Brahmapuranamu    Chapters   

అధసప్త దశో7ధ్యాయః

శ్యమంతకోపాఖ్యానము

లోమహహర్షణ ఉవాచ

యత్తు సత్రాజితే కృష్ణో మణిరత్నం స్యమంతకమ్‌ | దదా వహారయద్భభ్రుర్భోజేన శతధన్వనా || 1

సదా హి ప్రార్ధయామాస సత్యభామా మనిందితామ్‌ | అక్రూరోం7తరమన్విష్య న్మణిం చైవ స్యమంతకమ్‌ 2

నత్రాజితం తతో హత్వా శతధన్వా మహాబలః | రాత్రౌ తం మణి మదాయ తతో7క్రూరాయ దత్తవాన్‌ || 3

అక్రూరస్తు తదా విప్రా! రత్న మాదాయ చోత్తమమ్‌ | సమయం కారయాం చక్రేనా77వేద్యో7హం త్వయేత్యుత ||

సూతుడిట్లనియె

శ్రీ కృష్ణుడు సత్రాజిత్తునకు మణిరత్నము నొసంగగా, దానిని బభ్రువు, (అక్రూరుడు) భోజవంశీయుడగు శతధన్వునిచే హారించజేసెను. అక్రూరుడవకాశము కనిపెట్టి సత్యభామను స్యమంతకమడుగుచుసే యుందెను. శతధన్వుడు సత్రాజిత్తును సంహరించి రాత్రివేళ మణింగొనివచ్చి అక్రూరునకొసంగెను. అక్రూరడదిగొనియీ యంశ##మెవ్వరికి నెన్నడును దెలుపనని వానిచే ప్రమాణము సేయించెను.

వయ మభ్యుత్ప్రవత్య్సామః కృష్ణేన త్వాం ప్రధర్షితమ్‌ | మమ్యా ద్వారకా సర్వా వశే తిష్ఠ త్యద సంశయమ్‌ || 5

హతే పితరి దుఃఖార్తా సత్యభామా మనస్వినీ | ప్రయ¸° రథమారుహ్య నగరం వారణావతమ్‌ || 6

సత్యభామా తు తద్వృత్తం భోజస్య శతధన్వనః | భర్తుర్ని వేద్య దుఃఖార్తా పార్శ్వస్ధా7శ్రూణ్యవర్తయత్‌ || 7

పాండవానాం చ దగ్దానాం హరిః కృత్వోదక క్రియామ్‌ | కుల్యర్థే చాపి పాండూనాం న్యయోజయత సాత్యకిమ్‌ || 8

తతస్త్వరితమాగమ్య ద్వారకాం మధుసూదనః | పూర్వజం హలినం శ్రీమా నిదం వచనమబ్రవీత్‌ || 9

తండ్రి హతుడగుటకుం దపించి సత్యభామ రథమెక్కి వారణావతమునకేగెను. అక్కడ ధోజవంశీయుడగు శతధన్వుని యీ వృత్తాంతమును భర్తకుందెలిపి కంటనీరు గ్రుక్కుకొనెను, లక్కయింట దగ్ధులైన పాండవుల కుదక క్రియసేసి కృష్ణుడు సాత్యకిని వారియొక్క ఉత్తరక్రియయందు నియోగించి వెంటనే ద్వారకకేతెంచి బలరామునితో నిట్లనెను.

శ్రీ కృష్ణుఉవాచ

హతః ప్రసేనః సింహేన సత్రాజి చ్చతధన్వనా | స్యమంతకస్తు మద్గామీ తస్య ప్రభురహం విభో || 10

తదారోహ రథం శీఘ్రం భోజం హత్వా మహారథమ్‌ | స్యమంతకో మహాబాహో అస్మాకం స భవిష్యతి || 11

శ్రీ కృష్ణుడిట్లనియె

సింహము ప్రసేనుని జంపినది, శతధ్వనుడు సత్రాజిత్తును జంపెను. స్యమంతకము నాకు జెందవలసియున్నది. కావున త్వరగా రథమెక్కుము. అ భోజుం గూల్చి యమ్మణిం చెత్తుము, ఆ స్యమంతకము మనది కాగల దనియె.

లోమహర్షణ ఉవాచ

తతః ప్రవృత్తం యుధ్ధం చ తుములంభోజకృష్ణయోః | శతధన్వా తతోక్రూరం సర్వతోదిశ మైక్షత || 12

సంరబ్ధౌ తావుభౌ తత్ర దృష్ట్వా భోజజనార్ధనౌ శక్తో7పి శాపా ద్దార్దిక్య మక్రూరో నాన్వపద్యత || 13

అపయానే తతో బుద్ధిం భోజ శ్చక్రే భయార్ధితః | యోజనానాం శతం సాగ్రం హృదయా ప్రత్యపద్యత || 14

విఖ్యాతా హృదయా నామ శతయోజనగామినీ | భోజస్య వడవా విప్రా ! యయా కృష్ణ మయోధయత్‌ || 15

క్షీణాం జవేన హృదయా మధ్వనః శతయోజనే | దృష్ట్వా రథస్య స్వాం వృద్ధిం శత ధన్వాన మర్ధయత్‌ || 16

తత స్తస్యా హతాయాస్తు శ్రమా త్ఖేదాచ్చ భోద్విజాః | ఖముత్పేత రథ ప్రాణాః కృష్ణో రామ మథాబ్రవీత్‌ || 17

సూతుడిట్లనియె

శతధ్వనుడు కృష్ణునితో బోరుచు సక్రూరుడెక్కడున్నాడని చూచుచుండెను. అక్రూరుడు శక్తుడయ్యు శాపభీతిచే యుద్ధమున తోడ్పడ డయ్యెను, అప్పుడు భోజుడు భయార్తుడై వెనుదిరుగ నిశ్చయించెను. ''హృదయ'' ఆను వాని గుఱ్ఱము నూరు యోజనములు మించి దూకగలదు. భోజుని స్వాధీనముననున్నది. దానితోనే కృష్ణునితో దలపడెను. నూరుయోజనములు మేఱ యరిగి వేగముడుగుటయు, తన రథవేగ మెచ్చుటయు జూచి కృష్ణుడు శతధన్వుని నొప్పించెను. అ గుఱ్ఱము డిల్లవడి తుదకు ప్రాణములు గోల్పోవుట చూచి కృష్ణుడు బలరామునితో నిట్లనియొ.

శ్రీ కృష్ణ ఉవాచ

తిష్ఠే హ త్వం మహాబాహో దృష్టదోషా హయా మయా | పద్భ్యాం గత్వా హరిష్యామి మణిరత్నం స్యమంతకమ్‌ || 18

శ్రీకృష్ణుడిట్లనియె

ఓ శూరాగ్రేసర ! నీవిక్కడేయుండుము. గుఱ్ఱము నష్టమైనది. పాదచారినై వెళ్లి మణిరత్నమైన స్యమంతకము హరించగలను. అని

పద్భ్యామేవ తతో గత్వా శతధన్వాన మచ్యుతః | మిథిలామభితో విప్రా జఘాన పరమాస్త్రవిత్‌ || 19

స్యమంతకం చ నాపశ్య ద్ధత్వా భోజం మహాబలమ్‌ || నివృత్తం చాబ్రవీ త్కృష్ణం మణిం దేహీతి లాంగలీ || 20

నాస్తీతి కృష్ణశ్చోవాచ తతో రామో రుషా7న్వితః | ధిక్చబ్దపూర్వ మసకృ త్ర్పత్యు వాచ జనార్దనమ్‌ || 21

అటు పిమ్మట హరి పాదచారియై వెళ్ళి శతధన్వుని పైకేగి మిధిలా ప్రాంతమున వానిని సంహరించెను. కాని వాని దగ్గర స్యమంతకముకానరాదయ్యె. మరలివచ్చిన కృష్ణునింగని హలాయుడుడగు బలరాముడు మణినిమ్మని యడిగెను. కృష్ణుడు లేదని బదులు చెప్పెను. అంతట బలరాముడు రోషముగొని ఛీఛీ యనికేకలు వేసి కృష్ణునితో నిట్లుపలికెను.

భ్రాతృత్వా న్మర్షయామ్యేష స్వస్తి తే7స్తు వ్రజామ్యహమ్‌ | కృత్యం నమే ద్వారకయా న త్వయా న చ వృష్ణిభిః ||

తమ్ముడవని సైరించితిని. నీకు స్వస్తి యగుగాక. నాకుద్వారకతోగాని, నీతోగాని, వృష్ణులతోగాని పనిలేదు, నేను వెళ్ళు చున్నాను. అని

ప్రవివేశ తతో రామో మిథిలా మరిమర్దనః | సర్వకామై రుప హృతైర్మిథిలే నాభిపూజితః || 23

బలరాముడు మిథిలం బ్రవేశించెను. మిథిలాధిపతి సత్కారమంది. ఇష్టోపభోగియై యక్కడనే యుండెను.

ఏతస్మిన్నేవ కాలే తు బభ్రు ర్మతి మతాం వరః | నానారూపా న్ర్కతూన్సర్వా నాజహార నిరర్గలాన్‌ || 24

దీక్షామయం స కవచం రక్షార్థం ప్రవివేశ హ | స్యమంతకకృతే ప్రాజ్ఞో గాంధీపుత్రో మహాశయశాః || 25

అథ రత్నాని చాన్యాని ధనాని వివిధాని చ | షష్టిం వర్షాణి ధర్మాత్మా యజ్ఞేష్వేవ న్యయోజయత్‌ || 26

అక్రూరయజ్ఞా ఇతి తే ఖ్యాతా స్తస్య మహాత్మనః | బహ్వన్న దక్షిణాః సర్వే సర్వకామప్రదాయినః 27

అథ దుర్యోధనో రాజా గత్వా స మిథిలాం ప్రభుః గదాశిక్షాం తతో దివ్యాం బలదేవా దవాప్తవాన్‌ || 28

ఈ సమయములోనే బుద్ధిశాలియగు బభ్రువు (అక్రూరుడు) పెక్కువిధములగు క్రతువుల నాచరించెను. గాంధీపుత్రుడగు నా అక్రూరుడు దీక్షామయమైన రక్షాకవచమ్ముదొడిగికొని స్యమంతకము కొఱకు యజ్ఞము చేసెను. అరువదేండ్లు వివిధరత్న ధనరాసుల నధ్వరములందు వినియోగించెను. '' అక్రూరయజ్ఞము''లను పేర నవి ప్రఖ్యాతి వవసినవి. అవి విపులాన్న దానదక్షిణులు సర్వకామప్రదములునై విలసిల్లెను. అంతట దర్యోధనుడు మిథిలకేగి బలరామునికడ గదాయుధ్ధ శిక్షణమును వడసెను.

సంప్రసాద్య తతో రామో వృష్ణ్యంధక మహారథైః | ఆనీతో ద్వారకామేవ కృష్ణేన చ మహాత్మనా || 29

అక్రూర శ్చాంధకైః సార్థమాయాతః పురుషర్షభః | హత్వా సత్రాజితం సుప్తం సహబంధుం మహాబలః || 30

జ్ఞాతిభేదభయా త్క్రష్ణ స్తముపేక్షితవాం స్తదా | అపయాతే తదాక్రూరే నావర్ష త్పాకశాసనః || 31

అనావృష్ట్యా తదా రాష్ట్ర మభవ ద్బహూదా కృశమ్‌ | తతః ప్రసాదయామాసు రక్రూరంః కుకురాంధకాః 32

పునర్ద్వారవతీం ప్రాప్తే తస్మి న్దానపతౌ తతః | ప్రవవర్ష సహస్రాక్షః కక్షే జలనిధేస్తదా || 33

కన్యాం చ వాసుదేవాయ స్వసారం శీలసం మతామ్‌ | అక్రూరః ప్రదదౌ ధీమా న్ప్రీత్యర్థం మునిసత్తమాః || 34

అథ విజ్ఞాయ యోగేన కృష్ణో బభ్రుగతం మణిం | సభామధ్య గతః ప్రాహ తమక్రూరం జనార్ధనః || 35

మహారథులగు వృష్ణ్వంధకులతో పోయి కృష్ణుడు బలరాముని ద్వారకకు మరలదెచ్చెను. బంధువులతో గూడ నిద్రలోవున్న సత్రాజిత్తును జంపిన అక్రూరు డంధకులతో బాటు మరల ద్వారకకు వచ్చెను. అప్పుడు కృష్ణడు జ్ఞాతులతో బెడియునను భయమువలన వాని నుపేక్షించెను. అప్పుడక్రూరుడు మిథిలకుపోగా నింద్రుడు వర్షించడయ్యె. అనావృష్ఠితో రాజ్యమనేక విధముల క్షిణించిపోయెను. అందువలన కుకురాంధకులు అక్రూరునిం బ్రసన్నుం జేసికొని మరల ద్వారకకుం గొనివచ్చిరి. అంత దానవతి యగునతడు ద్వారకకు రాగానే జలనిధి తీరమున వాసవుడు బాగుగా వర్షించెను. అక్రూరుడు శీలవతియగు తన చెల్లెలిని వాసుదేవునకి ప్రీతికలుగ నిచ్చెను. అంతట కృష్ణుడు యోగశక్తిచే స్యమంతకమణి యక్రూరుని దగ్గర నున్నదని గమనించి సభామధ్యమున నక్రూరుని గూర్చి యిట్లు పలికెను.

శ్రీ కృష్ణ ఉవాచ :-

యత్త ద్రత్నం మణివరం తవ హస్తగతం విభో | తన్మే ప్రయద్ఛ మానార్హ మయిమా7 నార్యకం కృథాః || 36

షష్టి వర్షగతే కాలేయో రోషో7భూ న్మమానఘ | స సంరూడ్యో సకృత్ర్సాప్తస్తతః కాలాత్యయో మహాన్‌ || 37

శ్రీకృష్ణు డిట్లనియె !

నీ చేజిక్కిన మణిని నాకిమ్ము. నా మర్యాద గాపాడుము. అఱువదియేండ్లు నాకీమణి నిమిత్తముగ రోషము గల్గినది, కాలమెంతో గడిచిపోయినది.

సతతః కృష్ణ వచనాత్సర్వ సాత్త్వత సంసది| ప్రదదౌ తం మణిం బభ్రు రక్లేశేన మహామతిః || 38

తతస్తమార్జవాత్ర్పాప్తం బభ్రోర్హస్తా దరిందమః దదౌ హృష్ణమనాః కృష్ణ స్తం మణిం బభ్రవే పునః || 39

సకృష్ణహస్తా త్సంప్రాస్తం మణిరత్నం స్యమంతకమ్‌ | అబధ్య గాందినీపుత్రో విరరా జాంశుమానివః || 40

ఇతి శ్రీ మహాపురాణ అదిబ్రాహ్మే స్యమంతకోపాఖ్యానం నామసప్తదశో7ధ్యాయః ||

అంతటనక్రూరుడు కృష్ణుని పలుకులంబట్టి సర్వ యాదవసమాజమునందు మణింగొనివచ్చి మనస్సునొచ్చకుండ బుద్ది మంతుడుకావున దానిని హరికిచ్చెను. అరిభీకరుడైన కృష్ణుడు బభ్రు హస్తమునుండి సూటిగ లభించినయా మణిని చేకొని హర్షముగొని తిరిది దానిన క్రూరునకే యిచ్చెను. గాందినీ పుత్రడగు నక్రూరుడు క్భష్ణుని హస్తమునుండి లభించిన యా స్యమంతక మణిరత్నమును దాల్చి సూర్యునివలె దేజరిల్లెను.

ఇది బ్రహ్మపురాణమునందు స్యమంతకమణి సమానయనమును పదునేడవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters