Sri Sivamahapuranamu-I    Chapters   

అథ అష్టమోsధ్యాయః

వసంతుడు

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మణో హి ప్రజాపతేః | ప్రసన్నమానసో భూత్వా తం ప్రోవాచ స నారదః || 1

సూతుడు ఇట్లు పలికెను -

ప్రజాపతి యగు బ్రహ్మ యొక్క ఈ మాటలను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై ఆ నారదుడిట్లనెను (1).

నారద ఉవాచ |

బ్రహ్మన్‌ విధే మహాభాగ విష్ణుశిష్య మహామతే | ధన్యస్త్వం శివభక్తో హి పరతత్త్వ ప్రదర్శకః || 2

శ్రావితాసుకథా దివ్యా శివభక్తి వివర్ధినీ | అరుంధత్యాస్తథా తస్యా స్స్వరూపాయాః పరే భ##వే || 3

ఇదానీం బ్రూహి ధర్మజ్ఞ పవిత్రం చరితం పరమ్‌ | శివస్య పరపాపఘ్నం మంగల ప్రదముత్తమమ్‌ || 4

గృహీతదారే కామే చ హృష్టే తేషు గతేషు చ | సంధ్యాయాం కిం తపస్తప్తుం గతాయామభవత్తతః || 5

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! విధీ! మహాత్మా! నీవు విష్ణుని శిష్యుడవు. మహా ప్రాజ్ఞుడవు. శివభక్తుడవు అగు నీవు ధన్యుడవు. నీవు పరమాత్మ తత్త్వమును కళ్లకు కట్టినట్లు చెప్పగలవు (2). అరుంధతి గాథను, ఆమె పూర్వజన్మ వృత్తాంతముతో సహా వినిపించితివి. ఈ దివ్య గాథ శివభక్తిని వర్ధిల్లజేయును (3). ఓ ధర్మజ్ఞా! పవిత్రము, శ్రేష్ఠము, మహాపాపములను పోగొట్టునది, మంగళములనిచ్చునది, ఉత్తమమైనది అగు శివచరితమును ఇప్పుడు చెప్పుము (4). మన్మథుడు వివాహమాడి ఆనందించగా, వారందరూ తమ స్థానములకు వెళ్లగా, సంధ్య తపస్సు కొరకు వెళ్లగా, అప్పుడు ఏమైనది?(5).

సూత ఉవాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్య ఋషేర్వై భావితాత్మనః | సుప్రసన్నతరో భూత్వా బ్రహ్మా వచనమబ్రవీత్‌ || 6

సూతుడిట్లు పలికెను -

పవిత్రమగు అంతఃకరణము గల ఆ ఋషి యొక్క మాటను విని, బ్రహ్మ అత్యంత ప్రసన్నుడై ఇట్లు పలికెను (6).

బ్రహ్మోవాచ |

శృణు నారద విప్రేంద్ర తదేవ చరితం శుభమ్‌ | శివలీలాన్వితం భక్త్యా ధన్యస్త్వం శివసేవకః || 7

అహం విమోహితస్తాతయదైవాంతర్హితః పురా | అచింతయం సదాహం తచ్ఛంభు వాక్య విషార్దితః || 8

చింతయిత్వా చిరం చిత్తే శివమాయా విమోహితః |శివే చేర్ష్యామకార్షం హి తచ్ఛృణుష్వ వదామితే || 9

అథాహ మగమం తత్ర యత్ర దక్షాదయస్థ్సితాః | సరంతిం మదనం దృష్ట్వా సమదోsహం హి కించన || 10

దక్ష మా భాష్య సుప్రీత్యా పరాన్‌ పుత్రాంశ్చ నారద | అవోచం వచనం సోsహం శివమాయావి మోహితః || 11

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ విప్రశ్రేష్ఠా! నారదా! శివుని లీలలతో గూడిన ఆ శుభచరితమును భక్తితో వినుము. శివుని సేవకుడవగు నీవు ధన్యుడవు (7). వత్సా! పూర్వము శివుడి అంతర్ధానము కాగానే నేను మోహమును పొంది, ఆ శివుని వాక్యములనే విషముచే పీడింపబడి సర్వదా చింతిల్లెడివాడను (8). శివుని మాయచే మోహితుడనైన నేను చిరకాలము మనస్సులో చింతిల్లి శివుని యందు ఈర్ష్యను పొందితిని. ఆ వృత్తాంతమును చెప్పెదను వినుము (9). అపుడు నేను దక్షాదులు ఉన్న చోటకు వెళ్లితిని. అచట రతితో గూడియున్న మన్మథుని చూచి నేను కొంత గర్వమును పొందితిని (10). ఓ నారదా! శివుని మాయచే మోహితుడనైన నేను దక్షుని, ఇతర కుమారులను మిక్కిలి ప్రీతితో పలకరించి, ఈ మాటలను పలికితిని (11).

బ్రహ్మోవాచ |

హే దక్ష హే మరీ చ్యాద్యాస్సుతాశ్శృణుత మద్వచః | శ్రుత్వో పాయం విధేయం హి మమ కష్టాపనుత్తయే || 12

కాంతా భిలాషమాత్రం మే దృష్ట్వా శంభురగర్హయత్‌ | మాం చ యుష్మాన్మహాయోగీ ధిక్కారం కృతవాన్‌ బహు || 13

తేన దుఃఖాభితప్తోsలభేsహం శర్మన క్వచిత్‌ |యథా గృహ్ణాతు కాంతాం స స యత్నః కార్య ఏవ హి || 14

యథా గృహ్ణాతు కాంతాం స సుఖీ స్యాం దుఃఖవర్జితః | దుర్లభస్స తు కామో మే పరం మన్యే విచారతః || 15

బ్రహ్మ ఇట్లు పలికెను -

హే దక్షా! ఓ మరీచ్యాది కుమారులారా! నా మాటను వినుడు. విని నా కష్టమును దీర్చే ఉపాయము నాచరింపుడు (12). నేను కాంతయందు అభిలాషను మాత్రమే ప్రకటించగా, అది చూచి, శంభుడు నిందించెను. మహాయోగి యగు శివుడు నన్ను మిమ్ములను బహువిధముల ధిక్కరించి నాడు (13). ఆ కారణముచే నేను దుఃఖముతో వేగుచున్నాను. నాకెచ్చటనూ సుఖము లభించుట లేదు. ఆయన స్త్రీని వివాహమాడునట్లు మీరు యత్నించవలెను (14). ఆయన స్త్రీని చెట్టబట్టిన నాడు నేను దుఃఖమును వీడి సుఖమును పొందెదను. కాని, విచారించి చూచినచో, ఈ నా కోరిక తీరేది కాదని తలంచెదను (15).

కాంతాభిలాషమాత్రం మే దృష్ట్వా శంభురగర్హయత్‌ | మునీనాం పురతః కస్మాత్స కాంతాం సంగ్రహీష్యతి || 16

కా వా నారీ త్రిలోకేsస్మిన్‌ యా భ##వేత్తన్మనా స్థ్సితా | యోగమార్గమవజ్ఞాప్య తస్య మోహం కరిష్యతి || 17

మన్మథోsపి సమర్థో నో భవిష్యత్యస్య మోహనే | నితాంతయోగీ రామాణాం నామాపి సహతే న సః || 18

అ గృహీతేషుణా చైవ హరేణ కథ మాదినా | మధ్యమా చ భ##వేత్సృష్టి స్తద్వచ్చా నన్య వారితా || 19

నేను ఒక స్త్రీని చూచి అభిలాషను మాత్రమే పొందితిని. అది చూచి శంభుడు నన్ను మునుల యెదుట గర్హించినాడు.ఆయన స్త్రీని ఏల గ్రహించును?(16). ఆయన మనస్సులో ప్రవేశించి, యోగమార్గములో నుండు ఆయన మనస్సును చలింపజేసి, ఆయనకు మోహమును కలిగించగల స్త్రీ ఈ ముల్లోకములలో ఎవరేని గలరా?(17) యోగీశ్వరుడగు ఆయనను మోహింప జేయుటలో మన్మథుడు కూడా సమర్థుడు కాజాలడు. ఆయన స్త్రీల పేరును గూడ సహించడు (18). ఆది కారణుడగు శివుడు మన్మథుని బాణముల ప్రభావమును తిరస్కరించినచో, మధ్యమ సృష్టి ప్రథమ సృష్టి వలె నిరాటంకముగా ఎట్లు కొనసాగగలదు?(19).

భువి కేచిద్భవిష్యంతి మాయాబద్ధా మహాసురాః | బద్ధాకే చిధ్దరేర్నూనం కేచి చ్ఛంభోరుపాయతః || 20

సంసారవిముఖే శంభౌ తథైకాంత విరాగిణి | అస్మాదృతే న కర్మాన్యత్‌ కరిష్యతి న సంశయః || 21

ఇత్యుక్త్వా తనయాం శ్చాహం దక్షాదీన్‌ సునిరీక్ష్య చ | సరతిం మదనం తత్ర సానం దమగదం తతః || 22

భూలోకములో కొందరు మహాసురులు మాయచే బంధింపబడుచున్నారు. కొందరు హరిమాయచే, మరికొందరు శివుని మాయచే ఉపాయముగా బంధింపబడుదురు (20). సంసారమునందు విముఖుడు, మహా విరాగి అగు శంభుని యందు ఈ మోహమును కలిగించుట అను పనిని మనము తప్ప మరియొకరు చేయజాలరు. దీనిలో సందేహము లేదు (21). నేను దక్షుడు మొదలగు నా కుమారులతో నిట్లు పలికి, రతితో గూడియున్న మదనుని అచట గాంచి, సంతసించినవాడనై ఇట్లు పలికితిని (22).

బ్రహ్మోవాచ |

మత్పుత్ర వర కామ త్వం సర్వథా సుఖ దాయకః | మద్వచశ్శృణు సుప్రీత్యా స్వపత్న్యా పితృవత్సల || 23

అనయా సహచారిణ్యా రాజసే త్వం మనోభవ | ఏషా చ భవతా పత్యా యుక్తా సంశోభ##తే భృశమ్‌ || 24

యథా స్త్రియా హృషీకేశో హరిణా సా యథా రమా | క్షణదా విధునా యుక్తా తయా యుక్తో యథా విధుః || 25

తథైవ యువయోశ్శోభా దాంపత్యం చ పురస్కృతమ్‌ | అతస్త్వం జగతః కేతు ర్విశ్వకేతుర్భవిష్యసి || 26

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ కామా! నీవు నా పుత్రులలో శ్రేష్ఠుడవు. నీవు అన్ని విధములా సుఖమును ఇచ్చువాడవు. తండ్రియందు ప్రేమగల ఓ కామా! నీవు నీ భార్యతో గూడి నా మాటను ప్రీతితో వినుము (23). హే మన్మథ! నీవీ భార్యతో గూడి ప్రకాశించుచున్నావు. ఈమె కూడ భర్తవగు నీతో గూడి మిక్కిలి ప్రకాశించుచున్నది (24). హరి లక్ష్మితో, లక్ష్మి హరితో, రాత్రి చంద్రునితో, చంద్రుడు రాత్రితో ప్రకాశించినట్లుగా (25), మీరిద్దరు కూడా అటులనే శోభిల్లుచున్నారు. మీ దాంపత్యము శ్లాఘనీయము. కావున నీవు ఈ జగత్తునకు అధినాయకుడవు కాగలవు (26).

జగద్ధితాయ వత్స త్వం మోహయస్వ పినాకినమ్‌ | యథాశు సుమనాశ్శంభుః కుర్యాద్దార ప్రతి గ్రహమ్‌ || 27

విజనే స్నిగ్ధదేశే తు పర్వతే షు సరస్సు చ | యత్ర యత్ర ప్రయాతీశస్తత్ర తత్రానయా సహ || 28

మోహయ త్వం యతాత్మనం వనితా విముఖం హరమ్‌ | త్వదృతే విద్యతే నాన్యః కశ్చిదస్య విమోహకః || 29

భూతే హరే సానురాగే భవతోsపి మనోభవ | శాపోపశాంతిర్భవితా తస్మా దాత్మహితం కురు || 30

హే వత్సా! నీవు జగత్తునకు మేలుగోరి, శివుని మోహింపజేసి, ఆయన ప్రనన్నమగు మనస్సుతో భార్యను శీఘ్రముగా స్వీకరించునట్లు చేయుము (27). శివుడు ఏకాంతమైన సుందరప్రదేశమునకు గాని, పర్వతమునకు గాని, సరస్సునకు గాని, ఇతర స్థలములకు గాని ఎచటకు వెళ్లిననూ, నీవు ఈమెతో కూడి వెంబడించుము (28). ఆత్మనిగ్రహము కల్గి స్త్రీ విముఖుడైయున్న ఈ శివునినీవు మోహింపజేయుము. ఆయనను మోహింపజేయగల వ్యక్తి నీవు తక్క మరియొకరు లేరు (29). హే మన్మథా! శివుడు అనురాగము కలవాడైనచో, నీశాపమునకు కూడ ఉపశాంతి కలుగును. కావున, నీవు నీ హితమును గోరి అట్లు చేయుము (30).

సానురాగో వరారోహాం యదీచ్ఛతి మహేశ్వరః | తదా భవోsపి యోగ్యార్యస్త్వాం చ సంతారయిష్యతి || 31

తస్మాజ్ఞాయా ద్వితీయస్త్వం యతస్వహరమోహనే | విశ్వస్య భవ కేతుస్త్వం మోహయిత్వా మహేశ్వరమ్‌ || 32

ఇతి శ్రుత్వా వచో మే హి జనకస్య జగత్ర్పభోః | ఉవాచ మన్మథస్తథ్యం తదా మాం జగతాం పతిమ్‌ || 33

మహేశ్వరుడు దయాళువగు దైవము. ఆయన ఒక సుందరి యందు అనురాగమును పొందినచో, నిన్ను గూడ తరింపజేయగలడు (31). కావున, నీవు భార్యతో గూడి శివుని మోహింపజేయుటకై యత్నించుము. మహేశ్వరుని మోహింపజేసి, నీవు జగత్తునకు నాయకుడవు కమ్ము (32). జగత్ర్పభువు, తండ్రియగు నా ఈ మాటలను విని మన్మథుడు నాతో ఈ సత్యవాక్యమును పలికెను (33).

మన్మథ ఉవాచ |

కరిష్యేహం తవ విభో వచనా చ్ఛంభు మోహనమ్‌ | కిం తు యోషిన్మహాస్త్రం మే తత్కాంతాం భగవన్‌ సృజ || 34

మయా సంమోహితే శంభౌ యయా తస్యాను మోహనమ్‌ |కర్తవ్యమధునా ధాతస్తత్రోపాయం పరం కురు || 35

మన్మథుడిట్లు పలికెను -

హే విభో! నీ మాటను బట్టి నేను శంభుని మోహింపజేసెదను. కాని, నా మహాస్త్రము స్త్రీ. కాన, హే భగవన్‌! ,అట్టి స్త్రీని సృష్టింపుము (34). నేను ముందుగా శంభుని మోహింపజేసిన తరువాత ఆమె ఆయనను మరల మోహింపజేయ వలయును. హే బ్రహ్మన్‌! కావున ఇపుడీ విషయములో చక్కని ఉపాయమును చేయుము (35).

బ్రహ్మోవాచ |

ఏవం వాదిని కందర్పే ధాతాహం స ప్రజాపతిః | కయా సంమోహనీయోసావితి చింతామయోsభువమ్‌ || 36

చింతావిష్టస్య మే తస్య నిశ్శ్వాసో యో వినిస్సృతః | తస్మాద్వసంతస్సంజాతః పుష్పవ్రాతవిభూషితః || 37

శోణరాజీవ సంకాశః పుల్ల తామరసేక్షణః| సంధ్యోదితా ఖండశశి ప్రతిమాస్యస్సునాసికః || 38

శార్‌ఙ్గ వచ్చ రణావర్త శ్శ్యామకుంచిత మూర్ధ జః | సంధ్యాంశుమాలి సదృశః కుండల ద్వయమండితః || 39

ప్రమత్తేభగతిః పీనాయతదోరున్న తాంసకః | కంబుగ్రీవస్సువిస్తీర్ణహృదయః పీనసన్ము ఖః || 40

సర్వాంగ సుందర శ్శ్యామ స్సంపూర్ణస్సర్వ లక్షణౖః | దర్శనీయతమస్సర్వ మోహనః కామవర్ధనః || 41

బ్రహ్మ ఇట్లు పలికెను -

మన్మథుడు ఇట్లు పలుకగా, ప్రజాపతియగు నేను 'ఈ శివుని సమ్మోహింపజేయగల స్త్రీ ఎవరు గలరు?' అను చింతను పొందితిని (36). ఇట్లు చింతిల్లు చున్న నాయొక్క నిశ్శ్వాసనుండి వసంతుడు పుట్టెను. అతడు పుష్పమాలలచే అలంకరింపబడి (37), ఎర్రని పద్మము వలె భాసించెను. ఆతని కన్నులు వికసించిన పద్మముల వలె నుండెను అందమగు ముక్కు గల ఆతడు సంధ్యా కాలముందు ఉదయించిన పూర్ణ చంద్రుని వంటి ముఖమును కలిగియుండెను (38). ఆతని పాదముల క్రింద ధనస్సు ఆకారముగల రేఖలు ఉండెను. ఆతని శిరోజములు నల్లగా వంకరలు తిరిగి యుండెను. సంధ్యాకాలమందలి సూర్యుని వలె నున్న అతని ముఖము రెండు కుండలములతో అలంకరింపబడెను (39). బలిసిన పొడవైన బాహువులు, ఎతైన భూజములు గల ఆతడు మదించిన ఏనుగువలె మందగమనమును కలిగి యుండెను. ఆతని మెడ శంఖమును పోలి యుండెను. అతని వక్షస్థ్సలము మిక్కిలి విశాలముగ నుండెను. ఆతని ముఖము మంచి ఆరోగ్యముతో భాసిల్లెను (40). సర్వాంగ సుందరుడు, శ్యామవర్ణము కలవాడు, సర్వలక్షణములతో సంపూర్ణమైనవాడు, మిక్కిలి సుందరుడునగు ఆతడు అందరిని మోహింపజేయుచూ, కామమును వృద్ధి పొందించును (41).

ఏతా దృశే సముత్పన్నే వసంతే కుసుమాకరే | వవౌ వాయుస్సుసరభిః పాదపా అపి పుష్పితాః || 42

పికా వినేదుశ్శతశః పంచమం మధురస్వనాః | ప్ర పుల్ల పద్మా అభవన్‌ సరస్య స్స్వచ్ఛ పుష్కరాః || 43

తముత్పన్న మహం విక్ష్య తదా తాదృశముత్తమమ్‌ | హిరణ్య గర్భో మదన మగదం మధురం వచః || 44

ఏవం స మన్మథుని భస్సదా సహచరోsభవత్‌ | ఆనుకూల్యం తవ కృతస్సర్వం దేవ కరిష్యతి || 45

పుష్పములకు ఆశ్రయమగు ఇట్టి వసంతుడు, పుట్టగానే, సుగంధభరితమగు వాయువు వీచెను. చెట్లన్నియూ పుష్పములతో నిండెను (42). మధురమగు శబ్దమును చేసే వందలాది కోయిలలు పంచమస్వరముతో కూడినవి. స్వచ్ఛమగు నీటితో కూడిన సరస్సులలో పద్మములు వికసించెను (43). అట్టి ఉత్తముడగు వసంతుని పుట్టుకనుచూడగానే, హిరణ్యగర్భుడనగు నేను మదనునితో మధురమగు ఈ మాటను పలికితిని (44). హే మన్మథా! నీతో సమానమైన ఈతడు నీకు తోడుగా నుండి సర్వమును నీకు అనుకూలముగా చేయగలడు (45).

యథాగ్నేః పవనో మిత్రం సర్వత్రోపకరిష్యతి | తథాయం భవతో మిత్రం సదా త్వామను యాస్యతి || 46

వసతేరంతహే తుత్వా ద్వసంతాఖ్యో భవత్వయమ్‌ | తవాను గమనం కర్మ తథా లోకానురంజనమ్‌ || 47

అసౌ వసంత శృంగారో వాసంతో మలయానిలః | భ##వేత్తు సుహృదో భావస్సదా త్వద్వశవర్తినః || 48

బిబ్బోకాద్యాస్తథా హా వాశ్చతుష్షష్టి కలాస్తథా | రత్యాః కుర్వంతు సౌహృద్యం సుహృదస్తే యథా తవ || 49

అగ్నికి వాయువు సర్వత్రా మిత్రుడై ఉపకరించు తీరున, ఈతడు నీకు మిత్రుడై సదా నిన్ను అనుసరించి ఉండగలడు (46). ప్రసన్న చిత్తుల ప్రసన్నతను అంతమొందించువాడు గనుక ఈతనికి వసంతుడను పేరు కలుగుగాక! సర్వదా నిన్ను అనుసరిస్తూ లోకములను రంజింపజేయుట ఈతని కర్తవ్యము (47). ఈ వసంతుడు, వసంతకాలములో నుండే మలయవాయువు సదా నీకు వశవర్తులై నీయందు స్నేహభావమును కలిగియుందురు (48). భావ ప్రకటనము, హావభావములు, అరువది నాలుగు కళలు మొదలగునవి కూడ నీకు సహకరించును. వీరు నీకు స్నేహితులైనట్లే రతికి కూడా స్నేహితులుగ నుండగలరు (49).

ఏభిస్సహచరైః కామ వసంతప్రముఖైర్భవాన్‌ | మోహయస్వ మహాదేవం రత్యా సహ మహోద్యతః || 50

అహం తాం కామినీం తాత భావయిష్యామి యత్నతః | మనసా సువిచార్యైవ యా హరం మోహయిష్యతి || 51

ఏవముక్తో మయా కామస్సుర జ్యేష్ఠేన హర్షితః | ననామ చరణౌ మేsపి స పత్నీ సహితస్తదా || 52

దక్షం ప్రణమ్య తాన్‌ సర్వాన్మానసానభివాద్య చ | యత్రాత్మ గతవాన్‌ శంభుస్తత్‌ స్థానం మన్మథో య¸° || 53

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీ చరిత్రే ద్వితీయే సతీఖండే వసంత స్వరూపవర్ణనం నామాష్టమోsధ్యాయః (8).

హే మన్మథా! నీవు వసంతుడు మొదలగు సహచరులతో, మరియు రతీదేవితో గూడినవాడవై ఈ గొప్ప కార్యమును ఉత్సాహముతో చేపట్టి మహాదేవుని మోహింపజేయుము (50). వత్సా! హరుని మోహింప జేయగల సుందరిని గూర్చి బాగుగా ఆలోచించి ప్రయత్నపూర్వకముగా సృష్టించగలను (51). దేవనాయకుడనగు నేను ఇట్లు పలుకగా, కాముడు చాల సంతసించి, భార్యతో గూడి అపుడు నా పాదములకు నమస్కరించెను (52). మన్మథుడు దక్షునకు, ఇతర బ్రహ్మమానసపుత్రులందరికీ నమస్కరించి, శంభుడు వెళ్లిన స్థానమునకు పయనమయ్యెను (53).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో వసంతస్వరూపవర్ణనమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).

Sri Sivamahapuranamu-I    Chapters