Brahmapuranamu    Chapters   

అధత్రయోదశోధ్యాయః

పురు వంశ వర్ణనమ్‌

బ్రాహ్మణా ఊచుః-

పూరోర్వంశం వయం సూత శ్రోతుమిచ్ఛామ తత్త్వతః | ద్రుహ్య స్యానో ర్యదోశ్చైవ తుర్వసోశ్చపృధక్పృధక్‌ || 1

సూత! పురువంశమును, ద్రుహ్యుడు అనువు యదువు తుర్వసుడు నను వారి వంశములను వేర వేర వినవలతునుని భ్రాహ్మణులడుగ నూతుండిట్లనియె.

శృణుధ్వం మునిశార్దూలాః పూరో ర్వంశం మహాత్మనః | విస్తరేణా೭೭ను పూర్వ్యాచ్చ ప్రథమం వదతోమమ || 2

మునిపుంగవులరా! మొదట మహాత్ముడైన పూరుపువంశమును గూర్చి మొదటినుండి విస్తారముగా జెప్పుచున్నాను. వినుడు.

పూరోః పుత్ర స్సువీరోభూ న్మనన్యు స్తస్య చా೭೭త్మజః | రాజా చాభయదో నామ మనస్యో రభవత్సుతః || 3

తథై వాభయదస్యా೭೭సీ నామ పార్ధివః | సుధన్వనః సుబాహుశ్చ రౌద్రాశ్వ స్తస్య చాత్మజః || 4

రౌద్రాశ్వస్య దశార్ణేయః కృకణయు స్తధైవ చ | కక్షేయుః స్థండిలేయుశ్చ సన్నతేయ స్తథైవచ || 5

ఋచేయుశ్చ జలేయుశ్చ స్థలేయుశ్చ మహాబలః | ధనేయుశ్చ వనేయుశ్చ పుత్రకాశ్చ దశ;స్త్రియః || 6

భద్రా శూద్రా చ మద్రా చ శలదా మలదా తధా | ఖలదా చ తతో విప్రా సలదా సురసాపి చ || 7

తధా గోచపలాచ స్త్రి రత్నకూటా చ తా దశ | ఋషిర్జాతోత్రివంశే చ తాసాం భర్తాప్రభాకరః || 8

పూరువు కుమారుడు సువీరుడు, వానికి మనుస్యుడు, వానికి అభయదుడు. వానికి సుధన్వుడు, వానికి సుబాహువు, వానికి రౌద్రాశ్వుడు, రౌద్రాశ్వునకు దశార్ణేయుడు, కృకణయువు, కక్షేయువు, స్థండిలేయువు, నన్నతేయువు, ఋచేయువు, జలేయువు, బలశాలి యగు స్థలేయువు, ధనేయువు, వనేయువు నను పదిమంది గల్గిరి. మరియు భద్ర, శూద్ర, మద్ర, శలద, మలద, ఖలద, నలద, సురస, గోచవల, స్త్రిరత్నకూటయను పదిమంది కుమార్తెలు జనించిరి. అత్రివంశమందుదయించిన ప్రభాకరుడను ఋషి వారందరకు భర్తయయ్యెను.

భద్రాయాం జనయామాస సుతం సోమం యశస్వినమ్‌ | స్వర్భానునా హతే సూర్యే పతమానే దివో మహీమ్‌ || 9

తయోభిభూతే లోకే చ ప్రభా యేన ప్రవర్తితా | స్వస్తి తేస్త్వితి చోక్త్వా వై పతమానో దివాకరః | 10

వచనాత్తస్య విప్రర్షేర్న పపాత దవో మహీమ్‌ | అత్రి శ్రేష్ఠాని గోత్రాణి యశ్చకార మహాతపాః|| 11

యజ్ఞేష్వత్రే ర్బలం చైవ దేవై ర్యస్య ప్రతిష్ఞితమ్‌ | స తాసు జనయామాస పుత్రికా స్త్వాత్మకామజాన్‌ || 12

దశపుత్రాన్మ హాసత్త్వాం స్తప స్యుగ్రే రతా స్తధా | తేతు గోత్రకరా విప్రా ఋషమో వేదపారగాః || 13

అతడు భద్రయందు యశస్వియగు సోముని గనెను. సూర్యుడు రాహువుచే నిహతుడై (గ్రహణమందు) యాకాశమునుండి పడిపోవుచున్న తఱి, లోకమంధకారబంధురమైన యెడ యీ ప్రభాకరుని వలననే వెలుగేర్పడెను. నీకు స్వస్తి (శుభము) గలుగుగాక యని ప్రభాకరుడన్నంత సూర్యు డంతరిక్షమునుండి క్రిందికింబడడయ్యెను. ప్రభాకరుడత్రి ప్రధానములయిన అత్రేయస గోత్రములకు కర్తయయ్యె. యజ్ఞములందత్రికి బలము దేవతలచే కల్పింపబడెను. (ఇప్పటికిని యజ్ఞసదస్సునందాత్రేయన గోత్రుల కగ్రపూజ యిచ్చుట సంప్రదాయ సిద్ధమైనది.) ప్రభాకరుడా పదిమంది పత్నులయందు పదిమంది కుమారులను వేదపారగులను గోత్రకర్తలను గాంచెను. వారు స్వస్త్యాత్రేయ లనుపేర ప్రఖ్యాతి గనిరి.

స్వస్త్యాత్రేయా ఇతి ఖ్యాతాః కించ త్రిధనవర్జితాః | కక్షెయో స్తనయాస్త్వాసంస్త్రయ ఏవ మహారధాః || 14

నభానర శ్చాక్షుపశ్చ పరమన్యు స్తదైవ చ | సభాసరస్య పుత్రస్తువిద్వా న్కాలానలో నృపః || 15

కాలానలస్య ధర్మజ్ఞః సృంజయో నామ వై సుతః | సృంజయ స్యాభవ త్పుత్రో వీరో రాజా పురంజయః || 16

జనమేజయో మునిశ్రేష్టాః పురంజయనుతోభవత్‌ | జనమేజయస్య రాజర్షే ర్మహాశాలోభవత్సుతః 17

దేవేషు న పరిజ్ఞాతాః ప్రతిష్ఠిత యశా భువి | మహా మనా నామ సుతొ మహాశాలస్య విశ్రుతః 18

జజ్ఞే వీరః సురగణౖః పూజితః సుమహామనాః | మహామనాస్తు పుత్రౌ ద్వౌ జనయామాస భోద్విజాః || 19

ఉశీనరం చ ధర్మజ్ఞం తితిక్షుం చ మహాబలమ్‌ | ఉశీనరస్య పత్న్యస్తు పంచరాజర్షివంశజాః || 20

నృగా కృమిర్నవా దర్వా పంచమీ చ దృషద్వతీ | ఉశీనరస్య పుత్రాస్తు పంచ తాసు కులోద్వహాః || 21

తపసా చైవ మహతా జాతా వృద్ధస్య చా೭೭త్మజాః | నృగాయాస్తు నృగః పుత్రః కృమ్యాం కృమిరజాయత || 22

నవాయాస్తు నవః పుత్రో దర్వాయా స్సువ్రతోభవత్‌ | దృషద్వత్యాస్తు సంజజ్ఞె శిబి రౌశీనరో నృపః || 23

శిబేస్తు శిబియో విప్రా యోధోయస్తు నృగస్య హ | నవస్య నవరాష్ట్రంతు కృమేస్తు కృమిలాపురీ|| 24

సువ్రతస్య తథాంబష్టాః, శిబిపుత్రా న్నిబోధత | శిబేస్తు శిబయః పుత్రా శ్చత్వారో లోకవిశ్రుతాః || 25

వృషదర్భః సువీరశ్చ కేకయో మద్రక స్తధా | తేషాం జనపదాః స్ఫీతా కేకయా మద్రకా స్తధా || 26

వృషదర్భాః సువీరాశ్చ తితిక్షోస్తు ప్రజా స్త్విమాః | తితిక్షు రభవ ద్రాజా పూర్వస్యాం దిశి భో ద్విజాః || 27

త్రివిధ ధనశూన్యులు. (సూర్యుడు పడిపోవుటcజూచి ఆత్రేయుడగు ప్రభాకరుడాయనకు స్వస్తియగుcగాక యన్నందున నా గోత్రము వారికీ బిరిదు వచ్చినదన్నమాట) కక్షేయుని కుమారులు మువ్వురు. మహారధులు. సభానరుడు, చాక్షుషువు, పరమన్యువు ననువారు. సభానరుని కుమారుడు విద్యాంసుడగు కాలానలుడు. వాని కుమారుడు ధర్మజ్ఞుడగు సృంజయుడు వానిపుత్రుడు వీరుడు, మహారాజునగు పురంజయుడు వాని కుమారుడు జనమేజయుడు. మహాశాలుడు జనమేజయిని పుత్రుడు. మహాశాలుడు దేవతలలో విఖ్యాతుడు. సుప్రతిష్ట గన్నవాడు, నయ్యెను. మహాశాలుని కుమారుడు మహామనుడు దేవపూజితుడు. మిక్కిలి గొప్ప మనస్సుcగలవాడు. ఆయన కౌడుకులు ధర్మజ్ఞుడగు ఉశీనరుడు, మహాబలశాలియగు తితిక్షుడు ననువారిద్దరు. ఉశీనరుని పత్నునైదుగురు. రాజర్షి వంశమువారు. నృగ, కృమి, నవ, దర్వ, దృషద్వతియనువారు. వారియందు ఉశీనరునకు వార్ధకదశలో తపఃప్రభావముచే కులోద్వహులైన కుమారులైదుగురు. నృగకు నృగుడు, కృమకి కృమి, నవకు నపుడు, దర్వకు సువ్రతుడు, దృషద్వతికి శిబియనుజౌశినర ప్రభువు జన్మించిరి. శిబికి శిబులయుడను నల్గురు కొడుకులు నృగునికి ¸°ధేయులు గల్గిరి. నవునిది నవయను రాష్ట్రుము. కృమిది కృమిలాపురి, సువ్రతునికంబష్టులు గల్గురి. శిబయొక్క నల్గురు, కుమారులు వృషదర్భుడు, సువీరుడు, కేకయుడు, మద్రకుడునను వారు, వారిదేళములు సర్వసంవత్స మృద్ధములగు కేకయములు, మద్రకములు పృషదార్భములు సువీరములు నను ప్రసిద్ధినందినవి. తితిక్షువు పూర్వదిక్కునకు రాజయ్యెను.

ఉషద్రధొ మహావీర్యః ఫేన స్తస్య సుతోభవత్‌ | ఫేనస్య సుతపా జజ్ఞే తతః సుతపసో బలిః || 28

జాతో మానుష యోనౌ తు సరాజా కాంచనేషుథిః | మహాయోగీ సతు బలి ర్బభూవ నృపతిః పురా || 29

పుత్రా నుత్పాదయామాన పంచ వంశకరా న్భువి | ఆంగః ప్రధమతో జజ్ఞే వంగః సూహ్య స్తథైవ చ || 30

పుండ్రః కలింగశ్చ తథా బాలేయం క్షత్రముచ్యతే | బాలేయా బ్రాహ్మణాశ్చైవ తస్య వంశకరా భువి || 31

బలేశ్చ బ్రహ్మణా దత్తో వరః ప్రీతేన భో ద్విజాః | మహాయోగిత్వమాయుశ్చ కల్పస్య పరిమాణతః || 32

బలే! చాప్రతిమత్వం వై ధర్మతత్వార్ధ దర్శనమ్‌ | సంగ్రామే చాప్యజేయత్వం ధర్మే చైవ ప్రధానతామ్‌ || 33

త్రైలోక్య దర్శనం చాపి ప్రాధాన్యం ప్రసవే తథా | చతురో నియతా స్వర్ణాంస్త్వం చ స్థాపయితేతిచ || 34

ఇత్యుక్తొ విభునా రాజా బలిః శాంతిం హాం య¸° | కాలేన మహతా విప్రాః స్వం చ స్థాన ముపాగమత్‌ || 35

తేషాం జనపదాః వంచ అంగా పంగా ససుహ్మకాః | కాళీంగాః పుండ్రకాశ్చైవ ప్రజా స్త్వంగస్య సాంప్రతమ్‌ || 36

అంగపుత్రో మహానాశీ ద్రాజేంద్రో దధివాహనః | దధివాహన పుత్రస్తు రాజా దినిరథోభవత్‌ || 37

పుత్రో దివిరథస్యా೭೭సీచ్ఛ క్రతుల్య పరాక్రమః | విద్వా న్ధర్మరథో నామ తస్య చిత్రరథః సుతః || 38

తేన ధర్మరథేనాథ తదా కాలంజరే గిరౌ | యజతా సహ శ##క్రేణ సోమః పీతో మహాత్మనా || 39

అథ చిత్రరథస్యాపి పుత్రో దశరథోభవత్‌ | లోమపాద ఇతిఖ్యాతో యస్య శాంతా సుతాభవత్‌ || 40

తస్య దాశరధి ర్వీరళ్చతురంగో మహాయశాః | ఋష్యశృంగప్రసాదేన జజ్ఞే వంశవివర్ధవః || 41

తితిక్షుని కుమారుడు ఉషద్రధుడు. వాని కుమారుడు ఫేనుడు, వానికి సుతవుడు వానికి బలి కలిగిరి. బలి మనుష్య జన్మ మెత్తెను. అతడు బంగారపు తూణీరము (అమ్ములపొది) గలవాడు. మహాయోగియై రాజ్యమేలెను. వంశోద్దారకులగు నైదుగురు కుమారులను భూమియందు గదెను. వారు అంగుడు, వంగుడు, సుహ్ముడు, పుండ్రుడు, కళింగుడు ననువారు, వారి పరంపర బాలేయమనుపేర క్షత్రవంశము ప్రసిద్ధిగాంచెను. బాలేయాలను, బ్రాహ్మణులను, బలి వంశోద్ధారకులును, గూడనైరట. బ్రాహ్మ సంతోషించినవాడై బలికి మహాయోగిత్వము కల్పపూర్ణాయువు, ధర్మతత్తార్ధ మెఱుంగుడి సాటిలేని బలమును సంగ్రామమందజేయత్వము ధర్మప్రాధాన్యము, తైలోక్యదర్శనము, సంతానప్రాధాన్యము చాతుర్వర్ణ్యవ్యవస్థాపనము నను లక్షణములను వరముగ నొసంగెను; ఇందువలన బలి పరమశాంతి వడసెను. కాలక్రమమున నతడు స్వస్థానమును (పాతాళమును) చేరెను. అంగాదుల పేర నాయాదేశములు ప్రసిద్ధినందియున్నవి.

అంగునికొడుకు దధివాహనుడు. వాని కొడుకు దివిరధుడు. వాని పుత్రుడు ఇంద్రతుల్య పరాక్రముడు విద్వాంసుడునగు ధర్మరధుడువాని పుత్రుడు చిత్రరథుడు, ధర్మరథుడు కొలం జరాద్రిపై యజ్ఞముచేసి యింద్రునితోగూడి సోమపానము జేసెను. చిత్రరథుని తనయుడు దశరధుడు, లోమపాదుడను ఖ్యాతినందెను. ఆయన కూతురు శాంత. ఆ దశరధునికి శాంతా భర్తయైన ఋష్యశృంగుని యనుగ్రహముచే చతురంగుడనువాడు వంశోద్ధారకుడై జనించెను.

చతురంగస్య పుత్రస్తు పృథులాక్ష ఇతి స్మృత ః | పృథులాక్షసుతో రాజా చంపో నామ మహాయశాః || 42

చంపస్య తు పురీ చంపా యా మాలిన్యభవత్పురా | పూర్ణభద్రప్రసాదేన హర్యంగోస్య సుతోభవత్‌ || 43

తతో వైభాండకి స్తస్య వారణం శక్రవారణమ్‌ | అవతార యామాస మహీం మంత్రై ర్వాహనముత్తమమ్‌ || 44

హర్యంగస్య సుత స్తస్య రాజా భద్రరథః స్మృతః | పుత్రో భద్రరథస్యా೭೭సీ ద్భృహత్కర్మా ప్రజేశ్వరః || 45

బృహద్దర్భః సుత స్తస్య యస్మాజ్షజ్ఞే బృహన్మనాః | బృహన్మనాస్తు రాజేంద్రో జనయామాస వైసుతమ్‌ || 46

నామ్నా జయద్రథం నామ యస్మా ద్డృఢరథోనృపః | ఆసీద్దృఢరథస్యాపి విశ్వజి జ్జనమేజయీ || 47

దాయాద స్తస్య వై కర్ణో వికర్ణ స్తస్య చా೭೭త్మజః | తస్య పుత్రశతం త్వాసీ దంగానాం కులవర్ధనమ్‌ || 48

ఏతేంగవంశజాః సర్వే రాజానః కీ ర్తితా మయా | సత్యవ్రతా మహాత్మానః ప్రజావంతో మహారథాః || 49

ఋచేయోస్తు మునిశ్రేష్టా రౌద్రాశ్వతనయస్య వై | శృణుధ్వం సంప్ర వక్ష్యామి వంశం రాజ్ఞస్తుభోద్విజాః || 50

చతురంగునికి పృధులాక్షుడు, వానికి చంపుడుcగలిగెను (ఈతని రాజధానియే చంపాపురి. ఇంతకుము న్నీనగరము 'మాలిని' యనబడెను.) అతనికి పూర్ణభ్రదుని ప్రసాదమున హర్యంగుడు గల్గెను. వైభాండకి (ఋష్యశృంగముని) మంత్రములతో నింద్రుని ఉత్తమ వాహనమైన ఐరావతమును ఆ హర్యంగుని యేనుగుగా భూమికి దింపెను. హర్యంగుని తనయుడు ఛద్రరధుడను రాజు. వాని కోడుకు బృహత్కర్మ యను నరేంద్రుడు, వాని పుత్రుడు బృహద్దర్భుడు వానితనయుడు బృహన్మనుడు, రాజేంద్రుడగు వాని కుమారుడు జయద్రధుడు వానిపుత్రుడు దృఢరథ మహారాజు, వాని సుతుడు విశ్వజిత్తయిన జనమేజయుడు. వాని కుమారుడు వైకర్ణుడు. వాని పుత్రుడు వికర్ణుడు వానికి నూర్గురు కొడుకులుఁ గల్గిరి. వారంగవంశవర్ధనులు, ఆంగతవంశరాజుల నందరిని తెల్పియుంటిని, వారందరు సత్యవ్రతులు, మహత్ములు, సంతానవంతులు, మహారదులు, రౌద్రాశ్వతనయుడైన ఋచేయుని వంశమిక వర్ణించెద; వినుడు.

ఋచేయోస్తనయో రాజా మలినారో మహీపతిః మతినారసుతా స్త్వాసం స్త్రయః పరమధార్మికాః || 51

వసురోధః ప్రతిరథః సుబాషుశ్చైవ ధార్మికః| సర్వే వేదవిదశ్చైవ బ్రహ్మణ్యాః సత్యవాధివః || 52

ఇలా నామ తు యస్యా೭೭సీత్కన్యావై మునిసత్తమాః| బ్రహ్మవాదీ న్యపిస్త్రీ సాతంసు స్తామభ్యగచ్ఛత|| 53

తంసోః సుతోథ రాజర్షి ర్ధర్మనేత్రః ప్రతాపవాన్‌| బ్రహ్మవాదీ పరాక్రాంత స్తస్య భార్యోపదానవీ|| 54

ఉపదానవీ తతః పుత్రాం శ్చతురోజనయ చ్ఛుభాన్‌ | దుష్యంతమథ సుష్మంతం ప్రవీర మనఘం తథా|| 55

ఋచేయుని తనయుడు మతినారుడు, వానికొడుకుయి పరమధార్మికులు ముగ్గురు. వసురోధుడు, సుబాహువు అనువారు. అందురు వేదవిదులు, బ్రహ్మణ్యులు, సత్యనంగరులు, మతినారుని కూతురు ఇల ఆమె స్త్రీయయ్యు బ్రహ్మవాదినియయ్యె. ఆమె తంసుని భార్య. వారి కొడుకు రాజర్షి ప్రతాపశాలియైన ధర్మనేత్రుడు అయిన బ్రహ్మావాది, పరాక్రమవంతుడు అతని భార్య ఉపదాసవి. వారి కుమారులు నల్వురు దుష్యంతుడు, సుష్మంతుడు ప్రవీరుడు, అనఘడు, ననువారు.

దుష్యంతస్య తు దాయాదో భరతో నామ వీర్యవాన్‌| స సర్వదమనో నామ నాగాయుతబలో మహాన్‌|| 56

చక్రవర్తీ సుతో జజ్ఞే దుష్యంతస్య మహాత్మనః| శకుంతలాయాం భరతో యస్య నామ్మా తు భారతాః|| 57

భరతస్య వినష్టేషు తనయేషు మహీపతేః| మాతౄణాం తు ప్రకోసేస మయా తత్కధితం పురా|| 58

బృహస్పతే రంగిరసః పుత్రోవిప్రో మహామునిః | ఆయాజయ ద్భరద్వాజో మహద్భిః క్రతుభిర్విభుః|| 59

పూర్వం తు వితధే తస్య కృతే వై పుత్రజన్మని| తతోథ వితథో నామ భరద్వాజో త్సుతో భవత్‌|| 60

కతోథ వితథే జాతే భరతస్తు దివం యమౌ| వితధం చాభిషి చ్యాధ భరద్యాజో వనం య¸° || 61

దుష్యంతునికి శకుంతల యందుదయించినవాఁడు భరతుడు. నర్వదమనుడను ఖ్యాతినందెను. అతడు పదివేల యేనుగుల బలము గలవాడు. చక్రవర్తి, అయన పేరనే భారతవర్షము ఆందలి ప్రజలు భారతులను పేరును పొందిరి. భరతునితనయులు మాతృశాపమున నశించిరి. ఆ కథ మున్న తెలిపితిని.

బృహస్పతి (అంగిరస్సు) యొక్క కుమారుడు భరద్వాజుడు భరతునిచే బెక్కు యాగములు చేయించిను. కాని అవి పుత్ర సంతానము విషయములో వితధములు (వ్యర్థములు) కాగా భరద్వాజుని వలన (నియోగమువలన) అతనికి వితథుడను పుత్రుడు కలిఁగెను. వాడు కలిగిన వెంటనే భరతుడు దివమునకు వెళ్ళెను. అతనికి పట్టము గట్టి భరద్వాజుడు వసంబున కేగ్‌ ను.

స చాపి విత థః పుత్రాన్‌ జనయామాస పంచవై| సుహోత్రంచ సుహోతారం గయం గర్గం తథైవ చ|| 62

కపిలంచ మహాత్మానం సుహోత్రస్య సుతద్వయమ్‌ | కాశికంచ మహాసత్యం తథా గృత్సమతిం ప్రభుమ్‌|| 63

తథా గృత్సమతేః పుత్రా బ్రాహ్మణాః క్షత్రియా విశః| కాశికస్య తు కాశేయః పుత్రో దీర్ఘ తపా స్తథా|| 64

బభూస దీర్ఘతపసో విద్వా న్ధన్వంతిరిః సుతః| ధన్వంతరేస్తు తనయః కేతుమానితి విశ్రుతః||65

తథా కేతుమతః పుత్రో విద్వా న్భీమరథః స్మృతః| పుత్రో భీమరధస్యాపి వారాణ స్యధిపో భవత్‌|| 66

దివోదాస ఇతి ఖ్యాతః సర్వక్షత్ర ప్రణాశనః| దివోదాసస్య పుత్రస్తు వీరోరాజా ప్రతర్దనః|| 67

ప్రతర్దనస్య పుత్రౌ ద్వౌవత్సో భార్గవ ఏవఛ | అలర్కో రాజపుత్రస్తు రాజా సన్మతిమాన్‌భువి|| 68

హైహయస్య తు దాయాద్యం హృతవాన్వై మహీపతిః | ఆజహ్రే పితృదాయాద్యం దివోదాసహృతం బలాత్‌|| 69

భద్రశ్రేణ్యస్య పుత్రేణ దుర్ధమేన మహాత్మానా| దివోదాసేన బారేతి ఘృణయా సౌ విసర్జితః|| 70

అష్టారధో నామ నృపః సుతో భీమరధస్య వై | తేన పుత్రేణ బాలస్య ప్రహృతం తస్య భో ద్విజాః || 71

వైరస్యాం తం మునిశ్రేష్ఠాః క్షత్రియేణ విధిత్సతా|

వితధునికి అయిదుగురు సుతులుఁ గల్గిరి, సుహోత్రుడు, సుహోత, గయుడు, గర్గురు, కపిలుడు ననువారు. సుహోత్రుని కొడుకులు సత్యవాదియగు కాశికుడు నరపతియగు గృత్సమతి. గృత్సమతి పుత్రులు బ్రాహ్మలు, క్షత్రియులు వైశ్యులును. కాశికుని కుమారుడు (కాశేయుడు) దీర్ఘతపుడు. దీర్ఘతపుని కుమారుడు విద్వాంసుడైన ధన్వంతరి. ఆయనకుమారుడు కేతుమంతుడు వాని కుమారుడు విద్వాంసుడైన భీమరధుడు, వాని కుమారుడు వారణాసి ప్రభువగు దిశోదానుడు, దిశోదానుకొడుకు వ్రతర్ధనుడు వీరుడైన ప్రభువు అతని కుమారులు వత్సడు, బార్గవుడు, వత్సరాజుపుత్రుడగు అలర్కుడను ఠాణుబుద్ధిమంతుడు. హైహయుని దాయాద్యమును (రాజ్యమును) హరించెను అంతియగాక దివోదానుడు హరించిన పితృరాజ్యమును తిరిగి సంపాదించుకొనెను.

అలర్క కాశిరాజస్తు బ్రహ్మణ్యః సత్యసంగరః|| 72

షష్టిం వర్షసహస్రాణి షష్టిం వర్షశతాని చ | యువా రూపేణ సంపన్న ఆసీ త్కాశికులోద్వహః 73

లోబాముద్రాప్రసాదేన పరమాయు రవాప సః| వయసోంతే మునిశ్రేష్ఠాహత్వా క్షేమకరాక్షసమ్‌|| 74

రమ్యాం నివేశయామాస పురీం వారణసీం నృపః| అలర్కస్య తుదాయాదః క్షేమకోనామ పార్ధివః|| 75

క్షేమకస్య తు పుత్రోవై వర్షకేతు స్తతో భవత్‌ | వర్షకేతోశ్చ దాయాదో విభుర్నొమ ప్రజేశ్వరః|| 76

ఆనర్తస్తు విభో! పుత్రః సుకుమారస్తతో భవత్‌ | సుకుమారస్య పుత్రస్తు సత్యకేతుర్మహారథః|| 77

సుతో భవన్మహాతేజా రాజా పరమధార్మికః| వత్సస్య వత్సభూమిస్తు భర్గభూమిస్తు భార్గవాత్‌ || 78

ఏతే త్వంగిరసః పుత్రా జాతా వంశేథ భార్గవే| బ్రాహ్మణా క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ మునిసత్తమాః|| 79

అలర్కుడు కాశీరాజు బ్రహ్మణ్ముడు సత్యసంగరుడు అరువదు ఆరువేలేండ్లయువకుడై రూపసంపన్నుడై యుండెను. లోపాముద్రప్రసాదమున దీర్ఘాయువునొందినాడు. చివరివయస్సున క్షేమక రాక్షసుని జంపి రమ్యమైన వారాణసీ నగర నిర్మాణము సేసెను. అలర్కుని కొడుకు క్షేమకుడు వాని సుతుడు వర్షకేతుడు, వాని తనయుడు విభువు. విభుని కొడుకు ఆనర్తుడు. నుకుమారుడు వాని కొడుకు, వాని తనయుడు సత్యకేతువు ధర్మమూర్తి. వత్సునకు వత్సభూమి, భార్గవు నివలన భర్గభూమియుకలిగెను, భార్గవ వంశమునందు అంగిరసుని పుత్రులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగలరు.

ఆజమీఢో పరో వంశః శ్రూయతాం ద్విజసత్తమాః| సుహోత్రస్యబృహత్పుత్రో బృహత స్తనయాస్తృయః 80

ఆజమీఢో ద్విమీఢశ్చ పురుమీఢశ్చ వీర్యవాన్‌ | అజమీఢస్య పత్న్యస్తు తిస్రోవై యశసాన్వితాః 81

నీలీ చ కేశినీ చైవ ధూమినీ చ వరాంగనాః|| ఆజమీఢస్య కేశిన్యాం జజ్ఞేజహ్నుః ప్రతాపవాన్‌ || 82

ఆజహ్రే యో మహాసత్రం సర్వమేధమఖం నిభుమ్‌ | పతిలోభేన యం గంగా వినీతేవ ససారహ|| 83

నేచ్చతః ప్లావయామాస తస్య గంగా చ తత్సదః| తత్తయా ప్లావితం దృష్ట్వా యజ్ఞవాటం సమంతతః|| 84

జహ్ను ర ప్యబృవీ ద్గంగాం క్రుద్ధో విప్రాస్తదా నృపః | ఏష తే త్రిషు లోకేషు సంక్షిప్యాపః పిబా మ్యహమ్‌ || 85

అస్యగంగే వలే పస్యసద్యః ఫల మవాప్నుహి|

తతః పీతాం మహాత్మానో దృష్ట్వా గంగాం మహర్షయః| ఉపనిన్యు ర్మహాభాగా దుహితృత్వేన జాహ్నవీమ్‌ || 86

యువనాశ్వస్య పుత్రీం తు కావేరీం జహ్నరావహత్‌ | గంగాశాపేన దేహార్ధం యస్యాః పశ్చాన్న దీకృతమ్‌ || 87

జహ్నోస్తు దయితః పుత్రో ఆజకో నామ వీర్యవాన్‌ | ఆజకస్య తు దాయాదో బలాకాశ్వో మహీపతిః|| 88

బభూవ మృగయాశీలః కుశికస్తస్య చా೭೭ త్మజః | పహ్లవైః సహ సంపృద్ధో రాజా వసచరైః సహ|| 89

కుశికస్తు తపస్తే సే పుత్ర మింద్రసమం విభుమ్‌ | లభేయమితి తం శక్ర స్త్రాసా దభ్యెత్య జజ్ఞీవాన్‌||90

స గాధి రభవ ద్రాజా మఘవా కౌశికః స్వయమ్‌| విశ్వామిత్రస్తు గాధేయో విశ్వామిత్రా త్తథాష్టకః 91

అష్టకన్య సుతో లౌహిః ప్రోక్తో జహ్నుగణోమయా|

బ్రహ్మణోత్తములారా! అజమీడుని వంశము వినబడుగాక! సుహోత్రుని పుత్రుడు- బృహన్నామకుడు వాని తనయులు ముగ్గురు. అజమీఢుడు ద్విమీఢుడు-పురుమీఢుడు. ఆజమీఢుని భార్యలు నీలిని-కేశిని-ధూమీని యనువారు అజమీఢునకు కేశినియందు వ్రతాపవఁతుఁడగు జహ్నువు కలిగెను, అతడు సర్వమేధమను మహానత్రయాగ మొనరించెను. గంగాదేవి యాయనను భర్తగారించి వినీతురాలివలె నభినరించెను. అతడు యిష్టపడకున్నంత నాతని యజ్ఞసదస్సును ముంచెత్తెను. జహ్ను వందులకు కోపించి యిదిగో నీ నీరమును సంక్షేపించి త్రాగెదను చూడుమని త్రాగివైచెను. ఋషులు చూచి యామె నాతని కుమార్తెగా నొనర్చిరి. యువనాశ్వుని కూతురగు కావేరి నాతడు పరిణయ మయ్యెను. గంగా శాపమున నవ్వల కావేరియొక్క సగము మేను నదీరూపమయ్యెను. జహ్నుని తనయుడు అజకుడు, వాని కుమారుడు బలాకాశ్వుడు, వాని సుతుడు మృగయాప్రియుడు కుశికుడు, అడవిజాతులతో పెరిగినాడు. అతడిం ద్రతుల్యుడగు సుతుడు కావలెనని తపముఁజేసెను. ఇంద్రుడడలి గాధియను పేరుతో దానే స్వయముగ వాని కుదయించెను. గాధి తనయుడు విశ్వామితుడు, అష్టకుడాతనికొడుకు, వాని కొడుకు తౌహీ, ఇది జహ్నుగణము.

ఆజమిడో7వరో వంశః శ్రూయతాం ముని సత్తమాః

అజమీఢాత్తు నీల్యాం వై సుశాంతి రుదపద్యత | పురుజాతిః సుశాంతేశ్చ బాహ్యాశ్వః పురుజాతితః || 93

బాహ్యాశ్వతనయాః పంచ స్ఫీతా జనపదావృతాః | ముద్గలః సృంజయశ్చైవ రాజా బృహదిషు న్తథా || 94

యవీనరశ్చ విక్రాంత కృమిలాశ్వశ్చ పంచమః | పంచైతే రక్షణా యాలం దేశానా మితి విశ్రుతాః || 95

పంచానాం తే తు పంచాలా ః స్ఫీతా జనపదావృతాః | అలం సంరక్షణ తేషాం పంచాలా ఇతి విశ్రుతాః || 96

అజమిఢుని రెండవ వంశము. అజమీఢునికి నీలియందు సుశాంతి పుట్టెను. వానికి పురుజాతి, వానికి వాహ్యాశ్వుడు వానికి అయిదుగురుకల్గిరి. ముద్గలుడు సృంజయుడు, బృహదిషురాజు. పరాక్రమశాలియగు యువీనరుడు, కృమిలాశ్వుడు. ఈ అయుదుగురు దేశములను రక్షింపజాలుదురు. అని ప్రసిద్ధి.

ముద్గలస్య తు దాయాదో మౌద్గల్యః సు మహాయశాః | ఇంద్రసేనా యతో గర్భం బ్రధ్నశ్వం ప్రత్యపద్యత || 97

అసీ త్పంచజనః పుత్రః సృంజయస్య మహాత్మనః | సుతః పంచజనస్యాపి సోమదత్తో మహీపతి ః || 98

సోమదత్తస్య దాయాదః సహదేవో మహాయశాః సహదేవసుతశ్చాపి స్ణోమకో నామ విశ్రుతః || 99

అజమీఢనుతో జాతః క్షీణ వంశే తు సోమకః | సోమకస్య సుతో జంతు ర్యస్య పుత్రశతం బభౌ || 100

తేషాం యవీయా స్పృషతో ద్రుపదస్య పితా ప్రభుః | అజమీఢాః స్మృతాశ్చైతే మహాత్మానస్తు సోమకాః || 101

ముద్గలునిదాయాదుడు మౌద్గల్యుడు, అయనవలన ఇంద్రసేన బ్రధ్నశ్వుడును కోమరుం గన్నది. సృంజయుని కుమారుడు పంచజనుడనువాడు. వాని కొడుకు సోమదత్తుడు. వాని కొడుకు కీర్తిశాలి సహదేవుడు. వాని పుత్రుడు సోమకుడు. అజమీడు వంశము యొక్క క్షీణదశలో సోమకుడుపుట్టెను. వాని కొడుకు జంతువు. వానికి నూర్గురు కుమారులు. వారిలో చిన్నవాడు వృషతుండు. వాని కొడుకు ద్రుపదుడు. ఇంతవరకు అజమీఢవంశము. వారు సోమకులను పేరుతో ప్రఖ్యాతి గనిరి.

మహిషీ త్వజమీఢస్య ధూమినీపుత్ర గర్ధినీ | పతివ్రతా మహాభాగా కులజా మునిసత్తమా ః 102

సా చ పుత్రార్థినీ దేవీ వ్రతచర్యాస మన్వితా | తతో వర్షాయుతం తప్త్వా తపః పరమదుశ్చరమ్‌ || 103

హుత్వా7గ్నిం విధివ త్సాతు పవిత్రా మితభోజనా | అగ్నిహోత్ర కుశేష్వేవ సుష్వాప మునిసత్తమాః 104

మునిశ్రేష్టులారా! అజమాఢుని మహిషి ధూమిని పతివ్రత. వ్రతాచరణపరాయణ. సంతతికై పదివేలేండ్లు దుశ్చరమైన తపమాచరించి అగ్ని హోత్రము సేయుచు మిత భోజనయై అగ్నిహోత్రసమీపదర్భలందు శయించెను.

ధూమిన్యా స తయా దేవ్యా త్వజమీఢః | సమీయివాన్‌ | ఋక్షం సంజనయామాస ధూమ్రవర్ణం సుదర్శనమ్‌ || 105

ఋక్షాత్సంవరణో జజ్ఞే కురుః నంవరణాత్తథా | యః ప్రయాగా దతిక్రమ్య కురుక్షేత్రం చకార హ || 106

పుణ్యం చ రమణీయం చ పుణ్య కృద్భి ర్ని షేవితమ్‌ | తస్యాస్వవాయః సుషుహా న్యస్య నామ్నా7థ కౌరవాః 107

కురోశ్చ పుత్రా శ్చత్వారః సుథన్వా సుథనుస్తథా | పరీక్షిచ్చ మహాబాహుః ప్రవరశ్చారిమేజయః || 108

పరీక్షితస్తు దాయాదో ధార్మికో జనమేజయః | శ్రుతసేనో7 గ్రనేనశ్చ భీమ సేనశ్చ నామతః || 109

ఏతే సర్వే మహాభాగావిక్రాంతా బలశాలినః | జనమేజయస్య పుత్రస్తు సురధో మతిమాం స్తథా || 110

సురథన్య తు విక్రాంతః పుత్రో జజ్ఞే విదూరథః | విదూరథస్య దాయాద ఋక్ష ఏవ మహారథః || 111

ద్వితీయస్తు భరద్వాజా న్నామ్నా తేనైన విశ్రుతః | ద్వావృక్షౌ సోమవంశే7స్మిన్ద్వావేవచ పరీక్షితౌ || 112

భీమసేనా స్త్రయో విప్రా ద్వౌ చాపి జనమేజ¸° |

అమెతో అజమీఢుడు నమావేశమంది ధూమ్రవర్ణుడు చక్కనివాడునగు ఋక్షుడనుకుమారుని గాంచెను. ఋక్షుని వలన సంవరణుడు వానికి కురువుc గల్గెను. అతడు ప్రయాగనుండి వెళ్ళి కురుక్షేత్రము నిర్మించెను. అదిపవిత్రము, రమణీయము, పుణ్యవంతులచె సేవింపబడునది. ఆయన వంశీయులే కౌరువులు. కురుని కుమారులు నల్వురు, సుధన్వుడు, సుధనుడు, పరీక్షిత్తు మహాపరాక్రమవంతుడగు అరిమేజయుడు. పరీక్షిత్తుకొడుకులు జనమేజయుడు, శ్రుతసేనుడు, అగ్రసేనుడు, భీమసేనుడు, వీరందరు శూరులు, బలశాలురు. జనమేజయుని తనయుడు బుద్ధిశాలియగు సురధుడు. వానిసుతుడు విదూరథుడు, వానికొడుకు మహారథుడగు ఋక్షుడు. రెండవవాడు భరధ్వాజుని వలన నదే పేర ప్రఖ్యాతి వడెసెను. సోమ వంశమం దిద్దరు ఋక్షులు, ఇద్దరు పరీక్షిత్తులు, ముగ్గురు భీమసేనులు, ఇద్దరు జనమేజయులు గల్గిరి.

ఋక్షస్య తు ద్వితీయస్య భీమసేనో7భవ త్సుతః || 113

ప్రతీపో భీమసేనాత్తు ప్రతీపస్య తు శాంతనుః | దేపాపి ర్బా హ్లికశ్చైవ త్రయ ఏవ మహారథా ః || 114

శంతనో స్త్వభప ద్భీష్మ స్తస్మిన్వంశే ద్విజోత్తమాః ||

రెండవ ఋక్షునికి భీమసేనుముదయించెను, వానికి ప్రతీవుడు. వానికి శాంతనుడు. దేవాపి, బాహ్లీకుడు అను మువ్వురుc గల్గిరి. శాంతసునికి భీష్ముడుదయించెను.

బాహ్లికస్య తు రాజర్షే ర్వంశం శృణత భో ద్విజాః || 115

బాహ్లికస్య సుతశ్చైవ సోమదత్తో మహాయశాః | జజ్ఞిరే సోమదత్తాత్తు భూరి ర్భూరిశ్రవాః శలః || 116

ఉపాధ్యాయస్తు దేవానాం దేవాపి రభవ న్మునిః | చ్యవనపుత్రః కృతక ఇష్ట అసీన్మహాత్మనః 117

శాంతను స్త్వభవద్రాజా కౌరవాణాం ధురంధరః ||

బ్రాహ్మణులారా ! బాహ్లీకుని వంశము వినుడు. బాహ్లీకునికి కీర్తి శాలియగు సోమదత్తుడు, వానికి భూరిశ్రవుడు శలుడు, దేవాపిముని దేవతులకుపాధ్యాయుడయ్యె. చ్యవనపుత్రుడు కృతకు డతని కిష్టుయ్యెను. శాంతనుడు కౌరవశ్రేష్టుడు రాజయ్యెను.

శంతనోః సంప్రవక్ష్యామి వంశం త్రైలోక్యవిశ్రుతమ్‌ || 118

గాంగం దేవవ్రతం నామ పుత్రం సో7జనయత్ప్రభుః | సతుభీష్మ ఇతఖ్యాతః పాండవానాం పితామహః || 119

కాశీ విచిత్ర వీర్యం తు జనయామాస భోద్విజాః | శంతనోర్ధయితం పుత్రం ధర్మాత్మాన మకల్మషమ్‌ || 120

కృష్తద్వెపాయనా చ్చైవ క్షేత్రే వై చిత్రవీర్యకే | ధృతరాష్ట్రంచ పాండుం చ విదురం చాప్యజీజనత్‌ || 121

త్రిలోకప్రసిద్ధమైనశంతను వంశము తెల్పెద. శంతనుని వలన గంగ దేవవ్రతునిcగన్నది. అతడే భీష్ముడు. (గాంగేయుడు). పాండవులకు పితామహుడు. శంతనుని భార్య కాళి విచిత్రువీర్యునిగాంచెను. విచిత్ర్యవీర్యునిక్షేత్రమందు (భార్యయందు) కృష్ణద్వైపాయనుని వలన ద్భతరాష్ట్రుడు పాండురాజు విదురుడు పుట్టిరి.

ధృతరాష్ట్రస్తు గాంధార్యాం పుత్రా నుత్పాదయ చ్ఛతమ్‌ | తేషాం దుర్యోధనః శ్రేష్ఠః సర్వేషామపి స ప్రభుః || 122

పాండో ర్దనంజయః పుత్రః సౌభద్రస్తస్య చా7త్మజః | అభిమన్యోః పరీక్షిత్తు పితా పారీక్షితస్య హ || 123

పారీక్షితస్య కాశ్యాయాం ద్వౌ పుత్రౌ సంబభూవతుః | చంద్రాపీడస్తు నృపతిః సూర్యాపీడశ్చ మోక్షవిత్‌ || 124

చంద్రాపీడస్య పుత్రాణాం శత ముత్త మధన్వినామ్‌ | జానమేజయ మిత్యేవం క్షాత్రం భువి పరిశ్రుతమ్‌ || 125

ధృతరాష్ట్రునికి గాంధారియందు దుర్యోధనాదులు నూర్గురు గల్గిరి. దుర్యోధనుడు రాజరాజయ్యెను. పాండురాజు కుమారుడు ధనంజయుడు. అయనకు సౌభద్రుడు(సుభద్రకొడుకు) అభిమన్యుడు. వానికి పరీక్షిత్తు గల్గిరి. పరీక్షిత్తునకు పారిక్షిత్తుc (జనమే జయుడు) వానికి కాశియందు ఇద్దరు సుతులు పుట్టిరి. మహారాజగు చంద్రాపీడుడు, మోక్షజ్ఞుడగు సూర్యాపీడుడు ననువారు. చంద్రా పీడుని కొడుకులు నూర్వురు. మంచి విలుకాండ్రు. జానమేజయమను పేర నీ క్షత్రవంశము ప్రసిద్ధికెక్కినదిc.

తేషాం జ్యేష్ఠస్తు తత్రాసీ త్పురే వారాణసాహ్వయే | సత్యకర్ణో మహాబాహు ర్యజ్వా విపులదక్షిణః || 126

సత్యకర్ణస్య దాయాదః శ్వేతకర్ణః ప్రతాపవాన్‌ | ఆ పుత్రః స తు ధర్మాత్మా ప్రవివేశ తపోవనమ్‌ || 127

తస్మా ద్వనగతా గర్భం యాదవీ ప్రత్యపద్యత | సుచారో ర్దుహితా సుభ్రూ ర్మాలినీ గ్రాహమాలినీ || 128

సంభూతే స చ గర్భేచ శ్వేతకర్ణః ప్రజేశ్వరః | అన్వ గచ్ఛ త్కృతం పూర్వం మహాప్రస్థాన మచ్యుతమ్‌ || 129

సాతు దృష్ట్యా ప్రియం తం చ మాలినీ పృష్ఠతో7న్వగాత్‌ |

సుదారోర్దుహితా సాద్వీ వనే రాజీవలోచనా | పథి సా సుషువే బాలా సుకుమారం కుమారకమ్‌ || 130

తమపాస్యాథ తత్రైవ రాజానం సాన్వగచ్చత | పతివ్రతా మహాభాగా ద్రౌపదీవ పురాసతీ || 131

అందు మొదటివాడు సత్యకర్ణుడు వారణాసీనగరమందుండెను. ఈతడు పరాక్రమశాలి, యజ్వ. విపులదక్షిణుడు. వాని దాయాదుడు శ్వేతకర్ణుడు. ప్రతాపశాలి. అపుత్రకుడై వనమునకేగెను. అతనివలన వనమున యదువంశమున పుట్టినదియు సుచారుని కుమార్తెయు నగు మాలిని (గ్రాహమాలిని) గర్భవతి కాగా శ్వేతకర్ణుడు పూర్వము సంకల్పించిన మహాప్రస్థానమునకేగెను. మాలినియు ప్రియుని వెంబడించి మార్గమందు సుకుమారుడైన కుమారుం బ్రసవించెను. అ శిశువు నక్కడనే విడిచి, మహాప్రస్థానమున పతులననుగమించిన ద్రౌపదివలె మహానుభావురాలగు నామె రాజు ననుగమించెను.

కుమారః సుకుమారో7సౌ గిరిపృష్ఠే రురోద హ || 132

దయార్థం తస్య మేఘాస్తు ప్రాదురాస న్మహాత్మనః | శ్రవిష్ఠాయాస్తు పుత్రౌ ద్వౌ పైప్పలాదిశ్చ కౌశికః || 133

దృష్ట్వాకృపా న్వితౌ గృహ్య తౌ ప్రాక్షాళయతాం జలే | నిఘృష్టౌ తస్య పార్మ్వౌ తు శిలాయాం రుధిరప్లుతౌ || 134

అజశ్యామః స పార్మ్వాభ్యాం ఘృష్టాభ్యాంసుసమాహితః| ఆజశ్యామౌతు తత్పార్మ్వౌ దైవేన సంబభూవతుః || 135

అథా7 జపార్మ్వ ఇతి వై చక్రాతే నామ తస్య తౌ | స తు రేమ కశాలాయాం ద్విజాభ్యా మభివర్దితః || 136

రేమకస్య తు భార్యా త ముద్వహ త్పుత్ర కారణాత్‌ | రేమత్యాః స తు పుత్రో7భూ ద్ర్మాహ్మణౌ సచివౌతు తౌ || 137

ఆ విడిచిపెట్టిన శిశువు పర్వతమం దేడ్చుచుండగా దయచూప మేఘములు ఆ మహాత్మునికి నీడయిచ్చెను. శ్రవిష్ఠాకుమారులిద్దరు పైప్పలాది కౌశికుడనువారు జాలిగొని యా బాలుని జలమునందు గడిగిరి. అంతకుమున్నేడ్చుచు పాషాణమందు దొరలిన యా బాలుని రక్తసిక్తమైన శరీరము యిరుపార్శ్వములు మేకవతెనల్పెక్కినవి. అందువలన నా బాలుని కా మునులు అజపార్శ్వుడు అను నామకరణము గావించిరి. అతడు రేమకుని యింట నిద్దరు బ్రాహ్మణులచే బెంపబడెను. రేమకునిభార్య యతనిని తనపుత్రునిగా నెత్తుకొనగానామెకతడు కొడుకయ్యెను. అతనికా బ్రాహ్మణులు మంత్రులైరి.

తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ యుగ పత్తుల్యజీవినః | స ఏష పౌరవో వంశః పాండవానాం మహాత్మనామ్‌ || 138

శ్లోకో7పి చాత్ర గీతో7యం నాహుషేణ యయాతినా | జరాసంక్రమణ పూర్వం తదా ప్రీతేన ధీమతా || 139

అచంద్రార్క గ్రహా భూమి ర్భవే దియ మసంశయమ్‌| అపౌరవా మహీ నైవ భవిష్యతి కదాచన || 140

ఏష వః పౌరవో వంశో విఖ్యాతః కధితోమయా |

వారిపుత్ర పౌత్రులు సమాన జేవనుతైరి. ఇది పౌర వంశచరిత్ర. మహాను భావులైన పాండవుల గథ. ఈ విషయములో పరమ ప్రీతినందిన ధీమంతుడగు నహుషకుమారుడగు యయాతిచే వార్దక దశలోనిట్లొక శ్లోకము గానము చేయబడినది. ఈ భూమి చంద్రార్కగ్రహశూన్యమైన కావచ్చును. కాని యెస్నటికి అ పౌరపము కాదు. అనగా పురవంశాకురమెన్నటికిని నుండకపోదు. ఇది పౌరవంశచరిత్ర తెలిపితిని.

తుర్వసోస్తు ప్రవక్ష్యామి దృహ్యోశ్చానో ర్యదో స్తథా || 141

తుర్వసోస్తు సుతో వహ్ని ర్గోభాను స్తస్య చా7త్మజః | గోభానోస్తు సుతో రాజా ఐశాను రసరాజితః || 142

కరంధమస్తు ఐశానో ర్మరుత్త స్తస్య చా7త్మజః | అన్య స్త్వా విక్షితో రాజా మరుత్తః కథితో మయా || 143

ఇక తుర్వసువు ద్రుహ్యుడు. అనువు యదువు వారి వంశములు చెప్పెద. తుర్వసుని కొడుకు వహ్ని వాని కొడుకు గోభానుడు. అతని కొడుకు ఐశానుడు. ఇతడు పరాజుతడు కానిలాజు వాని కుమారుడు కరంధముడు. వాని పుత్రుడు మరత్తుడు. మఱియొక అవిక్షితుని పుత్రుడగు మరుత్త మహారాజు నాచే వెనుక చెప్పబడెను.

అనపత్యో7భవద్రాజా యజ్వా విపుల దక్షిణః | దుహితా సంయతా నామ తస్యా7సీ త్పృథివీపతే ః 144

దక్షిణార్థం తు సా దత్తా సంవర్తాయ మహాత్మనే | దుష్యంతం పౌరవం చాపి లేఖే పుత్ర మకల్మషమ్‌ || 145

ఏవం యయాతిశా పేన జరాసంక్రమణ తదా | పౌరవం తుర్వసోర్వంశం ప్రవివేశ ద్విజోత్తమాః || 146

మరుత్తు విపులదక్షిణములైన యజ్ఞము లాచరించెను. వానికి సంతతి లేదు, సంయతయనుకూతురు మాత్రమే గల్గెను. అమె యజ్ఞదక్షిణగా సంవర్తున కీయబడినది. అమె దుష్యంతుని కుమారునిం గనెను. ఇట్లు యయాతి శాపముచే తుర్వసుపు వంశము పురువంశములో చేరెను.

దుష్యంతస్య తు దాయాదః కరూరోమః ప్రజేశ్వరః | కరూరోమా దథాహ్లీద శ్చత్వార స్తస్య చాత్మజాః || 147

పాండ్యశ్చ కేరళ##శ్చైవ కాలశ్చోళశ్చ పార్థివః | దృహ్యోశ్చ తనయో రాజ న్బభ్రుసేతు శ్చ పార్దివః || 148

అంగారసేతు స్తత్సుత్రో మరుతాం పతి రుచ్యతే | ¸°వనాశ్వేన సమరే కృచ్ఛ్రేణ నిహతో బలీ || 149

యుద్ధం సుమహదప్యాసీ న్మాసాన్సరి చరుద్దశ | అంగారసేతో ర్దాయాదో గాంధారో నామ పార్థివః || 150

ఖ్యాయతే యస్య నామ్నా7వై గాంధారవిషయో మహాన్‌ | గాంథారదేశజాశ్చైవ తురగా వాజినాం పరాః || 151

దుష్యంతుని కుమారుడు కరూరోముడనురాజు. వాని కొడుకు అహ్లీదుడు. అతనికి నల్గురు కుమారులు, పాండ్యుడు, కేరశుడు, కాలుడు, చోళరాజుననువారు. దృహ్యుని కుమారుడు బభ్రుసేతు మహారాజు. అతని కొడుకు అంగారసేతుడు. అతడు మరుత్తులకు రాజు. ఆవీరుడు ¸°వనాశ్యునిచే అతికష్టముతో యుద్దమందు గూలచ్చిబడెను. పదునాలుగు మాసములా ఘోరయుద్ధము జరిగెను. అంగారసేతువు కొడుకు గాంధారుడు. అతనిపేరనే గాంధారమను దేశము ప్రఖ్యాతి కెక్కెను. గాంధారదేశమందలి గుఱ్ఱములు ప్రశస్తములు.

అనోస్తుపుత్రోధర్మో7భూ ద్ద్యూత స్తస్యా77త్మజోభవత్‌ | ద్యూతాద్వనదుహో జజ్ఞేప్రచేతాస్తస్యచా77త్మజః || 152

ప్రచేతసః సుచేతాస్తు కీర్తితా స్తుర్వసోర్మయా | బభూవుస్తు యదోః పుత్రాః పంచదేవసుతోపమాః || 153

సహస్రాదః పయోదశ్ఛ క్రోష్టా నీలో7ంజిక స్తథా| సహస్రాదస్య దాయాదా స్త్రయః పరమధార్మికాః || 154

హైహయశ్చ హయశ్చైవ రాజా వేణుహయ స్తథా | హైహయ స్యాభవ త్పుత్రో ధర్మనేత్ర ఇతి శ్రుతః || 155

ధర్మనేత్రస్య కార్తస్తు సాహంజ స్తస్య చా77త్మజః | సాహంజనీ నామ పురీ తేన రాజ్ఞా నివేశితా || 156

ఆసీ న్మహిష్మతః పుత్రో భద్రశ్రేణ్యః ప్రతాపవాన్‌ | భద్రశ్రేణ్యస్య దాయాదో దుర్దమో నామ విశ్రుతః || 157

దుర్దమన్య సుతో ధీమా న్కనకో నామ నామతః | కనకస్య తు దాయాదా శ్చత్వారో లోక విశ్రుతాః || 158

కృతవీర్యః కృతౌజాశ్చ కృతధన్వా తథైవచ | కృతాగ్నిస్తు చతుర్థో7భూ త్కృతవీర్యా దథార్జున ః || 159

అనువు కొడుకు ధర్ముడు, ధర్ముని కొడుకద్యూతుడు. వాని కొడుకు వనదహుడు. వాని కొడుకు ప్రచేతనుడు. వాని కొడుకు సుచేతనుడు. తుర్వసువంశీయులు చెప్పబడిరి. యదుకుమారులు దేవకుమారతుల్యులైదుగురు. సహస్రాదుడు, పయోదుడు, క్రోష్ఠనీలుడు. అంజికుడు. సహస్రాదుని కొడుకులు పరమధార్మికులు ముగ్గురు. హైహయుడు, హయుడు వేణుహయరాజు, హైహయుని కుమారుడు ధర్మనేత్రుడు, వాని కొడుకు కార్తుడు, వాని కొడుకు సాహంజుడు, వాని పేర '' సాహంబని'' యని పుర మేర్పడెను. మహిష్మతుని కొడుకు భద్రశ్రేణ్యుడు, ప్రతాపశాలి. వాన తనయుడు దుర్ధముడు. వాని తనయుడు బుద్ధిమంతుడు కనకుడు. వాని కుమారులు నల్గురు. కృతవీర్యుడు, కృతౌజనుడు, కృతథన్వుడు, కృతాగ్ని, కృతవీర్యుని తనయుడు అర్జునుడు (కార్త వీర్యార్జునుడు)

యో7సౌ బాహు సహస్రేణ సప్తస్రేణ సప్తద్వీపేశ్వరో7భవత్‌| జిగాయ పృథివీ మేకో రథేవా77దిత్యవర్చసా || 160

సహి వర్షాయుతం తప్త్యా తపః వరమ దుశ్చరమ్‌ | దత్త మారాధయామస కార్తవీర్యో7త్రినంభవమ్‌ || 161

తసై#్మ దత్తో వరా న్ప్రాదా చ్చతురో భూరి తేజసః| పూర్వం బాహుసహస్రం తు ప్రార్థితం సుమహ ద్వరమ్‌ || 162

అధర్మే7ధీయమానస్య సద్భిస్తత్ర నివారణమ్‌| ఉగ్రేణ పృథివీం జిత్వా ధర్మేణౖ వానురంజనమ్‌ || 163

సంగ్రామాన్సుబహుఞ్‌ జిత్వా హత్వా చారీ న్సహన్రశః | సంగ్రామే వర్వమానస్య వధం చాభ్యధికాద్రణ || 164

తన్య భాహుసహస్రం తు యుధ్యతః కిల భో ద్విజాః | యోగా ద్యోగీశ్వరస్యేవ ప్రాదుర్భవతి మాయమా || 165

తేనేయం పృథివీ సర్వా సప్తద్వీపా సవత్తనా | ససముద్రా ననగరా ఉగ్రేణ విధినా జితా || 166

తేన సప్తసు ద్వీపేషు నప్త యజ్ఞశతానివై | ప్రాప్తాని విధినా రాజ్ఞా శ్రూయంతే మునిసత్తమాః || 167

సర్వే యజ్ఞా మునిశ్రేష్ఠాః సహన్రళతదక్షిణాః | సర్వే కాంచనయూపాశ్చ సర్వే కాంచనసేదయః || 168

సర్వే దేవై ర్మునిశ్రేష్ఠా విమానస్థై రలంకృతైః | గంధర్వై రప్సరోభిశ్చ నిత్యమే వోపశోభితాః || 169

యస్యయజ్ఞే జగౌగాథాం గంధర్వో నారదస్తఢా | వరీదాసాత్మజో విద్వాన్మహిమ్నా తన్య విస్మితః || 170

ఇతడు సప్తద్వీములేలెను. వేయు బాహువులు కలవాడు. సూర్యునట్లు వెలుగు రథముతో నొక్కడు వసుధామండలమెల్ల జయించే పదివేలేండ్లు దుశ్చరమైన తపముసేసి దత్తాత్రేయుల నారాధించె. దత్తగురు డాతనకి నాల్గువరములిచ్చెను. వేయి చేతులు గల్గుట. అధర్మమునుండి సజ్జనులు రక్షించుట, సర్వ భూమండలము జయించి ధర్మమున ప్రజారంజనము చేయుట, రణరంగమునc బెక్కుర జయించి అక్కడే సర్వాధికుడైన వానిచేతిలో వధింపబడుట అనునవి యా వరములు. యుద్దము సేయుచుండగా యోగశక్తిచే యోగీశ్వరునికట్లు బాహుసహస్ర మావిర్భవించుచుండును. సప్తద్వీపయైన వసుంధర నాతడు సముద్రములు, నగరములు, పట్టణములతో గూడినవెల్ల గెల్చుకొనెను. ఏడు ద్వీపములందు నేడువందలయజ్ఞముల నతడు నిర్వహించెను. అన్ని యజ్ఞములు శతసహస్ర దక్షిణములు, అన్నియు కాంచనయూపములు, కాంచనవేదికములు, అన్నిటను సర్వదేవతలు, గంధర్వులు, అప్సరసలు అలంకరించు కొని విమానములపై యరుదెంచి నిత్యము నాతని యజ్ఞము నలంకరించిరి. అ యజ్ఞమందు దేవర్షియు, వరీదాసుకొడుకును గంధర్వుడును విద్వాంసుడు నగు నారదుడు అతని మహీమ కన్చెరువడి యతిని జన్నమందు ఈ గాధలను గానము చేసెను.

నారద ఉవాచ :-

న నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్ధివాః | యజ్ఞైర్దానై స్తపోభిశ్చ విక్రమేణ శ్రుతేన చ || 171

స హి సప్తమ ద్వీపేషు చర్మీ ఖడ్గీ శరాసనీ | రథీ ద్వీపా ననుచర న్యోగీ సందృశ్యతే నృభిః 172

అనష్ఠద్రవ్యతా నైవ న శోకో నచ విభ్రమః| ప్రభావేణ మహారాజః ప్రజా ధర్మేణ రక్షతః || 173

స సర్వర త్నభా క్సమ్రా ట్చక్రవర్తీ బభూవ హ | స ఏవ పశుపాల్యోభూ తేత్రపాలః స ఏవచః 174

స ఏవ వృష్ట్యా పర్జన్యో యోగిత్వా దర్జునో7భవత్‌ | స వై బాహుసహస్రేణ జ్యాఘత కఠీనత్వచా 175

భాతి రశ్మి సహస్రేణ శరదీవచ భాస్కరః |

నారదుడు పాడిన గాథలివి :- యజ్ఞ దాన తపస్సులచే, విక్రమముచే, శ్రుతముచే (పాండిత్యముచే) కార్తవీర్యార్జునుని స్థితి నే రాజును పొందజాలడు, సప్తధ్వీపములందును జనములకాతడు, డాలు, కత్తి, రథము కలవాడై యోగియై యెట్టయెదుట కనబడుచుండును. ద్రవ్యనష్టము, శోకము, విభ్రమము ననునవి ధర్మపాలనలో నుండు ఆతనికి లేవు. నర్వరత్నభాజనుడు, సమ్రాట్టు, చక్రవర్తియునై యతడే పశుపాలకుడు, క్షేత్రపాలుడను గూడ నయ్యెను. యోగియగుటచే నా కార్త వీర్యార్జునుడు వర్షించుటలో వర్జన్యుడాయెను. మేఘముతానేయయ్యెను. వింటివారిదెబ్బలచే కఠినమైన చర్మముగలబాహుసహస్రముచే నాతడు శరత్కాలమందు వేయికిరణములచే వెలుగొందు భాస్కరుడట్లు తేజరిల్లెను.

సహి నాగా న్మనుష్యేషు మాహిష్మత్యాం మహాద్యుతిః || 176

కర్కోటకసుతా న్జిత్వా పుర్యాం తస్యాం న్యవేశయత్‌ | న వై వేగం సముద్రస్య ప్రావృట్కాలేంబుజేక్షణః || 177

క్రీడన్నివ భుజోద్భిన్నం ప్రతిస్రోతశ్చకార హ | లుంఠితా క్రీడతా తేన నదీ తద్గ్రాహమాలినీ|| 178

చలదూర్మిసహస్రేణ శంకితా7భ్యేతి నర్మదా | తస్య బాహుసహస్రేణ క్షిప్యమాణ మహోదధౌ || 179

భయాన్నిలీనా నిశ్చేష్టా ః పాతాళస్థా మహీసురాః | చూర్ణీ కృత మహావీచిం చలన్మీనమహాతిమిమ్‌ || 180

మారుతావిద్ధఫేనౌఘ మావర్తక్షోభసంకులమ్‌ | ప్రావర్తయ త్తధా రాజా సహస్రేణ చ బాహునా || 181

దేవాసురసమాక్షి ప్తః క్షిరోదమివ మందరః | మందర క్షోభచకితా అమృతోత్పాదశంకితాః || 182

సహసోత్పతితా భీతా భీమం దృష్ట్యా నృపోత్తమమ్‌ | నతా నిశ్చలమూర్థానో బభూవుస్తే మహోరగాః || 183

సాయాహ్నే కదళీషండాః కంపితా ఇవ వాయునా | స వై బద్ద్వా ధనుర్జ్యాభి రుత్సిక్తం పంచభిః శ##రైః || 184

లంకేశం మోహయిత్వా తు సబలం రావణం బలాత్‌ | నిర్జిత్య వశమానీయ మాహిష్మత్యాం బబంధతమ్‌ || 185

మాహిష్మతీ నగరమందు కర్కౌటకుని కొడుకులను నాగులను జయించి వారి నానగరమందే మనుష్యులలోనుంచెను. పద్మ నయనుడగు నతడు వర్షాకాలమునందు విలానముగా తన బాహువులచే నుబికిన సముద్రవేగము నడ నీటివాలు నెదురెక్కించెను. క్రీడించుచున్న ఆకార్తవీర్యార్జునిచే తిరస్క్రతయై యాతడేలు గ్రామమును మాలాకారమున చుట్టుకొని పారు నర్మదానానది చలించు వేలకొలది కెరటములతో భయ పడుచు అతనికీ అభిముఖముగా వచ్చెను. అతడు వేయిచేతులచే సముద్రమునుక్షోభింపచేయగా పాతాళవాసులగు మహాసురులు భయపడి నిశ్చేష్ఠులయి సముద్రమందు నక్కినక్కి దాగిరి. మహాతరంగములు చూర్ణితములాయెను. మహామీన తిమింగలాది జలజంతువులు చలించిపోయొను. నురుగు రాసులు గాలిచేభగ్నమాయెను. సుడులుసంకులములయ్యెను. ఇట్లాతడు మందరగిరి మథవ పరిక్షిప్తమగుక్షీరాభ్ధినట్లుబ్ధిని సంక్షోభపరచెను. అమృతమథన మందువలె శంకితులయి వేలకొలది నాగులు తటాలున లేచి వెఱచుచు రాజవరుల దిలకించి పడగలు వంచి వినతులై సాయాహ్నమందు వాయుకంపితములైన అరటిబోవెల గుంపులట్లు వణంకుచు నాతని శరణమందిరి. అతడు శరపంచకముచే రక్తము గారి తడిసిపోయిన సేనానమేతుదైన లంకేశ్వరుని అల్లెత్రాళ్ళతో బంధించి మోహింపజేసి లోగొని మాహిష్మతీ నగరమున బంధించెను.

శ్రుత్వా తు బద్ధం పౌలస్త్యం రావణం త్వర్జునేన చ | తతో గత్వా పులస్త్యస్త మర్జునం దదృశే స్వయమ్‌ || 186

ముమోచ రక్షః పౌలస్త్యం పులస్త్యే నాభియాచితః | యస్య బాహుసహస్రస్య బభూవ జ్యాతల స్వనః || 187

యుగాంతే తోయద స్యేవ స్ఫుటతో హ్యశ##నేరివ | అహో బత మృధే వీర్యం భార్గవస్య యదచ్ఛినత్‌ || 188

రాజ్ఞో బాహుసహస్రస్య హైమం తాలవనం యథా | తృషితేన కదాచి త్స భిక్షిత శ్చిత్ర భానునా || 189

స భిక్షా మదదా ద్వీరః సప్తద్వీపా న్వాభాససోః | పురాణి గ్రామ ఘోషాంశ్చ విషయాంశ్చైవ సర్వశః || 190

జజ్వాల తస్య సర్వాణి చిత్రభాను ర్దిదృక్షయా | స తస్యపురుషేంద్రస్య ప్రభావేణ మహాత్మనః || 191

దదాహ కార్తవీర్యస్య శైలాం శ్చైవ వనాని చ | స చ శూన్యా శ్రమం రమ్యం పరుణస్యా77త్మజస్య వై || 192

దదాహ బలవద్భీత ళ్చిత్రభానుః సహైహయః | యం లేభే వరుణః పుత్రం పురా భాస్వంతా ముత్తమమ్‌ || 193

వశిష్ఠం నామ స మునిః ఖ్యాత అపవ ఇత్యుత | తత్రా77పపస్తు తం క్రోధాచ్ఛప్తవా నర్జునం విభుః || 194

యస్మాన్న వర్జిత మిదం వనం తేమమ హైహయ| తస్మా త్తే దుష్కరం కర్మ కృత మన్యో హనిష్యతి || 195

రామో నామ మహాబాహు ర్జామదగ్న్యః ప్రతాపవాన్‌ | ఛిత్వా బాహునహస్రం తే ప్రమథ్య తరసా బలీ || 196

తపస్వీ బ్రాహ్మణ స్త్వాం తు హనిష్యతి స భార్గవః | అనష్టద్రవ్యతా యస్య బభూ వామిత్రికర్షిణః || 197

ప్రతాపేన నరేంద్రస్య ప్రజా ధర్మేణ రక్షతః | ప్రాప్త స్తతో7 స్య మృత్యుర్వై తస్య శాపా న్మహ మునేః || 198

పర స్తథైవ భో విప్రాః స్వయమేవ వృతః పురా |

తనకుమారుడట్లు కార్తవీర్యార్జునిచే బంధితుడగుట వని పులస్త్యబ్రహ్మ కార్తవీర్యార్జునుని దర్శించి యాచించిన మీదట రావణు నతడు విడిచిపుచ్చెను. వాని బాహుసహస్రముచే నొనరింపబడిన ధనుష్టంకారము ప్రళయ సమయ పర్జన్యఘోషణభీషణమ్మై పిడుగులుపడినట్లు బెట్టదమాయెను. ఏమి అశ్చర్యము ! భార్గవరాముని వీర్యంబు కార్త్యవీర్యుని బాహుసహస్రమును హేమతాళవనంబునట్లు భేదించెను. దప్పిక గొనియనులుండొకప్పుడా కార్తవీర్యుని భిక్షమడుగ నవ్వీరుడాయనకు పురములు గ్రామముల ఘోషములు, పల్లెలు - దేశములతోడి సప్తద్వీపములను భిక్షగనొసంగెను. అగ్నియ వ్వినోద మరయం గోరి యన్నిటిని దహించివైచెను. కర్త్యావీర్యుని ప్రభావముచే నగ్ని యట్లు పర్వతములు వనములతో గూడ దహించెను. వరుణ కుమారు డాపపుడను వానియాశ్రమముం గూడ కార్తవీర్యునితోగూడి మసిసేసెను. వరుణకుమారుడు తేజస్వియునుత్తముడునగు వశిష్ఠుడనువాడు. ఆముని ఆపవుడను ప్రఖ్యాతి నంచెను, అపవుడు కోపించిఅర్జునుని శపించెన. ఓరీ!హైహయ ! నానివసించువనమునుగూడ విడువవైతివి. కావున నీ చేసిన దుష్కర్మమును మరొక్కడు నాశనము సేయగలడు. రాముడనుపేరనతడు మహావీరుడు జమదగ్నికి కుమారుయుదయించి నీ వేయు బాహువులు నరికి యాబ్రాహ్మణతపస్యి నిన్ను సంహరింపగల డనెను ప్రతాపముతో శత్రుసంహారమోనర్చును ధర్మముతో ప్రజాపాలన మొనర్చుచున్న యే కార్తవీర్యునకు ద్రవ్యనాశనములేదో! అకార్తవీర్యార్జునుడు మున్ను పొందిన వరములన్నియు నీరీతి ఫలించెను. ప్రబలుడైన వాని చేతిలో మరణము నతడు కోరుకొనెను. కోరినట్లు అపవమహాముని శాపమువలన పరశురామునిచేతిలో నతడువీరస్వర్గమందినాడు.

తస్య పుత్ర శతం త్వాసీ త్పంచశేషా మహాత్మనః || 199

కృతాస్త్రాబలినః శూరా ధర్మాత్మానో యశస్వినః | శూర సేనశ్చ శూరశ్చ వృషణో మధుపధ్వజః || 200

జయధ్వజశ్చ నామ్నా77సీ దావంత్యో నృపతిర్మహన్‌ | కార్తవీర్యస్య తనయా వీర్యవంతో మహాబలాః || 201

జయధ్వజస్య పుత్రస్తు తాలజంఘో మహాబలః | తస్య పుత్రశతం ఖ్యాతా స్తాలజంఘా ఇతి స్మృతాః || 202

తేషాం కులేముని శ్రేష్ఠా హైహయానాం మహాత్మానామ్‌ | వీతిహోత్రాః సుజాతాశ్చభోజాశ్చావంతయః స్మృతాః || 203

తౌండికేరాశ్చ విఖ్యాతా స్తాలజంఘా స్తధైవచ | భరతాశ్చ సుజాతాశ్చ బహుత్వా న్నానుకీర్తితాః || 204

వృషప్రభృతయో విప్రా యాదవాః పుణ్యకర్మిణాః | వృషో వంశధర స్తత్ర తస్యపుత్రో7భవ న్మధుః || 205

మధోః పుత్రశతం త్వాసీ ద్వృషణ స్తస్య వంశకృత్‌ | వృషణా ద్వృష్ణయః సర్వే మధోస్తు మాధవాః స్మృతాః || 206

యాదవా యదునామ్నా తే నిరుచ్యంతే చ హైహయాః | న తన్య విత్తనాశః స్యా న్నష్టం ప్రతిలభేచ్చ సః || 207

కార్తవీర్యస్య యో జన్మ కథయేదిహ నిత్యశః | ఏతే యయాతి పుత్రాణాం పంచవంశా ద్విజోత్తమాః || 208

అ కార్తవీర్యునకు కుమారులు నూర్గురు. అందైదుగురు మిగిలిరి. వారు బలశాలురు, శూరులు, ధర్మవరులు, కీర్తిశాలురు శూరశేనుడు, శూరుడు, వృషణుడు, మధుపద్వజుడు, జయధ్వజుడు అనువారు. జయధ్వజుడు అవంతీదేశము నేలిన వాడు, జయధ్వజుని తనయుడు తాలజంఘడు. వాని కుమారులు నూర్గురు '' తాలజంఘలు అను పేర బరగిరి. మహానుభావులగు హెహయుల వంశమందు నీతిహోత్రులు, సువ్రతులు, భోజులు, అవంతులు, తౌండికేరులు, తాళజంఘులు ప్రసిద్ధులు, భరతులు, సుజాతులు మొదలగువారు పెక్కుమంది కావున పేర్కొన శక్యముగారు. విప్రులారా ! వృషుడు మొదలయినవ యాదవులు పుణ్యాచరణపరాయణులు, వృషుడు మొదలయిన యాదవులు పుణ్యాచరణ పరాయణులు, వృషుడు, వంశధరుడు (మూలపురుషుడు), వాని కుమారుడు మధువు వానికి నూర్గురుకుమారులు, అందు వృషణుడు వంశకర్త. వాని సంతతి వృష్టులు, మధువను వాని సంతతి మాధవులైరి. యదవుపేర యాదవులని హైహయులు పేరందిరి. కార్తవీర్యుని జన్మచరిత్రకధనము నిత్యముచేయువానికి విత్తనాశనము కలుగదు. పోయిన సొత్తుదొరుకును. బ్రాహ్మణులారా ! ఇవి యయాతి కుమారులయిదుగిరి వంశములు.

కీర్తితా లోకవీరాణాం యో లోకా న్థారయంతి వై | భూతానీవ మునిశ్రేష్ఠాః పంచస్థావరజంగమాన్‌ || 209

శ్రుత్వా పంచ విసర్గాంస్తు రాజా ధద్మార్థ కోవిదః | వశీ భపతి పంచానా మాత్మజానాం తథేశ్వరః || 210

లభేత్పంచవరాం శ్చైవ దుర్లభా నిహ లౌకికాన్‌ | ఆయుః కీర్తిం తఖా పుత్రా నైశ్వర్యం భూతిమేవ చ || 211

ధారణా చ్ఛ్రవణాచ్చైప పంచవర్గస్య భోద్విజాః | క్రోష్టో ర్వంశం ముని శ్రేష్ఠాః శృణుధ్వం గదతో మమ || 212

యదో ర్వంశధరస్యాథ యజ్వనః పుణ్యకర్మణః | క్రోష్టో ర్వంశం హి శ్రు త్వైవ నర్వపాపైః ప్రముచ్యతే || 213

యస్యాస్వవాయుజో విష్ణుర్హరి ర్వృష్టి కులోద్వహః || 213

ఇతి శ్రీ మహాపురాణ అది బ్రాహ్మే యయాతి వంశానుకీర్తనం నామత్రయోదశో7ధ్యాయః ||

యయాతికుమారులయిదుగురు పంచభూతములవలె లోకములనుధరించినారు. కావున వారి చరిత్ర సంకీర్తనముచే పంచభూత జగత్తు చఠాచరాత్మక మిదియెల్ల ధరింపబడును. ఉద్దరింపబడును. ఈ పంచవంశ విసర్గము విన్నరాజు ధర్మార్థ నిపుణుడు వశియును ( జితేంద్రియుడు) కాగలడు. అయిదువరములందగలడు. అవి ఆయువు, కీర్తి, పుత్రులు, ఐశ్వర్యము, విభూతి, ఈ పవిత్రచరిత్ర. ధారణము వలన, శ్రవణము వలన, నీచెప్పిన ఫలము నిశ్చయమ. కోష్టువంశ మిక తెల్పెద. వినుండు, యజ్ఞకర్త ధర్మాత్ముడు వంశధారకుడనగు యదుక్రోష్టుపుల వంశముల వృత్తాంతము సర్వపాపవిమోచకము. ఈ వృష్టివంశమునమందు శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణ రూపమున నవతరించెను.

ఇది బ్రాహ్మమహాపురాణము నందు వంశాను కీర్తనమను పదమూCడవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters