Brahmapuranamu    Chapters   

అథ వింశో7ధ్యాయః

జంబూద్వీపవర్ణనమ్‌

లోమహర్షణ ఉవాచ -

క్షరోదేన యథా ద్వీపో జంబూసంజ్ఞో7 భివేష్టితః | సంవేష్ట్య క్షార ముదధిం ప్లక్షద్వీప స్తథా స్థితః || 1

జంబూద్వీపస్య విస్తారః శతసాహస్రస్శమితః | స ఏవ ద్విగుణొ విప్రా ప్లక్ష ద్వీపే7ప్యుదాహృతః || 2

సప్త మేధాతిథేః పుత్రాః ప్లక్షద్వీపేశ్వరస్యవై | శ్రేష్ఠః శాంతమయో నామ శిశిర స్తదనంతరమ్‌ః || 3

సుఖోదయ స్తథా77నందః శివః క్షేమక ఏవ చ| ధ్రువశ్చ సప్తమ స్తేషాం ప్లక్ష ద్వీపేశ్వరా హి తే || 4

పూర్వం శాంతభయం వర్షం శిశిరం సుఖదం తథా | ఆనందం చ శివం చైవ క్షేమకం ధ్రువమేవ చ || 5

మర్యాదాకారకా స్తేషాం తథా7న్యే వర్ష పర్వతాః | సపై#్తవ తేషాం నామాని శృణుధ్వల ముని సత్తమాః || 6

గోమేదశ్చైవ చంద్రశ్చ నారదో దుందుభి స్తథా | సోమకః సుమనాః శైలో వై భ్రాజశ్చైవ సప్తమః || 7

సూతుండిట్లనియె-

క్షీరసముద్రముచే జంబూద్వీపము చుట్టబడినట్లు ప్లక్షద్వీపము లవణోదధిచే పరవృతమై యున్నది. జంబూద్వీప విస్తృతి లక్ష యోజనములు, దానికి రెట్టింపు ప్లక్షద్వీపము. ప్లక్షద్వీపేశ్వరుడు మేధాతిది. వానికుమారులేడ్వురు. శాంతమయుడు(జ్యేష్ఠుడు) శిశిరుడు-సుఖోదయిడు-ఆనందుడు-శివుడు-క్షేమకుడు-ధ్రువుడు. వారీ ద్వీపము నేలినవారు. వారిపేర మఠ్యాదా(హద్దు)కౌరవ పర్వతము లేడు గలవు. అట్లే వర్షపర్వతములు మఱి యేడుగలవు. మునులాఠా! వాని పేర్లు వినుడు. గోమోదము-చంద్రము నరదము-దుందుభి-సోమకము-సుమనస్సు-వైభ్రాజము అనునవి.

వర్షాచలేషు రమ్యేషు వర్షేష్వే తేషు చానఘాః | వసంతి దేవగంధర్వ సహితాః నహితం ప్రజాః || 8

తేషు పుణ్యా జనపదా వీరా న మ్రియతే జనః | నా7ధయో వ్యాధయో వాపి సర్వకాలసుఖం హితత్‌ || 9

తేషాం నద్యశ్చ సపై#్త వవర్షాణాం తు సముద్రగాః | నామత స్తాః ప్రవక్ష్యామి శ్రుతాః పాపం హరంతి యాః || 10

అనుతప్తా శిఖాచై వ విప్రాశా త్రిదివా క్రముః | అమృతా సుకృతా చై వ నపై#్తతాస్తత్ర నిమ్నగాః || 11

ఏతే శైలా స్తథా నద్యః ప్రధానాః కథితా ద్విజాః | క్షుద్ర నద్యస్తథా శైలా స్తత్ర సంతి సహస్రశః || 12

తాః పిబంతి సదా హృష్టా నదీ ర్జనపదాస్తు తే | అవసర్పిణీ నదీ తేషాం న దై వోత్సర్పిణీ ద్విజాః || 13

పుణ్యాత్ములారా! రమ్యములగు నీవర్షపర్వతములందును, వర్షములందును ప్రజలు దేవగంధర్వులతో గూడి వసింతురు. అందలి దేశములు పవిత్రములు. వీర్యవంతములు. ఆందుజనులు మృతినందరు. అధివ్యాధులు లేక సర్వకాలము సుఖముందురు. అందు నదులు గూడ ఏడే. సముద్రగాములు. వానిపేర్లు ఆనుతప్త-శిఖ-విప్రాశ-త్రిదివ-క్రము-అమృత-సుకృత అనునవి. వినినంతనే పాపములు హరించునవి. ప్రధానములైన నదులు, పర్వతములు పేర్కొనబడినవి. చిన్నచిన్న నదులు పర్వతములు వేలకొలది గలవు. ఆచటివారు ఎప్పుడును ఆనదీ జలములనే త్రాగుచుందురు. కాని నదులు తగ్గవు పెరుగవు.

న తేష్వస్తి యుగావస్థా తేషు స్థానేషు నప్తసు | త్రేతాయుగసమః కాలః సర్వదైవ ద్విజో త్తమాః || 14

ప్లక్షద్వీపాదికే విప్రాః శాక ద్విపాంతికేషు వై | వంచవర్షసహస్రాణి జనా జీవం త్యనామయాః || 15

ధర్మ శ్చతుర్విదస్తేషు వర్ణాశ్రమవిబాగజః | వర్ణాశ్చ తత్ర చత్వార స్తా న్బుధాః ప్రవదామి వః || 16

ఆప్రదేశములేడింటియందును యుగ వ్యవస్థలేదు. ఎల్లప్పడు త్రేతాయుగ సమముగనే కాలము నడచును. ప్లక్షద్వీపము మొదలు శాకద్వీపము దనుక జనులు అయిదువేలేండ్లాయువు గల్గి నీరోగులయి యుందురు,వర్ణాశ్రమవిభాగానుసార మక్కడ ధర్మము నాల్గు విదములుగ నుండును. అక్కడ వర్ణములు నాలుగు. వానిని మీకు చెప్పుచున్నాను వినుడు.

అర్యకాః కురవశ్చైవ వివిశ్వా భావినశ్ఛ యే | విప్రక్షత్రియ వైశ్యాస్తే శూద్రాశ్చ ముని సత్తమాః || 17

ఆర్యకులు-కురువులు-వివిళ్వులు-భావులు ననుపేర విప్రక్షత్రియ వైశ్యశూద్రూలు అను నాలుగు వర్ణముల వారుందురు.

జంబూవృక్షప్రమాణస్తు తన్మధ్యే సుమహాతరుః| ప్లక్ష స్తన్నామ సంజ్ఞో7యం ప్లక్షద్వీపో ద్విజోత్తమాః|| 18

ఇజ్యతే వాత్ర భగచాం సై#్తర్వ ర్ణై రార్యకాదిభిః | సోమరూపీ జగత్ర్సష్టా సర్వః సర్వేశ్వరో హరిః || 19

ప్లక్షద్వీపప్రమాణన ప్లక్ష ద్వీపః సమావృతః | తధై వేక్షురసోదేన పరివేషానుకారిణాః || 20

ఇత్యేత ద్వో ముని శ్రేష్ఠాః ప్లక్ష ద్వీప ఉదాహృతః|సంక్షే పేణ మయా భూయః శాల్మలం తం నిబోధత || 21

జంబూద్వీపమున జంబువృక్షమున్నట్లు అంతపరిమాణముగల జువ్విచెట్టు ప్లక్షద్వీపమధ్యమందున్నది. అందుచే దానికా పేఠు గల్గినది, అందు ఆర్యకాదివర్ణముల వారిచే జగత్కర్తయు సర్వేశ్వరుడును సోమరూపియు నగు నాహరిఆరాధింపబడును, ప్లక్షధ్వీప ప్రమాణముగల ఇక్షు (చెఱకురసము) సముద్రముచే ప్లక్షద్వీపమావరింపబడి యున్నది. మునులారా! ఇట్లు మీకు ప్లక్షద్వీపము సంగ్రహముగ వర్ణించితిని. ఇక నాచే శాల్మలద్వీపమును గూర్చి తెలిసికొనుడు...

శాల్మల స్యేశ్వరో వీరో వఫుష్మాం స్తత్సుతా ద్విజాః | తేషాంతు నామసంజ్ఞాని స ప్తవర్షాని తానివై || 22

శ్వేతో7థ హరితశ్చైవ జీమూతో రోహిత స్తథా | వైద్యుతో మానసశ్చైవ సుప్రభశ్చ ద్విజోత్తమాః || 23

శాల్మలశ్చ సముద్రో7సౌ ద్వీపే నేక్షురసోదకః | విస్తారః ద్విగుణనాథ సర్వతః సంవృతః స్థితః || 24

తత్రాపి పర్వతా! సప్త విజ్ఞేయా రత్నయోనయః | వర్షాభివ్యంజకాస్తే తు తథా సపై#్తవ నిమ్నగాః|| 25

కుముద శ్చోన్నత శ్చైవ తృతీయస్తు బలాహకః | ద్రోణొ యత్ర మహౌషద్యః స చతుర్ధో మహీధరః || 26

కంకస్తు పంచమ ష్టష్ఠో మహిషః స స్తమ స్తధా | కకుద్మా న్పర్వతరః సరిన్నామాన్యతో ద్విజాః || 27

శ్రోణీ తోయా వితృష్ణా చ చంద్రా శుక్రా విమోచనీ | నివృత్తి; సప్తమీ తాసాం స్మృతాస్తాః పాపశాంతిదాః || 28

ఇక శాల్మలద్వీపము:- దీనికి వీరుడైన వువష్మంతు డధీశ్వరుడు. వాని కుమారుల నామములతో శ్వేతము, హరితము, జీమూతము' రోహితము, వైద్యుతము, మానసము, సుప్రభమునను పర్షపర్వతములేడును ప్రసిద్ధములు. శాల్మలద్వీపము ఇక్షు రససముద్రముచే పరివేష్టితము. ఈద్వీపము ప్లక్షద్వీపమునకు రెట్టింపు ప్రమాణము గలది. అక్కడ రత్నగర్భములైన సప్తకులాచలములు సప్తనదులు గలవు. అందు కుముదము, ఉన్నతము, వలాహకము, ద్రోణము. కంకము, మహిషము, కకుద్మంతము అను పర్వతములున్నవి. ద్రోణగిరి యందు మహౌషధు లుండును, ఇందలి నదులు:- శ్రోణి-తోయ-వితృష్టా-చంద్ర శుక్ర-విమోచని-నివృత్తి అనునవి. అవి స్మరణమాత్రాన పాపముల హరించును.

శ్వేతం చ లోహితం చైవ జీమూతం హరితం తథా | వైద్యుతం మానసం చై వనుప్రభం నామ సప్తమమ్‌ః||29

సపెతాని తు వర్షాణి చాతుర్వర్ణ్యయుతాని చ వర్ణాశ్చ శాల్మలే యే చ వసంత్యేషు ద్విజోత్తమాః || 30

కపిలాశ్చారుణాః పీతాః కృష్ణాశ్చైవ పృథక్పధక్‌| బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చైవ యజంతి తమ్‌ః||

భగవంతం సమస్తస్య విష్ణు మత్మాన మవ్యయమ్‌ | వాయుభూతం మఖశ్రేష్ఠై ర్యజ్వానో యజ్ఞసంస్థితమ్‌ః|| 32

దేవానామత్ర సాన్నిధ్య మతీవ సుమనోహరే | శాల్మలిశ్చ మహావృక్షో నామ నిర్వృత్తికారకః || 33

ఏష ద్వీపః సముద్రేణ సురోదేన సమావృతః | విస్తారా చ్ఛాల్మలేశ్చైవ సమేన తు సమంతతః || 34

సురోదకః పరివృతః కుశద్వీపేన పర్వతః | శాల్మలస్య తు విస్తారా ద్ద్విగుణన సమంతతః || 35

ఇందలివర్షములు శ్వేతము-లోహితము-జీమూతము-హరితము-వైద్యుతము-మానసము-సుప్రభము ననునవి. ఇందు చాత్యుర్వర్ణవ్యవస్థ యున్నది, కపిల=తేనెరంగు అరుణ=ఎఱుపు పీత = పసువు కృష్ణము=నలుపు అను రంగులు గల్గి క్రమముగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములవారిందు నివసింతురు. ఇచట యాగకర్తల కుపాస్యదైవము విష్ణువు. యజ్ఞమందు వాయు స్వరూపునిగ నా దైవమును యజ్వలు సేవింతురు. అతి మనోహరమైన యీ ద్వీపమందు దేవతలు సన్నిధి సేసియుందురు. శాల్మల వృక్షముండుటచే నీద్వీపమునకు శాల్మలద్వీపమని పేరు. కుశద్వీపము చుట్టును నురాసముద్రమున్నది. అదిశాల్మలద్వీపమునకు రెట్టింపు విస్తారము గలది.

జ్యోతిస్మతః కుశద్వీపే శృణుధ్వం తస్య పుత్రకాన్‌ | ఉద్భిదో వేణుమాంశ్ఛైవ సై#్వరధో రంధనో ధృతిః|| 36

ప్రభాకరో7థ కపిల స్తన్నామ్నా వర్ష పద్ధతిః | తస్యాం వసంతి మనుజై ః సహ దైతేయ దానవాః || 37

తథైవ దేవగంధర్వా యక్షకింపురుషాదయః | వర్ణా స్తత్రాపి చత్వారో నిజానుష్ఠానతత్పరాః || 38

దమినః శుష్మిణః స్నేహా మాందహాశ్చ ద్యిజో త్తమాః|బ్రాహ్మణాఃక్షత్రియావై శ్యాఃశూద్రాశ్ఛాను క్రమోదితాః ||

యథో క్తకర్మక ర్తృత్వా త్స్యాధికారక్షయాయ తే | తత్ర తే తు కుశద్వీపే బ్రహ్మరూపం జనార్దనమ్‌ః || 40

యజంతః క్షపయం త్యుగ్ర మధికారఫలప్రదమ్‌|విద్రుమో హేమశై లశ్చ ద్యుతిమా న్పుష్టిమాం స్తథా || 41

కుశేశయో హరిశ్చైవ స ప్తమో మందరాచలః | వర్షాచలాస్తు సపై#్తతే ద్వీపే తత్ర ద్విజో

త్తమాః || 42

ఇందు ఠాజైన జ్యోతిష్మంతుని కుమారులు:- ఉద్భిదుడు-వేణుమంతుడు-సై#్వరధుడు-రంధనుడు-ధృతి-ప్రభాకరుడు-కపిలుడు అసువారి పేరులతో వర్షములునున్నవి. ఇందు మనుజులతోబాటు దైత్య దానవ దేవ గంధర్న యక్ష కింపురుషులును వసింతురు. ఇక్కడ స్వధర్మానుష్ఠాన పరులయిన బ్రహ్మణాదిచతుర్వర్ణప్రజలు వరునగా దములు, శుష్మిణులు, స్నేహులు, మాందహులు ననుపేర నుందురు. అక్కడ పరబ్రహ్మరూపుడు జనార్ధను డారాధ్యదైవము. అచట జనులు జనార్దను గూర్చి యజ్ఞములు సేసి ఆదికారిక పురుఘలుగా నవతరింపవలసిన పురాకృతపుణ్యకర్మఫలమును క్షయింప జేసికొందురు. అనగా కేవల నైష్కర్మ్య విషయమయిన ముక్తిసే కోరుదురని తాత్పర్యము. విద్రుమము-హేమశైలము-ద్యుతిమంతము-పుష్టి మంతము-కుశేశయము-హరి మందరము ననునవియచ్చట వర్షపర్వతము లేడు.

నద్యశ్చ సప్త తాసాం తు వక్ష్యే నామా న్యనుక్రమాత్‌ | ధూతపాపా శివాచైవ పవిత్రా సమ్మతి స్తథాః 43

విద్యుదంభో మహీ చాస్య సర్వపాపహరా స్త్విమాః | అన్యాః సహస్రశ స్తత్ర క్షుద్రనద్యః స్తథా7చలాః|| 44

కుశద్విపే కుశస్తంబః సంజ్ఞయా తత్స్మృతం తతః | తత్ర్పమాణన స ద్వీపో ఘృతొదేన సమావృతః || 45

ఘృతోదశ్చ సముద్రో వై క్రౌంచద్వీపేన సంవృతః|క్రౌంచద్వీపో మునిశ్రేష్ఠాఃశ్రూయతాంచాపరో మహాన్‌ ||

ధూతపావ, శివ, పవిత్ర, సమ్మతి, విద్యుదంభస్సు, మహీ యనునవి మరికొన్ని చిన్నచిన్న యేరులు వేలకొలది సర్వపాపహరము లైన వక్కడ నున్నవి. కుశద్వీపమధ్యమున కుశస్థంబమున్నది. అందుచే దాని కాపేరు గల్గినది. ఘృత సముద్రము క్రౌంచద్వీపముచే నాపృతమయి యటనున్నది,

కుశద్వీపస్య విస్తారా ద్ద్వగుణో యస్య విస్తరః | క్రౌంచద్వీపే ద్యుతిమతః పుత్రా స ప్త మహాత్మనః || 47

తన్నామాని చ వర్షాణి తేషాం చక్రే మహామనాః | కుశగో మందగ శ్చోష్ణః పీవరో7థాంధకారకః || 48

ముని శ్చ దుందుభిశ్చైవ సపైతే తత్సుతా ద్విజాః | తత్రాపి దేవగంధర్వసేవితాః సుమనోరమాః || 49

వర్షాచలా మునిశ్రేష్ఠా స్తేషాం నామాని భో ద్విజాః | క్రౌంచశ్చ వామనశ్చైవ తృతీయ శ్చాంధకారకః || 50

దేవవ్రతో ధమశ్చైవ తథా7న్యః పుండరీకవా న్‌ దుందుభిశ్చ మమాశై లో ద్విగుణాస్తే పరస్పరమ్‌ || 51

ద్వీపా ద్వీపేఘ యే శై లా స్తథా ద్వీపాని తే తథా | వర్షాష్వేతేషు రమ్యేషు వర్ష శైలవరేషు చ || 52

నివసంతి నిరాతంకాః సహ దేవగణౖః ప్రజాః | పుష్కలాః పుష్కరా ధన్యా స్తే ఖ్యాతాశ్చ ద్విజో త్తమాః|| 53

బ్రహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చానుక్రమోదితాః|తత్ర నద్యో మునిశ్రేష్ఠా యాః పిబంతి తు తే సదాః ||

సప్త ప్రధానాః శతశ స్తథా7న్యాః క్షుద్రనిమ్నగాః | గౌరీ కుముద్వతీ చైవ సంధ్యా రాత్రి ర్మనోజవా || 55

ఖ్యాతిశ్చ పుండరీకా చ సపై#్తతా వర్షనిమ్నగా | తత్రాపి వర్ణై ర్భగవా స్పుష్కరాద్యై ర్జనార్దనః || 56

ధ్యానయోగే రుద్రరూప ఇజ్యతే యజ్ఞసన్నిధౌ | క్రౌంచద్వీపః సముద్రేణ దధిమండోదకేనతు || 57

ఆవృతః సర్వతః క్రౌంచద్వీపతుల్యేన మానతః | దధిమండోదకశ్చాపి శాకద్వీపేన సంవృతః || 58

క్రౌంచద్వీపస్య విస్తారద్విగుణన ద్విజో త్తమాః |

ఇక క్రౌంచ ద్వీపము కుశద్వీపము కంటె రెట్టింపువిరివి గలది. ఇచట ద్యుతిమంతుని కుమారు లేడుగురు, పరిపాలకులు. కుశగుడు-మందగుడు-ఉష్ణుడు-పీవరుడు-అంధకారకుడు-ముని-దుందుభి యనువారు. దేవగంధర్వనిషేవితములు రమ్యములు నైన వర్షపర్వతము లిందున్నవి. అవి క్రౌంచము, వామనము, అంధకారకము. దేపవ్రతము, ధమము, పుండరీక వంతము, దుందుభి అనునవి యొకదానికంటెనొకటి రెట్టింపు ప్రమాణము గలవి. ఇక్కడ దేవగణములతోగూడి పుష్కరులు పుష్కలులు ననువారు ధన్యులై చరింతురు. బ్రహ్మణాదిచతుర్వర్ణములు నిందుగలవు. ఇందు ప్రధాననదులేడు. గౌరి-కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజప, ఖ్యాతి, పుండరీక యనునవి. అక్కడ పుష్కరాదులచే ధ్యానయోగమున యజ్ఞమందు రుద్రరూపుడైన జనార్దను డారాధింపబడును. ఇది మీగడసముద్రముచే ఆవృతము. ఆది యాధ్వీపపరిమాణము గలది. దానిచుట్టును శాకద్వీపమున్నది.

శాకధ్వీపేశ్వర స్యాపి భవ్యస్య సుమహాత్మనః | సపై#్తవ తనయా స్తేషాం దదౌ వర్షాణి సప్త సః || 59

జలదశ్చ కుమారశ్చ సుకుమారో మనీకః || 60

కుసమోదశ్చ మోదాకిః సప్తమశ్చ మహాద్రుమః | తత్సంజ్ఞాస్యేవ తత్రాపి సప్తవర్షా ణ్యను క్రమాత్‌ || 61

తత్రాపి పర్వతాః సప్త వర్షవిచ్ఛేదకారకాః | పూర్వ స్తత్రోదయగిరి ర్జలధార స్తథా7పరః || 62

తదా రైవతకః శ్యామ స్తథై వాంభోగిరి ర్ద్విజాః | ఆస్తి కేయ స్తథా రమ్యః కేసరీ పర్వతోత్తమః || 63

శాక శ్చత్ర మహావృక్షః సిద్ధగంధర్వ సేవితః | యత్పత్రవాత సంస్పర్శా దాహ్లాదో జాయతే పరః || 64

తత్ర పుణ్యా జనపదా శ్చాతుర్వర్ణ్య సమన్వితాః | నివసంతి మహాత్మానో నిరాతంకా నిరామయాః || 65

నద్యశ్చాత్ర మహాపుణ్యా స్సర్వ పాపభయాపహాః | సుకుమారీ కుమారీ చ నళీనీ రేణుకా చ యా || 66

ఇక్షుశ్ఛ ధేనుకాచైవ గభస్తిః స ప్తమీ తథా | అన్యాశ్చ శతశ స్తత్ర క్షుద్రనద్యో ద్విజోత్తమాః || 67

మహీధరా స్తథా సంతి శతశో7థ సహస్రశః | తాః పిబంతి ముదా యుక్తా జలదాదిషు యే స్థితాః || 68

వర్షేషు యే జనవదా శ్చతుర్ధార్థ సమన్వితాః | నద్యశ్చాత్ర మమాపుణ్యాః స్వర్గాదభ్యేత్య మేదినీమ్‌ | 69

ధర్మహాని ర్న తేష్వస్తి న సంహర్షో న శుక్తథా | మర్యాదా వ్యుత్క్రమో నాపి తేష్తు దేశేషు స ప్తసు || 70

మగాశ్చ మాగదాశ్చైవ మానసా మందగా స్తథా | మగా బ్రామ్మణభూయిష్ఠా మాగధాః క్షత్రియాస్తు తే || 71

వైశ్యాస్తు మానసా స్తేషాం శూద్రా జ్ఞేయాస్తు మందగాః | శాకద్వీపే స్తితై ర్విష్ణుః సూర్యరూపధరో హరిః|| 72

యథోక్తై రిజ్యతే సమ్య క్కర్మభి ర్నియతాత్మభిః |

శాకద్వీపపతియైన భవ్యునికి జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మనీరకుడు, కుశమోదుడు, మోదాకి, మహాద్రుముడు నను పుత్రులు గలరు. అందలి వర్షములు వారిపేర నున్నవి. అందేడువర్షపర్వతములు ఉదయగిరి-జలధార=రైవతకము శ్యామము-అంభోగిరి-ఆస్తికేయము-కేసరి యనునవి. సిద్దగంధర్వసేవితమై యిచట శాకమను(టీకుగాని కడిమిగాని)మహావృక్ష మున్నది. దాని యాకుల గాలితాకినచో పరమాహ్లాదము గల్గును. అక్కడపవిత్రములయినచతుర్వర్ణప్రజలతోగూడిన జనపదములు గలవు. ఆచటి జనులు నిరాతంకులు ఏ అభ్యంతరములు లేనివారు నీరోగులు. నదులు మహాపుణ్యములు. పాపభయహరములు. సుకుమారి-కుమారి-నళిని-రేణుక-ఇక్షువు-ధేనుక-గభస్తి అనునవి యేడు చిన్నచిన్నయేరులు, గిరులు వేలున్నవి. జలదాది గిరులపై వసించు జను లానదీసలిలములను ద్రావుదురు. ఈనదులు స్వర్గమునుండి వచ్చినవి. అచటి ప్రజలలో ధర్మహాని సుఖదుఃఖములు, శాస్త్రముహద్దుమీరినడచుటఅనునవిలేవు. మగులు మాగధులు మానసులు మందగులు ననుపేర బ్రాహ్మణాదిచతుర్వర్ణప్రజ లచట నివసింతురు. శాకద్వీపవాసులకులదైవము విష్ణువు, సూర్యరూపుడుగా యథావిధి శ్రీహరి యీ ప్రజలచే నర్చింపబడును.

శాకద్వీప స్తతో విప్రాః క్షీరోదేన సమంతతః | శాకద్వీపప్రమాణన వలయేనేవ వేష్టితః || 73

క్షీరాబ్ధిః సర్వతో విప్రాః పుష్కరాఖ్యేన వేష్టితః || 74

ద్వీపేన శాక ద్వీపాత్తు ద్విగుణన సమంతతః | పుష్కరే సవనస్యాపి మహావీతో7భవత్సుతః || 75

ధాతకిశ్చ తయో స్త్వద్వ ద్ద్యే వర్షేనామసంజ్ఞితే | మహావీతం తథైవాన్య ద్ధాతకీఖండసంజ్ఞితమ్‌ || 76

ఏకశ్చాత్ర మహాభాగాః ప్రఖ్యాతో వర్షపర్వతః | మానసోత్తరసంజ్ఞోవై మధ్యతో వలయాకృతిః || 77

యోజనానాం సమస్రాణి ఊర్ధ్వం పంచాశ దుచ్ఛ్రితః | తావదేవ చ విస్తీర్ణః సర్వతః పరిమండల || 78

పుష్కరద్వీపవలయం మధ్యేన విభజన్నివ | స్థితో7సౌ తేన విచ్ఛిన్నం జాతం పర్షద్వయం హి తత్‌ || 79

వలయాకారమే కైకం తయో ర్మధ్యే మహాగిరిః | దశవర్ష సహస్రాణి తత్ర జీవంతి మానవాః || 80

శాకద్వీపము అదే ప్రమాణముగల క్షీరాభ్దిచే నావరింపబడియున్నది. క్షీరాభ్ది పుష్కరద్వీప సమావృతము, శాకద్వీపము కంటె రెట్టింపు ప్రమాణము కలది పుష్కరము.

పుష్కరద్వీపమందు సవనుని కుమారులు మమావీతుడు, ధాతకి యనువారు. వారిపేర పర్షములు రెండు. ఇక్కడ వర్ష పర్వతము మానసోత్తరమనునదొక్కటియే. అది యీద్వీపము నడుమ వలయాకారముననున్నది. ఏబదివేలయోజనముల యెత్తు, అంతే వెడల్పు గలది. అది పుష్కరద్వీపమండలమునునడిమికి రెండు భాగములు సేయుచున్నట్లున్నది. దాని మూలమునే యీ ద్వీపము రెండువర్షములుగా విభక్తమైనది. అవి వలయాకారములు. వాని నడుమ పెద్ద గిరి కలదు. అచటి జనులు పదివేలెండ్లు జీవింతురు.

నిరామయా విశోకాశ్చ రాగద్వేషవివర్జితాః | అధమో త్తమౌ న తే ష్వాస్తాం న వధ్యవధకౌ ద్విజాః || 81

నేర్ష్యా7సూయా భయం రోషో దోషో లోభాదికం నచ | మహావీతం బహి ర్వర్షం ధాతకీఖండ షుంతతః || 82

మానసోత్తరశైలస్య దేవ దైత్యాది సేవితమ్‌ | సత్యానృతే న తత్రా77స్తాం ద్వేపే పుష్కర సంజ్ఞితే || 83

న తత్ర నద్యః శైలా వా ధ్వీపే వర్షద్వయాన్వితే |

వారు ఠాగద్వేష శోకములు లేనివారు. ఆరోగ్యవంతులు వారిలో అధమోత్తమ భేదము లేదు. చంపువాడు చంపబడువాడును లేరు. ఈర్ష్యాసూయ లెరుగరు, భయము రోషము దోషము లోభము శూన్యములు. మానసోత్తర పర్వతమునకు మహావీత ఖండము వెలుపలిది. ధాతకీ ఖండము లోపలిది. దేవదైత్యులు వసింతురు. ఈవర్షద్వయమున పుష్కరద్వీపమందు సత్యానృతము (వాణిజ్యము) లేవు. నదులు లేవు కొండలులేవు. ద్వీపములులేవు.

తుల్యవేషాస్తు మనుజా దేవైస్తత్త్రైకరూపిణః || 84

వర్ణాశ్రమాచారహీనం ధర్మాహరణ వర్టితమ్‌ | త్రయీవార్తాదండనీతిశుశ్రూషారహితం చ తత్‌ || 85

వర్షద్వయం తతో విప్రా భౌమస్వర్గో7య ముత్తమః | సర్వస్య సుఖదః కాలో జరారోగవివర్జితః || 86

పుష్కరే ధాతకీఖండో మహావీతేచ వై ద్విజాః | న్యగ్రోధః పుష్కరద్వీపే బ్రహ్మణః స్థాన ముత్తమమ్‌|| 87

తస్మి న్నివసతి బ్రహ్మా పూజ్యమానః సురాసురైః | స్వాదూదకేన దధినా పుష్కరః పరివేష్టిత || 88

సమేన పుష్కర సై#్వవ విస్తరా న్మండలా త్తథా |

మనుష్యలందరివేషమొక్కటే. వారు దేవసమరూపులు. అట వర్ణాశ్రమాచారధర్మవిచక్షణలేదు. వేదత్రయము వార్త దండనీతి శుశ్రూష యనునవి లేనేలేవు. ఈవర్షద్యయము భూలోక స్వర్గమే. కాలము జరారోగములు లేక సర్వసుఖప్రదమగును ఈరెండుఖండములందు పుష్కర ద్వీపమందు న్యగ్రోధ (మఱ్ఱి) మహావృక్షము బ్రహ్మయుండు స్థానము. బ్రహ్మ యచట సురాసురులచే పూజింపబడుచుండును. తియ్యని నీటి సముద్రముచే నది చుట్టుకొన్నది. దానివ్రమాణము పుష్కరద్వీపసమానము.

ఏవం ద్వీపాః సముద్రైస్తు సప్త సప్తభి రావృతాః || 89

ద్వీపశ్చైవ సముద్రశ్చ సమానౌ ద్విగుణౌ పరౌ | పయాంసి సర్వదా సర్వసముద్రేషు సమానివై || 90

న్యూనాతితిక్తతా తేషాం కదాచి న్నైవ జాయతే | స్థాలీస్థ మగ్నిసంయోగా దుద్రేకి సలిలం యథా || 91

తథేందువృద్ధౌ సలిల మంభోధౌ మునిసత్తమాః | ఆన్యూనానతిరిక్తాశ్చ వర్ధం త్యాపో హ్రసంతి చ || 92

ఉదయాస్తమనే త్విందోః పక్షయోః శుక్లకృష్ణయోః | దశోత్తరాణి పంచైవ అంగుళానాం శతానిచ || 93

అపాం వృద్ధిక్ష¸° దృష్టౌ సాముద్రీణాం ద్విజోత్తమాః|భోజనం పుష్కరద్విపే తత్ర స్వయ ముపస్థితమ్‌ || 94

భుంజంతి వడ్రసం విప్రాః ప్రజాః సర్వాస్సదైవహి |

ఇట్లు ద్వీపము లేడును సముద్రము లేడింటిచే నావరింపబడియున్నవి. ద్వీపములన్నియు సమప్రమాణములు. సముద్రము లన్నియు వానికి రెట్టింపు ప్రమాణము గలవి. అన్ని సాగరములందలి నీరు నెల్లప్పుడును నమము. హెచ్చుతగ్గులులేవు. నిప్పుచే గిన్నెలో నీరు పొంగినట్లు, చంద్రుని వృద్ధిననుసరించి అందలి నీరుపొంగును. ఆపొంగుక్రుంగుకూడ నన్నిట సమానమే. అన్ని సాగరములు సమముగ పొంగును తగ్గును. శుక్లకృష్ణపక్షములందు చంద్రోదయాస్తమయములందు పదునైదు అంగుళములు పొంగుచు క్రుంగుచు నండును. పుష్కరద్వీపవాసులందరు నన్ని వేళల స్వయంసంప్రాప్తమైన షడ్రసోపేతభోజనము సేయుచుందురు,

స్వాదూదకస్య పరితో దృశ్యతే లోకసంస్థితిః || ద్విగుణా కాంచనీ భూమిః సర్వజంతువివర్జితా | 95

లోకాలోకస్తత శ్శైలో యోజనాయుతవిస్తృతః || 96

ఉచ్ఛ్రయేణాపి తావంతి సహస్రాణ్యవరోహిసః | తత స్తమః సమావృత్య తం శైలం సర్వతఃస్థితమ్‌ || 97

తమశ్చాండ కటాహేన నమంతా త్పరివేష్టితమ్‌ | పంచాశత్కోటివిస్తారా సేయ ముర్వీ ద్విజోత్తమాః || 98

సహైవాండ కటాహేన సద్వీపా సమహీధరా | సేయం ధాత్రీ విధాత్రీ చ సర్వభూతగుణాధికా ||

ఆధారభూతా జగతాం సర్వేషాం సా ద్విజో తమాః ||

ఇతి శ్రీ బ్రహ్మపురాణ సముద్రద్వీపపరిమాణవర్ణనం నామ వింశో7ధ్యాయః

స్వాదూదక (మంచినీటి) సముద్రము చుట్టు లోకమున్నది, దానికి రెట్టింపు బంగారుభూమి. జంతురహితము ఆమీద లోకాలోకపర్వతము పదివేలయోజనములు విరి వైనది, అంతేయెత్తును అంతే లోతుగలది. ఆ శైలము నావరించి చీకటి యున్నది. ఆచీకటి ఆండకటాహమంతట నావరించి యున్నది. ఇంతవరకుగల యీ భూమి యేబదికోట్ల యోజనముల ప్రమాణముగలది. బ్రహ్మాండకటాహముతో ద్వీపములతో పర్వతములతో నీధాత్రి విధాత్రి (సృష్టి హేతువు) యై సర్వ భూతములలో గుణాధిక్యముగల దై సర్వ జగదాధారమై యున్నది.

ఇది శ్రీబ్రహ్మపురాణమందు సముద్రద్వీప పరిమాణవర్ణనము అను ఇరువదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters