Brahmapuranamu    Chapters   

అథ దశాధికద్విశతతమో7ధ్యాయః

కృష్ణనిర్యాణకథనమ్‌

వ్యాస ఉవాచ

ఏవం దైత్యవధం కృష్ణో బలదేవసహాయవాన్‌ | చక్రే దుష్టక్షితీశానాం తథైవ జగతః కృతే || 1

క్షితేశ్చ భారం భగవా స్ఫల్గునేన సమం విభుః | అవతారయామాసహరిః సమస్తాక్షాహిణీవధాత్‌ || 2

కృత్వా భారావతరణం భువో హత్వా7ఖిలా న్నృపాన్‌ | శాపవ్యాజేన విప్రాణా ముపసంహృతవాన్కులమ్‌ || 3

ఉత్సృజ్య ద్వారాకం కృష్ణ స్త్యక్తా మానుష్య మాత్మభూః | స్వాంశో విష్ణుమయం స్థానం ప్రవివేశ పున ర్నిజమ్‌|| 4

వ్యాసుడిట్లనియె. ఇట్లుకృష్ణుడు బలదేవునిసాయమున విశ్వరక్షణకునై దుష్టరాజన్యశిక్షణము సేసెను. ఫల్గును నితోగూడినారాయణుడు అక్షౌహిణులన్నింటింగూల్చి భూదేవి బరువుం దించెను. ఇటుసేసి విప్రులిచ్చిన శాపము నెపమున యదుకులముంగూడ యుపసంహరించెను. ద్వారకనువదలి మానవాకరాము విడిచి యాస్వయంభువు నిజాంశమున తిఱిగి నిజస్థానమును విష్ణుపదముం బ్రవేశించెను.

మునయ ఊచుః

సవిప్రశాపవ్యాజేన సంజహ్రే స్వకులం కథమ్‌ | కథం చ మానుషం దేహ ముత్ససర్జ జనార్దనః || 5

వ్యాస ఉవాచ

విశ్వామిత్ర స్తథా కణ్వో నారదశ్చ ముహామునిః | పిండారకే మహాతీర్థే దృష్టా యదుకుమారకైః || 6

తతస్తే ¸°వనోన్మత్తా భావికార్యప్రచోదితాః | సాంబం జాంబవతీపుత్రం భూషయిత్వా స్త్రియం యథా || 7

ప్రసృతా స్తాన్మునీ నూచుః ప్రణిపాతపురఃసరమ్‌ ||

కుమారా ఊచుః

ఇయం స్త్రీ పుత్రకామా తు ప్రభో కం జనయిష్యతి || 8

వ్యాస ఉవాచ

దివ్యజ్ఞానోపపన్నాస్తే విప్రలుబ్ధా కుమారకైః | శాపం దదు స్తదా విప్రా స్తేషాం నాశాయ సువ్రతాః || 9

మునయః కుపితాః ప్రోచు ర్ముసలం జనయిష్యతి | యేనాఖిలకులోచ్ఛేదో యాదవానాం భవిష్యతి || 10

ఇత్యుక్తాసై#్తః కుమారాస్త ఆచచక్షుర్య థాతథమ్‌ | ఉగ్రసేనాయ ముసలం జజ్ఞే సాంబస్య చోదరాత్‌|| 11

మునులడిగిరి. ఆతడు విప్రశాప మిషమ్మున స్వకులము నెట్లుపసంహరించెను. మనుష్యదేహము నెట్లువదలెను. ? అన వ్యాసుడిట్లు పలుక దొడంగెను.

యదుకుమారులు పిండారకమను తీర్థమున కణ్వనారద విశ్వామిత్రులం గాంచిరి. నడిప్రాయంపుమదముచేత భావికార్య ప్రేరణముచేతను జాంబవతీపుత్రునికి సాంబునికి ఆడువేసమువేసి సాగినడచి ప్రణామ పూర్వకముగ వారిం గూర్చి ఈవిడ కొడుకు గావలయును ననుచున్నది. స్వామీ! పుత్రుం గనగలదా? అనిరి. యదుబాలురచే వంచితులై యమ్మునులు దివ్యజ్ఞాన సంపన్నులుగాపున సువ్రతులుగావున వారినాశనమునకప్పుడు శాపమిచ్చిరి. కుపితులై ఈమెముసల ముంగన గలదనిరి. దానదనఖిలయాదవకులము విచ్ఛిన్నము కాగలదనిరి. ఇట్లు శపింపబడి యయ్యాదవబాలురు వోయి యుగ్రసేనునికి యథాతథముగా తెలిపిరి. సాంబుని కడుపునందుండి ముసలము పుట్టెను.

తదుగ్రసేనో ముసల మయశ్చూర్ణ మకారయత్‌ | జజ్ఞే తచ్చైరకా చూర్ణం ప్రక్షిప్తం వై మహోదధౌ || 12

ముసల స్యాథ లౌహస్య చూర్ణిత స్యాంధకైర్ద్విజాః | ఖండం చూర్ణయితుం శేకు ర్నైవ తే తోమరాకృతి || 13

తదప్యంబునిధౌ క్షిప్తం మత్స్యో జగ్రాహ జాలిభిః | ఘాతిత స్యోదరా త్తస్య లుబ్ధో జగ్రాహ తజ్జరా || 14

విజ్ఞాత పరమార్థో7పి భగవా న్మధుసూదనః | నైచ్ఛ త్తద న్యధా కర్తుం విధినా యత్సమావృతః || 15

ఉగ్రసేను డాముసలము నినుపరజనుగా గొట్టించెను. అది సముద్రమునం బడవేయబడి మేకపెంటికలట్లు పొడియయ్యె ఇనుపరోకలి యదిచూర్ణితమై ఇనుపగుదియగా (తోమరముగా) తయారయ్యెగాని దానిని మఱివారు పొడిసేయలేని దానినిగూడ కడలింబడవేసినంత నొకచేప దానినీ మ్రింగెను. ఆ చేపంజంపి దానికడుపునుండి యాయినుపగుదియ నొకజాలరి గైకొనెను. మధువైరి భగవంతుడానిజమెఱింగియు విధివశుడై దానిని మఱొకలాగున జేయుట కిచ్ఛగింపడయ్యె.

డేవై శ్చ ప్రహితో దూతః ప్రణిపత్యా77హ కేశవమ్‌ | రహ స్యేవ మహం దూతః ప్రహితో భగవ న్సురైః || 16

వస్వశ్విమరుతాదిత్య రుద్రసాధ్యాదిభిః సహ | విజ్ఞాపయతి వః శక్ర స్తదిదం శ్రూయతాం ప్రభో || 17

దేవా ఊచుః

భారావతరణార్థాయ వర్షాణా మధికం శతమ్‌ | భగవానవతీర్ణో7త్ర త్రిదశైః సంప్రసాదితః ః 18

దుర్వృత్తా నిహతా దైత్యా భువో భారో7వతారితః | త్వయా సనాథా స్త్రిదశా వ్రజంతు త్రిదివేశతామ్‌ || 19

త దతీతం జగన్నాథ వర్షాణా మధికం శతమ్‌ | ఇదానీం గమ్యతాం స్వర్గో భవతే యది రోచతే || 20

దేవై ర్విజ్ఞాపితో దేవో7ప్యథాత్రైవ రతి స్తవ | తత్థ్సీయతాం యధాకాలం మాఖ్యేయ మనుజీవిభిః || 21

దేవతలువంప నొక దూతవచ్చి కేశవునికి ప్రణతిసేసి యేకాంతమందు నేను దేవదూతను ఏలినవారికడకు దేవతలంప వచ్చితిని. వసువులశ్వినులు మరలత్తులు రుద్రాదిత్యులు సాధ్యులంగూడి యింద్రుడు తమకిట్లు విజ్ఞాపనము సేయుచున్నాడు. ఇదె వినుండు త్రిదశులపార్థనచే భూభార హరణమునకై నూరేండ్లకుపైని భగవంతుడవీ ధరణి నవతరించితివి. దుష్టదైత్యులు నీచేహతులైరి భూమి బరువు దింపబడినది. ముక్కోటి దేవతలిప్పుడు సనాథులైరి. (దిక్కుగల వారైరి) దేవాధిపత్య మందుదురుగాక! జగన్నాథ! నూరేండ్లు గడచినవి. తమకభిమతమేని యిపుడు స్వర్గమునకు దయచేయవలయును మఱియు నీ కిక్కడన (భూలోకమంద) యభిలాషయేని యిక్కడనె యుండనగును. ఏలిన వారిసేవకులము మేమిట్లు సేయుమని చెప్పదగినవారము గాము.

శ్రీభగవాను వాచ

యత్త్వమాత్థాఖిలం దూత వేద్మి చైత దహం పునః | ప్రారభ్థ ఏవ హి మాయా యాదవానా మపి క్షయః || 22

భువో నామాతిభారో7యం యాదవై రనిబర్హితైః | అవతారం కరోమ్యస్య సప్తరాత్రేణ సత్వరః || 23

యథాగృహీతం చాంభోదౌ హృత్వా 7 హం ద్వారకాం పునః |

యాదవానుపసంహృత్య యాస్యామి త్రిదశాలయమ్‌ || 24

మనుష్యదేహ ముత్సృజ్య సంకర్షణ సహాయవాన్‌ | ప్రాప్త ఏవాస్మి మంతవ్యో దేవేంద్రేణ తథా సురైః || 25

జరాసంధాదయో యే7న్యే విహతా భారహేతవః | క్షితేస్తేభ్యః సభారో హి యదూనాం సమధీయత || 26

తదేత త్సుమహాభార మవతార్య క్షితే రహమ్‌ | యాస్యా మ్యమరలోకస్య పాలనాయ బ్రవీమి తాన్‌ || 27

వ్యాస ఉవాచ

ఇత్యుక్తో వాసుదేవేన దేవదూతః ప్రణమ్య తమ్‌ | ద్విజాః స దివ్యయా గత్యా దేవరాజాంతికం య¸° || 28

అంతట భగవంతుడిట్లనియె. నీవన్నదంతయు నేనెఱుంగుదును. కాని యాదవులయొక్క క్షయముగూడ నాచే నారంభింపబడినది. ఎవ్వరికిం జంపరాని యాదవులచేగూడ భూమికి బరువనునదితప్పదు. దీని నేడురాత్రులలో సత్వరమ దింపెదను. సముద్రమునకు గొంపోబడిన ద్వారకను దిఱిగికొనివచ్చి యాదవుల నుపసంహరింపజేసి స్వర్గము నలంకరింతును. మానవదేహమువదలి సంకరక్షణునితో నటకువచ్చినాడననియె యింద్రుడు దేవతలును ననుకొనవలసినది. భూభార కారణమైన జరాసంధాదులు హతులైరి. వారివలన వసుధభారము యాదవులపైకెత్తబడినది. ఆయీ భారమును నేనుదింపి యమరలోకపరిపాలనమునకు రాగలను. ఇట్లు వాసుదేవునిచే దెలుపబడి దేవదూత యాయనకు బ్రణమిల్లి దేవయానమున నింద్రుని సన్నిధికేగెను.

భగవానప్యథోత్పాహ న్దివ్యాన్భౌమాంతరిక్షగాన్‌ | దదర్మ ద్వారకాపుర్యాం వినాశాయ దివానిశమ్‌ || 29

తా స్దృష్ట్వా యాదవా నాహ పశ్యధ్వ మతి దారుణాన్‌ | మహోత్పాతశమాయైషాం ప్రభాసం యామమాచిరమ్‌ || 30

మహాభాగవతః ప్రాహ ప్రణి ప్యతో7ద్దవో హరిమ్‌ ||

భగవ స్యన్మయా కార్యం తదాజ్ఞాపయ సాంప్రతమ్‌ | మన్యే కుల మిదం సర్వం భగవా న్సంహరిష్యతి || 31

నాశాయాస్య నిమిత్తాని కుల స్యాచ్యుత లక్షయే || 32

భగవంతుడునప్పుడు దివ్యభౌమాంతరిక్షములైన యుత్పాతములంగని వెంటనే ప్రభాసతీర్థమున కేగుదమనియె. అప్పుడు పరమ భాగవతుడు (భగవద్భక్తుడు) ఉద్ధవుడు ప్రణతుడై హరితో నిట్లనియె. ఇప్పుడునాచేయవలసిన పని సెలవిమ్ము. ఏలినవారిప్పుడు యదుకులమెల్ల నుపసంహరింతురని తోచుచున్నది. యదుకులనాశనము కాగల నిమిత్తములను జూచుచున్నాను. అన భగవంతుడిట్లనియె.

శ్రీభగవాను వాచ

గచ్ఛత్వం దివ్యాయా గత్యా మత్ప్రసాదసముత్థయా | బదరీ మాశ్రమం పుణ్యం గంధమాదన పర్వతే || 33

నరనారాయణస్థానే పవిత్రితమహీతలే | మన్మనా మత్ర్పసాదేన తత్ర సిద్ధి మవాప్స్యసి || 34

అహం స్వర్గం గమిష్యామి ఉపసంహృత్య వైకులమ్‌ | ద్వారకాంచ మయా త్యక్తాం సముద్రః ప్లావయిష్యతి || 35

వ్యాస ఉవాచ

ఇత్యుక్తః ప్రణిపత్యైనం జగామ స తదోద్ధవః | నరనారాయణ స్థానం కేశ##వేనానుమోదితః || 36

ఉద్ధవ!నాప్రసాదముచే నీవుదివ్యగ మనమున గంధమాదన పర్వతమందున్న పుణ్యమగు బదరికాశ్రమమునకు జనుము. మహీతలమంతటిని బవిత్రముసేయు నానరనారాయణస్థానమందు నాపై మనసుంచి నాప్రసాదమున నక్కడ నీవు సిద్ధినందగలవు. నేను కులమెల్ల నుపసంహరించి స్వర్గమునకేగుదును. నేను విడిచినద్వారకను సముద్రుడు ముంచును. అనిపలుక విని ఉద్ధవుడు పదములవ్రాలి నారాయణానుమోదితుడై నరనారాయణస్థానమునకేగెను.

తతస్తే యాదవాః సర్వే రథానారుహ్య శీఘ్రగాన్‌ | ప్రభాసం ప్రయయుః సార్ధం కృష్ణరామాదిభి ర్ద్విజాః || 37

ప్ర్యాప ప్రభాసం ప్రయతా ప్రీతాస్తే కుకురాంధకాః | చక్రు స్తత్ర సురాపానం వాసుదేవానుమోదితాః || 38

పిబతాం తత్ర వై తేషాం సంఘర్షేణ పరస్పరమ్‌ | యాదవానాం తతో జజ్ఞే కలహాగ్నిః క్షయావహః || 39

జఘ్నుః పరస్పరం తేతు శ##స్త్రేర్దేవ బలాత్కృతాః | క్షీణశస్త్రాస్తు జగృహుః ప్రత్యాసన్నామథైరకామ్‌ || 40

ఏరకా తు గృహీతా తై ర్వజ్రభూతేవ లక్ష్యతే | తయా పరస్పరం జఘ్నుః సంప్రహారైః సుదారుణౖః || 41

ప్రద్యుమ్నసాంబప్రముఖాః కృతవర్మా7థ సాత్యకిః | అనిరుద్ధాదయశ్చాన్యే పృథుర్విపృథురేవ చ || 42

చారువర్మా సుచారు శ్చ తథా7క్రూరాదయో ద్విజాః | ఏరకారూపిభిర్వజ్రై స్తే నిజఘ్నుః పరస్పరమ్‌ || 43

అవ్వల నయ్యాదవులందరు శీఘ్రగములైన రథములనెక్కి కృష్ణబలరాములతో ప్రభాసమునకుం జనిరి. కుకు రాంధకులువారు నియమముపూని వాసుదేవునామోదమున సురాపానమొనరించిరి. అట్లు తప్పద్రావినవారికి అన్యోన్య సంఘర్షణమున కలహాగ్నిరేగి యాదవవంశ క్షయహేతువయ్యెను. వారు దైవముచే బలాత్కరింపబడినవారై శస్త్రాస్త్రముల నొండొరులం గొట్టుకొనిరి. శస్త్రములయిపోయి దగ్గరనున్న ఏరకమును (గుంద్రమూలాతృణమును గడ్గిపోచను) బట్టిరి. వారదిపట్టినంత వజ్రమట్లు కనిపించెను. దానితో మిగులదారుణముగ నొకరినొకరు గొట్టుకొనిరి. ప్రద్యుమ్నసాంబాదులు కృతవర్మసాత్యకి అనిరుద్ధాదులు పృధువు విపృధువు చారువర్మ చారువు అక్రూరుడు ఏరకారూపమైన వజ్రములచే గొట్టికొనిరి.

నివారయామాస హరి ర్యాదవాస్తే చ కేశవమ్‌ | సహాయం మేనిరే ప్రాప్తం తే నిజఘ్నుః పరస్పరమ్‌ || 44

కృష్ణొ7పి కుపితస్తేషా మేరకాముష్టిమాదదే | వధాయ తేషాం ముసలం ముష్టిలోహమభూత్తదా || 45

జఘాన తేన నిఃశేషా నాతతతాయిన యాదవాన్‌ | జఘ్నుశ్చ సహసా7భ్యేత్య తథా7న్యేతు పరస్పరమ్‌|| 46

హరివారిని వారుహరిని వారించుకొనిరి. హరి సాయపడవచ్చినాడనుకొని యొండొరుల గొట్టుకొనిరి. కృష్ణుడును కుపితుడై యేరకాతృణపుంజము గుప్పిటబట్టెను. అది యాదవవధకనువైన ముసలము. (గుప్పెడు ఇనుపదుడ్డు)అయ్యెను. ఆతతాయులై దానిచేయాదవులను హరినిశ్శేషముగాగొట్టెను. వారుం ద్వరగవచ్చి నొండొరులం బాదుకొనిరి.

తతశ్చార్ణమధ్యేన జైత్రో7సౌ చక్రిణో రథః | పశ్యతో దారుకస్యా77శు హృతో7శ్వైర్ద్విజసత్తమాః || 47

చక్రం గదా తథా శారఙ్గం తూణౌ శంఖో7సిరేవ చ | ప్రదక్షిణం తతః కృత్వా జగ్ము రాదిత్యవర్త్మనా || 48

క్షణమాత్రేణ వై తత్ర యాదవానామభూ తక్షయః | ఋతే కృష్ణం మహాబాహుం దారుకం చ ద్విజోత్తమాః || 49

చంక్రమ్యమాణౌ తౌ రామం వృక్షమూల కృతాసనమ్‌ | దదృశాతే ముఖా చ్చాస్య నిష్క్రామంతం మహోరగమ్‌|| 50

నిష్క్రమ్య సముఖాత్తస్య మహాభోగో భుజంగమః | ప్రయాత శ్చార్ణవం సిద్ధైః పూజ్యమాన స్తథోరగైః || 51

తమర్ఘ్య మాదాయ తదా జలధిః సంముఖం య¸° | ప్రవివేశ చ తత్తోయం పూజితః పన్నగోత్తమైః || 52

దృష్ట్వా బలస్య నిర్యాణం దారుకం ప్రాహ కేశవః || 53

అటుపై నర్ణవమధ్యమునుండి చక్రాయుధుని జైత్రరధము(జయశీలమైన యరదము) దారుకుడు (సారథి) చూచుచుండగనే ఆశ్వములచే గొంపోబడెను. చక్రము గద(కౌమోదకి)శారఙ్గ(హరివిల్లు) తూణము (అమ్ములపొది) శంఖము(పాంచజన్యము) కత్తి(నందకము) హరికిప్రదక్షిణముసేసి ఆదిత్యమండల మార్గముంబట్టియేగెను. (స్వరాదిత్యే అనుశ్రుతిననుసరించి స్వర్గమాదిత్యమందలమని రహస్యము) ఒక్కక్షణములోనే యట యాదవవంశ క్షయమయ్యెను. మహాశూరులొక్క కృష్ణుడు దారుకుడును (రథసారధి) మిగిలిరి.

ఒక చెట్టు మొదట నాసనమువైచికొని కూర్చుండియున్న బలరామునిదరికిడేకి వారిద్దరునాతని ముఖమునుండి వెడలుచున్న మహాసర్పముం దర్శించిరి. ఆసర్పము పెద్దపడగలతో నాతనిమొగము వెలువడి సిద్ధులు నాగులు పూజింప సముద్రమునకేగెను. సముద్రుడర్ఘ్యముంగొని యెదురేగెను. మహేంద్రులచే బూజితుడై యానీటం బ్రవేశించెను. బలరామ స్వామి నిర్యాణముంగని హరి దారుకునితో నిట్లనియె.

శ్రీభగవాను వాచ

ఇదం సర్వం త్వ మాచక్ష్వ వసుదేవోగ్రసేనయోః | నిర్యాణం బలదేవస్య యాదవానాం తథా క్షయమ్‌ || 54

యోగే స్ధిత్వా7హమప్యేత త్పరిత్యక్ష్యే కళేబరమ్‌ | వాచ్య శ్చ ద్వారకావాసీ జనః సర్వస్తథా77హుకః || 55

యథేమాం నగరీం సర్వాం సముద్రః ప్లావయిష్యతి | తస్మా ద్రథైః సుసజ్జైస్తు ప్రతీక్ష్యో హ్యర్జునాగమః || 56

నస్థేయం ద్వారకామధ్యే నిష్క్రాంతే తత్ర పాండవే | తేనైవ సహ గంతవ్యం యత్ర యాతి స కౌరవః || 57

గత్వా చ బ్రూహి కౌంతేయ మర్జునం వచనం మమ | పాలనీయ స్త్వయా శక్త్యా జనో7యం మత్పరిగ్రహః ||

ఇత్యర్జునేన సహితో ద్వారవత్యాం భవాన్‌ జనమ్‌ | గృహీత్వా యాతు వజ్ర శ్చ యదురాజో భవిష్యతి || 58

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే శ్రీకృష్ణచరితే శ్రీకృష్ణ నిజధామగమననిరూపణం నామ దశాధికద్విశతతమో 7 ధ్యాయః

బలరాముని నిర్యాణము యాదవకులక్షయ మిదియెల్ల నీవు వసుదేవునికి నుగ్రసేనునికిం దెల్పుము. నేనును యోగసమాధి నిలిచి యీకళేబరమును విడిచితినని ద్వారకావాసి జనమునకుంజెప్పుము. ఈద్వారకానగరమును సముద్రుడు ముంచివేయును. అందువలన సిద్ధముగా బూన్పబడిన రథములతో నర్జునుని రాకకెదురుచూడుడు. పాండవుడాతడు నిష్క్రమింపగా ద్వారకామధ్యమందు మీరుండవలదు. అతడెటకేగు నటకాతనితో మీరు నేగవలయు. నీవేగి కుంతీ కుమారుని కర్జునునకు నాచెప్పినమాట చెప్పుము. నాపరిగ్రహము (భార్యావర్గము) నీవు నీశక్తికొలది పాలింపదగినది. అనిపలికి యర్జురునితో గూడి నీవు ద్వారవతియందలి జనముంగొని వెశ్లుదువుగాక! వజ్రుడు యాదవులకు రాజుగాగలడు.

ఇది శ్రీబ్రహ్మపురాణమున శ్రీకృష్ణచరితమందు శ్రీకృష్ణనిజధామగమనము అను రెండువందలపదియవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters