Brahmapuranamu    Chapters   

అథ త్ర్యధికద్విశతతమో7ధ్యాయః

అదితికృతా భగవత్త్సుతిః

వ్యాస ఉవాచ

గరుడో వారుణం ఛత్రం తథైవ మణిపర్వతమ్‌ | సభార్యం చ హృషీకేశం లీలయైవ వహ న్య¸° || 1

తతః శంఖ ముపాధ్మాయ స్వర్గద్వారం గతో హరిః | ఉపతస్థు స్తతో దేవాః సార్ఘపాత్రా జనార్దనమ్‌ || 2

స దేవైరర్చతః కృష్ణొ దేవమాతుర్నివేశనమ్‌ | సితాభ్రశిఖరాకారం ప్రవిశ్య దధీశే7దితిమ్‌ || 3

స తాం ప్రణమ్య శ##క్రేణ సహితః కుండలో త్తమే | దదౌనరకనాశం చ శశంసాసై#్య జనార్దనః || 4

తతః ప్రీతా జగన్మాతా ధాతారం జగతాం హరిమ్‌ | తుష్టావా 7దితారవ్యగ్రం కృత్వా తత్ప్రవణం మనః || 5

వ్యసుడిట్లనియె.

గరుత్మంతుడు వరుణు డిచ్చిన ఛత్రమును, మణిపర్వతమును పత్నీ సమేతుడైనహరిని విలాసముగ వహించుచు బయనించెను. స్వర్గద్వారమునకు జేరి హరి శంఖము నొత్తెను. దేవతలు అర్ఘ్యపాత్రముంగొని యెదురు వచ్చిరి. వేల్పులచే బూజింపబడి తెల్లని మేఘమట్లున్నశిఖరములతో నున్న దేవమాతయగు నతిదిగృహముం బ్రవేశించి ఇంద్రునితో గూడ తానామెకు నమస్కరించి మణికుండలము లొసంగి నరకుడు నశించెనని తెల్పెను. జగజ్జనని యదితి సంప్రీతయై జగత్కర్తయగు హరిని మనస్సతనియందు నిలిపి తొట్రువడక ఇట్లు స్తుతించెను.

అదితిరువాచ

నమ స్తే పుండరీకాక్ష భక్తానామభయంకర | సనాతనాత్మ న్భూతాత్మ న్సర్వాత్మన్భూతభావన || 6

పణత ర్మనసో బుద్ధే రింద్రియాణాం గుణాత్మక | సితదీర్ఘాదినిఃశేష కల్పనా పరివర్జిత || 7

జన్మాదిభి రసంస్పృష్ట స్వప్నాదిపరివర్జిత | సంధ్యా రాత్రి రహర్భూమి ర్గగనం వాయురంబు చ || 8

హుతాశనో మనో బుద్ధిర్భూతాదిస్త్వం తథా7చ్యుత | సృష్టి స్థితి వినాశానాం కర్తా కర్తృపతిర్భవాన్‌ || 9

బ్రహ్మవిష్ణు శివాఖ్యాభి రాత్మమూ ర్తిభిరీశ్వరః | మాయాభిరేత ద్వ్యాప్తం తే జగత్థ్సావరజంగమమ్‌ || 10

అనాత్మ న్యాత్మవిజ్ఞానం సా తే మాయా జనార్థన | అహం మమేతి భావో7త్ర యయా సముపజాయతే || 11

సంసారమధ్యే మాయాయా స్తవై తన్నాథ చేష్టతమ్‌ | యైఃస్వధర్మపరై ర్నాథ నరై రారాధితో భవాన్‌ || 12

తే తరంత్యభిలామేతాం మాయా మాత్మవిముక్తయే | బ్రహ్మాద్యాః సకలా దేవా మనుష్యాః పశవ స్తథా || 13

విష్ణుమాయామహావర్తే మోహాంధతమసా77వృతాః | ఆరాధ్య త్వామభీప్సంతే కామానాత్మభవక్షయే || 14

పదే తే పురుషా బద్ధా మాయయా భగవంస్తవ | మయాత్వం పుత్రకామిన్యా వైరిపక్ష క్షయాయ చ || 15

ఆరాధితో న మోక్షాయ మాయావిలసితం హితత్‌ | కౌపీనాచ్ఛాదనప్రాయా వాంఛా కల్పద్రుమాదపి || 16

జాయతే యదపుణ్యానాం సో7పరాధః స్వదోషజః | తత్ప్రసీదాఖిలజగ న్మాయామోహకరావ్యయ || 17

అజ్ఞానం జ్ఞానసద్భావ భూతభూతేశ నాశయ | నమస్తే చక్రహస్తాయ శార్జస్తాయతే నమః || 18

ఏతత్పశ్యామితే రూపం స్థూలచిహ్నోపశోభితమ్‌ | నజానామి పరం యత్తే ప్రసీద పరమేశ్వర || 19

పుండరీకాక్ష! భక్తాభయప్రద! సనాతన స్వరూపా! సర్వభూతభావన! మనోబుద్ధేంద్రియములకు ప్రేరకుడా! హ్రస్వ దీర్ఘాది వికల్పరహిత! జన్మాదిరహిత! స్వప్నాద్యవస్థాత్రయపర్జిత! నీవు సంధ్యాది కాలస్వరూపుడవు. భూమ్యాది పంచభూత స్వరూపుడవు. మనోబుద్ధి చిత్తాహంకారములు నీవే. సృష్ట్యాదిక ర్తవు కర్తలకు పతివి నీవే. మాయాకృతములగు బ్రహ్మాది మూర్తులతో నంతట చరాచరాత్మక జగమెల్ల వ్యాపించియున్నాడవు. అత్మగానిదాని యందు ఆత్మబుద్ధి నీమాయ. దానివలననే యహంకార మమకారములు గల్గును. సంసారమందు ఇదెల్ల నీమాయ యొక్కచేష్టయే. స్వధర్మపరులచే నీవారాధింప బడుదువు. వారే ఈ మాయను తరింతురు. బ్రహ్మాదులు మనుష్యులు పశువులు సకలము విష్ణుమాయ యను నుడిలో పడి మోహమను గాఢాంధకారమున గ్రమ్ముకొనబడుదురు. నిన్నారాధించి యభీష్టములంది భవము తరింతురు. నీ పదము నందుకొందురు. పుత్రకామనచే శతృక్షయము కొరకు నిన్ను నేనారాధించితిని. మోక్షమునకు గాదు. మాయ యొక్క విలాసమిది. ఈ కోరిన కల్పవృక్షమునుండి కూడ గోచిగుడ్డనడుగుట వంటిది. పుణ్యకర్మలు చేయునినవారు ఇట్టిఫలవాంఛచేయుట యను నీ యపరాధము తమకుతాము చేసుకున్నదే. సకల జగన్నాయామోహపరుడవగునో పరాత్పర! నాయెడ ప్రసన్నుడవగుము. కేవల జ్ఞానసత్తాస్వరూపుడవు. నా అజ్ఞానమును నశింపజేయుము. శార్జ చక్రగదాహస్త! నీకు నమహ్కరము. స్థూల చిహ్నములచే శోభిల్లు నీరూపమిదే చూచుచున్నాను. నీ కేవల తత్త్వము నెరుగను. ప్రసన్నుడవగుము.

వ్యాస ఉవాచ

అదిత్యైవం స్తుతో విష్ణుః ప్రహస్యాహ సురారణిమ్‌ ||

శ్రీకృష్ణ ఉవాచ

మాతా దేవి త్వ మస్మాకం ప్రసీద వరదా భవ || 20

అదితిరువాచ

ఏవమస్తు యథేచ్ఛా తే త్వమశేషసురాసురైః | అజయ్యః పురుషవ్యాఘ్ర మర్త్యలోకే భవిష్యసి || 21

వ్యాస ఉవాచ

తతో7నంతరమేవాస్య శక్రాణీ సహితాందితిమ్‌ | సత్యభామా ప్రణమ్యా77హ ప్రసీదేతి పునః పునః || 22

అదితిరువాచ

మత్ప్రాసాదా న్న తే సుభ్రు జారా వై రూప్యమేవ చ | భవిష్యత్యనవద్యాంగి సర్వకామా భవిష్యసి || 23

ఇట్లు విష్ణువు స్తుతింపబడి సురారణిని (దేవమాత) గూర్చి యల్లన నవ్వి యిట్లనియె. (అగ్ని పుట్టుట కాధారము అరణి. అట్లే దేవతల ప్రాదుర్భావమున కాధార మదితి గావున యామెను సురారణి యను వైదికభాషతో చక్కగా వ్యాసులిచ్చట పేర్కొన్నారు.)

దేవీ! మాకు నీవు మాతవు. దయచూపుము. వరప్రదాత్రివి గమ్ము. అని కృష్ణుడు స్తుతింప నీయిష్టమట్లేయగుగాక! సురాసురలకు నీవజయ్యుడవై మనుష్యలోకముననుందువని యదితి యనెను. అటుపై శచీదేవితో గూడినఅదితికి సత్యభామ మ్రొక్కి మాయెడ ప్రసన్నురాలవు గమ్మని మరిమరి కోరెను. అదితియు నా ప్రసాదమున ముదిమి రూప వికృతియు నీకు కలుగదు. సర్వకామసిద్ధినందగలవని దీవించెను.

వ్యాస ఉవాచ

అదిత్యా తు కృతానుజ్ఞో దేవరాజో జనార్దనమ్‌ | యథావత్పూజయామాన బహుమాన పురఃసరమ్‌ || 24

తతో దదర్శ కృష్ణొ7పి సత్యభామాసహాయవాన్‌ | దేవోద్యానాని సర్వాణి నందనాదీని సత్తమాః || 25

దదర్శ చ సుగంధాడ్యం మంజరీపుంజధారిణమ్‌ | శైత్యాహ్లాదకరం దివ్యం తామ్రపల్లవ శోభితమ్‌ || 26

మధ్యమానే7మృతే జాతం జాతరూప సమప్రభమ్‌ | పారిజాతం జగన్నాథః కేశవః కేశి సూదనః || 27

తం దృష్ట్వా ప్రాహ గోవిందం సత్యభామా ద్విజోత్తమాః || 28

సత్యభామోవాచ

కస్మాన్న ద్వారకామేష నీయతే కృష్ణ! పాదపః | యది తే తద్వచః సత్యం సత్యా7త్యర్థం ప్రియేతిమే 29

మద్గృహే నిష్కుటార్ధాయ తదయం నీయతాం తరుః | నమే జాంబవతీ తాదృ గభీష్టన చ రుక్మిణీ || 30

సత్యే! యథా త్వమిత్యుక్తం త్వయా కృష్ణ సకృత్ప్రియమ్‌ | సత్యం తద్యది గోవింద నోపచారకృతం వచః || 31

తదస్తు పారిజాతో7యం మమ గేహవిభూషణమ్‌ | బిభ్రతీ పారాజాతస్య కేశపాశేన మంజరీమ్‌ ||

సపత్నీనామహం మధ్యే శోభేయమితి కామయే ||32

వ్యాస ఉవాచ

ఇత్యుక్తః స ప్రహసై#్యనం పారిజాతం గరుత్మతి | ఆరోపయామాస హరి స్తమూచుర్వనరక్షిణః || 33

అదితి యనుజ్ఞగొని దేవేంద్రుడు హరిని స బహుమానముగ యథావిధి బూజించెను. అవ్వల కృష్ణుడు సత్యభామ వెనుకొన నందనవనము మొదలైన దేవోద్యానవనములన్నింటిని దర్శించెను. మరియు సువాసనల నించు పూలగుత్తులతో చలువలం జిమ్ముచు నెర్రని చివుళ్ళతో నాహ్లాదకరమై యమృత మథనమునందు పుట్టి సువర్ణప్రభ నొప్పు దివ్యమైన పారిజాతమును దర్శించెను. ఆ దివ్యతరురత్నమును గని భామారత్నము సత్యభామ యిట్లనియె. కృష్ణ! యీ దివ్యవృక్షము ద్వారకకు మనమేల గొనిపోరాదు?సత్య నాకెంతెని ప్రియురా లను నీమాట నిజమే యగునేని నాయింటి పెరటిలో నాటుటకు దీనిం గొనిరమ్ము. నీయంతగ ప్రేమపాత్రము జాంబవతి గాదు. రుక్మిణియు గాదు. అని పలుమారులు పలికితివి. ఆ పలుకులు నిజమైనచో నది మాటమాత్రము కాదేని (ఉపచార మాత్రమున నన్నది కాదేని) యీ పారిజాతము నా గృహ భూషణమగుగాక! ఈ పారిజాత కుసుమ మంజరిని నా కొప్పునం దుఱుముకొని సవతులనడుమ నందరికన్న మిన్నగ రాణింపగోరుచున్నానని పలుక కృష్ణుడు నవ్వి పారిజాతము గరుడునిపై కెక్కించెను. అతనింగని నందన వనపాలకు లిట్లనిరి.

వనపాలా ఊచుః

భోశ్శచీ దేవరాజస్య మహిషీ తత్పరిగ్రహమ్‌ | పారిజాతం న గోవింద హర్తుమర్హసి పాదపమ్‌ || 34

శచీవిభూషణార్ధాయ దేవైరమృత మంథనే | ఉత్పాదితో7యం నక్షేమీ గృహీత్వైనం గమిష్యసి || 35

మౌఢ్యాత్ప్రార్ధయసే క్షేమీ గృహీత్వైనం చ కో వ్రజేత్‌ | అవశ్యమస్య దేవేంద్రో వికృతిం కృష్ణ యాస్యతి || 36

వజ్రోద్యతకరం శక్ర మనుయాస్యంతి చామరా| తదలం సకలైర్దేవై ర్విగ్రహేణ తవాచ్యుత ||

విపాకకటు యత్కర్మ న తచ్ఛంసంతి పండితాః || 37

వ్యాస ఉవాచ

ఇత్యు క్తే తై రువాచైతా న్సత్యభామా7తికోపినీ || 38

దేవరాజ పట్టమహిషి శ##చేదేవి. ఆమె సొత్తు పారిజాతము. గోవింద దానిని నీవు కొల్లగొన దగదు. శచీదేవి యలంరారమునకే దేవత లమృత మంథనమున దీని నావిర్భవింప జేసినారు. దానింజేకొని నీవు క్షేమమున నరుగ జాలవు. తెలియక దీనిని గోరెదవు. ఎవడు దీనింగొని పోగలడు? దీనివలన దేవేంద్రుడు వికృతి నందగలడు. (అతని మనసు చెడునని భావము.) వజ్రముం జేబూనిన శక్రుని నమరులు వెంబడింపగలరు. దేవతలందరితోడి విరోధము అచ్యుత!నీకు వలదు. పరిణామమందు కటువైన (చేదైన) పనిని పండితులు మెచ్చరు (పర్యవసానమున దేవ విరోధము కొనితెచ్చు విషమమైన పని యీ పారిజాతాహరణమని భావము) అని వనపాలకులు పలుక ప్రచండకోపమున సత్యభామ యిట్లనియె.

సత్యభామోవాచ

కా శచీ పారిజాతస్య కోవా శక్రః సురాధిపః | సామాన్యః సర్వలోకానాం యద్యేషో7మృత మంథనే || 39

సముత్పన్నః పురా కస్మా దేకో గృహ్ణాతి వాసవః | యథా సురా యథా చేందు ర్యథా శ్రీ ర్వనరక్షిణః || 40

సామాన్యః సర్వలోకస్య పారిజాత స్తథా ద్రుమః | భర్తృ బాహు మహాగర్వా ద్రుణద్ధ్యేన మథో శచీ || 41

తత్కథ్యతాం ద్రుతం గత్వా పౌలోమ్యా పచనం మమ| సత్యభామా వద త్యేవం భర్తృగర్వోద్ధతాక్షరమ్‌ || 42

యది త్వం దయితా భర్తు ర్యది తస్య ప్రియా హ్యసి | మద్భర్తుర్హరతో వృక్షం తత్కారయ నివారణమ్‌ || 43

జానామి తే వతిం శక్రం జానామి త్రిదశేశ్వరమ్‌ | పారిజాతం తథా7ప్యేనం మానుషీ హరయామి తే || 44

వ్యాస ఉవాచ

ఇత్యుక్తా రక్షిణో గత్వా ప్రోచ్చైః ప్రోచు ర్యథోదితమ్‌ | శచీ చోత్సాహయామాస త్రిదశాధిపతిం పతిమ్‌ || 45

పారిజాతమునకు శచి యెవతె? సురాధిపుడు శక్రుడెవరు? ఈ వృక్షమమృతమథనమునందే పుట్టినయెడల యిది సర్వలోకములకు జెందిన సమానమైన యాస్తి. వాసవుడొక్కడే దాని నెందులకు గైకొనును? దేవతలు చంద్రుడు లక్ష్మి సర్వలోకమునకు సామాన్య ధనమైనట్టు పారిజాత వృక్షముc గూడ సామాన్యమే. మగని బాహువుల నండగొని గనిని గర్వాతిశయముచే నిపుడు శచి దీనిని నిరోధించుచున్నది. అందువలన పరుగునcబోయి పౌలోమికీ నా మాటను చెప్పుదు. భర్తృగర్వమున(సౌభాగ్య గర్వమున) నుద్ధతమైన భాషలో సత్యభామ యిట్లు చెప్పుచున్నది. నీవు గనక మగనికి గూర్చుదానవేని యతనికి ప్రియురాల వైన నీ తరువును హరించు నా భర్త నాపింపుము. నీమగని నింద్రు నెరుగుదును. దేవతలకు ప్రభువని యెరుగుదును. అదంతయు నట్లుండ మనుష్యస్త్రీని నేను నా పారిజాతమును గొనిపోయుచున్నానని సత్యభామ పలుక వనపాలకులేగి సత్యభామ చెప్పినది చెప్పినట్లు పెద్దగ ఘోషించుచు శచీదేవికి జెప్పిరి. శచియు దేవాధిపతిని ప్రోత్సహించెను.

తతః సమస్త దేవానాం సైన్యైః పరివృతో హరిమ్‌ | ప్రవృత్తః పారిజాతార్థ మింద్రో యోధయితుంద్విజాః || 46

తతః పరిఘనిస్త్రింశ గదాశూల వరాయుధాః | బభూవుస్త్రిదశాః సజ్జాః శ##క్రే వజ్రకరే స్థితే || 47

తతో నిరీక్ష్య గోవిందో నాగరాజోపరి స్థితమ్‌ | శక్రం దేవపరీవారం యుద్ధాయ సముపస్థితమ్‌ || 48

చకార శంఖనిర్ఘోషం దిశః శ##బ్దేన పూనయన్‌ | ముమోచ చ శరవ్రాతం సహస్రాయుత సంమితమ్‌ || 49

తతో దిశో నభ##శ్చైవ దృష్ట్వా శరశతాచితమ్‌ | ముముచు స్త్రిదశాః సర్వే శస్త్రాణ్య శస్త్రాణ్యనేకశః || 50

ఏకైకమస్త్రం శస్త్రం చ దేవైర్ముక్తం సహస్రధా | చిచ్ఛేద లీలయైవేశో జగతాం మధుసూదనః || 51

పాశం సలిలరాజస్య సమాకృష్యోరగాశనః | చచాల ఖండశః కృత్వా బాల పన్నగదేహవత్‌ || 52

యమేన ప్రహితం దండం గదాప్రక్షేప ఖండితమ్‌ | పృథివ్యాం పాతయామాస భగవాన్దేవకీసుతః || 53

శిబికాం చ ధనేశస్య చక్రేణ తిలశో విభుః | చకార శౌరిరర్కేందూ దృష్టి పాతహతౌజసౌ || 54

నీతో7గ్నిః శతశో బాణౖ ర్ద్రావితా వసవో దిశః | చక్రవిచ్ఛిన్నశూలాగ్రారుద్రాభువి నిపాతితాః || 55

సాధ్యా విశ్యేచ మరుతో గంధర్వాశ్చైవ సాయకైః | శార్గిణా ప్రేషితాః సర్వే వ్యోమ్ని శాల్మలితూలవత్‌ || 56

గరుడశ్చాపి వక్త్రేణ పక్షాభ్యాం చ నఖాంకురైః | భక్షయన్నహనద్దేవా న్దానవాంశ్చ సదా ఖగః || 57

తతః శరసహస్రేణ దేవేంద్ర మధుసూదనౌ | పరస్పరం వవర్షాతే ధారాభిరివ తోయదౌ || 58

ఐరావతేన గరుడో యుయుధే తత్రసంకులే | దేవైః సమేతై ర్యుయుధే శ##క్రేణ చ జనార్దనః || 59

చిన్నేషు శీర్యమాణషు శ##స్త్రేష్వ స్త్రేషు సత్వరమ్‌ | జగ్రాహ వాసవో వజ్రం కృష్ణశ్చక్రం సుదర్శనమ్‌ || 60

తతో హాహాకృతం సర్వం త్రైలోక్యం సచరాచరమ్‌ | వజ్రచక్రధరౌ దృష్ట్వా దేవరాజ జనార్దనౌ || 61

అంతట నెల్ల దేవసేనలు తన్ననుగమింప పారిజాతముకొర కింద్రుడు యుద్ధము సేయింప ప్రవృత్తుడయ్యెను. అవ్వల పరిమ నిస్త్రింశ గదా శూలాద్యాయుధ విశేషములను గొని త్రిదశులింద్రుడు వజ్రాయుధము గొని నిలువ యుద్ధసన్నద్ధులైరి. అంతట గోవిందు డై రావత గజరాజ మందున్న శక్రుని దేవపరివారమును యుద్ధ సన్నద్ధులంగని దిక్కులు పిక్కటిల్ల శంఖ నిర్ఘోష మొనరించెను. వేలు లక్షలుగ బాణములను వదలెను. దిక్కులు నాకాశము బాణములు నిండ దేవతలనేక శస్త్రాస్త్రములను విసరిరి. జగదీశ్వరుడు మధుసూదను డొక్కొక అస్త్రమును శస్త్రమును వేవేలుతున కలగ భేదించెను. వరుణుని పాశము నురగాశనుడు (గతుత్మంతుడు) పాముపిల్ల దేహమనట్లు ఖండఖండముల సేసి ఎగిరెను. భగవంతుడు దేవకీకుమారుడు యముడు వదలిన దండమును గదచే నడచి ఖండించి పొడమింబార వైదెను. ఆ ప్రభువు శైరి కుబేరుని పల్లకిని చక్రముచే నువ్వుగింజంత తునకతునకలు సేసెను. సూర్యచంద్రులకు దేరిపారజూచి తేజోహీనులం గావిందెను. అగ్ని వందలకొలది బాణములకు గురియయ్యెను. వసువులు నలుదిక్కులకు దరుమబడిరి. చక్రాయుధముచే శూలగ్రములు దెగబడరుద్రులు పుడమిపై వడగొట్టబడిరి. శార్‌జ్గ (శారర్‌గ్జమను ధనుస్సును బట్టెడి హరి) సాధ్యులను విశ్యేదేవతలను మరుత్తులను గంధర్వుల నమ్ములచే నాకాశమున బూరుగుపింజల నట్లు ఎగురగొట్టెను. గరుడుడు తుండముతో రెక్కలతో గోటికొనలతో దేవదానవులను దినుచు చంపుచుండెను.

బాణ సహస్రముల నింద్రోపేంద్రులు రెండు మేఘములు వర్షధారల నట్లొండురులపై వర్షించుకొనిరి. సంకుల యుద్ధమున గరుడుడై రావతముతో దేవతలతో నింద్రునితో జనార్ధునుడును బోరిరి. శస్త్రములు నస్త్రములును తెగి విరిగి విడిపోవ సత్త్వరముగ నింద్రుడు వజ్రమును బట్టెను. కృష్ణుడు సుదర్శన చక్రము నెత్తెను. అంత చరాచరమగు ముల్లోకమెల్ల వజ్రచక్రధరులైన యా దేవరాజ జనార్ధనులజూచి హాహాకార మొనరించెను.

క్షిప్తం వజ్రమథేంద్రేణ జగ్రాహ భగవాన్హరిః | నముమోచ తదా చక్రం తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్‌ || 62

ప్రనష్ట వజ్రం దేవేంద్రం గరుడక్షత వాహనమ్‌ | సత్యభామా7బ్రవీద్వాక్యం పలాయన పరాయణమ్‌ || 63

అవ్వల నింద్రుడు విసరిన వజ్రాయుధము జేతంబట్టకొనిశ్రీకృష్ణడు చక్రాయుధముమ మాత్రము వదలక నిలునిలుమని తర్జించెను. వజ్రము గోల్పడి వాహనము గరుడుని దెబ్బతినునంత పలాయన మంత్రము జపింపనున్న శచీవతింగని సత్యభామ యిట్లనియె.

సత్యభామోవాచ

త్రైలోక్యేశ్వర నో యుక్తం శచీభర్తుః పలాయనమ్‌ | పారిజాతస్రగా భోగా త్త్వాముపస్థాస్యతే శచీ || 64

కీదృశం దేవరాజ్యం తే పారిజాత స్రగుజ్జ్వలామ్‌ | అపశ్యతో యథాపూర్వం ప్రణయాభ్యాగతాం శచీమ్‌ || 65

అలం శక్ర ప్రయాసేన న వ్రీడాం యాతు మర్హసి | నీయతాం పారిజాతో7యం దేవాః సంతు గతవ్యథాః || 66

పతిగర్వావలేపేన బహుమానపురః సరమ్‌ | న దదర్శ గృహాయాతా ముపచారేణ మాం శచీ || 67

స్త్రీత్వాదగురుచిత్తాహం స్వభర్తుః శ్లాఘనాపరా| తతః కృతవతీ శక్ర భవతా సహ విగ్రహమ్‌ || 68

తదలం పారిజాతేన పరస్వేన హృతేన వా | రూపేణ యశసాచైవ భ##వేత్త్స్రీ కాన గర్వితా || 69

వ్యాస ఉవాచ

ఇత్యుక్తో వై నివవృతే దేవరాజ స్తయా ద్విజాః | ప్రాహ చై నామలం చండి సఖి!ఖేదాతి విస్తరైః || 70

న చా7పి సర్గ సంహార స్థితి కర్తా7ఖిలస్య యః | జితస్య తేన మే వ్రీడా జాయతే విశ్వరూపిణా || 71

యస్మిన్జగత్సకల మేతదనాదిమధ్యే | యస్మాద్యతశ్చన భవిష్యతి సర్వభూతాత్‌ ||

తేనోద్భవప్రళయ పాలన కారణన | వ్రీడా కథం భవతి దేవి నిరాకృతస్య || 72

సకల భువన మూ ర్తేర్మూర్తిరల్పా సుసూక్ష్మా | విదిత సకల వేదై ర్జాయతే యస్య నాన్యైః ||

తమజమకృత మీశం శాశ్వతం స్వేచ్ఛయైనం | జగదుపకృతి మాద్యం కోవిజేతుం సమర్థః || 73

ఇతి శ్రీమహాపురాణ ఆది బ్రాహ్మే పారిజాత హరణశక్రస్తవ నిరూపణం నామ త్ర్యథికద్విశతతమో7ధ్యాయః

త్రిలోకేశ్వరా! శచీభర్తకు బారిపోవుట యుక్తముగాదు. పారిజాత కుసుమమాలసిగను ముడుచుకొని శచి నిన్ను సేవింపగలదు. పారిజాతమాలచే దేజరిల్లుచు వలపుగొని యేతెంచిన శచిని మునుపటి యట్లు గనని నీదేవ సామ్రాజ్యమే బాటిది.? ఇంద్రా చాలు దాలు సిగ్గువడకుము. దేవతలు పారిజాతము గౌంపోదురుగాక. వారువ్యధపడకుందురుగాక. పతిగర్వమున తానుగర్వముగొని తనఇంతటికివచ్చిననన్నుశచి బహుమానముగజూడలేదు. స్త్రీనగుటవలనఉదారమైనమనస్సు లేనిదానవై నాభర్తను మెన్చుకొనుటయే పనిగా నో యింద్రా! నీతోతగవు బెట్టుకొంటిని చాలు పరులసొత్తుతో దొంగిలుటతో పారిజాతముతో బనిలేదు. రూపమునకు కీర్తికి నేమాడుది గర్వింపదు? అనిపలుక నింద్రుడు సంరంభముడిగి ఓసఖి చండి(తీవ్రకోపమున) మిగుల ఖేదపడవలదు. సృష్టిస్థితి సంహారక ర్తయగు విశ్వస్వరూపునిచే నోడుటకు నేనుసిగ్గుపడను. ఎవనియందీ జగమెల్లనున్నదో కల్గుచున్నదో లయించుచున్నదో యట్టిప్రభువుచేతనోడిన వానికి సిగ్గేలకల్గును. సకలభువన స్వరూపుడగు నాయన సూక్ష్మాతిసూక్ష్మస్వరూపము సకలవేదవధులచే నెరుగబడునది ఆన్యులచే నెరుగబడుటెట్లు? అట్టియజుని, నీశ్వరుని శాశ్వతుని తనంతటతాను జగదుపకారము సేయుమొట్టమొదటివానినెవ్వడు జయింపసమర్థుడు?

ఇది బ్రహ్మపురాణమున పారిజాతాపహరణమందు ఇంద్రకృతకృష్ణస్తుతియను రెండువందలమూడవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters