Brahmapuranamu    Chapters   

అథసప్తదశాధికద్విశతతమో7ధ్యాయః

ధర్మశ్రైష్ఠ్యవర్ణనమ్‌

లోమహర్షణ ఉవాచ

శ్రుత్వైవం యమమార్గం తే నరకేషు చ యాతనామ్‌ | పప్రచ్ఛుశ్చ పునర్వ్యాసం సంశయం మునిసత్తమాః || 1

మునయ ఊచుః

భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద | మర్త్యస్య కః సహాయోవై పితా మాతా సుతో గురుః || 2

జాతిసంబంధివర్గశ్చ మిత్రవర్గస్తథైవ చ | మృతం శరీరముత్సృజ్య కాష్ఠలోష్టసమం జనః ||

గచ్ఛంత్యముత్ర లోకేవై కశ్చ తాననుగచ్ఛతి || 3

వ్యాస ఉవాచ

ఏకః ప్రసూయతే విప్రా ఏక ఏవహి నశ్యతి | ఏకస్తరతి దుర్గాణి గచ్ఛత్యేకస్తు దుర్గతిమ్‌ || 4

అసహాయః పితామాతా తథా భ్రాతా సుతోగురుః | జ్ఞాతిసంబంధివర్గశ్చ మిత్రవర్గస్తథైవ చ || 5

మృతం శరీరముత్సృజ్య కాష్ఠలోష్టసమం జనాః | ముహూర్తమివ రోదిత్వా తతోయాంతి పరాఙ్ముఖాః || 6

తైస్తచ్ఛరీరముత్సృష్టం ధర్మ ఏకో7నుగచ్ఛతి | తస్మాద్ధర్మః సహాయశ్చ సేవితవ్యః సచానృభిః || 7

ప్రాణీ ధర్మసమాయుక్తో గచ్ఛేత్స్వర్గతిం పరామ్‌ | తథైవాధర్మసంయుక్తో నరకం చోపపద్యతే || 8

తస్మాత్పాపాగతైరర్థెర్నానురజ్యేత పండితః | ధర్మఏకో మనుష్యాణాం సహాయః పరికీర్తితః || 9

లోభాన్మోహాదనుక్రోశాద్భయాద్వా7థ బహుశ్రుతః | నరః కరోత్యకార్యాణి పరార్ధే లోభమోహితః || 10

ధర్మశ్చార్థశ్చ కామశ్చ త్రితయం జీవతః ఫలమ్‌ | ఏతత్త్రయమవాప్తవ్య మధర్మపరివర్జితమ్‌|| 11

మునయః ఊచుః

శ్రుతం భగవతో వాక్యం ధర్మయుక్తం పరం హితమ్‌ | శరీరసిచయం జ్ఞాతుం బుద్ధిర్నో7త్ర ప్రజాయతే || 12

మృతం శరీరం హి నృణాం సూక్ష్మమవ్యక్తతాం గతమ్‌ | ఆచక్షుర్విషయం ప్రాప్తం కథం ధర్మో7నుగచ్ఛతి || 13

వ్యాస ఉవాచ

పృథివీ వాయురాకాశ మాపో జ్యోతిర్మనోంతరమ్‌ | బుద్ధిరాత్మా చ సహితా ధర్మం పశ్యంతి నిత్యదా || 14

ప్రాణినా మిహసర్వేషాం సాక్షిభూతా దివానిశమ్‌ | ఏతై శ్చ సహధర్మో హి తం జీవ మనుగచ్ఛతి || 15

త్వగస్థిమాంసం శుక్రం చ శోణితం చ ద్విజోత్తమా | శరీరం వర్జయంత్యేతే జీవితేన వివర్జితమ్‌ || 16

తతో ధర్మసమాయుక్తః స జీవః సుఖమేధతే | ఇహలోకే పరేచైవ కిం భూయః కథయామి వః || 17

లోమహర్షుండనియె.

మునివరులు యమమార్గము నరకయాతనలను గురించి విని తిఱిగి వ్యాసుని యీ క్రింది సందేహమడిగిరి. భగవంతుడా! సర్వ ధర్మజ్ఞా! సర్వశాస్త్ర విశారద! మానవునకు సహాయులు తండ్రియా తాతయా కొడుకా గురువా! జ్ఞాతులు బంధువర్గమా. మిత్రవర్గమా జనులు చనిపోయిన వాని శరీరము కట్టెను రాతినట్లు విసరి పారవేయుదురు గాని వాని వెంబడిని బోవువాడెవ్వడు? అన వ్యాసదేవులు నరుడొక్కడే పుట్టును ఒక్కడుగానే గిట్టును. ఒక్కడే దుర్గతిని దాటును. ఒక్కతే దుర్గతినందును. జీవుడు నిస్సహాయుడు. చచ్చిన శరీరమును నీవన్నట్లు పారవేసిబంధువులు కొలదిసేపేడ్చి వెనుదిరిగిపోవుదురు. వారు పారవేసిన యా జీవుని ధర్మ మొక్కటే వెంబడించును. అందుచే ధర్మమన్ని యవస్థలందు అన్ని లోకములందు సహాయమగును గావున నరులు దానిని సేవింపవలయును. లోభ మోహములవలన జాలివలన భయమువలన బహుశ్రుతుడు (పండితుడు) కూడ యితరులకొరకు లోభవశుడై తప్పిదములు చేయును. బ్రతుకునకు ఫలము ధర్మము అర్థము కామము ననుమూడు పురుషార్థములు. ధర్మము తప్పకుండ నీ మూడు ఫలములను బొంది తీరవలెను. అన విని మునులిట్లనిరి. వ్యాసదేవా! నీవలన పరమహితమైనది ధర్మయుక్తమునైన వాక్యము విన్నాము. శరీరసిచయము = వరీరనాశస్థితి నెఱుంగ గోరెదము. మానవుల మృతశరీరము సూక్ష్మమై అవ్యక్తస్థితినంది కనబడనిదైనప్పుడు దానిని ధర్మమెట్లు వెంబడించును? అన వ్యాసు లిట్లనిరి. భూమి వాయువు ఆకాశము నీరు జ్యోతి (తేజస్సు) అంతరంగము (మనస్సు) బుద్ధీ యనునవేకీభావమొంది ధర్మమును జూచును. అన్ని జీవులకు వారువారు చేయు పనులన్నిటికిని రేయింబవళ్ళు సాక్షులయి యుండును. వీనితో పాటు ధర్మము జీవునివెంట నేగును. చర్మము ఎముకలు మాంసము శుక్రము రక్తము ననునిది ప్రాణముపోయిన వెంటనే శరీరమును విడిచిపెట్టును. అందువలన ధర్మవరుడొక్కడే ఇహమందు పరమందును సుఖపడువాడు. ఇంకేమి తెలుపుదునన మునులిట్లనిరి.

తద్దర్శితం భగవతా యథా ధర్మో7నుగచ్ఛతి | ఏతత్తు జ్ఞాతు మిచ్ఛామః కథం రేతః ప్రవర్తతే || 18

వ్యాస ఉవాచ

అన్నమశ్నంతి యే దేవాః శరీరస్థాః ద్విజోత్తమాః | పృథివీ వాయురాకాశ మాపో జ్యోతిర్మనస్తథా || 19

తతస్తృప్తేషు భో విప్రా స్తేషు భూతేషు పంచసు | మనః షష్ఠేషు శుద్దాత్మా రేతః సంపద్యతే మహత్‌ || 20

తతో గర్భః సంభవతి శ్లేష్మా స్త్రీపుంసయోర్ద్విజాః | ఏతద్వః సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతుమిచ్ఛథ || 21

మునయ ఊచు

అఖ్యాతం నో భగవతా గర్భః సంజాయతే యథా | యథా జాతస్తు పురుషః ప్రపద్యేత తదుచ్యతామ్‌ || 22

వ్యాస ఉవాచ

ఆసన్నమాత్ర పురుష సై#్తర్భూతై రభిభూయతే | విప్రయుక్తస్తు తైర్భూతైః పునర్యాత్యపరాం గతిమ్‌ || 23

సచ భూతసమాయుక్తః ప్రాప్నోతి జీవమేవ హి | తతో7స్య కర్మ పశ్యంతి శుభం వా యది వా7శుభమ్‌ || 24

దేవతాః పంచభూతస్థాః కిం భూయః శ్రోతుమిచ్ఛథ ||

ధర్మమెట్లు వెంటబడునో తాము కనులగట్టినట్లు తెలిపినారు. ఇక రేతస్సు ఎట్లు ప్రవర్తించునో యిదియు పిండోత్పత్తి క్రమమును తెలుపుమని ప్రార్థింప వ్యాసుడిట్లనియె. ఓ విప్రశ్రేష్ఠులార ! శరీరమందున్న దేవతలు (ఆ యా యింద్రియాధిష్ఠాన దేవతలు) అన్నము నారగింతురు. వారు పృథివ్యప్తేజోవాయ్వాకాశములను పంచభూతములు మనస్సు స్వరూపమున నుందురు. ఆరూపమున పంచభూతములు మనస్సు తృప్తిపడగానే పరిశుద్ధమైన రేతస్సు రూపొందును. దానివలన స్త్రీపురుషసంయోగమున గర్భమేర్పడును. ఇదంతయు మీ కెఱింగించితిన నేమి వినవలతురన మునులిట్లనిరి.

మునయ ఊచుః

త్వగస్థిమాంస ముత్సృజ్య తైస్తు భూతై ర్విపద్జితః | జీవః స భగవాన్క్వస్థః సుఖదుఃఖే సమశ్నుతే || 25

వ్యాస ఉవాచ

జీవః కర్మసమాయుక్తః శీఘ్రం రేతః సమాగతః | స్త్రీణాం పుష్పం సమాసాద్య తతః కాలేన భో ద్విజాః || 26

యమస్య పురుషైః క్లేశో యమస్య పురుషై ర్వధః | దుఃఖం సంసార చక్రం చ నరః క్లేశం చ విందతి || 27

ఇహ లోకే సతు ప్రాణీ జన్మ ప్రభృతి భో ద్విజాః | సుకృతం కర్మ వై భుంక్తే ధర్మస్య ఫలమాశ్రితః || 28

యది ధర్మం సమాయుజ్య జన్మప్రభృతి సేవతే | తతః సపురుషో భూత్వా సేవతే నిత్యదా సుఖమ్‌ || 29

ఆథాంతంరాంతరం ధర్మ మధర్మ ముపసేవతే | సుఖస్యానంతరం దుఃఖం సజీవో7ప్యధిగచ్ఛతి || 30

ఆధర్మేణ సమాయుక్తో యమస్య విషయం గతః | మహాదుఃఖం సమాసాద్య తిర్యగ్యోనౌ ప్రజాయతే || 31

కర్మణా యేన యేనేహ యస్యాం యోనౌ ప్రజాయతే | జీవో మోహనసమాయుక్త స్తన్మే శృణుత సాంప్రతమ్‌ || 32

ఎముకలు చర్మము మాంసమును విడిచి ఆజీవాత్మ ఎక్కడనిలచి సుఖదుఃఖములను అనుభవించును. అనిఋషులడుగగా వ్యాసు లిట్లనిరి. అది పురుషుడై పుట్టి ప్రవర్తించు రీతి తెలుపుమన వ్యాసులు పురుషుడు (జీవుడు) పంచభూత సమావేశమంది వానికి లోబడియుండును. వానితో విడివడి తిరిగి మఱొకగతి కేగును. భూతసంబంధము పొంది ప్రాణధారణము చేయును. అప్పుడు జీవరూపమున నున్న వీడు చేయు పుణ్యపాపములను బంచభూతములం దంతర్యామిరూపమున నున్న దేవతలు గాంచుచుందురు. మఱి మేమి విననెంతురు? అన మునులిట్లనిరి. చర్మాస్థి మాంసములను విడిచి యా భూతములన్నింటిని విడిచి జీవుడు తనకుదానై సుఖదుంఖముల ననుభవించునుగద? యన వ్యాసుడు, జీవుడు కర్మసంబంధము నంది రేతస్సును బొంది స్త్రీయొక్క పుష్పమును (ఆర్తవమును)బొంది జనించును. అవ్వల యమభటులవలన బాధలను చావును దుఃఖములను సంసారచక్ర పరిభ్రమణమును బొంది నానాక్లేశములకు వశుడగును. ఇహలోకమున నా ప్రాణి పుట్టినది మొదలు మున్ను దాజేసిన పుణ్యము ధర్మముయొక్క ఫలము నాశ్రయించి సుఖమనుభవించును. పుట్టినదాదిగ ధర్మమునే సేవించిన యెడల పురుషుడై నిత్యమును సుఖించును. అనంతరము తాజేసిన యధర్మఫలము ననుభవించును. సుఖముతర్వాత దుఃఖముం బొందును. అధర్మయుక్తుడు యమలోకమేగి మహాదుఃఖమొంది పశువక్ష్యాదులందు పుట్టును. ఏ యే కర్మమిక్కడ జేసి యేయే యోనియందు మోహవశుడై పుట్టునో యిపుడు విరముగ వినుండు.

యదేతదుచ్యతే శాసై#్త్రః సేతిహాసైశ్చ ఛందసి | యమస్య విషయం ఘోరం మర్త్యలోకం ప్రవర్తతే || 33

ఇహ స్థానాని పుణ్యాని దేవతుల్యాని భో ద్విజాః | తిర్యగ్యోన్యతిరిక్తాని గతిమంతి చ సర్వశః || 34

యమస్య భవనే దివ్యే బ్రహ్మలోకసమే గుణౖః | కర్మభిర్నియతైర్బద్ధో జంతు ర్దుఃఖాన్యుపపాశ్నుతే || 35

యేన యేన హి భావేన యేన వై కర్మణాం గతిమ్‌ | ప్రయాతి పురుషో ఘోరాంఃతథా వక్ష్యామ్యతః పరమ్‌ || 36

అధీత్య చతురో వేదా న్ద్విజోమోహ సమన్వితః | పతితాత్ప్రతిగృహ్యాథ ఖరయోనౌ ప్రజాయతే || 37

ఖరో జీవతి వర్షాణి దశపంచచ భో ద్విజాః | ఖరో మృతో బలీవర్దః సప్తవర్షాణి జీవతి || 38

బలీవర్దో మృతశ్చాపి జాయతే బ్రహ్మరాక్షసః | బ్రహ్మరక్షస్తు మాసాం స్త్రీంస్తతో జాయేత బ్రాహ్మణః || 39

పతితం యాజయిత్వా తు కృమియోనౌ ప్రాయతే | తత్ర జీవతి వర్షాణి దశపంచచ భోద్విజాః || 40

క్రిమిభావాద్వినిర్ముక్త స్తతో జాయేత గర్దభః | గర్దభః పంచ వర్షాణి పంచ వర్షాణి శూకరః || 41

కుక్కుటః పంచ వర్షాణి పంచ వర్షాణి జంబుకః | శ్వా వర్షమేకం భవతి తతో జాయేత మానవః || 42

ఈ విషయము శాస్త్రములు ఇతిహాసాదులు వేదమునందును తెలుపబడినది. మర్త్యలోకము ఘోరయమలోకమునకు విషయమై యున్నది. ఈలోకమందు దేవతుల్యములు పుణ్యములగు స్థానములున్నవి. అవి పశుపక్ష్యాది జీవభావమునకు భిన్నములు. బ్రహ్మలోకమువంటి దివ్యమైన యమమందిరమందు జీవుడు కర్మబద్ధుడై దుఃఖము లనుభవించును. ఏయే స్వరూపమున నేయేకర్మ ఫలమును బురుషుడందునో అయా ఘోరగతులను దెలిపెదను. నాల్గువేదములు చదివి ద్విజుడు మోహమునొంది పతితునివలన (కులభ్రష్ఠుని వలన) పరిగ్రహముసేసి (దానము పట్టి) గాడిదయై పుట్టును. గాడిద పదునైదేండ్లు బ్రతుకును. గాడిదయైచచ్చి యేడేండ్లు ఎద్దగును. ఎద్దుచచ్చి బ్రహ్మరక్ష స్సగును. అందుమూడేండ్లుండి బ్రాహ్మణుడగును. కులభ్రష్ఠునిచేత యజ్ఞము సేయించినవాడు కృమి (పురుగు)గాపుట్టును. అందు పదునైదేండ్లుండి గాడిదయయి యైదేండ్లు నక్కగా నైదేండ్లుకుక్కగా నొకయేడునుండి యటుపై మానవుడగును.

ఉపాధ్యాయస్య యః పాపం శిష్యః కుర్యాదబుద్ధిమాన్‌ | స జన్మానీహ సంసారే త్రీనాప్నోతి న సంశయః || 43

ప్రాక్శ్వా భవతి భో విప్రా స్తతః క్రవ్యాత్తతః ఖరః | ప్రేత్య చ పరిక్లిష్టేషు పశ్చాజ్జాయేత బ్రాహ్మణః || 44

మనసా7పి గురోర్భార్యాం యః శిష్యో యాతి పాపకృత్‌ | ఉదగ్రాన్ప్రైతి సంసారా న ధర్మేణహ చేతసా || 45

శ్వయోనౌ తు స సంభూత స్త్రీణి వర్షాణి జీవతి | తత్రాపి నిధనం ప్రాప్తః క్రిమియోనౌ ప్రజాయతే || 46

కృమిభావమను ప్రాప్తో వర్షమేకం తు జీవతి | తతస్తు నిధనం ప్రాప్య బ్రహ్మయోనౌ ప్రజాయతే || 47

యది పుత్రసమం శిష్యం గురుర్హన్యాదకారణమ్‌ | ఆత్మనః కామకారేణ సో7పి హింస్రః ప్రజాయతే || 48

పితరం మాతరం చైవ యస్తు పుత్రోవ7మన్యతె | సో7పి విప్రో మృతో జంతుః పూర్వం జాయేత గర్దభః || 49

గర్దభత్వం తు సంప్రాప్య దశవర్షాణి జీవతి | సంవత్సరం తు కుంభీర స్తతో జాయేత మానవః || 50

పుత్రస్య మాతా పితరౌ యస్య రుష్టావుభావపి | గుర్వపధ్యానతః సో7పి మృతో జాయేత గర్దభః || 51

ఖరో జీవతి మాసాంశ్చ దశ చాపి చతుర్దశ | బిడాలః సప్తషూసాంస్తు తతో జాయేత మానవః || 52

మాతాపితర వాక్రుశ్య శారీకః సంప్రజాయతే | తాడయిత్వా తు తావేవ జాయతే కచ్ఛపో ద్విజాః || 53

కచ్ఛపో దశ వర్షాణి త్రీణి వర్షాణి శాల్యకః | వ్యాళో భూత్వా తు షణ్మాసాం స్తతో జాయేత మానుషః || 54

భర్తృపిండముపాశ్నానో రాజద్విష్టాని సేవతే | సో7పి మోహసమాపన్నో మృతోజాయేత వానరః || 55

వానరో దశవర్షాణి సప్తవర్షాణి మూషకః | శ్వాచ భూత్వాతు షణ్మాసాం స్తతో జాయేత మానవః || 56

న్యాసాపహర్తా తు నరో యమస్య విషయం గతః | సంసారాణాం శతం గత్వా కృమియోనౌ ప్రజాయతే || 57

తత్ర జీవతి వర్షాణి దశ పంచ చ భో ద్విజాః | దుష్కృతస్య క్షయం కృత్వా తతో జాయేత మానుషః || 58

అసూయకో నరశ్చాపి మృతో జాయేత శృంగికః | విశ్వాసహర్తా చ నరో మీనో జాయేత దుర్మతిః || 59

భూత్వా మీనో7ష్ట వర్షాణి మృగో జాయేత భో ద్విజాః | మృగస్తు చతురో మాసాం తతచ్ఛాగః ప్రజాయతే || 60

ఛాగస్తు నిధనం ప్రాప్య పూర్ణే సంవత్సరే తతః | కీటః సంజాయతే జంతు స్తతో జాయేత మానుషః || 61

ధ్యాన్యాన్యవాం స్తిలాన్మాషా న్కుళుత్థాన్సర్షపాంశ్చణాన్‌ | కలాయానథ ముద్గాంశ్చ గోధూమానతసీ స్తథా || 62

నస్యాన్యన్యాని హృత్త్వాచ మర్త్యో మోహాదచేతనః | సంజాయతే మునిశ్రేష్ఠా మూషికో నిరపతప్రః || 63

తతః ప్రేత్యమునిశ్రేష్ఠా మృతో జాయేత శూకరః || శూకరో జాతమాత్రస్తు రోగేణ మ్రియతే పునః || 64

శ్వా తతో జాయతే మూకః కర్మణా తేన మానవః భూత్వా శ్వా పంచ వర్షాణి తతో జాయేత మానవః || 65

వరదారాభి మర్శం తు కృత్వా జాయేత వై బకః | శ్వా శృగాలస్తతో గృధ్రో వ్యాళః కంకో బక స్తథా || 66

భ్రాతుర్భార్యాం తు పాపాత్యా యోధర్షయతి మోహితః | పుంస్కోకిలత్వ మాప్నోతి స్యోపి సంపత్సరం ద్విజాః || 67

సఖిభార్యాం గురోర్భార్యాం రాజభార్యం తధైవ చ | ప్రధర్షయిత్వా కామాత్మా మృతో జాయేత శూకరః || 68

శూకరః పంచవర్షాణి దశవర్షాణి వై బకః | పిపీలికస్తు మాసాంస్త్రీ న్కీటః స్యా న్మాసమేవ చ || 69

ఏతానాసాద్య సంసార న్క్రమియోనౌ ప్రజాయతే | తత్ర జీవతి మాసాంస్తు కృమియోనౌ చతుర్దశ || 70

నరోధర్మక్షయం కృత్వా తతో జాయేత మానుషః | పూర్వం దత్త్వా తు యః కన్యాం ద్వితీయే దాతుమిచ్ఛతి || 71

సో7పి విప్రా మృతో జంతుః క్రిమియోనౌ ప్రజాయతే | తత్ర జీవతి వర్షాణి త్రయోదశ ద్విజోత్తమాః || 72

అధర్మ సంక్షేమయేముక్త స్తతో జాయేత మానుషః | దేవకార్య మకృత్వా తు పితృ కార్యమథాపి వా || 73

అనిర్వాప్య పితౄ న్దేవా న్మృతో జాయేత వాయసః | వాయసః శతవర్షాణి తతో జాయేత కుక్కుటః 74

జాయతే వ్యాలకశ్చాపి మాసం తస్మాత్తు మానుషః | జ్యేష్ఠంపితృసమం చాపి భ్రాతరం యో7వమన్యతే || 75

సో7పి మృత్యుముపాగమ్య క్రౌంచయోనౌ ప్రజాయతే | క్రౌంచో జీవతి వర్షాణి దశ జాయేత జీవకః || 76

తతో నిధన మాప్నోతి మనుషత్వ మవాప్నుయాత్‌ | వృషలో బ్రాహ్మణీం గత్వా కృమి¸°నౌ ప్రజాయతే || 77

తతః సంప్రాప్య నిధనం జాయతే శూకరః పునః | శూకరో జాతమాత్రస్తు రోగేణ మ్రియతే ద్విజాః || 78

శ్వా చ వై జాయతే మూఢః కర్మణా తేనభో ద్విజాః | శ్వా భూత్వా కృత కర్మా7సౌ జాయతే మానుష స్తతః || 79

తత్రాపత్యం సముత్పాద్య మృతో జాయత మూషకః | కృతఘ్నస్తుమృతో విప్రా యమస్య విషయం గతః || 80

యమస్య విషయే క్రూరై ర్బద్ధః ప్రాప్నోతి వేదనామ్‌ | దండకం ముద్గరం శూల మగ్నిదండం చ దారుణమ్‌ || 81

అసిపత్రవనం ఘోరం వాలుకాం కూటశాల్మలీమ్‌ | ఏతశ్చాన్యాశ్చ బహవో యమస్య విషయం గతాః || 82

యాతనాః ప్రాప్య ఘోరాస్తు తతో యాతి ద భో ద్విజాః | సంసారచక్ర మాసాధ్య క్రిమియో నౌ ప్రజాయతే || 83

క్రిమిర్భవతి వర్షాణి దశపంచ చ భో ద్విజాః | తతోగర్భం సమాసాద్య తత్రైవ మ్రియతే నరః || 84

తతో గర్భశ##తైర్జంతు ర్బహుశః సంప్రపద్యతే | సంసారాన్సుబహూన్గత్వా స్తతస్తిర్యక్ప్రజాయతే || 85

తతోదుఃఖమనుప్రాప్య బహువర్షగణానివై | స పునర్భవసంయుక్త స్తతః కూర్మః ప్రజాయతే || 86

వధిహృత్వా బకశ్చాపి ప్లవో మత్స్యానసంస్కృతాన్‌ | చోరయిత్వాతు దుర్భిద్ధి ర్మధుదంశః ప్రజాయతే || 87

ఫలం వా మూలకం హృత్వా పూపం వా7పి పిపీలికః | చోరయిత్వాతు నిష్పావం జాయతే ఫలమూషకః || 88

పాయసం చోరయిత్వాతు తిత్తిరత్వ మవాప్నుయాత్‌ | హృత్వా పిష్టమయం పూపం కుంభోలూకః ప్రజాయతే || 89

అపోహృత్వాతు దుర్భుద్ధి ర్వాయసో జాయతేవరః | కాంస్యం హృత్వా తు దుర్బుద్ధి ర్హారీతో జ్యాయతేనరః || 90

రాజతం భాజనం హృత్వా కపోతః సంప్రజాయతే | హృత్వాతు కాంచనం భాండం కృమియోనౌ ప్రజాయతే || 91

పత్రోర్ణం చోరయిత్వా తు కురరత్వం నియచ్ఛతి | కోశకారం తతో హృత్వా నరో జాయేత నర్తకః || 92

అంశుకం చోరయిత్వాతు శుకో జాయేతన మానవః | చోరయిత్వా దుకూలంతు మృతో హంసః ప్రజాయతే || 93

క్రౌంచః కార్పాసికం హృత్వ మృతో జాయేత మానవః | చోరయిత్వా నరః పట్టం త్వావికం చైవ భోద్విజాః || 94

క్షౌమం చ వస్త్రమాహృత్యా శశో జంతుః ప్రజాయతే | చూర్ణంతు హృత్వా పురుషో మృతో జాయేత బర్హిణః || 95

హృత్వా రక్తాని వస్త్రాణి జాయతే జీవజీవకః | వర్ణకాదీంస్తథా గంధాం శ్చోరయిత్వేహ మానవః || 96

చుచ్ఛుందరిత్వమాప్నోతి విప్రో లోభపరాయణః | తత్ర జీవతి వర్షాణి తతో దశ చ పంచ చ || 97

అధర్మస్య క్షయం కృత్వా తతో జాయేత మాసవః | చోరయిత్వా పయశ్చాపి బలాకా సంప్రజాయతే || 98

యస్తు చోరయతే తైలం నరో మోహసమన్వితః | సో7సి విప్రా మృతో జంతు సై#్తలపాయీ ప్రజాయతే || 99

ఆశస్త్రం పురుషం హత్వా స శస్త్రః పురుషాధమః | అర్థార్థం యదివా వైరీ మృతో జాయేత వై ఖరః || 100

ఖరోజీవతి వర్షే ద్వే తతః శ##స్త్రేణ వధ్యతే | సమృతో మృగయోనౌతు నిత్యోద్విగ్నో7భిజాయతే || 101

మృగో విధ్యేత శ##స్త్రేణ గతేసంవత్సరే తతః | హతోమృగస్తతోమీనః సో7పి జాలేన బధ్యతే || 102

ఉపాధ్యాయునెడ బుద్ధిపూర్వముగ బాపము సేసిన శిష్యుడు మూడు జన్మములిహలోకమున సంసారమందు గుములును. అవ్వల కుక్కగును. అటుపై పచ్చి మాంసముతిను జంతువై గాడిదయైచచ్చి నరక మనుభవించి యవ్వల బ్రాహ్మణ జన్మమెత్తును. ఏ శిష్యుడు గురుపత్నిని మనసుచేతనైన బొందునో వాడధర్మచిత్త సంస్కారముచే భయంకర సంసార దుఃఖితుడగును. కుక్కగా మూడేండ్లు జీవించిచచ్చి బ్రాహ్మణజన్మమెత్తును. గురువు బుద్ధిపూర్వకముగ పుత్రుడట్లున్న శిష్యుని హననమొనర్చినచో ఘాతుక మృగమగును. ఏకొడుకు దల్లిని దండ్రిని యవమానించునో వాడు తొలుత గాడిద యగును. పదేండ్లట్లుండి యొకయేడు కుంభీర మగును. మొసలి తలిదండ్రు లిద్దరు నెవ్వనికి దుష్టులుగ దోచుదురో దారుణమైన యా అపధ్యానమువలన (పొరపాటు తలంపు వలన) వాడు గార్దభమగును. ఆ విధముగ రెండేడ్లుండి వాడు పిల్లియై యేడు నెలలుండును. తల్లిదండ్రులను గోలపెట్టినవాడు కోకిలయగును. వారిని గొట్టినవాడు మూడేండ్లు శాత్వక మగును (డేగ). అటుపై నాఱుమాసములు వ్యాళ##మై (పామై) యామీద మానవుడు పుట్టును. యజమాని యన్నము గాజేసినవాడు రాజద్వేషుల యన్నము దిన్నవాడు కోతియగును. పదేండట్లుండి యేడేండ్లెలుక యగును. ఆఱుమాసములు కుక్కయై యవ్వల మానవుడగును. అసూయాగ్రస్తుడు శార్జకమగును. విశ్వాస ఘాతకుడు చేవయగును. ఎనిమిదేండ్లట్లుండి నాల్గునెలలు మృగ మగును. అవ్వలమేక యగును. ఒక్కయేడాదికి జచ్చి కీటకమయి యా మీద మానుష జన్మమందును. ధాన్యములు యవలు దొంగిలించిన వాడెలుక యగును. అటుపై జచ్చి పందియై రోగముచే జచ్చును. అవ్వల మూగ కుక్కయై యైదేడ్లుండి మానవుడగును. పరదారగమనము చేసినవాడు తోడేలగును. కుక్క నక్క గ్రద్ద పాము కంకమురాబందు కొంగయు నగును. ఏపాపి సోదరుని భార్యను బలాత్కరించి మగకోకిలయయి యొక్కయేడుండును. స్నేహితునియొక్క గురువుయొక్క రాజుయొక్క భార్యను గామించిన వాడు పంది యగును. అయిదేండ్లట్లుండి పదేండ్లు కొంగయై మూడునెలలు చీమయై యొకనెల కీటమై క్రిమియై పదునాల్గు నెలలుండి యవ్వల మనుజుడగును. తొలుత కన్యనిత్తునని వాగ్దానముసేసి మఱొక్కనికిచ్చిన వాడు క్రిమి యగును. పదమూడేండ్లట్లు బ్రతికి పాపము క్షయించి మనజుడగును. దేవ పితృకార్యములు సేయక వారికి తర్పణము సేయకున్న వాడు కాకియై నూరేండ్లు మీదట కోడియగును. ఆమీద నొకనెల పామై నరజన్మమందును. తండ్రితో సముడైన పెద్దయన్నను దమ్ముని నెవ్వడవమానించునో వాడు బెగ్గురు పక్షిగ పదేండ్లుండి జీవకమగును. (చకోరపక్షి) అవ్వల నరుడగును. వృషలుడు (శూద్రుడు) బ్రాహ్మణస్త్రీని సంగమించి కృమియై పందియై రోగముచే జచ్చును. అటుపై కుక్కయై తుదకు నరుడగును. అపుడు సంతానముంగని చచ్చి ఎలుకయగును. కృతఘ్నుడు (చేసినమేలు మరచినవాడు) యమలోకమేగి యమభటుల క్రౌర్యమునకు గుమిలి కుమిలి వారి దండాఘాతములకు ముద్గర శూరాగ్ని దండముల దెబ్బలకు గురియై ఘోరమైన అసిపత్రవనమునందు (కత్తులబోనున) కూటశాల్మలియను మిడమిడగాలు నిసుక మేటలందు నడిపింపబడి ఘోరయాతనలనుభవించి సంసారచక్ర పరిభ్రమణమంది క్రిమియగును. పదేనేండ్లట్లుండి యక్కడ కడుపువచ్చి యటనే చచ్చును. అవ్వలననేక గర్భములనంది తుదకు పశుపక్షి జన్మమందు పెక్కేండ్లట్లుండి తాబేలగును. పెరుగు దొంగిలించి కొంగ యగును. పచ్చిచేపలను హరించినవాడు తేనెటీగయగును. పండుమూలకము (ముల్లంగి) అప్పము దొంగిలి చీమ యగును.

పాయసముదొంగ తిత్తిరి (తీతువు) పక్షియగును. పిండితో జేసిన యప్పచ్చి నపహరించి గ్రుడ్లగూబ యగును. మంచినీళ్లు హరించి కాకియగును. కంచుదొంగిలించి హారితము (పచ్చపిట్ట) యగును. వెండిగిన్నె కాజేసిన పావురమగును. బంగారు బిందెను హరించి క్రిమియగును. పట్టుబట్ట దొంగిలి కురరము (టిట్టిభము-తీతువుపక్షి) యగును. పట్టు పురుగులను హరించినవాడు నర్తకుడు (నటకుడు) అగును. వస్త్రసామాన్యమును హరించినవాడు చిలక యగును. నార పట్టు బట్ట హరించి హంసజన్మ మెత్తును. నూలుబట్ట హరించి తీతువు పక్షియగును. పట్టునూరు ఆవికము గొఱ్ఱ ఉన్నితో నేసినబట్ట నారచీరను (తెల్లపట్టుబట్ట) దొంగిలించి కుందేలు (చెవులపిల్లి) యై పుట్టును. ఎఱ్ఱవస్త్రముల హరించి చకోరపక్షియగును.

చందనాది సుగంధవస్తువుల హరించినవాడు చుంచుగా బుట్టును. ఆజన్మములో బదియేనేండ్లుండి యాపాపము క్షమింపజేసికొని మానవుడై జనించును. పాలు దొంగిలించినవాడు బలాక పక్షి (పెద్దకొక్కెర) యైపుట్టును. నూనె (నువ్వులనూనె) హరించిన గబ్బిలము (తైలముంద్రావు) జంతువగును. అర్థము కొఱకు (డబ్బుకొఱకు) చేతిలోనాయుధములేనివాని సాయుధుడై కొట్టినవాని (చంపినవాడు) గాడిద యగును. ఆజన్మలో రెండేండ్లు బ్రతికి చివరకు ఆయుధముచే నరక బడును. అట్లుచచ్చి వాడు మృగముగా బుట్టి నిరంతరాందోళనముతో నుండును. ఒక్క యేడాదితర్వాత వాడాయుదముదెబ్బతిని కూలును. ఆమీద వాడే వలలోదగుల్కొన్న చేపయై నాల్గవనెలలో అడవి జంతువగును. పదేండ్లంట్లుండి పులిజన్మమెత్తి యైదేడ్లుండి మరణించి అధర్మక్షయమై మనజుడగును.

మాసే చతుర్థే సంప్రాప్తే శ్వాపదః సంప్రజాయత్‌ | శ్వాపదో దశవర్షాణి ద్వీపీ వర్షాణి పంచ చ || 103

తత స్తునిధనం ప్రాప్తః కాలపర్యాయ చోదితః | అధర్మస్యక్షయం కృత్వా మానుషత్వ మవాప్నుయాత్‌ || 104

వాద్యం హృత్వాతు పురుషో తోమశః సంప్రజాయతే | తథా పిణ్యాకసంమిశ్ర మన్నం యశ్చోరయేన్నరః || 105

స జాయతే బభ్రుసటో దారుణో మూషికోనరః | దశ##న్వై మానుషాన్నిత్యం పాపాత్మా సం ద్విజోత్తమాః || 106

ఘృతం హృత్వాతు దుర్బిద్ధిః కాకో మద్గుః ప్రజాయతే | మత్స్యమాంస మథోహృత్వా కాకో జాయేత మానవః || 107

లవణం చోరయిత్వా తు చిరికాకః ప్రజాయతే | విశ్వాసేన తు నిక్షిప్తం యో7పనిహ్నోతి మానవః || 108

స గతాయుర్నరస్తేన మత్స్యయోనౌ ప్రజాయతే | మత్స్యయోని మనుప్రాప్య మృతో జాయేత మానుషః || 109

మానుషత్వ మనుప్రాప్య క్షీణాయురుపజాయతే | పాపాని తు నరః కృత్వా తిర్యగ్జాయేత భో ద్విజాః || 110

నచా77త్మనః ప్రమాణంతు ధర్మం జానాతి కించన | యే పాపాని నరాః కృత్వా నిరస్యంతి వ్రతైః సదా || 111

సుఖదుఃఖసమాయుక్తా వ్యాధిమంతో భవంత్యుత | అసంవీతాః ప్రజాయంతే శ్ల్శేచ్ఛాశ్చాపి న సంశయః || 112

నరాః పాపసమాచారా లోభమోహసమన్యితాః | వర్జయంతి హి పాపాని జన్మప్రభృతి యేనరాః || 113

అరోగా రూపవంతశ్చ ధ్యనినస్తే భవంత్యుత | స్త్రియో7ప్యేతేన కల్పేన కృత్వా పాపమవాప్నుయుః || 114

ఏతేషాం మేవ పాపానాం భార్యాత్వముపయాంతి తాః | ప్రాయేణ హరణ దోషాః సర్వ ఏవ ప్రకీర్తితాః || 115

ఏతద్వైలేశమాత్రేణ కథితం వో ద్విజర్షభాః | అపరస్మిన్కథాయోగే భూయః శ్రోష్యథ భోద్విజాః || 116

ఏతన్మయా మహాభాగా బ్రహ్మణో వదతః పురా | సురర్షీణాం శ్రుతం మధ్యే పృష్టం చాపి యథా తథా || 117

మయా7పి తుభ్యం కార్త్స్యేన యధావదను వర్ణితమ్‌ | ఏతచ్ఛ్రుత్వా మునిశ్రేష్ఠా ధర్మే కురుత మానసమ్‌ || 118

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షిసంవాదే సంసారచక్ర నిరూపణంనామ సప్తదశాధిక ద్విశతతమో7ధ్యాయః

వాద్యమును హరించినవాడు గొఱ్ఱయగును. పిండితోకూడిన అన్నమును దొంగిలించినవాడు బభ్రుసటుపుఅను (ముంగిపింగళవర్ణముగల వేంట్రెకలు గలది) దారుణమైన మూషికముగా బుట్టును. అట్టిమనుజులను నిత్యము గఱచుచుండును. నేతిని హరించినవాడు నీరుకాకియగును. చేప మాంసము దొంగిలి కాకియగును. ఉప్పు దొంగిరి చిరి కాకమగును. చెముడుకాకి బొంతకాకి మొదలగు వానిలో రకము. తనపై విశ్వాసము (నమ్మకము) గల్గియున్నవాని మోసగించినవాడు చేపయైపుట్టి మనుజుడగును. అప్పుడాయుర్దాయు తక్కువయుండును. నరుడు పాపములుసేసి పశుపక్ష్యాది జన్మములందును తన తాహతెతో ధర్మమేదో వాడెరుంగలేడు. అట్టివారు వ్రతదూరులై వ్యాదిగ్రస్తులై దుఃఖితులగుచుందురు. ఒడలిపై బట్టకూడ లేకుండ వ్లుెచ్ఛులై పావులై లోభమోహాదివశులై పుట్టుదురు. (వ్లుెచ్ఛుడు అనార్యుడు గోమాంసభక్షకుడు అపశబ్దములు భాషించువాడు ళిష్టాచార రహితమగు కామరూపాది దేశములనుండువాడు) అట్టిననాటి నుండి యెవ్వరు పాపములను విడిచెదరో వారారోగ్యవంతులు. ఐశ్వర్యవంతులు రూపవంతులు నగుదురు. ఈ చెప్పిన కల్పము ప్రకారము స్త్రీలుకూడ యాయా పాపఫలములందుదురు. అట్టి పాపాత్ములకే భార్యలగుదురు. ఇంతవరకు విశేషించి యాయా వస్తువుల దొంగతనము వలని దోషములు తెలుపబడినవి. ఇది వేశమాత్రముగ మీకెఱింగించితిని. వాటియొక కథా సందర్భమందు ఓద్విజులారా! ఇంకను విశేషముగ విందురుగాక! నేనిది బ్రహ్మ దేవర్షులకు దెలుపు తఱివిన్నది. విన్నట్లు మీకు దెలిపితిని. ఇది విని మునివరులార! మీరు మనస్సును ధర్మమునందు నిలుపుడు.

ఇది బ్రహ్మపురాణమున సంసారచక్రనిరూపణము అను రెండువందలపదునేడవఅధ్యాయము.

Brahmapuranamu    Chapters