Brahmapuranamu    Chapters   

అథద్వాదశాధికద్విశతతమో7ధ్యాయః

రుక్మిణ్యాదీనాం పరలోకగమనమ్‌

వ్యాస ఉవాచ

అర్జునో7పి తదా7న్విష్య కృష్ణరామ కళేబరే | సంస్కారం లంభయామాస తథా7న్యేషా మనుక్రమాత్‌ || 1

అష్టౌ మహిష్యః కథితా రుక్మిణీ ప్రముఖాస్తు యాః | ఉపగృహ్య హరేర్దేహం వివిశు స్తా హుతాశనమ్‌|| 2

రేవతీ చైవ రామస్య దేహమా శ్లిష్య సత్తమాః | వివేశ జ్వలితం వహ్నిం తత్సంగాహ్లాదశీతలమ్‌ || 3

ఉగ్రసేనస్తు తచ్ఛ్రుత్వా తథైవా77నకదుందుభిః | దేవకీ రోహిణీ చైప వివిశు ర్జాతవేదసమ్‌|| 4

తతో7ర్జునః ప్రేతకార్యం కృత్వా తేషాం యథావిధి | నిశ్చక్రామ జనం సర్వం గృహీత్వా వజ్రమేవ చ || 5

రుక్మిణ్యాదులు పరలోకమునకేగుట

వ్యాసుడిట్లనియె.

అర్జునుడప్పుడు కృష్ణ బలరామ శరీరములను వెదకి వానికిని మఱి యితర శరీరములకు సంస్కారమును గావించెను. మఱియును అష్టమహిషులు రుక్మిణి మొదలగువారు హరి శరీరమునం బుట్టిన యగ్నియందు బ్రవేశించిరి. రేవతియు బలరాము దేహము గౌగలించుకొని తత్స్పర్శవలన గలిగిన యానందముచే చల్లబడిన యగ్నియందు ప్రవేశించెను. ఆపై నర్జునుడు వారికి ప్రేతకృత్యములను యథావిధిగ జరిపి తక్కిన జనమును వజ్రుని దీసికొని వెళ్ళెను.

ద్వారవత్యా వినిష్క్రాంతాః కృష్ణపత్న్యః సహస్రశః | వ్రజం జనం చ కౌంతేయః పాలయం శనకైర్య¸°|| 6

సధా సుధర్మా కృష్ణేన మర్త్యలోకే సమాహృతా | స్వర్గం జగామ భో విప్రాః పారిజాతశ్చ పాదపః || 7

యస్మిన్దినే హరిర్యాతో దివం సంత్యజ్య మేదినీమ్‌ | తస్మిన్దినే7వతీర్ణో7యం కాలకాయః కలిః కిల || 8

ప్లావయామాస తాం శూన్యాం ద్వారకాంచ మహోదధిః | యదుశ్రేష్ఠ గృహం త్వేకం నాప్లావయత సాగరః || 9

నాతిక్రామతి భో విప్రా స్తద ద్యాపి మహోదధిః | నిత్యం సంనిహిత స్తత్ర భగవా న్కేశవో యతః || 10

తదతీవ మహాపుణ్యం సర్వపాతకనాశనమ్‌ | విష్ణుక్రీడాన్వితం స్థానం దృష్ట్వా పాపా త్ప్రముచ్యతే|| 11

ద్వారవతినుండి బయలుదేరిన వేలకొలది కృష్ణ భార్యలకు వజ్రునికి నతడు రక్షణ యిచ్చి యాదరించెను. కృష్ణునిచే భూమికి గొనిరాబడిన సుధర్మయను దేవసభపారిజాత వృక్షము స్వర్గమునకు వెళ్ళిపోయెను. హరి మేదినినివిడిచి స్వర్గారోహణము చేసిననాడే కలి నల్లని శరీరముతో భూమికి దిగెను. మహాసముద్రము నిర్జనమైన ద్వారకను ముంచి వేసెను. ఒక్క కృష్ణ గృహమును మాత్రము ముంచలేదు. ఆ గృహమందెపుడును భగవంతు డీనాటికిని యుండుటచే నేడును సముద్రుడు తన హద్దుదాటి దాని నాక్రమింపడు. అది మహాపుణ్యస్థానము సర్వపాపహరము. విష్ణువు క్రీడించిన స్థానము. దానిని దర్శించిన పాపము వోవును.

పార్థః పంచనదే దేశే బహుధాన్య ధనాన్వితే | చకార వాసం సర్వస్య జనస్య ముని సత్తమాః || 12

తతో లోభః సమభవ త్పార్ధేనై కేన ధన్వినా | దృష్ట్వా స్త్రియో నీయమానా దస్యూనాం నిహతేశ్వరాః || 13

తతస్తే పాపకర్మాణో లోభోపహతచేతనసః || ఆభీరా మంత్రయామాసుః సమేత్యాత్యంత దుర్మదాః || 14

ఆభీరా ఊచుః

ఆయమేకో7ర్జునో ధన్వీ స్త్రీజనం నిహతేశ్వరమ్‌ | నయత్యస్మానతిక్రమ్య ధిగేత త్క్రియతాం బలమ్‌ || 15

హత్వా గర్వసమారూఢో భీష్మద్రోణ జయద్రథాన్‌ | కర్ణాదీంశ్చ న జానాతి బలం గ్రామనివాసినామ్‌ || 16

బలజ్యేష్టాన్నరానన్యా న్గ్రామ్యాంశ్చైవ విశేషతః | సర్వానేవావజాతి కిం వో బహుభిరుత్తరైః || 17

వ్యాస ఉవాచ

తతో యష్టి ప్రహరణా దస్యవో లోష్టహారిణః | సహస్రశో7భ్యధావంత తం జనం నిహతేశ్వరమ్‌ || 18

తతో నివృత్తః కౌంతేయః ప్రాహా77భీరాన్హసన్నివ || 19

అర్జున ఉవాచ

నివర్తధ్వ మధర్మజ్ఞా యదితోనముమూర్షవః || 20

వ్యాస ఉవాచ

ఆవజ్ఞాయ వచస్తస్య జగృహుస్తే తదా ధనమ్‌ | స్త్రీజనం చాపి కౌంతేయా ద్విష్వక్సేన పరిగ్రహమ్‌ || 21

పార్ధుడు ధాన్యధన సమృద్ధమైన పంచనద దేశమందు యాదవ జనమున కంతకు నివాస మేర్పరచెను. అవ్వల కలిప్రభావముచేత మానవులలో లోభగుణ మంకురించెను. భర్తలను గోల్పోయిన స్త్రీలు చోరులకు సంబంధించిన వారిని ధనుర్ధారియైన యొక్క అర్జునుడు తీసికొనిపోయి రక్షణ యిచ్చుట చూచి లోభవశులై పాపులైన యాభీరులు (అడవిమూకలు) పొగరుగొని యొండొరులిట్లు ఆలోచించిరి. ఈ అర్జును డొక్కడు విల్లుగొని భర్తలు చనిపోయిన స్త్రీజనమును గొనిపోవుచున్నాడు. మనలను లెక్కచేయుటలేదు. కనుక మనబలము జూపింతము. భీష్మద్రోణ జయద్రధ కర్ణాది వీరులను జంపి గర్వమెక్కి గ్రామవాసులగు మన బలమేదో యెరుగకున్నాడు. బలాఢ్యులగు పెక్కు గ్రామముల వారినందరిని అవమానించుచున్నాడు. మీరెవ్వరును బదులు పలుకవలదు. అన కర్రలు కత్తులు గొని దస్యులు (గూండాలు) వేలకొలది పరువులెత్తిరి. అంత నర్జునుడు వెనుదిరిగి యయ్యాభీరులం గని మీరు బ్రతుకదలతురేని వెనుకకు పొండు'' అన నాతని మాటను ధిక్కరించి వాండ్రెల్ల స్త్రీలను కృష్ణభార్యలను నర్జునునిచెంత నుండి లాగికొనిపోయిరి.

తతో7ర్జునో ధనుర్దివ్యం గాండీవ మజరం యుధి | ఆరోపయితు మారేభే న శశాక స వీర్యవాన్‌|| 22

చకార సజ్యం కృచ్ఛ్రాత్తు తదభూ చ్ఛిథిలం పునః | న సస్మార తథా7స్త్రాణి చింతయన్నపి పాండవః || 23

శరాన్ముమోచ చైతేషు పార్థః శేషా న్సహర్షితః | న భేదం తే పరం చక్రు రస్తా గాండీవధన్వనా || 24

వహ్నినా చాక్షయా దత్తాః శరాస్తే7పి క్షయం యయుః | యుధ్యతః సహ గోపాలై రర్జున స్యాభవతక్షయః || 25

ఆచింతయత్తు కౌంతేయః కృష్ణసై#్యవహి తద్బలమ్‌ | యన్మయా శరసంఘాతైః సబలా భూభృతో జితాః|| 26

మిషతః పాండుపుత్రస్య తతస్తాః ప్రమదోత్తమాః | అపాకృష్యంత చా77భీరైః కామా చ్చాన్యాఃప్రవవ్రజుః|| 27

తతః శ##రేషు క్షీణషు ధనుష్కోట్యా ధనంజయః | జఘాన దస్యూంస్తే చాస్య ప్రహారా న్జహసు ర్ద్విజాః || 28

పశ్యత స్త్వేవ పార్థస్య వృష్ణ్యంధకవరస్త్రియః | జగ్మురాదాయ తే వ్లుెచ్ఛాః సమంతాన్ముని సత్తమాః || 29

అంత నర్జునుడు యుద్ధమందు వమ్మువోయి గాండీవము నెక్కుపెట్ట బూనెను. కాని అతనికశక్యమయ్యె. కష్టముమీద నెక్కుపెట్టినను క్షణములో నది శిథిలమైపోయెను. దివ్యాస్త్రము లతనికి జ్ఞాపకమే రాలేదు. చేనున్న తక్కిన యస్త్రములను వారిపై విసరెను. కాని యవి యన్నియు గ్రుంగిపోయి శత్రుభేదముం జేయవయ్యెను. ఖాండవవన దహన సమయమున నగ్ని యిచ్చిన యక్షయ బాణములు కూడ అప్పుడు క్షయించిపోయినవి. గోపాలురతో పోరుచున్న యర్జునునికి హైన్యస్థితి వచ్చెను. అపుడర్జునుడు శరజాలముచే బలాఢ్యులగు రాజులను నేను గెలుచుట కృష్ణునియొక్కబలమే యని తలంచెను. అతడు చూచుచుండగనే యుత్తమస్త్రీవర్గమును ఆభీరులు లాగికొనిపోయిరి. కొందరు స్త్రీలు తమంతనే కామప్రవృత్తితో ఆ మూకవెంట పడిపోయిరి. ఆర్జునుడు శస్త్రాస్త్రములచే గొట్టుచుండ వాండ్రు పకపక నవ్వుచుండిరి. ఇట్లువ్లుెచ్ఛులు పార్థుడు చూచుచుండగనే వృష్ణ్యంధకకులాంగనలనందరం గొనిపోయిరి.

తతః స దుఃఖితో జిష్ణుః కష్టం కష్టమితి బ్రువన్‌ | అహో భగవతా తేన ముక్తో7స్మీతి రురోద హ || 30

తద్ధను స్తాని చాస్త్రాణి స రథస్తే చ వాజినః | సర్వ మేకపదే నష్టం దాన మశ్రోత్రియే యథా || 31

అహో చాతి బలం దైవం వినా తేన మహాత్మనా | య దసామర్థ్యయుక్తో7హం నీచై ర్నీతః పరాభవమ్‌ || 32

తౌ బాహూ స చమే ముష్టిః స్థానం త త్సో7స్మి చార్జునః | పుణ్యనేవ వినా తేన గతం సర్వమసారతామ్‌ ||

మమార్జునత్వం భీమస్య భీమత్వం తత్కృతం ధ్రువమ్‌ | వినా తేన యదాభీరై ర్జితో7హం కథమన్యథా || 33

ఆంతట జిష్ణువగు (అర్జునుడు) కష్టము! కష్టమనుచు భగవంతునిచే విడువబడితినని యేడ్చెను. అదే ధనుస్సు అవే యమ్ములు అదే రథము అవే గుఱ్ఱములు. వేదవిదుడు వేదానుష్ఠాతయు కాని వానికి చేసిన దానమువలె నొక్క యడుగులో సర్వము వమ్మైపోయినది. ఆహా! విధి యెంత బలీయము. ఆ మహానుభావుడు లేనంతట వట్టి చేతగాని దద్దమ్మనై పనికిమాలినవారిచే నవమానింపబడితిని. అవే బాహువులు అదే పిడికిలి. అదేచోటు. ఆ అర్జునుడనే యైయున్నాను. పుణ్యముతో నాస్వామితో నెడబాటుననంతయు నిస్సారమైపోయినది. నా యర్జునత్వము భీముని భీమత్వము కృష్ణుని వలన నీయబడినవే. నిజము. ఆయన లేమి నీ చచ్చుగొల్లలకు నేను బెండువడితిని.

వ్యాస ఉవాచ

ఇత్థం వదన్య¸° జిష్ణు రింద్రప్రస్ధం పురోత్తమమ్‌ | చకార తత్ర రాజానం వజ్రం యాదవనందనమ్‌ || 34

స దదర్శ తతో వ్యాసం ఫాల్గుణః కాననాశ్రయమ్‌ | తముపేత్య మహాభాగం వినయేనాభ్యవాదయత్‌ || 35

తం వందమానం చరణా వవలోక్య సునిశ్చితమ్‌ | ఉవాచ పార్థ విచ్ఛాయః కథమంత్యంత మీదృశః || 36

అజారజో7నుగమనం బ్రహ్మహత్యా7థవా కృతా | జయాశాభంగదుఃఖీ వా భ్రష్టచ్ఛాయో7సి సాంప్రతమ్‌ || 37

సాంతానికాదయో వా తే యాచమానా నిరాకృతాః | అగమ్య స్త్రీరతిర్వా7పి కేనాసి విగతప్రభః || 38

భుంక్తే7ప్రదాయ విప్రేభ్యో మిష్టమేక మథో భవాన్‌ | కిం వా కృపణ విత్తాని హృతాని భవతా7ర్జున || 39

కచ్చిన్న సూర్యవాతస్య గోచరత్వం గతో7ర్జున | దుష్టచక్షుర్హతో వా7పి నిఃశ్రీకః కథమన్యథా || 40

స్పృష్టో నఖాంభసా వా7పి ఘాటాంభఃప్రోక్షితో7సివా | తేనాతీవాసి విచ్ఛాయో న్యూనై ర్వా యుధి నిర్జీత || 41

వ్యాసఉవాచ

తతఃపార్థో వినిశ్వస్య శ్రూయతాం భగవన్నితి | ప్రోక్తో యథావ దాచష్ట విప్రా ఆత్మపరాభవమ్‌ || 42

ఇట్లర్జునుడు పలుకుచు నింద్రప్రస్థమునకేగి యాదవ కుమారుడగు వజ్రుని యందు రాజును గావించెను. అవ్వల నడవిలో నున్న వ్యాసుని మహానుభావుని దర్శించి సమీపించి యడకుప దోప నమస్కరించెను. అట్లు మ్రొక్కిన యర్జునుని వ్యాసభనవానులు తేరి పార జూచి యర్జునుడేయని నిశ్చయమునకు వచ్చి పార్ధా! ఈవిధముగ మిక్కిలి వన్నెదరిగి యున్నాడవేమి? గొర్రెలపరాగము వెంబడింపవలసి వచ్చెనా? బ్రహ్మహత్యకు బాల్పడితివా? గెలుపునం దాశాభంగమై దుఃఖము గల్గెనా! విన్నవోయి యున్నాడవు. నిన్ను యాచింపవచ్చిన సాంతానికాదులను లేదని నిరాకరించి పంపితివా! (సాంతానికుడు = పుత్రుడు మొదలగు వాడు) అగమ్యా గమనము జేసితివా! (కూడని స్త్రీతో సంగమము) ప్రభదరిగియుండుటకు గారణమేమి! విప్రులకు బెట్టక నీవొక్కడవే మధురాన్నములను దింటివా? కాక దీనుల ధనములను హరించితివా? సూర్యవాతమునకు (వడదెబ్బకు) గురికాలేదు కదా! ఎట్లు శోభ గోల్పోయితివి? దృష్టిదోషము తగిలెనా నభోదక స్పర్శ కల్గినదా! (గోళ్లయొక్క స్పర్శ కల్గిన యుదకమశుచి యన్నమాట) మట్టికుండ నీటిచే ప్రోక్షింపబడితివా! (తడుపబడితివా) నీకన్న తక్కువవారిచే గెలువబడితివా ! ఇట్లు ఛాయదరిగియున్నావేమి?

పార్థుడంతట నిట్టూర్పు పుచ్చి భగవంతుడ! వినుము అని తన పరాభవ వృత్తాంతమును జరిగినది జరిగినట్లిట్లు చెప్పెను.

అర్జున ఉవాచ

యద్బలం యచ్చనస్తేజో యద్వీర్యం యత్పరాక్రమః | యా శ్రీశ్చాయా చనః సో7స్మాన్పరిత్యజ్యహరిర్గతః || 43

ఇతరేణవ మహతా స్మితపూర్వాభిభాషిణా | హీనా వయం మునే! తేన జాతాస్తృణమయా ఇవ || 44

అస్త్రాణాం సాయకానాం చ గాండీవస్య తథా మమ | సారతా యా7భవన్మూర్తా స గతః పురుషోత్తమః || 45

యస్యావలోకనాదస్మాం శ్రీర్జయః సంపదున్నతిః | న తత్యాజ స గోవింద స్త్యక్త్వా7స్మాన్భగవాన్గతః || 46

భీష్మద్రోణాంగ రాజాద్యా స్తథా దుర్యోధనాదయః | యత్ర్పభావేణ నిర్డగ్ధాః స కృష్ణస్త్యక్తవాన్భువమ్‌|| 47

నిర్యౌవనా హతశ్రీకా భ్రష్టచ్ఛాయేవ మే మహీ | విభాతి తాత నైకో7హం విరహే తస్య చక్రిణః|| 48

యస్యానుభావాద్భీష్మాద్యై ర్మయ్యగ్నౌ శలభాయితమ్‌ | వినా తేనాద్య కృష్ణేన గోపాలై రస్మి నిర్జితః || 49

గాండీవం త్రిషులోకేషు ఖ్యాతం యదనుభావతః | మమ తేన వినా77భీరై ర్లగుడైస్తు తిరస్కృతమ్‌ || 50

స్త్రీసహస్రాణ్యనేకాని హ్యనాథాని మహామునే | యతతో మమ నీతాని దస్యుభిర్లగుడాయుధైః || 51

ఆనీయమానమాభీరైః సర్వం కృష్ణావరోధనమ్‌ | హృతం యష్టి ప్రహరణౖః పరిభూయ బలం మమ || 52

విఃశ్రీకతా నమే చిత్రం యజ్జీవామి తదద్భుతమ్‌ | నీచావమానపంకాంకీ నిర్లజ్జో7స్మిపితామహ || 53

మాబలము మాతేజస్సు మావీర్యము మాపరాక్రమము మాసిరి మాకాంతి యెవరో యట్టిహరి మమ్మువీడివెళ్ళినాడు. చిరునవ్వుతో ముచ్చటించు మాస్వామి ఆ మహానుభావుడు అన్యుడట్లు మమ్ము విడిచివెళ్ళినాడు. దానిచే నా సర్వాయుధములు తృణప్రాయములైనవి. అస్త్రములు శస్త్రములు గాండీవముయొక్క మూర్తీభవించిన సారమెల్ల తానైన యాపురుషోత్తముడు వెళ్ళిపోయినాడు. ఎవనిచూపున మమ్ములను శ్రీ జయము సంపత్సమృద్ధి విడువలేదో యట్టిగోవిందుడు భగవంతుడు విడిచి వెళ్ళినాడు. భీష్మద్రోణులు అంగరాజు (కర్ణుడు) దుర్యోధనాదులు నేప్రభువు ప్రభావముచే సమూలము నిర్దగ్ధలైరో యట్టి కృష్ణుడు భూమిం బాసినాడు. ¸°వనము బాసి హతశ్రీయై వన్నె దరిగి చక్రాయుధుని విరహము వలన నేనొక్కడనే కాదు ఈ పృథివి కుములుచున్నది. ఏస్వామి యనుభావము వలన లీలవలన నేనను నగ్నియందు భీష్మాదులు మిడుతలైరో యట్టి కృష్ణుని బాసి గొల్లలకోడి పోయితిని. ఎవ్వని యనుభావముచే త్రిలోకు ప్రసిద్ధమైనదో యట్టి గాండీవము కృష్ణుడు లేమిని గొల్లల బడితెలకు లొంగిపోయినది. హరిలేమిని ఎన్నో వేలమంది స్త్రీలు ఆనాధలు వట్టి కట్టెలతో దొంగలచే గొనిపోబడినారు. నా బలమును ధిక్కరించి గొల్లలు నేను గొనివచ్చుచున్న కృష్ణునియంతఃపురమంతయు కర్రలతో నదలించి తోలికొని పోబడినారు. నేను సిరి గోల్పోవుట వింతగాదు. బ్రతికియుండుట అదే యత్యద్భుతము. నీచులవలని యవమానమను ఱొంపిని బూసికొని తాత! దిక్కుమాలి సిగ్గుమాలినవాడనైతిని.

శ్రుత్వా7హం తస్య తద్వాక్య మబ్రవం ద్విజసత్తమాః | దుఃఖిత్స్య చ దీనస్య పాండవస్య మహాత్మనః || 54

అలంతే వ్రీడయా పార్థ ! న త్వం శోచితు మర్హసి | అవేహి సర్వభూతేషు కాలస్య గతి రీదృశీ || 55

కాలో భవాయ భూతానా మభావాయ చ పాండవ | కాలమూలమిదం జ్ఞాత్వా కురుస్జైర్యమతో7ర్జున || 56

నద్యః సముద్రా గిరయః సకలా చ వసుంధరా | దేవా మనుష్యాః పశవ స్తరవశ్చ సరీసృపాః || 57

సృష్టాః కాలేన కాలేన పునర్యాస్యంతి సంక్షయమ్‌ | కాలాత్మకమిదం సర్వం జ్ఞాత్వా శమ మవాప్నుహి || 58

యథా77త్థ కృష్ణమాహాత్మ్యం తత్తథైవ ధనంజయ | భారావతారకార్యార్థ మవతీర్ణః సమేదినీమ్‌ || 59

భారాక్రాంతా ధరా యాతా దేవానాం సంనిధౌ పురా | యదర్థ మవతీర్ణో7సౌ కామరూపీ జనార్దనః || 60

తచ్చ నిష్పాదితం కార్య మశేషా భూభృతో హతాః | వృష్ణ్యంధక కులం సర్వం తథా పార్థోప సంహృతమ్‌|| 61

నకించి దన్యత్కర్తవ్య మస్య భూమితలే7ర్జున | తతో గతః స భగవా న్కృతకృత్యో యథేచ్ఛయా || 62

సృష్టిం సర్గే కరోత్యేష దేవదేవః స్థితిం స్థితౌ |

అంతే లయం సమర్థో 7 యం సాంప్రతం వై యథాకృతమ్‌ || 63

తస్మాత్పార్థన సంతాప స్త్వయాకార్యః పరాభవాత్‌ | భవంతి భవకాలేషు పురుషాణాం పరాక్రమాః || 64

యతస్త్వయైకేన హతా భీష్మద్రోణాదయో నృపాః | తేషా మర్జున కాలోత్థం కిం న్యూనాభిభవో న సః || 65

విష్ణోస్తస్యానుభావేన యథా తేషాం పరాభవః | త్వత్త స్తథైవ భవతో దస్యుభ్యో7ంతే తదుద్భవః || 66

సదేవో7స్య శరీరాణి సమావిశ్య జగత్థ్సితిమ్‌ | కరోతి సర్వభూతానాం నాశం చాంతే జగత్పతిః || 67

భవోద్భవే చ కౌంతేయ సహాయన్తే జనార్దనః | భవాంతే త్వద్విపక్షాస్తే కేశ##వే నావలోకితాః || 68

కః శ్రద్దధ్యాత్సగాంగేయా న్హన్యాస్త్వం సర్వకౌరవాన్‌ | ఆభీరేభ్యశ్చ భవతః కః శ్రద్దధ్యా త్పరాభవమ్‌|| 69

పార్థైత త్సర్వభూతేషు హరేర్లీలావిచేష్టితమ్‌ | త్వయా యత్కౌరవా ధ్వస్తా యదాభీరైర్భవాన్జితః || 70

గృహీతా దస్యుభిర్యచ్చ రక్షితా భవతా స్త్రియః | తదప్యహం యథా వృత్తం కథయామి తవార్జున || 71

అర్జునుని దుఃఖమువిని దీనుడైయేడ్చుచున్న మహాత్ముడైన యాపాండవునియొక్క యమ్మాటవిని నేనిట్లంటిని. వ్యాసుడు. పార్థ! సిగ్గుపడవలదు. ఏడువకుము. సర్వభూతములయెడల కాలముయొక్కగతి యిట్టిదని యెఱుంగుము. భూతములపుట్టుకకు గిట్టుటకు కాలము కారణము. ఇది కాలనిమిత్తమనియెరిగి స్థైర్యము నొందుము. నదులు సముద్రములు పర్వతములు వసుథ మనుష్యులు పశువుల చెట్లు పాములు కాలముచే నృజింపబడి కాలముచేతనే క్షయించును. సర్వమును కాలస్వరూపముగ దెలిసి శాంతినొందుము. ధనంజయ! కృష్ణప్రభావము నీవన్నది యంతయు నంతే. భారహరణమునకు భూమియం దత డవతరించినాడు. భూదేవి భారవశ##యైమున్ను దేవతలందరి కేగినది. అందులకే కామరూపియైనభగవంతు డవతరించి ఆపనిజరిపినాడు. రాజులను గూల్చినాడు. తుదకు దానుజన్మించిన వృష్ణ్యంధకకులముగూడ నుపహరించినాడు. ఇతనికింక నీ భూతలమున జేయవలసినది కొంచెము కూడలేదు, అందుచే గృతకృత్యుడై భగవంతుడు యథేచ్ఛగా నిర్గమించినాడు. సృష్టిస్థితిలయములు మూడును శ్రీహరిలీలలే. పార్థ! పరాభవమునకు సంతాపవడకుము. పురుషుల పరాక్రమములు కాగలకాలములందగుచుండును. బీష్మద్రోణాదులు నీచే గూలుట కాలమువలననే. పరమాత్మ యనుభావముననే వారి పరాభవము. తక్కువవారివలన నీకు పరాభవము. ఆదేవుడు స్థితిలయములు చేయునపుడు అన్యశరీరములందావేశించుచుండును. కాగలప్పుడు హరి నీకు సహాయుడయ్యెను. కానపుడు నీశత్రువులు హరి దృష్టిలో పడినారు. నీవు గాంగేయునితోడి కౌరవులనెల్ల గూల్చితివన్న నెవడునమ్మును? అట్లే యెందులకుగాని యాభీరుల కోడితివన్నను నెవడునమ్మును? ఇవి సర్వభూతములయందు హరియొక్క విలాసము. అతని చేష్ట. నీచే గౌరవులు ధ్వంసమగుట యాభీరులకు నీవోడుట నీరక్షణలోనున్న స్త్రీలు దొంగలచేబడుటయను విషయములో జరిగినది నీకుచెప్పుచున్నాను వినుము.

ఆష్టావక్రః పురా విప్ర ఉదవాసరతో7భవత్‌ | బహూన్వర్షగణాన్పార్థ గృణన్బ్రహ్మ సనాతనమ్‌ || 72

జితేష్వసురసంఘేషు మేరుపృష్ఠే మహోత్సవః | బభూవ తత్ర గచ్ఛంత్యో దదృశుస్తం సురస్త్రియః || 73

రంభాతిలో త్తమాద్యాశ్చ శతశో7థ సహస్రశః | తుష్టువుస్తం మహాత్మానం ప్రశశంసుశ్చ పాండవ || 74

ఆకంఠమగ్నం సలిలే జటాభారధరం మునిమ్‌ | వినయావనతాశ్చైవ ప్రణముః స్తోత్రతత్పరాః || 75

యథా యథా ప్రసన్నో7భూ త్తుష్టువుస్తం తథా తథా | సర్వాస్తాః కౌరవశ్రేష్ఠ! వరిష్ఠం తం ద్విజన్మనామ్‌|| 76

అష్టావక్ర ఉవాచ

ప్రసన్నో7హం మహాభాగా భవతీనాం యదిష్యతే | మత్తస్తద్ర్వియతాం సర్వం ప్రదాస్యామ్యపి దుర్లభమ్‌|| 77

వ్యాస ఉవాచ

రంభాతిలోత్త మాద్యాశ్చ దివ్యా శ్చావ్సరసో 7 బ్రువన్‌ || 78

అప్సరస ఊచుః

ప్రసన్నే త్వయ్యసంప్రాప్తం కిమస్మాకమితి ద్విజాః || 79

ఇతరాస్త్వబ్రువన్విప్ర ప్రసన్నో భగవాన్యది | తదిచ్ఛామః పతిం ప్రాప్తుం విప్రేంద్ర పురుషోత్తమమ్‌ || 80

వ్యాస ఉవాచ

ఏవం భవిష్యతీత్యుక్త్వా ఉత్తతార జలాన్మునిః | తముత్తీర్ణం చ దదృశు ర్విరూపం వక్రమష్టధా || 81

తం దృష్ట్వా గృహ్యమానానాం యాసాం హాసః స్ఫుటో7భవత్‌ | తాః శశాప మునిః కోప మవాప్య కురునందన!

అష్టావక్ర ఉవాచ

యస్మాద్విరూపరూపం మాం మత్వా హాసావమాననా | భవతీభిఃకృతా తస్మా దేష శాపం దదామి వః || 83

మత్ప్రసాదేన భర్తారం లబ్ధ్వా తు పురుషోత్తమమ్‌ | మచ్ఛాపోపహతాః సర్వా దస్యుహస్తం గమిష్యథ|| 84

వ్యాస ఉవాచ

ఇత్యుదీరితమాకర్ణ్య మునిస్తాభిః ప్రసాదితః | పునః సురేంద్ర లోకం వై ప్రాహ భూయో గమిష్యథ || 85

ఏవం తస్య మునేః శాపా దష్టావక్రస్య కేశవమ్‌ | భర్తారం ప్రాప్య తాః ప్రాప్తా దస్యుహస్తం వరాంగనాః || 86

తత్త్వయా నాత్ర కర్తవ్యః శోకలేశో7పి పాండవ | తేనైవాఖిలనాథేన సర్వం తదుపసంహృతమ్‌ || 87

భవతాం చోపసంహార మాసన్నం తేన కుర్వతా | బలం తేజస్తథా వీర్యం మాహాత్మ్యం చోపసంహృతమ్‌ || 88

జాతస్య నియతో మృత్యుః పతనం చ తథోన్నతేః |

విప్రయోగావసానం తు సంయోగః సంచయః క్ష (యాతక్ష) యః|| 89

విజ్ఞాయ న బుధాః శోకం న హర్ష ముపయాంతి యే | తేషామేవేతరే చేష్టాం శిక్షంతః సంతి తాదృశాః|| 90

తస్మాత్త్వయా నరశ్రేష్ఠ! జ్ఞాత్వైతద్భ్రాతృభిః సహ | పరిత్యజ్యాఖిలం రాజ్యం గంతవ్యం తపసే వనమ్‌ || 91

తద్గచ్ఛ ధర్మరాజాయ నివేద్యైత ద్వచో మమ | పరశ్వో భ్రాతృభిః సార్ధం గతం వీర యథా కురు|| 92

వ్యాస ఉవాచ

ఇత్యుక్తో ధర్మరాజంతు సమభ్యేత్య తథోక్తవాన్‌ | దృష్టం చైవానుభూతం వా కథితం తదశేషతః || 93

వ్యాసవాక్యం చ తే సర్వే శ్రుత్వా7ర్జున సమీరితమ్‌ | రాజ్యే పరీక్షితం కృత్వా యయుః పాండుసుతా వనమ్‌|| 94

ఇత్యేవం వో మువిశ్రేష్ఠా విస్తరేణ మయోదితమ్‌ | జాతస్య చ యదోర్వంశే వాసుదేవస్య చేష్టితమ్‌ || 95

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే శ్రీకృష్ణచరితసమాప్తికథనంనామ ద్వాదశాధికద్విశతతమో7ధ్యాయః

అష్టావక్రకథ

మున్ను సనాతన బ్రహ్మోపాసనము జేయుచు నష్టావక్రుడు పెక్కేండ్లు నీటనే నివాసముండెను. ఆసురులోడిన తరువాత మేరువుపై బెద్ద యుత్సవమయ్యెను. అదిచూడనేగుచు దేవతాస్త్రీలు ఆతనింజూచిరి. రంభాతిలోత్తమ మొదలైన వారు నూర్లువేలుగ నమ్మహాత్ముని స్తుతించిరి. ప్రశంసించిరి. అతడు కంఠమువరకు మునిగి పెనుజడలుదాల్చియుండ వినయమున నమరాంగనలు మ్రొక్కిన బ్రసన్నుడై యిట్లనియె.

నేను ప్రసన్నుడనైతిని. తామేదికోరిన నిచ్చెదనుకోరుకొనుడన రంభ, తిలోక్తమ మొదలైనవారు నీవు ప్రసన్నుడవైన మేము పడయని భాగ్యమేమున్నదనిరి. కాని వారిలో కొందరు ప్రసన్నుడవైతివేని నిన్ను భర్తగా కోరెదమనిరి. అట్లేయగునని యతడు నీళ్ళనుండిలేచెను. అయ్యెడ నాతని నెనిమిది వంకరలుగలవికృత రూపునిగా జూచిరి. చూచి చాటువడుచున్నయయ్యింతుల పరిహాసమాతనికి స్పష్టమయ్యెను. దాన గోపించి అతడు నా విరూపము చూచి హసించి యవమానముచేసితిరి కావున నాదయ చేతనే బురుషోత్తముని భర్తగ బొంది నాశాపముచే దొంగలచేత జిక్కెదరనెను. దాని కడలి వారు బ్రతిమాల ఆ ముని యింద్రలోకమునకు నామీద నేగుదురని యనుగ్రహించెను. ఇట్లు అష్టావక్రుని శాపమువలన జరిగిన దానికి నీవు కొంచెముకూడ శోకింపబనిలేదు. ఈ సంహారమేకాదు కొలదికాలములో మీరు నుపసంహరింపబడుదురు. పుట్టినవానికి గిట్టుటయు మీదనుండుటయు సంచయము క్షయము (ప్రోగుచేయుట పోగొట్టుకొనుట) గలిసి విడివడుటయుం దప్పదు. స్వభావమని దీనినెరింగిన పండితులు క్రుంగరు పొంగరు. అట్టి పండితుల నడవడిని అలవరుచుకొన్నవారుకూడ వారివలెనే యున్నవారునుగలరు.

కావున నరశ్రేష్ఠ! సోదరులతో నిది యెఱింగి రాజ్యము విడిచి తపముసేయ వనమునకు వెళ్ళదగును. ఈ నా మాటను ధర్మరాజునకు జెప్పుము. ఎల్లుండి సోదరులతోగూడనుత్తమగతిమహాప్రస్థానముజేయుడు. అనితెలుపబడిపార్థుడు ధర్మరాజు దగ్గరకువచ్చి యదంతయుతెల్పెను. వారందరు నర్జునుని వచనమువిని పరీక్షిత్తును రాజ్యమున సుంచి వనమునకు జనిరి. ఓ మునిశ్రేష్ఠులార! విస్తరముగ నిట్లు యదువంశమునందు బుట్టిన వాసుదేవునియొక్క చరిత్రము మీకు దెలిపితిని.

ఇది బ్రహ్మపురాణమున శ్రీకృష్ణచరిత్ర సమాప్తికథనమను 212 అధ్యాయము.

Brahmapuranamu    Chapters