Brahmapuranamu    Chapters   

అథఆశీత్యుత్తరశతతమో7ధ్యాయః

శ్రీకృష్ణచరితే - చతుర్వ్యూహవర్ణనమ్‌

వ్యాస ఉవాచ

నమస్కృత్వా సురేశాయ విష్ణవే ప్రభవిష్ణవే | పురుషాయ పురాణాయ శాశ్వతాయావ్యయాయ చ || 1

చతుర్వ్యూహాత్మనే తసై#్మ నిర్గుణాయ గుణాయ చ | వరిష్ఠాయ గరిష్ఠాయ వరేణ్యాయామితాయచ || 2

యజ్ఞాంగాయాభిలాంగాయ దేవాద్యైరీప్సితాయ చ | యస్మాదణుతరం నాస్తి యస్మాన్నా స్తి బృహత్తరమ్‌ || 3

యేన విశ్వమిదం వ్యాప్తమజేన సచరాచరమ్‌ | ఆవిర్భావతి రోభావ దృష్టాదృష్టవిలక్షణమ్‌ || 4

వదంతి యత్సృష్ట మితి తథై వాప్యుపసంహృతమ్‌ | బ్రహ్మణ చా7దిదేవాయ నమస్కృత్య సమాధినా || 5

అవికారాయ శుధ్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ జష్ణవే విష్ణవే నమః || 6

నమో హిరణ్య గర్భాయ హరయే శంకరాయ చ | వాసుదేవాయ తారాయనర్గస్థిత్యంతకారిణ || 7

ఏకానేకస్వరూపాయ స్థూలసూక్ష్మాత్మనే నమః | అవ్యక్త వ్యక్త భూతాయ విష్ణవే ముక్తి హేతవే || 8

సర్గస్థితి వినాశానాం జగతో యోజగన్మయః | మూలభూతో నమస్తసై#్మ విష్ణవే పరమాత్మనే || 9

ఆధారభూతం విశ్వస్యాప్యణీయాంన మణీయసామ్‌ | ప్రణమ్య సర్వ భూతస్థ మచ్యుతం పురుషోత్తమమ్‌ || 10

జ్ఞాన స్వరూప మత్యంతం నిర్మలం పరమార్థతః | త మేవార్థ స్వరూపేణ భ్రాంతి దర్శనతః స్థితమ్‌ || 11

విష్ణుం గ్రసిష్ణుం విశ్వస్య స్థితౌ సర్గే తథా ప్రభుమ్‌ | అనాదిం జగతా మీశమజ మక్షయవ్యయమ్‌ || 12

కథయామి యథా పూర్వం యక్షాద్యైర్మునిపత్తమైః | పృష్టః ప్రోవాచ భగవానబ్జయోనిః పితామహః || 13

వ్యాసుడిట్లనియె. సురేశ్వరునికి సృష్టికారణునకు విష్ణువునకు పురాణపురుషునకు చతుర్వ్యూహ స్వరూపుడైన నిర్గుణ స్వరూపునకు గుణరూపునకు సర్వాధికునకు యజ్ఞాంగ స్వరూపునకు సర్వాంగునకు నమస్కారము. ఎవనికంటె నణువైన వస్తువు యెవనికంటె పెద్దదైన వస్తువులేదో, జననములేని యెవ్వనిచేత విశ్వము వ్యాప్తమైనదో బుట్టుట గిట్టుట దృశ్యమగుట యదృశ్య మగుటయను లక్షణములచే విలక్షణమైన చరాచర విశ్వవ్యాప్తమైన వానినిగా దెలుపుదురో యెవనివలన జగత్తు పుట్టినది నశించునదియని బ్రహ్మణ్యులు పేర్కొందురో యట్టినిర్వికారము శుద్ధము నిత్యము నేకైక రూపము విష్ణువు జిష్ణువు (సర్వవ్యావకము జయశీలము) నని వర్ణింపబడు పరమాత్మకు నమస్కారము. హిరణ్యగర్భునకు (స్వర్ణమయమైన బ్రహ్మాండము గర్భముగా గలవాడు) హరికి శంకరునకు వాసుదేవునకు (సర్వదేవనివాసమైన వానికి) తారునికి (సంసారమును తరింపజేయువాడు) నేక రూపునికి స్ధూలము సూక్ష్మమునైనవానికి నవ్యక్తము వ్యక్తమునైన వానికి ముక్తిహేతువగు విష్ణునకు జగన్మూలము నయినవానికి నమస్కారము. విశ్వమున కాధారమై నణువులకంటె నణువై సర్వభూతములందుండి చ్యుతిలేనివానికి (అచ్యుతునకు) నమస్కారము. పరమార్థముగ గేవల జ్ఞానరూపమయ్యు నర్థస్వరూపముగ భ్రాంతిదర్శనమున దృశ్యాత్మక జగత్తుగ గనిపించువానినిగ మునులు పేర్కొనెడి భగవత్తత్వమును గుఱించి బ్రహ్మమున్ను చెప్పినట్లు నేనును జెప్పుచున్నాను.

ఋక్వామాన్యుద్గిరన్వక్రైర్యః పునాతి జగత్రయమ్‌ | ప్రణిపత్య తథేశాన మేకార్ణవ వినిర్గతమ్‌ || 14

యస్యాసురగణా యజ్ఞాన్విలుంపంతి నయాజినామ్‌ | ప్రవక్ష్యామి మతం కృత్స్నం బ్రహ్మణో7వ్యక్తజన్మనః || 15

యేన సృష్టిం సముద్దిశ్య ధర్మాద్యాః ప్రకటీకృతాః | ఆపోనారా ఇతి ప్రోక్తా మునిభిస్తత్వ దర్మిభిః || 16

అయనం తస్యతాః పూర్వం తేన నారాయణః స్మృతః | సదేవో భగవాన్సర్వం వ్యాప్య నారాయణో విభుః 17

చతుర్థా సంస్థితో బ్రహ్మా సగుణో నిర్గుణ స్తథా | ఏకా మూర్తిరనుద్దేశ్యా శుక్లాం పశ్యంతి తాం బుధాః || 18

జ్వాలా మాలావనద్ధాంగీ నిష్టా సా యోగినాం పరా| దూరస్థా చాంతికస్థా చ విజ్ఞేయా సా గుణాతిగా || 19

వాసుదేవాభిధానా7సౌ నిర్మమత్వేన దృశ్యతే | రూపవర్ణాదయ స్తస్యా న భావాః కల్పనామయాః || 20

ఆస్తే చసా సదా శుధ్దా సుప్రతిష్ఠికరూపిణీ | ద్వితీయా పృథివీం మూర్థ్నా శేషాఖ్యా ధారయత్యథః || 21

తామసీసా సమాఖ్యాతా తిర్యక్త్వం సముపాగతా | తృతీయా కర్మ కురుతే ప్రజాపాలన తత్పరా || 22

సత్త్వోద్రిక్తాతుసా జ్ఞేయా ధర్మసంస్థాన కారిణీ | చతుర్థీ జలమధ్యస్థా శేతే పన్నగ తల్పగా|| 23

రజస్తస్యా గుణః సర్గం సాకరోతి సదైవహి | యా తృతీయా హరేర్మూర్తిః ప్రజాపాలన తత్పరా || 24

సాతు ధర్మ వ్యవస్థానం కరోతి నియతం భువి | ప్రోద్ధతా నసురాన్హంతి ధర్మవ్యుచ్ఛిత్తి కారిణః || 25

పాతి దేవాన్సగంధర్వాన్ధర్మ రక్షా పరాయణాన్‌ | యదాయదా చ ధర్మస్య గ్లానిః సముపజాయతే || 26

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజత్య7సౌ | భూత్వాపురా వరాహేణ తుండేనాపో నిరస్య చ || 27

ఏకయా దంష్ట్రయోత్ఖాతా నళినీవ వసుంధరా | కృత్వా నృసింహరూపం చ హిరణ్య కశిపుర్హతః || 28

విప్రచి త్తిముఖాశ్చాన్యే దానవా వినిపాతితాః | వామనం రూపమాస్థాయ బలిం సంయమ్య మాయయా || 29

త్రైలోక్యం క్రాంతవానేన వినిర్జిత్య దితేః సుతాన్‌ | భృగోర్వంశే సముత్పన్నో జామదగ్య్నః ప్రతాపవాన్‌ || 30

జఘాన క్షత్రియాన్రామః పితుర్వధమనుస్మరన్‌ | తథా7త్రితనయో భూత్వా దత్తాత్రేయః ప్రతాపవాన్‌ || 31

యోగమష్టాంగ మాచఖ్యావలర్కాయ మహాత్మనే | రామోదాశరథిర్భూత్వా సతుదేవః ప్రతాపవాన్‌ || 32

జఘాన రావణం సంఖ్యే త్రైలోక్యస్య భయంకరమ్‌ | యదా చై కార్ణవే సుప్తో దేవదేవో జగత్పతిః || 33

సహస్రయుగ పర్యంతం నాగపర్యంకగో విభుః | యోగనిద్రాం సమాస్థాయ స్వేమహిమ్ని వ్యవస్థితః || 34

త్రైలోక్యముదరే కృత్వా జగత్థ్సావర జంగమమ్‌ | జనలోకగతైః సిద్ధైః స్తూయమానో మహర్షిభిః || 35

ఎవడు తన ముఖములచేత ఋక్సాను మంత్రములను బఠించుచు నేకార్ణవమునుండి వెలువడివచ్చి ముల్లోకముల బవిత్రము జేయునో యట్టియీశానునకు నమస్కరించి దేవతలు యజ్ఞములొనరించు వారి యజ్ఞాచరణమునకు లోపము రానీయరో యాయనకు నమస్కరించి యవ్యక్తమునుండి పుట్టిన బ్రహ్మయొక్క సమగ్రమైన యభిప్రాయమును దెలుపుచున్నాను. ఆయన సృష్ఠినుద్దేశించి ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములను వేదరూపమున ప్రకటించియున్నాడు. ఆపః (దీనికి నీరు సామాన్యార్థము. కాని దానికి మూల పదార్థమైన విద్యుత్తు ప్రకాశోదకమను బేర నర్థమని ఋషులు చెప్పినారు) వానికి నారములని నామాంతరము. అవియ యనము అనగా గమ్యస్థానము (ఉనికి)గ గలవాడు నారాయణుడు. సృష్ఘిమూలమైన నాపోరూపమున సర్వవ్యాపకమైయున్న తత్త్వమే నారాయణ తత్త్వమని తాత్పర్యము, ఆ భగవత్తత్వము నాలుగు విధములై యున్నది. ఒకమూర్తి శుక్లవర్ణము. అది జ్వాలా మాలామయము. దానిని యోగులు జ్ఞానులు మాత్రమే దర్శింతురు. అది దూరమందును దగ్గరనుగూడ నుండునది. అది గుణములకతీతమైనది. వాసుదేవనామమున నుండునది. మమకారములేని స్థితిలోనే యది కనబడును. రూపము రంగు మొదలగు కల్పిత భావములు దానికిలేవు. కేవల శుద్ధస్వరూపము. మిక్కిలి నిలకడగల వస్తువు. ఇక రెండవ వ్యూహము. శేషుడను బేర భూమిని ధరించుచున్నది. అది తమోగుణమూర్తి. తిర్యగ్భావమును బొందినది. అనగా బశుత్వమునొందినదని యర్థము. మూడవ వ్యూహము సత్వప్రధానమూర్తి ధర్మ సంస్థాపనమొనరించి ప్రజారక్షణ నిమిత్తమైన కర్మను (స్థితిరూపమును జేయునది) నాలుగవ వ్యూహము (మూర్తి) శేషతల్పమున సముద్రమధ్యమందుండును. రజోగుణరూపము సర్గకారణము (సృష్ఠి కారణము) ఈ చెప్పిన వానిలో మూడవ మూర్తియగు హరి స్వరూపము ధర్మ వ్యవస్థాపనము జేయును. ధర్మనాశముజేయ జలరేగిన నసురులను సంహారించును. ధర్మపరాయణులైన దేవ గంధర్వాదులను రక్షించును. ఈమూర్తి యెపుడు ధర్మము వాడిపోవునో యధర్మము ప్రకోపించునో యపుడు తననుతాను సృజించుకొనును. మున్ను వరాహమై ముట్టెతో నుదకమును జిమ్ముకొని వచ్చి తనయొక్క కొమ్ముచేత నీవసుంధరను బద్మిని (తామర తీగ) నట్లు పైకెత్తినది. ఈ మూర్తియే నరసింహమూర్తియై హిరణ్యకశిపుని సంహరించినది. దేనిచేతనే విప్రచిత్తి మొదలుగా మఱందరో దానవులు గూల్పబడిరి. వామన రూపమూని మాయచే బలిని బంధించి దైత్యులగెలచి ముర్లోకమాక్రమింపబడినది. భృగువంశమందు జమదగ్ని కుమారుడై పుట్టి యద్భుత ప్రతాపముచే నొకరాచపురువు తండ్రిని సంహరించినాడని సర్వక్షత్రియ నాశనమొనరించినది. అట్లే అత్రి కుమారుడై ప్రతాపశీలియై దత్తాత్రేయుడను బేరనుదయించి మహాత్ముడైన యలక్కునకు నష్టాంగ యోగమునుపదేశించినది. దశరథకుమారుడై రాముడనుబేర పుట్టి రావణుని సంహరించినది. సర్వజగత్తు నొకేసముద్రమైనపుడు ఈ సర్వజగత్ప్రభువు అనేక యుగసహస్రములు నాగపర్యంక శయనుడై యోగనిద్రనూని తన మహిమయందు దాన నిమిడియుండి ముల్లోకములను గర్భమునదాల్చి జనోలోకమందున్న సిద్ధులు స్తుతింప విలసిల్లుచుండును.

తస్యనాభౌ సముత్పన్నం పద్మం దిక్పత్ర మండితమ్‌| మరుత్కింజల్క సంయుక్తం గృహం పైతామహం వరమ్‌||

యత్ర బహ్మా సముత్పన్నో దేవదేవశ్చతుర్ముఖః | తదా కర్ణమలోద్బూతౌ దానవౌ మధుకైటభౌ || 37

మహాబలౌ మహావీర్యౌ బ్రహ్మాణం హంతుముద్యతౌ | జఘాన తౌ దురాధర్షౌ ఉత్థాయ శయనోదధే || 38

ఏవ మాదీం స్తథైవాన్యాన సంఖ్యాతుమిహోత్సహే | అవతారో హ్యస్యేహ మాథురః సాంప్రత స్త్వయమ్‌ || 39

ఇతిసా సాత్వికీ మూర్తిరవతారం కరోతి చ | ప్రద్యుమ్నేతి సమాఖ్యాతా రక్షాకర్మణ్యవస్థితా || 40

దేవత్వే7థ మనుష్యత్వే తిర్యగ్యోనౌ చ సంస్థితా | గృహ్ణాతి తత్స్వభావశ్చ వాసుదేవాచ్చయా సదా|| 40

దదాత్య భిమతాన్కా మాన్పూజితా సా ద్విజోత్తమా | ఏవం మయా సమాఖ్యాతః కృతకృత్యో7పి యఃప్రభుః || 41

మానుషత్వం గతో విష్ణుః శృణుధ్వం చోత్తరం పునః || 42

ఇతి బ్రహ్మపురాణ చతుర్వ్యూహ వర్ణనం నా మాశీత్యధికశతతమో7ధ్యాయః

అయ్యనంతశయనమూర్తినాభినుండి దిక్కులేరేకులుగా భాసించునొక పద్మము బుట్టినది. అందలి కేసరములు మరుద్గణము. (వాయు) అది పితామహుని చతుర్ముఖుని పుట్టిల్లు. యోగనిద్రనున్న యాస్వామి గులిమినుండి మదుకైటభులను దానవులుబుట్టిరి. మహావీర్యులు మహాబలశాలులునై బ్రహ్మను చంపబోయిన యాయిద్దరను తల్పమునుండి లేచి యా ప్రభువు సంహరించెను. ఇట్లనేకలీలలు ఆయనవి అసంఖ్యాకములు.అట్టియజుడు అవికారుడు మధురానగరములోనవతరించియున్నాడు. ఈసాత్వికమూర్తిజగత్‌స్థితిహేతువైయవతరించగా బ్రద్యుమ్ననామముననాల్గవ వ్యూహముగజెప్పబడినది. ఈ మూర్తియొకపుడు దేవభావమును నొకతఱి మనుష్య భావమును వెరొకయెడ పశుపక్ష్యాది భావమునుగూడ గ్రహించుచుండి తదనురూప స్వభావమునై వాసుదేవాఖ్యమై పూజింపబడి యభీష్టముల ననుగ్రహించుచున్నది. కృతకృత్యుడయ్యు (ఏకర్తవ్యములేనివాడయ్యు) సర్వ ప్రభువైన విష్ణువునుగూర్చి నేనింతవరకు దెల్పితిని. ఆయన మనుష్యత్వమును బొంది చేసిన లీలావిశేషములను నిటుపై నాలింపుడు.

ఇది బ్రహ్మపురాణమున చతుర్వ్యూహవర్ణనమను నూట యెనుబదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters