Brahmapuranamu    Chapters   

అథషోడశో7ధ్యాయః

స్యమంతక ప్రత్యానయనమ్‌

లో మహర్షణ ఉవాచ -

భజమానస్య పుత్రో7థ రథముఖ్యో విధూరథః | రాజాధిరాజ శ్శూరస్తు విధూరథ సుతో7భవత్‌ 1

రాజాధిరాజస్య సుతా జజ్ఞిరేవీర్యవత్తరా ః | దద్తాతాదత్తౌ బలినౌ శోనాశ్యః శ్వేతవాహనః || 2

శమీ చ ధండశర్మా చ దంతశత్రుశ్చ శత్రుజిత్‌ | శ్రవణా చ శ్రవిష్ఠా చ స్వసారౌ సంభభూవతుః 3

శమిపుత్రః ప్రతిక్షత్రః ప్రతిక్షత్రస్య చా7త్మజః | స్వయంభోజః స్వయంభోజాద్భదిక ః సంబభూవహ || 4

తస్యపుత్రా బభూపుర్హి సర్వే భీమపరాక్రమాః | కృతవర్మా7గ్రజ్జస్తేషాం శతధన్వా తు మధ్యమః || 5

దేవాంతశ్చ నరాంతశ్చ భిషగ్వైతరణశ్చ యః | సుదాంత శ్చాతిదాంతశ్చ నికాశ్యః కామదంభకః || 6

దేవాంతస్యాభవత్పుత్రో విద్వా న్కంబలబర్హిషః | అసమౌజాః సుతస్తస్య నాసమౌజాశ్ఛ తావుభౌ || 7

అజాతపుత్రాయ సుతాం ప్రదదా వసమౌజసే | సుదంష్ట్రశ్చ సుచారుశ్చ కృష్ణ ఇత్యంధకాః స్మ్రతాః || 8

గాంథారీ చైవ మాద్రీ చ క్రోష్టుభార్యే బభూవతుః | గాంధారీ జనయామాస ఆనమిత్రం మహాబలమ్‌ || 9

మాద్రీ యుధాజితం పుత్రం తతో వై దేవమీఢ్జుషం | అనమిత్ర మమిత్రాణాం జేతార మపరాజితమ్‌ || 10

అనమిత్రసుతో నిఘ్నె నిఘ్నతో ద్వౌ బభూవతుః | ప్రసేవశ్చాథ సత్రాజి చ్ఛత్రుసేనాజితా వుభౌ || 11

సూతుడిట్లనయె. భజమానుని సుతుడురథముఖ్యుడు, విదూరథుడు, విదూరథుని కుమారుడు వీరుడగు రాజాధిదేవుడు. వానికిదత్త - అతిదత్త - శోణాశ్వ - శ్వేత వాహన - ళమి-దండశర్మ -దంతశత్రు - శత్రుజిత్తులు అనుసుతులు. శ్రవణ శ్రవిష్ఠ యును కుమార్తెలు కలగిరి, శమికుమారుడు ప్రతిక్షత్రుడు, వానికి స్వయంభోజుడు, వానికి భదికుడు కల్గిరి. వాని కుమారులుభీమ పరాక్రములు. వారిలో కృతవర్మజ్యేష్ఠుడు. శతధన్వ మధ్యముడు. దేవాంతకుడు, నరాంతుడు. భిషక్కు పైతరుణుడు సుదాంతుడు - అతిదాంతుడు | నికాశ్యుడు - కామదంభకుడు - అనువారి కలిగిరి. దేవాంతకుని పుత్రడు విద్వంసుడగు కంబల బర్హిషుడు. వాని కొడుకులు అసమౌజుడు నాసమేజుడు అనువారు. పుత్ర సంతతిలేని అసమౌజసునికి సుందష్ట్రుడు సుచారువు కృష్ణుడు అనుకుమారులను అంధకుడిచ్చెను. వారు అంధకులను పేరందిరి.

గాంధారి మాద్రి కోష్ఠుని యొక్క భార్యలు. గాంధారి తనయుడు మహాబలశాలియగు అనమిత్రుడు. మాద్రి తనయులు యుధాజిత్తు దేవమీఢుషుడు ఇతడు శత్రువులకు గూడమిత్రుడు. శత్రుజేతయగు అనమిత్రుని కొడుకు నిఘ్నుడు. వాని కొడుకులిద్దరు. ప్రసేనుడు సత్రాజిత్తు. వీరు శత్రుసేనల జయించినవారు.

ప్రసేనో ద్వారవత్యాం తు నివసన్వో మహామణిమ్‌ | దివ్యం స్యమంతకం నామ స సూర్యా దుపలబ్దవాన్‌ || 12

తస్య సత్రాజితః సూర్యఃసఖా ప్రాణనమో7భవత్‌ | స కదాచి న్నిశాపాయే రధేన రథినాం వరః || 13

తోయకూల మప స్ప్రష్జు ముపస్థాతుం య¸° రవిమ్‌ | తస్యోపతిష్ఠతః సూర్యం వివస్వా నగ్రతః స్థితః || 14

విస్పష్టమూర్తిర్భగవాంస్తేజో మండలవా న్విభుః | అథ రాజా వివస్వంత మువాచ స్థిత మగ్రతః || 15

యథైవ వ్యోమ్ని పశ్యామి సదా త్వాం జ్యోతిషాం పతే | తేజోమండలినం దేవం తథైవ పురతః స్థితమ్‌ || 16

కోవిశేషో7స్తి మే త్వత్తః సఖ్యేనోపగతన్య వై |

సత్రాజిత్తు ప్రసేనుడు ద్వారపతిలో నుండెను. స్యమంతమను దివ్యమణిని సూర్యో పాసనచేసి వడసెను. అతనికి సూర్యుడు ప్రాణసమానుడైన మిత్రడు. అతడోకనాడు వేకువ జామున రథమెక్కి యొక జలాశయమునకేగి స్నానము చేసి సూర్యోపస్థానము సేయుచుండగా సూర్య భగవానుడెదుట స్పష్టమైన మూర్తితో తేజోమండలాకారముతో సాక్షాత్కరించెను. రా జాయననుజూచి యిట్లనియె. గగనమునందు నిత్యము నిన్నెట్లు చూచుచున్నానో అట్లే తేజోమండలాకారమున నెదుట నిపుడు చూచుచున్నాను. జ్యోతిస్సుల కెల్ల నధిపతిని నీవు నీతోనిట్లు చెలిమి నొందిన నాకు నీవలనగలుగు విశేషమేమి? అనిన,

ఏతచ్ఛ్రత్వాతు భగవాన్మణిరత్నం స్యమంతకమ్‌ || 17

స్వకంఠా దవముచ్యాథ ఏకాంతే న్యస్తవాన్విభుః | తతో విగ్రహవంతం తం దదర్శ నృపతి స్తదా || 18

ప్రీతిమా నథ తం దృష్ట్యా ముహూర్తం కృతవా న్కథామ్‌ | తమభిప్రస్థితం భూయో వివస్వంతం స సత్రజిత్‌ || 19

లోకాన్‌భాసయసే సర్వా యేన త్వం సతతం ప్రభో | తదేత న్మణిరత్నం మే భగవన్‌న్దాతుమర్షసి || 20

తతః స్యమంతకమణిం దత్తవాన్‌ భాస్కర రస్తదాః స త మాబధ్య నగరీం ప్రవివేశ మహీపతిః || 21

తం జనాః పర్యధావంత సూర్యో7యం గచ్ఛతీతిహ | స్వాం పురీం స విసిష్మాయ రాజా త్వంతఃపురం తథా || 22

తం ప్రసేనజితే దప్యం మణిరత్నం స్యమంతకమ్‌ | దదౌ భ్రాత్రే నరవతిః ప్రేవ్ణూ సత్రాజి దుత్తమమ్‌ || 23

స సుణిః స్యందతే రుక్మం వృష్ణ్యంధకనివేశ##సే | కాలవర్షీ చ పర్జన్యో నచ వ్యాధిభయం హ్యభూత్‌ || 24

లిప్సాం చక్రే ప్రసేనన్య మణిరత్నే స్యమంతకే | గోవిందో న చ తం లేభే శక్తో7పి నజహార పః || 25

కదాచి స్మ్రగయాం యాతః ప్రసేన స్తేన భూషితః | స్యసుంతకకృతే సింహాద్వధం ప్రాపవసేచరాత్‌ || 26

అథ సింహాం ప్రధావంత మృక్షరాజో మహాబలః | నిహత్య మణిరత్నం తదాదాయ ప్రావిశ ద్గుహామ్‌ || 27

తతో వృష్ణ్యంధకాః కృష్ణం ప్రసేనవధకారణాత్‌ | ప్రార్ధనాం తాం మణ ర్బుద్ధ్వా సర్వ ఏవ శశంకిరే || 28

స శంక్యమానో ధర్మాత్మా అకారీ తస్య కర్మణః | ఆహరిష్యే మణిమితి ప్రతిజ్ఞాయ వనం య¸° || 29

దీనిని విని యినుడు తనకంఠమునుండి తీసి స్యమంతకమణిని ఏకాంతమున నుంచెను. అంత నాభానుని సాకారముగ నా రాజప్పుడు దర్శించెను. మఱియు నతనితో ముహూర్తకాలము సంప్రీతితో ప్రసంగిచెను. అటుపై భాస్కరుడు బయలుదేరబోవుతఱి నాఱడు ప్రభూ! ఏ రత్నము దాల్చి నీవు లోకములన్నిటిని బ్రకాశింపజేయుచున్నావో యా మణిరత్నమును నాకు దయ సేయుమని కోరెను. ద్యుమణి యమ్మణిని యారాణ్మణి కిచ్చెను. అదిదాల్చి అమ్మహేశుడు రాజధానిం బ్రవేశించెను. అపురజను లంతట నిడుగో సూర్యుడవనికిందిగి వచ్చుచున్నాడని యాతనింగూర్చి పరువిడిరి. అట్లు పట్టణమెల్ల నాశ్చర్యమున ముంచి యంతఃపురమున కరిగెను. ఆ రత్నము నక్కడ తన తమ్ముడు ప్రళేనజిత్తునకు బ్రీతితో నొసంగెను. అ మణి యావృష్ణ్యంధకులయింట బంగారమును వర్షించుచుండెను. అది వచ్చిన తరువాత మేఘుడు సకాలమున వర్షించుచుండెను. అందెందును వ్యాధిభయము లేదయ్యె. గోవిందుడా ప్రసేనుని మణిరత్నమును దీనికొననెంచెను. కానియతడు శక్తుడయ్య దానిం గైకొనడయ్వెను. అది దాల్ఛి1 యొకప్పుడు ప్రసేనుడు వేటకుం బోయి యమ్మణింగని బెదరిమీద బడిన సింహము నోటబడి మృతినందెను. అయ్యెద వానింజంపి పారిపోవు మృగరాజును ఋక్షరాజు సంహరించి యా రత్నరాజముంగొని దనగుహం జొచ్చెను. వృష్ణ్యంధకులయ్యెడ ప్రసేనుడు హతుడవుట విని, అంతకుమున్నామణి నిమ్మని కోరియున్నందున నిదికృష్ణుని పనియోమోయని శంకించిరి. అట్లు తనను అనుమానించుట యెరింగి యాపని తాను జేయనివాడయ్యు నయ్యపవాదు తొలిగించుకొన నెంచి హరి యమ్మణింగొనితెత్తునని ప్రతిననేసి వనమేగెను.

యత్ర స్రసేనో మృగయాం వ్యచర త్తత్ర చాప్యథ| ప్రసేనస్య పదం గృహ్య పురుష్తెరాప్తకారిభిః || 30

ఋక్షవంతం గిరివరం వింధ్యం చ గిరిముత్తమమ్‌ | అన్వేష యన్పరిశ్రాంతః స దదర్శ మహామనాః || 31

సాశ్వం హతం ప్రసేనం తు నావిందత చ తస్మణిమ్‌ | అథ సింహః ప్రసేనస్య శరీర స్యావిదూరతః || 32

ఋక్షేణ నిహతో దృష్టః పదై ర్బక్షస్తు సూచితః | పదైసై రవ్వియాయాధ గుహా మృక్షస్య మాధవః || 33

స హి ఋక్షబిలే వాణీం శుశ్రావ ప్రమదేరితామ్‌ | ధాత్ర్యా కుమారమాదాయ సుతం జాంబవతో ద్విజాః || 34

క్రీడయంత్యాచమణినా మా రోదీ రిత్యధేరితామ్‌ ||

ప్రసేనుడు వేటాడిన తాపునందాతని యడుగుజాడలను, ఆప్తజనమ్మువలన విని గుర్తించి, ఆజాడంబట్టి పోయి పోయి ఋక్షవంతమనుగిరిని వింద్యపర్వతమున వెదకివెదకి అలసిసొలసి తుదకు గుఱ్ఱముతో గూడ కూల్పబడిన ప్రసేనుంగాంచెను. గాని మణిని మాత్రము గానడయ్యె, ప్రసేనునిశరీరమునకు దగ్గర భల్లుకముచే హతమై పడియున్న సింముజూచెను. అడుగులగుర్తులంబట్టి యాచం పినది భల్లుకమని మాత్రము గ్రహిచెను. అట్లే పయనించి యల్లంతలో నొక గుహను జూచెను. ఆ యెలుగుబంటి బిల మందొక సుందరి యెలుంగు వినవచ్చెను. అట నొకదాది జాంబవంతునితనయు నొకబాలునెత్తుకొని స్యమంతకమణిం జూపుచు, నాడించుచున్న దానిం జూచెను.

ధాత్య్రువాచ

సింహః ప్రసేన మవధీ త్సింహో జాంబవతా హతః | సుకుమారక! మారో దీ స్తవహ్యేష స్యమంతకః || 35

వ్యక్తిత స్తస్య శబ్ధస్య తూర్ణమేవ భిలం య¸° | ప్రవిశ్య తత్ర భగవాం స్తద్ధృక్షబిల మంజసా || 36

స్థాపయిత్వా బిలద్వా రేయదూన్‌ లాంగలినాసహ| శార్గధన్వా బిలస్థంతు జాంబవంతం దదర్శ సః || 37

యుయుదే వాసుదేవస్తు బిలే జాంబవతా సహ | బాహూభ్యామేవ గోవిందో దివసా నేకవింశతిమ్‌ || 38

ధాత్రియిట్లనుచున్నది -

'' సింహః ప్రశేన మవధీత్‌ సింహో జాందవతా హతః |

సుకుమారక ! మారోదీ స్తప హ్యేష స్యమంతకః || ''

సింహము ప్రసేనుని గూల్చినది. అ సింగము జాంబవంతునిచే గూలినది. ఓ సుకుమారుడా ! ఏడువకు ఈ న్యమంతక మణి నీదే సుమా! అని యాయనుచున్నమాట ఆ మాటయొక్క వ్యక్తింబట్టి వెనువెంటనే హరి బిలముంజొచ్చెను. కృష్ణ భగవానుడు బిలద్వారమందు బలరామునితో గూడ యదువుల నిక్కడుండుడని నిలిపి శార్జధనువూని లోనికింజొచ్చి జాంబవంతుని జూచెను. అగుహయం దాతనితో వాసుదేవుడు యుద్ధము సేసెను. ఇరువది యొక్క రోజులు వానితో బాహు యుద్ధము గావించెను.

ప్రవిషే7థ బిలే కృష్ణే బలదేవ పురస్సరాః | పురీం ద్వారవతీ మేత్య హతం కృష్ణం న్యవేదయన్‌ || 39

వాసుదేవో7పి నిర్జిత్య జాంబవంతం మహాబలమ్‌ | లేభే జాంబవతీం కన్యా మృక్షరాజస్య సంమతామ్‌ || 40

మణిం స్యమంతకమ్‌ చైవ జగ్రాహ77 త్మవిశుద్దయే| అనునీయర్జరాజం తు నిర్యి¸° చ తతో బిలాత్‌ || 41

ఉపాయా ద్ద్వారకాం కృష్ణ స్స వినీతైః పురస్సరై | ఏవం స మణిమాహృత్య విశోధ్యా77త్మాన మచ్యుతః || 42

దదౌసత్రాజితే తం వై సర్వసాత్త్వతసంనది | ఏవం మిధ్యాభిశ##ప్తేన కృష్ణే నామిత్రషూతినా || 43

అత్మా విశోదితః పాపా ద్యినిర్జిత్య స్యమంతకమ్‌ |

కృష్ణుడు బిలమం బ్రవేశించిన తరువాత బలరామాదులు ద్వారవతికేగి కృష్ణుడందు హతుడయ్యెనని తెలిపిరి. వాసు దేవుండో, జాంబవంతుని గెలిచి, యాబుక్షాధిపతి తనయును జాంబవతింబొంది తన యపవాదుపోవ నెలుగుల ఱని ననునయించి స్యమంతకమణిం గైకొని యుపాయముననా గుహ వెలువడి యావలకేగెను. ఆయనతో విధేయులయిన పరివారము వెన్నంటి వచ్చిరి. ఇట్లాతడు మణిం గౌని వచ్చి అత్మవిశోధనము సేసికొని సర్వసాత్వత జననమావేశమందు దానిని సత్రాజిత్తున కొసంగెను. అరిజనసంహారియైన హరి లేనిపోని యపవాదునకు గురియై యది పాపుకొనెను.

సత్రాజితో దశ త్వాస న్భార్యా స్తాసాం శతం సుతాః || 44

ఖ్యాతిమంత స్త్రయస్తేషాం భంగకారస్తు పూర్వజః | వీరో వాతపతి శ్చైవ వసుమేధ స్తథైవ చ || 45

కుమార్యశ్చాపి తిస్రో వైదిక్షు ఖ్యాతా ద్విజోత్తమాః సత్యభామోత్తమా తాసాం వ్రతినీచ దృడవ్రతా || 46

తథా ప్రస్వాపినీ చైవ భార్యాః కృష్ణాయ తాదదౌ | సభాక్షో భంగకారిస్తు నా వేయశ్చ సరోత్తమౌ || 47

జజ్ఞాతే గుణసంపన్నౌ విశ్రుతౌ రూపసంపదా | మాద్య్రాః పుత్రో7థ జజ్ఞే7థ వృష్ణిపుత్రో యుధాజితః || 48

జజ్ఞాతే తన¸° వృష్ణే శ్వఫల్క శ్చిత్రక స్తథా | శ్వఫల్కః కాశిరాజస్య సుతాం భార్యామవిందత || 49

గాంధీనీంనామ తస్యాశ్చ గా ః సదా ప్రదదౌ పితా | తస్యాం జజ్ఞే మభాబాహుః శ్రుతవా నతిథిప్రియః || 50

అక్రూరో7థ మహాబాగో జజ్ఞే విపులదక్షిణః | ఉపమద్గు స్తథా మద్గు ర్ముదరశ్చారిమర్ధనః || 51

ఆరిక్షేప స్తథోపేక్షః శత్రుహా చారిమేజయః | ధర్మభృచ్ఛాపి ధర్మా చ గృధ్రభోజాంధక స్తథా || 52

ఆవాహప్రతివాహౌ చ నుందరీ చ వరాంగనా | విశ్రుతాశ్వస్య మహిషీ కన్యా చాస్య వసుంధరా || 53

రూప¸°వన సంపన్నా సర్వత్త్వమనోహరా | అక్రూరేణోగ్ర సేనాయాం సుతౌ వై కులనందనౌ || 54

వసుదేవశ్చోప దేవశ్చ జజ్ఞాతే దేవ వర్చసౌ | చిత్రకస్యా భవస్సుత్రాః పృథుర్విపృథురేవ చ || 55

అళ్వగ్రీవో7శ్వబాహుశ్చ సుపార్శ్వకగవేషణౌ | అరిష్టనేమిశ్చ సుతా ధర్మో ధర్మభృదేవ చ || 56

సుబాహుర్బహు బాహుశ్చ శ్రనిష్ఠాశ్రవణస్త్రియా | ఇమాం మిథ్యాభిశస్తిం యః కృష్ణస్వ సముదాహృతామ్‌ || 57

వేద మిథ్యాభి శాపాస్తం స స్పృశంతి కదాచశ ||

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే స్యమంతక ప్రత్యానయన నిరూపణం నామ షోడశో7ధ్యాయః

సత్రాజిత్తు భార్యలు పదిమంది. వారియందు నూర్గురు కుమారులుదయించిరి. అందు ప్రఖ్యాతి గలవారు ముగ్గురు. అందగ్రజుడు | భంగకారుడనువాడు, వాతపతి, వసుమేధుడు, వాని తరువాతివారు. కూతరులు ముగ్గురు, వారిలో సత్యభామ ఉత్తమ (పెద్దదన్నమాట) రెండవది ఉత్తమ వ్రతాచారపరాయణయగువ్రతిని. ప్రస్వాపిని అనునది మూడవయామె. వారిని సత్రాజిత్తు కృష్ణున కిచ్చెను. భంగకారి కొడుకులిద్దరు. కీర్తిమంతులు, రూపవంతులు సభాక్షుడు, నావేయుడనువారు. (క్రోష్టుభార్యయగు) మాద్రియందు గల్గినవాడు వృష్ణిపుత్రడు, యుధాజిత్తు. వృష్ణి కుమారులు శ్వఫల్కుడు, చిత్రకుడు ననియిద్దరు. శ్వఫల్కుడు, కాశిరాజతనయంబెండ్లాడెను. అమె గాందినియను పేరిది. అమె తండ్రి యామెకు గోవుల నెప్పుడు నిచ్చెడువాడు (అందున నాపేరు ప్రఖ్యాతికి వచ్చినది) అమె యందు పండితుడు, అతిథి ప్రియుడు మహావీరుడు బహుదక్షిణ నిచ్చువాడు మహానుభావుడగుఅక్రూరుడుదయించెను. అక్రూరుడేగాక ఉపమద్గువు, మద్గువు, మదురుడు, అరిమర్దనుడు, అరిక్షేపుడు, ఉపేక్షుడు, అరిమేజయుడు, ధర్మపరుడైన ధర్ముడు, గృధ్రభోజుడు, అంధకుడు, ఆవాహుడు, ప్రతివాహుడు, ననువారును సుందరియగు వసుంధరయను కుమార్తెయును శ్వఫల్కునికి కలిగిరి. వసుంధర విశ్రుతాశ్వుని వివాహమాడి

పట్ట మహిషి అయినది. ఈమె రూప¸°వనసంపన్న సర్వసత్వ మనోహరయునై యొప్పెను. అక్రూరుని కుగ్రసేనయందు కులనందనులైన నందను లిద్దరు గల్గిరి. వసుదేవుడు, ఉపదేవుడు అనువారు. దేవ వర్చస్కులు. చిత్రకుని కుమారులు పృథువు, విపృథువు, అశ్వగ్రీవుడు, అశ్వబాహుడు,సుపార్శ్వకుడు, గవేషణుడు, అరిష్టనేమి, ధర్ముడు, ధర్మభృత్తు సుబాహువు, బహుబాహువు, యను పుత్రులు. శ్రవిష్ఠ, శ్రవణయను కూతుళ్లు కలిగిరి. కృష్ణుని యీ యవవాద వృత్తాంతము విన్నవానికి ఎన్నడును అపవదల స్పర్శయుండదు.

ఇది శ్రీ బ్రహ్మపురాణమందు స్యమంతక ప్రత్యానయనమను పదునారవ యథ్యాయము.

Brahmapuranamu    Chapters