Brahmapuranamu    Chapters   

అథ పంచచత్వారింశదధిక ద్విశతతమో7ధ్యాయః

అజస్యాపి విక్రియయా నానాభవనమ్‌

వసిష్ఠ ఉవాచ

ఆప్రబుద్ధ మథావ్యక్త మిమం గుణనిధిం సదాl గుణానా ధార్యతాం తత్త్వం సృజ త్యాక్షిపతే తథా ll 1

అజోహి క్రీడయా భూప విక్రియాం ప్రాప్త ఇత్యుత l ఆత్మానం బహుధా కృత్వా నానేవ ప్రతిచక్షతే ll 2

ఏతదేవం వికుర్వాణో బుధ్యమానో న బుధ్యతే l గుణా నాచరతే హ్యేష సృజ త్యాక్షిపతే తథా ll 3

అవ్యక్తబోధానా చ్చైవ బుద్యమానం వదం త్యపి l న త్వేవం బుధ్యతేవ్యక్తం సగుణం తాత నిర్గుణమ్‌ ll 4

కదాచి త్త్వేవ ఖల్వేతత్తదాహుః ప్రతిబుద్ధకమ్‌ l బుద్యతే యది చావ్య క్తమేత ద్వై పంచవింశకమ్‌ ll 5

బుద్యమనో భవత్యేష మమాత్మక ఇతి శ్రుతః l అన్యోన్య ప్రతిబుద్ధేన వదం త్యవ్యక్త మచ్యుతమ్‌ ll 6

అవ్యక్తభోదనాచ్చైవ బుధ్యమానం వదం త్యుత l పంచవింశం మహాత్మానం న చాసా వపి బుధ్యతే ll7

షడ్వంశం విమలం బుద్ధమప్రమేయం సనాతనమ్‌ ll సతతం పంచవింశం తు చతుర్వింశం విబుధ్యతే ll 8

దృశ్యాదృశ్యే హ్యనుగత తత్స్వభావే మహాద్యుతే l అవ్యక్తం చైవ తద్బ్రహ్మబుద్యతే తాత కేవలమ్‌ ll 9

పంచవింశం చతుర్వింశమాత్మాన మనుపశ్యతి l బుధ్యమానో యదా೭೭త్మానమన్మోహ మితి మన్యతే ll 10

తదా ప్రకృతి మానేష భవ త్యవ్యక్తలోచనః l బుధ్యతే చ పరాం బుద్ధిం విశుద్ధా మమతాం యదా ll 11

షడ్వింశం రాజషార్దూల తదా బుద్ధః కృతో వ్రజేత్‌ l తత స్త్యజతి సోవ్యక్త సర్గప్రలయధర్మి ణమ్‌ ll 12

నిర్గుణాం ప్రకృతిం వేద గుణయుక్తా మచేతనామ l తతః కేవల ధర్మాసౌ భవ త్యవ్యక్తదర్శ నాత్‌ ll 13

కేవలేన సమాగమ్మ మిముక్తాత్మాన మాప్నుయాత్‌ ll ఏతత్తుతత్త్వ మిత్యాహు ర్నిస్తత్త్వ మజరామరమ్‌ ll 14

వసిష్ఠ జనక సంవాదోప సంహారము

ఆ ప్రబుద్ధావస్థలోనుండు జీవుడు అవగక్తమును నిర్గణమునునగు ఇరువదియైదవత త్త్వమును కూడ సగుణతత్త్వముగా భావించును. ఆతత్త్వమునందు ఆరోపింపబడు గుణము లను సృజించుచు ఉపసంహరించుచు ఉన్నట్లు కల్పనచేసికోనును. ఓజనకరాజా! ఆమూల తత్త్వము అజము-జన్మరహితము-ఐనను క్రీడార్థమై వికారములను పొందుచున్నాడు. తన్నుతాను అనేక తత్త్వముల రూపమున కల్పించుకొని నానా రూపముల నొందినవాడువలె చెప్పబడుచున్నాడు. ఇట్లు వికృతి నొందుచుండియు ఇట్లని వాస్తవ స్థితిని ఎరుగలేకున్నాడు. అవ్యక్త తత్త్వస్వరూపము ఇది యని తత్త్వబొధ చేయబడినవుడు జ్ఞాన సాధనదశలో అతడు బుధ్యమానుడు-బోధమును-జ్ఞనమును- అందుకొనుచున్నవాడు - అని వ్యవహరింపబుడుచు న్నాడు. కాని ఇట్లు బోధింపడుచుండియు సగుణమైనదివలె కనబడు ఈ అవ్యక్తతత్త్వమును వాస్తవమున నిర్గుణమైనదానినిగా గుర్తింపలేకపొవుచున్నాడు. ఇరువదియైదవదియగు ఈ అవ్యక్తతత్త్వ స్వరూపమునుదాని నిర్గుణత్వమును ఒకానొకప్పుడీతడు తెలిసికొన గలిగిన యెడల ప్రతిబుద్ధుడు అని వ్యవహరింపబడును. బుధ్యమాన దశలో జీవుడు మమకారావృతుడు. అన్నితత్తమలకును అతీతమగు ఇరువదియారవతత్త్వము విమలమును బుద్ధమును- జ్ఞానాత్మకమును -ఆప్రమేయమును. ఇట్టిది అని ఎరుగశక్యముకానిది-ననాతనవసస-శాశ్వతమైనది. దానిని గుర్తింపగలిగినప్పుడు సృష్టి ప్రళయధర్మయుక్తమగు ఇరువదియైదవ తత్త్వముగా నుండుటను గూడ అతిగతమై అతగున్నదదశనందుకొనును. అప్పుడీతడు వస్తుతః గుణరహితమును జడమునునగు ప్రకృతిని సగుణత్ము నొందిన దానినిగా గురైరుగును. తాను కేవల జ్ఞానాత్మకుడై అవ్యక్తతత్త్వమును గూడ వాస్తవ రూపమున దర్శింపగలుగును.

తత్త్వసంశ్రవణా దేవ తత్త్వజ్ఞో జాయతే నృప l పంచవిశతిత త్త్వాని ప్రవదంతి మనీషిణః ll

నచైవతత్త్వవాం స్తాత సంసారేషు నిమజ్జతిl ఏషాముపైతి తత్త్వం హిక్షిప్రం బుధ్యస్వ లక్షణమ్‌ ll 16

షడ్వింశో7యమితి ప్రాజ్ఞో గృహ్యమాణో7జరామరః l కేవలేన బలేనైవ సమదతాం యా త్యసంశయమ్‌ ll

షడ్వీం శేన ప్రబుద్ధేన బుధ్యమానో7ప్యబుద్ధిమాన్‌ l ఏత న్నానాత్వ మిత్యుక్తం సాంఖ్య శ్రుతినిదర్శనాత్‌ ll 18

చేతనేన సమేతస్య పంచవింశతికస్య హ l ఏకత్వం వైభ##వే త్తస్య యదా బుద్ధ్యా7నుబుధ్యతే ll 19

బుధ్యమానేన బుద్ధేన సమాతాం యాతి మైథిల l సంగధర్మా భవత్యేష నిఃసంగాత్మా నరాధిప ll 20

నిఃసంగాత్మ్బాన మాసాద్య షడ్వింశం కర్మజం విదుః l విభు స్త్యజతి చావ్యక్తం యదాత్వేత ద్విబుధ్యతే ll 21

చతుర్వింశ మగాధం చ షడ్వింశస్య ప్రబోధనాత్‌ l ఏష హ్యప్రతిబుద్ధశ్చ బుద్యమానస్తు తే 7నఘ ll 22

ఉక్తో బుద్ధ శ్చతత్త్వేన యథాశ్రుతి నిదర్శనాత్‌ l పమశకోదుంబరే యద్వ దన్యత్వం తద్వదేకతా ll 23

మత్స్యోదకం యథా తద్వ దన్యత్వ ముపలభ్యతే l ఏవ మేవ చ గంతవ్యం నానా త్వై కత్వ మేతయోః ll 24

ఏతావ న్మోక్ష ఇత్యుక్తో జ్ఞాన విజ్ఞాన విజ్ఞాన సంజ్ఞిత l పంచవింశతిక స్యా77శుయో7యం దేహే ప్రవర్తతే ll 25

ఏవ మోక్షయిత వ్యేతి ప్రాహు రవ్యక్త గోచరాత్‌ ll సో7య మేవం విముచ్యేత నాన్య థేతి వినిశ్చయః ll 26

పరశ్చ పరధర్మాచ భవ త్యేవ సమేత్య వై l విశుద్ధ ధర్మా శుద్ధేన నాశుద్ధేన చ బుద్ధిమాన్‌ ll 27

విముక్తధర్మా బుద్ధేన సమేత్య పురుషర్షభ l నియోగధర్మిణాచైవ విముక్తాత్మా భవత్యథ ll 28

విమోక్షిణా విమోక్షశ్చ సమే త్యేహ తథా భ##వేత్‌ l శుచికర్మా శుచిశ్చైవ భవ త్యమిత బుద్ధిమాన్‌ ll 29

విమలాత్మాచ భవతి సమేత్య మిమలాత్మనా l కేవలాత్మా తథా చైవ కేవలేన సయేత్యవై

స్వతంత్రశ్చ స్వతంత్రేణ స్వతంత్రత్వ మావాప్యతే ll 30

ఓ రాజా! తత్త్వముల నాశ్రయించిననేకాని నరుడు తత్త్వజ్ఞుడుకాజాలడు. నాయనా ! తత్త్వజ్ఞుడు సంసారగతు లలోమునుగడు. తత్త్వములిరువదియైదని విద్వాంసులు చెప్పు చున్నారు. వీని లక్షణమును తెలిసికొన్నచో వీటిమూలతత్త్వమునుకూడ చేరగలుగను. ఏలయన- ఇరువదియారవది సర్వమూతత్త్వము. ఇతడు ఇదియే ఇరువదియారవ తత్త్వమని సరిగా గుర్తించినచో జరామరణములు లేక శుద్ధయోగబలముచే సమతాస్థితిని పొందును. సందేహములేదు. ఐనను అజ్ఞానానికి జ్ఞానబోధ చేయుటకై తత్త్వములు ఇరువదినాల్గేయని ఇరువదియైదేయని ఏకత్వమునుండి నానాత్వము జరిగిన విధము ఇదియని సాంఖ్య దర్శనము. ఎపుడుచేతన తత్త్వము కూడిన ఈ పంచవింశతితమ తత్త్వమయొక్క ఏకత్వము బుద్ధియందు స్థిరమై ఆవగతమై నిలుచునో అపుడు ముముక్షువు సమత్వము పొందును. ఏలయన నిఃసంగుడై యుండియు పరమాత్ముడు మాయాకృతమైన సంగవశమున నంసారములో వరిభ్రమించుచున్నాడు. మాయదూరమైనపుడు ముక్తినందు చున్నాడు. నిఃసంగరూపుడగు పంచవింశతితమతత్త్మును ఎరిగిన తరువాత అజుడగు- జన్మరహితు డగు-ఆ ఇరువదియారవ తత్త్వము నెరుగగలుగును. అవ్యక్త తత్త్వము నెరుగుటచేతనే ఈ పరమ విబోధము-జ్ఞానము-కలుగును. చతుర్వింశతి తత్త్వముల నెరుగుటకూడ ఈ ఇరువదియారవతత్త్వము నెరిగిముక్తి నందుటకు సాధనమే. ఓ అనముడవగు జనకరాజా! నీకిట్లు సాంఖ్య విధానమున బుద్ధ-బుద్యమాన-అప్రతిబుద్ధుల లక్షణములను తెలిపితిని. ఈ తెలిపిన తత్త్వముల-నానాత్వము-ఏకత్వముల సంబంధము చేపకునీటికిని -మేడికాయకు దానియందలి పురుగులకును- గలసంబంధము వంటిది. జ్ఞానము విజ్ఞానము అని వ్యవహరింపబటడు ముక్తి స్వరూపమిదియే. ఈ దేహమున సాక్షితత్త్ముగానున్న ఇరువది యైదవ అవ్యక్త తత్త్వము నెరుగనిదే ముక్తి కలుగదు. ఈ ఇరువది యారవతత్త్వము పరతత్త్వము పరమగు ధర్మము%ు కలిగినది; ఏమాత్రమును ఆశుద్ధము కాని శుద్ధతత్త్ము; విశుద్ధ మగుధర్మముకలది; జ్ఞానశాలి; జ్ఞానాత్మకుడు; వాస్తవమున ఆలోచించినచో సర్వధర్మములనుండి విముక్తుడు; కాని సంయోగవియోగ ధర్మములుకల ఈ చుతుర్వంశతితత్త్వాత్మకమగు ఈ ప్రకృతితో సంబధము కలుగుటవలన బుద్ధుడైనందున మరల దానినుండి విడివడినప్పుడు ముక్తి నందెనని వ్యవహరించుట, వాస్తవమున అతనికి బంధము మోక్షములేవు. అట్లతడు విమోక్షిగా- శుచికర్మునితో కలిసిశు%ుచిగా విమలాత్మునితో కలిసి విమలాత్ముడుగా కేవలునితో కలిసికేవలాత్ముడుగా అగుచున్నాడు . స్వతంత్రునితో కలిసి స్వతంత్రుడై స్వాతంత్ర్యమును పొందుచున్నాడు.

ఏతావ దేత త్కథితం మయాతే తథ్యం మహారాజ యథార్థతత్త్వమ్‌ l

అమత్సరత్వం ప్రతిగృహ్య బుద్ధ్యా సనాతనం బ్రహ్మవిశుద్ద మాద్యమ్‌ ll 31

త ద్వేదనిష్ఠస్య జనస్య రాజన్‌ ప్రదేయ మేత త్పరమం త్వయా భ##వేత్‌ l

విధిత్సమానాయ నిబోధకారకం ప్రబోధహేతోః ప్రణతస్య శాసనమ్‌ ll

న దేయ మేత చ్చ యథా7నృతాత్మనే శఠాయ క్లీబాయ న జిహ్మబుద్ధయే l

న పండిత జ్ఞానపరోపతాపినే దేయం తథా శిష్యవిబోధనాయ ll 33

శ్రద్ధాన్వితాయాథ గుణాన్వితాయ పరాపవాదా ద్విరతాయ నిత్యమ్‌

విశుద్ధయోగాయ బుధాయ చైవ కాపావతే7థ క్షమిణ హితాయ ll 34

వివిక్తశీలాయ విధిప్రియాయ వివాదహీనాయ బహుశ్రుతాయ l

వినీత వేషాయ న హైతుకాత్మనే సదైవ గుహ్యం త్విద మేవ దేయమ్‌ ll 35

ఏతైర్గుణౖ ర్హీనతమే న దేయ మేతత్పరం బ్రహ్మ విశుద్ధ మాహుః

నశ్రేయసే యోక్ష్యతి తాదృశే కృతం ధర్మ ప్రవక్తార మపాత్రదానాత్‌ ll 36

ప్రథ్వీ మిమాం నా యది రత్నపూర్ణాం దద్యా దదేయం త్విద మవ్రతాయ l

జితేంద్రియాయ ప్రయతాయ దేయం దేయం పర తత్త్వవిదే నరేంద్ర ll 37

కరాల మాతే భయ మస్తి కించి దేత చ్చుత్తం బ్రహ్మ పరం త్వయా7ద్యః

యథావదుక్తం పరమం పవిత్రం విశోకమత్యంత మనాదిమద్యమ్‌ . ll 38

ఆగాధ మేత దజరామరం చ నిరామయం వీతభయం శివం చ l

సమీక్ష్య మోహం పరవాదసంజ్ఞ మేతస్య తత్త్వార్థ మిమం విదిత్వాll 39

ఆవాప్త మేత ద్ధి పూరా సనాతనా ద్ధిరణ్య గర్భాద్ధి తతో నరాధిప l

ప్రసాద్య యత్నేన త ముగ్రతేజసం సనాతనం బ్రహ్మయథా త్వ యైతత్‌ ll 40

పృష్ట స్తయాచా7స్మి యథా నరేంద్ర తథా మ యేదం త్వయి నోక్తమన్యత్‌ l

యథా 7వాప్తం బ్రహ్మణో మే నరేంద్ర మహాజ్ఞానం మోక్షవిదాం పరాయణమ్‌ ll 41

ఓ మహారాజా! ఇంతవరకు నేను నీకిట్లు యథార్థతత్త్వము తెలిపితిని. నీవశను విశుద్ధమును ఆద్యమును సనాతనము-శాశ్వాతమును-అగు బ్రహ్మతత్త్వమును అమత్సరుడవై మనో దోషములేవియులేనివాడవై ప్రతి గ్రహించితివి. నీవును ఈ పరమ విద్యానుశాసనమును వేదనిష్ఠ-వేదములయందును శాస్త్రములయందును ప్రామాణ్యబుద్ధి- కలిగిప్రబోధము నొందుటకైప్రణతుడై తెలిసికొనగోరి ఆడిగిన వానికి మాత్రమే ఈయవలెను. అసత్యవాది - మోసగాడు- కపటబుద్ధి- ఆసమర్థుడు- జ్ఞానపరులగు పండితులను నొప్పించువాడు అగువానికీయరాదు- శిష్యులకు జ్ఞానము కలిగించుటకై నీవీవిద్యను శ్రద్ధకలవాడు సద్గుణ వంతుడు పరనిందచేయనివాడు వివేచనతో కూడిన శీలముకలవాడు వేదశాస్త్ర విధియందు ప్రీతికలవాడు వివాదములు చేయనివాడలు అనేక శాస్త్రములను పెద్దలవలన వినినవాడు వినయమును తెలుపు వేషముకలవాడు హేతువాదము చేయనివాడు -ఇట్టివానికి మాత్రమే తెలుపవలయును. విశుద్ధమగు వరబ్రహ్మతత్త్వమును ఈ సద్గుణములు లేనివాని కీయరాదు. ఇచ్చినచో అపాత్రదానమువలన ప్రవచనము చేసిన గురువునకు కూడ శ్రేయస్సు కలుగదు. వ్రతనియమములు లేనివాడు తాను సమస్తరత్నములతో ఈ భూమినంతటికి విద్యకు ప్రతిఫలముగా ఇత్తుననినను అట్టివానికి విద్యను బోధించరాదు. ఓనరేంద్రా! తత్త్వము నెరుగగోరి జితేంద్రియుడై ప్రయతుడైన-ఇంద్రియని గ్రహము శుచిత్వము కలిగిన-వానికి మాత్రమే ఇది బోధించవలెను. ఓజనకా! నీవు పరమ పవిత్రమును అత్యంతము శోకరహితమును అనాది మధ్యమును%ు ఆగుబ్రహ్మతత్త్వమును వాస్తవముగ ప్రవచించగా వింటివి. నీకిక సంసారభయములేదు. ఈ తత్త్వము అగాధము- అజరామరము- దోషరహితము- భయరహితము- శుభకరము- పంవాదము అనుపేరుగల ఈ తత్త్వర్థము- తెలిసికొని మోహస్వరూపమునుగుర్తించి విడువుము.

ఓ రాజా! పూర్వము హిరణ్య గర్భబ్రహ్మ సనాతనపరమాత్మనుండి ఈ విద్యను గ్రహించెను. మహాతేజస్వియగు ఆబ్రహ్మనుండి నేను ఆయనను అనుగ్రహింపజేసికొని గ్రహించితిని. నీవడిగినందున నేను నీకిది ప్రతి పాదించితిని. ఇదియునేను బ్రహ్మవలన ఎంత ఎట్లు తెలిసికొంటినో అంతయ అట్లే తెలిపితిని కాని ప మాత్రము మార్చులు చేర్పులు చేయలేదు.

వ్యాస ఉవాచ

ఏత దుక్తం పరం బ్రహ్మయస్మాన్నా77వర్తతేపునః l పంచవింశం మునిశ్రేష్ఠా వసిష్ఠేన యథా పురా ll 42

పున రావృత్తి మాప్నోతి పరమం జ్ఞాన మవ్యయమ్‌ l నాతిబుధ్యతి తత్త్వేన బుధ్యమనో7 జరామరమ్‌ ll 43

ఏత న్నిః శ్రేయసకరం జ్ఞానం భోః పరమం మయా l కథితం తత్త్వతో విప్రాః శ్రుత్వా దేవర్షితో ద్విజాః ll 44

హిరణ్య గర్భా దృషిణా వసిష్ఠేన సమాహృతమ్‌ సమాహృతమ్‌ l వసిష్ఠా దృషిశార్దూలో నారదో7వాప్తపవా నిదమ్‌ ll 45

నారదా ద్విదితం మహ్య మేత దుక్తం సనాతనమ్‌ l మా శుచధ్వం మునిశ్రేష్ఠాః శ్రుత్వైత త్పరమం పదమ్‌ ll 46

యేన క్షరాక్షరే భిన్నే న భయం తస్య విద్యతే l విద్యతే తుభయం యస్య యో నైనం వేత్తి తత్త్వతః ll 47

అవిజ్ఞానా చ్చ మూఢాత్మా పునః పున రుపద్రావాన్‌ l ప్రేత్య జాతిసహస్రాణి మరణాంతా న్యుపాశ్నుతే ll 48

దేవలోకం తథా తిర్య జ్మానుష్య మపి చాశ్నుతే l యది వా ముచ్యతే వా7పి తస్మా దజ్ఞాన సాగరాత్‌ ll 49

అజ్ఞాన సాగరే ఘోరే హ్యవ్యక్తాగాధ ఉచ్యతే l అహ న్యహని మజ్జంతి యత్ర భూతాని భోద్విజాః ll 50

తస్మా దగాధా దవ్యక్తా దుపక్షీణా త్సనాతనాత్‌ l తస్మా ద్యూయం విరజస్కా వితమస్కాశ్చ భోద్విజా ః ll 51

ఏవం మయా మునిశ్రేష్ఠాఃసారా త్సారతరం పరమ్‌ l కథితం పరమం మోక్షం యం జ్ఞాత్వా న నివర్తతే ll 52

ననాస్తికాయ దాతవ్యం నాభక్తాయ కదాచన l న దుష్టమతయే విప్రా న శ్రాద్ధావిముఖాయచ ll

ఇతి శ్రీమహపురాణ అదిబ్రాహ్మే వసిష్ఠ కరాలజనక సంవాదసమాప్తి నిరూపణం నామ పంచ చత్వారింపశదధిక ద్విశతతమో7ధ్యాయః

వ్యాసుడిట్లుమునులతో పలికెనుః ఓ మునిశ్రెష్ఠులారా! వసిష్ఠుడు పంచవింశతితమ తత్త్వసంబంధియగు తత్త్వమును ఇట్లు తెలిపెను. ఈ తత్త్వము ఎరిగి దనిద్వారమున షడ్వింశ- ఇరువదియారవ-తత్త్వమును చేరినవారికి జననమరణ రూపసంసారములో పునరావృత్తియుండదు. ఇది పరమమగు జ్ఞానము. దీనినిమించినజ్ఞానము లేదు. ఇది ఎరిగినవారు అజరామరమగు తత్త్వము చేరుదురు. ఓద్విజులారా! నిఃశ్రేయసకరమగు ఈ పరమజ్ఞానము దేవర్షియగు నారదునివలన వినినేనున్నదున్నట్లు మీకు తెలిపితిని. ఏలయన-హిరణ్య గర్భునినుండి వసిష్ఠుడును అతని నుండి నారదుడును అతనినుండి నేనును వింటిమి. దీనిని వినినందున మీకును సంసారములన శోకముకలుగదు. క్షరాక్షర తత్త్వమల భేదాభేదము నెరిగిన వారికి భయముండదు. ఎరుగని మూఢాత్ముడు మాత్రము అనేక జన్మపరంపరలనొంది మరలమరల ఉపద్రవముల పొందును. జననము- మరణము- దేవలోకము- నరకలోకాము- నరకలోకము- తిర్యగ్యోనులు- మనుష్య జన్మము ఇదే క్రమమున పునఃపునరావృత్తి పొందును. అవ్యక్తాగాధమగు అజ్ఞాన సముద్రమున మునుగును.

ఓముని శ్రేష్ఠులారా! నేనిట్లు మిగుల సారతమమగు పరతత్త్వమును మీకు తెలిపితిని. దీనిని తెలిసికొనినవారు పరమ మోక్షమును పొందుదురు. మరల జననమరణ పునరావృత్తి పొందరు. ఓవిప్రులారా! దీనిని నాస్తికుడు అభక్తుడు దుష్టమతి శ్రద్ధారహితుడు అగువానికి తెలుపరాదు.

ఇదిశ్రీమహాపురాణమున అది బ్రాహ్మమున వసిష్ఠ జనక సంవాద సవాప్తినిరూపణమను రెండవందలనలువదియైదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters