Brahmapuranamu    Chapters   

అథఅష్టనవత్యధికశతతమో7ధ్యాయః

బలరామక్రీడావర్ణనమ్‌

వ్యాసఉవాచ

వనే విచరతస్తస్య సహగోపైర్మహాత్మనః | మానుషచ్ఛద్మరూపస్య శేషస్య ధరణీభృతః || 1

నిష్పాదితోరుకార్యస్య కార్యేణౖవా7వతారిణః | ఉపభోగార్థ మత్యర్థం వరుణః ప్రాహ వారుణీమ్‌ || 2

వరుణ ఉవాచ

అభీష్టా సర్వదా హ్యస్య మదిరేత్వం మహౌజసః | అనంతస్యోపభోగాయ తస్య గచ్ఛముదే శుభే|| 3

వ్యాస ఉవాచ

ఇత్యుక్తా వారుణీ తేన సంవిధాన మథాకరోత్‌ | బృందావనతటోత్పన్న కదంబ తరుకోటరే || 4

విచరన్‌ బలదేవో7పి మదిరాగంధమద్భుతమ్‌ | ఆఘ్రాయ మదిరాహర్ష మవాపాథ పురాతనమ్‌ || 5

తతః కదంబాత్సహసా మద్యధారాం స లాంగలీ | పతంతీం వీక్ష్య మునయః ప్రయ¸° పరమాం ముదమ్‌ || 6

పపౌచ గోపగోపీభిః సమవేతో ముదాన్వితః | ఉపగీయమానో లలితం గీతవాద్య విశారదైః || 7

శ్రమతోత్యంత ఘర్మాంభః కణికామౌక్తికోజ్జ్వలః | ఆగత్యయమునాం స్నాతుమిచ్ఛా మీత్యాహ విహ్వలః || 8

వ్యాసుడిట్లనియె.

మాయామానుష రూపమున నొకానొక పనికై యవని నవతరించి గోపకులతో బృందాపనమున సంచరించుచున్న తన ఫణామండలమున ధరణి నెల్ల ధరించిన శేషుని యవతారమై మహత్తర కార్యములను నిర్వహించుచున్న బలరాముని యపభోగముకొఱకు వరుణుడు వారుణియను తనశక్తింగూర్చి ఓ మదిరా! నీవు అనంతుని కెంతయు నిష్టమైనదానవు. అతడునిన్నాలకించుటకు ఆనువుగ అచటికరుగుము అన యవ్వారుణి సంకర్షణుని సన్నిధానము నకు అరిగెను. బృందావనమందున్న కదంబ (కడిమి) వృక్షముయొక్క తోఱ్ఱలోవసించుచు బలదేవుడద్భుతమైన మద్యపరిమళము నాఘ్రాణించి తొలుతటి చవి గుర్తించి హర్షమొందెను. అవ్వల నాచెట్టునుండి పడుచున్న మభ్యధారను జూచిమిగుల సంతోషించెను. గోపికలతో గోపకులతోగూడి గీతవాద్య నిపుణులు తనయశో గానము చేయ ఆ వారుణుని ద్రావెను. శ్రమచే క్రమ్మిన చెమట బిందువులు ముత్యములవలె భాసిల్లనతడు యమునకు వచ్చి స్నానము చేయుదునని పలికెను.

తస్య వాచం నదీ సా తు మత్తోక్తామవమన్యవై | నా77జగామ; తతః క్రుద్ధోహలం జగ్రాహలాంగలీ || 9

గృహీత్వాతాం తటేనైవ చకర్షమద విహ్వలః | పాపే నా77యాపినా77యాసి గమ్యతా మిచ్ఛయా7న్యతః || 10

సాకృష్టా తేనసహసా మార్గం సంత్యజ్య నిమ్నగా | యత్రా77స్తే బలదేవోప్లావయామా7సౌ సతద్వనమ్‌ || 11

శరీరిణీ తథోపేత్య త్రాసవిహ్వలలోచనా | ప్రసీదే త్య బ్రవీద్రామం ముంచమాంముశలాయుధ || 12

సో7బ్రవీ దవజానాసి మమ శౌర్యబలం యది | సో7హంత్వాం హలపాతేన నయిష్యామి సహస్త్రధా || 13

వ్యాస ఉవాచ

ఇత్యుక్తయాతిసంత్రస్తస్తయా నద్యా ప్రసాదితః | భూభాగే ప్లావితేతత్ర ముమోచయమునాం బలః || 14

ఆనది యాతని మాటవిని తప్పత్రాగి మత్తుచే నన్నమాటయని యనుమానించి యామె రాదయ్యెను. దాన గోపించి యాతడు నాగలి గైకొని మదవివశుడై ఆనది యొడ్డున బెల్లగించి లాగెను. పాపాత్మురాల! రానైతివి. మరి యెచటికేని నీ యిచ్చననుసరించి పొమ్మనెను. ఆ నదీదేవత యట్లు తటాలున నాకర్షింపబడి మార్గము విడిచి బలదేవుడున్న అవ్వనమునంతటను ముంచెత్తెను. మరియు శరీరము దాల్చి బెదరిన చూపులతో ఓ హలాయుధా! అనుగ్రహము జూపుము. నన్నువదలిపెట్టుమని పల్కెను. అతడు నాశౌర్యమును బలమును నీవు కించ పరతువేని నా నాగలిచే నిన్నుడచి వేయిపాయల వెంట నిన్ను నడిపించెదను. అననామె మిక్కిలి జడిసిపోయి బ్రతిమాలినంతట ఆమె ముంచెత్తిన భూభాగమందామెను వదలెను.

తతః స్నాతస్యవై కాంతి రాజగామ మహావనే | అవతం సోత్పలం చారు గృహీత్వైకంచ కుండలమ్‌ || 15

వరుణ ప్రహితాం చాసై#్మ మాలామవ్లూనపంకజామ్‌ | సముద్రార్హే తథా వస్త్రేనీలే లక్ష్మీరయచ్ఛత || 16

కృతావతంసః సతదాచారుకుండల భూషితః | నీలాంబరధరః స్త్రగ్వీ శుశుభేకాంతి సంయుతః || 17

ఇత్థం విభూషితో రేమే తత్ర రామస్తదావ్రజే | మాసద్వయేన యాతశ్చపునః సమథురాం పురీమ్‌ || 18

రేవతీం చైవతనయాంరై వతస్య మహీపతేః | ఉపమేమే బలస్తస్యాం జజ్ఞాతే నిశఠోల్ముకౌ || 19

ఇతి శ్రీబ్రహ్మపురాణ బలరామక్రీడావర్ణనం నామాష్టనవత్యధిక శతతమోధ్యాయః

అవ్వల నతడందు స్నానము చేయగా నద్భుతకాంతి వచ్చెను. తరువాత లక్ష్మి నొకనల్లగలువను శిరోభూషణము గను వరుణుడు కానుకపంపిన కుండలము వెట్టుకొని వాడిపోని తామర పూమాలను సముద్రునికుచితములైన రెండు దివ్యాంబరములను బలభద్రునకు కానుకపెట్టెను. నీలాబ్జము నవతంసముగ ధరించి మణికుండలము చెవికిబెట్టుకొని యా నీలాంబరములు గట్టుకొని పూలమాలదాల్చి కాంతినొంది బలరాముడు మిక్కిలి శోభించెను. అచట రెండు మాసములు క్రీడించి మధురకు జని రైవతరాజుకూతురును రేవతిని పరిణయమాడెను. ఆమెయందతడు నిశఠుడు ఉన్ముఖుడు అను నిర్వురు పుత్రులం గనియెను.

ఇది బ్రహ్మపురాణమున బలరామ క్రీడా వర్ణనమను నూటతొంబదియెనిమిదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters