Brahmapuranamu    Chapters   

అథషడశీత్యధికశతమో7ధ్యాయః

ధేనుకవధాఖ్యానమ్‌

వ్యాసఉవాచ

గాఃపాలయంతౌ చపునః సహితౌ రామకేశవౌ | భ్రమమాణౌ వనేతత్ర రమ్యంతాలవనం గతౌ || 1

తచ్చ తాలవనం నిత్యం ధేనుకో నామ దానవః | నృగోమాంసకృతాహారః సదా7ధ్యాస్తే ఖరాకృతిః || 2

తత్ర తాలవనం రమ్యం ఫలసంపత్సమన్వితమ్‌ | దృష్వా స్పృహాన్వితా గోపాః ఫలదానే7బ్రువన్వచః || 3

గోపా ఊచుః

హే రామ హే కృష్ణ సదా ధేనుకేనైన రక్ష్యతే | భూప్రదేశో యత స్తస్మా త్త్యక్తా నీమాని సంతివై || 4

ఫలాని పశ్య తాలానాం గంధామోదయుతాని వై | వయ మోతా న్యభీప్సామః పాత్యంతాం యది రోచతే || 5

ఇతి గోపకుమారాణాం శ్రుత్వా స్కర్షణో వచః | కృష్ణశ్చ పాతయామాప భువి తాలఫలాని వై || 6

ధేనుకవధాఖ్యానము

వ్యాసులిట్లనియె. బలరామకృష్ణులు గలసి యావులను గాచుచు నావనములందిరుగుచు జక్కని తాలవనమునకు వెళ్ళిరి. ఆవనమందు నరగోమాంసములను దినుచు గాడిదరూప మమున ధేనుకుడను దానవుడువసించుచుండెను. ఆవనములో దాటిపండ్లు సమృద్ధిగా నుండుట జూచి గోపకులు కుతూహలములో నోరామకృష్ణ! ఈప్రాంతము ధేనుకుని గాపుదలలో యున్నందున సువాసనగల యీపండ్లు వదలబడియున్నవి. వీనిని మేము గోరుచున్నాము. మీకది సమ్మతమైనచో వీనిని రాలగొట్టుదము అన బలరాముడు, కృష్ణుడును వానిని బడగొట్టిరి.

తాలానాం పతతాం శబ్ద మాకర్ణ్యాసురరాట్తతః | ఆజగామ సదుష్టాత్మా కోపాద్దైతేయగర్దభః || 7

పద్భ్యాముభాభ్యాం స తదా పశ్చిమాభ్యాం చ తం బలీ | జఘా నోరసి తాభ్యాం చ స చ తే నాప్యగృహ్యత || 8

గృహీత్వా భ్రామణనై వ చాంబరే గతజీవితమ్‌ | తస్మి న్నేవ ప్రచిక్షేప వేగేనతృణ రాజని || 9

తతః ఫలా న్యనేకాని తా లాగ్రా న్నిపత స్ఖరః | పృతివ్యాం పాతయామాస మహావాతో7ంబుదా నివ || 10

అన్యా న ప్యస్య వై జ్ఞాతీ నాగతా న్దైత్యగర్దభాన్‌| కృష్ణ శ్చిక్షేప తాలాగ్రే బలభద్ర శ్చ లీలయా || 11

క్షణ నాలంకృతా పృథ్వీ పక్వై స్తాలఫలై స్తదా | దైత్‌ గర్దభ##దేహై శ్చ మునయః! శుశుభే7ధికమ్‌ || 12

తతో గావో నిరాబాధా స్తస్మిం స్తాలవనే ద్విజాః | నవశష్పం మఖం చేరు ర్యత్ర భుక్త మభూత్పురా || 13

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే బాలచరితే ధేనుకవధవర్ణనం నామ షడశీతిత్యధికశతతమో7ధ్యాయః

ఆచప్పుడువిని రాక్షసుడు గర్దభాకారుడు కోపముగొనివచ్చి పెనుకకాళ్ళతో వానియెదురు రొమ్ముపై గొట్టగా నాకాళ్ళను పట్టుకొని గిరగిరద్రిప్పి ఆకసమున కెగురువేసెను. వాడు ప్రాణములను బాసెను. అట్లుపడుచున్న వాని తాకిడికి పండ్లు గుట్టలుగ బడినవి. వాని జ్ఞాతులు ఖరాసురులెందరో యెదిరింప వాయువు మోఘములను జెదరిగిట్టినట్లు వారినం దరను బలరామకృష్ణులు అచెట్లమీదకు విసరిరి. దాన దాటిపండ్లన్నియు నేలపైబడి చూడనిం పుగ దోచెను. క్రూరులగు నా గర్దభాకారులు మడసి పడినంత నయ్యడవి నిరాబాధమై గోపకులు గోవులు హాయిగ సంచరింప మిగులరమణీయమై యొప్పెను. అందలి పచ్చని లేబచ్చికలయందు నాగొల్లపిల్లలు తాళఫలముల నారంగించిరి.

ఇది బ్రహ్మపురాణమునబాలచరితమందు ''ధేనుకవధ'' వర్ణనమను నూటయెనుబదియాఱవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters