Brahmapuranamu    Chapters   

అథఏకాదశాధికద్విశతతమో7ధ్యాయః

కృష్ణ నిర్యాణకథనమ్‌

వ్యాస ఉవాచ

ఇత్యుక్తో దారుకః కృష్ణం ప్రణిపత్య పునః పునః | ప్రదక్షిణం చ బహుశః కృత్వా ప్రాయాద్యథోదితమ్‌|| 1

స చ గత్వా తథా చక్రే ద్వారకాయాం తథా7ర్జునమ్‌ | ఆవినాయ మహా బుద్ధిం పజ్రం చక్రే తథా నృపమ్‌|| 2

భగవానపి గోవిందో వాసుదేవాత్మకం పరమ్‌ | బ్రహ్మాత్మని సమారోప్య సర్వభూతే ష్వధారయత్‌ || 3

స మానయన్ద్విజవచో దుర్వాసా యదువాచ హ | యోగయుక్తో7భవ త్పాదం కృత్వా జానుని సత్తమాః || 4

సంప్రాప్తో వై జరా నామ తదా తత్ర స లుబ్థకః | ముసలశేషలోహస్య సాయకం ధారయ న్పరమ్‌ || 5

సతత్పాదం మృగాకారం సమవేక్ష్య వ్యవస్థితః | తతో వివ్యాధ తేనైవ తోమరేణ ద్విజోత్తమాః || 6

గతశ్చ దదృశే తత్ర చతుర్బాహుధరం నరమ్‌ | ప్రణిపత్యా77హ చైవైనం ప్రసీదేతి పునః పునః || 7

అజానతా కృతమిదం మయా హరిణశంకయా | క్షమ్యతా మాత్మపాపేన దగ్ధం మా దగ్ధు మర్హసి || 8

వ్యాస ఉవాచ

తతస్తం భగవానాహ నాస్తి తే భయ మణ్వపి | గచ్ఛత్వం మత్ర్పసాదేన లుబ్ధ స్వర్గేశ్వరాస్పదమ్‌ || 9

కృష్ణనిర్యాణము

వ్యాసుడిట్లనియె.

కృష్ణునిచే నిట్లు తెలుపబడి దారుకుడు స్వామికి మఱిమఱి నమస్కరించి ప్రదక్షిణ మొనరించి యాయన చెప్పినట్లేగెను. ఏగి ద్వారక కర్జునుని గొనివచ్చి వజ్రుని రాజుం జేసెను. భగవంతుడగు గోవిందుడు వాసుదేవాత్మకమయిన తన యంశమును బ్రహ్మందారోపించి సర్వభూతములందు ధరించెను. సర్వాత్మభావమునందె నన్నమాట. మున్ను దుర్వాసుడు చెప్పినట్లు (అది ద్విజుడు బ్రాహ్మణుడు చెప్పినమాట యైనందున) దానిం గౌరవింని మోకాలిపై పాదముంచి యోగ సమాధిం గొని నిల్చెను. అంతట జరుడు అను వ్యాధుడు (బోయ) అచటికి వచ్చెను. వాడు మునుపటి రోకలి యందు మిగిలిన యినుపముక్కతో తయారైన బాణముంగొని యొక లేడి కాలియడుగు వలెనున్న హరిపాదముం జూచి బాణముతో గొట్టెను. కొట్టి యాదరికి వెళ్ళి నాలుగు బాహువులతో నున్న యొక నరమూర్తిం జూచెను. ఆయనకు ప్రణామము సేసి క్షమింపుమని మఱిమఱి వేడుకొనెను. కెలియక యొక లేడీ యనుకొని కొట్టితిని. నా పాపకర్మము చేత తగలబడుచున్న నన్ను నీవు తగలబెట్టవలదు అనెను. వానింగని భగవంతుడు నీకణుమాత్రమేని భయము లేదు. నా ప్రసాదముచే దేవేంద్ర లోకమున కేగుమని హరి పలికెను.

వ్యాస ఉవాచ

విమానమాగతం సద్య స్తద్వాక్య సమనంతరమ్‌ | ఆరుహ్య ప్రయ¸° స్వర్గం లుబ్ధక స్త త్ర్పసాదతః || 10

గతే తస్మి న్స భగవా న్సంయోజ్యా77త్మాసమాత్మని | బ్రహ్మభూతే7వ్యయే7చింత్యే వాసుదేవ మయే7మలే ||

అజన్మ న్యజరే7నాశిన్యప్రమేయే7ఖిలాత్మని | త్యక్త్వా స మానుషం దేహ మవాప త్రివిధాం గతిమ్‌ || 12

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షి సంవాదే శ్రీకృష్ణచరితే కృష్ణనిర్యాణ కధనం నామ ఏకాదశాధిక ద్విశతతమో7ధ్యాయః

శ్రీహరి వాక్యానంతర మప్పుడే విమాన మేతెంచెను. ఆ బోయ హరిప్రసాదమువలన నది యెక్కి స్వర్గమున కేగెను. అతడేగినంతట భగవంతుడు నారాయణుడు మనసున కందని యమేయము అమలము జన్మ జరామరణములు లేనిది సర్వాత్మకము నైన యాత్మయందు (తనయందు) ఆత్మను (తనను) వాసుదేవరూపమూర్తి యందు సంయోజించి మానుష దేహముంబాసి త్రివిధమయిన గతిని బొందెను. సాలోక్య సారూప్యసా యుజ్యరూపమైన పరమముక్తిని బొందెను.

ఇది శ్రీబ్రహ్మపురాణమున శ్రీకృష్ణ చరితమున కృష్ణనిర్యాణ కథనమను రెండువందల పదనొకొండవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters