Sri Sivamahapuranamu-I    Chapters   

అథ పంచవింశోsధ్యాయః

రుద్రాక్ష మహాత్మ్యము

సూత ఉవాచ |

శౌనకర్షే మహాప్రాజ్ఞ శివరూప మహాపతే | శృణు రుద్రాక్ష మహాత్మ్యం సమాసాత్కథయామ్యహమ్‌ || 1

శివప్రియతమో జ్ఞేయో రుద్రాక్షః పరపావనః | దర్శనాత్‌ స్పర్శనాజ్ఞాప్యాత్సర్వ పాపహరస్స్మృతః || 2

పురా రుద్రాక్ష మహిమా దేవ్యగ్రే కథితో మునే | లోకోపకరణార్థాయ శివేన పరమాత్మనా || 3

సూతుడిట్లు పలికెను -

శౌనక మహర్షీ! నీవు గొప్ప జ్ఞానివి. శివ స్వరూపడవు. గొప్పవారిలో గొప్పవాడివి. నేను రుద్రాక్ష మహిమను సంగ్రముగా చెప్పెదను వినుము (1). మిక్కిలి పవిత్రమగు రుద్రాక్ష శివునకు ఎంతయూ ప్రియమైనది. రుద్రాక్షను చూచినా, స్పృశించినా, మాలతో జపము చేసినా పాపములన్నియు తొలగునని ఋషులు చెప్పిరి. (2). ఓ మహర్షీ! పూర్వము శివపరమాత్మ లోకోప కారము కొరకై పార్వతీ దేవికి రుద్రాక్ష మహిమను చెప్పియున్నాడు (3).

శృణు దేవి మహేశాని రుద్రాక్ష మహిమాం శివే | కథయామి తవ ప్రీత్యా భక్తానాం హితకామ్య యా|| 4

దివ్య వర్ష సహస్రాణి మహేశాని పునః పురా | తపః ప్రకుర్వతస్త్రస్తం మనస్సంయమ్య వై మమ || 5

స్వతంత్రేణ పరేశేన లోకోపకృతి కారిణా | లీలయా పరమేశాని చక్షురున్మీలితం మయా || 6

పుటాభ్యాం చారు చక్షర్భ్యాం పతితా జలబిందవః | తత్రాశ్రు బిందవో జాతా వృక్షా రుద్రాక్ష సంజ్ఞ కాః || 7

ఓ మహేశానీ!దేవీ!శివే! భక్తుల హితమును గోరి, నేను నీకు ప్రీతితో రుద్రాక్ష మహిమను చెప్పెదను వినుడు (4). ఓ మహేశ్వరీ! పూర్వము నేను వేలాది దివ్య సంవత్సరములు సంయమముతో తపస్సు చేయుచుండగా, నామనస్సు భయపడినది (5) హే పరమేశ్వరి! పరమేశ్వరుడు, స్వతంత్రుడు, లోకములకు ఉపకారమును చేయువాడునగు నేనులీలగా నేత్రములను తెరచితిని (6). సుందరమగు ఆ నేత్ర పుటముల నుండి నీటి బిందువులు జారినవి. ఆ కన్నీటి బిందువులే రుద్రాక్ష అను పేరు గల వృక్షములైనవి (7).

స్థావరత్వమను ప్రాప్య భక్తాను గ్రహకారణాత్‌ | తే దత్తా విష్ణు భ##క్తే భ్యశ్చతుర్వర్ణేభ్య ఏవ చ || 8

భూమౌ గౌండోద్భవాంశ్చక్రే రుద్రాక్షాన్‌ శివవల్లభాన్‌ | మథురాయామయోధ్యాయాం లంకాయాం మలయే తథా || 9

సహ్యాద్రౌ చ తథా కాశ్యాం దశేష్వన్యేషు వా తథా | పరానసహ్యాపాపౌఘభేదనాన్‌ శ్రుతినోదనాన్‌ || 10

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శ్శూద్రా జాతా మమాజ్ఞయా | రుద్రాక్షాస్తా పృథివ్యాం తు తజ్జాతీయాశ్శుభాక్ష కాః || 11

ఆ కన్నీటి బిందువులు భక్తుల అనుగ్రహము కొరకై వృక్షరూపమును పొందినవి. ఆ రుద్రాక్షలను శివుడు విష్ణు భక్తులకే గాక సర్వవర్ణముల వారికి ఇచ్చెను (8). శివునకు ప్రీతికరములగు రుద్రాక్షలు భూలోకములో గౌడ దేశమునందు పుట్టినవి. శివుడు వాటిని మథుర, అయోధ్య, లంక, మలయ (9) సహ్య పర్వతములు, కాశీ మాత్రమే గాక, ఇంకనూ, పది స్థానములలో లభ్యమగునట్లు చేసెను. వేద సమ్మతములగు రుద్రాక్షలు శ్రేష్ఠమైనవి, సహింప శక్యము కాని పాప సమూహములను నశింపజేయును (10). నా ఆజ్ఞచే ఈ శుభకరములగు రుద్రాక్షలు భూలోకములో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర అనే నాల్గు భేదములతో ప్రవర్తిల్లుచున్నవి (11).

శ్వేతరక్తాః పీతకృష్ణా వర్ణా జ్ఞేయాః క్రమాద్బుధైః | స్వజాతీయం నృభిర్ధార్యం రుద్రాక్షం వర్ణతః క్రమాత్‌ || 12

వర్ణైస్తు తత్ఫలం ధార్యం భుక్తిముక్తి ఫలేప్సు భిః | శివభ##క్తైర్విశేషేణ శివయోః ప్రీతయే సదా || 13

ధాత్రీఫల ప్రమాణం యచ్ఛ్రేష్ఠమేతదుదాహృతమ్‌ | బదరీఫల మాత్రం తు మధ్యమం సంప్రకీర్తితమ్‌ || 14

అధమం చణమాత్రం స్యాత్ర్పక్రియైషా పరోచ్యతే | శృణు పార్వతి సుప్రీత్యా భక్తానాం హితకామ్యయా || 15

రుద్రాక్షలలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అను నాల్గు రంగులు గలవు. మానవులు తమకు యోగ్యమైన రంగు గల రుద్రాక్షలను స్వీకరించి ధరించవలెను (12). భుక్తిని, ముక్తిని, గోరు శివభక్తులు పార్వతీ పరమేశ్వరుల ప్రీతి కొరకై ఆయా వర్ణముల రుద్రాక్షలను ధరించవలెను (13). పెద్ద ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్ష ఉత్తమమనియు, రేగిపండు ప్రమాణము గలది మధ్యమమనియు (14), సెనగగింజ ప్రమాణముగలది అధమమనియు వ్యనస్థ గలదు. ఓ పార్వతీ! భక్తుల హితమును గోరి నేను చెప్పే విషయమును ప్రీతితో వినుము (15).

బదరీఫల మాత్రం చ యత్‌ స్యాత్‌ కిల మహేశ్వరి | తథాపి ఫలదం లోకే సుఖసౌభాగ్య వర్ధనమ్‌ || 16

ధాత్రీఫలసమం యత్‌ స్యాత్‌ సర్వారిష్ట వనాశనమ్‌ | గుంజయా సదృశం యత్‌ స్యాత్సర్వార్థ ఫలసాధనమ్‌ || 17

యథా యథా లఘుస్స్యాద్వై తథాధిక ఫలప్రదమ్‌ | ఏకైకతః ఫలం ప్రోక్తం దశాంశై రధికం బుధైః || 18

రుద్రాక్ష ధారణం ప్రోక్తం పాపనాశనహేతవే | తస్మాచ్చ ధారణీయో వై సర్వార్థ సాధనో ధ్రువమ్‌ || 19

ఓ మహేశ్వరీ!రేగిపండు ప్రమాణము గల రుద్రాక్ష ఈ లోకములో సుఖసౌభాగ్యములను పెంపొందిచుటయే గాక, ఇతర ఫలములను గూడ ఇచ్చును (16). ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్ష కష్టములనన్నిటినీ తొలగించును. గురివింద ప్రమాణము గల రుద్రాక్ష సర్వకార్యములను సిద్ధింపజేయును (17). రుద్రాక్ష ఎంత చిన్నదో, అంత అధిక ఫలము నిచ్చును. పై మూడింటిలో అల్పప్రమాణము గల రుద్రాక్ష క్రమము గా అధిక ప్రమాణము గల దానికంటె పదిరెట్లు అధిక ఫలమునిచ్చునని పండితులు చెప్పెదరు (18).రుద్రాక్షను ధరించినచో పాపములన్నియు దూరమగును. కావున, సర్వకార్యములను సిద్ధింపజేయు రుద్రాక్షను తప్పక ధరించవలెను (19).

యథా చ దృశ్యతే లోకే రుద్రాక్షః ఫలదశ్శుభః | న తథా దృశ్యతేsన్యా చ మాలికా పరమేశ్వరి || 20

సమాస్న్నిగ్ధా దృఢాస్థ్సూలాః కంటకైస్సంయుతాశ్శుభాః | రుద్రాక్షాః కామదా దేవి భుక్తిముక్తి ప్రదాస్సదా || 21

క్రిమిదుష్టం ఛిన్న భిన్నం కంటకైర్హీనమేవ చ | వ్రణయుక్త మవృత్తం చ రుద్రాక్షాన్‌ షడ్వివర్జయేత్‌ || 22

స్వయమేవ కృతద్వారం రుద్రాక్షం స్యాదిహోత్తమమ్‌ | యత్తు పౌరుషయత్నేన కృతం తన్మధ్యమం భ##వేత్‌ || 23

ఓ పరమేశ్వరీ! లోకములో శుభమగు రుద్రాక్ష ఫలములనిచ్చినట్లుగా, ఇతర మాలలు ఫలమునిచ్చినట్లు కనబడుట లేదు (20). ఓ దేవీ! సమాన పరిమాణము గలవి, మృదుస్పర్శ గలవి, దృఢమైనవి, పెద్దవి, కంటకములతో కూడినవియగు రుద్రాక్షలు అన్ని వేళలా శుభములను కలిగించి, కోర్కెలనీడేర్చి, భుక్తిన, ముక్తిని ఇచ్చును (21). పురుగు పట్టినది, పగిలినది, విరిగినది, కంటకములు లేనిది, వ్రణము కలది, వృత్తాకారముగా లేనిది అనే ఆరు రకముల రుద్రాక్షలు పనికి రావు (22). సహజముగా రంధ్రములు గల రుద్రాక్ష శ్రేష్టమైనది. పురుషుడు రంధ్రము చేసినది మధ్యమము(23).

రుద్రాక్ష ధారణం ప్రాప్తం మహాపాతకనాశనమ్‌ | రుద్ర సంఖ్యా శతం ధృత్వా రుద్ర రూపో భ##వేన్నరః || 24

ఏకాదశ శతానీహ ధృత్వా యత్ఫల మాప్యతే | తత్ఫలం శక్యతే నైవ వక్తుం వర్ష శ##తైరపి || 25

శతార్ధేన యుతైః పంచశ##తైర్వై ముకుటం మతమ్‌ | రుద్రాక్షై ర్విరచేత్సమ్యగ్భక్తి మాన్‌ పురుషో వరః || 26

త్రిభిశ్శతైః పుష్టి యుక్తై స్త్రి రావృత్త్యా తథా పునః | రుద్రాక్షైరు పవీతం చ నిర్మీయాద్భక్తి తత్పరః || 27

రుద్రాక్షలను ధరించినచో మహా పాపములు నశించును. పదకొండు వందల రుద్రాక్షలను ధరించు మానవుడు రుద్ర రూపుడగును(24). పదకొండు వందల రుద్రాక్షలను ధరించుట వలన లభించే ఫలములను వర్ణించుటకు వందలాది సంవత్సరముల కాలమైననూ సరిపడదు (25). అయిదు వందల ఏభై రుద్రాక్షలతో కిరీటమును చేసి భక్తుడు ధరించవలెను. అట్టి భక్తుడు శ్రేష్ఠుడు (26). భక్తుడు మూడు వందల అరవై రుద్రాక్షలను మూడు పేటలుగా చేసి యజ్ఞోపవీతాకారముగా ధరించవలెను (27).

శిఖాయాం చ త్రయం ప్రోక్తం రుద్రాక్షాణాం మహేశ్వరి |కర్ణయోః షట్‌ చ షట్‌ చైవ వామదక్షిణయోస్తథా || 28

శతమేకోత్తరం కంఠే బాహ్వోర్వై రుద్రసంఖ్యయా | కూర్పరద్వాయయోస్త్రత్ర మణి బంధే తథా పునః || 29

ఉపవీతే త్రయం ధార్యం శివభక్తిరతైర్నరైః | శేషానుర్వరితాన్‌ పంచ సమ్మితాన్‌ ధారయేత్కటౌ || 30

ఏతత్సంఖ్యా ధృతా యేన రుద్రాక్షాః పరమేశ్వరి | తద్రూపం తు ప్రణమ్యం హి స్తుత్యం సర్వైర్మహేశవత్‌ || 31

ఓ మహేశ్వరీ! శిఖలో మూడు, చెవులకు ఒకదానికి ఆరు చొప్పున (28), కంఠమునందు నూట ఒకటి, బాహువులకు, మోచేతులకు, మణికట్టులకు ఒక్కింటికి పదకొండు (29), యజ్ఞోపవీతమునందు ముడు రుద్రాక్షలను శివభక్తులు ధరించవలెను. మరియు, నడుమునకు సమాన ప్రమాణము గల అయిదు పెద్ద రుద్రాక్షలను ధరించవలెను (30). ఓ పరమేశ్వరీ! ఈ సంఖ్యలో రుద్రాక్షలను ధరించిన భక్తుడు ఈశ్వరుని వలె అందరికీ, నమస్కరించి స్తుతింపదగినవాడగును (31).

ఏవం భూతం స్థితం ధ్యానే యదా కృత్వాపనైర్జపమ్‌ | శివేతి వ్యాహరంశ్చైవ దృష్ట్వా పాపైః ప్రముచ్యతే || 32

శతాధిక సహస్రస్య విధిరేష ప్రకీర్తితః | తదభావే ప్రకారోsన్యః శుభస్సంప్రోచ్యతే మయా || 33

శిఖయామేక రుద్రాక్షం శిరసా త్రిశతం వహేత్‌ | పంచాశచ్చ గలే దధ్యాద్బాహ్వోః షోడశ షోడశ || 34

మణిబంధే ద్వాదశ ద్విస్కంధే పంచశతం వహేత్‌ | అష్టోత్తరశ##తైర్మాల్య ముపవీతం ప్రకల్పయేత్‌ || 35

ఏవం సహస్ర రుద్రాక్షాన్‌ ధారయేద్యో దృఢవ్రతః | తం నమంతి సురాస్సర్వే యథా రుద్రస్తథైవ సః || 36

ఈ విధముగా రుద్రాక్షలను దరించి, ధ్యానము నందు శివనామమును జపించు భక్తుని చూచినచో, పాపములు నశించును (32). పదకొండు వందల రుద్రాక్షలను ధరించు విధానమును ఇంత వరకు చెప్పితిని. ఇపుడు నేను రుద్రాక్షలను ధరించే మరియొక శుభ పద్ధతిని చెప్పుచున్నాను (33). శిఖయందు ఒకటి, శిరసుపై మూడు వందలు, కంఠమునందు ఏభై, ఒక్కొక్క బాహువునందు పదహారు (34), మణి కట్టునందు పన్నెండు, భుజస్కంధములు రెండింటి యందు అయిదు వందల చొప్పున రుద్రాక్షలను ధరించవలెను. నూట ఎనిమిది రుద్రాక్షలతో యజ్ఞోపవీతమును తయారు చేసుకొనవలెను (35). ఈవిధముగా దృఢముగా వ్రతము కలిగి, రుద్రాక్షలను ధరించు భక్తునకు దేవతలందరు నమస్కరింతురు. అట్టివాడు సాక్షాత్తుగా రుద్రుడే (36).

ఏకం శిఖాయాం రుద్రాక్షం చత్వారింశత్తు మస్తకే | ద్వాత్రింశత్కంఠ దేశే తు వక్షస్యష్టోత్తరం శతమ్‌ || 37

ఏకైకం కర్ణయోః షట్‌ షట్‌ బాహ్వోః షోడశ షోడశ | కరయో రవిమానేన ద్విగుణన మునీశ్వర || 38

సంఖ్యా ప్రీతిర్ధృతా యేన సోsపి శైవజనః పరః | శివవత్పూజనీయో హి వంద్యస్సర్వైర భీక్ణశః || 39

శిరసీ శానమంత్రేణ కర్ణే తత్పురుషేణ చ | అఘేరేణ గవే ధార్యం తేనైవ హృదయేsపి చ || 40

శిఖయందు ఒకటి, శిరస్సునందు నలభై, కంఠమునందు ముప్పది రెండు, వక్ష స్థ్సలము నందు నూట ఎనిమిది (37), చెవులకు ఒక్కింటికి ఆరు, బాహువులకు ఒక్కింటికి పదహారు, చేతులకు ఒక్కింటికి ఇరవై నాలుగు చొప్పున (38) రుద్రాక్షలను ప్రీతితో ధరించువాడు శ్రేష్ఠుడగు శైవుడగును. అతనిని అందరు శివునివలె నమస్కరించి పూజింతురు (39). శిరస్సునందు ఈ శానమంత్రముతో, చెవులయందు తత్పురుషమంత్రముతో, కంఠమునందు అఘోరమంత్రముతో, హృదయమునందు కూడ అదే మంత్రముతో రుద్రాక్షలను ధరించవలెను (40).

అఘోర బీజమంత్రేణ కరయోర్ధారయే త్సుధీః | పంచదశాక్షగ్రథితాం వామదేవేన చోదరే || 41

పంచ బ్రహ్మభింగైశ్చ త్రిమాలాం పంచ సప్త చ | అథవా మూల మంత్రేణ సర్వా నక్షాంస్తు ధారయేత్‌ || 42

మద్యం మాంసం తు లశునం పలాండుం శిగ్రుమేవ చ | శ్లేష్మాంతకం విడ్వరాహం భక్షణ వర్జయేత్తతః || 43

వలక్షం రుద్రాక్షం ద్విజతనుభిరేవేహ విహితం సురక్తం క్షత్రాణాం ప్రముదిత ముమే పీ తమసకృత్‌ |

తతో వైశ్యైర్ధార్యం ప్రతిదివస మావశ్యకమహో తథా కృష్ణం శూద్రైః శ్రుతిగదిత మార్గోయమగజే|| 44

వివేకి అఘేర బీజ మంత్రముతో రెండు చేతులయందు రుద్రాక్షలను ధరించవలెను. ఉదరమునందు పదిహేను రుద్రాక్షల మాలను వామదేవ మంత్రముతో ధరించవలెను (41). అంగ సహిత ఓం కారమును అయిదు సార్లు జపించి, మూడు, అయిదు, లేదా ఏడు మాలలను ధరించవలెను. లేదా, పంచాక్షరీ మంత్రముతోనే రుద్రాక్షలనన్నిటినీ ధరించవలెను (42). రుద్రాక్షలను ధరించిన భక్తుడు మద్యమును, మాంసమును, వెల్లుల్లిని, నీరుల్లిని, మునగ కూరను, విరిగిచెట్టు కూరను, పందిమాంసమును భక్షించరాదు (43). తెల్లని రుద్రాక్షలను బ్రాహ్మణులు మాత్రమే ధరించవలెను. ఉమే! క్షత్రియులు ఎర్రని రుద్రాక్షలను ఆనందముతో ధరించవలెను. వైశ్యులు పచ్చని రుద్రాక్షలను నిత్యము ధరించవలెను. శూద్రులు నల్లని రుద్రాక్షలను ధరించవలెను. ఓపార్వతీ! ఇది వేద విహితమైన మార్గము (44).

వర్ణీ వనీ గృహీ యతీ నియమేన దధ్యాత్‌ ఏతద్రహస్యపరమో న హి జాతు తిష్ఠేత్‌ |

రుద్రాక్ష ధారణమిదం సుకృతైశ్చ లభ్యం త్యక్త్వేదమే తదఖలాన్నరకాన్‌ ప్రయాంతి || 45

ఆదా వామలకాస్తతో లఘు తరా రుగ్ణాస్తతః కంటకైస్సందష్టాః క్రిమిభిస్తనూపకరణచ్ఛిద్రేణ హీనాస్తథా|

ధార్యా నైవ శుభేప్సుభిశ్చణకవద్రుద్రాక్ష మప్యంతతో రుద్రాక్షా మమ లింగ మంగలముమే సూక్ష్మం ప్రశస్తం సదా || 46

సర్వాశ్రమాణాం వర్ణానాం స్త్రీ శూద్రాణాం శివాజ్ఞాయా | ధార్యాస్సదైవ రుద్రాక్షా యతీనాం ప్రణవేన హి || 47

దివా బిభ్రద్రాత్రికృతై రాత్రౌ బిభ్రద్దివాకృతైః | ప్రాతర్మధ్యాహ్న సాయాహ్నే ముచ్యతే సర్వపాతకైః || 48

బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు మరియు సన్న్యాసి నియమపూర్వకముగా రుద్రాక్షలను ధరించవలెను. రుద్రాక్షలు లేకుండా ఒక క్షణమైననూ ఉండరాదు. రుద్రాక్షలను ధరించు భాగ్యము పుణ్యము చేత మాత్రమే లభించును. రుద్రాక్షలను వీడిన మానవులు సమస్త నరకములను పొందెదరు (45). ముందుగా ఉసిరి కాయ ప్రమాణము గల రుద్రాక్షలను, తరువాత వాటికంéటె తేలికయైన వాటిని ధరించవలెను. రోగము గలవి, కంటకములు తొలగిపోయినవి, పురుగు పట్టినవి, సూది గుచ్చుటకు తగినంత రంధ్రము లేనివియగు రుద్రాక్షలను, శుభములను కోరు భక్తుడు ధరించరాదు. చిక్కుడు గింజ ప్రమాణము గల రుద్రాక్ష ప్రశస్తమైనది. ఉమాదేవీ! రుద్రాక్ష నా యొక్క మంగళకరమగు చిహ్నము (46). అన్ని వర్ణముల వారు, ఆశ్రమముల వారు, స్త్రీలు, శూద్రులు సర్వదా రుద్రాక్షలను ధరించవలెనని శివుని యాజ్ఞ. యతులు ఓం కారముతో రుద్రాక్షలను ధరించవలెను (47). పగలు ధరించినచో రాత్రియందు చేసిన పాపములు, రాత్రి ధరించినచో పగటి యందు చేసిన పాపములు, సర్వకాలములలో ధరించినచో సర్వపాపములు తొలగిపోవును (48).

యే త్రిపుండ్ర ధరా లోకే జటాధారిణ ఏవ యే | యే రుద్రాక్ష ధరాస్తే వై యమలోకం ప్రయాంతి న || 49

రుద్రాక్ష మేకం శిరసా బిభర్తి తథా త్రిపుండ్రం చ లలాట మధ్యే |

పంచాక్షరం యే హి జపంతి మంత్ర పూజ్యా భవద్భిః ఖలు తే హి సాధవః || 50

యస్యాంగే నాస్తి రుద్రాక్ష స్త్రి పుండ్రం భాలపట్టకే | ముఖే పంచాక్షరం నాస్తి తమానయ యమాలయమ్‌ || 51

జ్ఞత్వా జ్ఞాత్వా తత్ప్రభావం భస్మం రుద్రాక్ష ధారిణః | తే పూజ్యా స్సర్వదాస్మాకం నానేతవ్యాః కదాచన || 52

ఏవ మాజ్ఞాపయామాస కాలోపి నిజకింకరాన్‌ | తథేతి మత్వా తే సర్వే తూష్ణీమాసన్‌ సువిస్మితాః || 53

ఈ లోకములో త్రిపుండ్రమును ధరించువారు, జటలను ధరించువారు, రుద్రాక్షలను ధరించువారు యమలోకమును పొందురు (49). ఒక రుద్రాక్షను శిరస్సుపై ధరించి, లలాటమునందు త్రిపుండ్రమును ధరించి, పంచాక్షరీ మంత్రమును జపించు మానవులు సాధువులు. వారిని మీరు పూజించవలెను (50). ఎవని శరీరమునందు రుద్రాక్ష లేదో, లలాటమునందు త్రిపుండ్రము లేదో, నోటిలో పంచాక్షరి లేదో అట్టి వానిని యమనగరికి తీసుకుని రండు (51). భస్మను, రుద్రాక్షలను ధరించు మానవుల మహిమ నిశ్చితముగా తెలుసుకొనుడు. వారు మనకు అన్ని కాలములలో పూజింపదగినవారు. వారినెన్నడూ తీసుకుని రావలదు (52). అని యముడు తన కింకరుల నాదేశించెను. అపుడు వారందరు ఆశ్చర్యముతో చకితులై మాటలాడక ఊరకుండిరి (53).

అత ఏవ మహాదేవి రుద్రాక్షోత్యఘనాశనః | తద్ధరో మత్ర్పయశ్శుద్ధోsత్యఘవానపి పార్వతి || 54

హస్తే బాహౌ తథా మూర్ధ్ని రుద్రాక్షం ధారయేత్తు యః | అవధ్యస్సర్వ భూతానాం రుద్రరూపీ చరేద్భువి || 55

సురాసురాణాం సర్వేషాం వందనీయస్సదా సవై | పూజనీయో హి దృష్టస్య పాపహా చ యథా శివః || 56

ధ్యాన జ్ఞానావముక్తోsపి రుద్రాక్షం ధారయేత్తు యః | సర్వపాపవినిర్ముక్తస్స యాతి పరమాం గతిమ్‌ || 57

ఓ మహాదేవీ! రుద్రాక్ష పాపములను పోగొట్టుటలో మిక్కిలి గొప్పది. ఓ పార్వతీ! పాపియైనను రుద్రాక్షలను ధరిచువాడు శుద్ధుడై, నాకు ప్రియుడగును (54). చేతుల యందు, బాహువుల యందు, మరియు శిరస్సునందు రుద్రాక్షలను ధరించువ్యక్తి సర్వప్రాణులకు అవధ్యుడై, రుద్రరూపుడై భూలోకమునందు సంచరించును (55). అట్టివాడు దేవతలకు, రాక్షసులకు, సర్వమానవులకు సర్వకాలముల యందు నమస్కరింపదగిన వాడు. పూజింపదగిన వాడు . అతని దర్శనము శివుని దర్శనము వలె పాపములను పోగొట్టును (56). ధ్యాన, జ్ఞానములు లేనివైడైనను, రుద్రాక్షలను ధరించు మానవుడు పాపములన్నిటి నుండి విముక్తిని పొంది, మోక్షమును పొందును (57).

రుద్రాక్షేణ జపన్మంత్రం పుణ్యం కోటి గుణం భ##వేత్‌ | దశకోటి గుణం పుణ్యం ధారణాల్లభ##తే నరః || 58

యావత్కాలం హి జీవస్య శరీరస్థో భ##వేత్స వై | తావత్కాలం స్వల్పమృత్యుర్న తం దేవి విబాధతే || 59

త్రిపుండ్రేణ చ సంయుక్తం రుద్రాక్ష విలసాంగకమ్‌ | మృత్యుంజయం జపంతం చ దృష్ట్వా రుద్రఫలం లభేత్‌ || 60

పంచదేవ ప్రియశ్చైవ సర్వదేవప్రియస్తథా | సర్వమంత్రాన్‌ జపేద్భక్తో రుద్రాక్ష మాలయా ప్రియే || 61

రుద్రాక్ష మాలతో మంత్రమును జపించినచో, కోటి రెట్లు పుణ్యము లభించును. రుద్రాక్షలను ధరించి జపించు మానవుడు పదికోట్ల రెట్లు పుణ్యమును పొందును (58). ఓ దేవీ! జీవుని శరీరము నందు రుద్రాక్ష ఉన్నంత వరకు, అకాల మృత్యువు ఆ జీవుని బాధించదు (59). త్రిపుండ్రమును ధరించి, రుద్రాక్షలతో ప్రకాశించు అవయవములు గలవాడై, మృత్యుంజయ మంత్రమును జపించు వ్యక్తిని చూచినచో, శివదర్శన ఫలము లభించును (60).ఓ పార్వతీ! రుద్రాక్ష మాలతో మంత్రములనన్నిటినీ జపించు భక్తుడు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులకు మాత్రమే గాక, సర్వదేవతలకు ప్రియుడగును (61).

విష్ణ్వాది దేవ భక్తాశ్చ ధారయేయుర్న సంశయమ్‌ | రుద్ర భక్తో విశేషణ రుద్రాక్షాన్‌ ధారయేత్సదా || 62

రుద్రాక్షా వివిధాః ప్రోక్తాస్తేషాం భేదాన్‌ వదామ్యహమ్‌ | శృణు పార్వతి సద్భక్త్యా భుక్తిముక్తి ఫల ప్రదాన్‌ || 63

ఏక వక్త్రశ్శివస్సాక్షాత్‌ భుక్తిముక్తి ఫలప్రదః | తస్య దర్శన మాత్రేణ బ్రహ్మహత్యా వ్యపోహతి || 64

యత్ర సంపూజితస్తత్ర లక్ష్మీర్దూరతరా న హి | నశ్యంత్యు పద్రవాస్సర్వే సర్వకామా భవంతి హి || 65

విష్ణువు మొదలగు ఇతర దేవతల భక్తులు కూడా రుద్రాక్షలను ధరించవలెననుటలో సందియము లేదు. రుద్ర భక్తులు ప్రత్యేక శ్రద్ధతో సర్వకాలముల యందు రుద్రాక్షలను ధరించవలెను (62). రుద్రాక్షలు అనేక రకములుగా నున్నవి. వాటిలోని భేదములను చెప్పెదను. ఓ పార్వతీ! భుక్తిని, ముక్తిని ఇచ్చే ఈ రుద్రాక్షల వివరములను భక్తితో వినుము (63). ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తుగా శివస్వరూపమే. అది భుక్తిని, ముక్తిని, ఇతర ఫలములను ఇచ్చును. దాని దర్శన మాత్రము చేతనే బ్రహ్మ హత్యాదోషము తొలగును (64). దానిని పూజించు స్థలములో సంపదలు విలసిల్లును. ఉపద్రవములు తొలగిపోయి, కోర్కెలు ఈడేరును (650.

దివక్త్రో దేవదేవేశ స్సర్వ కామఫల ప్రదః | విశేషతస్స రుద్రాక్షో గోవధం నాశ##యేద్ద్రుతమ్‌ || 66

త్రివక్త్రో యో హి రుద్రాక్ష స్సాక్షాత్సాధన దస్సదా | తత్ర్పభావా ద్భవేయుర్వై విద్యాస్సర్వాః ప్రతిష్ఠితాః || 67

చతుర్వక్త్రస్స్వయం బ్రహ్మా నరహత్యాం వ్యపోహతి | దర్శనాత్స్పర్శనాత్సద్యశ్చ తుర్వర్గఫలప్రదః || 68

పంచవక్త్రస్స్వయం రుద్రః కాలాగ్నిర్నామతః ప్రభుః | సర్వముక్తిప్రదశ్చైవ సర్వకామఫలప్రదః || 69

రెండు ముఖములు గల రుద్రాక్ష సర్వశ్రేష్ఠమైనది. అది కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. అది గోహత్యా పాపమును వెనువెంటనే పోగొట్టును (66). మూడు ముఖములు గల రుద్రాక్ష సాధన సంపత్తిని కలిగించును. దాని ప్రభావముచే సాధకుని యందు విద్యలన్నియూ స్థిరమగును (67). నాల్గు ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తుగా బ్రాహ్మ స్వరూపము. అది నరహత్యా దోషమును పోగొట్టును. దానిని దర్శించి, స్పృశించుట వలన నాల్గు పురుషార్థములు సిద్ధించును(68). అయిదు ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్ర స్వరూపము. సర్వసమర్ధమగు ఈ రుద్రాక్షకు కాలాగ్ని యని పేరు. ఇది సర్వ విధముల ముక్తిని, సర్వకాలములను ఇచ్చును (69).

అగమ్యగమనం పాపమభక్ష్యస్య చ భక్షణమ్‌ | ఇత్యాది సర్వపాపాని పంచవక్త్రో వ్యపోహతి || 70

షడ్వక్త్రః కార్తికేయస్తు ధారణాద్దక్షిణ భుజే | బ్రహ్మహత్యాదికైః పాపైర్ముచ్యతే నాత్ర సంశయః || 71

సప్తవక్త్రో మహేశాని హ్యనంగో నామ నామతః | ధారణాత్తస్య దేవేశి దరిద్రోsపీశ్వరో భ##వేత్‌ || 72

రుద్రాక్షశ్చాష్టవక్త్రశ్చ వసుమూర్తిశ్చ భైరవః | ధారణాత్తస్య పూర్ణాయుర్మృతో భవతి శూలభృత్‌ || 73

అగమ్యగమనము, తినకూడని దానిని తినుట మొదలగు పాపములనన్నింటిని అయిదు ముఖముల రుద్రాక్ష పోగొట్టును (70). ఆరు ముఖముల రుద్రక్ష సాక్షాత్తుగా కుమారస్వామి స్వరూపము. దానిని కుడి భుజమునందు ధరించు మానవుడు బ్రహ్మ హత్యాది పాపములన్నింటి నుండి విముక్తుడగననుటలో సందేహము లేదు (71). ఓ పార్వతీ! ఏడు ముఖముల రుద్రాక్షకు అనంగమని పేరు. దానిని ధరించు వ్యక్తి దరిద్రుడైననూ సర్వసమర్ధడగును (72). ఎనిమిది ముఖముల రుద్రాక్ష వసువుల స్వరూపమై యున్నది. దానికి భైరవమని పేరు. దానిని ధరించు మానవుడు పూర్ణాయుర్దాయమును పొంది, మరణించిన తరువాత సివసాయుజ్యమును పొందును (73).

భైరవో నవవక్త్రశ్చ కపిలశ్చ మునిస్మ్సృతః | దుర్గా వా తదధిష్ఠాత్రీ నవరూపా మహేశ్వరీ || 74

తం ధారయే ద్వామహస్తే రుద్రాక్షం భక్తి తత్పరః | సర్వేష్వరో భ##వేన్నూనం మమ తుల్యో న సంశయః || 75

దశవక్త్రో మహేశాని స్వయం దేవో జనార్దనః | ధారణాత్తస్య దేవేశి సర్వాన్‌ కామానవాప్నుయాత్‌ || 76

ఏకాదశముఖో యస్తు రుద్రాక్షః పరమేశ్వరి | స రుద్రో ధారణాత్తస్య సర్వత్ర విజయీ భ##వేత్‌ || 77

తొమ్మిది ముఖముల రుద్రాక్ష భైరవుని స్వరూపమనియు, కపిలమహర్షి యొక్క స్వరూపమనియు చెప్పబడినది. తొమ్మిది రూపములతో విలసిల్లు దుర్గా మహేశ్వరి దానికి అధిష్ఠాన దేవత (74). అట్టి రుద్రాక్షను భక్తితో ఎడవ చేతియందు ధరించు మానవుడు సర్వ సమర్థుడగుటయే గాక, నాతో సమానుడగుననుటలో సందేహము లేదు (75). ఓమహేశ్వరీ! పది ముఖముల రుద్రాక్ష సాక్షాత్తుగా జనార్దనుని స్వరూపము. ఓదేవీ! దానిని ధరించు మానవునకు కోర్కెలన్నియూ ఈడేరును (76). ఓపరమేశ్వరీ! పదకొండు ముఖములు గల రుద్రాక్ష రుద్రుని స్వరూపము. దానిని ధరించు వ్యక్తి అంతటా విజయమును పొందును (77).

ద్వాదశాస్యం తు రుద్రాక్షం ధారయేత్కే శ##దేశ##కే | ఆదిత్యాశ్చైవ తే సర్వే ద్వాదశైవ స్థితాస్తథా || 78

త్రయోదశముఖో విశ్వే దేవాస్తద్దారణాన్నరః | సర్వాన్‌ కామానవాప్నోతి సౌభాగ్యం మంగలం లభేత్‌ || 79

చతుర్దశముఖో యో హి రుద్రాక్షః పరమశ్శివః |ధారయేన్మూర్ద్నితం భక్త్యా సర్వ పాపం ప్రణశ్యతి || 80

ఇతి రుద్రాక్ష భేదా హి ప్రోక్తా వై ముఖభేదతః | తత్తన్మంత్రాన్‌ శృణు ప్రీత్యా క్రమాచ్ఛైలేశ్వరాత్మజే || 81

పన్నెండు ముఖముల రుద్రాక్షను కేశముల యందు ధరించవలెను. ద్వాదశాదిత్యులు దాని యందు ప్రతిష్ఠితులై ఉందురు (78). పదమూడు ముఖముల రుద్రాక్షలు విశ్వేదేవతల స్వరూపము. వాటిని ధరించు మానవునకు కోర్కెలన్నియూ, ఈడేరి, సౌభాగ్యము మంగళములు కలుగును (79). పదునాల్గు ముఖముల రుద్రాక్ష పరమశివుని స్వరూపము. దానిని భక్తితో శిరస్సుపై ధరించినచో, పాపములన్నియూ నశించును (80). ఓ పార్వతీ! ముఖముల సంఖ్యను బట్టి రుద్రాక్షలలో గల భేదములను నీకు వివరించితిని. ఆయా రుద్రాక్షలకు సంబంధించిన మంత్రములను భక్తితో క్రమముగా వినుము (81).

ఓం హ్రీం నమః (1), ఓం నమః (2), ఓం క్లీం నమః (3),

ఓం హ్రీం నమః (4), ఓం హ్రీం నమః (5), ఓం హ్రీం హుం నమః (6)

ఓం హుం నమః (7), ఓం హుం నమః (8), ఓం హ్రీం హుం నమః (9),

ఓం హ్రీం నమః నమః (10), ఓం హ్రీం హుం నమః (11),

ఓం క్రోం క్షౌం రౌం నమః (12), ఓం హ్రీం నమః (13), ఓం నమః (14).

అనునవి పదునాల్గు మంత్రములు.

భక్తి శ్రద్ధాయుతశ్చైవ సర్వకామార్థ సిద్దయే | రుద్రాక్షాన్‌ ధారయేన్మంత్రై ర్దేవనాలస్య వర్జితః || 82

వినా మంత్రేణ యో ధత్తే రుద్రాక్షం భువి మానవః | స యాతి నరకం ఘోరం యావదింద్రాశ్చతుర్దశ || 83

రుద్రాక్ష మాలినం దృష్ట్వా భూతప్రేత పిశాచకాః | డాకినీ శాకినీ చైవ యే చాన్యే ద్రాహకారకాః || 84

కృత్రిమం చైవ యత్కించి దభిచారాదికం చ యత్‌ | తత్సర్వం దూరతో యాతి దృష్ట్వా శంకిత విగ్రహమ్‌ || 85

సాధకుడు భక్తి శ్రద్ధలతో గూడినవాడై, సర్వకామనలు సిద్ధించుట కొరకై, జూదము మొదలగు వ్యసనములను, సోమరితనమును వీడి, మంత్ర పూర్వకముగా రుద్రాక్షలను ధరించవలెను (82). మంత్రము లేకుండా రుద్రాక్షలను ధరించు మానవుడు పదునాలుగు ఇంద్రుల కాలమును నరకములో గడుపును (83). రుద్రాక్ష మాలను ధరించిన వ్యక్తి ని చూచినచో, భూత ప్రేత పిశాచ డాకినీ శాకినీ మొదలగు, ద్రోహమును చేయు ప్రాణులు తొలగిపోవును (84). చేతబడి మొదలగునవి కూడా రుద్రాక్షలను ధరించువానికి దూరముగా పోవును (85).

రుద్రాక్ష మాలినం దృష్ట్వా శివో విష్ణుః ప్రసీదతి | దేవీ గణపతి స్సూర్య స్సురా శ్చాన్యేsపి పార్వతి || 86

ఏవం జ్ఞాత్వా తు మహాత్మ్యం రుద్రాక్షస్య మహేశ్వరి | సమ్యగ్ధార్యాస్సమంత్రాశ్చ భక్త్యా ధర్మ వివృద్ధయే || 87

ఇత్యుక్తం గిరిజాగ్రే హి శివేన పరమాత్మనా | భస్మ రుద్రాక్ష మహాత్మ్యం భుక్తి ముక్తి ఫలప్రదమ్‌ || 88

శివస్యాతి ప్రి¸° జ్ఞే¸° భస్మ రుద్రాక్ష ధారిణౌ | తద్ధారణ ప్రభావాద్ది భుక్తిర్ముక్తిర్న సంశయః || 89

ఓ పార్వతీ! రుద్రాక్ష మాలను ధరించువ్యక్తి శివునకు, విష్ణువునకు, దేవికి, గణపతికి, సూర్యునకు, ఇతర దేవతలకు కూడ ప్రీతిపాత్రుడగును (86). ఓ మహేశ్వరీ!భక్తుడు ఈ తీరున రుద్రాక్ష యొక్క మహిమను యెరింగి, ధర్మ వృద్ధికొరకై భక్తితో రుద్రాక్షలను సమంత్రకముగా ధరించవలెను (87). పరమాత్మ యగు శివుడు పార్వతి యెదుట ఈ విధముగా భుక్తిని, ముక్తిని ఒసంగు భస్మ రుద్రాక్షల మహిమను వర్ణించెను (88). భస్మధారి, మరియు రుద్రాక్షధారి శివునకు మిక్కిలి ప్రీతిపాత్రులు. వాటిని ధరించినచో, వాటి మహిమ వలన భుక్తి, ముక్తిలభించుననుటలో సందియము లేదు (89).

భస్మరుద్రాక్ష ధారీ యశ్శివ భక్తస్స ఉచ్యతే | పంచాక్షర జపాసక్తః పరిపూర్ణశ్చ సన్ముఖే || 90

వినా భస్మత్రిపుండ్రేణ వినా రుద్రాక్ష మాలయా | పూజితోsపి మహాదేవో నాభీష్టఫలదాయకః || 91

తత్సర్వం చ సమాఖ్యాతం యత్పృష్టం హి మునీశ్వర | భస్మ రుద్రాక్ష మహాత్మ్యం సర్వకామ సమృద్ధిదమ్‌ || 92

ఓ పార్వతీ! భస్మను, రుద్రాక్షలను ధరించి పంచాక్షర జపమునందు ఆసక్తి గల వ్యక్తి పరిపూర్ణుడగు శివభక్తుడని చెప్పబడును (90). భస్మయొక్క త్రిపుండ్రము, రుద్రాక్షమాల లేకుండగా మహాదేవుని పూజించినప్పటికీ, ఆయన కోర్కెల నీడేర్చడు (91).ఓ మునిశ్రేష్ఠా! నీవు కోరిన విషయమునంతనూ చెప్పితిని. కోర్కెల నన్నిటినీ ఈడేర్చు భస్మ, రుద్రాక్షల మహిమను చెప్పితిని (92).

ఏ తద్యః శృణుయాన్నిత్యం మహాత్మ్యం పరమం శుభమ్‌ | రుద్రాక్ష భస్మనోర్భక్త్యా సర్వాన్‌ కామానవాప్నుయాత్‌ || 93

ఇహ సర్వముఖం భుక్త్వా పుత్రపౌత్రాది సంయుతః | లభేత్పరత్ర సన్మోక్షం శివస్యాతి ప్రియో భ##వేత్‌ || 94

విద్యేశ్వర సంహితేయం కథితా వో మునీశ్వరాః | సర్వసిద్ధి ప్రదా నిత్యం ముక్తిదా శివశాసనాత్‌ || 95

ఇతి శ్రీ శివ మహాపురాణ ప్రథమాయాం విద్యేశ్వర సంహితాయాం సాధ్య సాధన ఖండే రుద్రాక్ష మహాత్మ్య వర్ణనం నామపంచ వింశోsధ్యాయః (25)

రుద్రాక్ష భస్మల ఈ పరమ పవిత్రమగు మహాత్మ్యమును భక్తితో విను మానవుడు కోర్కెలనన్నిటినీ పొందును (93). అట్టి మానవుడు ఇహ లోకములో పుత్ర పౌత్రులతో కూడి సర్వసుఖముల ననుభవించి, పరలోకములో ఉత్తమమగు మోక్షమును పొంది, శివునకు మిక్కిలి ప్రీతి పాత్రుడగును (94). ఓ మునిశ్రేష్ఠులారా! ఎల్లవేళలా సిద్ధులనన్నిటినీ ఇచ్చే ఈ విద్వేశ్వరసంహితను మీకు చెప్పితిని. శివుని యాన వలన ఈ విద్వేశ్వర సంహిత మోక్షము నిచ్చును.

శ్రీ శివ మహాపురాణములో మొదటిదియగు విద్యేశ్వర సంహితలోని సాధ్య సాధన ఖండములో రుద్రాక్ష మహాత్మ్య వర్ణనము అనే ఇరువది అయిదవ అధ్యాయము సమాప్తము (25).

విద్యేశ్వర సంహిత సమాప్తము.

హరిః ఓం తత్సత్‌

Sri Sivamahapuranamu-I    Chapters