Brahmapuranamu    Chapters   

అష్టసప్తత్యధికశతతమో7ధ్యాయః

కండూపాఖ్యానమ్‌

వ్యాసఉవాచ

తస్మిన్‌క్షత్రేమునిశ్రేష్ఠాః సర్వసత్త్వసుఖావహే| ధర్మార్థకామమోక్షాణాం ఫలదేపురుషోత్తమే ||1

క డుర్నామ మహాతేజా ఋషిఃపరమధార్మికః| సత్యవాదీ శుచి ర్దాంతః సర్వభూతహితే రతః|| 2

జితేంద్రియో జితక్రోధో వేదవేదాంగపారగః| అవాపపరమాం సిద్ధి మారాధ్యపురుషోత్తమమ్‌ || 3

అన్యే7పితత్రసంసిద్దా మునయః సంశితవ్రతాః|సర్వభూతహితా దాంతా జితక్రోధా విమత్సరాః ||4

మునయఊచు

కో7సౌ కండుః కథవ తత్ర జగామ పరమాం గతిమ్‌| శ్రోతుబిచ్ఛామహేతస్య చరితంబ్రూహిసత్తమ|| 5

కండూపాఖ్యానము

వ్యాసులిటనిరి

ఓ మునీశ్వరులారా! సర్వజీవి సుఖకరమైనది సర్వపురుషార్థము లిచ్చునదియునైన యాపురుషోత్తమ క్షేత్రమున ''కండువు'' అను నొకఋషి పరమ ధర్మాత్ముడు తేజస్వి సత్యవాది శుచి ఇంద్రియముల నిగ్రహించినవాడు సర్వభూత హితువు కోరువాడు క్రోధములేనివాడు వేదవేదాంగ పారంగదుడునై వసించుచుండెను. అతడు పురుషోత్తము నారాధించి పరమ సిద్ధి నందెను. అట్టి వారే మఱిపెక్కుమంది మునులు నతనివలె ముక్తినందిరి. అనమునులు ఈ కండువెవరు? అచట పరమగతి నెట్లందెను? ఆచరిత్ర వినవలతుమన వ్యాసులిట్లనిరి.

వ్యాసఉవాచ

శృణుధ్వం మునిశార్థూలాః కధాం తస్యమనోహరామ్‌| ప్రవక్ష్యామి సమాసేన మునే స్తస్య విచేష్టితమ్‌ || 6

పవిత్రే గౌతమీతరే విజనే సుమనోహరే| కందమూలఫలై ః పూర్ణే సమిత్పుష్పకుశాన్వితేః ||7

నానాద్రుమలతాకీర్ణే నానాపుష్పోపశోభితే| నానాపక్షిరుతేరమ్యే నానామృగ గణాన్వితే || 8

తత్రా77శ్రమపదం కండో ర్బభూవ మునిసత్తమాః| సర్వర్తులపుష్పాఢ్యం కదళీషండ మందితమ్‌|| 9

తపస్తేపేమునిస్తత్ర సుమహత్పరమాద్బుతమ్‌| వ్రతోపవాసై ర్నియమైః స్నానమౌనసు సంయమైః || 10

గ్రీష్మే పంచతపా భూత్వా వర్షాసు స్థండిలేశయః| ఆర్థ్రవాసాస్తుహేమంతే సతేపే సుమహత్తపః ||11

దృష్ట్వా తు తపసోవీర్యం మునే స్తస్య సువిస్మితాః| బభూవుర్థేవగంధర్వాః సిద్ధవిద్యాధరా స్తథా || 12

భూమింతథా7న్తరిక్షం చ దివం చ మునిసత్తమాః| కండుః సంతాపయామాస త్రైలోక్యంతపసోబలాత్‌|| 13

అహో7స్య పరమం ధైర్య మహో7స్య పరమం తపః | ఇత్యబ్రువంస్తదా దృష్ట్వా దేవా స్తం తపసిస్థితమ్‌|| 14

మంత్రయామాసు రవ్యగ్రాః శ##క్రేణసహితా స్తదా| భయా త్తస్య సముద్విగ్నా స్తపోవిఘ్నమభీప్సవః|| 15

జ్ఞాత్వాతేషామభిప్రాయం శక్రస్త్రిభువనేశ్వరః| ప్రవ్లూెచాఖ్యాం వరారోహాం రూప¸°వన గర్వితామ్‌ || 16

సుమధ్యాం చారుజంఘాం తాం పీనశ్రోణిపయోధరాం| సర్వలక్షణ సంపన్నాం ప్రోవాచబలసూదనః || 17

శక్రఉవాచ

ప్రవ్లూెచే! గచ్ఛశీఘ్రంత్వం యదా7సౌతప్యతేమునిః| విఘ్నార్థంతస్యతపసః క్షోభయస్వా77శు సుప్రభే || 18

ప్రవ్లూెచోవాచ

తవవాక్యంసుర శ్రేష్ఠ! కరోమి సతతం ప్రభో| కింతుశంకా మమైవాత్ర జీవితసప్య చ సంశయః || 19

బిభేమి తం మునివరం బ్రహ్మచర్యవ్రతే స్థితమ్‌| ఆత్యుగ్రందీప్తతపసం జ్వలనార్క సమప్రభమ్‌|| 20

జ్ఞాత్వామాం స మునిః క్రోధాద్విఘ్నార్థం సముపాగతామ్‌| కండుః పరమతేజస్వీ శాపందాస్యతి దుఃసహమ్‌|| 21

ఊర్వశీమేనకా రంభాఘృతాచీ పుంజికస్థలా| విశ్వాచీ సహజన్యా చ పూర్వచిత్తిస్తిలోత్తమా|| 22

అలంబుషా మిశ్రకేశీ శశిలేఖా చ వామనా| అన్యాశ్చాప్సరసః సంతి రూప¸°వనగర్వితాః || 23

సుమధ్యాశ్చారువదనాః బీనోన్నతపయోధరాః| కామప్రధాన కుశలా స్తా స్తత్రైవంని యోజయ|| 24

మునులారా! ఇదె వినుండు. పవిత్రమైన గొమతీ నదీతీరమందు కందమూలఫల సమృ ద్ధము సమిత్పుష్ట కుశసంపూర్ణమునైన పుణ్యాశ్రమము కండుమును నివాసమయ్యెను. అది సర్వర్తు ఫల పుష్ప శోభితము. అందాయన యమనియమాదులతో మౌనముతో దపమాచరించు చుందెను. గ్రీష్మఋతువున పంచాగ్ని మధ్యమున వర్షాకాలమున ఆవరణము లేని యెడ దడ బట్టలతో చలికాలములో మహాతపమాచరించెను. అదిచూచి ఈయన తపస్సు వేడిమికి భూమి అంతరిక్షము స్వర్గముగూడ నుడికేత్తినవి. ఆహా! ఈయున ధైర్యమేమి ఈతపస్సేమి అని దేవతలు వెరగంది యందరు నాయన తపము భంగము గావింతమని నిశ్చయించిరి. వారి తల పెఱింగి యింద్రుడు ప్రవ్లూెచ యను నప్సరసను పరమసుందరిని జూచి భామినీ! కండుముని తపమాచరించు తావున కిప్పుడు చనుము. ఆతని తపమ్ము చెరచి క్షోభింప జేయుమనియె. ఆమె ప్రభూ! నీయాజ్ఞ తప్పక సేసెదను కాని యిక్కడ నాకు జీవిత సంశయమేర్పడినది. బ్రహ్మచర్యనిష్ఠుడగు నమ్మునిని మహ్రోగ్ర తపస్విని అగ్ని నూర్యులట్లు వెలుగువానినిగ నెఱిగిన దానం గావున జడియుచున్నాను. అతడు దుస్సహమయిన శాపమీయగలడు. ఏలినవారి యానలో ఊర్వశ్యాదులెందరో యప్సరసలు న్నారు. వారు సుందరులు నెఱజాణలు. ఎవ్వనినేని మోహింపజేయగల నేర్పరులు. వారి నాపనిలో నియోగింపుమనెను.

బ్రహ్మోవాచ

తస్యాస్తద్వచనం శ్రుత్వా పునఃప్రాహశచీపతిః| తిష్ఠంతునామ చాన్యాస్తా స్త్వంచాత్రకుశలాశుభే! || 25

కామం వసంతం వాయుంచ సహాయార్థే దదామితే| తై స్సార్థం గచ్ఛసుశ్రోణి! యత్రా77స్తే సమహామునిః || 26

శక్రస్య వచనం శ్రుత్వా తదా సా చారులోచనా| జగామా77కాశ మార్గేణ త్సై సార్థం చా7శ్రమం మునేః || 27

గత్వాసాతత్ర రుచిరం దదర్శ వనము త్తమమ్‌| మునించ దీ ప్తతపస మాశ్రమస్థ మకల్మషమ్‌|| 28

అపశ్యత్సా వనం రమ్యం తై స్సార్థం నందనోపమ్‌| సర్వర్తువరపుష్పాఢ్యం శాఖామృగ గణాకులమ్‌ || 29

పుణ్యం పద్మబలోపేతం సపల్లవ మహాబలమ్‌| శ్రోత్ర రమ్యా న్సుమధురాన్‌ శబ్డా న్ఖగముఖేరితాన్‌ || 30

సర్వర్తు ఫల భారాఢ్యా న్సర్వర్తు కుసుమోజ్జ్వలాన్‌| అపశ్యత్పాదపాంశ్చైవ విహంగై రనునాదితాన్‌ || 31

ఆమ్రా నామ్రాతకా న్భవ్యాన్నారికేళాన్సతిందుకాన్‌ | అథ బిల్వాం స్తతా జీవా న్దాడిమాన్బీజ.పూరకాన్‌|| 32

పనసాన్‌ లకుచాన్నీపానక శిరీషా న్సుమనోహరాన్‌| పారావతాం స్తథా కోలా నరిమేదావ్లుె వేతసాన్‌|| 33

భల్లాతకానామలకాన్‌ శతపర్ణాంశ్చ కింశుకాన్‌ | ఇంగుదాన్కరవీరాంశ్చ హరీతక విభీతకాన్‌|| 34

ఏతానన్యాంశ్చ సా వృక్షాన్‌ దదర్శపృథులోచనా| తథై వాశోక పున్నాగ కేతకీవకులానథ|| 35

పారిజాతాన్కోవిదారాన్మందారేందీవరాం స్తథా| పాటలాః పుష్పితా రమ్యా దేవదారుద్రుమాం స్తథా|| 36

సాలాంస్తాలాం స్తమాలాంశ్చ నిచులాన్‌ లోమకాంస్తథా| అన్యాంశ్చ పాదపశ్రేష్ఠానపశ్యత్ఫల పుష్పితాన్‌ || 37

చకోరైః శతపత్రైశ్చ భృంగరాజైస్తథా శుకైః | కోకిలైః కలవింగైశ్చ హాకతైర్జీవజీవకైః || 38

ప్రియపుత్రై శ్చాతకైశ్చ తథా7న్యై ర్వివిధైఃఖగైః | శ్రోత్రరమ్యం సుమధురం కూజద్భిశ్చాప్యధిష్ఠితాన్‌|| 39

సరాంసి చ మనోజ్ఞాని ప్రసన్నసలిలారనిచ| కుముదైః పుండరీకైశ్చ తథానీలోత్పలైశ్శుభై ః || 40

కల్హారైః కమలైశ్చైవ ఆచితాని సమంతతః| కాదంభైశ్చక్రవాకైశ్చ తథైవ జలకుక్కుటై ః || 41

కారండవై ర్భకైర్హంసైః కూర్శైర్మద్గుభిరేవచ| ఏతైశ్చాన్యైశ్చకీర్ణాని సమంతాజ్జలచారిభిః ||42

క్రమేణౖవ తథాసాతు వనం బభ్రామ తైః సహ| ఏవం దృష్ట్వా వనం రమ్యంతై ః సార్థం పరమాద్బుతమ్‌ || 43

విస్మయోత్ఫుల్లనయనా సా బభూవ వరాంగనా | ప్రోవాచ వాయుం కామం చ వసంతం చ ద్విజోత్తమాః || 44

ప్రవ్లూెచో వాచ

కురుధ్వం మమ సాహాయ్యం యూయం సర్వే పృథక్పృథక్‌ || 45

ఆమె మాటవిని యింద్రుడు----

ఎందరో ఉందురుగాక! ఇక్కడ నీవే నేర్పరివి. నీకు మన్మథుని వాయువును గూడ తోడొసంగెద నీవేగుమను నా ప్రవ్లూెచ యాకసమున నమ్మున్యాశ్రయమునకుం జనియె. అచ్చట నొక సుందర వనమీక్షించెను.

అందాశ్రమమందున్న యమ్మునింజూచెను. అయ్యాశ్రమో పాంతమందలి యావనము శోభ నిరుపమానము, సర్వ పుష్ప ఫలభరితము సర్వర్తుశోభనము. అందలి పావురములు కోవెల లయొక్క కలకూజితములు శ్రవణ మనోహరములు ఆ విశాలనయన యాయందమును చేరి పాఱజూచి యమ్మధుర నాదములు విని ప్రసన్న నలిలములైన కొలనులం జూచి వనంతా దులతో మీరందఱు నాకు దోడ్పడుడని హెచ్చరించెను.

బ్రహ్మోవాచ

ఏవముక్త్వా తదా సాతు తథేత్యుక్తా సురైర్ద్వితాః | ప్రత్యువాచాద్య యాస్యామి యత్రా7సౌ సంస్థితో మునిః ||

అద్య తం దేహయంతారం ప్రయుక్తేంద్రియ వాజినమ్‌ | స్మర శస్త్రగళద్రశ్మిం కరిష్యామి కుసారథిమ్‌ || 47

బ్రహ్మోజనార్దనో వా7పియది వా నీలలోహితః తథా77ప్యద్య కరిష్యామి కామబాణక్షతాంతరమ్‌ || 48

ఇత్యుక్త్వా ప్రయ¸° సా7థ యత్రాసౌ తిష్ఠతే మునిః | మునేస్తపః ప్రభావేణ ప్రశాంత శ్వాపదాశ్రమమ్‌ || 49

సా వుంస్కోకిల మాధుర్యే నదీతీరే వ్యవస్థితా | స్తోకమాత్రం స్థితా తస్మా దగాయత వరా7ప్సరాః || 50

తతో వసంతః సహసా బలం సమకరోత్తదా |కోకిలారావ మధుర మకాలిక మనోహరమ్‌ || 51

వవౌ గంధవహశ్చైవ మలాయాద్రినికేతనః | పుష్పానుచ్చావచాన్మేధ్యా న్పాతయంశ్చ శ##నై శ్శనైః || 52

పుష్పబాణధరశ్చైవ గత్వా తస్య సమీపతః | మునేశ్చ క్షోభయామాస కామస్తస్యాపి మాననమ్‌ || 53

తతో గీతధ్వనిం శ్రుత్వా మునిర్వస్మిత | మానపః | జగామ యత్ర సా సుభ్రూః కామబాణప్రపీడితః || 54

దృష్ట్వా తామాహ సందృష్టో విస్మయోత్పుల్లలోచనః | భ్రష్టోత్తరీయో వికలః పులకాంచిత విగ్రహః || 55

ఋషిరువాచ

కా7సి కస్యాసి సుశ్రోణి సుభ##గే చారుహాసిని మనోహరసి మే సుభ్రు బ్రూహి సత్యం సుమధ్యమే || 56

ప్రవ్లూెచోవాచ

తవ కర్మకారా చాహం పుష్పార్థమహమాగతా| ఆదేశం దేహి మేక్షిప్రం కిం కరోమి తవా77జ్ఞయా || 57

వ్యాసఉవాచ

శ్రుత్వైవం వచనం తస్యాస్త్యక్త్వా ధైర్యం విమోహితః | ఆదాయ హస్తే తాం బాలాం ప్రవివేశ స్వమాశ్రమమ్‌ ||

తతః కామశ్చ వాయుశ్చ వసంతశ్చ ద్విజోత్తమాః | జగ్ముర్యథాగతం సర్వేకృతకృత్యా స్త్రివిష్టపమ్‌ || 59

శశంసుశ్చ హరిం గత్వా తస్యాస్తస్య చ చేష్టితమ్‌| శ్రుత్వా శక్రస్తదా దేవాః ప్రీతాః సుమససో7భవన్‌ || 60

ఇట్లని వారిచే నౌననిపించుకొని యిప్పుడ యమ్మునిచెంత కేగెదను. శరీర రథనమును నింద్రియములను గుఱ్ఱముచే నిగ్రహించిన యాతని వూవిలుతునమ్ములచే పగ్గముల బిగువు సడలింజేసి జేతగాని సారథిం గలవానిబోలె జేసెదను. బ్రహ్మ జనార్దనుడు శివుడయినను నగుగాక నీక్షణములో కామ బాణక్షతుని గావించెదనని యమ్ముని ప్రశాంతా శ్రమందు నిలిచి యల్లల్లన సంగీతము పాడనారంభించెను. అంతట ననంతుడు తనబలగ ముల గూర్చి కొని యకాలిక మధుర కోకిలారావము మేళవింపజేసెను. గంధవహుడు (వాయువు) మలయాద్రి నుండి యల్లల్లన వీవందొడంగె. అంతియ కాదవ్వనసీమ నల్గడల నాచెట్లునుం పూవులం జలజల రాల్చెను. మదనుడు వూవుటమ్ముల నమ్ముని మనస్సును గలగుండు పరచెను. అంత కండువా సంగీత ధ్వని నాలకించి వింతగొని యావిడయున్న తావునకేగి యా సొగనులాడి సోయగమున కచ్చెరువడి తేఱిపాఱ జూచి పైవలువజార మేను గగుర్బోడవ మది చెదరి యల్లన నిట్లు పలుకరించె. ఓ సుందరి ! నీవెటనుండుదానవు ఎవరిదానవు నామనను జూరగొనుచున్నావు. నిజము తెల్పుమన నామె నీదాన్యము సేసెదను. పువులకోఱకు వచ్చతిని. నావలనం బనిగొనుము నీ యాజ్ఞనిప్పుడు నిర్వ హింతును. అనవిని ముని మోహముగొని ధైర్యమొడలి యామెంజేత బట్టుకొని తనయాశ్ర మముంజొచ్చెను. అవ్వల బువ్విలుకాడు వాయువు వనంతుడునిట్లు తమపని చక్కవెట్టికొని వచ్చినదారి సమరపురి కరిగిరి. అతని యొక్కయు నామెయొక్కయు సమావేశ వృత్తాంతము నింద్రున కేరింగించిరి. సురపతియు సురలు నది విని ప్రీతిసెందిరి.

సచ కండుస్తయా సార్ధం ప్రవిశ##న్నేవ చా77శ్రమమ్‌ | ఆత్మనః పరమం రూపం చకార మదనాకృతి || 61

రూప ¸°వన నంపన్న మతీవసుమనోహరమ్‌ | దివ్వాలంకార సంయుక్తం షోడశాబ్దవయోమితం || 62

దివ్య వస్త్రధరం కాంతం దివ్యస్రగ్గంధభూషితమ్‌ | సర్వోప భోగసంపన్నం సహసా తపసో బలాత్‌ || 63

దృష్ట్వా సా తస్య తద్వీర్యంపరం విస్మయమాగతా | ఆహో7స్య తపసో వీర్య మిత్యుక్త్వా ముదితా7భవత్‌ || 64

స్నానం సంధ్యాం జపం హోమం స్వాధ్యాయం దేవతార్చనమ్‌ | వ్రతోప వాసనియమం ధ్యానం చ మునిసత్తమాః ||

త్యక్త్వా స రేమే ముదితస్తయా సార్ధమహర్నిశమ్‌ | మన్మథా విష్టహృదయో న బుబోధ తపః క్షయమ్‌ || 66

సంధ్యారాత్రి దివాపక్ష మాసర్త్వయన హాయనమ్‌ | న బుబోధ గతం కాలం విషయాసక్త మానసః || 67

సా చ తాం కామజైర్భావై ర్విదగ్ధా రహసి ద్విజాః | వరయామాస సుశ్రోణిః వ్రలాపకుశలా తదా || 68

ఏవం కండుస్తయా సార్ధం వర్షాణామధికం శతమ్‌ | అతిష్ఠన్మందరద్రోణ్యాం గ్రామ్యధర్మరతో మునిః || 69

సా తం ప్రాహ మహాభాగం గంతుమిచ్చామ్యహం దివమ్‌ | ప్రసాద సుముఖో బ్రహ్మన్ననుజ్ఞాతుం త్వమర్హసి || 70

తయైవ ముక్తః సమునిస్తస్యా మాసక్త మానసః | దినావి కతిచిద్భద్రే స్థీయతామిత్య భాషత || 71

ఏవముక్తా తతస్తేన సాగ్రం వర్షశతం పునః | బుభుజే విషయాం స్తన్వీ తేన సార్ధం మహాత్మనా | 72

అనుజ్ఞాం దేహి భగవన్ర్వజామి త్రిదశాలయమ్‌ | ఉక్తస్తయేతి సపునః స్థీయతామిత్యభాషత || 73

వునర్గతే వర్షశ##తే సాధికే సా శుభాననా | యామ్యహం త్రిదివం బ్రహ్మన్ర్పణయస్మిత శోభనమ్‌ || 74

ఉక్తస్తయైవం సమునిః వునరాహా77యతేక్షణామ్‌ | ఇహా77స్యతాం మయా సుభ్రు | చిరం కాలం గమిష్యసి || 75

తచ్ఛాస భీతా నుశ్రోణీ సహ తేనర్షిణా పునః | శతద్వయం కించిదూనం వర్షాణాం సమతిష్ఠత || 76

గమనాయ మహాభాగో దేవరాజనివేశనమ్‌ | ప్రోక్తః ప్రోక్తస్తయా తన్వ్యా స్థీయతామిత్యభాషత || 77

తస్య శాప భయాద్బీరుర్ణాక్షిణ్యన చ దక్షిణా | ప్రోక్తా ప్రణయభంగార్తి వేదినీ న జహౌ మునిమ్‌ || 78

తయా చ రమతస్తస్య పరమర్షేరహర్నిశమ్‌ | నవం నవమభూత్ర్పేమ మన్మథాసక్త చేతసః || 79

ఏక దాతు త్వరాయుక్తో నిశ్చశ్రామోటజాన్మునిః | నిష్క్రామంతం చ కుత్రేతి గమ్యతే ప్రాహసాశుభా || 80

ఇత్యుక్తః సతయా ప్రాహ పరివృత్త మహాః శుభే | సంధ్యోపాస్తిం కరిష్యామి క్రియాలోపో7స్యథా భ##వేత్‌ || 81

తతః స్రహస్య ముదితా సాతం ప్రాహమహామునిమ్‌ | కిమద్య సర్వధర్మజ్ఞ పరివృత్త మహస్తవ

గత మేతన్న కురుతే విస్మయం కస్యకథ్యతే || 82

మునిరువాచ

ప్రాత స్త్వమాగతా భ##ద్రే నదీతీరమిదం శుభమ్‌ | మయా దృష్ట్వా7సి సుశోణి ప్రవిష్టా చ మమా77శ్రమమ్‌ || 84

ప్రవ్లూెచోవాచ

ప్రత్యూషస్యాగతా బ్రహ్మన్సత్యమేతన్న మే మృషా | కిం త్వద్య తస్య కాలస్య గతాన్యబ్దశతాని తే || 85

తతః ససాధ్వసో విప్రస్తాం పప్రచ్ఛా77యతేక్షణామ్‌| కధ్యతాం భీరు కః కాలస్త్వయా మేరమతః సదా || 86

సప్తోత్తరాణ్యతీతాని నవవర్ష శతానిచ | మాసాశ్చ షట్తథై వాన్యత్సమతీతం దినత్రయమ్‌ || 87

ఋషిరువాచ

సత్యం భీరు వదస్యేత త్పరిహాసో7థవా శుభే | దిన మేక మహం మన్యే త్వయా సార్థ మిహోషితమ్‌ || 88

ప్రవ్లూెచోవాచ

వదిష్యా మ్యనృతం బ్రహ్మన్‌ | కథమత్రతవాంతికే | విశేషాదద్య భవతా పృష్టా మార్గానుగామినా || 89

వ్యాసఉవాచ

నిశమ్య తద్వచస్తస్యాః పముని ర్ద్విజసత్తమాః | ధిగ్ధిజ్మా మిత్యనాచారం వినింద్యా77త్మాన మాత్మనా || 90

ముని రువాచ

తపాంసి మమ నష్టాని హతం బ్రహ్మవిదాం ధనమ్‌ | హృతో వివేకః కేనాపి యోషిన్మోహాయ నిర్మితా || 91

ఊర్మిషట్కాతిగం బ్రహ్మజ్ఞేయ మాత్మజయేన మే | గతిరేషా కృతా యేన ధిక్తం కామమహాగ్రహమ్‌ || 92

వ్రతాని సర్వవేదాశ్చ కారణాన్యఖిలాని చ | సరకగ్రామ మార్గేణ కామేనాద్య హతానిమే || 93

వినింద్యేత్థం ధర్మజ్ఞః స్వయమాత్మాన మాత్మనా | తామప్సరస మాసీనాం మిదం వచన మబ్రవీత్‌ || 94

కండుముని యవ్వనితతో నాశ్రమముంజొచ్చి మనోహర రూపము నిండుజవ్వనముం దనకు సంతరించుకొనియె. దివ్యవస్త్రములు దివ్యాభరణములుం దాల్చి పదునాఱండ్ల యీడున నున్న యా యందగానింగాంచి కేవలతపశ్శక్తిచే దివ్యకుసుమాలలు దాల్చి సుగంధము బూసికొని సర్వభోగసంపన్నుడై యప్పటికప్పుడ తోచిన యా తపస్వి ప్రభావ ముంగని యచ్చెరువుపడి యవ్వేల్పుపడతి, ఓహో! ఈయన తపస్సు ఈయన వీర్యమ ద్భుతమని కడుంగడు సంబరపడెను. స్నానసంధ్యలు జపము హోమము బ్రహ్మయజ్ఞము దేవతార్చనము ధ్యానము వ్రతోపవాస నియమములనువదలి యమ్ముదితతో రేయింబవళ్ళు మదనవశుడై క్రీడించెను. తపస్సు క్షయమైనదనికూడ గుర్తింపడయ్యె.. విషయలంపటుడై పగలురాత్రి సంధ్యపక్షమాసర్తు సంవత్సరము లేవోకూడ తేలియకయామె వలంపునంబడియె. అక్కాంతయు పంచబాణప బాణనిహతయై యోకాంతముని నింపు నింపుపలుకుల నుపలాలించుచు నతనింగోరిరమించెను. ఇట్లామేని గ్రామ్యసుఖము మఱగి వందయేండ్లా సుందరితో మందరగిరి కందరమునందుండెను. అంతనది యమ్మాహానుభావుంగని నేను స్వర్గమునకేగెద. ప్రసన్నముఖువై యోబ్రహ్మణ్యమూర్తీ యనుజ్ఞదయసేయుమనియె. అతడామెయెడ నెడలని వలపుగొని కల్యాణి ! కొన్నిదినములండుమనియె. అట్లయని యా వేల్పువడతి నూరేండ్లకుమించి యాతని తోడి పొందుగొని యింపోందె. ఆ మీద మఱల యనుమతింపుమనియె. కాదుకాదు నిలునిలుమన మఱి వందసంవత్సరము లేగె. ఎడనెడ నిట్లావిడయడుగుటయునమ్ముని వలపుగొని వలదనుటయుంగా జరుగుచుండ నాతని శాపమున కడలి యాదేవకామిని యించుక తక్కువగా రెండువందలేండ్లు ప్రణయ భంగమువలన గలుగు బాధ నెఱింగినదికావున యాతని వదలిపోదయ్యెను. అప్సరమర్షి దానితో రేయింబవళ్లు రమించుచున్న కొలది ప్రేమయెప్పటికప్పుడు గ్రొత్తది కాజొచ్చెను. ఒక్కతఱి నాతడు తత్తరముగొని యిల్లువిడిచి చనుచుండ నానురకాంత ఎచటికేగుచున్నారన కల్యాణి తెల్లవారినది. సంధ్యవార్చెదను. కాదేని అనుష్ఠానలోప మగునన నల్లన నవ్వి యమ్మహామునింగని ఓ ధర్మజ్ఞ ! ఇప్పుడా నీకు తెల్లవారుట అనుష్ఠానమెప్పుడో గతించినది. ఇమ్మాట యెవనికి వింత గొలువదు? అననమ్ముని ఈ యుదయమే నీవీ నదీతీరమునకు వచ్చితిని నాకు గనబడితివి. నా యాశ్రమమును జొచ్చితిని. సంధ్యాసమయమయినది ప్రోద్దెక్కినది ఎందుకు పరియాచకములాడెదవు? ఉన్నదున్నట్లు పలుకుము. అనవిని ప్రవ్లూెచ నేను వేకువవేళ వచ్చిన మాట ఓ బ్రహ్మణ్యా నిజమే నేనబద్దమాడుట లేదు. కాని ఇప్పుడా కాలము కొన్ని వందలేండ్లు గడిచిపోయినదనియె. అంతట నా విప్రుడు వెఱపుగొని యామెంగని నీతో నేను క్రీడించిన కాలమెలతో నిజము చెప్పుము జడియకుము. పరిహాసమా? యన తొమ్మిదివందలేండ్ల ఆరుమాసాల మూడు రోజులయినది అబద్దమాడను బ్రహ్మణ్యుడవగు నీ సన్నిధినా అబద్దములాడుట దారియించుకయుం దప్పని మహానుబావులగు తమరడుగుచుండ అనృతమెట్లు పలుకగలను అనందాని పలుకులాలించి యా ముని ఛీఛీ ఎంత అనాచార మెంతయపచారము గావించితిని అని తనను దానిందించుకొని నా తపస్సునెల్ల నేటగలిసినవి. బ్రహ్మవేత్తలధనమెల్ల చెఱచినట్లయినది నావివేక మెవ్వడో కాజేసినట్లయినది ఈ యాడుది నన్ను మోహపెట్టుటకు పుట్టింపబడినది. షడూర్ముల(కవ్వలిదాబ్రహ్మవస్తువు 1. బుభుక్ష 2. తృష్ణ 3. శోకము 4. మోహము 5.జర 6. మరణము) ఆత్మనిగ్రహముచే నెఱుగ వలసినది. ఛీఛీ ఆకామమహాగ్రహము నన్ను పట్టుకొని నాకీగతి తెచ్చిపెట్టినది నా వ్రతములు సర్వవేదములు మఱియెల్ల ఉత్తమకారణములు నరకగ్రామమునకు మార్గమైన కామముచే నిహతములయినవి. అనియిట్లు తన్నుదానిందించుకొని యాధర్మజ్ఞుడు తనయందు గూర్చున్న యా యప్సరసంజూచి యిట్లనియె.

ఋషిరువాచ

గచ్చపాపే! యథకామం యత్కార్యం తత్త్వయా కృతమ్‌ | దేవరాజస్య యతోభం కుర్వంత్యా భావచేష్టితైః 95

నత్వాం కరోమ్యహం భస్మ క్రోధతీవ్రేణ వహ్నినా! సతాం సా ప్తపదం మైత్ర్యముషితోహం త్వయాసహ || 96

అథవా తవదోషః కః | కింవా కుర్యామహం తవ | మమైవ దోషో నితరాం యేనాహమజితేంద్రియః || 97

యథా శక్రప్రియార్ధిన్యా కృతో మత్తపసో వ్యయః | త్వయా దృష్ఠి మహామోహ మనునా7హం జుగుప్సితః || 98

వ్యాస ఉవాచ

యాసదిత్థం సవిప్రర్షిస్తాం బ్రవీతి సుమధ్యమామ్‌ | తావత్‌స్ఖల త్స్వేదజలా సాబభూవాతివేపథుః || 99

ప్రవేస మానాం స చ తాం ప్విన్నగాత్రలతాం సతీమ్‌ | గచ్ఛగచ్చేతి సక్రోధ మువాచ

ముని సత్తమః || 100

సాతు విర్భర్త్సితా తేన వినిష్ర్కమ్య తదాశ్రమాత్‌ | ఆకాశగామినీ స్వేదం మమార్జ తరుపల్లవైః || 101

వృక్షా ద్వృక్షం య¸° బాలా ఉదగ్రారుణ పల్లవైః | నిర్మమార్జ చ గాత్రాణి గళ##త్స్యేద జలానివై || 102

ఋషిణాయస్తదా గర్భస్తస్యా దేహే సమాహితః | నిర్జగామ సరోమాంచ స్వేదరూపీ తదంగతః || 103

తం వృక్షా జగృహుర్గర్భమేకం చక్రేచ మారుతః | సోమేనా77ప్యాయితో గోభిః స తదా వవృధే శ##నైః || 104

మారిషా నామ కన్యా7భూద్వృ క్షాణాం చారులోచనా | ప్రాచేతసానాం సాభార్య దక్షస్య జననీ ద్విజాః || 105

పోమ్మోపాపాత్మురాల! నీ హావభావములచే నామదిం గలచి యింద్రునికై చేయవలసిన దంతయం జేసితివి. సత్పురుషులదోడి మైత్రి సాప్తపదము (అనగా ఏడలుగులు కలిసి వేయుట లేక యేడు మాటలు మాటలాడుకొనుటవలన నేర్పడునది) కావున నీతో గలిసి కొన్నాళ్లుంటినిగావున నిన్ను భస్మముచేయును. అదిగాక యిందు నీ తప్పిదమేమున్నది! నీకేదైన శాస్తిచేయుటకు, ఇంద్రియ నిగ్రహములేనివాడనగట నీ తప్పు నాయదియె. సురవతి ప్రీతికొరకైననీ వాల్చూపను సమ్మోహన మంత్రముచే నేనీయవరమునకు గుఱియైతిని. అని యిట్లా బ్రహ్మర్షి యారమణితో ననినంతట నది ముచ్చెటములు పోసి యొదలెల్ల దడియ నెడనెడ వడంకుచున్న యావేల్పుపడతింగని పోపోమ్మని యమ్మనియలుకగొని జడిపింపనది యయ్యాశ్రమము వెడలి యాకసమువెంట నేగుచు నాచెట్లచిగుళ్లం జెమటదుడిచికొనియె. అట్లు చెట్టునుండి చెట్టునకడుగువెట్టుచు నా చిన్నది యెరయెఱ్ఱని క్రొందలిరుటాకులం జెమట తడులోత్తుకొనుచున్నంత నయ్యింతికి పులకలయ్యె అప్పుడ పులకలతో బాటామె మేనువెడలి స్వేదరూపమున గర్భము కలిలమయి జాల్వారెను. దానిని వృక్షములు సేకొనియె. వాయువద్దానినేకము సేసెను. అమృతాంశుడు తన కిరణముల నద్దాని కాప్యాయ మొనరింప నల్లల్లననది దినదినాభివృద్దినొందెను. అ గర్భమే మారిషయనుపేర వృక్షములకు గన్యయయ్యె ఆమె ప్రాచేతసులభార్య దక్షునికి తల్లి.

స చాపి భగవాన్కండు, క్షీణ తపసి సత్తమః | పురుషోత్తమాఖ్యం భో విప్రా విష్ణోరాయతనం య¸° || 106

దదర్శ పరమం క్షేత్రం ముక్తిదం భువి దుర్లభమ్‌ | దక్షిణస్యోదధే స్తీడే సర్వ కామ ఫలప్రదమ్‌ || 107

సురమ్యం నాలుకాకీర్ణం కేతకీవన శోభితమ్‌ | నానాద్రుమలతాకీర్ణం నానాపక్షిరుతం శివమ్‌ || 108

సర్వత్ర సుఖసంచారం సర్వర్తు కుసుమాన్వితమ్‌ | సర్వసౌఖ్యప్రదం నౄణాం ధస్యం సర్వగుణాకరమ్‌ || 109

భృగ్వాద్యైః సేవితం పూర్వం ముని సిద్దవరై స్తథా | గంధర్వైః కిన్నరై ర్యక్షై స్తథా7న్యై ర్మోక్షకాంక్షిభిః || 110

దదర్శవ చ హరిం తత్ర దేవైః సర్వై రలంకృతమ్‌ | బ్రాహ్మణాద్యైస్తథా వర్ణై రాశ్రమస్థైర్నిషేవితమ్‌ || 111

దృష్ట్వైవ స తదా క్షేత్రం దేవం చ పురుషోత్తమమ్‌ | కృతకృత్య మివా77త్మానం మేనే స మునిత్తమః || 112

తత్రైకాగ్ర మనా భూత్వా చకారా77రాధనం హరేః | బ్రహ్మసార మయం కుర్వన్‌ జప మేకాగ్రమానసః ||

ఊర్ద్వబాహు ర్మహాయోగీ స్థిత్వా7సౌ మునినత్తమః || 113

మునయ ఊచుః

బ్రహ్మపారం మునే ! శ్రోతుమిచ్ఛామః పరమం శుభమ్‌ | జపతాకండునా దేవో యేనా77రాధ్యత కేశవః || 114

ఆ కండుముని సత్తముండును తననుక్షమింప పురుషోత్తమమను నావిష్ణు క్షేత్రమునకరిగెను. ముక్తిదము దుర్లభమునై దక్షిన సముద్ర తీరమందున్న సర్వకామదమయిన యా దివ్యక్షేత్రమును దర్శించెను. భృగ్వాదిమునులు నిరంతరము సేవించు నవ్వైకుంఠాయతనముంగని సర్వదేవతలు గొలువ నింపుగులుకు హరిని పురుషోత్తము వైకుంఠుం దర్శించి కృతార్థుడనైతి ననుకొనియె. మఱియు నేకాగ్రచిత్తుడై యాస్వామి నారాధించెను. అయ్యోగి ఊర్ద్వబాహువై యచట నిలువబడి ''బ్రహ్మపారము'' అను మహామంత్రమును జపించెను. అనవిని మునులు వ్యాసుంగని యోమునీ ఆ బ్రహ్మపారము పరమ శుభమంత్రము కండుముని జపించి విష్ణునారాధించిన యది మేము వినవలతుమన వ్యాసభగవానుల డిట్లానలిచ్చెను.

వ్యాస ఉవాచ

పారంపరం విష్ణురపారపారః పరః పరేభ్యః పరమార్ధరూపః

సబ్రహ్మపారః పరపారభూతః పరఃపరణామపి పారపారః 115

నకారణం కారణం సంశ్రితో7పి తస్యాపి హేతుః పరహేతుహేతుః |

కార్యోపి చైష సహకర్మకర్తృ...రూపైరనేకైరవ తీహసర్వమ్‌ || 116

బ్రహ్మప్రభుర్భ్రహ్మ స సర్వభూతో బ్రహ్మ ప్రజానాం పతిరచ్యుతో7సౌ |

బ్రహ్మావ్యయం నిత్యమజం స విష్ణు రపక్షయాద్యైరఖిలై రసంగః || 117

బ్రహ్మాక్షరమజం నిత్యం. యదా7సౌ పురుషోత్తమః | తదా రాగాదయో దోషాః ప్రయాంతు ప్రశమం మమ || 118

కండుకృతబ్రహ్మ పారస్తవము

పారం పరం విష్ణుః

శ్రీహరి సంసార మార్గమునకు సరవోత్కృష్టము పునవావృత్తి రహితమునగు అవిధిలేక గురుపరంపరచే తెలియదగిన రహస్య వస్తువు. అపారపారః - తెలియలేని అంతముగలవాడు లేక ఆపరిమితశక్తిగలవాడు. పరేభ్యః పరః - ఉత్కృష్టముగా నెంచబడు ఆకాశాదుల కంటె గొప్పవాడు. (మహతో మహీయాన్‌ ) పరమాత్మ రూపః -పర - బ్రహ్మరూపుడు. బ్రహ్మపారః - బృహద్రూపమగు ప్రధానమునకు అవసానమైనవాడు. లేక సబ్రహ్మపారః - వేదములు తపస్సులతో కూడికొనిన వారు సబ్రహ్మలు అట్టివారికి గంతవ్యుడు, పరపారభూతః - ఆత్మేతరమగు ఆనాత్మ ప్రపంచమునకు అవధియైనవాడు పరాణామపి పరః - ఆత్మగా ప్రతీయమానములగుచున్న ఇంద్రియాదులకు అతీతుడు. పారపారః - వూరకములు పోషకములునైన ఆకాశాదులకు లేక ఇంద్రాదులకు కూడ వూరకుడు పోషకుడునైనవాడు.

ఆ విష్ణువు అన్నిటికి కారణము. సమస్తకార్యములకు కారణమైన విపంచమహాభూతములు తన్మాత్రలు వానికి కూడ కారణమైనవాడు. ఆహంకారమునకు మహత్తత్వము హేతువు. దానికి కూడ హేతువైనవాడు అనగా ఉపాదాన కారణభూతుడు. ఆతడే క్రియాకారక రూపముతో సమస్తమునకు రక్షకుడునై యున్నాడు. అతడు వేదనిర్వాహకుడు. అతడే వేదము. వేదాంగాదులు కూడ నాతడే. వేదార్థ స్మర్తలగు మన్వాదులకు కూడ ప్రభువైనవాడు. అవ్యయుడు నిత్యుడు పుట్టుకలేనివాడు. షడ్భావ వికారములతో సంబంధము లేనివాడు. బ్రహ్మ పుట్టుక లేనివాడు నాశన రహితుడు నిత్యుడునైనట్లు ఈ పురుషోత్తముడును అట్లే అని స్తుతించుచున్న నాయొక్క రాగద్వేషాదులు శమించుగాక!

వ్యాస ఉవాచ

శ్రుత్వా తస్య మునేర్జాప్యం బ్రహ్మపారం ద్విజోత్తమాః | భక్తిం చ పరమాం జ్ఞాత్వా నుదృఢాం పురుషోత్తమః ||

ప్రీత్యా స పరయాదేవ స్తదా7సౌభక్తవత్సలః | గత్వా తస్యసమీపం తు ప్రోవాచమధుసూదనః || 120

మేఘగంభీరయావాచా దిశః | సంనాదయన్నివ | అరుహ్య గరుడం విప్రా! వినతాకుల నందనమ్‌ || 121

అని యిట్లమ్ముని జపించు బ్రహ్మ పారమునువిని యాతని యచంచల భక్తి పారమ్యమెఱింగి పురుషోత్తస్వామి పరమప్రీతితో భర్తవత్సలుండు గావున నతని దగ్గరకేగి మేఘగంభీరమగు వచనము దిక్కుల బ్రతిధ్వనింపజేయుచు వినతాకుల నందనుడైన గరుడునిపై గూర్చుండి యిట్లనియె.

శ్రీ భగవానువాచ

మునే బ్రూహి పరంకార్యం యత్తేమనసివర్తతే | వరదో7హ మనుప్రాప్తో వరంవరయ సువ్రత || 122

శ్రుత్వైవం వచనం తస్య దేవదేవస్య చక్రిణః | చక్షురున్మీల్య సహసా దదర్శ పురతో హరిమ్‌ || 123

అతసీపుష్పసంకాశం పద్మపత్రాయతేక్షణమ్‌ | శంఖచక్రగదాపాణిం ముకుటాంగదధారిణమ్‌ || 124

చతుర్భాహుముదారాంగం పీత వస్త్రధరంశుభమ్‌ | శ్రీవత్సలక్ష్మ సంయుక్తం వనమాలావిభూషితమ్‌ || 125

సర్వలక్షణసంయుక్తం సర్వరత్నవిభూషితమ్‌ | దివ్యచందన లిప్తాంగం దివ్యమాల్యవిభూషితమ్‌ || 126

తతః | ప విస్మయావిష్టో రోమాంచిత తనూరుహః | దండవత్ర్పణి పత్యోర్వ్యాం ప్రణామ మకరోత్తదా || 127

అద్య మే సఫలం జన్మ అద్య మే సఫలం తపః | ఇత్యుక్త్వా మునిశార్దూలా స్తం స్తోతు ముపచక్రమే || 128

ఓ మునీ నీ మదినున్న పనితెలుపుము. వరమీయ వచ్చితిని. అడుగుమన కండుముని కనులు దెఱిచి యెదుటనున్న కమలాక్షుని అతనీకుసుమసంకాశుని శంఖచక్ర గదాహస్తుని కిరీటాంగద ధారిని పీతాంబరుని శ్రీవత్సవక్షుని వనమాలా భూషితుని చతుర్భాహువును దివ్యగంధాను లిప్తుని దివ్యమాలాభూషితుని నమున్నత మూర్తినిజూచి వెఱగంది తనువు పులకరింప సాష్టాంగ దండప్రణామమొనరించెను. మఱియు నిపుడు నా జన్మ సఫలమైనది. నా తపస్సు ఫలించినదని నమ్ముని వరుడిట్లు వినుతింపనారంభించెను.

స్తుతిః

కండురువాచ

నారాయణ ! హరే! కృష్ణ! శ్రీవత్సాంక జగత్పతే ! | జగద్బీజ! జగద్ధామ! జగత్సాక్షిన్న మో7స్తుతే || 129

అవ్యక్త! జిష్ణో! ప్రభవ ! ప్రధానః పురుషోత్తమ !| పుండరీకాక్ష ! గోవింద ! హృషీకేశః నమోస్తుతే ! 130

హిరణ్యగర్భ ! శ్రీనాథ పద్మనాభ! సనాతన ! భూగర్భ! ధ్రువ! ఈశాన! హృషీకేశ ! నమోస్తుతే || 131

అన్యాద్యంతామృతాజేయ! జయత్వం జయతాం వర! | అజితాఖండ ! శ్రీ కృష్ణ ! శ్రీనివాస ! నమోస్తుతే || 132

వర్జన్య ధర్మకర్తా చ దుష్పార దురధిష్టిత !| దుఃఖార్తినాశన! హరే! జలశాయిన్నమో7స్తుతే || 133

భూతపావ్యక్త భూతేశ భూతతత్వైరనాకుల! | భూతాధివాస! భూతాత్మన్భూతగర్భ! నమో7స్తుతే || 134

యజ్ఞ ! యజ్వన్యజ్ఞధర! యజ్ఞధాతా7భయప్రద! యజ్ఞగర్భ! హిర్యణ్యాంగ! పృశ్నిగర్భ ! నమో7స్తుతే || 135

క్షేత్రజ్ఞః క్షేత్రభృతేత్రీ%్‌ష క్షేత్రహా క్షేత్రకృద్వశీ | క్షేత్రాత్మన్జేత్ర రహిత ! క్షేత్రస్రష్ట్రే నమో7స్తుతే || 136

గుణాలయ ! గుణావాస! గుణాశ్రయ | గుణావహ! గుణభోక్తు! గుణారామ! గుణత్యాగిన్నమో7స్తుతే || 137

త్వంవిష్ణుస్త్వంహరిశ్చక్రీత్వం జిష్ణుస్త్వం జనార్దనః | త్వంభూత స్త్వంవషట్కార స్త్వంభవ్య స్త్వంభవత్రభుః || 138

త్వంభూత కృత్త్వమవ్యక్తస్త్వం భవోభూతభృద్భద్దవాన్‌ | త్వం భూతభావనో దేవస్త్వామాహురజమీశ్వరమ్‌ || 139

త్వమనంతః కృతజ్ఞస్త్వం ప్రకృతిస్త్వంవృషాకపిః| త్వం రుద్రస్త్వం దురాధర్జ స్త్వమోఘ స్త్వమీశ్వరః || 140

త్వంవిశ్వకర్మాజిష్ణుస్తం7త్వంశంభుస్త్వంవృషాకృతిః | త్వం శంకర స్త్వముశనాత్వంసత్యంత్వంతపో జనః || 141

త్వం విశ్వజేతాత్వం శర్మత్వంశరణ్య స్త్వమక్షరమ్‌ | త్వంశంభు స్త్వంస్వయంభూశ్చత్వం జేష్ట స్త్వంపరాయణః || 142

త్వమాదిత్య స్త్వ మోంకార స్త్వంప్రాణస్త్వంత మిస్రహా| తమ పర్జన్య స్త్వంప్రథితవేధా స్త్వంసురేశ్వరః || 143

త్వమృగ్యజుః సామ చైవత్వ మాత్మాసంచతోభవాన్‌ | త్వ మగ్ని స్త్వం చపవన స్త్వ మాపోవసుధా భవాన్‌ || 144

త్వం స్రష్టా త్వం తథా భోక్తా హోతాత్వం చ హవిః క్రతుః| త్వం ప్రభుస్త్వం విభుః శ్రేష్ఠస్తమ లోకపతిరచ్యుతః || 145

త్వంసర్వదర్శనః శ్రీమాంస్త్వం సర్వదమనో రిహా| త్వ మహస్త్వం తథారాత్రి స్త్వా మాహు ర్వత్సరంబుధాః || 146

త్వంకాల స్త్వంకాలా కాష్ఠా త్వం ముహూర్తః క్షణా లవాః | త్వంబాల స్త్వంతథా వృధ్ద స్త్వం పుమా స్త్ర్సీ నపుంసకః || 147

త్వంవిశ్వయోని స్త్వం చక్షు స్త్వం వేదాంగస్త్వ మవ్యయః | త్వంశాశ్వత స్త్వమజిత స్త్వముపేంద్ర స్త్వముత్తమః ||

త్వం వేదవేద స్త్వం ధాతా విధాతాత్వం సమాహితః || 148

త్వం సర్వ విశ్వసుఖదస్త్వం వేదాంగం త్వమవ్యయః | త్వంవేదవేద స్త్వంధాతా విధాతా త్వం సమాహితః ||

త్వం జలనిధి రామూలం త్వం ధాతా త్వం పునర్వసుః | త్వం వైద్య స్త్వంధృతాత్మా చ త్వ మతీంద్రియ గోచరః || 149

త్వ మగ్రణీ ర్గ్రామణీ స్త్వం త్వం సుపర్ణ స్త్వ మాదిమాన్‌ |

త్వం సంగ్రహ స్త్వం సుమహ త్త్వం ధృతాత్మా త్వ మచ్యుతః || 150

త్వం యమస్త్వం చ నియమ స్త్వంప్రాంశు స్త్వం చతుర్భుజః |

త్వ మే వాన్నాంరాత్మా త్వం పరమాత్మా త్వ ముచ్యతే || 151

త్వం గురు స్త్వం గురుతమ స్త్వంవామ స్త్వం ప్రదక్షిణః |

త్వం పిప్పల స్త్వ మగమ స్త్వం వ్యక్త స్త్వం ప్రజాపతిః || 152

హితణ్యనాభ స్త్వం దేవ స్త్వం శశీ త్వం ప్రజాపతిః | అనిర్దేశ్యవపు స్త్వం వై త్వం యమ స్త్వం సురారిహా || 153

త్వం చ సంకర్షణో దేవ స్త్వం కర్తా త్వం సనాతనః | త్వం వాసుదేవో7మేయాత్మా త్వ మేవ గుణవర్జితః || 154

త్వం జ్యేష్ఠస్త్వం వరిష్ఠస్త్వం త్వం సహిష్ణు శ్చ మాధవః | సహస్రశీర్షా త్వం దేవ స్త్వ మవ్యక్తః సహస్రదృక్‌ || 155

సహస్రపాద స్త్వం దేవ స్త్వం విరాట్త్వం సురప్రభుః || త్వమేవ తిష్ఠనే భూయో దేవదేవ దశాంగులః || 156

యద్భూతం త త్త్వమే వోక్తః పురుషః శక్ర ఉత్తమః | యద్భావ్యం త త్త్వ మీశావస్త్వ మృత స్త్వం తథా7మృతః || 157

త్వత్తోరోహత్యయంలోకోమహీయాంస్త్వ మనుత్తమః | త్వం జ్యాయా న్పురుషస్త్వంచ త్వందేవ దశథాస్థితః || 158

విశ్వభూత శ్చతుర్భాగోనవభాగో7మృతో దివి | నవభాగో7న్తరిక్షస్థః పౌరుషేయః సనాతనః || 159

భాగద్వయం చ భూసంస్థం చతుర్ధాగో7ప్యభూదిహ | త్వత్తో యజ్ఞాః సంభవంతి జగతో వృష్ఠికారణమ్‌ || 160

త్వత్తో విరాట్సముత్పన్నోజగతో హృది యః పుమాన్‌ | సో7తిరిచ్యత భూతేభ్య స్తే జసాయళసాశ్రియా || 161

త్వత్తః సురాణా మాహారః పృషదాజ్య మజాయత| గ్రామ్యారణ్యా శ్చౌషధయ స్త్వత్తః పశుమృగాదయః || 162

ధ్యేయధ్యాన పర స్త్వం చ కృతవా నసి చౌషధీః |త్వం దేవదేవ సప్తాస్యకాలాఖ్యో దీప్తవిగ్రహః || 163

జంగమాజంగమం సర్వం జగదేత చ్చరాచరమ్‌ | త్వత్తః సర్వ మిదం జాతం త్వయి సర్వం ప్రతిష్టితమ్‌ || 164

అనిరుద్ధ స్త్వం మాధవ స్త్వం ప్రద్యుమ్నః సురారిహా | దేవ ! సర్వసురశ్రేష్ఠ! సర్వలోక పరాయణ! || 165

త్రాహి మా మరవిందాక్ష నారాయణ నమో7స్తుతే | నమస్తే భగవన్విష్ణో నమస్తే పురుషోత్తమ || 166

నమస్తే సర్వలోకేశ ! నమస్తే కమలాలయ | గుణాలయ ! నమస్తే7స్తు గుణాకర || 167

వాసుదేవ! నమస్తే7స్తు నమస్తే7స్తు సురోత్తమ | జనార్దన నమస్తే7స్తు సనాతన || 168

నమస్తే యోగినాం గమ్య | యోగావాస నమోస్తు7తే | గోపతే! శ్రీపతే! విష్ణో నమస్తే7స్తు మరుత్పతే || 169

జగత్పతే జగత్సూతే నమస్తే జ్ఞానినాం పతే | దివస్పతే నమస్తే7స్తు మహీపతే || 170

నమస్తే మధుహంత్రే చ నమస్తే7 పుష్కరరేక్షణ | కైటభఘ్న నమస్తే7స్తు సుబ్రహ్మణ్య నమోస్తుతే || 171

నమో7స్తు తే మహామీన శ్రుతి పృష్ఠధరాచ్యుత | సముద్రలిలక్షోభ పద్మజాహ్లాద కారిణ || 172

అశ్వశీర్ష మహాఘోణ మహాపురుష విగ్రహ | మధుకైటభ హంత్రే చ నమస్తే తురగానన || 173

మహాకమఠభోగాయ పృథివ్యుద్ధరణాయ చ | విధృతాద్రి స్వరూపాయ మహాకూర్మాయ తే నమః || 174

నమో మహావరాహాయ పృథివ్యుద్ధార కారిణ | నమశ్చా77ది వరాహాయ విశ్వరూపాయ వేధసే || 175

నమో7సంతాయ సూక్ష్మాయ ముఖ్యాయ చ వరాయ చ | పరమాణు స్వరూపాయ యోగిగమ్యాయ తేనమః || 176

తసై#్మనమో కారణకారణాయ|

యోగీంద్ర వృత్తి నిలయాయ సుదుర్విదాయ |

క్షీరార్ణవాశ్రిత మహాహిసుతల్పగాయ |

తుభ్యం నమః కనకరత్నసుకుండలాయ || 177

నారాయణాది నామములతో నారంభించి శ్రీహరికళ్యాణ నామసంకీర్తనముజేసి పాలసముద్రమందున్న మహా సర్పమందునిద్రించు కనకరత్న కుండలాలంకృతుడగు పరమాత్మకు నమస్కారము అని చేసిన ఈ స్తుతి పారాయణ ప్రధానము సులభార్ధము గావున అనువాదము చేయబడలేదు.

వ్యాస ఉవాచ

ఇత్థం స్తుత స్తదా తేన ప్రీతః ప్రోవాచ మాధవః | క్షివ్రం బ్రూహి మునిశ్రేష్ఠ మత్తో య దభివాంఛసి || 178

కండురువాచ

సంసారే7స్మిన్‌ జగన్నాథ దుస్తరే లోమహర్షణ | అనిత్యే దుఃఖబహుళే కదళీదళసన్నిభే || 179

నిరాశ్రయే నిరాలంబే జల బుద్బుద చంచలే | సర్వోప్రదవ సంయుక్తే దుస్తరే చాతిభై రవే || 180

భ్రమామి సుచిరం కాలం మాయయా మోహిత స్తవ | న చాంతమభిగచ్ఛామి విషయాసక్తమానసః || 181

త్వా మహంచాద్యదేవేశ సంసార భయపీడితః | గతో7స్మి శరణం కృష్ణ మాముద్ధర భవార్ణవాత్‌ || 182

గంతు మిఛ్ఛామి పరమం పదం య త్తే సనాతనమ్‌ | ప్రసాదాత్తవదేవేశ పునరావృత్తి దుర్లభమ్‌ || 183

ఇట్లు స్తుతింపబడి నింప్రీతుడై మాధవుడు మునివర ! నావలన నీ కోరునదేమో త్వరగ చెప్పుమన కండుమని....... జగన్నాథా! తలచుకొన్నంత మేను గగుర్పొడుచు నీ దాటరాని యనిత్యసంసారమందు బహుదుఃఖ కరమైయరటాకువలె పేలవమై నశించు స్వభావముగల నీటిబుడగ వంటి నిరాశ్రయము నిరాలంబమునగు భయంకర సంసారమున మాయామో హితుడనై తిరుగుచున్నాను. విషయవాసనలచేత జెడిన మనసుతో దీని యంతు దరికానలేకున్నాను. దీనికి దడిసి యిపుడు నిన్ను దిక్కంటిని కృష్ణా నన్నుద్దరింపుము. నీ ప్రసాదమున పునరావృత్తిలేని దుర్లభ##మైన సనాతన ముక్తిపదము నంద గోరుచున్నాను. అన భగవంతుడిట్లనియె.

శ్రీభగవాను వాచ

భక్తో7సి మే మునిశ్రేష్ఠ మా మారాధయ నిత్యశః | మ త్ర్పసాదాద్ద్రువంమోక్షం ప్రాప్య్ససి త్వంసమీహితమ్‌ || 184

మద్భక్త్యా క్షత్రియా వైశ్యాః స్త్రియః | శూద్రాన్త్యజాతిజాః | ప్రాప్నువన్తివరాం సిద్ధిం కిం పున స్త్వం ద్విజోత్తమ || 185

శ్వపాకో7పి చ మధ్భక్తః సమ్య క్శ్రద్ధా సమన్వితః | ప్రాప్నో త్యభిమతాం సిద్ధి మన్యేషాం తత్రకా కథా || 186

వ్యాస ఉవాచ

ఏవముక్త్వా తు తం విప్రాః | స దేవే భక్త వత్సలః | దుర్విజ్ఞేయ గతి ర్విష్ణు స్తత్రైవాన్త రధీయత || 187

ఓమునిశిరోమణి ! నీవు నా భక్తుడవు. నిచ్చలు నన్నారాధింపుము. నా యనుగ్రహమున నిశ్చలమైన మోక్షమును బొందగలవు. నా భక్తులు ఏకులమువారైన స్త్రీలైన పరమసిద్ధినందుదురు. నీవందుటలో నాశ్చర్యమేమి. కుక్క మాంసము దినువాడైన మిక్కిలి శ్రద్ధగొని నాయెడ భక్తికలవాడు అభీష్టసిద్ది బొందును. మఱియితరుల మాటజెప్పనేల? అనిపలికి భక్తవత్సలుడగు హరి యంతర్థానమయ్యెను.

గతే తస్మి న్ముని శ్రేష్ఠాః కండుః సంహృష్టమానసః | సర్వా న్కామా న్పరిత్యజ్య స్వస్థచిత్తో7భవ త్పునః || 188

సర్వేన్ద్రియాణి సంయమ్య నిర్మమో నిరహంకృతిః | ఏకాగ్రమానసః సమ్య గ్థ్యాత్వాతం పురుషోత్తమమ్‌ || 189

నిర్లేపం నిర్గుణం శాంతం వత్తామాత్ర వ్యవస్థితమ్‌| అవాప పరమం మోక్షం సురాణా మపి దుర్లభమ్‌ || 190

యః పఠేచ్ఛృణుయా ద్వాపి కథాం కండో ర్మహాత్మనః | విముక్తః సర్వపాపేభ్యః స్వర్గఃలోకం స గచ్ఛతి|| 191

ఏవం మయా మునిశ్రేష్ఠాః కర్మ భూమిరు దాహృతా | మోక్షక్షేత్రం చ పరమం దేవం చ పురుషోత్తమమ్‌ || 192

యేపశ్యన్తి విభుం స్తువన్తి వరదం ధ్యాయన్తి ముక్తి ప్రదమ్‌ |

భక్త్యా శ్రీపురుషోత్తమాఖ్య మజరం సంసార దుఃఖాపహమ్‌ || 193

తేభుక్త్వా మనుజేన్ద్రభోగ మమలాః స్వర్గే చ దివ్యం సుఖమ్‌ |

పశ్చా ద్యాన్తి సమస్త దోష రహితాః స్థానం హరే రవ్యయమ్‌ || 194

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయంభ్వు%ృ సంవాదే కండూపాఖ్యాన

నిరూపణం నామాష్టసప్తత్యధికతశతతమో7ధ్యాయః

విష్ణువట్లు జనినంతట కండువు ముదమంది నిష్కాముడై స్వస్థచిత్తుడై యింద్రియముల నియమించుకొని యహంకారమువాసి మది నిలకడగొన నిర్లేవుడు నిర్గునుడు శాంతుడు సత్తామాత్రుడునైన పురుషోత్తమ దేవుని ధ్యానించి యమర దుర్లభ##మైన పరమపదమందెను. మహాత్ముడగు కండువుయొక్క కథనెవ్వరు చదువునో వినునో యతడఘము లంబాసి స్వర్గలోకమందును. ఓ ముని తల్లజులార! కర్మభూమియగు భారతవర్షమును గుఱించిమోక్ష క్షేత్రములగురించి పరమాత్మ పురుషోత్తముని గుఱించి చెప్పితిని. అవ్వరదుని ప్రభుని భక్తితో నెవ్వరు ధ్యానింతురు దర్శింతురు స్తుతింతురు వారు పవిత్రులై రాజ్యభోగముల ననుభవించి స్వర్గసుఖము జూరలాడి అవ్యయమగు ముక్తినందుదురు.

ఇది బ్రహ్మపురాణమున కండూపాఖ్యానమును నూటడెబ్బది యెనిమిదవ అధ్యాయము

Brahmapuranamu    Chapters