Brahmapuranamu    Chapters   

అథసప్తత్రింశదధికద్విశతతమోధ్యాయః

జ్ఞానినాం మోక్షప్రాప్తినిరూపణమ్‌

మునయ ఊచుః

యద్యేవం వేదవచనం కురు కర్మ త్యజేతి చ | కాం దిశం విద్యయా యాంతి కాం చ గచ్చంతి కర్మణా || 1

ఏతద్వై శ్రోతుమిచ్ఛామ స్తద్బవాన్ర్పబ్రవీతు నః | ఏతదన్యోన్య వై రూప్యం వర్తతే ప్రతికూలతః || 2

విద్యా - కర్మ - గతివివేచనము

వేదవిధి ననుసరించి కర్మల నాచరించవలెననియు కర్మలను విడువవలెననియు మీరు చెప్పుచున్నారు. ఇది పరస్పరము విరుద్ధముగా నున్నది. కావున కర్మల నాచరించినచో ఏగతి కలుగునో వానిని విడిచి విద్యను-జ్ఞానమును ఆశ్రయించినచో ఏగతి కలుగునో విన కుతూహలముగుచున్నది. తెలుపుడు. అని మునులు వ్యాసునడిగిరి.

వ్యాస ఉవాచ

శృణుధ్వం ముని శార్దూలా యత్ప్సచ్ఛధ్వం సమాసతః | కర్మవిద్యామ¸° చోభౌ వ్యాఖ్యాస్యామి క్షరాక్షరౌ || 3

యాం దిశం విద్యయా యాంతి యాం గచ్ఛంతి చ కర్మణా | శృణుధ్వం సాంప్రతం విప్రా గమనం హ్యేతదు త్తరమ్‌ || 4

ఆస్తి ధర్మ ఇతి యుక్తం నాస్తి తత్రైన యో వదేత్‌ | యక్షస్య సాదృశ్యమిదం యక్షస్యేదం భ##వే దథ || 5

ద్వావిమావథ పంథానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః | ప్రవృత్తిలక్షణో ధర్మో నివృత్తో వా విభాషితః || 6

కర్మణా బధ్యతే జందు ర్విద్యయా చ విముచ్యతే | తస్మాత్కర్మ న కుర్వంతి యతయః పారదర్శినః || 7

కర్మణా జాయతే ప్రేత్య మూర్తిమాన్షోడశాత్మకః | విద్యాయా జాయతే నిత్య మవ్యక్తం హ్యక్షరాత్మకమ్‌ || 8

కర్మ త్వేకే ప్రశంసంతి స్వల్పబుద్ధిరతా నరాః | తేన తే దేహజాలేన రమయంత ఉపాసతే || 9

యే తు బుద్ధిం పరాం ప్రా ప్తా ధర్మనై పుణ్యదర్శినః | న తే కర్మ ప్రశంసంతి కూపం నద్యాం పిబన్నివ || 10

కర్మాణాం ఫలమాప్నోతి సుఖదుఃఖే భవాభవౌ | విద్యయా తదవాప్నోతి యత్ర గత్వా న శోచతి || 11

యత్ర గత్వాన మ్రియతే యత్ర గత్వాన జాయతే | న జీర్యతే యత్ర గత్వా యత్ర గత్వా న వర్ధతే || 12

యత్ర తద్బ్రహ్మ వరమ మవ్యక్తమచలం ధ్రువమ్‌ | అవ్యాకృతమానాయామ మమృతం చాధియోగవిత్‌ || 13

ద్వంద్వైర్న యత్ర బాధ్యంతే మానసేన చ కర్మణా సమాః సర్వత్ర మైత్రాశ్చ సర్వభూతహితే రతాః. || 14

విద్యామయోన్యః పురుషా ద్విజాః కర్మమయోపరః | విప్రాశ్చంద్ర సమస్సర్మః సూక్ష్మయా కళయా స్థితః ||

తదేతదృషిణా ప్రోక్తం విస్తరేణాను గీయతే | న వక్తుం సక్యతే ద్రష్టుం చక్రతంతు మివాంబరే || 16

ఏకాదశవికారాత్మా కలా సంభారసంభృతః | మూర్తిమానితి తం విద్యా ద్విప్రాః కర్మగుణాత్మకమ్‌ || 17

దేవో యః సంశ్రిత స్తస్మి న్బుద్ధీందురివ పుష్కరే | క్షేత్రజ్ఞం తం విజానీయా నృఇత్యం యోగజితాత్మకమ్‌ || 18

తమో రజశ్చ సత్త్వం ద జ్ఞేయం జీవగుణాత్మకమ్‌ | జీవమాత్మగుణం విద్యా దాత్మానం పరమాత్మనః || 19

సచేతనం జీవగుణం వదంతి స చేష్టతే జీవగుణం చ సర్వమ్‌ |

తతః పరం క్షేత్రవిదో వదంతి ప్రకల్పయంతో భువనాని సప్త || 20

మునిశ్రేష్ఠలారా! మీరడిగినది చెప్పెదను. కర్మ మయమగుక్షరత త్త్వమునువిద్యామయమగు అక్షరతత్త్వమును కర్మానుష్ఠానమువలన విద్యా లాభమువలన కలుగు గతులను కూడ విరింతును. వినుడు. ఈ ప్రశ్నలకు సమాధానము చాలగ హన - గంభీరమైనది. ధర్మమున్నది అనుచునే అదే ధర్మము లేదని చెప్పుట పరస్పర విరుద్ధము. వేదానుసారియగు ప్రవృత్తి మార్గము విద్యానుసారియగు నివృత్తిమార్గము అని రెండుమార్గములు కలవు. కర్మము బంధహేతువు. విద్య ముక్తి హేతువు. అందుచే తత్త్వము నెఱిగిన మునులు కర్మల నాచరింపరు. కర్మల నాచరించుటచే షోడశతత్త్వ రూపుడగు పురుషుడు మరణించి మరల పుట్టును. విద్యచే అక్షరరూపుడై ముక్తినందును. (షోడశకలలు - అనగా ముఖ్య ప్రాణము - శ్రద్ధ - పంచభూతములు ఇంద్రియములు - మనస్సు అన్నము - వీర్యము - తపస్సు - వేద మంత్రములు - కర్మములు - లోకములు - నామము - ఇవి పదునారు ప్రశ్నోపనిషత్‌ - 6 ప్రశ్న - 4 మంత్రము) అపరా విద్యను ఆశ్రయించినవారు కర్మలను మెచ్చుచు జన్మమరణ పరంపరలో చిక్కి దేహములతోనే ఆనందించు చుందురు. పరావిద్యను ఆశ్రయించినవారు ధర్మతత్త్వము నెఱిగినవారు కావున నది నీరు త్రావువారు బావినీటిని మెచ్చనట్లు కర్మమార్గమును మెచ్చరు. కర్మానుష్ఠానము వలన సుఖదుఃఖములను జన్మమరణములను పొందుదురు. విద్యచేత దుఃఖశోకములు కాని జన్మ మరణములు కాని హానివృద్ధులు కాలేని స్థానమును పొందుదురు. అవ్యక్తము అచలము ధ్రువము అవ్యాకృతము అనామయము అమృతము యోగముచే ప్రాప్యము అగు పరబ్రహ్మ స్థానమును పొందుదురు. అట్టివారు సుఖదుఃఖములవంటి ద్వంద్వముల చేతను సంకల్ప కృతములగు కర్మలచేతను బాధింపబడక అన్ని ప్రాణులయందు మైత్రభావము హితబుద్ధి కలిగియుందురు. పురుషుడును (జీవుడు) కర్మమయుడు విద్యామయుడు అని రెండు విధములు. వీరిలో కర్మమయ పురుషుడు చంద్రునివలె సుకుమార స్పర్శ కలిగి చంద్రకల వంటి సూక్ష్మ కలారూపమున నుండును. అని ఋగ్వేద పురుషుడు చెప్పెను. దానిని విస్తరించి అనుగానము చేయుదును. వస్త్రములో దారపు ఏసెవలె సూక్ష్మమగు ఆతత్త్వము సులభముగా మాటలతో చెప్పుటకుగాని ఇంద్రియములతో చూచుటకుగాని శక్యముకాదు. పంచతన్మాత్రలు గుణత్రయము మనోబుద్ధ్యహంకారములు అంతఃకరణత్రయము అనెడి ఏకాదశ తత్త్వ వికారములు షోడశకలలు కర్మలు గుణములు మూర్తీభవించిన తత్త్వముగా ఆ కర్మమయ పురుషుని తెలియవచ్చును. అతడు ఈ షోడశ కలామయమగు దేహమును ఆశ్రయించి సముద్రజలమునందు ప్రతిబింబించిన చంద్రుడు వలె నుండి యోగసాధనచే జయింపబడు తత్త్వమై క్షేత్రజ్ఞుడని వ్యవహరింపబడుచుండును. తమస్సురజస్సుసత్త్వము ఈ మూడును జీవుని గుణములు. జీవుడు ఆత్మయొక్క గుణము. ఆత్మ పరమాత్మయొక్క గుణము. ఈ గుణత్రయాత్మకమగు ఈ దృశ్య ప్రపంచము అంతయు ఈ సప్తలోకములను ఈ జీవుని సృష్టియే అని క్షేత్రతత్త్వము నెఱిగినవారి వచనము.

వ్యాస ఉవాచ

ప్రకృత్యాస్తు వికారా యే క్షేత్రజ్ఞాస్తే పరిశ్రుతాః | తే చైనం న ప్రజానంతి న జానాతి స తానపి || 21

తైశ్చైవ కురుతే కార్యం మనఃషష్ఠెహేంద్రియైః | సుదాంతైరివ సంయంతా దృఢః పరమవాజిభిః || 22

ఇంద్రియేభ్యః పరా హ్యర్థా అర్థేభ్యః పరమం మనః | మనసస్తు పరా బుద్ది ర్బుద్ధేరాత్మా మహాన్పరః || 23

మహతః పరమవ్యక్త మవ్యక్తాత్పరతో 7మృతమ్‌ | అమృతాన్న పరం కించి త్సా కాష్ఠా పరమా గతిః || 24

ఏవం సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశ##తే | దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః || 25

అంతరాత్మని సంలీయ మనఃషష్ఠాని మేధయా | ఇంద్రియైరింద్రియార్థాంశ్చ బహుచి త్తమచింతయన్‌ || 26

ధ్యానేపి పరమం కృత్వా విద్యాసంపాదితం మనః | అనీశ్వరః ప్రశాంతాత్మా తతో గచ్ఛేత్పరం పదమ్‌ || 27

ఇంద్రియాణాం తు సర్వేషాం వశ్యాత్మా చలితస్మృతిః | ఆత్మనః సంప్రదానేన మర్త్యో మృత్యుముపాశ్రుతే || 28

విహత్య సర్వసంకల్పా స్సత్త్వే చితం నివేశ##యేత్‌ | సత్త్వే చిత్తం సమావేశ్య తతః కాలంజరో భ##వేత్‌ || 59

చిత్తప్రసాదేన యతి ర్జమాతీహ శుభాశుభమ్‌ | ప్రసన్నాత్మా೭೭త్మని స్థిత్వా ముఖమత్యంత మశ్నుతే || 30

లక్షణం తు ప్రసాదస్య యథా స్వప్నే సుఖం భ##వేత్‌ | నిర్వాతే వా యథా దీపో దీప్యమానో స కంపతే || 31

ఏవం పూర్వాపరే రాత్రే యంజన్నాత్మానమాత్మనా | లఘ్వాహరో విశుద్ధాత్మా పశ్యత్యాత్మానమాత్మని || 32

రహస్యం సర్వవేదానా మనై తిహ్యమనాగమమ్‌ | ఆత్మప్రత్యాయకం శాస్త్ర మిదం పుత్రానుశాసనమ్‌ || 33

ధర్మాఖ్యేనేషు సర్వేషు సత్యాఖ్యేనేషు యద్వసు | దశవర్ష సమస్రాణి నిర్మథ్యామృతముద్ధృతమ్‌ || 34

నవనీతం యథాదధ్నః కాష్ఠాదగ్నిర్యథై వ చ | తథైవ విదుషాం జ్ఞానం ముక్తి హేతోః సముద్ధృతమ్‌ || 35

స్నాతకానామిదం శాస్త్రం వాచ్యం పుత్రానుశాసనమ్‌ | తదిదం నాప్రశాంతాయ నాదాంతాయ తపస్వినే || 36

నావేదవిదు షే వాచ్యం తథానానుగతాయ చ | నాసూయ కాయాసృజవే న చానిర్దిష్టకారిణ || 37

న తర్కశాస్త్రదగ్ధాయ తథైవ పిశునాయ చ | శ్లాఘినే శ్లాఘనీయాయ ప్రశాంతాయ తపస్వినే || 38

ఇదం ప్రియాయ పుత్రాయ శిష్యాయానుగతాయ తు | రహస్యధర్మం వక్తవ్యం నాన్యసై#్మతు కథంచన || 39

యదప్యస్య మహీం దద్యా ద్రత్న పూర్ణా మిమాం నరః | ఇదమేవ తతః శ్రేయ ఇతి మన్యేత తత్త్వవిత్‌ || 40

అతో గుహ్యతరార్థం త దధ్యాత్మ మతిమానుషమ్‌ | యత్తన్మహర్షిభిర్దృష్టం వేదాంతేషు చ గీయతే || 41

తద్యుష్మభ్యం ప్రయచ్ఛామి యన్మాం పృచ్ఛథ సత్తమాః ||

యన్మే మనసి వర్తేత యస్తు వో హృది సంశయః | శ్రుతం భవద్భి స్తత్సర్వం కిమన్యత్కథయామి వః || 42

ప్రకృతియొక్క వికారములు అగు దృశ్యప్రపంచము - క్షేత్రజ్ఞుడనబడు ఆత్మతత్త్వము అను ఈ రెంటిలో అవి ఇతని నెరుగజాలవు. కాని అతడు వాని నెరుగును. సమర్థుడగు సారథి మేలైన గుఱ్ఱములతో రథమును నడిపినట్లు మనస్సుతో ఐదు జ్ఞానేంద్రియములతో ఆయా పనులు చేయించును. ఇంద్రియములకంటె ఇంద్రియములతో అనుభవించు విషయములు వాటికంటె మనస్సు మనస్సు కంటె బుద్ధి బుద్ధికంటె హిరణ్యగర్భుడను తత్త్వము దానికంటె జగద్బీజమగు అవ్యక్తమను ఈశ్వరతత్త్వము దానికంటె అమృతతత్త్వము ఒక దానికంటె మఱియొకటి సూక్ష్మతరములు. అమృతతత్త్వముకంటె సూక్ష్మతరము లేదు. అదే అందరకును కడపటి గమ్యస్థానము. ఈవిధముగా సర్వ భూతములయందు రహస్యముగా ప్రత్యక్తత్త్వమై యున్న పరాత్మతత్త్వము బహిర్గతమై ప్రకాశింపక కనబడక యుండును. కాని సూక్ష్మదృష్టి కల మహనీయులు నిశితమగు బుద్ధితో చూడగలుగుదురు. పంచ జ్ఞానేంద్రియముల మనస్సున లీనము చేసి ఆ అఱిటితో సుఖవిషయములను ఆలోచింపక అనుభవింపక జ్ఞానసంపన్నమగు మనస్సును పరతత్త్వధ్యానమున నిలిపి తనపై ఇంద్రియములను అధికారము చేయనీయక ప్రశాంత మనస్కుడగు వాడు ముక్తి పొందును. ఇంద్రియముల కన్నిటికి వశుడయి ధ్యానము తత్త్వముపై నిలుపలేక ఆత్మను మనశ్చాంచల్యమునకు వదలినవాడు మృత్యువును - సంసారమును పొందును. సర్వ సంకల్పములను అణచి చిత్తమున సత్త్వగుణమును నింపి తత్త్వవిచారణాపరుడు కావలెను. చిత్తము నిర్మలముగటచే ఇది శుభము ఇది అశుభము అను భేదబుద్ధి తొలగి అత్యంత సుఖమును పొందును. చిత్తప్రసాదము గాఢసుషుప్తిసుఖమువలె స్వచ్ఛమయినది. అప్పుడు చిత్తము గాలిలేనిచోట దీపమువలె నిశ్చలమై ప్రకాశించును. ఈ తత్త్వ విచారశాస్త్రము సర్వవేద రహస్యము. ఐతిహ్యములచే అగమములచే లభించదు. ఆత్మజ్ఞనము కలిగించునది. భృగువను నతనికి అతని తండ్రనియగు వరుణుడుపదేశించినది. పెరుగును మథించి నవనీతమునువలె కాష్ఠము మథించి అగ్నినివలె ధర్మసత్య ప్రతిపాదకములగు శాస్త్రములను పదివేలు కొలదిగ సంవత్సరములపాటు మథించి తత్త్వవేత్తలు ముముక్షువులకు ముక్తిని సంపాదించు ఈ తత్త్వమును వారి నుద్ధరించుటకై బయల్పరచిరి. వేదవిద్యాధ్యయనము చేసినవానికి దీనిని తెలుపవలెను. ప్రశాంత చిత్తము ఇంద్రియనిగ్రహము తపస్సు వేదార్థజ్ఞానము పెద్దలను అనువర్తించుట అననూయత బుజు ప్రవర్తనము చెప్పినట్లు చేయుట- అను మంచి లక్షణములు లేనివానికిని తర్కశాస్త్రముతో బుద్ధి చెడినవానికిని కొండెగానికిని ఆత్మస్తుతి చేసికొను వానికిని అతడు భూమినంతటిని ప్రతిఫలముగా ఇచ్చినను బోధించరాదు. ఇది అన్ని ధనములకంటె జ్ఞానములకంటె శ్రేయోరూపము. రహస్యతరము. మనుష్యులకు దుర్టభము. మహర్షులు దర్శించినది. ఉపనిషత్తులతో తెలిపుబడినది. ఓ మహర్షులారా ! మీరు నన్నడిగితిరి కావున తెలిపితిని. అదంతయు వింటిరి. నాకు తెలిసినది మీకు సంశయము కలిగినది ఏదైన అడుగుడు. చెప్పెదను.

మునయ ఊచుః

అధ్యాత్మం విస్తరేణహ పునరేవ వదస్వ సః | యదధ్యాత్మం యథా విద్మో భగవన్నృపి సత్తమ || 43

ఓ భగవన్‌ ! ఋషిసత్తమా! అధ్యాత్మమును మాకు ఇంకను విస్తరించి తెలుపుము.

వ్యాస ఉవాచ

ఆధ్యాత్మం యదిదం విప్రాః పురుష న్యేహ పఠ్యతే | యుష్మభ్యం కథయిష్యామి తస్య వ్యాఖ్యావధార్యతామ్‌ ||

భూమి రాపస్తథా జ్యోతి ర్వాయురాకాశ##మేవ చ | మహాభూతాని యశ్చైవ సర్వభూతేషు భూతకృత్‌ || 45

విప్రులారా ! పృథివి - నీరు - అగ్ని - వాయువు - ఆకాశము - అను పంచమహాభూతములను వాటియందు నిలిచియున్న భూతస్రష్టయగు పరమాత్ముడును అనునదియే అధ్యాత్మము.

మునయ ఊచుః

ఆకారం తు భ##వేద్యస్య యస్మిన్దేహం న పశ్యతి | ఆకాశాద్యం శరీరేషు కథం తదుప వర్ణయేత్‌ || 46

ఇంద్రియాణాం గుణాః కేచిత్కథం తానుపలక్షయేత్‌

వీనిలో వేనికి రూపము కలదు? వేనికి రూపము లేదు? ఇవి శరీరమున ఎట్లు ఉన్నవి? ఇంద్రియములును వాని గుణములను ఏవి? ఎట్లు వానిని గుర్తించవలెను?

వ్యాస ఉవాచ

ఏతద్వో వర్ణయిష్యామి యథావదను దర్శనమ్‌ | శృణుధ్వం తదిహైకాగ్ర్యా యథాతత్త్వం యథా చ తత్‌ || 47

శబ్దః శ్రోత్రం తథా ఖాని త్రయ మాకాశ లక్షణమ్‌ | ప్రాణశ్చేష్టా తథా స్పర్శ ఏతే వాయుగుణాస్త్రయః || 48

రూపం చక్షుర్విపాకశ్చ త్రిధా జ్యోతిర్విధీయతే | రసోథ రసనం స్వేదో గుణాస్త్వేతే త్రయోంభసామ్‌ || 49

ఘ్రేయం ఘ్రాణం శరీరం చ భూమేరేతే గుణాస్త్రయః | ఏతావానింద్రియ గ్రామో వ్యాఖ్యాతః పాంచభౌతికః || 50

వాయోః స్పర్శో రసోద్భ్యశ్చ జ్యోతిషో రూపముచ్యతే | ఆకాశప్రభవః శాబ్దో గంధో భూమిగుణః స్మృతః || 51

మనో బుద్ధిః స్వభావశ్చ గుణా ఏతే స్వయోనిజాః | తే గుణానతివర్తంతే గుణభ్యః పరమా మతాః || 52

యథా కూర్మ ఇవాంగాని ప్రసార్య సంనియచ్ఛతి | ఏవమేవేంద్రియగ్రామం బుద్ధిశ్రేష్ఠో నియచ్ఛతి || 53

యదూర్ధ్వం పాదతలయో రవాక్చోర్ధ్వం చ పశ్యతి | ఏతస్మిన్నేవ కృత్యే సా వర్తతే బుద్ధిరుత్తమా || 54

గుణౖస్తు నీయతే బుద్ధి ర్బుద్ధిరేవేంద్రియాణ్యపి | మనఃషష్ఠాని సర్వాణి బుద్ధ్యా భావాత్కృతో గుణాః || 55

ఇంద్రియాణి సరైః పంచ షష్ఠం తన్మన ఉచ్యతే | సప్తమీం బుద్ధిమేవా೭೭హుః క్షేత్రజ్ఞం విద్ధిచాష్టమమ్‌ || 56

చక్షురాలోకనాయైవ సంశయం కురుతే మనః | బుద్ధిరధ్యవసానాయ సాక్షీ క్షేత్రజ్ఞ ఉచ్యతే || 57

రజస్తమశ్చ సత్త్వం చ త్రయ ఏతే స్వయోనిజాః | సమాః సర్వేషు భూతేషు తాన్గుణా నుపలక్షయేత్‌ || 58

తత్ర యత్ర్పీతి సంయుక్తం కించి దాత్మని లక్షయేత్‌ | ప్రశాంతమివ సంయుక్తం సత్త్వం తదుపధారయేత్‌ || 59

యత్తు సంయోహసంయుక్తం కాయే మనసి వా భ##వేత్‌ | ప్రవృత్తం రజఇత్యేవం తత్ర చాప్యుపలక్షయేత్‌ || 60

యత్తు సంయోహసంయుక్త మవ్యక్తం విషమం భ##వేత్‌ | అప్రతర్క్యమవిజ్ఞేయం తమ స్తదుపధారయేత్‌ || 61

ప్రహర్ష ః ప్రీతిరానందం స్వామ్యం స్వస్థాత్మచింతతా | అకస్మాద్యది వా కస్మా ద్వదంతి సాత్త్వికాన్గుణాన్‌ || 62

అభిమానో మృషావాదో లోభో మోహ స్తథాక్షమా | లింగాని రజసస్తాని వర్తంతే హేతుతత్త్వతః || 63

తథా మోహః ప్రమాదశ్చ తంద్రీ నిద్రాప్రబోధితా | కథంచి దభి వర్తంతే విజ్ఞేయా స్తామసా గుణాః || 64

శబ్దము ఆకాశపు గుణము; చెవి దానిని గ్రహించు ఇంద్రియము. శూన్యము దేహములో దాని ఉనికి. స్పర్శ వాయువునకు గుణము. ప్రాణవాయువు దేహమున దాని రూపము. చేష్ట - చలనము - దాని వ్యాపారము. రూపము అగ్నికి గుణము. నేత్రము దాని ఇంద్రియము. విపాకము దేహమున దాని వ్యాపారము. రసము - రుచి - నీటికి గునము; నాలుక దాని ఇంద్రియము: చెమట దేహమున దాని రూపము. గంధము భూమికి గుణము. ముక్కు దాని ఇంద్రియము. శరీరము దాని రూపము. మనస్సు - బుద్ధి - స్వభావము - ఇవి స్వతఃసిద్ధములైనవి. ఇవి ఈ భూత గుణములకు అతీతములు. బుద్ధితో వాటిని వివేకులు నిగ్రహించుకొందురు. శబ్దాది గుణములు - విషయములు బుద్ధిని ప్రేరించును. బుద్ధి ఇంద్రియములను ప్రేరించును. మనస్సుతో ఇంద్రియములు ఆరు - బుద్ధప్రేరణ లేనిచో గుణ విషయ అనుభవమునకు లేదు. కనుక అది అరింద్రియములపై ఏడవ తత్త్వము - క్షేత్రజ్ఞుడగు జీవుడు ఎనిమిదవ తత్త్వము. క్షేత్రమనగా దేహము. దానియందుండి ఆయా కర్మలు చేయుచు వాని ఫలముల ననుభవించు జీవుడు క్షేత్రజ్ఞుడు. వీనిలో చక్షుస్సు మొదలగు ఇంద్రియములు రూపము మొదలగు విషయముల గ్రహించును. మనస్సు సంకల్ప వికల్పములను సంశయమును కలిగించునున. బుద్ధి-ఇది ఇట్టిదని నిశ్చయమును కలిగించును. క్షేత్రజ్ఞుడు వీటి సహాయమున ఆయాపనులు చేయుచుండును. సత్త్వరజస్తమో గుణములును స్వతఃసిద్ధములైనవి. ఇవి అన్ని భూతములయందును సమత్వముతోనే ఉండును. కాని జీవులలో ఎవరియందేది అధికముగా నుండునో వారికి దానినిబట్టి ప్రవృత్థులు కలుగుచుండును. ప్రహర్షము - ప్రీతి - ఆనందము - నిశ్చలచిత్తము అన్నిటిని తన అధీనములో ఉంచుకోగలుగుట - ఇవి సత్త్వగుణ లక్షణములు. అభిమానము - వ్యర్థముగా మాటాడుట - లోభము - మోహము - క్షమ ఇవి రజోలక్షణములు. అధిక మోహము - మూఢత్వము - ఏమరుపాటు - బద్ధకము - నిద్ర - ఎచ్చరిక - మెలకువ లేకుండుట తెలియవలసిన వాటిని ఎంతో శ్రమమీదకాని తెలిసికొన లేకుండుట - ఇవి తమోగుణ లక్షణములు.

మనః ప్రసృజతే భావం బుద్ధి రధ్యవసాయినీ | హృదయం ప్రియమేవేహ త్రివిధా కర్మచోదనా || 65

ఇంద్రియేభ్యః పరా హ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః | మననస్తు పరా బుద్ధి ర్బుద్ధే రాత్మా పరః స్మృతః || 66

బుద్ధి రాత్మా మనుష్యస్య బుద్ధిరేవా೭೭వాత్మనాయికా | యదా వికురుతే భావం తదా భవతి సా మనః || 67

ఇంద్రియాణాం పృథగ్భావా ద్బుద్ధి ర్వికురుతే హ్యను | శృణ్వతీ భవతి శ్రోత్రం స్పృశంతీ స్పర్శ ఉచ్యతే || 68

పశ్యంతి చ భ##వేద్దృష్టీ రసంతీ రసనా భ##వేత్‌ | జిఘ్రంతీ భవతి ఘ్రాణం బుద్ధి ర్వికురుతే పృథక్‌ || 69

ఇంద్రియాణి తు తాన్యాహు స్తేషాం వృత్త్యా వితిష్ఠతి | తిష్ఠతి పురుషే బుద్ధి ర్బుద్దఙ ర్బావవ్యవస్థితా || 70

కదాచి ల్లభ##తే ప్రీతిం కదాచిదపి శోచతి | న సుఖేన న దుఃఖేన కాదాచిదిహ ముహ్యతే || 71

స్వయం భావాత్మికా భావాం స్త్రీనేతానతి వర్తతే | సరితాం సాగరో భర్తా మహావేలామివోర్మిమాన్‌ || 72

యదా ప్రార్థయతే కించి త్తదా భవతి సా మనః | అధిష్ఠానే చ వై బుద్ధ్యా పృథగేతాని సంస్మరేత్‌ || 73

ఇంద్రియాణి చ మేధ్యాని విచేతవ్యాని కృత్స్నశః | సర్వణ్యవాసు పూర్వేణ యద్యదా చ విధీయతే || 74

అభిభాగమనా బుద్ధి ర్భావో మనసి వర్తతే | ప్రవర్తమానస్తు రజః సత్త్వ మప్యతివర్తతే || 75

యే వై భావేన వర్తంతే సర్వే ష్వేతేషు తే త్రిషు | అన్వర్థాస్సంప్రవర్తంతే రథనేమి మరా ఇవ || 76

ప్రదీపార్థం మనః కుర్యా దింద్రియైర్ముద్ధిసత్తమైః | నిశ్చరద్భిర్యథాయోగ ముదాసీనైర్యదృచ్ఛయా || 77

ఏవం స్వభావమేవేద మితి బుద్ధ్యా స ముహ్యతి | అశోచస్సంప్రహృష్యంశ్చ నిత్యం విగతమత్సరః || 78

న హ్యాత్మా శక్యతే ద్రష్టు మింద్రియైః కామగోచరైః | ప్రవర్తమానైరనేకై ర్దుర్ధరైరకృతాత్మభిం || 79

తేషాం తు మనసా రశ్మీ న్యదా సమ్యజ్నియచ్చతి | తదా ప్రకాశ##తేస్యా೭೭త్మా దీపదీప్తా యథా೭೭కృతిః || 80

సర్వేషామేవ భూతానాం తమస్యుపగతే యథా | ప్రకాశం భవతే సర్వం తథైవ ముపధార్యతామ్‌ || 81

యథా వారిచరః పక్షీ న లివ్యతి జలే చరన్‌ | విముక్తాత్మా తథా మోగీ గుణదోషై ర్న లిప్యతే || 82

ఏవమేవ కృతప్రజ్ఞో న దోషై ర్విషయాం శ్చరన్‌ | ఆసజ్జమానః సర్వేషు న కథంచిత్ర్పలిప్యతే || 83

త్యక్త్వా పూర్వకృతం కర్మ రతి ర్యస్య సదా೭೭త్మని | సర్వభూతాత్మభూతస్య గునసంగేన సజ్జతః || 84

న్వయమాత్మా ప్రసవతి గుణష్వపి గుణష్వపి కదాచన | న గుణా విదురాత్మానం గుణా న్వేద స సర్వదా || 85

పరిదధ్యాద్గుణానాం స ద్రష్టా చైవ యథాతథమ్‌ | సత్త్వక్షేత్రజ్ఞయోరేవ మంతరం లక్షయే న్నరః || 86

సృజతే తు గుణానేక ఏకో న సృజతే గుణాన్‌ | పృథగ్భూతౌ ప్రకృత్యైతౌ సంప్రయుక్తౌ చ సర్వదా || 87

యథాశ్మనా హిరణ్యస్య సంప్రయుక్తౌ తథైవ తౌ | మశకోదుంబరౌ వాపి సంప్రయుక్తౌ యథా నహ || 88

ఇషీకా వా యథా ముంజే పృథక్చ సహ చైవ హ | తథైవ సహితావేతా అన్యోన్యస్మి న్ర్పతిష్ఠితౌ || 89

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షి సంవాదే జ్ఞానినాం మోక్షప్రాప్తి నిరూపణంనామ సప్తత్రింశదధిక ద్విశతతమోధ్యాయః.

భావములను సృజించునది మనస్సు : అధ్యవసాయమును - నిశ్చయమును - కలిగించునది బుద్ధి: ఆనందము మొదలగు భావములను అనుభూతి పొందునది హృదయము - అని కర్మలకై జీవుని ప్రేరించు తత్త్వములు మూడు విధములు. ఈ అంశములను ఇట్లు వివరించుకొనవలయును : ఇంద్రియములకంటె సూక్ష్మతరములు శబ్దస్పర్శరూప రస గంధములనెడి విషయములు. వాటికంటె సూక్ష్మతరము మనస్సు. దానికంటె సూక్ష్మతరము బుద్ధి: బుద్ధికంటె సూక్ష్మతరమై ఈ అన్నింటిచేత పని చేయించువాడు జీవుడు. కాని జీవునకు గల ఉపకరణములలో బుద్ధియె సూక్ష్మతమము. ఈ స్వతంత్ర శక్తి కల బుద్ధిలో సంకల్ప వికల్పములు కలిగిన స్థితియే మనస్సు. అట్లే బుద్ధియే వినుచో శ్రోత్రము స్పృశించుచోత్వక్‌ చూచుచో చక్షుస్సు - రుచి చూచుచో రసన - వాసన చూచుచో ఘ్రాణము అని ఐదింద్రియములుగా వ్యవహరింపబడును. జీవుని ఆశ్రయించియుండు ఈ బుద్ధి ఆయా భావములను బట్టి వ్యవస్థనొందును. అవి 1. సుఖము 2. దుఃఖము. 3. ఏమియు తెలియని మూఢస్థితి. బుద్ధి ఈమూడు ప్రభావములకును అతీతమైనది. సముద్రము నదులను చెలియలికట్టను తనలో ఇముడ్చుకొన్నట్లు బుద్ధి ఆయా భావములను తనలో ఇముడ్చుకొనును. బుద్ధి ఆయాభావముల యందు ప్రవర్తించునప్పడు గుణములు మూడును తమ తమ ప్రభావమును చూపును. ప్రవృత్తికాలములో రజోగుణము సత్త్వగుణముపై తన అధికారము చూపును. ఈ మూడు గుణములును చక్రనాభినేములనడుమ చక్రపు అరల - ఆకులవలె బుద్ధియందు ఇమిడియుండి ఆయా విషయముల ననుసరించి ప్రవర్తించుచుండును. వివేకులు ఇంద్రియములను మనస్సునుకూడ ఆత్మతత్త్వమును సాక్షాత్కరించుకొనుటకే వినియోగించుకోవలెను. కాని మనస్సును అదుపులో ఉంచుకొననిదే ఇంద్రియములు తమ విషయములమీద స్వేచ్ఛగా ప్రవర్తించుచున్నంతవరకు ఆత్మ సాక్షాత్కారము సాధ్యముకాదు. కనుక ముముక్షువు వివేకముతో మనస్సహాయమున ఇంద్రియములను నిగ్రహించవలెను. చీకటి తొలగగానే లోకము నందలి ప్రాణులకు ఆయా వస్తువులు కనబడునట్లు అజ్ఞానము తొలగగానే ఆత్మ సాక్షాత్కారము జరుగును. నీటిపక్షి నీటిలో తిరుగుచున్నను నీరుకాని అచటి మలినములుకాని అంటునట్లు జీవన్ముక్తుడగు యోగి ఇంద్రియ విషయములలో ప్రవర్తించినను వాని దోషములతనికి అంటవు. ఆత్మానుభవముతో తనయందు తానే ఆనందించువారు సంచితకర్మను నశింపజేసికొని ప్రారబ్ధము అనుభవముతో నిశించి సర్వభూతములు తానైనందున త్రిగుణ సంబంధముచే విషయములలో ప్రవర్తిల్లినను ఆత్మ స్వయంజ్యోతిస్తత్త్వముతో ప్రకాశించును. ఆత్మ గుణములను ఎరుగును. జడములగుటచే గుణములు ఆత్మను ఎరుగలేవు. అతడు ధ్యానయోగముచే త్రిగుణముల తత్త్వమును గ్రహించగలడు. సత్త్వాది గుణములకును క్షేత్రజ్ఞునకు గల భేదము ఇది. వీనిలో సత్త్వాదులు గుణములను సృజించజాలవు. ఆత్మ గుణాదులను సృజించగలదు. ఇట్లు ఇవి వేరువేరయి యుండియు లోక వ్యవహారమున ఇవి అవినాభావముతో ఒక దానిని మఱియొకటి ఎడబాయక యుండును. ఇది ఖనిజ శిల- బంగారముల వంటివి. మేడికాయ - దానియందలి పురుగులవంటివి. ముంజదర్భయందలి ముల్లు వంటివి. ఇవి వేరు తత్త్వములయియును కలిసియే యుండును. వీనిని వేరుపరచుకొనుటయే ఆత్మతత్త్వ వివేకము. ఇదియే ఆత్మసాక్షాత్కారమునకు సాథనము.

శ్రీ శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాస ఋషిసంవాసమున విద్యా కర్మ గతి వివేచనమను రెండువందల ముప్పదిఏడవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters