Brahmapuranamu    Chapters   

అథ నవాధికద్విశతతమో7ధ్యాయః

ద్వివిదవానరవధ వర్ణనమ్‌

వ్యాస ఉవాచ

శృణుధ్వం మునయః సర్వే బలస్య బలశాలినః | కృతం యదన్యదేవాభూత్తదపి శ్రూయతాం ద్విజాః || 1

నరకస్యాసురేంద్రస్య దేవపక్షవిరోధినః | సఖా7భవన్మహావీర్యో ద్వివిదో నామ వానరః || 2

వైరానుబంధం బలవా న్స చకార సురా న్ర్పతి |

ద్వివిద ఉవాచ

నరకం హతవాన్కృష్ణో బలదర్పసమన్వితమ్‌ | కరిష్యే సర్వదేవానాం తస్మా దేష ప్రతిక్రియామ్‌ || 3

వ్యాస ఉవాచ

యజ్ఞవిధ్వంసనం కుర్వన్మర్త్యలోకక్షయం తథా | తతో విధ్వంసయామాస యజ్ఞా నజ్ఞానమోహితః || 4

బిభేద సాధుమర్యాదాం క్షయంచక్రే చ దేహినామ్‌ | దదాహ చపలో దేశం పురగ్రామాంతరాణి చ || 5

క్వచిచ్చ పర్వతక్షేపా ద్గ్రామాదీన్సమచూర్ణయత్‌ | శైలానుత్పాట్య తోయేషు ముమో చాంబునిధౌ తథా || 6

పునశ్చార్ణవమధ్యస్థః క్షోభయాస సాగరమ్‌ | తేనాతిక్షోభితశ్చాబ్ధి రుద్వేలో జాయతే ద్విజాః || 7

ప్లావయంస్తీరజా న్గ్రామాన్పురాదీనతివేగవాన్‌ | కామరూపం మహారూపం కృత్వా సస్యా న్యనేశః || 8

లుఠన్భ్రమణసంమర్దః సంచూర్ణయతి వానరః | తేన విప్రకృతం సర్వం జగదేత ద్దురాత్మనా || 9

నిఃస్వాధ్యాయవషట్కారం ద్విజాశ్చా77సీత్సుదుఃఖితమ్‌ |

వ్యాసుడిట్లనియె.

బలరాముని లీల మఱియొకటి వినుడు. నరకాసురునికి మిత్రుడు దేవవిరోధి ద్వివిదుడను వానరుడుండెను. వాడు శత్రువులతో విరోధము వెట్టుకుని నరకుని జంపిన కృష్ణునినిమిత్తముగా దేవతలకు బ్రతిక్రియ సేయుదునని యజ్ఞ ధ్వంసము చేయుచు మర్త్యలోకమునకు హాని సేసెను. సాధువుల మర్యాదలం జెరచెను. జీవులం జంపెను. దేశమును బురములను గ్రామములను గాల్చెను. పర్వతము లెత్తిపడవేసి గ్రామములను గుండగొట్టెను. శైలముల లేపి నీళ్ళలో సముద్రములో బడద్రొబ్బెను. సముద్రమున నిల్చి క్షోభింపజేసెను. దాన వార్ధి పొంగి చెలియలికట్టదాటి దారినున్న పురగ్రామముల ముంచెత్తెను. కోరిన రూపు దాల్చి దూకుచు గంతులిడుచు పంటల నెల్ల విథముల చూర్ణములు సేసెను. వానిచే నీ జగమెల్ల నపకరింపబడి నిస్స్వాధ్యాయ నషట్కారమై దుఃఖించెను.

కదాచిద్రైవతోద్యానే పపౌపానం హలాయుధః || 10

రేవతీ చ మహాభాగా తథైవాన్యా వరస్త్రియః | ఉద్గీయమానో విలసల్లలనామౌళిమధ్యగః || 11

రేమే యదువరశ్రేష్ఠః కేబేర ఇవమందిరే | తతః స వానరో7భ్యేత్య గృహీత్వా సీరిణో హలమ్‌ || 12

ముశలం చ చకారాస్య సంముఖః స విడంబనామ్‌ | తథైవ యోషితాం తాసాం జహాసాభిముఖం కపిః || 13

పానపూర్ణాంశ్చ కరకాం శ్చిక్షేపా77హత్య వైతదా | తతః కోపపరీతాత్మా భర్త్సయామాస తం బలమ్‌ || 14

తథా7పి తమవజ్ఞాయ చక్రే కిలకిలాధ్వనిమ్‌ | తతః సముత్థాయ బలోజగృహే ముశలం రుషా || 15

సో7పి శైలశిలాం భీమాం జగ్రాహ ప్లవగోత్తమః | చిక్షేప చ తాం క్షిప్తాం ముశ##లేన సహస్రధా || 16

బిభేద యాదవశ్రేష్ఠః స పపాత మహీతలే | అపత న్ముశలం చాసౌ సముల్లంఘ్య ప్లవంగమః || 17

వేగేనా77యమ్య రూషేణ బలేనోర స్యతాడయత్‌ | తతో బలేనకోపేన ముష్టినా మూర్ధ్నితాడితః || 18

పపాత రుధిరోద్గారీ ద్వివిదః క్షీణజీవితః పతతా తచ్ఛరీరేణ గిరేః శృంగ మశీర్యత || 19

మునయః శతధా వజ్రివజ్రేణవ హి తాడితమ్‌ | పుష్పవృష్టిం తతోదేవా రామస్యోపరి చిక్షిపుః || 20

ప్రశశంసుస్తదా7భ్యేత్య సాథ్వేతత్తేమహత్కృతమ్‌ | ఆనేన దుష్టకపినా దైత్యపక్షోపకారిణా || 21

జగ వ్నిరాకృతం వీర దిష్ట్యా స క్షయమాగతః || 22

వ్యాస ఉవాచ

ఏవం విధాన్యనేకాని బలదేవస్య ధీమతః | కర్మాణ్యపరిమేయాని శేషస్య ధరణీభృతః || 23

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే బలదేవమాహాత్మ్యే ద్వివిదవానరవధవర్ణనంనామ నవాధికద్విశతతమో7ధ్యాయః

ఒకతరి హలాయుధుడు రైవతోద్యానమున మద్యపానము సేయుచుండెను. ఆయన భార్య రైవతి మఱి కొందరు రమణు లాతని ననుగమించిరి. వారు తన కీర్తిని గానముసేయ నడుమున నిల్చి కుబేరుడట్లు క్రీడించెను. అంతట ద్వివిదవానరుడు వచ్చి యాతని రోకలిని నాగలిం గైకొని యెదుటబడి వినోద మొనరించెను. ఆ తరుణుల యెదుట నిగిలించెను. నిండు కల్లుకుండల గిఱవాటు వెట్టెను. పగుల నడచెను. బలరాము డీసుగొని వానిని బెదరించెను. అయినను వా డతని నవమానించుచు కిలకిల ధ్వని సేసెను. అంతట లేచి హలి రోషముతో రోకలిం బట్టెను. వాడొక వెఱవు గొలుపు రాతిబండ నెత్తి విసరెను. హలి దానిని ఱొకట వేలతునకలు సేసి చిమ్మెను. ఆ కోతి దుమికి మీదబడ బలుడు రోసమున వాని వంచి ఱొమ్మునం గొట్టెను నడినెత్తిం గ్రుద్దెను. అంత ద్వివిదుడు రక్తము గ్రక్కికొని ప్రాణములు పోయి పడిపోయెను. పడుచున్నవాని యొడలున నా కొండశిఖర మో మునులార! వజ్రియొక్క వజ్రమున గొట్టబడినట్లు విరిగి పడెను. దేవతలంతట రామునిపై పూలవాన గురిపించిరి. వచ్చి బాగుబాగు గొప్పవని సేసినాడవని కొనియాడిరి. ఈ చెడ్దకోతి దైత్యుల వైపుపకారముచేయ లోకమును బాధించినాడు. భాగ్యవశమున వీడు నీచే గడతేర్పబడినాడనిరి. ఇట్లవంతమూర్తి విశ్వంభరాధారి బలదేవుని లీల లనంతములు.

ఇది శ్రీ బ్రహ్మపురాణమున బలరామ లీలావర్ణనము ద్వివిధవానరవధ యను రెండువందల తొమ్మిదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters