమాలిబ్రహ్మస్థానస ప్తకుండమణిరత్నహ్రదకౌశిక్యభరత జ్యేష్ఠాలికా విశ్వేశ్వరకల్పనర కన్యానంవేద్య నిశ్చీవాప్రభవ వశిష్ఠాశ్రమ దేపకూటకూపవసిష్టాశ్రమవీరాశ్రమబ్రహ్మసరబ్రహ్మవీరఅవకాపిలి కుమారధారశ్రీధారా గౌరీశిఖర శునఃకుండ నందితీర్థ కుమారవాసశ్రీవాసజౌర్వసీతీర్థకుంభకర్ణహ్రదతీర్థ కౌశికిహ్రద ధర్మకామతీర్థ ఉద్ధాలక సంధ్యా కారతోయ కపిల లోహితార్ణవ శోణోద్భవ వంశగుల్మ ఋషభ కలతీర్థ పుణ్యావతీహ్రద బదరీకాశ్రమ రామతీర్థ పితృవస విరజా మార్కండేయవన కృష్ణతీర్థ వటతీర్థ రోహిణీ వ్రవర తీర్థ ఇంద్రద్యుమ్న నరతీర్థ సానుగర్త మహేంద్రతీర్థ శ్రీనద ఇషుతీర్థ వార్షభ కావేరీహ్రద కన్యా గోకర్ణ గాయత్రీస్థాన బదరీహ్రద మధ్యస్థాన వికర్ణక జాతీహ్రద దేవకూప కుశప్రవణ సర్వదేవవ్రత కన్యాశ్రమహ్రద వాలఖిల్యమహర్షిఅఖండితహ్రద నామక తీర్థము లివి.

వీనిని శ్రద్ధతో సేవించి స్నానాది విధులు చేసి ఉపవసించి జితేంద్రియుడై దేవర్షి పితృతర్పణములు గావించి దేవతార్చనముచేసి మూడు రాత్రు లిందుపవసిఆంచినవారికి వేరువేరు ఫలములనంతములు కల్గును, దాన నశ్వమేధ యాగ ఫలము గల్గును. నంశయము లేదు. ఈ తీర్థ మహాత్మ్యము నిత్యము విన్నను పఠించినను సర్వపాప విముక్తి గల్గును.

ఇది బ్మహ్మపురాణమునందుసర్వతీర్థమాహాత్మ్యవర్ణనమను ఇరువది యైదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters