Brahmapuranamu    Chapters   

అథ షోడశాధికద్విశతతమో7ధ్యాయః

నరకదుఃఖనివారణాయ ధర్మాచరణవర్ణనమ్‌

మునయ ఊచుః

ఆహో7తిదుఃఖం ఘోరం చ యమమార్గే త్వయోదితమ్‌ | నరకారిణి చ ఘోరాణి ద్వారం యామ్యం చ సత్తమ ||

అస్త్యుపాయో నవా బ్రహ్మన్‌ య్యమమార్గే7తి భీషణ | బ్రూహి యేన నరా యాంతి

సుఖేన యమసాదనమ్‌ || 2

వ్యాస ఉవాచ

ఇహ యే ధర్మసంయుక్తా స్త్వహింసానిరతా నరాః | గురుశుశ్రూషణ యుక్తా

దేవబ్రామ్మణపూజకాః || 3

యస్మిన్మష్యలోకేతే సభార్యాః ససుతాస్తథా | తమధ్వానం చ గచ్ఛంతి యథా

తత్కథయామివః || 4

విమానైర్వివిధైర్దివ్యైః కాంచనధ్వజశోభితైః | ధర్మరాజపురం యాంతి అప్సరోగణ

సేవితాః || 5

బ్రాహ్మణభ్యస్తు దానాని నానారూపాణి భక్తితః | యే ప్రయచ్ఛంతి తే యాంతి

సుఖేనైవ మహాపథే || 6

అన్నం యేతు ప్రయచ్ఛంతి బ్రాహ్మణభ్యః సుసంస్కృతమ్‌ | శ్రోత్రియేభ్యో విశేషేణ

భక్త్యా పరమయాయుతః ||

తరుణీభిర్వరస్త్రీభిః సేవ్యమానాః ప్రయత్నతః | ధర్మరాజపురం

యాంతి విమానైరభ్యలంకృతైః || 8

యేచ సత్యం ప్రభాషంతే బహిరంతశ్చ నిర్మలాః | తే7పియాంత్యమ

రప్రఖ్యా విమానైర్యమమందిరమ్‌ || 9

గోదానాని పవిత్రాణి విష్ణుముద్దిశ్య సాధుషు|యే ప్రయచ్ఛంతి ధర్మజ్ఞాః కృశేషు కృశవృత్తిషు || 10

తేయాంతి దివ్యవర్ణాభై ర్విమావైర్మణిచిత్రితైః| ధర్మరాజపురం శ్రీమత్సేవమానాప్సరోగణౖః | 11

మునులిట్లనిరి

యమలోకమార్గమందు గల్గు ఘోర దుఃఖము ఘోరములైన నరకములు నరక

ద్వారమును గురించి యాశ్చర్యమైన విషయములను నీవు దెలిపితివి. భయంకరమైన

యాదారిలో సుఖముగ వెళ్ళుట కుపాయము కలదో లేదో తెలుపు మన

వ్యాసుండిట్లనియె. ఇహమందు ధర్మపరులై యహింసా నిరతులై గురు శుశ్రూష

దేవబ్రాహ్మణ పూజ చేసిన వారు భార్యాపుత్రాదులతో యమమార్గమున వెళ్ళరు.

బంగారు టెక్కెములతోఁగూడిన దివ్యవిమానముల యందప్సరసలు సేవింప

ధర్మరాజుపరమున కేగెదరు. బ్రాహ్మణులకన్నదానము మొదలైన వానిని భక్తితో

పవిత్రముగ చేసినవారు దేవతా తరుణులచేత సేవింపబడుచు విమానములమీద

వెళ్ళెదరు. సత్యము పల్కిననారు మనసులో మాటలో స్వచ్చమైనవారు

విష్ణుతాత్పర్యముతో గోదానమ జేసినవారప్సరసలు సేవింప ధర్మపురి కేగుదురు.

ఉపానద్యుగళం ఛత్రం శయ్యాసనమథాపివా | యేప్రయచ్ఛంతి వస్త్రాణి

తథైవాభరణానిచ || 12

తేయాంత్యశ్చైరథైశ్చైవ కుంజరైశ్చాప్యలంకృతాః | ధర్మరాజపురం దివ్యం ఛత్త్రైః

సౌవర్ణరాజతైః || 13

యేచ భక్త్యా ప్రయచ్ఛంతి గుడపానక మర్చితమ్‌ |ఓదనం చ ద్విజాగ్ర్యేభ్యో విశుద్ధేనాంతరాత్మనా || 14

తే యాంతి కాంచనైర్యానై ర్వివిధైస్తు యమాలయమ్‌ | వర స్త్రీభిర్యథాకామం సేవ్యమానాః పునః పునః || 15

యేచ క్షీరం ప్రయచ్ఛంతి ఘృతం దధిగుడం మధు | బ్రాహ్మణభ్యః ప్రయత్నేన శుద్ధ్యోపేతం సుసంస్కృతమ్‌ || 16

చక్రవాకప్రయుక్తైశ్చ విమానైస్తు హిరణ్మయైః | యాంతి గంధర్వవాదిత్రైః సేవ్యమనా యమాలయమ్‌ || 17

యేఫలాని ప్రయచ్ఛంతి పుష్పాణిసురభీణిచ | హంస యుక్తైర్విమానైస్తు యాంతి ధర్మపురం నరాః || 18

యేతిలంస్తిల ధేనుంచ ఘృతధేనుమథాపివా | శ్రోత్రియేభ్యః ప్రయచ్ఛంతి విప్రేభ్యః శ్రద్ధయా7న్వితాః || 19

సోమమండలసంకాశై ర్యానైస్తే యాంతి నిర్మలైః | గంధర్వైరుపగీయంతే పురే వైవస్వతస్య తే || 20

యేషాం వాప్యశ్చ కూపాశ్చ తడాగాని సరాంపిచ | దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ శీతలాశ్చ జలాశయాః || 21

యానైస్తే హేమచంద్రాభై ర్దివ్యఘంటానినాదితైః | వ్యజనైస్తాళవృంతైశ్చ వీజ్యమానా మహాప్రభాః || 22

యేషాం దేవకులాన్యత్ర చిత్రాణ్యాయతనానిచ | రత్నైః ప్రస్ఫురమాణాని మనోజ్ఞాని శుభానిచ || 23

తేయాంతి లోకపాలైసై ర్విమానైర్వాతరంహసైః | ధర్మరాజపురం దివ్యం నానాజనసమాకులమ్‌ || 24

పానీయం యే ప్రయచ్ఛంతి సర్వప్రాణిషు జీవనమ్‌ | తే వితృష్ణాః సుఖం యాంతి విమానై స్తం మహాపథమ్‌ || 25

కాష్ఠపాదుక యానాని పీఠకాన్యాసనాని చ | యైర్దత్తాని ద్విజాతిభ్య స్తే7ధ్వానం యాంతి వైసుఖమ్‌ || 26

సౌవర్ణ మణిపీఠేషు పాదౌ కృత్వోత్తమేషు చ | తే ప్రయాంతి విమానైస్తు అప్సరోగణమండితైః || 27

ఆరామాణి విచిత్రాణి పుష్పాఢ్యానీహ మానవాః | రోపయంతి ఫలాఢ్యాని నరాణా ముపకారిణః || 28

వృక్షచ్ఛాయాసు రమ్యాసు శీతలాసు స్వలంకృతాః | వరస్త్రీగీతవాద్యైశ్చ సేవ్యమానా వ్రజంతి తే || 29

సువర్ణం రజతం వామౌపి విద్రుమం వకాక్తికం తథాః | యే ప్రయచ్ఛంతి తే యాంతి విమానైః కనకోజ్జ్వలైః 30

భూమిదా దీప్యమానాశ్చ సర్వకామైస్తు తర్పితాః | ఉదితాదిత్య సంకాశై ర్విమాన్పైర్భృశనాదితైః || 31

కన్యాం తు యేప్రయచ్ఛంతి బ్రహ్మదేయామలంకృతామ్‌ | దివ్యకన్యావృతాయాంతి విమానైస్తేయమాలయమ్‌ || 32

సుగంధాగురుకర్పూరా న్పుష్పధూపాన్ద్విజోత్తమాః | ప్రయచ్ఛంతి ద్విజాతిభ్యో భక్త్యా పరమయా7న్వితాః || 33

తే సుగంధాః సువేషాశ్చ సుప్రభాః సువిభూషితాః | యాంతి ధర్మపురం యానై విచిత్రైరభ్యలంకృతాః || 34

దీపదా యాంతి యానైశ్చ దీపయంతో దిశో దశ | ఆదిత్య సదృశై ర్యానై ర్దీప్యమానా యథ్యా7న్నయః || 35

గృహావసథదాతారో గృహైః కాచంనమండితైః | వ్రజంతిబాలార్కనిభై ర్ధర్మరాజ గృహం నరాః || 36

జలభాజన దాతారః కుండికా కారకప్రదాః | పూజ్యమానాప్సరోభిశ్చ యాంతి దృప్తా మహాగజైః || 37

పాదాభ్యంగం శిరోభ్యంగం స్నానపానోదకం తథా | యే ప్రయచ్ఛంతి విప్రేభ్య స్తే యాంత్యశ్వైర్యమాలయమ్‌ ||

విశ్రామయంతి యేవిప్రాం శ్రాంతానథ్వని కర్శితాన్‌ | చక్రవాకప్రయుక్తేన యాంతి యానేద తే సుఖమ్‌ || 39

స్వాగతేన చ యో విప్రం పూజయే దాసనేన చ | సగచ్ఛంతితమధ్వానం సుఖం పరమనిర్వృతః || 40

నమోబ్రహ్మణ్య దేవేతి యో హరిం చాభివాదయేత్‌ | గాంచ పాపహరేత్యుక్త్వా సుఖం యాంతిచ తత్పథమ్‌ || 41

అనంతరాశినో యేచ దంభానృతవివర్జితాః | తే7పి సారసయుక్తైస్తు యాంతి యానైశ్చ తత్పథమ్‌ || 42

వర్తంతే హ్యేకభ##క్తేన శాఠ్యదంభ వివర్జితాః | హంసయుక్తైర్విమానైస్తు సుఖం యాంతి యమాలయమ్‌ || 43

చతుర్ధేనైకభ##క్తేన వర్తతే యే జితేంద్రియాః | తేయాంతి ధర్మనగరం యానైర్బర్హిణయోజితైః || 44

తృతీయే దివసే యేతు భుంజతే నియతవ్రతాః | తే7పి హస్తిరథైర్దివ్యై ర్యాంతి యానైశ్చ తత్పథమ్‌ || 45

షష్ఠే7న్నభక్షకో యస్తు శౌచనిత్యో జితేంద్రియః | సయాతి కుంజరస్థస్తు శచీపతిరివ స్వయమ్‌ || 46

ధర్మరాజపురం దివ్యం నానామణి విభూషితమ్‌ | నానాస్వరసమాయుక్తం జయశబ్దరవైర్యుతమ్‌ || 47

పక్షోపవాసినో యాంతి యానైః శార్దూలయోజితైః | పురం తద్ధర్మరాజస్య సేవ్యమానాః సురాసురైః || 48

యేచమాసోపవాసం తు కుర్వతే సంయతేంద్రియాః | తే7పి సూర్య ప్రదీపై#్తస్తు యాంతి యానైర్యమాలయమ్‌ || 49

మహాప్రస్థాన మేకాగ్రో యః ప్రయాతి దృఢవ్రతః | సేవ్యమానస్తు గంధర్వై ర్యాతి యానైర్యమాలయమ్‌ || 50

శరీరం సాధయే ద్యస్తు వైష్ణవేనాంతరాత్మనా | స రథేనాగ్ని వర్ణేన యాతీహ త్రిదశాలయమ్‌ || 51

అగ్ని ప్రవేశం యః కుర్యా న్నారాయణపరాయణః | స యాత్యగ్ని ప్రకాశేన విమానేన యమాలయమ్‌ || 52

ప్రాణాంస్త్యజతి యో మర్త్యః స్మరన్విష్ణుం సనాతనమ్‌ | యానేనార్క ప్రకాశేన యాతి ధర్మపురం నరః || 53

ప్రవిష్టో7ంతర్జలం యస్తు ప్రాణాంస్త్యజతిమానవః | సోమమండలకల్పేన యాతి యానేన వై సుఖమ్‌ || 54

స్వశరీరం హి గృధ్రేభ్యో వైష్ణవో యః ప్రయచ్ఛతి | సయాతి రథముఖ్యేన కాంచనేన యమాలయమ్‌ || 55

స్త్రీగ్రహే గోగ్రహే వా7పి యుద్ధే మృత్యుముపైతియః | స యాత్యమరకన్యాభిః సేవ్యమానో రవిప్రభః || 56

వైష్ణవా యే చ కుర్వంతి తీర్థయాత్రాం జితేంద్రియాః | తత్పథం యాంతితే ఘోరంసుఖయానైరలంకృతాః || 57

యే యజంతి ద్విజశ్రేష్ఠాః క్రతుభిర్భూరిదక్షిణౖః | తప్తహాటక సంకాశై ర్విమానైర్యాంతి తే సుఖమ్‌ || 58

పరపీడామకుర్వంతో భృత్యానాం భరణాదికమ్‌ | కుర్వంతితే సుఖమ్‌ యాంతి విమానైః కనకోజ్జ్వలైః 59

యే క్షాంతాః సర్వభూతేషు ప్రాణినా మభయప్రదాః | క్రోధమోహ వినిర్ముక్తా నిర్మదాః సంయతేంద్రియాః || 60

పూర్ణచంద్రప్రకాశేన విమానేన మహాప్రభాః | యాంతి వైవస్వతపురం దేవగంధర్వసేవితాః || 61

ఏకభావేన యే విష్ణుం బ్రహ్మాణం త్య్రంబకం రవిమ్‌ పూజయంతి హితేయాంతి విమానై ర్భాస్కర ప్రభైః || 62

యేచ మాంసం న ఖాదంతి సత్యశౌచసమన్వితాః | తే7పి యాంతి సుఖేనైవ ధర్మరాజపురం నరాః || 63

మాంసాన్మిష్టతరం నాస్తి భక్ష్యభోజ్యాదికేషు చ | తస్మాన్మాంసం న భుంజీత నాస్తి మిష్టైః సుఖోదయః || 64

గో సహస్రం తు యో దద్యాద్యస్తు మాంసం న భక్షయేత్‌ | సమావేతౌ పురా ప్రాహ బ్రహ్మా వేదవిదాం వరః || 65

సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వయజ్ఞేషు యత్ఫలమ్‌ | అమాంసభక్షణ విప్రా స్తచ్చ తచ్చచతత్పమమ్‌ || 66

ఏవం సుఖేన తే యాంతి యమలోకం చ ధార్మికాః | దానవ్రతపరా యానై ర్యత్ర దేవో రవేః సుతః || 67

పాదరక్షలు గొడుగు మంచము ఆసనము వస్త్రాభభణములనొసంగిన వారు గజాశ్వరథములనెక్కి బంగారు వెండి గొడుగులతో నేగుదురు. శుద్ధాంతఃకరణముతో పానకము అన్నము పూజించి యిచ్చినవారు బంగారు విమానముల నేగుదురు. పాలు పెరుగు నేయి బెల్లము మంత్రపూతముగా పరిమళపుష్పముల నిచ్చినవారు హంసవిమానములమీద నరుగుదురు. నువ్వులనుతిలధేనుఘృత ధేనుదానములను శ్రద్ధతో శ్రోత్రియులకిచ్చినవారు చంద్రమండలమునట్లు ప్రకాశించు విమావములమీద గంధర్వులు గానము సేయుచుండ యమపురికి జనెదరు. వాపీకూపతటాకములు సరస్సులు దిగుడు బావులు పుష్కరుణులు మొదలైన శీతలోదకలాశయములను ద్రవ్వించినవారు బంగారువిమానములమీద దివ్యఘంటానాదము వినిపింప ఛత్రచామరాదులచే వీవబడుచు నేగుదురు. ఈ లోక మందు దేవాలయములు సువర్ణరత్నమయములుగా నిర్మించినవారు వాయువేగములైన విమానములలో లోకపాలురతో నేగుదురు. మంచినీళ్ళిచ్చినవారు దారుమయపాదుకులు పీఠములు ఆసనములిచ్చినవారు సుఖముగ స్వర్ణమణిపీఠమందు గూర్చుండి విమానములలోనేగుదురు. పుష్పోద్యానములు పండ్లతోటలు ప్రతిష్ఠించినవారు చల్లనిచెట్లనీడలో దేవతాగానముల వినుచునేగుదురు. బంగారము వెండి పవడము ముత్యము దానమిచ్చినవారు భూదాతలు సాలంకృతకన్యాదానముచేసినవారు సుగంధాగరు కర్పూరములను పుష్పములను ధూపద్రవ్యముల నొసంగినవారు సుగంధలిప్తులై సువేషులై సుప్రభులై సుభూషితులై ధర్మపురమేగుదురు. దీపదానము చేసినవారు సూర్యసదృశ##మైన విమానములమీద దశ##దెశలు మెరయించుచు నేగుదురు. గృహదానముచేసినవారు బంగారు గృహముల వసింతురు. జలకుంభములను కుండికలను కూజాలనిచ్చినవారేనుగులమీద వెళ్ళెదరు. పాదాభ్యంగము. శిరోభ్యంగము చేయించినవారు స్నానపానోదకములనిచ్చిన వారు జాతిగుఱ్ఱమునెక్కి వెళ్ళెదరు. మార్గాయాసమునవచ్చిన బ్రాహ్మణులను విశ్రమింపజేసినవారు చక్రవాకపక్షులు పూన్చిన వాహనములనేగుదురు. ఇంటికివచ్చిన బ్రాహ్మణులకు స్వాగతముచ్చి (దయచేయుడని గౌరవించి) సుఖాసనమిచ్చి పూజించినవారు నమోబ్రహ్మణ్యదేవాయ (బ్రహణ్యమూర్తియైన భూదేవునకు నమస్కారము) యని పాదములపై వ్రాలి నమస్కరించి పాపహరయను మంత్రముతో గోదానముచేసిన వారును సుఖప్రయాణముచేయుదురు. ద్విజభుక్తశేషముఅనగా బ్రాహ్మణులకు భోజనముపెట్టిన తరువాత శేషించిన యమృతమనుపేరుగలయాహారము ప్రసాదరూపముగ నారగించినవారు దాంఛిక వృత్తి యనృతములేనివారు హంసవిమానముననేగుదురు. మూడురోజులుపవాసముండి నాల్గవరోజున నేకభుక్తముసేసినవారు మూర్ఖత్వము డాంభికములేనివారు నెమలివిమానములోనేగుదురు. మూడురోజుల కొకసారి వ్రతముపూని భోబనముసేయువారు గజరథములమీద నేగుదురు. ఆరురోజుల కొక్కమారే శుచియై భోజనముచేసినయాతడు దేవేంద్రు నట్లేనుగునెక్కి వెళ్ళును. పక్షమునకొకతూరి భోజనముచేసినవారు పులులుపూన్చిన రథముననేగెదరు. నెలరోజ లుపవాసముసేసినవారు గంధర్వగానములు వినుచు విమానయానము చేయుదురు. విష్ణుభక్తి తాత్పర్యముతో నారాయణ పరాయణతతో ప్రాణముబాసినవాడు అగ్ని ప్రవేశముచేసినవాడ్గనివలె విలసించురథముననేగును. విష్ణుభక్తితో తనంతట తాను జలములోదిగి ప్రాణమువదలినవాడు, తనశరీరమును గ్రద్దలకెరవెట్టినవాడు బంగారవిమానముననేగును. గోరక్షణకు స్త్రీ రక్షణకొరకు ప్రాణమర్పించినవాడు దేవతాస్త్రీలు గొలువ సూర్యప్రభతో నేగును. విష్ణుభక్తితో తీర్థయాత్ర సేసిన వారు యజ్ఞములు చేసినవారు ఇతరులకెట్టిబాధయు గల్గింపనివారు భక్తితో సేవచేయు నౌకర్లను భరించినవారు ఓరిమిగల వారు సర్వభూతదయగలవారు అభయమిచ్చిన వారు కామాదిగుణములు లేనివారు చంద్రప్రకాశ##మైన విమానమున దేవ గంధర్వుల కొలువ యమపురికేగుదురు. బ్రహ్మ విష్ణుశివమూర్తులను భేదబుద్ధిలేకుండ పూజించినవారు సూర్యప్రభములగు విమానములనేగుదురు. సత్యశౌచములు గల్గి మాంసము తిననివారును సుఖముగ నేగుదురు. భక్ష్యభోజ్యాదులందు మాంసముకంటె రుచికరమైన పదార్థములేదు. పరసుఖాభిలాషి దానిని తినగూడదు. మాంసము ముట్టనివాడు గోసహస్ర దానముసేసినవాడును సమానులేయని వేదవేత్తలకెల్ల శ్రేష్ఠుడైన బ్రహ్మచెప్పినాడు. సర్వతీర్థసేవనము సర్వయజ్ఞాచరణము వలనకల్గు పుణ్యమొక్క మాంసభక్షణ చేయనందువలన కల్గును. దానవ్రతధర్మపరులైన మహానుభావులు సూర్య కుమారుడైన ధర్మప్రభువుయొక్క నగరమునకు సుఖముగనేగుదురు.

దృష్ట్వా తాన్థార్మికాన్దేవః స్వయం సంమానయేద్యమః | స్వాగతాసనదానేన పాద్యార్ఘ్యేణ ప్రియేణతు || 68

ధన్యా యూయం మహాత్మాన ఆత్మనో హితకారిణః | యేన దివ్య సుఖార్థాయ భవద్భిః సుకృతం కృతమ్‌ || 69

ఇదం విమానమారుహ్య దివ్యస్త్రీభోగభూషితాః | స్వర్గం గచ్ఛధ్వమతులం సర్వకామసమన్వితమ్‌ || 70

తత్ర భుక్త్వా మహాభోగా నంతే పుణ్యపరిక్షయాత్‌ | యత్కించిదల్పమశుభః ఫలం తదిహ భోక్ష్యథ || 71

యేతు తం ధర్మరాజానం నరాః పుణ్యానుభావతః | పశ్యంతి సౌమ్యమనసం పితృభూతమివా77త్మనః || 72

తస్మాద్ధర్మః సేవితవ్యః సదాముక్తి ఫలప్రదః | ధర్మాదర్థస్తథాకామో మోక్షశ్చ పరికీర్త్యతే || 73

ధర్మోమాతా పితా భ్రాతా ధర్మోనాథః సుహృత్తథా | ధర్మః స్వామీ సఖా గోప్తా తథా ధాతా చ పోషకః || 74

ధర్మాదఠ్థో7ర్థతః కామః కామాద్భోగః సుఖాని చ | ధర్మాదైశ్వర్యమేకాగ్ర్యం ధర్మాత్స్వర్గగతిః పరా || 75

ధర్మస్తు సేవితో విప్రా స్త్రాయతే మహతో భయాత్‌ | దేవత్వం చ ద్విజ్వతం చ ధర్మాత్ప్రాప్నో త్య సంశయమ్‌ || 76

యదాచ క్షీయతే పాపం నరాణాం పూర్వసంచితమ్‌ | తదైషాం భజతే బుద్ధి ర్ధర్మం చాత్ర ద్విజోత్తమాః || 77

జన్మాంతరసహస్రేషు మానుష్యం ప్రాప్యదుర్లభమ్‌ | యో హినా7చరతే ధర్మం భ##వేత్స ఖలువంచితః || 78

కుత్సితా యే దరిద్రాశ్చ విరూపావ్యాధితాస్తథా| పరప్రేప్యాశ్చమూర్ఖాశ్చజ్ఞేయా ధర్మవివర్జితాః || 79

యేహి దీర్ఘాయుషః శూరాః పండితా భోగినో7ర్థినః | అరోగా రూపవంతశ్చ తైస్తు ధర్మః పురాకృతః || 80

ఏవం ధర్మరతా విప్రాగచ్ఛంతి గతిముత్తమామ్‌ | అధర్మం సేవమానాస్తు తిర్యగ్యోనిం వ్రజంతితే || 81

యే నరా నరకధ్వంసి వాసుదేవమనువ్రతాః | తే స్వప్నే7పి న పశ్యంతి యమం వా నరకాణి వా || 82

అనాదినిధనం దేవం దైత్యదానవ దారణమ్‌ | యే నమంతి నరానిత్యం న హి పశ్యంతి తే యమమ్‌ || 83

కర్మణా మనసా వాచా యే7చ్యుతం శరణంగతాః | న సమర్థో యమస్తేషాం తే ముక్తిఫలభాగినః || 84

యే జనా జగతాం నాథం నిత్యం నారాయణంద్విజాః | నమంతి నహి తే విష్ణోః స్థానా దన్యత్ర గామినః || 85

నతే దూతాన్న తన్మార్గం న యమం నచ తాంపురీమ్‌ | ప్రణమ్య విష్ణుం పశ్యంతి నరకాణి కథంచన || 86

కృత్వా7పి బహుశః పాపం నరా మోహసమన్వితాః | న యాంతి నరకం నత్వా సర్వపాపహరం హరిమ్‌ || 87

శాఠ్యేనాపి నరా నిత్యం యే స్మరంతి జనార్దనమ్‌ | తే7పి యాంతి తనుంత్యక్త్యా విష్ణులోకమనామయమ్‌ || 88

అత్యంతక్రోధసక్తో7పి కదాచిత్కీర్తయేద్ధరిమ్‌ | సో7పి దోషక్షయాన్ముక్తిం లభే చ్చేదిపతిర్యథా || 89

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షిసంవాదే ధార్మికాణాం సుగతినిరూపణంనామ షోడశాధికద్విశతతమో7ధ్యాయః

అట్లువచ్చిన ధర్మాత్ములకు యముడు స్వయముగా స్వాగతముపల్కి పాద్యార్ఘ్యాసనాద్యుపచారములుసేసి సత్కరించును. మీరు ధన్యులు మహానుభావులు మీ హితవేదియో తెలిసి పుణ్యముసేసినారు. ఇదిగో దివ్యస్త్రీ భోగ భాజనమైన యీ విమానమెక్కి సర్వకామ సమృద్ధమైన స్వర్గమునకు వెళ్ళుడు. మహాభోగములట ననుభవించి దాన మీ పుణ్యము చెల్లిన తరువాత శేషించి యేదైనను కొంచెము పాపమున్నయెడల దానినిక్కడ యనుభవింపుడు. పుణ్యఫలముగ సౌమ్యమైన మనస్సుతో తనకు తండ్రియైన యముని పితృదేవతారూపమున దర్శింతురు. కావున ధర్మము భుక్తిముక్తుల నిచ్చునది యవశ్యము సేవింపవలసినది. ధర్మమువలననే యర్థకామములు మోక్షముఁగూడ సిద్ధించును. ధర్మము తల్లి తండ్రి సోదరుడు. దిక్కు ధర్మము యజమానికి మిత్రుడు రక్షకుడు ధాత పోషకుడును. ధర్మము వలన యర్థము అర్థమువలన కామము కామమువలన సుఖభోగములు ధర్మము వలన సర్యోత్తమైశ్వర్యము ధర్మము వలన స్వర్గగతి పరమగతియు ధర్మము నాచరించిననది మహాభయమునుండి రక్షించును. దేవత్వము భూదేవత్వము దానివలననే. పూర్వపాపము నశించినపుడే జీవులకు ధర్మబుద్ధిగల్లును. వేలకొలది జన్మముల తరువాతగాని లభింపని నూనుష్యమును బొందిగూడ ధర్మమునాచరింపనివాడు దైవవంచితుడు. ధర్మదూరులైనవారే నీచులు దరిద్రులు విరూపులు రోగులు నౌకరులు మూర్ఖులునైనగుదురు. దీర్ఘాయుష్మంతులు శూరులు పండితులు భోగలు ధనికులు నరోగులు సురూపులు నగువారు పూర్వము ధర్మముసేసినవారన్నమాట. ధర్మరతులుత్తముగతికేగుదురు.అధర్మరతులు పశుపక్ష్యాదియోనినందుదురు. నరక ధ్వంసియైన వాసుదేవునిసేవించు వ్రతముగలవారు గలలోగూడ కాలుని నరకములను జూడరు. ఆద్యంతములువేని దేవునిదైత్యదానవ నాశకుని పరమేశ్వరు నచ్యుతుని త్రికరణశుద్ధిగ శరణొందినవారిని యముడేమియు చేయజాలడు. నారాయణుని నమస్కరించు వారు విష్ణుస్థానముం దప్పమరియొక చోటునకు బోరు. వారికి యమదూతలు యముడు యమపురి నరకములు కానిపింపవు. పొరవడి పెక్కు పాపములు చేసిన వారుకూడ సర్వపాప హరుడగు హరిని నమస్కరించిరేనినరకమునకు బోరు. మోఢ్యముచేతనైనను జనార్దనస్మరణ సేసినవారు శరీరమునువిడిచి విష్ణులోకమునకుపోదురు. పగచేనైన నొక్క తఱి హరినామ ముచ్చరించినజాలును శిశుపాలుడట్లు ముక్తినందును.

ఇది బ్రహ్మపురాణమున ధార్మికనుగతి నిరూపణమను రెండువందల పదియాఱవయధ్యాయము.

Brahmapuranamu    Chapters