Brahmapuranamu    Chapters   

అథ చతుర్దశాధికద్విశతతమో7ధ్యాయః

యమలోకమార్గస్వరూపవర్ణనమ్‌

మునయ ఊచుః

న తృప్తి మధిగచ్ఛామః పుణ్యధర్మామృతస్య చ | మునే త్వన్ముఖగీతస్య తథాకౌతూహలం హి నః || 1

ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం కర్మణో గతిమ్‌ | వేత్సి సర్వం మునే తేన పృచ్ఛామస్త్వాం మహామతిమ్‌ || 2

శ్రూయతే యమలోకస్య మార్గః పరమదుర్గమః | దుఃఖక్లేశకరః శశ్వ త్సర్వ భూత భయావహః || 3

కథం తేన నరా యాంతి మార్గేణయమసాదనమ్‌ | ప్రమాణం చైవ మార్గస్య భ్రూహి నో వదతాం వర || 4

మునే పృచ్ఛామ సర్వజ్ఞ బ్రూహి సర్వమశేషతః | కథం నరకదుఃఖాని నా7ప్నువంతి నరాన్మునే || 5

కేనోపాయేన దానేన ధర్మేణ నియమేన చ | మానుషస్య చ యామ్యస్య లోకస్య కియదంతరమ్‌ || 6

కథం చ స్వర్గతిం యాంతి నరకం కేన కర్మణా | కియంతి స్వర్గస్థానాని కియంతి నరకాని చ || 7

కథం సుకృతినో యాంతి కథం దుష్కృత కారిణః | కిం రూపం కిం ప్రమాణం వా కో వర్ణ స్తూభయోరపి || 8

మునులిట్లనిరి. ''వ్యాసముని! మీముఖముచే గానముచేయబడిన పుణ్యధర్మములనెడి గానామృతమునకు దృప్తి జెందలేకున్నాము. భూతముల యొక్క పుట్టువు ప్రళయము కర్మగతి యంతయు నెరుగుదువు. అందువలన నిన్నడుగు చున్నాము. యమలోకమార్గము దుఃఖక్లేశములను గల్గించునని సర్వభూత భయంకరమని మిక్కిలి దుర్లభమని విన్నాము. అదారివెంట నరులు యమసదనమునకెట్లు వెళ్ళుదురు. ఆదారియొక్క దూరమెంత? నరకదుఃఖములను బొందకుండుటకు నుపాయము, దాన ధర్మ నియమాదులెట్టివి? నరులు స్వర్గమెట్లు పొందుదురు. ఆరెంటికిని స్థానములెన్ని? పుణ్యాత్ములెట్లు వెళ్ళుదురు. పావులెట్లు వెళ్ళుదురు? స్వర్గమునుకుగొంపోబడు జీవునియొక్కయు నరకమునకుగొంపోబడుజీవునియొక్కయు ఆకారము రంగు ప్రమాణములెట్టివి?'' అన వ్యాసుడిట్లనియె.

వ్యాస ఉవాచ

శృణుధ్వం మునిశార్దూలా వదతో మమ సువ్రతాః | సంసార చక్రమజరం స్థితిర్యస్య న విద్యతే || 9

సో7హం వదామి వః సర్వం యమమార్గస్య నిర్ణయమ్‌ | ఉత్క్రాంతికాలాదారభ్య యథానాన్యో వదిష్యతి || 10

స్వరూపంచైవ మార్గస్య యన్మాం పృచ్ఛథ సత్తమాః | యమలోకస్యచాధ్వాన మంతరం మానుషస్య చ || 11

యోజనానాం సహస్రాణి షడశీతి స్తదంతరమ్‌ | తప్తతామ్రమివా77తప్తం తదధ్వానముదాహృతమ్‌ || 12

తదవశ్యం హి గంతవ్యం ప్రాణిభిర్జీవ సంజ్ఞకైః | పుణ్యా న్పుణ్యకృతో యాంతి పాపాన్పాప కృతో7ధమాః || 13

ద్వావింశతిశ్చ నరకా యమస్య విషయే స్థితాః | యేషు దుష్కృత కర్మాణో విపచ్యంతే పృధక్పృథక్‌ || 14

నరకో రౌరవో రౌద్రః శూకరస్తాళ ఏవ చ | కుంభీపాకో మహాఘోరః శాల్మలో7థ విమోహనః || 15

కీటాదః కృమిభక్షశ్చ నా (లా) లాభక్షో భ్రమస్తథా | నద్యః పూయ వహాశ్చాన్యా రుధిరాంభ స్తథైవ చ || 16

అగ్నిజ్వాలా మహాఘోరః సందంశః శునభోజనః | ఘోరా వైతరిణీ చైవ అసిపత్రవనం తథా || 17

''సంసార చక్రము అజరము. అనగ నదియెన్నిటికిని శిథిలముకానిది. నిలుకడలేక తిరుగుచునే యుండును. ప్రాణోత్ర్కమణము జరిగినది మొదలు జీవుడు పయనించు యమమార్గస్వరూపము నేను జెప్పెదను. మఱియొకడు సెప్పలేడు. యమలోకమునకు మనుష్యలోకమునకు నడుమగల యంతరము ఎనుబదియారువేల యోజనములు. కాలిన రాగివలెనది క్రాగుచుండును. జీవులు తప్పక ప్రయాణము జేయవలసిన దారియది. పుణ్యులు పుణ్యలోకమునకు బాపులు నరకమునకు పోవుదురు. యమునిరాజధానిలో నిరువదిరెండు నరకములున్నవి. వానిపేరులు స్పష్టము.

న తత్ర వృక్షచ్ఛాయా వా న తడాగాః సరాంసి చ | న వాప్యో దీర్ఘికా వా7పి న కూపో న ప్రపా సభా|| 18

న మండపోనా77యతనం న చ నద్యో నచ పర్వతాః | న కించి దాశ్రమస్థానం విద్యతే తత్ర వర్త్మని || 19

యత్ర విశ్రమతే శ్రాంతః పురుషో7తీవకర్షితః | అవశ్యమేవ గంతవ్యః ససర్వైస్తు మహాపథః || 20

ప్రాప్తే కాలే తు సంత్యజ్య సుహృద్బంధుధనాదికమ్‌ | జరాయుజాండజాశ్చైవస్వేదజాశ్చోద్భిజా స్తథా || 21

జంగ మాజంగమాశ్చైవ గమిష్యంతి మహాపథమ్‌ | దేవాసుర మనుషై#్యశ్చ వైవస్వతవశానుగైః || 22

స్త్రీపుంనపుంసకైశ్చైవ పృథివ్యాం జీపసంజ్ఞితైః |పూర్వాహ్ణే చాపరాహ్ణేవా మధ్యాహ్నేవా తథా పునః || 23

సంధ్యాకాలే7ర్ధరాత్రే వా ప్రత్యూషే వా7ప్యుపస్థితె | వృద్ధైర్వా మధ్యమైర్వా7పి ¸°వనస్థైస్తథైవ చ || 24

గర్భవాసే7థ బాల్యే వా గంతవ్యః స మహాపథః | ప్రవాసస్థైర్గృహస్థైర్వా పర్వతస్థైః స్ధలే7పి వా || 25

క్షేత్రస్థైర్వా జలస్థైర్వా గృహమధ్య గతైస్తథా | ఆసీనైశ్చాస్థితైర్వా7పి శయనీయగతై స్తథా || 26

జాగ్రద్భిర్వా ప్ర సుపై#్తర్వా గంతవ్యః స మహాపథః | ఇహానుభూయ నిర్దిష్ట మాయుర్జంతుః స్వయం తదా || 27

తస్యాంతే చ స్వయం ప్రాణౖ రనిచ్ఛన్నపి ముచ్యతే | జలమగ్నిర్విషం శస్త్రం క్షుద్యాధిః పతనం గిరేః || 28

నిమిత్తం కించిదాసాద్య దేహీ ప్రాణౖ ర్విముచ్యతే | విహాయ సుమహత్కృత్స్నం శరీరం పాంచఖౌతికమ్‌|| 29

ఆదారిలో చెట్టునీడ చెరువులు సరస్సులు బావులు చలివెందలి విశ్రమించుటకు గృహముగాని యుండవు. ఆ దారిలో నదులు పర్వతములు గొంచెము విశ్రమించుటకు జోటు లుండవు. మరణ కాలమువచ్చినంతట బందు మిత్రాదులను వదలి సర్వజీవులు సర్వవేళల చిన్న పెద్దయనకుండ గర్భములోనున్న శిశువుసైతము నేస్థితిలోనున్నను దుదకు నిద్రావస్థలోనున్నను బ్రాణములు విడిచిన జీవి యిహమునందు నిర్దిష్టమైయున్న యాయుర్దాయము ననుభవించి తుదకాదారింబడి యేగవలసినదే. వద్దన్నను నదితప్పదు. జలాగ్నులు విషశస్త్రములు నాకలి పర్వతమునుండి పడుటమొదలగు నేదో నిమిత్తమున దేహిబ్రాణములను వదలి యీపాంచభౌతిక మహా శరీరము నిక్కడ విడుచును.

అన్యచ్ఛరీర మాదత్తే యాతనీయం స్వకర్మజమ్‌ | దృఢం శరీర మాప్నోతి సుఖదుఃఖోపభుక్తయే || 30

తెన భుంక్తే స కృచ్ఛ్రాణి పాపకర్తా నరో భృశమ్‌ | సుఖాని ధార్మికో హృష్ట ఇహ నీతో యమక్షయే || 31

ఊష్మా ప్రకుపితః కాయే తీవ్రవాయు సమీరితః | భినత్తి మర్మస్థానాని దీప్యమానో నిరింధనః || 32

ఉదానో నామ పవన స్తతశ్చోర్ధ్వం ప్రవర్తతే | భుజ్యతా మంబుభక్ష్యాణా మధోగతి నిరోధకృత్‌ || 33

తతో యేనాంబుదానాని కృతావ్యన్నరసాస్తథా | దత్తాః స తస్యామాహ్లాద మాపది ప్రతిపద్యతే || 34

అన్నాని యేన దత్తాని శ్రద్ధాపూతేన చేతసా | సో7పి తృప్తి మవాప్నోతి వినా7ప్యన్నేన వై తదా || 35

యేనానృతాని నోక్తాని ప్రీతిభేదః కృతో న చ | ఆస్తికః శ్రద్ధధానశ్చ సుఖమృత్యుం స గచ్ఛతి || 36

దేవ బ్రాహ్మణ పూజాయాం నిరతాశ్చాన సూయకాః | శుక్లా వదాన్యా హ్రీమంత స్తే నరాః సుఖమృత్యవః || 37

యః కామాన్నాపి సంరంభా న్న ద్వేషాద్ధర్మముత్పృజేత్‌ | యథో క్తకారీ సౌమ్యశ్చస సుఖం మృత్యుమృచ్ఛతి || 38

వారిదాస్తృషితానాం యే క్షధితాన్న ప్రదాయినః | ప్రాప్నువంతి నరాః కాలే మృత్యుం సుఖసమన్వితమ్‌ || 39

శీతం జయంతి ధనధా స్తాపం చందనదాయినః | ప్రాణఘ్నీం వేదనాం కష్టాం యే చాన్యోద్వేగ ధారిణః || 40

మోహం జ్ఞాన ప్రదాతార స్తథా దీపప్రదాస్తమః | కూటసాక్షీ మృషావాదీ యో గురుర్నానుశాస్తి వై || 41

తాను జేసిన కర్మానుసారము యాతనాశరీరమును సుఖదుఃఖములనుభవించుటకు మఱొక ధృడమైన దానిని స్వీకరించును. ఆశరీరముతో బాపి పాపము పుణ్యుడు పుణ్యము ననుభవించును. ప్రాణము పోవునపుడు తీవ్రమైనవాయువుచేరగుల్కొల్పబడి శరీరమందు నూక్ష్మముగనున్న అగ్ని ప్రకోపించును. అది కట్టెలులేకుండగనేమండునగ్నివలె రగుల్కొని ఆయువు పట్టులను(మర్మస్థానములు)బ్రద్దలు కొట్టును. అప్వల నుదానవాయువుమీదికి లేచును. ఆజీవితిన్నయాహారముత్రాగిననీరు క్రిందికిపోకుండ నిరోధించును. ఎవడు బ్రతికియుండగ మంచినీళ్ళిచ్చి యెవరికేని యన్నరసము బెట్టెనో వానికినాయాపద సమయమందుహాయిగల్గును. శ్రద్ధాపవిత్రమైన మనస్సుతోనన్నముబెట్టినవాడు ఆ యమమార్గముననన్నములేకుండగనే తృప్తినొందును. అనృతమాడనివాడు నెదుటవాని ప్రీతికి భంగము చేయనివాడు ఆస్తికుడు శ్రద్ధావంతుడు సుఖమైన మరణము నొందును. దేవబ్రాహ్మణ పూజానిరతులు అసూయారహితులు శుక్లులు (అచ్చము పుణ్యములు చేసినవారు) దాతలు హ్రీమంతులు (తప్పుపని చేయుటకు గల్గెడి సంకోచము హ్రీయనబడును) వీరు సుఖమృత్యువులు. (అనాయాసమరణులు.) కామోద్రేకద్వేషములకు పశుడుగాక ధర్మము దప్పక చెప్పినట్లు చేయుచు సౌమ్యుడైయుండువాడు సుఖమైన చావొందును. దప్పికకు నీళ్ళు ఆకలికి అన్నముల బెట్టిన నరులు సుఖమరణమందుదురు. ధనదాతలు యమమార్గములో జలిని యింతురు. మంచి గంధమిచ్చినవారు తాపమునొందరు. ఇతరుల యుద్వేగమమును సహించినవారు ప్రాణోత్క్రమణ వేదనను బొందరు. జ్ఞాన (విద్య)దాతలు దీపమిచ్చినవారు మోహములోబడరు. కూటసాక్షి యసత్యవాది గురుశిక్షనొందనివాడు వెదనిందకుడు మృత్యు సమయములోమూర్ఛలోబడుదురు.

తేమోహమృత్యవః సర్వే తథా యే వేదనిందకాః | విభీషణాః పూతి గంధాః కూట ముద్గరపాణయః || 42

ఆగచ్ఛంతి దురాత్మానో యమస్య పురుషా స్తథా | ప్రాప్తేషు దృక్పథం తేషు జాయతే తస్య వేపథుః || 43

క్రందత్యవిరతః సో7థ భాతృమాతృ పితౄం స్తథా | సా తు వాగస్ఫుటా విప్రా ఏకవర్ణా విభావ్యతే || 44

దృష్టి ర్విభ్రామ్యతే త్రాసా త్కాసావృష్ట్యత్య (విష్టమ) థా7ననమ్‌ | తతః సవేదనావిష్టం తచ్ఛరీరం విముంచతి||

ప్రాణముపోవు జీవునకు భయంకరులు పాడుకంపుగొట్టువాడు బడితలు బల్లెములు దుడ్లు చేతబట్టినవారు క్రూరులు యమకింకరులెదురు వత్తురు. వాండ్రుకంటబడగానే యీప్రాణికికంపము పుట్టును. మొర్రోయని బంధువుల కొఱకేడ్చును. ఆ మాటకూడ స్ఫుటముగా అన్నియక్షరములు నేక రూపమున వినిపించును. బెదరున జూపు బెదరును. కంఠములో గురగుర పుట్టును. అంతట వేదనామయమైన యా శరీరము జీవుడు వదలును.

వాయ్వగ్రసారీ తద్రూప మేవాన్య త్ప్రపద్యతే | తత్కర్మయాతనార్థేచ న మాతృపితృ సంభవమ్‌ || 46

తత్ప్రమాణవయోవస్థా సంస్థానైః ప్రాప్యతే7న్యథా | తతో దూతో యమస్యాథ పాశైర్బధ్నాతి దారుణౖః || 47

జంతోః సంప్రాప్తకాలస్య వేదనార్తస్య వై భృశమ్‌ | భూతైః సంత్యక్తదేహస్య కంఠప్రాప్తానిలస్యచ || 48

శరీరాచ్చ్యావితో జీవో రోరవీతి తథోల్బణమ్‌ | నిర్గతో వాయుభూతస్తు షాట్కౌశికకలే బరే || 49

మాతృభిః పితృభిశ్చైవ భ్రాతృభిర్మాతులైస్తథా | దారైః పుత్రై ర్వయసై#్యశ్చ గురుభిస్త్యజ్యతే భువి || 50

దృశ్యమానశ్చతైర్దీనై రశ్రుపూర్ణేక్షణౖర్భృశమ్‌ | స్వశరీరం సముత్సృజ్య వాయుభూతస్తు గచ్ఛతి || 51

వాయువు ననుసరించి (వ్రాతప్రకోపముచే) కర్మయాతనానుభవమునకు దలిదండ్రుల వలన నేర్పడిన శరీరము నుగాక యదేరూపముననున్న శరీరమును సరిగా నదేప్రమాణము నదేబాల్యాద్యవస్థగల యవయవములతో బొందును. అవ్వల యమదూత పాశములచే గట్టివేయును. మరణవేదన పడుచు గాలమురాగా పంచభూతములు దేహమును విడచి పెట్టును. ప్రాణము కంఠగతమైన సమయమున జీవుడు శరీరమునుండి విడదీయబడి యెద్దువలె రంకెలు వేయును. షాట్కౌశికమైన ఆనందమయ ( అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ) వాయుస్వరూపమున నిర్గమించును. తల్లి దండ్రి మొదలగు సర్వసంబంధులచేత విడువబడును. బిక్కమొగములు బెట్టి కన్నీళ్ళుగార్చుచు వారు చూచుచుండ తన శరీరమును (గూడును) విడిచి వాయురూపుడైపోవును.

అంధకార మపారం చ మహాఘోరం తమో వృతమ్‌ | సుఖదుఃఖ ప్రదాతారం దుర్గమం పాపకర్మణామ్‌ || 52

దుఃసహం చ దురంతం చ దుర్నిరీక్షం దురాసదమ్‌ | దురాపమతి దుర్గం చ పాపిష్ఠానాం సదా7హితమ్‌ || 53

అంధకార బంధురము చుట్టు చీకటి యావరించినది సుఖ దుఃఖప్రదము దుస్సహము దురంతము దురాసదము దుర్నీరీక్ష్యము, దుర్గమమునై యాదారింబట్టి పాపాత్ములు వెళ్ళుదురు.

కృష్యమాణాశ్చ తైర్భూతైర్యామ్యైః పాశైస్తు సంయతాః | ముద్గరైస్తాడ్యమాణాశ్చ నీయంతే తం మహాపథమ్‌ ||

క్షీణాయుషం సమాలోక్య ప్రాణినం చా77యుషక్షయే | నినీషవః సమాయాంతి యమదూతా భయంకరాః || 55

అరూఢా యానకాలే తు ఋక్షవ్యాఘ్రఖరేషు చ | ఉష్ట్రేషు వానరేష్వన్యే వృశ్చికేషు వృకేషు చ || 56

ఉలూకసర్పమార్జారం తథా7న్యే గృధ్రవాహనాః | శ్యేనసృగాలమారూఢాః సరఘా కంకవాహనాః | 57

వరాహపశుభేతాళ మహిషాస్యా స్తథా పరే | నానారూపధరాః ఘోరాః సర్వప్రాణిభయంకరాః || 58

దీర్ఘముష్కాః కఠాళాస్యా వక్రనాసాస్త్రిలోచనాః | మహాహను కపోలాస్యాః ప్రలంబదశనచ్ఛదాః || 59

నిర్గతై ర్వికృతాకారై ర్దశ##నైరంకురోపమైః | మాంసశోణితదిగ్ధాంగా దంష్ట్రాభిర్భృశముల్బణౖః || 60

ముఖైః పాతాళసదృశైర్జ్వలజ్జిహ్వైర్భయంకరైః | నేత్రైః సువికృతాకారై ర్జ్వలత్పింగళచంచలైః || 61

మార్జారోలూకఖద్యోత శక్రగోపవదుద్ధతైః | కేకరైః సంకులై స్తభ్ధై ర్లోచనైః పావకోపమైః || 62

భృశమాభరణౖర్భీమై రాబద్ధైర్భుజగోపమైః | శోణాసరళగాత్రైశ్చ ముండమాలావిభూషితైః || 63

కంఠస్థ కృష్ణసర్పైశ్చ ఫూత్కారరవభీషణౖః | వహ్నిజ్వాలోపమైః కేశై స్తబ్థరూక్షైర్భయంకరైః || 64

బభ్రుపింగళలోలైశ్చ కద్రుశ్మశ్రుభిరావృతాః | భుజదండైర్మహోఘోరైః ప్రలంబై పరిఘోపమైః || 65

కేచిద్విబాహవస్త్రత్ర తథా7న్యే చ చతుర్భుజాః | ద్విరష్టబాహవశ్చాన్యే దశవింశభుజా స్తథా || 66

అసంఖ్యాత భుజాశ్చాన్యే కేచిద్బాహుసహస్రిణః | ఆయుధైర్వికృతాకారైః ప్రజ్వలద్భిర్భయానకైః || 67

శక్తితోమరచక్రాద్యైః సుదీపై#్తర్వివిధాయుధైః | పాశశృంఖలదండైశ్చ భీషయంతో మహాబలాః || 68

ఆగచ్ఛంతి మహారౌద్రా మర్త్యానామాయుషం క్షయే | గ్రహీతుం ప్రాణినః సర్వం యమస్యా77జ్ఞాకరాస్తథా ||

యత్తచ్ఛరీరమాద త్తే యాతనీయం స్వకర్మజమ్‌ | తదస్య నీయతే జంతో ర్యమస్య సదనం ప్రతి || 70

బద్ధ్వా తత్కాల పాశైశ్చ నిగడైర్వ్రజ్రశృంఖలైః | తాడయిత్వా భృశం క్రుద్ధై ర్నీయతే యమకింకరైః || 71

ప్రస్థలంతం రుదంతం చ ఆక్రోశంతం ముహుర్ముహుః | హా తాత మాతః పుత్రేతి వదంతం కర్మదూషితమ్‌ || 72

ఆహత్య నిశితైః శూలై ర్ముద్గరై ర్నిశితైర్ఘనైః | ఖడ్గశక్తి ప్రహారైశ్చ వజ్రదండైః సుదారుణౖః || 73

భర్త్స్యమానో మాహారావై ర్వజ్ర శక్తి సమన్వితైః | ఏకైకశో భృశం క్రుద్ధై స్తాడయద్భిఃసమంతతః || 74

స ముహ్యమానో దుఃఖార్తః ప్రతపంశ్చ ఇత స్తతః | ఆకృష్య నీయతే జంతు రధ్వానం సుభయంకరైః || 75

కుశకంటక వల్మీక శంకుపాషాణ శర్కరే | తథా ప్రదీ ప్తజ్వలనే క్షారవజ్రశతోత్కటే || 76

ప్రదీప్తాదిత్య తప్తేన దహ్యమాన న్తదంశుభిః | కృష్యతే యమదూతైశ్చ శివాసంనాదభీషణౖః || 77

వికృష్యమాణసై#్తర్ఘోరై ర్భక్ష్యమాణః శివాశ##తైః | ప్రయాతి దారుణ మార్గే పాపకర్మా యమాలయమ్‌ || 78

క్వచిద్భీతైః క్వచిత్త్రసై#్తః ప్రస్ఖలద్భిః క్వచిత్క్వచిత్‌ | దుంఖేనాక్రందమానైశ్చ గంతవ్యః సమహాపథః || 79

నిర్భర్త్స్యమానై రుద్విగ్నై ర్విద్రుతైర్భయవిహ్వలైః | కంపమాన శరీరైస్తు గంతవ్యం జీవసంజ్ఞకైః || 80

కంటకాకీర్ణమార్గేణ సంతప్త సికతేన చ | దహ్యమానై స్తు గంతవ్యం నరైర్దాన వివర్జితైః || 81

మేదశ్శోణిత దుర్గంధై ర్బస్తగాత్రైశ్చ పూగశః | దగ్ధస్ఫుటత్వచా77కీర్ణై ర్గంతవ్యం జీవఘాతకైః || 82

కూజద్భిః క్రందమానైశ్చ విక్రోశద్భిశ్చ విస్వరమ్‌ | వేదనార్తైశ్చ సద్భిశ్చ గంతవ్యం జీవఘాతకైః || 83

శక్తిభిర్ఛింద పాలైశ్చ ఖడ్గతోమరసాయకైః | భిద్యద్భిస్తేక్షణశూలాగ్రై ర్గంతవ్యం జీవఘాతకైః || 84

శ్వానైర్వ్యాఘ్రైర్వృకైః కంకై ర్భక్ష్యమాణౖశ్చ పాపిభిః || 85

కృంతద్భిః క్రకచాఘాతై ర్గంతవ్యం మాంసఖాదిభిః | మహిషర్షభశృంగాగ్రై ర్బిద్యమానైః సమంతతః || 86

ఉల్లిఖద్భిః శూకరైశ్చ గంతవ్యం మాంసఖాదకైః | సూచీ భ్రమరకాకోల మక్షికాభిశ్చ సంఘశః || 87

భుజ్యమానైశ్చ గంతవ్యం పాపిష్ఠైర్మధుఘాతకైః | విశ్వస్తం స్వామినం మిత్రం స్త్రియం వా య స్తుఘాతయేత్‌ ||

శ##సై#్త్రర్నికృత్యమానైశ్చ గంతవ్యం చాతురై ర్నరైః | ఘాతయంతి చ యేజంతూం స్తాడయంతి నిరాగసః || 89

రాక్షసై ర్భక్ష్యమాణాస్తే యాంతి యామ్యపధం నరాః | యే హరంతి పరస్త్రీణాం వరప్రావరణాని చ || 90

తే యాంతి విద్రుతా నగ్నాః ప్రేతీభూతా యమాలయమ్‌ | వాసో ధాన్యం హిరణ్యం వా గృహక్షేత్రమథా7పివా||

యే హరంతి దురాత్మానః పాపిష్ఠాః పాపకర్మిణః | పాషాణౖర్లగుడైర్థండై స్తాడ్యమానైస్తు జర్జరైః || 92

వహద్భిః శోణితం భూరి గంతవ్యం తు యమాలయమ్‌ | బ్రహ్మస్వం యే హరంతీహ నరా నరకనిర్భయాః || 93

తాడయంతి తథా విప్రా నాక్రోశంతి నరాధమాః | శుష్కకాష్ఠనిబద్ధాస్తే చిన్న కర్ణాక్షినాసికాః || 94

పూయ శోనితదిగ్ధాస్తే కాలగృధ్రైశ్చ జంబుకైః | కింకరైర్భీషణౖశ్చండై స్తాడ్యమానాశ్చ దారుణౖః || 95

విక్రోశమానా గచ్ఛంతి పాపినస్తే యమాలయమ్‌ | ఏవం పరమదుర్థర్ష మధ్వానం జ్వలనప్రభమ్‌ || 96

రౌరవం దుర్గవిషమం నిర్దిష్టం మానుషస్య చ | ప్రతప్తతామ్రవర్ణాభం వహ్నిజ్వాలా స్ఫులింగవత్‌ || 97

కురంట కంట కాకీర్ణం పృథువికట తాడనైః | శక్తివజ్రైశ్చ సంకీర్ణ ముజ్వలం తీవ్రకంటకమ్‌ || 98

అంగార వాలుకామిశ్రం వహ్ని కీటక దుర్గమమ్‌ | జ్వాలామాలా కులం రౌద్రం సూర్యరశ్మిప్రతాపితమ్‌ || 99

అధ్వానం నీయతే దేహీ కృష్యమాణః సునిష్ఠురైః | యదైవ క్రందతే జంతు ర్దుఃఖార్తః పతితః క్వచిత్‌ || 100

తదైవా77హన్యతే సర్వై రాయుధైర్యమ కింకరైః | ఏవం సంతాడ్యమానశ్చ లుబ్ధః పాపేషు యో7నయః ||

అవశో నీయతే జంతు ర్దుర్ధరైర్యమ కింకరైః | సర్వైరేవహి గంతవ్య మధ్వానం తత్సుదుర్గమమ్‌ || 102

నీయతే వివిధైర్ఘోరై ర్యదూతై రవజ్ఞయా | నీత్వా సుదారుణం మార్గం ప్రాణినం యమకింకరైః || 103

ప్రవేశ్యతే పురీం ఘోరాం తామ్రాయసమయీం ద్విజాః | సాపురీ విపులాకారా లక్షయోజనమాయతా || 104

చతురస్రా వినిర్దిష్టా చతుర్ద్వారవతీ శుభా | ప్రాకారాః కాంచనాస్తస్యా యోజనాయుతముచ్ఛ్రితాః || 105

ఇంద్రనీల మహానీల పద్మరాగోపశోభితా | సాపురీ వివిధైః సంఘై ర్ఘోరా ఘోరైః సమాకులా || 106

దేవదానవ గంధర్వై ర్యక్షరాక్షసపన్నగైః | పూర్వం ద్వారం శుభం తస్యాః పతాకా శతశోభితమ్‌ || 107

వజ్రేంద్ర నీలవై ఢూర్య ముక్తాఫలవిభూషితమ్‌ | గీతనృత్యైః సమాకీర్ణం గంధర్వాప్సరసాం గణౖః || 108

ప్రవేశ స్తేన దేవానా మృషీణాం యోగినాం తథా | గంధర్వ సిద్ధయక్షాణాం విద్యాధర విసర్పిణామ్‌ || 109

ఉత్తరం నగరద్వారం ఘంటాచామర భూషితమ్‌ | ఛత్ర చామరవిన్యాసం నానారత్నైరలంకృతమ్‌ || 110

వీణావేణురవై రమ్యై ర్గీతమంగళ నాదితైః | ఋగ్యజుఃసామనిర్ఘోపై ర్ముని బృంద సమాకులమ్‌ || 111

విశంతి యేన ధర్మజ్ఞాః సత్యవ్రతపరాయణాం | గ్రీష్మే వారి ప్రదా యే చ శీతిచాగ్ని ప్రదా నరాః || 112

శ్రాంతసంవాహకా యే చ ప్రియ వాదరతాశ్చ యే | యే చ దానరతా శూరా మాతా పితృపరాశ్చ యే || 113

ద్విజశుశ్రూషణ యుక్తానిత్యం యే7తిధిపూజకాః | పశ్చిమం తు మహాద్వారం పుర్వా రత్నైరిభూషితమ్‌ || 114

విచిత్రమణి సోపానం తోమరైః సమలంకృతమ్‌ | భీరీమృదంగ సంనాదైః శంఖకాహలనాది తమ్‌ || 115

సిద్ధబృందైః సదా హృష్టై ర్మంగళైః ప్రణినాదితమ్‌ | ప్రవేశ##స్తేన హృష్టానాం విశ్వభక్తిమతాం నృణామ్‌ || 116

సర్వతీర్థప్లుతా యే చ పంచాగ్నేర్యేచ సేవకాః | ప్రస్థానే యే మృతా వీరా మృతాః కాలంజరే గిరౌ || 117

అగ్నౌ విపన్నా యే వీరాః సాధితం యైరనాశకమ్‌ | యే స్వామి మిత్రలోకార్థే గోగ్రహే సంకులే హతాః || 118

యమకింకరులు పాశములచే గట్టి ముద్గరములచే గొట్టుచు లాగికొనిపోవుదురు. (ముద్గరము=పొట్టియినుపదుడ్డు) యమదూతలు జీవుని యాయుర్దాయమయినట్లు తెలిసికొని బల్లూకములు పెద్దపులులు గాడిదలు వొంటెలు కోతులు మండ్రగబ్బలు తోడేళ్ళు గుడ్లగూబలు పాములు పిల్లులు గ్రద్దలు, డేగలు, నక్కలు, నెక్కివత్తురు. పెక్కువికృత రూపములతో అనగా పందులు కుక్కలు, పశువులు దున్నలు మొదలగు రూపములతో వత్తురు. భయంకరమూర్తులు వంకర ముక్కులు, మూడుకళ్ళు పెద్దదవడలు దీర్ఘాండములు వ్రేలాడుపెదవులుగల్గి రక్తమాంసములు అలమిన శరీరములతో భయంకరమైన కోరలతో మండుచున్న నాలికలతో బాతాళమువంటి ముఖములతో వికృతములైన నేత్రములతో పిల్లులు గుడ్లగూబలు మిణుగురువురుగులు ఆర్ద్రపురుగులట్లున్న తిరుగుడువడుచున్న కన్నులతో మెల్లకళ్ళతో నిప్పులట్లు మెఱయు చూపులతో నాయమదూతలు కనిపింతురు. భయంకరమైన పాములట్లుండు అయోమయములైన భూషణములతో పుఱ్ఱల మాలలు ధరించి బుసలుకొట్టు నల్లతాచుల గంఠములకుజుట్టుకొని యగ్ని మంటలట్లున్న నిక్కిన తలవెంట్రుకలతో నూర కదలు రాగిరంగు, గోరోచనపురంగులోనున్న వ్రేలాడు గడ్డముల తో గొందరికి రెండు నాలుగు పదహారు పది, ఇరువది మఱియు లెక్కలేనన్ని చేతులతో కొందరు వేయిచేతులతో మంటలుజిమ్ము వివిధాయుధములతో బాశములతో నినుపగొలుసులతో దండములతోవచ్చి హడలుగొట్టుదురు. యమునియాజ్ఞగొని జీవుల సల్వమూహరించి కొనిపోయి యమ సదనము జేర్తురు. తడబడుచు నేడ్చుచు బొబ్బలిడుచు అమ్మనాన్న కొడుకాయని జుట్టాలను బిలిచి యేడ్చుచున్నకర్మచే చెడినవానిని శూలములచే బొడుచుచు నినుప గుదియలచే నడచుచు వజ్రసమానములైన దండములచే బాదుచు గత్తులచే నరకుచు బెల్లుగ నార్చుచు గృద్ధులైన కింకరు లీడ్చుకొని పోవుచుండ నాజీవుడు దుఃఖమున గుమిలి మూర్ఛవడియుడుకెత్తి పోవ నిట్టటు లాగుచు నూదులట్లు గ్రుచ్చికొను గుశకంటకముల నీడ్చుచు పుట్ణల దొర్లించుచు శంకుపాషాణముల దొరలించుచు గులకరాళ్ళ కెరలించుచు గనగనమండు మంటలలో కాలెడి యెండలో నొకవంక నక్కలు తినుచుండ జీవుడు నరకమార్గమున బోవును. ఇట పాపులు బెదరి బెదరి తడబడి యాక్రందనము చేయుచు నాదారిం జనుచుందురు. కాలిన నేలపై ముండ్లకంచెలలో కాలుచు దానముజేయని పిసినిగొట్టులు పయనింతురు. జీవఘాతకులు రక్తము రసి మొదలగువాని పాడుకంపుతో గొట్టు మేకపోతు శరీరముతో జర్మము గాలుచుండ వెళ్ళును. మఱియు పులుగులవలె గూయుచు నాక్రందించుచు వికృతముగ నాక్రోశించుచు వేదనకుగురియైవివిధాయుధములచే నరకబడుచు పొడువబడుచు జీవఘాతకు లాదారిం బోవుదురు. మాంసము మెక్కిన జీవులు బల్లెములచే బొడవబడుచు ఱంపములచే గోయబడుచు యెడ్లు దున్నలు మొదలగు వానిచే బొడవబడుచు పందులచే గీరబడుచు సూదులచే బొడవబడుచు గందురీగలు కుట్ట మధుఘాతకులు (ఇతరుల నోటియందలి మధురమైన కూడు పడగొట్టినవారు) స్వామిద్రోహము జేసినవారు మిత్రఘాత స్త్రీఘాత చేసినవారు యమకింకరుల శస్త్రముల దెగి పోవలసియుండును. నిరపరాధములైన సాధుజంతుఘాత చేసినవారిని రాక్షసు లాదారిలో గొరికిగొని తినుచుందురు. పరస్త్రీల వస్త్రము లపహరించినవారు ప్రేతలై దిగంబరులై యమాలయమునకు బరువులెత్తుదురు. గృహక్షేత్ర సువర్ణ వస్త్ర ధాన్యాదులను దొంగిలించిన పాపులు పాషాణములచే బడితెలచే బాదబడుచు గీలుకీలు పట్టువిడి రక్తములు గార నాదారివెంట బోవలసియుండును. బ్రాహ్మణుల గొట్టి ఘోష పెట్టించినవారు యెండిన కాష్ఠములకు వేసి కట్టబడి కన్ను ముక్కు చెవులు గోయబడ జీము నెత్తురుచే నలముకొనబడి కాలుని గ్రద్దలచె నక్కలచే బీకికొని తినబడుచు దండములం బాదబడుచు మొరవెట్టుచు నాతెరవునం బోవుదురు. ఇట్టి ఘోరమైన జ్వాలామయమైన రౌరవమను నరకము మానవుల కేర్పడినది.

కాలిన రాగివలె మంటలు జిమ్ముచు మిణుగురులు చెదర ముళ్ళజెముడు డొంకలతో నిండిన నిప్పుల యిసుకతో నిండి వహ్నికీటకమైన మార్గమున (వహ్ని=నిప్పుచేత కీటకము = నిష్ఠురము) మండుటెండ గాయు దారిని బాసి చనవలసియుండును. ఇట్లెంతో దూరము గడచినమీద రాగి యినుముతో నిర్మితమై లక్ష యోజనముల వైశాల్యము గల్గి నలుచదరముగా నాలుగు ద్వారములు గల యమనగరము వచ్చును. పదివేల యోజనములు ఎత్తైన బంగారు ప్రాకారములు దానికి గలవు. ఇంద్రనీలాది మణులచే నది శోభనించుచుండును. దాని తూర్పుద్వారమున దేవ దానవ యక్ష రాక్షస పన్నగాదిగణములుండును. వందలకొలది పతాకములెగురుచుండును. గంధర్వ అప్సరసలట నాడుచు పాడుచుందురు. ఆ తూర్పుద్వారమున ప్రవేశము దేవ ఋషి యోగి బృందములకు. యక్ష సిద్ధాదర విద్యాధరులకు మాత్రమే. ఉత్తరద్వారమున గంటలు మ్రోయుచుండును. ఛత్ర చామరాదులు సొంపు నింపుచుండును. అది నానా రత్నాలంకృతము. వీణా వేణు మృదంగాది మంగళధ్వనులు వినిపించుచుండును. ఋగ్యజుస్సామ వేద ఘోషముతో మునిబృందమందము గొలుపుచుండును. ఆ ద్వారమువెంట ప్రవేశము గలవారు ధర్మజ్ఞులు సత్యవ్రతులు. వేసివిలో మంచినీరిచ్చినవారు. చలికాలమున వెచ్చదనమిచ్చినవారు. అలసటవడిన వారికి విశ్రాంతి నిచ్చినవారు. ప్రియభాషణము చేసినవారు. దానశూరులు. మాతా పితృసేవాతత్పరులు. గురుశుశ్రూష చేసినవారు. అతిథిపూజకులు. వీరికి నుత్తర ద్వారము ప్రవేశద్వారము. ఇక పడమటి ద్వారము రత్నభూషితము. రంగురంగుల రత్నాల మెట్లుతొమరములు నచట రాణించును. భేరీమృదంగశంఖాదుల ధ్వనులు కాహళముల మేళవింపు (కాహళం = బాకా) వినిపించును. హర్షభరితులై శుభప్రదులైన సిద్దులయొక్కబృందములచే నది మారుమ్రోయుచుండును. ఆదారిని ప్రవేశమానంద భరితులకు భక్తులకు సర్వతీర్థస్నానము జేసినవారికి. పంచాగ్నుల సేవించినవారికి పుణ్యతీర్థ యాత్రలందు కాలంజర పర్వతములందు నగ్నియందు మరణించినవారికి శత్రునాశనము చేసికొన్నవారికి స్వామి (యజమాని) స్నేహితుడు లోకము గోపులు మొదలైనవానిరక్షణకొరకు హతులైన శూరులకు తపోధనులకు పశ్చిమద్వారమున బ్రవేశమీయబడును.

తే విశంతి నరాః శూరాః పశ్చిమేన తపోధనాః | పుర్యాం తస్యాం మహాఘోరం సర్వసత్త్వభయంకరమ్‌ || 119

హాహాకార సమాక్రుష్టం దక్షిణం ద్వారమీదృశమ్‌ | అంధకార సమాయుక్తం తీక్షణశృంగైః సమన్వితమ్‌ || 120

కంటకైర్వృశికైః సర్సై ర్వజ్రకీటైః సుదుర్గమైః | విలుంపద్భిర్వృకైర్వ్యాఘ్రై రృక్షైః సింహైః సజంబుకైః ||

శ్వాసమార్జార గృధ్రైశ్చ సజ్వాలకవలైర్ముఖైః | ప్రవేశ##స్తేన వై నిత్యం సర్వేషామపకారిణామ్‌ || 122

యే ఘాతయంతి విప్రా న్గా బాలం వృద్ధం తథా77తురమ్‌ | శరణాగతం విశ్వసస్తం స్త్రియం మిత్రం నిరాయుధమ్‌ ||

యే7గమ్యాగామినో మూఢాః పరద్రవ్యాపహారిణః | నిక్షేపస్యాపి హర్తారో విషవహ్ని ప్రదాశ్చయే || 124

పరభూమిం గృహం శయ్యాం వస్త్రాలంకారహారిణః | పరరంధ్రేషు యే క్రూరా యే సదా7నృత వాదినః || 125

గ్రామరాష్ట్ర పురస్థానే మహాదుఃఖ ప్రదాహి యే | కూటసాక్ష్య ప్రదాదాతారః కన్యావిక్రయ కారకాః || 126

అభక్ష్యభక్షణ రతా యే గచ్ఛంతి స్నుషాం సుతామ్‌ః మాతరం పితరం చైవ యే వదంతి చ పౌరుషమ్‌ || 127

అన్యేయే చైవ నిర్దిష్టా మహాపాతక కారిణః | దక్షణన తు తే సర్వే ద్వారేణ ప్రవిశంతి వై || 128

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షి సంవాదే యమలోకస్య మార్గ స్వరూపాఖ్యాన నిరూపణం నామ చతుర్దశాధిక ద్విశతతమో7ధ్యాయః

ఆ నగరమునకు దక్షిణద్వారము మహాభయంకరము సర్వప్రాణి భయంకరము. హాహాకారమెత్తుచుండును. అంధకారబంధురము. సూదిమొనగల శిఖరములు ముళ్ళు తేళ్ళు వజ్రకీటములు (కర్రలదొలుచు పురుగులు) వీనిచే నడుగిడుటకు వీలుండదు. తోడేళ్ళు పులులు నక్కలతో సింహములు పిల్లులు గ్రద్దలు కణకణమండు ముఖములతో జరించు నాద్వారమున సర్వాపకారులైనవారికి బ్రవేశము. గోబ్రాహ్మణ వృద్ధులను బాధలలో నున్నవానిని శరణు జొచ్చినవానిని స్త్రీని మిత్రుని ఆయుధము చేతిలో లేనివానిని జంపినవారికిది ప్రవేశద్వారము. పొందరాని గురుపత్ని మొదలైన స్త్రీలను బొందినవారు మూఢులు పరద్రవ్యాహారకులు దాచనిచ్చిన వస్తువులు హరించినవారు విషము బెట్టిన వాండ్రు నిప్పంటినవారు పరభూగృహశయ్యా వస్త్ర భూషణాపహరులు పరుల లోపములనే వెదకు క్రూరులు ననృతవాదులు గ్రామమునకు రాష్ట్రమునకు పురమునకు దుఃఖము కల్గించినవారు అబద్ధసాక్ష్య మిచ్చినవారు కన్యల నమ్ముకొన్నవారు అభక్ష్య భక్షణ ప్రియులు కోడలిని కూతురును బొందినవాడ్రు తల్లిని దండ్రిని కటువుగ మాట్లాడినవారు మరి మహాపాతకులుగ చెప్పబడిన యెందరు దక్షిణద్వాఠమున యమపురము బ్రవేశింతురు.

ఇది బ్రహ్మపురాణమున యమలోకమార్గ స్వరూపాభ్యానమను రెండువందల పదునాలుగవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters