Brahmapuranamu    Chapters   

అథత్ర్యశీత్యధికశతతమో7ధ్యాయః

కంసవిచారకథనమ్‌

వ్యాస ఉవాచ

కంసస్త్వథోద్విగ్నమనాః ప్రాహ సర్వన్మహాసురాన్‌ | ప్రలంబుకేశిప్రముఖా నాహూయా7సురపుంగవాన్‌ || 1

కంస ఉవాచ

హే ప్రలంబ మహాబాహో కేశి న్ధేనుక పూతనే | అరిష్టాద్యైస్తథా చాన్యైః | శ్రూయతాం వచనం మమ || 2

మాం హన్తుమమరై ర్యత్నః కృతః కిల దురాత్మభిః మద్వీర్యతాపి తాన్వీరా తాన్వీరా న్న త్వేతాన్గణయామ్యహమ్‌ || 3

అశ్చర్యం కన్యయా చోక్తం జాయతే దైత్యపుంగవాః | హాస్యం మే జాయతే వీరాస్తేషు యత్నపరేష్వపి || 4

తథాపి ఖలు దుష్టానాం తేషామప్యధికం మయా | అపకారాయ దైత్యేంద్రా యతనీయమ్‌ దురాత్మనామ్‌ || 5

ఉత్పన్నః కో7పి మృత్యుర్మే భూతభవ్యభవత్ర్పభుః | ఇత్యేత ద్బాలికాప్రాహ దేవకీగర్భసంభవా || 6

తస్మాద్బాలేషు పరమోయత్నః కార్యో మహీతలే | యత్రోద్రిక్తం బలం బాలే స హంతవ్యః ప్రయత్నతః || 7

వ్యాసుండిట్లనియె. అంతట గంసుండు మనసుతోట్రువడి ప్రలంబుడు కేశి మొదలయిన యసురప్రముఖులం బిల్చియిట్లనియె. ఓ ప్రలంబ! మహావీర! కేశీ! ధేనుక!పూతనా! అరిఫ్ణుడు మున్నగువారితో నామాట నాలింపుడు. దురాత్ములు అమరులు నన్నుజంపయత్నించుచున్నారు. నేను వీండ్రను లెక్కసేయను. దేవకికి బుట్టినపిల్ల చెప్పినమాటలాశ్చర్యముం గల్గించినవి. వారెంత యత్నము సేయుచున్నను వారియెడ నాకు పరిహాసము గల్గుచున్నది. అయినను నా దుష్టుల కపకారముసేయ యత్నింపవలసినదే. త్రికాలములందు నిత్యమయిన మృత్యువు నాకొఱుకు బుట్టినట్లా బాలిక చెప్పినది. కావున నేపిల్లవానియందు మిక్కిలి బలము గాన్పించునో వెదకి వానిందుదముట్టింపుడు.

వ్యాస ఉవాచ

ఇత్యాజ్ఞాప్యాసురాస్కంపః ప్రవిశ్యా77గృహం తతః | ఉవాచ వనుదేవంచ దేవకీ మవిరోధతః || 8

కంస ఉవాచ

యువయో ర్ఘాతితా గర్భా వృథైవైతే మయా7ధునా | కో7ప్యన్య ఏవ నాశాయ బాలో మమ సముద్గతః || 9

తదలం పరితాపేన నూనం యద్భావి నో హితే | అర్భరౌః | యువయోః ; కోవా అయుషోంతే న హన్యతే || 10

వ్యాస ఉవాచ

ఇత్యాశ్వాస్య విముచ్యైవ కంసస్తౌ పరితోష్యచ | అంతర్గృహం ద్విజశ్రేష్ఠాః ప్రవివేశ పునః స్వకమ్‌ || 11

ఇతి బ్రహ్మపురాణ శ్రీకృష్ణబాలచరితే కంసవిచారకధనంనామ త్ర్యశీత్యధిక శతతమో7ధ్యాయః

ఇట్లాజ్ఞయ్చి కంసుడింట బ్రవేశించి, దేవకీవసుదేవులతో వైరము దోపకుండ యిట్లనియె. ఊరక మీ శిశువులను నేను జంపితిని. కాని యెవ్వడో మఱియొకడు నానాశనమునకు బుట్టియున్నాడు. మీరు బాధపడకుడు. భావితప్పదు. మీ యిద్దరి పిల్లలులేరుగదా! అయుర్దాయ సమాప్తి యందెవడు చంపబడడు. అని దేవకీవసుదేవుల ననునయించి కారాగారమునుండి వదలిపెట్టి, సంతోషపరచి తన యంతర్గృహముం బ్రవేశించెను.

ఇది బ్రహ్మపురాణమందు 'కంసవిచారకథనము' అను నూటయెనుబదిమూడవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters