Brahmapuranamu    Chapters   

అథ ఊననవత్యుత్తరశతతమో7ధ్యాయః

రాసక్రీడావిలాసము. అరిష్టవధ.

వ్యాస ఉవాచ

గతే శ##క్రే గోపాలాః కృష్ణ మక్లిష్టకారిణమ్‌ | ఊచుః ప్రీత్యా ధృతం దృష్ట్వా తేన గోవర్ధనాచలమ్‌ | 1

గోపా ఊచుః

వయ మస్మా న్మహాభాగ భవతా మహతో భయాత్‌ | గావ శ్చ భవతా త్రాతా గారిధారణకర్మణా || 2

బాలక్రీడేయ మతులా గోపాలత్వం జుగుప్సితమ్‌ | దివ్యం చ కర్మ భవతః కి మేత త్తాత కథ్యతామ్‌ || 3

కాలియో దమిత స్తోయే ప్రలంబో వినిపాతితః | ధృతో గోవర్ధన శ్చాయం శంకితాని మనాంసి నః || 4

సత్యం సత్యం హరేః పాదౌ శ్రయామో7మితనిక్రమ | యథా త్వ ద్వీర్య మాలోక్య నత్వాం మన్యామహేనరమ్‌||

దేవో వా దానవో వా త్వం యక్షో గంధర్వ ఏవ వా | కిం చాస్మాకం విచారేణ బాంధవో7సి నమో7స్తుతే || 6

ప్రీతిః సస్త్రీకుమారస్య వ్రజస్య త్వయికేశవ | కర్మ చేద మశక్యం య త్సమసై#్త స్త్రీదశై రపి || 7

బాలత్వం చాతివీర్యం చ జన్మ చాస్మాన్‌ సుశోభనమ్‌ | చింత్యమాన మమేయాత్మన్‌ శంకాం కృష్ణ ప్రయచ్ఛతి || 8

వ్యాస ఉవాచ

క్షణం భూత్వా త్వసౌ తూష్ణీం కించి త్ప్రణయ కోపవాన్‌ | ఇ త్యేవ ముక్త సై#్తర్గోపై రాహ కృష్ణో ద్విజోత్తమాః ||

మత్సంబంధేన వో గోపా యది లజ్జా న జాయతే | శ్లాఘ్యో వా7హం తతః కిం వో విచారేణ ప్రయోజనాత్‌ || 10

యది వో7స్తి మయి ప్రీతిః శ్లాఘ్యో7హం భవతాం యది | త దర్హాం బంధుసదృశీం బాంధవాః క్రియతాం మయి ||

నాహం దేవో న గంధర్వో న యక్షో న చ దానవః | అహం వో బాంధవో జాతో నాత శ్చింత్య మతో7న్యథా||12

ఇతి శ్రుత్వా హరే ర్వాక్యం బద్ధమౌనా స్తతో బలమ్‌ | యయు ర్గోపా మహాభాగా స్తస్మి న్ప్రణయకోపిని || 13

అరిష్టవధనిరూపణము

వ్యాసులిట్లనిరి.

గోపాలు రింద్రుడేగిన తరువాత గోవర్ధనగిరి నవలీలగనెత్తిన కృష్ణుంగని ప్రీతితో నిట్లనిరి. ''కృష్ణా! కొండ నెత్తిన యద్భుతలీలచే నీవు గోవులను మమ్ములను మహాభయమునుండి కాచితివి. ఈ బాలలీల యనుపమము. ఆలకాపరి యగుట నింద్యము. నీచేసిన పనియో దివ్యము. ఇదెట్లు జరిగినో తెలుపుము. మడువులో గాళియుడ ణగద్రొక్కబడెను. ప్రలంబుడు గూల్పబడెను. ఈ గోవర్ధన మెత్తబడెను. ఇవిచూడ మానసములు సంశయ గ్రస్తములగుచున్నవి. శ్రీహరి నీపాదములే మాశ్రయించెదము. నీ బలిమి చూచి నిన్ను నరమాత్రునిగ భావింపలేకున్నాము. సత్యము! సత్యము. నీవు దేవుడవో దానవుడవో యక్షుడవో గంధర్వుడవో. ఆవిమర్శమాకేల? మాకు బంధువుడవు. నీకు నమస్కారము. ఆబాల గోపాలమునకు నీయెడల బ్రీతిగల్గినది. నీ చేసిన పని నెల్లదేవతలొక్కటైనను జేయజాలరు. ఒకవంక బాల్యము వేఱొక వంక నద్భుతవీర్యము నివి యన్నియు నిట్లుండ గొల్లలమగు మాలోసామాన్యులలో నీవు జన్మించుట విమర్శింప మాకు సంశయము గల్గించుచున్నది అనవినికృష్ణుడు క్షణమాత్రముపలుకకుండనిలిచి ప్రణయకోపముననటించి యిట్లు వారికిబదులు పలికెను. నాసంబంధముచే మీకు సిగ్గు గలుగ దేనినేను శ్లాఘ్యడనేగద! అందువలన కార్యాకార్యవిమర్శ యెందులకు? మీకు నాయందుబ్రీతియున్నయెడల మీమెప్పునే బొందదగినవాడనయినయెడల బంధుసమానమైన గౌరవము మీరుచూపుడు. నేను దేవుడనుగాను గంధర్వుడను యక్షుడను దానవుడను గాను నేను మీకు జుట్టుమునై పుట్టితిని. ఇందు వలన వేఱొక విధముగ మీరాలోచింపబనిలేదు అన శ్రీహరి వాక్యము విని గోపకులు మహానుభావులు మౌనమువట్టి పొలయలుక గన్నయాతని నుండి బలరాముదరి కేగిరి.

రాసక్రీడారంభము

కృష్ణ7స్తు విమలవ్యోమ శరచ్చయంద్రస్య చంద్రికామ్‌ | తథా కుముదినీం పుల్లా మామోదితదిగంతరామ్‌ || 14

వనరాజీం తథా కూజద్భృంగమాలామనోరహమ్‌ | విలోక్య సహ గోపీభి ర్మన శ్చక్రే రతిం ప్రతి | 15

సహరామేణ మధుర మతీవ వనితాప్రియమ్‌ | జగౌ కలపదంశౌరిః నామ తత్ర కృతవ్రతః || 16

రమ్యం గీతధ్వనిం శ్రుత్వా సంత్య జ్వావసథాం స్తదా | అజగ్ము స్త్వరితా గోప్యో యత్రా 77స్తే మధుసూధనః || 17

శ##నైః శ##నై ర్జగౌ గోపీ కాచి త్తస్య పదానుగా| దత్తావధానా కాచి చ్చ త మేవ మనసా7స్మరత్‌ || 18

కాచి త్కృష్ణేతి కృష్ణేతి చోక్త్వా లజ్జా ముపాయ¸°| య¸° చ కాచి త్ప్రేమాంధా తత్పార్మ్వ మవిలజ్జితా || 19

కాచి దావసథ స్యాంతః స్థిత్వా దృష్ట్వా బహిర్గురుమ్‌ | తన్మయత్వేన గోవిందం దధ్యౌ మీలితలోచనా || 20

గోపీపరివృతో రాత్రిం శరచ్చంద్రమనోరమామ్‌ | మాసయామాస గోవిందో రాసారంభరసోత్సుకః || 21

గోప్యశ్చ బృందశః కృష్ణచేష్టాభ్యాయ త్త మూర్తయః | అన్యదేశగతే కృష్ణే చేరు ర్వృందావనాంతరమ్‌ || 22

బభ్రము స్తా స్తతో గోప్యః కృష్ణదర్శనలాలసాః | కృష్ణన్య చరణం రాత్రౌ దృష్ట్వా వృందావనే ద్విజాః || 23

ఏవం నానాప్రకారాసు కృష్ణచేష్టాసు తాసు చ | గోప్యో వ్యగ్రాః సమం చేరూ రమ్యం వృందావనం వనమ్‌ || 24

నివృత్తా స్తా స్తతో గోప్యో నిరాశాః కృష్ణదర్శనే | యమునాతీర మాగమ్య జగు స్త చ్చరితం ద్విజాః || 25

తతో దదృశు రాయాంతం వికాశిముఖపంకజమ్‌ | గోప్యసై#్రలోక్యగోప్తార కృష్ణమక్లిష్ణకారిణమ్‌ || 26

కాచిదాలోక్య గోవిందం మాయాంత మతిహర్షితా తృష్ణకృష్ణేతికృష్ణేతి ప్రాహోత్ఫుల్ల విలోచనా || 27

కాచిద్‌ భ్రూభంగురంకృత్వా లలాటఫలకం హరిమ్‌ | విలోక్య నేత్రభృంగాభ్యాం పపౌతన్ముఖపంకజమ్‌ || 28

కాచిదాలోక్య గోవిందం నిమీలిత విలోచనా తసై#్యవ రూపం ధ్యాయంతో యోగారూఢేవ సా బభౌ || 29

తతః కాంచిత్రియాలాపైః కాంచిద్‌ భూభంగవీక్షితైః | నిన్యే7నునయమన్యాశ్చ కరస్పర్శేన మాధవః || 30

తాభిః ప్రసన్న చిత్తాభి7ర్గోపీభి సహ్ససాదరమ్‌ | రరామ రాసగోషీభి రుదారచరితో హరిః || 31

ఆకాశము స్వచ్ఛమై శారదచంద్రచంద్రికామనోహరమై కలువ తీగలు వికసింప దిగంతములు సువాసనల ఘుమఘుమలాడ దుమ్మెదలఝంకారములచే నింపుగొలుపువనపాళిం జూచి కృష్ణుడు గోపికలతో గ్రీడింప మనసు పడెను. బలరామునితో గృష్ణుడు పద్మమువంటిపాదములతో నవ్వనమున విహరించుచు గోపాంగనలకు మిగుల నింపుగూర్చును. వేణుగానమొ నరించెను. రమ్యమైన యాగీత ధ్వనిని విని గోపికలిండ్లువెడలి సత్వరము కృష్ణుని దరికేతెంచిరి. ఒక గోపియతని యడుగుల మెల్లమెల్లన ననుగమించెను. వేణుగానము విన గుతూహలముగొని వేఱొకతె యతనినే స్మరించెను. మఱొకతె కృష్ణా ! కృష్ణాయని పలికి యంతలో సిగ్గుపడెను. వేఱొకతె ప్రేమ కనులుగప్ప సిగ్గువిడిచి యాతనిపజ్జ నిలిచెను. మఱియొకగోపిక యింటనే నిలిచి వెలినున్న బెద్దల(మామగారిని) గని బృందావనమునకు వెళ్ళుటకు సాహసము జేయలేక తన్మయతను జెంది గనులుమూసికొని గోవిందునే ధ్యానించెను. శరచ్ఛంద్రమనోహరమైన యొకరాత్రివేళ గోపికలు వెంబడింప గోవిందుడు రాసక్రీడారంభరసోల్లాసియై వారల నాదరించెను. గోపికలు గుంపులుగ కృష్ణవిలాసవివశ##లై యతుడు చాటువడ విరహాతరలై కృష్ణదర్శనాపేక్షతో బృందావన మెల్లను వెదకుచు దిరిగిరి. రాత్రి కృష్ణుని యడుగుజాడలను జూచి యతని వివిధశృంగారాను భావములకు మురిసి మైమరిచి పరిపరివిధముల నావనమున బరిభ్రమించిరి. కృష్ణుడు కనిపింపమి నిరాశ##జెంది మరలి యమునా తీరమునకు వచ్చి కృష్ణచరిత్రమును మధురముగ స్వరసమ్మేళనమొనరించి పాడిరి. అంతలో హరిముఖపంకజము వికసింప దటాలున నెదురు వడగ గోపికలు ముల్లోకములను రక్షింపగల పుణ్యశీలురు గావున యమ్మూర్తిని దర్శించిరి. ఏతెంచుచున్నగోవిందుని యొకసుందరి చూచి కనుదుమ్ములు విప్పార నానందభరితయై కృష్ణా ! కృష్ణా! యని యాలాపనము సేసెను. ఒకతె కనుబొమలు ముడిపడ హరింజూచియాముఖపంకజమును దన నయనములను దుమ్మెదలచే నాస్వాదించెను. మఱియొకతె కనులల్లన మూసికొని యతనిరూపమును ధ్యానంచుచు యోగారూఢయైనట్లు భాసించెను. అవ్వల ప్రియభాషణములచే నొక్కతెను. భ్రూభంగవిలాసములచే నొక్కతెను గరస్పర్శముచే నింకొకతెను ననునయించి మాధవుడు వారినందరిని నన్నిలీలలంగలకదేర్చి వారితో రాసక్రీడా విలాసవై భవమున రమించెను.

రాసమండలబద్ధో7పి కృష్ణపార్శ్వమనుద్‌ గతః | గోపీజనో స చై వాభూ దేకస్థానస్థిరాత్మనా || 32

హస్తే ప్రగృహ్య చైకాం స గోపికాం రాసమండలే | చకార చ కరస్పర్శనిమీలితదృశం హరిః || 33

తతః ప్రవవృతే రమ్యా చలద్వలయనిస్వనైః | అనుయాతశరత్కావ్యగేయగీతి రనుక్రమాత్‌ || 34

కృష్ణః శరచ్చంద్రమసం కౌముదీకుముదాకరమ్‌ | జగౌ గోపీజనస్త్వేకం కృష్ణనామ పునఃపునః || 35

పరివృత్తా శ్రమేణౖకా చలద్వలయతాపినీ దదౌ బాహులతాం స్కంధే గోపీ మధువిషూతినః || 36

కాచిత్ర్పవిలసద్‌ బాహుః పరిరభ్య చుచుంబతమ్‌ | గోపీగీత స్తుతివ్యాజనిపుణా మధుసూదనమ్‌ || 37

గోపీకపోలసంశ్లేష మభిపద్య హరౌర్భుజా | పులకోద్గమ శస్యాయ స్వేదాంబుధరతాం గతౌ || 38

రాసగేయం జగౌ కృష్ణో యావత్తారతరధ్వని | సాధు కృష్ణేతి కృష్ణేతి తావత్తా ద్విగుణం జగుః || 39

గతే7నుగమనం చక్రు ర్వలనేసమ్ముఖంయయుః | ప్రతిలోమానులోమేన భేజు ర్గోపాంగనా హరిమ్‌ || 40

స తదా సహగోపీభీ రరామ మధుసూదనః | స వర్షకోటి ప్రతిమః క్షణస్తేన వినా7భవత్‌ || 41

గోపికాజనము వర్తులాకారముగదీరి రాసక్రీడ యందిమిడి యున్ననునొకేలక్ష్యమందు స్థిరపడిన మనస్సుతో కృష్ణుని యందేకాగ్రత చెందిన మనస్సుతో సుస్థిరమైన సమాధియోగముచేత గృష్ణుని పార్శ్వభాగమును విడవకుండ నిరంతర సాన్నిధ్యానందము ననుభవించెను. శ్రీహరి యొకగోపికచేయిపట్టుకొని తనకరస్పర్శచే గల్గినయానంద పారవశ్యముచేత నరమోడ్పువెట్టిన కన్నులుకలదానినిగా నొనరించెను. అవ్వల చలించు నొడ్డాణముల చిరుగంటల స్వనములచే గ్రమగ్రమముగ శరద్దృతుసమయ కావ్యగీతము ననుసరించి లయానుగుణముగ గోపికా కృష్ణుల నృత్య మారంభమయ్యెను.

ఒక గోపిక బాహులతలు సాచి కృష్ణుని గౌగింలించుకొని గోపికలసంగీతమాధుర్యమును స్తుతించు నెపమున దోచు నైపుణ్యమున స్వామిని ముద్దుపెట్టుకొనెను. ఆగోపి చెక్కిళ్లకలయిక (నంశయమును) నొంది కృష్ణుని భుజములు ఒడలు పులకరించుటయను బంటనుజ్జీవకమగు స్వేదమనెడి జలమును వర్షించుటలో జలధరభావమును బొందినది. (అనగా నొక సస్యమునకు వర్షముగురియు మేఘము జ్జీవకమైనట్లు కపోల స్పర్శము వలన కల్గిన శృంగారానుభవముచే గోపికలు మైమరపుజెంద వారి తనువల్లరి పులకరించినదని భావము) కృష్ణుడు తారస్థాయిలో రాసక్రీడాగేయమాలపించినంతట భేష్‌ భేష్‌ కృష్ణా! యని రెట్టించి వంతపాడిరి. హరి ముందడుగువేయ నావెంబడిని వారడుగు వేసిరి. అతడు వెనుతిరిగిన వారతనికి సమ్ముఖమైరి (ఎదరైరి) ఇట్లు లయానుగుణమైన బాదవిన్యాసమున గోపాంగనలు ప్రతిలోమానులోమముగ హరిని దారిసిల్లిరి. ఇట్లాగోపసుందరులతో గృష్ణుడు రమింప నతనితోనగుక్షణమెడబాటు వారికి గోటిసంవత్సరముల వియోగముతో సమానమై తోచెను.

తావార్యమాణాః పితృభిః పతి భిర్భాతృభిస్తథా | కృష్ణం గోపాంగనా రాత్రౌ రమయంతి రతిప్రియాః || 42

సో7పి కైశోరకవయా మానయ న్మధుసూదనః | రేమే తాభిరమేయాత్మా క్షపాసు క్షపితాహితః || 43

తత్‌ భర్తృషు తథా తాసు సర్వభూతేషు చేశ్వరః | ఆత్మస్వరూప రూపోసౌ వ్యాప్య సర్వ మవస్తితః || 44

యథా సమస్తభూతేషు నభో7గ్నిః పృథివీజలమ్‌ | వాయుశ్చా77త్మా తథైవాసౌ వ్యాప్య సర్వమవస్థితః || 45

తండ్రులు భర్తలు అన్నదమ్ములు నెంతవారించినను నత్యుల్లానమున వ్రజసుందరులు రాత్రులందు గృష్ణునితో గ్రీడించిరి. అతడును గైశోరకవయస్సున వారినాదరించుచు ననేకరాత్రులు రమించెను. వారిపతులందు గోపికలందు సర్వభూతములందు సర్వేశ్వరుడు గావున నాత్మస్వరూపమై సర్వమున వ్యాపించి హరియుండెను. సమస్తభూతములందు బృథివ్యాపస్తేజోవాయురాకాశములను పంచభూతములు నెట్లు వ్యాపించియున్నవో యట్లే కృష్ణపరబ్రహ్మ మయ్యెడ సర్వవ్యాపకమై యుండెను.

వ్యాస ఉవాచ

ప్రదోషార్ధే కదాచిత్తు రాసాసక్తే జనార్దనే | త్రాసయస్‌ సమదో గోష్టా నరిష్టః సముపాగతః || 46

సతోయతో యదాకారస్తీ క్షశృంగో7ర్కలోచనః | ఖురాగ్రపాతై రత్యర్థం దారయన్‌ ధరణీతలమ్‌ || 47

లేలిహానః సనిష్పేషం జిహ్వయోష్ఠౌ పునః పునః | సంరంభాక్షి ప్తలాంగూలః కఠినస్కంధబంధనః || 48

ఉదగ్రకకుదాభోగః ప్రమాణాద్‌ దురతిక్రమః | విణ్మూత్రాలి ప్తపృష్టాంగో గవాం ముద్వేగకారకః || 49

ప్రలంబకంఠో7భిముఖస్తరు ఘాతాకింతాననః | పాతయంస గవాం గర్భాం దైత్యో వృషభరూపధృక్‌ || 50

సూద యం స్తరసా సర్వాన్వనాన్యటతి యః సదా | తతస్త మతిఘోరాక్ష మవేక్ష్యాతిభయాతురాః || 51

గోపా గోపస్త్రియశ్చైవ కృష్ణకృష్ణేతి చుక్రుశుః | సింహనాదం తతశ్చక్రే తలశబ్దం చ కేశవః | 52

తచ్ఛబ్దశ్రవణాచ్ఛాసౌ దామోదరముఖం య¸° || అగ్రన్యస్త విషాణాగ్రః కృష్ణకుక్షికృతేక్షణః || 53

అభ్యధావత దుష్టాత్మా దైత్యో వృషభరూపధృక్‌ | అయాంతం దైత్యవృషభం దృష్ట్వా మహాబలమ్‌ || 54

నచచాల తతః స్థానాద వజ్ఞా న్మితలీలయా | ఆసన్నం చై వ జగ్రాహ గ్రాహవన్మధుసూదనః || 55

జఘాన జానునా కుక్షౌ విషాణగ్రహణాచలమ్‌ | తస్య దర్పబలం హత్వా గృహీతస్య విషాణయోః || 56

అపీడయ దరిష్టస్య కంఠం క్లిన్నమివాంబరమ్‌ | ఉత్పాట్య శృంగమేకం చ తేనై వాతాడ యత్తతః || 57

మమార స మహాదైత్యో ముఖా చ్ఛోణి తముద్వమన్‌ | తుష్టుపుర్నిహతే తస్మిన్‌ గోపా దైత్యే జనార్ధనమ్‌ ||

జంభే హతే సహస్త్రాక్షంపురా దేవగణా యథా || 58

ఇతి శ్రీ బ్రహ్మపురాణ శ్రీకృష్ణబాలచరితే7రిష్టవధనిరూపణం నామ నవత్యధికశతత మోధ్యాయః

'' అరిష్టవధ ''

ఒకతరి నర్థాన్తమయసమయమున (ప్రదోషకాలము సగముగడచిన తరువాత) జనార్ధనుడు రాసక్రీడా వినోదము నందానక్తుడైయుండ నరిష్టుడను రక్కసుడు మదమెక్కి హడలగొట్టుచు గోశాల కరుదెంచెను. కారుమబ్బువలె నల్లగ నుండి పదునైన కొమ్ములుగల్గి సూర్యునట్లు జ్వలించు చూపులతో డెక్కలతాకున భూతలము జీల్చుచు నాలికచే బెదవులను నొరయించి నాకుచు దోకలువ్వెత్తున బైకెత్తి మిగుల కఠినమగుస్కంధబంధమున మిగులవెడదయగుమూపుతో నొడ్డుపొడువులను మిగులగడువరానివాడై మూత్రపురీషములంబూత పడిన పిరుదులతో నొడలితో గోవులకువెరపుగొల్పుచు మెడవ్రేల నెదురై చెట్లతాకిడివడినముఖముతో వృషభరూపముగొని గోవులకుగర్భపాతము చేయుచు నెల్లయడవులం గూల్చుచు నొకదైత్యు డచట నెల్లపుడు సంచరించువాడెదుట బడెను. భయంకరమగుకన్నులతోనున్న వానినిగని గోపకులు గోపికలు కృష్ణా! కృష్ణా! యని యాక్రందించిరి. అంతట కేశవుడు సింహగర్జనముచేసి చప్పట్లుజరచెను. వీడా సడివిని దామోదరున కెదురుగజని కొమ్ములు ముందునకు నిగిడించి కృష్ణుని కడుపునెడ చూపు నిలిపి యాదుష్టుడు పరువులు వెట్టెను. అట్లు వచ్చుచున్న వృషభాసురునిగని కృష్ణుడు వానినీసడించు సూచనగ నొదవిన చిరునవ్వుసొగసు జూపి తా నిలిచిన చోటనుండి కదలక నిలుచుండెను. మఱియు దాపునకు పచ్చినవానిని హరి మొసలి పట్టినట్లుపట్టి కొమ్ములుచేకొని కడుపునందు మోకాళ్లంబొడిచెను. వాని గొమ్ముపట్టి వాని దర్పమును బలమునుంగోట్టి తడిబట్టను బిండినట్లు వాని కంఠమును మెలిపెట్టెను. మరియు వాని కొమ్మొకటి పెరకి దానిచేతనే వానింగొట్టెను. అమ్మహాదైత్యుడు నోట నెత్తురు గ్రక్కుచు మరణించెను. వాడట్లు హతుడైనంత గోపకులవుడు జంభాసురుడీల్గినపుడు దేవతలింద్రునట్లు జనార్దనుని స్తుతించిరి.

ఇది బ్రహ్మపురాణమున శ్రీకృష్ణబాలచరితమున రాసక్రీడ అరిష్టవధ నిరూపణమును నూటయెనుబదితొమ్మిదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters