Sri Sivamahapuranamu-I    Chapters   

అథ అష్టమోsధ్యాయః

శబ్ద బ్రహ్మ

బ్రహ్మోవాచ |

ఏవం తయోర్మునిశ్రేష్ఠ దర్శనం కాంక్షమాణయోః | విగర్వయోశ్చ సురయోస్సదా నౌ స్థితయోర్మునే || 1

దయాలు రభవచ్ఛంభుర్దీనానాం ప్రతిపాలకః | గర్విణాం గర్వహర్తా చ సర్వేషాం ప్రభురవ్యయః || 2

తదా సమభవత్తత్ర నాదో వై శబ్దలక్షణః | ఓ మోమితి సురశ్రేష్ఠాత్సువ్యక్తః ప్లుతలక్షణః || 3

కిమిదం త్వితి సంచింత్య మయా తిష్ఠన్మహాస్వనః | విష్ణుస్సర్వ సురారాధ్యో నిర్వైరస్తుష్టచేతసా || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునిశ్రేష్ఠా! గర్వము తొలగి, దర్శనమును కోరి, అచట నిలబడియున్న మా ఇద్దరిపై (1), దీనులను రక్షించువాడు, గర్వము నడంచువాడు, సర్వ ప్రాణులకు ప్రభువు, వినాశము లేనివాడు నగు శివునకు దయకలిగెను (2). అపుడచట దేవతాశ్రేష్ఠుడగు శివుని నుండి, ఓం ఓం అనే స్పష్టమగు దీర్ఘమైన శబ్దము బయలుదేరెను (3). ఈ మహాశబ్దము ఏమై యుండును? అని తలంచుచూ, సర్వ దేవతలచే పూజింపబడే విష్ణువు, వైరిభావము తొలగుటచే సంతోషముగా నున్న మనస్సుగలవాడై, నాతో గూడి నిలబడి యుండెను (4).

లింగస్య దక్షిణ భాగే తథాsపశ్యత్సనాతనమ్‌ | ఆద్యం వర్ణమాకారాఖ్య ముకారం చోత్తరం తతః || 5

మకారం మధ్యతశ్చైవ నాదమంతేsస్య చోమితి | సూర్య మండల వద్దృష్ట్వా వర్ణమాద్యం తు దక్షిణ || 6

ఉత్తరే పావక ప్రఖ్యము కారమృషిసత్తమ | శీతాంశు మండల ప్రఖ్యం మకారం తస్య మధ్యతః || 7

అపుడాయన లింగమునకు దక్షిణమున సనాతనము, మొదటి వర్ణమునగు అకారమును, ఉత్తరమున ఉకారమును (5), మధ్యలో మకారమును, అంతమునందు ఓం అను నాదమును దర్శించెను. ఓ మహర్షీ! దక్షిణముననున్న మొదటి వర్ణము సూర్య మండలము వలె (6), ఉత్తరమున నున్న ఉకారము అగ్ని హోత్రమువలె, మధ్యలోని మకారము చంద్రమండలము వలె భాసించెను (7).

తస్యోపరి తదాsపశ్యచ్ఛుద్ధస్ఫటిక సుప్రభమ్‌ | తురీయాతీత మమలం నిష్కలం నిరుపద్రవమ్‌ || 8

నిర్ద్వంద్వం కేవలం శూన్యం బాహ్యాభ్యంతరవర్జితమ్‌ | స బాహ్యాభ్యంతరే చైవ బాహ్యాభ్యంతర సంస్థితమ్‌ || 9

ఆది మధ్యాంతరహిత మానందస్యాపి కారణమ్‌ | సత్య మానందమమృతం పరం బ్రహ్మ పరాయణమ్‌ || 10

కుత ఏవాత్ర సంభూతః పరీక్షా వోsగ్ని సంభవమ్‌ | అధో గమిష్యోమ్యనలస్తంభస్యానుపమస్య చ || 11

అపుడు విష్ణువు ఆ ఓం కారముపైన, స్ఫటికమువలె శుద్ధము, కాంతులను వెదజల్లునది, జాగ్రత్స్వప్నసుషుప్తుల కతీతమైన తురీయతత్త్వము, దోషరహితము, అంశములు లేనిది, దుఃఖమునకు అతీతమైనది (8), రెందడవది లేనిది, ఏకము, ఆకాశరూపము, బయట లోపల అను భేదము లేనిది, బయట లోపల కూడ వ్యాపించియున్నది (9), మొదలు, మధ్య, తుది లేనిది, ఆనందఘనము, సత్యము, అమృతము, సర్వోత్కృష్టము నగు పరబ్రహ్మను దర్శించెను (10). ఈ అగ్నిస్తంభము ఎచటనుండి పుట్టినది? మరల మనమిద్దరము పరిశీలించెదము. సాటిలేని ఈ అగ్నిస్తంభము యొక్క క్రింది భాగమును నేను పరిశీలించెదను (11).

వేదశబ్దోభయావేశం విశ్వాత్మానం వ్యచింతయత్‌ | తదాs భవదృషిస్తత్ర ఋషేస్సారతమం స్మృతమ్‌ || 12

తేనైవ ఋషిణా విష్ణుర్‌ జ్ఞాతవాన్పరమేశ్వరమ్‌ | మహాదేవం పరం బ్రహ్మ శబ్ద బ్రహ్మతనుం పరమ్‌ || 13

చింతయా రహితో రుద్రో వాచో యన్మసా సహ | అప్రాప్య తన్నివర్తంతే వాచ్యస్త్వే కాక్షరేణ సః || 14

ఏకాక్షరేణ తద్వాచ్యమమృతం పరమకారణమ్‌ | సత్య మానంద మమృతం పరం బ్రహ్మ పరాత్పరమ్‌ || 15

ఏకాక్షరాదకారాఖ్యాద్భ గవాన్‌ బోజకోండజః | ఏకాక్షరాఖ్యాద్ధరిః పరమకారణమ్‌ || 16

అపుడు విష్ణువు వేదావేశ, శబ్దావేశములు గల, జగత్స్వరూపుడగు శివుని స్మరించెను. అపుడచట ఋషి పరంపరకు సారభూతుడైన ఋషి ఒకడు ప్రత్యక్షమాయెను (12).పరమేశ్వరుడు, పరబ్రహ్మ, శబ్దమే దేహముగా గలవాడు, సర్వోత్కృష్టుడునగు మహాదేవుని విష్ణువు ఆ ఋషి వలన దర్శించగల్గెను (13). రుద్రుడు మనోవృత్తులకు గాని, వాక్కులకు గాని గోచరుడు కాడు. మనస్సు ఆయనను పొందలేక వెనుదిరిగినది. అట్టి శివుడు ఓం కారము అనే ఒకే ఒక అక్షరముచే నిర్దేశించబడును (14). సర్వకారణ కారణము, అమృతము, సత్యము, ఆనందము, సర్వశ్రేష్ఠమునగు పరబ్రహ్మను ఓం కారము నిర్దేశించును (15). ఆకారము అనే ఒక అక్షరముచే భగవాన్‌ హిరణ్యగర్భుడు (సృష్టికర్త), ఉకారమనే ఒక అక్షరముచే పరమ కారణము (స్థితికర్త) అగు విష్ణువు నిర్దేశింపబడుదురు (16).

ఏకాక్షరాన్మకారాఖ్యాద్భగవాన్నీలలోహితః | సర్గకర్తా త్వకారాఖ్యో హ్యుకారాఖ్యస్తుమోహకః || 17

మకారాఖ్యస్తు యో నిత్యమనుగ్రహకరోsభవత్‌ | మకారాఖ్యో విభుర్బీజీ హ్యకారో బీజ ఉచ్యతే || 18

ఉకారాఖ్యో హరిర్యోనిః ప్రధానపురుషేశ్వరః | బీజీ చ బీజం తద్యోనిర్నాదాఖ్యశ్చ మహేశ్వరః || 19

మకారమనే ఒక అక్షరము కంఠమునందు నీల వర్ణము, ఇతర త్రా రక్తవర్ణము గల భగవాన్‌ శివుని నిర్దేశించును. అకారము సృష్టికర్త. ఉకారము మోహింపజేయునది (17). మకారము సదా అనుగ్రహమును ఇచ్చును. మకారముచే చెప్పబడే సర్వవ్యాపకుడగు శివుడు బీజ (బీజముగలవాడు) అనబడును. అకారము బీజము (18). ఉకారముచే చెప్పబడు విష్ణువు యోని. ప్రకృతికి, పురుషునకు ప్రభువగు మహేశ్వరుని యందు బీజ, బీజము, యోని ఐక్యమగును. ఆయన నాదస్వరూపుడు (19).

బీజీ విభజ్య చాత్మానం స్వేచ్ఛయా చ వ్యవస్తితః | అస్య లింగాదభూద్బీ జమకారో బీజినః ప్రభోః || 20

ఉకారయోనౌ నిక్షిప్త మవర్ధత సమంతతః | సౌవర్ణ మభవచ్చాండ మావేద్యం తదలక్షణమ్‌ || 21

అనేకాబ్దం తథా చాప్సు దివ్యమండం వ్యవస్థితమ్‌ | తతో వర్ష సహస్రాంతే ద్విధాకృతమజోద్భవమ్‌ || 22

అండమప్సు స్థితం సాక్షాద్వ్యాఘాతే నేశ్వరేణ తు | తథాస్య సుశుభం హైమం కపాలం చోర్ధ్వ సంస్థితమ్‌ || 23

బీజి తన ఇచ్ఛచే తనను తాను విభజించుకొనెను. ప్రభువగు బీజియొక్క ఆకారరూపమగు బీజము (20) ఉకారముతో గూడి సర్వత్రా విస్తరించి, సువర్ణాండము ఆయెను. దానికి ఇతర లక్షణము లేమియూ లేకుండెను (21). ఆ దివ్యమైన అండము అనేక సంవత్సరములు నీటియందుండెను. ఆ అండము వేయి సంవత్సరముల తరువాత రెండు భాగములాయెను (22). నీటియందున్న ఆ అండము ఈశ్వరుని అఘాతముచే రెండు ముక్కలాయెను. ఆ సువర్ణాండము యొక్క పైనున్న సగభాగము మిక్కిలి శోభిల్లెను (23).

జజ్ఞే సా ద్యౌస్తదపరం పృథివీ పంచలక్షణా | తస్మాదండాద్భవో జజ్ఞే కకారాఖ్యశ్చతుర్ముఖః || 24

స స్రష్టా సర్వలోకానాం స ఏవ త్రివిధః ప్రభుః | ఏవమోమోమితి ప్రోక్త మిత్యాహుర్యజుషాం వరాః || 25

యజుషాం వచనం శ్రుత్వా ఋచస్సామాని చాదరమ్‌ | ఏవమేవ హరే బ్రహ్మన్నిత్యాహుశ్చావయోస్తదా || 26

తతో విజ్ఞాయ దేవేశం యథావచ్ఛక్తి సంభ##వైః | మంత్రైః మహేశ్వరం దేవం తుష్టావ సుమహోదయమ్‌ || 27

ఆ అర్థభాగమే ద్యులోకమాయెను. క్రిందనున్న సగభాగము అయిదు గుణములతో (శబ్దస్పర్శరూపరసగంధములు) కూడిన పృథివి ఆయెను. ఆ అండమునుండి నాల్గు మోముల బ్రహ్మ జన్మించెను. ఆయనకు కకారము సంజ్ఞ (24). ఆయన సమస్తలోకములను సృష్టించెను. ఈ విధముగా ప్రభువగు మహేశ్వరుడు మూడు రూపములను దాల్చెను. ఈ తీరున ఓం ఓం అని వేదములు పరమేశ్వరుని నిర్దేశింతునని శ్రేష్ఠమగు యజుర్వేద మంత్రములు చెప్పుచున్నవి (25). యజుర్వేద మంత్రముల ఈ ప్రతిపాదనను వినినవై ఋగ్వేద సామవేద మంత్రములు కూడ ' ఓవిష్ణూ! హేబ్రహ్మన్‌ ! అది సత్యమే' మాతో పలికినవి (26). ఈ తీరున దేవతలకు ప్రభువు, గొప్ప ఆవిర్భావము కలవాడునగు మహేశ్వరుని విష్ణువు శక్తి నుండి జన్మించిన మంత్రములతో యథావిధిగా స్తుతించెను.(27)

ఏతస్మిన్నంతరేsన్యచ్చ రూపమద్భుతసుందరమ్‌ | దదర్శ చ మయా సార్ధం భగవాన్‌ విశ్వపాలకః || 28

పంచవక్త్రం దశభుజం గౌరకర్పూరవన్మునే | నానాకాంతి సమాయుక్తం నానా భూషణ భూషితమ్‌ || 29

మహోదారం మహావీర్య మహాపురుషలక్షణమ్‌ | తం దృష్ట్వా పరమం రూపం కృతార్థోs భూన్మయా హరి ః || 30

అథ ప్రసన్నో భగవాన్‌ మహేశః పరమేశ్వరః | దివ్యం శబ్దమయం రూపమాఖ్యయ ప్రహసన్‌ స్థితః || 31

ఇంతలో విశ్వమును పాలించు విష్ణువు నాతో గూడి మరియొక అద్భుత సుందరరూపమును చూచెను (28). ఓ మహర్షీ! ఐదు ముఖములు, పది భుజములు కలిగినట్టియు, తెల్లని కర్పూరము వలె అనంత కాంతి కిరణములతో ఒప్పుచున్నట్టియు, అనేక భూషణములను ధరించినట్టియు (29), అతిశయించిన శోభ కలిగినట్టియు, గొప్ప శక్తి కలగినట్టియు, మహా పురుషలక్షణులు గల పరమేశ్వరుని దివ్యరూపమును చూచి, నేను విష్ణువు కృతార్థులమైతిమి (30). అపుడు భగవాన్‌ మహేశ్వరుడు ప్రసన్నుడై తన దివ్వమగు నాదరూపమును ప్రకటించి చిరునవ్వుతో నిలబడి యుండెను (31).

అకారస్తస్య మూర్ధా హి లలాటో దీర్ఘ ఉచ్యతే | ఇకారో దక్షిణం నేత్ర మీకారో వామలోచనమ్‌ || 32

ఉకారో దక్షిణం శ్రోత్రమూకారో వామ ముచ్యతే | ఋకారో దక్షిణం తస్య కపోలం పరమేష్ఠినః || 33

వామం కపోల మూకారో 77నాసాపుటే ఉభే | ఏకారశ్చోష్ఠ ఊర్థ్వశ్చ హ్యైకారస్త్వధరో విభోః || 34

ఓ కారశ్చ తథౌ కారో దంతపంక్తిద్వయం క్రమాత్‌ | అమస్తు తాలునీ తస్య దేవదేవస్య శూలినః || 35

అకారము పరమేశ్వరుని శిరస్సు. అకారము లలాటము. ఇకారము కుడి కన్ను. ఈకారము ఎడమకన్ను (32). ఉకారము కుడి చెవి. ఊకారము ఎడమ చెవి. ఋకారము ఆ పరమేశ్వరుని కుడి చెక్కిలి (33). ఊకారము ఎడమ చెక్కిలి 7,7కారములు రెండు ముక్కు పుటములు. ఏకారము పై పెదవి. ఇకారము ఈశ్వరుని క్రింది పెదవి (34). ఓకారము పై పళ్ల వరుస. దేవదేవుడగు శివునికి అం, అః అనునవి తాలు స్థానములాయెను (35).

కాది పంచాక్షరాణ్యస్య పంచ హస్తాశ్చ దక్షిణ | చాది పంచాక్షరణ్యవం పంచ హస్తాస్తు వామతః || 36

టాది పంచాక్షరం పాదాస్తాది పంచాక్షరం తథా | పకార ఉదరం తస్య ఫకారః పార్శ్వ ఉచ్యతే || 37

బకారో వామపార్శ్వ స్తు భకారస్స్కంధ ఉచ్యతే మకారో హృదయం శంభో ర్మహాదేవస్య యోగినః || 38

యకారాది సకారాంతా విభోర్వై సప్తధాతవః | హకారో నాభిరూపో హి క్షకారో ఘ్రాణ ఉచ్యతే || 39

కవర్గలోని అయిదు అక్షరములు అయిదు కుడిచేతులు కాగా, చవర్గలోని అయిదు అక్షరములు అయిదు ఎడమ చేతులాయెను (36). టవర్గలో అయిదు, తవర్గలో అయిదు వెరసి పది అక్షరములు పాదముల వ్రేళ్లు ఆయెను. పకారము ఉదరము కాగా, ఫకారము కుడి పార్శ్వము ఆయెను (37). బకారము ఎడమ పార్శ్వముకాగా, భకారము స్కంధమాయెను. యోగీశ్వరుడు, మహాదేవుడునగు శంభువునకు హృదయము మకారము (38). సర్వవ్యాపియగు శివునకు యకారము మొదలుగ సకారము వరకు గల ఏడు అక్షరములు ఏడు ధాతువులు (మజ్జా మాంసాదులు) ఆయెను. హకారము నాభి అనియు, క్షకారము ఘ్రాణంద్రియము అనియు చెప్పబడును (39).

ఏవం శబ్దమయం రూపమగుణస్య గుణాత్మనః | దృష్ట్వా తముమయా సార్ధం కృతార్ధోsభూన్మయా హరిః || 40

ఏవం దృష్ట్వా మహేశానం శబ్ద బ్రహ్మతనుం శివమ్‌ | ప్రణమ్య చ మయా విష్ణుః పునశ్చాపశ్యదూర్ధ్వతః || 41

ఓం కారప్రభవం మంత్రం కలాపంచక సంయుతమ్‌ | శుద్ధస్ఫటికం సంకాశం శుభాష్టత్రింశదక్షరమ్‌ || 42

మేధాకార మభూద్భూయస్సర్వదర్మార్ధసాధకమ్‌ | గాయత్రీ ప్రభవం మంత్రం సహితం వశ్యకారకమ్‌ || 43

చతుర్వింశతివర్ణాఢ్యం చతుష్కల మనుత్తమమ్‌ |

నేను మరియు విష్ణువు, నిర్గుణుడే అయిననూ గుణస్వరూపుడైన శివుని ఉమాసహితమైన ఈ శబ్దమయ రూపమును గాంచి కృతార్థులమైతిమి (40). ఈ విధముగా నాదబ్రహ్మ రూపములో శివుని దర్శించి, నమస్కరించి, విష్ణువు మరియు నేను మరలపైకి చూచితిమి (41). ఓంకరాము నుండి పుట్టినట్టియు, అయిదు కళలు కలిగినట్టియు, శుద్ధస్ఫటికము వలె ప్రకాశించుచున్నట్టియు, ముప్పది ఎనిమిది అక్షరములు గల శుభమంత్రమును పొందితిమి (42). మరియు, బుద్ధిరూపమైనట్టియు, సర్వధర్మములను, పురుషార్థములను సాధించినట్టియు, ఇంద్రియ జయమునకు హేతువైనట్టియు (43), ఇరువది నాల్గు అక్షరములు కల్గినట్టియు, నాల్గు కళలు కల్గినట్టియు, సర్వశ్రేష్ఠమైన గాయత్రిని దర్శించితిమి.

అథ పంచసితం మంత్రం కలాష్టక సమాయుతమ్‌ || 44

ఆభిచారికమత్యర్థం ప్రాయస్త్రింశచ్ఛుభాక్షరమ్‌ | యజుర్వేదసమాయుక్తం పంచవింశుచ్ఛుభాక్షరమ్‌ || 45

కలాష్టకసమాయుక్తం సుశ్వేతం శాంతికం తథా | త్రయోదశకలాయుక్తం బాలాద్యైస్సహ లేహితమ్‌ || 46

బభూవురస్య చోత్పత్తి వృద్ధి సంహారకారణమ్‌ | వర్ణా ఏకాధికాః షష్టిరస్య మంత్ర వరస్య తు || 47

పునర్మృత్యుంజయం మంత్రం పంచాక్షరమతః పరమ్‌ | చింతామణిం తథా మంత్రం దక్షిణామూర్తి సంజ్ఞకమ్‌ || 48

తతస్తత్త్వ మసీత్యుక్తం మహావాక్యం హరస్య చ | పంచమంత్రాంస్తథా లబ్ద్వా జజాప భగవాన్‌ హరిః || 49

తరువాత ఎనిమిది కళలతో కూడినట్టియు (44), శత్రు సంహారమును చేయునట్టియు, ముప్పది శుభవర్ణములు గల తెల్లని మంత్రమును, యజుర్వేదమునకు సంబంధించినట్టియు, ఇరవై అయిదు శుభవర్ణములు (45), ఎనిమిది కళలు కల్గినట్టియు , మిక్కిలి తెల్లనైనట్టియు, శాంతి కరమైన మంత్రమును చూచితిమి. మరియు, పదమూడు కళలు కలిగినట్టియు, బాలురకు కూడ అభీష్టమైనట్టియు (46), సృష్టిస్థితిలయములకు కారణమైనట్టియు, అరవై ఒక్క వర్ణములు గల శ్రేష్ఠమంత్రమును పొందితిమి (47). మరల మృత్యుంజయ మంత్రము, పంచాక్షర మంత్రము, చింతామణి మంత్రము, దక్షిణామూర్తి మంత్రము (48), తత్త్వమసి అనే శివుని మహా వాక్యము అనే ఈ అయిదు మంత్రములను పొంది, విష్ణుభగవానుడు జపించెను (49).

అథ దృష్ట్వా కలావర్ణమృగ్యజుస్సామరూపిణమ్‌ | ఈశానమీశముకుటం పురుషాఖ్యం పురాతనమ్‌ || 50

అఘోరహృదయం హృద్యం సర్వగుహ్యం సదాశివమ్‌ | వామపాదం మహాదేవం మహాభోగీంద్ర భూషణమ్‌ || 51

విశ్వతః పాదవంతం తం విశ్వతోsకరం శివమ్‌ | బ్రహ్మణోsధిపతిం సర్గస్థితి సంహారకారణమ్‌ || 52

తుష్టావ వాగ్భిరిష్టాభిస్సాంబం వరదమీశ్వరమ్‌ | మయా చ సహితో విష్ణుర్భగవాంస్తుష్టతేతసా || 53

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యు పాఖ్యానే శబ్ద బ్రహ్మానువర్ణనం నామ అష్టమోsధ్యాయః (8).

ఋగ్యజుస్సామవేద స్వరూపుడు, నాదశరీరి, దేవతాసార్వభౌముడు, జగన్నియంత, పురుషశబ్దవాచ్యుడు, జగత్పిత, (50), ప్రసన్నమగు హృదయము గలవాడు, సుందరుడు, సర్వప్రాణుల హృదయమునందుండు వాడు, సుందరమగు పాదములు గలవాడు, దేవోత్తముడు, గొప్ప సర్పరాజములు భూషణులుగా గలవాడు (51), సర్వత్రా పాదములు గలవాడు, సర్వాత్రా నేత్రములు గలవాడు, మంగళకరుడు, బ్రహ్మకు ప్రభువు స్పష్టిస్థితిలయకర్త (52) అగు సదాశివుని చూచి, విష్ణుభగవానుడు నాతో కలిసి, వరములనిచ్చు దైవము అగు సాంబుని ప్రసన్నమగు మనస్సుతో ప్రియములగు వాక్కులతోస్తుతించెను (53).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందలి మొదటి ఖండములో స్పష్ట్యు పాఖ్యానమునందు శబ్దబ్రహ్మవర్ణనము అనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).

Sri Sivamahapuranamu-I    Chapters