Brahmapuranamu    Chapters   

అథపంచాధికద్విశతతమో7ధ్యాయః

అనిరుద్ధచరిత్ర వర్ణనమ్‌

వ్యాస ఉవాచ

ప్రద్యుమ్నాద్యా హరేః పుత్రా రుక్మిణ్యాం కథితా ద్విజాః | భన్వాదికాంశ్చ వై పుత్రా స్సత్యభామా వ్యజాయత ||

దీప్తిమంతః ప్రపక్షాద్యా రోహిణ్యాస్తనయా హరేః | బభూవుర్జాంబవత్యాశ్చ సాంబాద్యా బాహుశాలినః || 2

తనయా భద్రవిందాద్యా నాత్నజిత్యాం మహాబలాః | సంగ్రామజిత్ప్రధానాస్తు శైబ్యాయాం చాభవ న్సుతాః || 3

వృకాద్యాస్తు సుతా మాద్రీ గాత్రవత్ప్రముఖాన్సుతాన్‌ | అవాప లక్ష్మణాపుత్రా న్కాళింద్యాశ్చ శ్రుతాదయః || 4

అన్యాసాం చైవ భార్యాణాంసంయుత్సన్నాని చక్రిణః | అష్టాయుతాని పుత్రాణాం సహ్రసాణి శతంతథా || 5

ప్రద్యుమ్నః ప్రముఖస్తేషాం రుక్మిణ్యాస్తు సుతస్తతః | ప్రద్యుమ్నాదనిరుద్ధో7భూ ద్వజ్రస్తస్మాదజాయత || 6

అనిరుద్ధో రణ7రుద్ధో బలేః పౌత్రీంమహాబలః | బాణస్య తనయాముషా ముపయేమే ద్విజోత్తమాః || 7

యత్ర యుద్ధమభూద్ఘోరం హరిశంకరయోర్మహత్‌ | ఛిన్నం సహస్రం బాహూనం యత్ర బాణస్య చక్రిణా || 8

అనిరుద్ధచరిత్ర

వ్యాసుడిట్లనియె. శ్రీకృష్ణునికి రుక్మిణియందు గల్గిన ప్రద్యుమ్నాదులగు పుత్రులం దెల్పితిని. సత్యభామయందు భానువు మొదలగు కుమారులు గల్గిరి. దీప్తిమంతుడు ప్రవక్షుడు మున్నగువారు రోహిణియందు గల్గిన తనయులు. సాంబాదులు జాంబవతి కుదయించిరి. నాగ్నజితియందు భద్రవిందాదులు పుట్టిరి. శైబ్యయందు సంగ్రామజిత్తు మొదలయిన కొడుకులుగల్గిరి. మాద్రికుమారులు వృకాదులు. లక్ష్మణ గాత్రవంతుడు మొదలగువారిం గనెను. కాళిందికి శ్రుతాదు లుదయించిరి. మఱియితర భార్యలందు చక్రికి ఎనిమిదయుతములు నూరువేలును కుమారులు జనించిరి. (అయుతము పదివేలుx8=8000+100000=అనగా ఒకలక్షయెనుబదివేల మంది హరివంశమన్నమాట) అందరిలో రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు మొదటివాడు. అతనివలన నిరుద్దుడుదయించెను. అతనికి వజ్రుడు పుట్టెను. యుద్ధములందు అరుద్ధుడు=నిరోధింపబడనివాడు. కావున అనిరుద్ధుడను పౌరుష నామమునందిన యాతడు బలిపౌత్రిని బాణుని కుమార్తెను ఉషను బెండ్లాడెను. ఆ సందర్భముననే హరిహరులకు ఘోరయుద్ధమై బాణాసురుని వేయిబాహువులు చక్రిచే దెగగొట్టబడినవి.

మునయ ఊచుః

కథం యుద్ధమభూద్బ్రహ్మన్నుషార్ధే హరకృష్ణయోః | కథం క్షయం చ బాణస్య బాహూనాం కృతవాన్హరిః || 9

ఏతత్సర్వం మహాభాగ వక్తుమర్హసి నో7ఖిలమ్‌ | మహత్కౌతూహలం జాతం శ్రోతు మేతాం కథాంశుభామ్‌ || 10

వ్యాస ఉవాచ

ఉషా బాణసుతా విప్రాః పార్వతీం శంభునా సహ| క్రీడంతీ ముపలక్ష్యోచ్చైః స్పృహాం చక్రే తదాస్వయమ్‌ || 11

తతః సకలచిత్తజ్ఞా గౌరీ తా మాహ భామినీమ్‌ ||

గౌర్యువాచ

అల మిత్యనుతాపేన భర్త్రా త్వమంపి రంస్యసే || 13

ఇత్యుక్తా సా తదా చక్రే కదేతి మతిమాత్మనః | కోవా భర్తా మమే త్యేనాం పునరప్యాహ పార్వతీ || 14

పార్వత్యువాచ

వైశాఖే శుక్లద్వాదశ్యాం స్వప్నేయో7భిభవం తవ | కరిష్యతి స తే భర్తా రాజపుత్రి! భవిష్యతి || 15

మునులువిని ఉషానిమిత్తముగనైన యయ్యుద్ధ విశేషముల పూర్తిగ దెల్పుము. వినగుతూహల మగుచున్నదన వ్యాసులిట్లనిరి.

బాణుని కూతురు ఉష శంకరునితో గ్రీడించు పార్వతింగని తనలోదానెంతో ముచ్చట పడెను. అంతగౌరి యందరి డెందముల నెఱింగినది కావునతాపపడకు! నీవునుమగనితో నిట్లేక్రీడింతువు. లెమ్మనియె. అదివిని యాముగ్ధ ఎప్పుడు నామగడెవ్వడన మరల పార్వతి వైశాఖశుక్ల ద్వాదశినాడు కలలో నీకు అభిభవము=తిరస్కారమును (మానభంగమును) జేయేనో యతడో రాచకన్నియ! నీకు భర్తకాగలడనియె.

వ్యాస ఉవాచ

తస్యాం తిథౌ పుమాన్స్వప్నే యథా దేవ్యా ఉదిరితః | తథైవాభిభవం చక్రే రాగం చక్రే చ తత్ర సా ||

తతః ప్రబుద్ధా పురుష మపశ్యంతీ తముత్సుకా || 15

ఉషోవాచ

క్వ గతో7సీతి నిర్లజ్జా ద్విజాశ్చోక్తవతీ సఖీమ్‌ | బాణస్య మంత్రీకుంభాండశ్చిత్రలేఖా తు తత్సుతా || 16

తస్యాః సఖ్యభవత్సా చ ప్రాహ కో7యం త్వయోచ్యతే | యదా లజ్జాకులా నాసై#్య కథయామాస సా సఖీ || 17

తదా విశ్వాసమానీయ సర్వమేషా న్యవేదయత్‌ | విదితాయాం తు తా మాహ పునరూషా యథోదితామ్‌ ||

దేవ్యా తథైవ తత్ప్రాప్తౌ యో7భ్యుపాయః కురుష్వతమ్‌ || 18

వ్యాస ఉవాచ

తతః పటే సురాన్దైత్యా న్గంధర్వాంశ్చ ప్రధానతః | మనుష్యాంశ్చాభిలిఖ్యాసౌ చిత్రలేఖా7ప్యదర యత్‌ || 19

అపాస్య సాతుగంధర్వాం స్తథోరగ సురాసురాన్‌ | మనుష్యేషు దదౌ దృష్టిం తేష్వప్యంధకవృష్ణిషు || 20

కృష్ణరామౌ విలోక్యా77సీ త్సుభ్రూర్లజ్జాయతేక్షణా | ప్రద్యుమ్నదర్మనే వ్రీడాదృష్టిం నిన్యే తతోద్విజాః || 21

దృష్ట్వా7నిరుద్ధం చ తతో లజ్జా క్వాపి నిరాకృతా | సో7యం సో7యం మమేత్యుక్తే తథా సా యోగగామినీ ||

య¸° ద్వారవతీ ముషాం సమాశ్వాస్య తతః సఖీ || 22

ఇతి శ్రీమహాపురాణ అదిబ్రాహ్మే బాణయుద్ధే పంచాధిక ద్విశతతమో7ధ్యాయః

చెలిచిత్రలేఖ మెల్లన లాలించు విశ్వాసము గల్గించినంత ఉషాదేవి గౌరి పలికినది పలికినట్లు చెలికత్తెకుందెలిపి వాని కుపాయముసేయమనియె. అంతట చిత్రలేఖపటమునందు సురలను దైత్యులను గంధర్వులను ప్రధానముగా మనుష్యులను లిఖించి చూపెను. ఆ బాలిక యందఱందలగించి మనుష్యుల చిత్తర్వులందు జూపుంచెను. వారిలోగూడ ఆంధకవృ ష్ణివంశములందు దృష్టిపెట్టెను. అందును కృష్ణుని బలరాముని ంగని సిగ్గుదొలకి కన్నులు విప్పార ప్రద్యుమ్నునింజూడ లజ్జనిండినచూపును బ్రసరింపజేసెను. అవ్వల ననిరుద్ధుంగాంచియు ఆసిగ్గెటువో యెనో అతడే యీతడు నాకని (నాకు కనబడినవాడని బాహ్యార్థము) నాకు గావలసినవాడని చెప్పగా సఖియగు నాచిత్రరేఖ నెచ్చెలినోదార్చి యోగశక్తిచే ద్వారవతికేగెను.

ఇది బ్రహ్మపురాణమున అనిరుద్ధచరిత్రమను రెండువందలఐదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters