Brahmapuranamu    Chapters   

అథఏకోనత్రింశదధికద్విశతతమో7ధ్యాయః

వ్యాసముని సంవాదే విష్ణుభక్తిహేతుకథనమ్‌

మునయ ఊచుః

శ్రుతం ఫలం గీతికాయా అస్మాభిః సుప్రజాగరే | కృష్ణస్య యేన చాండాలో గతో7సౌ పరమాం గతిమ్‌ || 1

యథా విష్ణౌ భ##వేద్భక్తి స్తన్నో బ్రూహి మహామతే | తపసా కర్మణా యేన శ్రోతుమిచ్ఛాను సాంప్రతమ్‌ || 2

విష్ణుభక్తిహేతుకథనము

వ్రజాగరము చేసి విష్ణుమహిమ గానము చేసి చాండాలుడును ముక్తిని పొందిన విషయము వింటిమి. మహామతి శాలివగు ఓ వ్యాసమహర్షీ ! ఏతపస్సుచే ఏ కర్మ నాచరించుటచే విష్ణవునందు భక్తికలుగునో ఆఉపాయమును మాకు తెలుపుము. వినగోరుచున్నాము. అనిమునులు అడిగిరి.

వ్యాస ఉవాచ

శృణుధ్వం మునిశార్దూలాః ప్రవక్ష్యా మ్యను పూర్వశః |యథాకృష్ణే భ##వేద్భక్తిః పురుషస్య మహాఫలా || 3

సంసారే7స్మి న్మహాఘోరే సర్వభూతభయావహే| మహామొహకరే నౄణాం నానాదుఃఖ శతాకులే || 4

తిర్య గ్యోని సహస్రేషు జాయమానః పునః పునః | కథంచిల్ల భ##తే జన్మ దేహీ మానుష్యకం ద్విజాః || 5

మానుషత్వే7పి విప్రత్వం విప్రత్వే7పి వివేకితా | వివేకాద్ధర్మబుద్ది స్తు బుద్ద్యా తు శ్రేయసాం గ్రహః || 6

యావ త్పాపక్షయం పుంసాం న భ##వే జ్జన్మసంచితమ్‌ | తావన్న జాయతే భక్తి ర్వాసుదేవే జగన్మయే || 7

తస్మా ద్వక్ష్యామి భో విప్రా భక్తిః | కృష్ణే యథా భ##వేత్‌ | అన్యదేవేషు యా భక్తిః పురుషస్యేహ జాయతే || 8

కర్మణా మనసా వాచా తద్గతే నాంతరాత్మనా |తేన తస్య భ##వే ధ్భక్తి ర్యజనే మునిసత్తమాః || 9

సకరోతి తతో విప్రా భక్తిం చాగ్నేః సమాహితః | తుష్టే హుతాశ##నే తస్య భక్తి ర్భవతి భాస్కరే || 10

పూజాం కరోతి సతత మాదిత్యస్య తతో ద్విజాః | ప్రసన్నే భాస్కరే తస్య భక్తిర్భవతి శంకరే || 11

పూజాం కరోతి విధవ త్ప తు శంభో | ప్రయత్నతః | తుష్టే త్రిలోచనే తస్య భక్తిర్భవతి కేశ##వే || 12

సంపూజ్య తం జగన్నాథం వాసుదే వాఖ్య మవ్యయమ్‌ | తతో భుక్తిం చ ముక్తించ స ప్రాప్నోతి ద్వి జోత్తమాః || 13

ఓ మునిశ్రేష్టులారా! మానవునకు మహాఫలప్రదమగు విష్ణుభక్తి కలుగుఉపాయము క్రమముగా చెప్పెదను. వినుడు. మహాఘోరమును సర్వప్రాణులకు భయమును కలిగించునదియు మహామోహమును కలిగించునదియు నానా విధములగు నూర్లకొలది దుఃఖములతో నిండినదియు అగు ఈ సంసారమున జీవుడు వేలకొలదిగా తిర్యగ్యోనుల - వృక్ష పశుపక్ష్యాది జన్మములయందు మరల మరల జన్మించి ఎంతో కష్టము మీద మనుష్యజన్మమును పొందును. అందును.

బ్రహణుడగుట అందును వివేకములుగుట అందును ధర్మమునందు ప్రవృత్తి అందును శ్రేయః వ్రదమయిన వానిని గ్రహించుట దుర్లభము. సంచితపాపము సంపూర్ణముగా నశించనంతవరకు సర్వజగద్రూవుడగు వాసుదేవుని యందు భక్తికలుగదు. కనుక అందులకు ఉపాయము తెలిపెదను. వినుడు. త్రికరణములతో శుద్ధిగా అన్యదేవతల యందు మనస్సునిలిపి అనుష్ఠించు భక్తివలన యజ్ఞములు చేయుటయందు శ్రద్దకలుగును. అప్పుడు అగ్నియందు భక్తికలిగి యజ్ఞములు చేసి అగ్నిని తృప్తి నొందించుటచే సూర్యునియందు భక్తికలుగును. భాస్కరుని ఉపాసించి అతనిని ప్రీతునిగా చేయుటవలన శంకరునియందు భక్తికలగును. విధివిధానానుసారము శంకరుని ఆరాధించి అతనిని తుష్టి నొందించుటవలన విష్ణునియందు భక్తికలుగును. జగద్రక్షకుడును అవ్యయుడును- నాశనములేనివాడు - అగు వాసుదేవుని సంపూజించుటవలన నరుడు భుక్తిని ముక్తిని పొందును.

మునయ ఊచుః

అవైష్ణవా నరా యేత తు దృశ్యంతే చ మహామునే | కిం తే విష్ణుం నార్చయంతి బ్రూహి త త్కారణం ద్విజ || 14

ఓ మహాముని ! లోకమున వైష్ణవులు కానివారు కొందఱు కొనబడుటకును వారా విష్ణుపునర్చింపకుండుటకును హేతు వేమని మునులు వ్యాసునడిగిరి.

వ్యాస ఉవాచ

ద్వౌ భూతసర్గౌ విఖ్యాతౌ లోకేస్మిన్మునిపత్తమాః | అసురశ్చ తథా దైవః పురా సృష్టః స్వయంభువా || 15

దైవీం ప్రకృతి మాసాద్య పూజయంతి తతో7చ్యుతమ్‌ | అసురీం యోని మాపన్నా ధూషయంతి నరా హరిమ్‌ || 16

మాయయా హత విజ్ఞానా విష్ణో స్తేతు నరాధహాః | ఆప్రాప్య తం హరిం విప్రా స్తతో యాం త్యధమాం గతిమ్‌ || 17

తస్య యా గహ్వరీ మాయా దు ర్విజ్ఞేయా సురాసురైః | మహామోహకరీ నౄణాం దుస్తరా చాకృతాత్మభిః || 18

ఓ మునిశ్రేష్టులారా! స్వయంభూబ్రహ్మచేయు ఈ భూతసృష్టి దైవీసృష్టి అసురసృష్టి అని రెండువిధములు దైవీ ప్రకృతి - స్వభావము. కలవారు విష్ణుని భక్తితో అర్చింతురు. అనురీప్రకృతి కలవారు హరిని ధూషింతురు. అసురీప్రకృతిగల నరాధములు మాయచే విజ్ఞానము నశించినందున విష్ణుని చేరలేక అధమగతిని పొందుదురు. విష్ణుని మాయ గంభీరమైనది. సురాసురులకును తెలిసికొన శక్యముకానది. మహామోహము కలిగించునది. సంస్కారము నొందిన మనస్సులులేని వారికి దాట శక్యముకానిది.

మునయ ఊచుః

ఇచ్చానుస్తాం మహామాయాం జ్ఞాతుంవిష్ణోః సుదుస్తరామ్‌ | వక్తుమర్హసి ధర్మజ్ఞ పరం కౌతూహలం హినః || 19

ఓ ధర్మజ్ఞా ! సుదుస్తరమగు విష్ణుని మహామాయను గూర్చి తెలిసినకొన కుతూహలమగుచున్నది. తెలుపుము.

వ్యాస ఉవాచ

స్వప్నేంద్రజాలసంకాశా మాయా సా లోకకర్షణీ | కః శక్నోతి హరే ర్మాయాం జ్ఞాతుం తాం కేశవా దృతే || 20

యా వృత్తా బ్రాహ్మణస్యా77సీ న్మాయార్థే నారదస్య చ | విడంబనాం తుతాం విప్రాః శృణుధ్వం గదతో మమ || 21

ప్రాగాసీ న్నృపతి శ్రీమా నాగ్నీధ్ర ఇతి విశ్రుతః | నగరే కామదమన స్తస్యాథ తనయః శుచిః || 22

ధర్మారామః క్షమాశీలః పితృశుశ్రూషణరతః | ప్రజానురంజకో దక్షః శ్రుతిశాస్త్రకృతశ్రమః || 23

పితా7స్య త్వకరో ద్యత్నం వివాహాయ న చైచ్ఛత | తం పితా ప్రాహ కిమితి నేచ్ఛ సే దారసంగ్రహమ్‌ || 24

సర్వమేత త్సుఖార్థం హి వాంఛంతి మనుజాః కిల | సుఖమూలా హి దారాశ్చ తస్మా త్తం త్వం సమాచర || 25

స పితుర్వచనం శ్రుత్వా తూష్ణీ మాస్తే చ గౌరవాత్‌ | ముహుర్ముహు స్తం చ పితా చోదయామాస భోద్విజాః || 26

అథాసౌ పితరం ప్రాహ తాత నామా నురూపతా | మయా సమాశ్రితా వ్యక్తా వైష్ణవీ పరిపాలినీ || 27

తం పితా ప్రాహ సంగమ్య నైష్య ధర్మో7స్తిపుత్రక | నవిధారయితవ్యా స్యా త్పురుషేణ విపశ్చితా || 28

కురు మద్వచనం పుత్ర ప్రభురస్మి పితా తవ | మా నిమజ్జ కులం మహ్యం నరకే సంతతి క్షయాత్‌ || 29

స హి తం పితు రా దేశం శ్రుత్వా ప్రాహ సుతో వశీ | ప్రీతః సంస్మృత్య పౌరాణీం సంసారస్య విచిత్రతామ్‌ || 30

లోకములను ఆకర్షించు ఆ విష్ణుమాయ స్వప్నముతో ఇంద్రజాలముతో సమానమైనది. దానిని విష్ణువు తప్ప మఱవ్వరును తెలిసికొనజాలరు. మాయ విషయములో ఒక బ్రహ్మణునకును నారదమహర్షికిని కూడ జరిగిన మోసము తెలిపెదను వినుడు. ఒక నగరమును పూర్వము అగ్నీధ్రుడగు కామదమనుడురాజుండెడివాడు. అతని కుమారుడు పవిత్రుడు, ధర్మమునందే ఉండి ఆనందము పొందువాడు, క్షమాశీలము పితృసేవాసక్తి ప్రజలను రంజించు సమర్థత కలవాడు, వేదములయందు శాస్త్రములయందు పరిశ్రమ చేసినవాడు. తండ్రి అతనికి పెండ్లి చేయ యత్నించెను. అతడు ఇష్టపడలేదు. నాయనా! నీవు పెండ్లాడ ఇష్టపడని కారణమేమి? మునుజులు భార్యవలన సుఖములు లభించునను తలపుతోనే కదా పెండ్లాడుదురు. కనుక నీవును వివాహముచేసికొనుము. అని తండ్రి పలుకగా అయనమందలి గౌరవముచే కుమారుడు ఏమియు సమాధానమీయక ఊరకుండెను. ఐనను మరల అడుగగా అతడు తండ్రితో ఇట్లు పలికెను: నేను అభివ్యక్తము పరిపాలింపదగినదియు విష్ణునికి సంబంధించినదియును అగు 'నామానురూపతా' నామమునకు తగినట్లుడచుట అనునియమమును ఆశ్రయించితిని అనెను. తండ్రి ఇట్లు పలికెను. కుమారా? ఇది ధర్మముకాదు. వివేకియగుపురుషుడు తండ్రి అజ్ఞకు విరుద్ధముగా ఆలోచింప దగదు. నాకు నీపై అధికారము కలదు. నామాట పాలింపుము. సంతతి ముందునకు సాగకపోవుటచే నా వంశము నరకములో మునుగునట్లు చేయకుము. అనెను. తండ్రి ఇచ్చిన ఈ అజ్ఞను విని ఇంద్రియనిగ్రహము కల ఆ కుమారుడు అనాదిసిద్ధముగా నున్న ఈ సంసారవు విచిత్రస్థితిని జ్ఞాపకము చేసికొని ఇట్లు పలికెను.

పుత్రఉవాచ

శృణు తాత వచో మహ్యం తత్త్వవాక్యం సహేతుకమ్‌ | నామానురూపం కర్తవ్యంసత్యం భవతి పార్తివ || 31

మయా జన్మ సహస్రాణి జరామృత్యుశతానిచ | ప్రాప్తాని దారసంయోగ వియోగాని చ సర్వశః || 32

తృణగల్మలతావల్లీ సరీసృపమృగద్విజా ః | పశుస్త్రీ పురుషాద్యాని ప్రాప్తని శతశో మయా ||

33

గణకింనరగంధర్వ విద్యా ధరమహోరగాః | యక్షగుహ్యకరక్షాంసి దానవాప్సరసః సురాః || 34

నదీశ్వరసహస్రం చ ప్రాప్తం తాత పునః పునః | సృష్టస్తు బహుశః | సృష్టౌ సంహారే చాపి సంహృతః || 35

దారసంయోగయు క్తస్య తా తేదృజ్మే విడంబనా| ఇత స్తృతీయే య ద్వ్రత్తం మమ జన్మని త చ్చ్రణు ||

కథయామి సమాసేవ తీర్థమాహత్మ్యసంభవమ్‌ || 36

అతీత్య జన్మాని బహూని తాత! నృదేవగంధర్వ మహోరగణామ్‌ |

విద్యాధరాణాం ఖగకింనరాణాం జాతో హి వంశే సుతపా మహర్షిః || 37

తతో మమాభూదచలా హి భక్తి ర్జనార్దనే లోకపతౌ మధుఘ్నే |

వ్రతోపవానై ర్వివిధై శ్చభక్త్యా సంతోషత శ్చక్రగదాస్త్రధారీ || 38

తుష్టోభ్యగా త్పక్షిపతిం మహత్మా విష్ణుః సమారుహ్య వరప్రదో మే |

ప్రాహోచ్చశబ్దం వ్రియతాం ద్విజాతే వరో హి యం వాంఛసి తం ప్రదాస్యే || 39

తతో7హ మూచే హరిమీశితారం తుష్టో7సి చే త్కేశవ త ద్వృణోమి |

యా సా త్వదీయా పరమా హి మాయా తాం వేత్తు మిఛ్ఛామి జనార్దనా7హమ్‌ || 40

అథాబ్రవీ న్మే మధుకైటభారిః కిం తే తయా బ్రహ్మన్మాయయా వై |

ధర్మార్థకామాని దదాని తుభ్యంపుత్రాణి ముఖ్యాని నిరామయత్వమ్‌ || 41

తతో మురారిం పునరుక్తవా నహం భూయో 7 ర్థధర్మార్థ జిగీషు తైవ యత్‌ |

మాయా త వేమా మిహవేత్తుమిచ్చే మ మాద్య తాం దర్శయ పుష్కరాక్ష || 42

నాయనా ! సహేతుకమగు తాత్త్విక విషయమును చెప్పెద వినుము. ఓ రాజా! నామమునకు అనుగుణముగా ఆచరించుట కర్తవ్యము. అనునది సత్యము. నేను ఎన్నియో జన్మములు జరామరణములు భార్యలతో సంయోగ వియోగములు గడ్డి -పొదులు -తీగలు సరీసృపములు -ప్రాకెడిపామువంటి ప్రాణులు - మృగములు-పక్షులు-పశువులు మానవులలో స్త్రీ పురుషులు మొదలగు రూపములు ఎన్నియో పొందితిని. గణదేవతలగు వసురుద్రాదిత్యులు కింసర గంధర్వ - విద్యాధరనాగులు యక్షగుహ్యక రాక్షసులు దానవులు అప్సరసలు దేవతలు సముద్రములు మొదలగు అనేక రూపములలో సృష్టింపబడితిని. సంహరింపబడితిని. దారలతో సంయోగమువలన నాకు కలిగిన మోసము ఇటువంటిది. ఈ జన్మనుండి పూర్వము మూడవ జన్మమున జరిగినదియు తీర్థ మాహాత్మ్యముతో సంబంధించినదియు అగువృత్తాంతమును సంగ్రహముగా చెప్పెదను వినుము. నేను నరదేవగంధర్వ నాగ విద్యాధర గరుడ కింనరాది జన్మములు అనేకములు పొందిన తరువాత సుతపస్కుడను మహా ఋషిగా జన్మిచింతిని. అట్టినాకు లోకములకు ప్రభువు-మధువను రాక్షసుని వధించినవాడునగు జనార్దనునియందు స్థిరమగు భక్తి కలిగెను. చక్రగదాఖడ్గదారియగు విష్ణుని వివిధములగు వ్రతములచే ఉపవాసములచే మెప్పింపగా ఈ మహాత్ముడు నాకు వరమీయ గోరి గరుడుని ఎక్కి వచ్చి ఓ బ్రాహ్మణా ! నీకు కావలసిన వరము ఏదో కోరుము. ఇచ్చెదను. అని బిగ్గరగా పలికెను. నీకు నాపై ప్రీతి కలిగినచో నీ మాయాతత్త్వమును నాకు తెలుపుమని కోరితిని. ధర్మార్థ కామములను శ్రేష్టులగు పుత్రులను బాధా రాహిత్యమును ఇత్తును. తీసికొనుము. నా మాయను తెలిసికోని ఏమి చేయుదువు? అని విష్ణువనెను. ధర్మార్థ కామాది పురుషార్థములు చేతనైనను జయింపవలసినది నీ మాయనే కావున నేను దాని తత్త్వమును తెలిసికొనగోరుచున్నాను. కనుక ఓ పుండరీకాక్షా! నీకు నీ మాయాతత్త్వమును చూపుము. అని నేనంటిని.

విష్ణు రువాచ

మాయాం మదీయాం న హి వేత్తి కశ్చిన్న చాపి వా వేత్స్యతి కశ్చి దేవ || 43

పూర్వం సురర్షిర్ద్విజ నారదాఖ్యో బ్రహ్మాత్మజో 7 భూ న్మమ భక్తి యుక్తః

తేనాపి పూర్వం భవతా యథైవ సంతోషితో భక్తిమతా హి త ద్వత్‌ || 44

వరం చ దాతుం గతవా సహంచ న చాపి వప్రే పర మేతదేవ |

నివారితో మా మతిముఢభావా ద్బవాన్య థైవం వృతవా స్వరం చ || 45

తతో మయోక్తో 7 భసి నారద త్వంమాయం హి మే వేత్స్యసి సంనిమగ్నః ||

తతో నిమిగ్నోం7భసి నారదో7సౌ కన్యా బభౌ కాశిపతేః సుశీలా || 46

తాం ¸°వనాఢ్యా మథ చారుధర్మిణ విదర్భరాజ్ఞ స్తనయాయ వై దదౌ |

సు ధర్మణ సో7పి తయా సమేతః సిషేవ కామా నతులా న్మహర్షిః || 47

స్వర్గే గతే 7 సౌ పితరి ప్రతాపవా న్రాజ్యం క్రమాయత మవాప్య హృష్టః ||

విదర్భ రాష్ట్రం పరిపాలయానః పుత్రైః సపౌత్రై ర్భహుభి ర్ర్వతో7భవత్‌ || 48

అథాభవద్భమిపతేః సుధర్మణః కాశీశ్వరే ణాథ సమం సుయుద్దమ్‌ |

తత్ర క్షయం ప్రాప సపుత్రపౌత్రం విదర్భరా ట్కాశిపతిశ్చయుద్దే || 49

తతః సుశీలా పితరం సపుత్రం జ్ఞాత్వా పతించాపి సపుత్ర పౌత్రమ్‌ |

పురా ద్వినిఃసృత్య రణావనిం గతా దృష్ట్వా సుశీలా కదనం మహాంతమ్‌ || 50

భర్తు ర్బలే తత్ర పితు ర్బలే చ దుఃఖాన్వితా సా సుచిరం విలప్య|

జగామ సా మాతర మార్తరూపా భ్రాతౄన్సుతా న్ర్భాతాసుతా న్సపౌత్రాన్‌ || 51

భర్తార మేషా పితరం చ గృహ్య మహాశ్మశానే చ మహాచితిం సా |

కృత్వా హుతాశం ప్రదదౌ స్వయం చ యుదా సమిద్దో హుతభు గ్బభూవ || 52

తదా సుశీలా ప్రవివేశ వేగా ద్దా పుత్ర హా పుత్ర ఇతి బ్రువాణా |

తదా పునః సా ముని ర్నారదోభూత్‌ | స చాపి వహ్నిః స్పటికామాలాంభః |53

పూర్ణం సరో 7 భూదథ చోత్తతార తస్యాగ్రతో దేవవర స్తు కేశవః |

ప్రహస్య దేవర్షి మువాచ నారదమ్‌ ||

కస్తే తు పుత్రో వద మే మహర్షే మృతం చకం శోచసి నష్టబుద్దిః |

వ్రీడాన్వితో భూ దథ నారదో 7 సౌ తతో 7 హ మేనం పున రేవ చా77హ || 55

ఇతిదృశా నారద కష్టరూపా మాయా మదీయా కమలాసనాద్యైః

శక్యా న వేత్తుం సమహేంద్రరుద్రైః కథం భవా న్వేత్స్యతి దుర్విభావ్యమ్‌ || 56

నామాయ ఇంతవరకు ఎవరును ఎఱుగరు. ఇక ముందును తెలిసికొనజాలరు. పూర్వము బ్రహ్మకు కుమారుడును దేవర్షియు అగు నారదుడు భక్తియుక్తుడై నీవు వలెనే నన్ను ఆరాధించి మెప్పించెను. నేనతనికి వరమీయబోవ అతడును ఇదే కోరును. నే నెంతగా వలదు అని చెప్పినను అతడు మూఢుడై ఈ వరమునకై పట్టుపట్టెను. అంతట నేనతనితో నారదా! నీవు నీటిలో మునిగినచో నా మాయ తెలియునంటిని. నారదుడు నామాట ననుసరించి నీట మునిగిలేచి సుశీలయను కాశిరాజ పుత్రిగాఅయ్యెను. ఆమె ¸°వనవతి ఐనతరువాత ఆ రాజామెను విదర్భ రాజకుమారుడగు సుధర్మున కిచ్చి వివాహము చేసెను. ఆ సుధర్ముడు ఈమెతో కామసుఖమును అనుభవించెను. తన తండ్రి స్వర్గమునకు ఏగిన తరువాత ప్రతాపవంతుడగు ఆ సుధర్ముడు అతని విదర్భ రాజ్యమునకు పాలకుడై పుత్త్రపౌత్త్రులతో కూడి సంతోషముతో నుండెను. ఇట్లుండ కాశీరాజును సుధర్మునకును యుద్ధముజరిగెను. తమ పుత్త్రపౌత్త్రులతోకూడ ఇరువురును నాశము నొందిరి. ఈ విషయముతెలిసి యుద్ధరంగమునకు పోయి సుశీల చాల తడపుశోకించి ఆర్తురాలై తల్లికడకుపోమెను. మఱియు మరణించిన తన తండ్రిని భర్తను వారి వారి పుత్త్రపౌత్త్రాదులను తీసికొని గొప్పచితిని పేర్చి అగ్నిని ప్రజ్వలింపజేసి హాపుత్త్రా! హాపుత్త్రా! అని శోకించుచు అగ్నిలో ప్రవేశించెను. వెంటనే ఆమె నారదుడయ్యెను. ఆ అగ్ని స్ఫటిక మువలె నిర్మలమును చల్లనిదియునై నిండు సరస్సయ్యెను. అతని ఎదుట నిలిచి దేవ శ్రేష్టుడగు విష్ణువు బిగ్గరగా నవ్వి దేవర్షియగు నారదునితో ఇట్లు పలికెను! మహర్షీ! నీకుమారుడు ఎవ్వరు? బుద్దిపొగొట్టుకొని ఎవరిని గూర్చి శోకించు చున్నావు? అది విని నారదుడు సిగ్గుపడెను. నేను (శ్రీ మహావిష్ణువు) అతనితో మరల ఇట్లంటిని: ఓ నారదా! నామాయ ఇటువంటిది. చాలకష్టరూపమయినది. బ్రహ్మ రుద్రుడు మహేంద్రుడుకూడ దీని నెఱుగలేరనిని నేవేమితెలిసికొనగలవు? ఈ నామాయ ఇట్టిదని ఊహించుటకును అలవి కానది.

స వాక్య మాకర్ణ్య మహామహర్షి రువాచ భక్తిం మమ దేహి విష్ణో |

ప్రాప్తే7థ కాలే స్మరజం తథైవ సదా చ సందర్శన మీశ తే7స్తు || 57

య త్రాహ మార్త శ్చితి మద్య రూఢ స్త త్తీర్థ మ స్త్వచ్యుత పాప హంత్రా |

అధిష్ఠితం కేశవ నిత్య మేవ త్వయా న హేదం కమలోద్భవేన || 58

తతో మయోక్తో ద్విజ నారదో7సౌ తీర్థం సితో దం హి చితి స్తవాస్తు |

స్థాస్యా మ్యహం చాత్ర సదైవ విష్ణు ర్మహేశ్వరః స్థాప్యతి చోత్తరేణ || 59

సదా విరించె ర్వదనం త్రినేత్రః స చ్ఛేత్స్వ తేయం త్వథచో గ్రవాచమ్‌ |

తదా కపాలస్య తు మోచనాయ స మేష్యతె తీర్థ మిదం త్వదీయమ్‌ || 60

స్నాతస్య తీర్థే త్రిపురాంతకస్య పతిష్యతే భూమితలే కపాలమ్‌ |

తతస్తు తీర్థేతి కపాలమోచనం ఖ్యాతం పృథివ్యాం చ భవిష్యతే తత్‌ || 61

తదా ప్రభృత్యంబుదవాహనో7సౌ న మోక్ష్యతే తీర్థవరం సుపుణ్యమ్‌ |

న చైవ తస్మి న్ద్విజ సంప్రచక్షతే త తేత్ర ముగ్రం త్వథ బ్రహ్మవధ్యా || 62

యదా స మోక్ష త్యమరారి హంతా త త్షేత్ర ముఖ్యం మహదా ప్తపుణ్యమ్‌ |

తదా విముక్తేతి మరై రహస్యం తీర్థం స్తుతం పుణ్యద మవ్యయాఖ్యమ్‌|| 63

కృత్వా తు పాపాని నరో మహాంతి తస్మి స్ర్పవిష్టః శుచి రప్రమాదీ |

యదా తు మాం చితయతే సశుద్ధః ప్రయాతి మోక్షం భగవ త్ర్పసాదాత్‌ || 64

భూత్వా తస్మి న్రుద్ర పిశాచనంజ్ఞో యోన్యంతరే దుఃఖ ముపాశ్నుతే7సౌ |

విముక్త పాపో బహువర్ష పూగై రుత్పత్తి మాయాస్యతి విప్రగేహే || 65

శుచిర్యతాత్మా7స్య తతో7ంతకాలే రుద్రో హితం తారక మస్య కీర్తయేత్‌ |

ఇత్యేవ ముక్త్వా ద్విజపర్య నారదం గతో7స్మి దుగ్ధార్ణవ మాత్మగేహమ్‌ || 66

స చాపి విప్ర స్త్రిదివం చచార గంధర్వరాజేన సమర్చ్యమానః |

ఏతత్తవోక్తం నను బోధనాయ మాయా మదీయా న హి శక్యతే సా || 67

జ్ఞాతుం భవా నిచ్ఛతి చేత్తతో7ద్య ఏవం విశ స్వాప్సు చ మేత్పి యేన |

ఏవం ద్విజాతి ర్హరిణా ప్రబోధితో భావ్యర్థయోగా న్నిమమజ్జ తోయే || 68

కోకాముఖే తాత తతో హి కన్యా చాండాల వేశ్మ న్యభవ ద్ద్విజః సః |

రూపాన్వితా శీలగుణోపపన్నా అవాప సా ¸°వన మాససాద || 69

చాండాలపుత్రేణ సుబాహునా7పి వివాహితా రూపవివర్జితేన |

పతి ర్నతస్యా హి మతో బభూవ సా తస్య చైవాభిమతా బభూవ 70

పుత్రద్వయం నేత్రహీనంబభూవ కన్యా చ పశ్చా ద్బధిరా తథా7న్యా |

పతి ర్దరిద్ర స్త్వథ సా7పి ముగ్ధా నదీగతా రోదితి తత్ర నిత్యమ్‌ || 71

గతా కదాచి త్కలశం గృహీత్వా సా7ంతర్జలం స్నాతు మథ ప్రవిష్టా |

యావ ద్ద్విజో7సౌ పున రేవ తావ జ్జాతః క్రియాయోగరతః సుశీలః|| 72

తస్యాః న భర్తా7థ చిరం గతేతి ద్రష్టుం జగా మాథ నదీం సుపుణ్యామ్‌ |

దదర్శ కుంభం స చ తాం తటస్థాం తతో7తిదుఃఖా త్ర్పరురోద నాదయన్‌ || 73

తతో7ంధయుగ్యం బధిరా చ కన్యా దుఃఖాన్వితా7సౌ సముపాజగామ |

తే వై రుదంతం పితరం చ దృష్ట్వా దుఃఖాన్వితా వై రురుదు ర్భృశార్తాః || 74

తతః స పప్రచ్చ నదీతటస్థా న్ద్విజా న్భవద్భి ర్యదియో దేకా |

దృష్టా తు తో యార్థముపాద్రవంతీ అఖ్యాత తే ప్రోచు రిమాం ప్రవిష్టా || 75

నదీం న భూయ స్తు సముత్తతార ఏతావ దే వేహ సమీహితం నః |

స త ద్వచో ఘోరతరం నిశమ్య రురోద శోకాశ్రు పరిప్లుతాక్షః || 76

తం వై రుదంతం ససుతం సకన్యం దృష్ట్వా7హమార్తః సుతరాం బభూవ |

ఆర్తిశ్చ మే7భూ దథ సంసృతిశ్చ చాండాలయోషా7హ మితి క్షితీశ || 77

తతో7బ్రవం తం నృపతే మతంగం కి మర్థ మార్తేన హి రుద్యతే త్వయా |

తస్యా న లాభో భవితా7తిమౌర్ఖ్యా దాక్రందితే నేహ పృథా హి కిం తే || 78

సమా మువాచా77త్మజయుగ్మమంధం కన్యా చైకా బధి రేయం తథైవ |

కథం ద్విజాతే అధునా77ర్తమేత మశ్వాసయిష్యే7ప్యథ పోషయిష్యే || 79

ఇత్యేవ ముక్త్వా స సుతైశ్చ సార్థం పూత్కృత్య చ రోదితిస్మ |

యథా యథా రోదితి స శ్వపాక స్తథా తథా మే హ్యభవత్కృపా7పి || 80

తతో7హమార్తం తు నివార్య తంవై స్వవంశ వృత్తాంత మథా77చచక్షే |

తతః స దుఃఖా త్సహ పుత్రకైః సంవివేశ కోకాముఖ మార్తరూపః || 81

ప్రవిష్టమాత్రే సలిలే మతంగ స్తీర్థప్రభావాచ్చ విముక్త పాపః |

విమాన మారుహ్య శశిప్రకాశం య¸° దివం తాత మమోపపశ్యతః || 82

తస్మి న్ర్పవిష్టే సలిలే మృతే చ మ మా ర్తి రాసీ దతిమోహక ర్త్రీ |

తతో7తిపుణ్య నృపవర్య కోకాజలే ప్రవిష్ట స్త్రిదివం గత శ్చ || 83

నారదమహర్షి నామాట విని ఇట్లుపలికెను. ఓ విష్ణూ! నాకు నీయందుభక్తిఇమ్ము. సమయమువచ్చినప్పుడు నీ సంస్మరణమును సందర్శనమును నాకు లభించుగాక! నేను ఇప్పుడు అర్తుడనై చితిని ఆరోహించిన స్థలము తీర్థముగా నయి ఓ అచ్యుతా! కేశవా! పాపనాశకుడవగు నీచేతను బ్రహ్మదేవునిచేతను అధిష్ఠింపబడినది అగుగాక! నారదుని కోరికవిని ఓ బ్రాహ్మణా! సుతపోమహర్షీ! నేను- (శ్రీ మహావిష్ణువు) ఇట్లంటిని. ఓ నారదా! కాశిరాజకన్యగా నీవు చితిచేసిన తావు సితోదమను తీర్ధమగును. నేనును మహేశ్వరుడును దీనియందు నిలిచెదము. ఉగ్రముగా మాటలాడినబ్రహ్మ యొక్క ముఖమును శివుడు త్రుంచిన తరువాత ఆతడీ నీ తీర్థమున స్నానముచేయగనే ఆ బ్రహ్మకపాలము ఈ తీర్థస్థానమున భూమిపై పడును. అంతటనుండి దీనికి కపాపలమోచన తీర్థమను ప్రఖ్యాతి ఏర్పడును. అప్పటినుండి ఈ పుణ్యతీర్థమునందు ఇంద్రడు నిరంతరము నిలిచియుండును. ఇంద్రునికి విడువని బ్రహ్మవధ దోషము అంటగా అతడు దాని నిచ్చట విడిపించుచుకొనును. కాన దేవతలను ఈ రహస్యమగు మహాతీర్థమును విముక్తతీర్థమని ప్రసిద్ధము చేయుదురు. నరుడు ఎన్ని మహాపాపములు చేసినవాడైనను ఈ తీర్థమున ప్రవేశించి ఏమరుపాటులేక స్నానమాడి శుచియై నన్ను స్మరించినచో శుద్ధుడై భగవదను గ్నహముపొంది ముక్తుడగును. రుద్రపిశాచమను మహాపాపుడు అనేక జన్మములంది దుఃఖములనుభవించును. అతడట్లు జన్మపరంపరలతో పాపము నశించి అనేక సహస్రసంవత్సరముల తరువాత విప్రగృహమున జన్మించును. అతడా జన్మములో మహానిగ్రహముకలువాడగును. అతని అంతకాలమున రుద్రుడు హితకరమగు తారకమంత్రడు నతని కుపదేశించును. ఓ విప్రా? నేనిట్లు నారదునకు చెప్పి నా నివాసమగు క్షీరసాగరమునకు వెళ్ళితిని. విప్రుడు-నారదమహర్షియును గంధర్వ రాజుచే సమర్పించబడుచు స్వర్గమున సంచరించెను. ఓ సుతపోమహామునీ! నిన్ను ప్రబోధించుటకై నీకు ఈ నారద వృత్తాంతము తెలిపితిని. నా మాయను నీవు ఎఱుగజాలవు. నీవది తెలిసికొనగోరినచో ఈ కోకాముఖ తీర్థమందు మునుగుము. అని విష్ణువు పలికెను.

విష్ణుని వచనముననుసరించి విప్రుడగు సుతపొమహాముని తన భవిష్యత్‌ ఫలమునకు వశుడై ఆ నీట మునిగెను. నాయనా! ఆ బ్రాహ్మణుడు వెంటనే చండాలగృహమున కన్యగానయ్యెను. ఆమె మంచిరూపము శీలము గుణములు కలది. క్రమముగా ¸°వనవంతురాలు కాగా ఆమెకు రూపహీనుడగు సుబాహుడను చండాల కుమారునితో వివాహమయ్యెను. భర్త ఆమెకు ఇష్టుడు కాలేదు. కాని భర్తకు ఆమె ఇష్టురాలయ్యెను. ఆమెకు ఇద్దఱు అంధులగు కుమారులును ఒక చెవిటి కుమార్తెయు కలిగిరి. భర్త దరిద్రుడు. అందుచే ఆ అమాయికురాలు అనుదినము నదికిపోయి ఏడ్చుచుండెడిది. ఒకానొకప్పుడా చండాల కన్యక బిందె తీసికొని నదికిపోయి స్శానమునకై నీటిలో ప్రవేశించి లేవగనే కర్మయోగమునందు అసక్తుడగు సుతపో మహామునియను బ్రాహ్మణుడుగా - మొదటి రూపమునకు-మారెను. భర్తయగు సుబాహుడును భార్య నదికిపోయి చాలసేపయినదేయని నదికి వెడలి అచట కడవ మాత్రముండి ఒడ్డున ఆమె కనబడకపోవుటచే మహాదుఃఖమున ఆ ప్రదేశము మారు మ్రోగునట్లు ఏడువసాగెను. అంతలో గ్రుడ్డి కుమారులును చెవిటి కూతురును అచటికి వచ్చి తమతండ్రి ఏడ్చుచుండుట చూచి తామును ఏడువసాగిరి. తరువాత సుబాహుడు అచ్చటనున్న బ్రాహ్మణులను మీరెవరైన నీటికి నదిలో దిగిన యువతిని చూచితిరా! చెప్పుడు అని అడిగెను. ఆమె నదిలో దిగుట చూచితిమి. కాని పైకి వచ్చినట్లు చూడలేదు. అని వారు చెప్పిరి. భయంకరమగు ఆమాట విని సుబాహుడు కన్నీళ్ళు కారుచుండ గట్టిగా ఏడువ నారంభించెను. ఓ రాజా ! అట్లు అతడును కొడుకులును కూతురును ఏడ్చుట చూచి నాకు చాల బాధ కలుగుటతోబాడు నేనే అంతవరకు చండాల కన్యకగా ఉంటినను విషయము స్మరణమునకు వచ్చెను. అందుచే నేనా సుబాహునితో నీవిట్లు ఎందులకు అర్తుడవై ఏడిచెదవు? మూర్ఖుడవై ఎంత ఏద్చినను ఆమె నీకు లభింపదు. అంటిని. అతడు నాతో ఇట్లనెను. ఓ బ్రాహ్మణా! ఈ కుమారులు ఇద్దరును గ్రుడ్డివారు. కుమార్తె చెవిటిది. దుఃఖించుచున్న వీరిని నేను ఎట్లు ఓదార్చ గలను? ఎట్లు పెంచి పెద్ద చేయగలను? ఇట్లు పలికి అతడు కుమారులతో కుమార్తెతో కూడ వెక్కివెక్కి ఏడువసాగెను. అతడు ఏడ్చినకొలది నాకు వారిపై దయ కలిగెను. అందుచే నతని ఏడ్పు మాన్పించి నా వృత్తాంతము నాతనికి తెలిపితిని. అతడును మిగు ఆర్తుడై ఆ కోకాముఖ తీర్థమున మునిగెను. నీటిలో ప్రవేశించగనే ఆ తీర్థ ప్రభావమున వాడు పాపములనుండి ముక్తుడై నేను చూచుచుండగనే చంద్రునివలె ప్రకాశించెడి విమానమెక్కి స్వర్గమునకు పోయెను. అతడట్లు మరణించగనే కును మోహకరమగు మనోవ్యథ కలిగెను. ఓ రాజశ్రేష్ఠా! నేనును మహాపవిత్రమగు కోకాజలమున మునిగి స్వర్గమునకు వెళ్ళితిని.

భూయో7భవం వైశ్యకులే వ్యథార్తో జాతిస్మర స్తీర్థ వరప్రసాదాత్‌ |

తతో7తినిర్విణ్ణమనా గతో7హం కోకాముఖం సంయత వాక్యచిత్తః || 84

వ్రతం సమాస్థాయ కళేబరం స్వం సంశోయిత్వా దివ మారురోహ |

తస్మా చ్చ్యత ప్త్వ ద్భవనే చ జాతో జాతిస్మర స్తాత హరిప్రసాదాత్‌ || 85

సో7హం సమారాధ్య మురారిదేవం కోకాముఖే త్యక్త శుభా శుభేచ్ఛః

ఇత్యేవ ముక్త్వా పితరం ప్రణమ్య గత్వా చ కోకాముఖ మగ్రతీర్థమ్‌ || 86

విష్ణుం సమారాధ్య వరాహరూప మవాప సిద్ధిం మనుజర్షభో7సౌ |

ఇత్థంస కామదమనః నహపుత్రపౌత్రః కోకాముఖే తీర్థవరే సుపుణ్య || 87

త్యక్త్వా తనుం దోషమాయీం తతస్తుగతో దివం సూర్యసమై ర్విమానైః ||

ఏవం మయోక్తా పరమేశ్వరస్య మాయా సురాణా మపి దుర్విచింత్యా |

స్వప్నేంద్రజాల పత్రిమా మురారే ర్యయా జగన్యోహ ముపైతి విప్రాః || 88

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్నే విష్ణుధర్మాసు కీర్తనే మాయాప్రాదుర్భావ నిరూపణం నామ ఏఓనత్రింశదధిక ద్విశతతమో7ధ్యాయః.

తరువాత జన్మమున వైశ్యకులమునందు వ్యథతో బాధపడువాడనుగా కోకాముఖతీర్థ ప్రభావమున పూర్వజన్మస్మృతి కలవాడనుగా జన్మించితిని. అంతటనేను చాలవైరాగ్యము చెంది వాక్కును మనస్సును నిగ్రహములో ఉంచుకొని కోకాముఖతీర్థమునకు వెళ్ళితిని. అచ్చటనే వ్రతముపూని శరీరము కృశింపజేసికొని దేహత్యాగముచేసి స్వర్గమును పొందితిని. స్వర్గమునుండిదిగి భూలోకమునందు కూడ విష్ణుని అనుగ్రహము వలన పూర్వజన్మస్మృతి కలవాడనుగా నీయుంట పుట్టితిని. ఇట్లు నేను శ్రీమహావిష్ణుని ఆరాధించి కోకాముఖతీర్థమున శుభాశుభములగు కోరికలు ఏవియు లేకుండ వదలుకొనిన వాడనైతిని. అనిపలికి ఆరాజకుమారుడు తండ్రిని నమస్కరించి శ్రేష్ఠమగు కోకాముఖతీర్థమునకు పోయి అమనుజశ్రేస్ఠుడు వరాహరూపుడగు శ్రీమహావిష్ణునారాధించి సిద్ధినిపొందెను. ఇట్లు ఆ కామదమనుడనునతడు తన పుత్రపౌత్త్రులతో కూడ మహాపవిత్రమగు కోకాముఖతీర్థమున అపవిత్రమగు మానవశరీరమును విడిచి సూర్యసమములై ప్రకాశించెడి విమానములలో స్వర్గమునకేగెను.

ఓ బ్రహ్మణులారా! దేవతలకు ఊహింప అలవికానిదియు స్వప్నముతోను ఇంద్రజాలముతోను సమానమును లోకమును మోహపరచునదియునగు పరమేశ్వరుడగు విష్ణునిమాయను మీకు తెలిపితినని వ్యాసమహాముని పలికెను.

ఇది శ్రీమహాపురాణమగు ఆదిబ్రాహ్మమున విస్ణుధర్మాను కీర్తనమున మాయాప్రాదుర్భావ నిరూపణము అను రెండువందల ఇరువదితొమ్మిదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters