Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Sivamahapuranamu-II    Chapters   

అథ అష్టా దశో%ధ్యాయః

గణశ వ్రత వర్ణనము

నారద ఉవాచ |

జీవితే గిరిజాపుత్రే దేవ్యా దృష్టే ప్రజేశ్వర | తతః కిమభవత్తత్ర కృపయా తద్వదాధునా || 1

నారదుడిట్లు పలికెను -

ఓ ప్రజాపతీ! పార్వతీ తనయుడు జీవించెను ఆమె తన పుత్రుని చూచెను. ఆ తరువాత అచట ఏమాయెను? అ విషయమును దయతో ఇప్పుడు చెప్పుము (1).

బ్రహ్మోవాచ |

జీవితే గిరిజాపుత్రే దేవ్యా దృష్టే మునీశ్వర | యజ్జాతం తచ్ఛృణుష్వాద్య వచ్మి తే మహదుత్సవమ్‌ || 2

జీవితస్స శివాపుత్రో నిర్వ్యగ్రో%వికృతో మునే | అభిషిక్తస్తదా దేవైర్గణాధ్యక్షై ర్గజాననః || 3

దృష్ట్వా స్వతనయం దేవీ శివా హర్ష సమన్వితా | గృహీత్వా బాలకం దోర్భ్యాం ప్రముదా పరిషస్వజే || 4

వస్త్రాణి వివిధానీహ నానాలంకరణాని చ | దదౌ ప్రీత్యా గణశాయ స్వపుత్రాయ ముదాంబికా || 5

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! పార్వతీ తనయుడు జీవించెను. దేవి ఆతనిని చూచెను. ఆ తరువాత జరిగిన మహోత్సవమును గురించి నీకిపుడు చెప్పెదను (2). ఓ మునీ! జీవించిన ఆ పార్వతీ పుత్రుడు చింత గాని, వికారము గాని లేకుండ నుండెను. అపుడా గజాననుని దేవతలు, గణనాయకులు అభిషేకించిరి (3). పార్వతీదేవి తన కుమారుని చూచి ఆనందముతో నిండిన మనస్సు గలదై ఆ బాలకుని చేతులతో దగ్గరకు తీసుకొని ఆ లింగనము చేసుకొనెను (4). ఆ జగన్మాత తన పుత్రుడగు ఆ గణశునకు వివిధ వస్త్రములను, అనేక అలంకారములను ప్రీతితో ఇచ్చెను (5).

పూజయిత్వా తయా దేవ్యా సిద్ధిభిశ్చాప్యనేకశః | కరేణ స్పర్శితస్సో%థ సర్వదుఃఖహరేణ వై || 6

పూజయిత్వా సుతం దేవీ ముఖమాచుంబ్య శాంకరీ | వరాన్‌ దదౌ తదా ప్రీత్యా జాతస్త్వం దుఃఖితో%ధునా || 7

ధన్యోసి కృతకృత్యో%సి పూర్వపూజ్యో భవాధునా | సర్వేషామమరాణాం వై సర్వదా దుఃఖ వర్జితః || 8

ఆననే తవ సిందూరం దృశ్యతే సాంప్రతం యది | తస్మాత్త్వం పూజనీయో%సి సిందూరేణ సదా నరై ః || 9

ఆ దేవి గణశుని ఆదరించి అనేక సిద్ధులను ఇచ్చి దుఃఖములనన్నిటినీ పోగొట్టే తన చేతితో ఆతనిని స్పృశించెను(6). శాంకరీ దేవి కుమారుని ఆదరించి ముఖమును ముద్దాడి ప్రీతితో వరములనిచ్చెను. ఆమె ఇట్లు పలికెను : నాయనా! నీకు ఇపుడు పుట్టుటతోడనే ఆపద కలిగినది (7). నీవు ధన్యుడవు కృతకృత్యుడవు. నిన్ను దేవతలందరు మున్ముందుగా పూజించెదరు. నీవు సర్వకాలముల యందు దుఃఖరహితుడవై ఉండెదవు (8). ఇపుడు నీ ముఖమునందు సిందూరము కనబడుచున్నది. కావున మానవులు నిన్ను సర్వదా సిందూరముతో పూజించెదరు (9).

పుషై#్పర్వా చందనైర్వాపి గంధేనైవ శుభేన చ | నైవేద్యేన సురమ్యేణ నీరాజనేన విధానతః || 10

తాంబూలైరథ దానైశ్చ తథా ప్రక్రమణౖరపి | నమస్కారవిధానేన పూజాం యస్తే విధాస్యతి || 11

తస్య వై సకలా సిద్ధిర్భవిష్యతి న సంశయః | విఘ్నాన్యనేకరూపాణి క్షయం యాస్యంత్యసంశయమ్‌ || 12

ఇత్యుక్త్వా చ తదా దేవీ స్వపుత్రం తం మహేశ్వరమ్‌ | నానా వస్తుభిరుత్కృష్టం పునరప్యర్చ యత్తథా || 13

పుష్పములు, శుభమగు గంధము, నైవేధ్యము, యథావిధిగా రమ్యమగు నీరాజనము (10). తాంబూలము నిచ్చుట, ప్రదక్షిణ నమస్కారములు అను విధానముచే ఎవరు నిన్ను పూజించెదరో (11), వారికి నిస్సంశయముగా సర్వము సిద్ధించును. అనేక రకముల విఘ్నములు నిశ్చితముగా నశించును (12). ఆ దేవి తన పుత్రునితో మరియు మహేశ్వరునితో ఇట్లు పలికి, అపుడు మరల విఘ్నేశ్వరుని అనేక వస్తువులతో అలంకరించి పూజించెను (13).

తతస్స్వాస్థ్యం చ దేవానాం గణానాం చ విశేషతః | గిరిజాకృపయా విప్ర జాతం తత్‌ క్షణమాత్రతః || 14

ఏతస్మింశ్చ క్షణ దేవా వాసవాద్యా శ్శివం ముదా | స్తుత్వా ప్రసాద్య తం దేవం భక్త్యా నిన్యుశ్శివాంతికమ్‌ || 15

సంసాద్య గిరిశం పశ్చాదుత్సంగే సన్న్యవేశయన్‌ | బాలకం తం మహేశాన్యాస్త్రి జగత్సుఖహేతవే || 16

శివో%పి తస్య శిరసి దత్త్వా స్వకరపంకజమ్‌ | ఉవాచ వచనం దేవాన్‌ పుత్రో%యమితి మే పరః |7

ఓ విప్రా! అపుడు దేవతలకు మరియు గణములకు పార్వతి కృపచే వెనువెంటనే అధిక స్వస్థత చేకూరెన (14). ఆ సమయములో ఇంద్రాది దేవతలు శివదేవుని ఆనందముతో స్తుతించి ప్రసన్నుని చేసి బక్తితో పార్వతి వద్దకు దోడ్కిని వెళ్లిరి (15). మహేశ్వరుని ప్రక్కన మమేశ్వరిని కూర్చుండబెట్టి, తరువాత ముల్లోకములకు సుఖము కలుగుట కొరకై ఆ బాలకుని ఆమె ఒడిలో కర్చుండబెట్టిరి (16). శివుడు కూడా ఆ బాలుని శిరస్సుపై పద్మము వంటి తన చేతిని ఉంచి దేవతలతో 'వీడు నా రెండవ కుమారుడు ' అని పలికెను (17).

గణశో%పి తదోత్థాయ నమస్కృత్య శివాయవై | పార్వత్యై చ నమస్కృత్య మహ్యం వై విష్ణవే తథా || 18

నారదాద్యానృషీన్‌ సర్వాన్‌ న త్వాస్థాయ పురో%బ్రవీత్‌ | క్షంతవ్యశ్చాపరాధో మానశ్చైవేదృశో నృణామ్‌ || 19

అహం చ శంకరశ్చైవ విష్ణశ్చై తే త్రయస్సురా ః | ప్రత్యూచుర్యుగపత్ర్పీత్యా దదతో వరముత్తమమ్‌ || 20

త్రయో వయం సురవరా యథాపూజ్యా జగత్త్రయే | తథాయం గణనాథశ్చ సకలైః ప్రతిపూజ్యతామ్‌ || 21

అపుడు గణశుడు లేచి శివునకు, పార్వతికి, నాకు విష్ణువునకు (18), మరియు నారదాది బుషులందరికీ నమస్కరించి వారి ఎదుట నిలబడి ఇట్లు పలికెను : నా అపరాధమును మన్నించుడు. ఇట్టి అభిమానము (అహంకారము) ను కలిగియుండట మానవుల లక్షణము (19). నేను, శంకరుడు మరియు విష్ణువు అనే త్రిమూర్తులు ఉత్తమ వరములనిచ్చి ఒక్క సారిగా ప్రీతితో నిట్లు పలికితిమి (20). త్రిమూర్తులమగు మేము మల్లోకములలో ఎట్లు పూజింపబడుచున్నామో, అదే విధముగా సర్వులు ఈ గణనాథుని కూడా పూజించెదరు గాక! (21)

వయం చ ప్రాకృతాశ్చాయం ప్రాకృతః పూజ్య ఏవ చ | గణశో విఘ్న హర్తా హి సర్వకామఫలప్రదః || 22

ఏతత్పూజాం పురా కృత్వా పశ్చాత్పూజ్యా వయం నరైః |వయం చ పూజితాస్సర్వే నాయం చాపూజితో యదా || 23

అస్మిన్నపూజితే దేవాః పరపూజా కృతా యది | తదా తత్ఫలహానిస్స్యాన్నాత్ర కార్యా విచారణా || 24

ఇత్యుక్త్వా స గణశానో నానా వస్తుభిరాదరాత్‌ | శివేన పూజితః పూర్వం విష్ణునాను ప్రపూజితః || 25

మేము ప్రకృతి నుండి పుట్టితిమి. ఇతడు కూడా ప్రకృతి నుండి పుట్టినాడు గాన నిశ్చయముగా పూజ్యుడు. గణశుడు విఘ్నములను పారద్రోలి, కొర్కెలనన్నిటినీ ఈడేర్చును (22). మానవులు ముందుగా ఇతనిని పూజించి తరువాతమమ్ములను పూజించవలెను. ఇతనిని పూజించనిచో, మలో ఎవ్వరినైననూ పూజించినట్లు గాదు (23). ఇతనిని పూజించకుండగా ఇతర దేవతలను పూజించినచో, ఆ ఫలము లభించదు. ఓ దేవతలారా! ఈ విషయములో సందేహించకుడు (24). ఇట్లు పలికి ముందుగా శివుడు, తరువాత విష్ణువు ఆ గణశుని ఆదరముగా అనేక వస్తువలతో పూజించిరి (25).

బ్రహ్మణా చ మయా తత్ర పార్వత్యా ప్రపూజితః | సర్వై ర్దేవైర్గణౖశ్చైవ పూజితః పరయా ముదా || 26

సర్వైర్మిలిత్వా తత్రైవ బ్రహ్మ విష్ణు హరాదిభిః | స గణశశ్శివాతుష్ట్యై సర్వాధ్యక్షో నివేదితః || 27

పునశ్చైవ శివేనాసై#్మ సుప్రసన్నేన చేతసా | సర్వదా సుఖదా లోకే వరా దత్తా హ్యనేకశః || 28

బ్రహ్మ (నేను), పార్వతి, సమస్త దేవతలు మరియు సమస్త గణములు పరమానందముతో ఆయనను పూజించిరి (26). బ్రమ్మ, విష్ణువు, ఇతర దేవతలందరు కలిసి పార్వతిని ఆనందింపజేయుట కొరకై ఆమెతో ఆ గణశుడే సర్వాధ్యక్షుడని విన్నవించిరి (27). మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గల శివుడు సర్వకాలముల యందు సుఖము నిచ్చే అనేకవరములను గణశునకు మరల ఇచ్చెను (28).

శివ ఉవాచ |

హే గిరీంద్ర సుతాపుత్ర సంతుష్టో%హం న సంశయః | మయి తుష్టే జగత్తుష్టం విరుద్ధః కో%పి నో భ##వేత్‌ || 29

బాలరూపో%పి యస్మాత్త్వం మహావిక్రమ కారక ః | శక్తి పుత్రస్సుతేజస్వీ తస్మాద్భవ సదా సుఖీ || 30

త్వన్నామ విఘ్న హంతృత్వే శ్రేష్ఠం చైవ భవిత్వితి | మమ సర్వగణాధ్యక్ష స్సంపూజ్యస్త్వం భవాధునా || 31

ఏవముక్త్వా శంకరేణ పూజా విధిరనేకశః | ఆశిషశ్చాప్యనేకా హి కృతాస్తస్మింస్తు తత్‌ క్షణాత్‌ || 32

శివుడిట్లు పలికెను -

ఓ పార్వతీ పుత్రా! నేను సంతసించితిని. సందేహము లేదు.నేను సంతసించినచో జగత్తు సంతసించును. విరోధులు ఎవ్వరూ ఉండరు (29). నీవు శక్తి పుత్రుడవు. గొప్ప తేజశ్శాలివి. నీవు బాలుడవే అయిననూ మహాపరాక్రమమును ప్రదర్శించితివి గాన, సర్వదా సుఖముగా నుండుము (30). విఘ్నములను పోగొట్టుటలో నీ పేరు ప్రసిద్ధి గాంచును. నీవు నా గణములన్నింటికి అధ్యక్షుడవై పూజలను గైకొనుము (31). శంకరుడిట్లు పలికి వెంటనే పూజా విధిని నిర్ణయించి, అనేకములగు ఆశీర్వచనములను గణశునకు పలికెను (32).

తతో దేవగణాశ్చైవ గీత వాద్యం చ నృత్యకమ్‌ | ముదా తే కారయామాసుస్త థైవాప్సరసాం గణాః || 33

పునశ్చైవ వరో దత్తస్సు ప్రసన్నేన శంభునా | తసై#్మ చ గణనాథాయ శివేనైవ మహాత్మనా || 34

చతుర్థ్యాం త్వం సముత్పన్నో భాద్రే మాసి గణశ్వర | అసితే చ తథా పక్షే చంద్రస్యోదయనే శుభే || 35

ప్రథమే చ తథా యామే గిరిజాయాస్సుచేతసః | ఆవిర్భభూవ తే రూపం యస్మాత్తే వ్రతముత్తమమ్‌ || 36

అపుడు దేవతలు, గణములు మరియు అప్సరసలు ఆనందముతో వాద్యములను మ్రోగించి ఆడి పాడిరి (33). అపుడు మహాత్ముడు, మంగళకరుడు అగు శంభుడు మిక్కిలి ప్రసన్నుడై ఆ గణశునకు మరల వరము నిచ్చెను (34). ఓ గణశా! నీవు భాద్రపద కృష్ణచతుర్థి నాడు చంద్రోదయ శుభకాలమున జన్మించితివి (35). పవిత్ర మనస్కురాలగు గిరిజ నుండి మొదటి జాములో నీ రూపము ఆవిర్భవించెను గాన, నీ వ్రతము ఉత్తమమైనది (36).

తస్మాత్తద్దిన మారభ్య తస్యామేవ తిథౌ ముదా | వ్రతం కార్యం విశేషేణ సర్వసిద్ధ్యై సుశోభనమ్‌ || 37

యావత్పునస్సమాయాతి వర్షాంతే చ చతుర్థికా | తావద్ర్వతం చ కర్తవ్యం తవ చైవ మమాజ్ఞయా || 38

సంసారే సుఖమిచ్ఛంతి యే%తులం చాప్యనేకశః | త్వాం పూజయంతు తే భక్త్యా చతుర్థ్యాం విధి పూర్వకమ్‌ || 39

మార్గశీర్షే తథా మాసే రమా యా వై చతుర్థికా | ప్రాతస్స్నా నం తదా కృత్వా వ్రతం విప్రాన్నివేదయేత్‌ || 40

కావున సర్వము సిద్దించుట కొరకై అదే తిథినాడు ఆరంభించి శుభకరమగు వ్రతమును ఆనందములో శ్రద్ధతో అనుష్ఠించవలెను (374). నా ఆజ్ఞచే, మరల సంవత్సరము తరువాత చతుర్థీతిధి వచ్చువరకు నీ ఈ వ్రతమునుచేయవలెను (38). సంసారము నందు సాటిలేని అనేక సుఖములను ఎవరు గోరెదరో, వారు నిన్ను చవితి నాడు భక్తితో యథావిధిగా పూజించవలెను (39). మార్గశీర్ష కృష్ణ చతుర్థినాడు ఉదయమే స్నానము చేసి వ్రతమునాచరించి బ్రాహ్మణులకు భోజనము నిడవలెను (40).

దూర్వాభిః పూజనం కార్యముపవాసప్తథా విధః | రాత్రేశ్చ ప్రహరే జాతే స్నాత్వా సంపూజయేన్నరః || 41

మూర్తిం ధాతుమాయిం కృత్వా ప్రవాల సంబవాం తతా | శ్వేతార్క సంభవాం చాపి మార్దికాం నిర్మితాం తథా || 42

ప్రతిష్ఠాప్య తదా తత్ర పూజయేత్ర్పయతః పూమాన్‌ | గంధైర్నానావిధైర్దివ్యైశ్చందనైః పుష్పకైరిహ || 43

వితస్తి మాత్రా దూర్వా చ వ్యంగా వై మూలవర్జితాః | ఈదృశానం తద్బలానాం శ##తేనైకోత్తరేణ హ || 44

ఉపవాసముండి దూర్వలతో పూజించవలెను. రాత్రి యొక్క మొదటి యామము నందు స్నానముచేసి మానవుడు పూజించవలెను (41). లోహమూర్తిని గాని, పగడముల మూర్తిని గాని, తెల్ల జిల్లెడుతో చేసిన మూర్తిని గతాని, మట్టితో చేసిన మూర్తిని గాని పూజించవలెను (42). మానవుడు అట్టి మూర్తిని ప్రతిష్ఠించి నానావిధములగు దివ్యచందనముతో మరియు సుగంధ ద్రవ్యములతో, పుష్పములతో శ్రద్ధగా పూజించవలెను (43). దూర్వలు పన్నెండు అంగుళముల పొడవు గలవై వ్రేళ్లు లేనివిగా ఉండవలెను. వాటికి ఉపాంగములు ఉండరాదు. దూర్వలు గట్టిగా నుండవలెను. నూట ఒక్క దూర్వాలతో ఆ ప్రతిమను పూజించవలెను (44).

ఏక వింశతికేనైవ పూజయేత్ర్పతిమాం స్థితామ్‌ | ధూపైర్దీపైశ్చ నైవేద్యైర్వివిధైర్గణనాయకమ్‌ || 45

తాంబూలాద్యర్ఘ సద్ద్రవ్యైః ప్రణిపత్య స్తవైస్తథా | త్వాం తత్ర పూజయిత్వేత్థం బాల చంద్రం చ పూజయేత్‌ || 46

పశ్చాద్విప్రాంశ్చ సంపూజ్య భోజయేన్మధురైర్ముదా | స్వయం చైవ తతో భుంజ్యాన్మధురం లవణం విని || 47

గణనాయకుని ప్రతిమను ఇరవై ఒక్క పత్రములతో పూజించి ధూపదీపములను, వివిధ నైవేద్యములను సమర్పించవలెను (45). ఆ ప్రతిమయందు నిన్ను ఈ విధముగా తాంబూలముతో, పవిత్ర పూజాద్రవ్యములతో పూజించి ప్రణమిల్లి స్తుతించి బాలచంద్రుని కూడా పూజించవలెను (46). తరువాత బ్రాహ్మణులను చక్కగా పూజించి, మధుర పదార్ధములతో ఆనందుముగా భోజనము నిడవలెను. తనువాత తాను కూడా ఉప్పులేని మధురమగు ఆహారమును భుజించవలెను (47).

విసర్జయేత్తతః పశ్చా న్నియమం సర్వమాత్మనః | గణశస్మరణం కుర్యాత్సంపూర్ణం స్యాద్ర్వతం శుభమ్‌ || 48

ఏవం వ్రతేన సంపూర్ణే వర్షే జాతే నరస్తదా | ఉద్యాపన విధిం కుర్యాద్ర్వత సంపూర్తి హేతవే || 49

ద్వాదశ బ్రాహ్మణాస్తత్ర భోజనీయా మదాజ్ఞయా | కుంభ##మేకం చ సంస్ధాప్య పూజ్యా మూర్తిస్త్వదీయికా || 50

స్థండిలేష్ట ఫలం కృత్వా తదా వేదవిధానతః | హోమశ్చైవాత్ర కర్తవ్యో విత్త శాఠ్యవివర్జితైః || 51

తరువాత వ్రతనియముములనన్నిటినీ విడిచి పెట్టి గణశుని స్మరించినచో, ఈ శుభవ్రతము పూర్తియగును (48). ఈ వ్రతమును మనవుడు ఆచరించి ఒక సంత్సరము తరువాత వ్రతపూర్తి కొరకై ఉద్యాపనమును అనుష్ఠించవలెను (49). దానియందు పన్నెండు గురు బ్రాహ్మణులకు భోజనము నిడవలెను. ఇది నా ఆజ్ఞ. ఒక కలశమును స్థాపించి నీ మూర్తిని పూజించవలెను (50). అపుడు వేద విధానము ననుసరించి అష్ట దళ పద్మములను ముగ్గువేసి అదే స్థలములో హోమమును చేయవలెను. ఈ వ్రతమును చేయుటలో దనలోభమును విడువవలెను (51).

స్త్రీ ద్వయం చ తథా చాత్ర బటుక ద్వయమాదరాత్‌ | భోజయేత్పూజయిత్వావై మూర్త్యగ్రే విధిపూర్వకమ్‌ || 52

నిశి జాగరణం కార్యం పునః ప్రాతః ప్రపూజయేత్‌ | విసర్జనం తతశ్చైవ పూనరాగమనాయ చ || 53

బాలకాచ్చాశిషో గ్రహ్యాస్స్వస్తి వాచనమేవ చ | పుష్పాంజలిం ప్రదద్యాచ్చ వ్రతసంపూర్ణ హేతవే || 54

నమస్కారాంస్తతః కృత్వా నానాకార్యం ప్రకల్పయేత్‌ | ఏవం వ్రతం కృతం యేన తస్యేప్సితఫలం భ##వేత్‌ || 55

మరియు అచట మూర్తి యెదుట ఇద్దరు స్త్రీలను, ఇద్దరు బాలకులను పూజించి ఆదరముతో యథావిధిగా భోజనమునిడవలెను (52). రాత్రి జాగరమును చేసి మరల ఉదయము పూజను చేయవలెను. తరువాత మరల మరల రావలెనని ప్రార్థించి ఉద్వాసన చెప్పవలెను (53). వ్రతము పూర్ణమగుట కొరకై ఒక బాలకునకు దోసెడు పువ్వులను సమర్పించి వాని నుండి ఆశీస్సులను గ్రహించి స్వస్తి మంత్రములను పఠించవలెను (54). తరువాత నమస్కరించి మిగిలిన కార్యముల నన్నిటినీ పూర్తి చేయవలెను. ఇట్లు వ్రతము చేసిన వానికి కోరిన ఫలము లభించును (55).

యో నిత్యం శ్రద్ధయా సార్థం పూజాం చైవ స్వశక్తితః | కుర్యాత్తవ గణశాన సర్వకామఫలాప్తయే || 56

సిందూరైశ్చందనైశ్చైవ తండులైః కేతకై స్తథా | ఉపచారైరనేకైశ్చ పూజయేత్త్వాం గణశ్వరమ్‌ || 57

ఏవం త్వాం పూజయేయుర్యే భక్త్యా నానోపచారతః | తేషాం సిద్ధిర్భవేన్నిత్యం విఘ్ననాశో భ##వేదిహ || 58

సర్వై ర్వర్ణైః ప్రకర్తవ్యా స్త్రీభిశ్చైవ విశేషతః | ఉదయాభి ముఖైశ్చైవ రాజభిశ్చ విశేషతః || 59

ఓ గణశా! నిన్ను నిత్యము శ్రద్ధతో యథాశక్తి పూజించు వాని కోర్కెలన్నియూ ఈడేరును (56). గణశుడవగు నిన్ను సిందూరము, గంధము, బియ్యము, మొగలి పువ్వులు మరియువివిధ ఉపచారములతో పూజించవలెను (57). ఎవరైతే ఈ విధముగా నిన్ను భక్తితో అనేక ఉపచారములను సమర్పించి పూజించెదరో, వారికి సిద్ధి కలుగును. వారిని విఘ్నములు ఏనాడైననూ బాధించవు (58). అన్ని వర్ణములవారు, మరియు స్త్రీలు కూడ ఈ వ్రతమును ప్రత్యేకముగా చేయవలెను. అభివృద్ధిని గోరు రాజులు ఈ వ్రతమును విశేముగా చేయవలెను (59).

యం యం కామయతే యో వై తం తమాప్నోతి నిశ్చితమ్‌ | అతః కామయమానేన తేన సేవ్య స్సదా భావాన్‌ || 60

ఎవరెవరు ఏయే కొర్కెలను కలిగియుందురో వారు వారు నిన్ను నిత్యము పూజించి ఆయా కోర్కెలను నిశ్చితముగా పొందవచ్చును (60).

బ్రహ్మోవాచ |

శివేనైవం తదా ప్రోక్తం గణశాయ మహాత్మనే | తదానీం దైవతైశ్చైవ సర్వైశ్చ బుషిసత్తమైః || 61

తథేత్యుక్త్వా తు తై స్సర్వై ర్గణౖశ్శంభుప్రియైర్మునే | పూజితో హి గనాథీశో విధినా పరమేణ సః || 62

తతశ్చైవ గణాస్సర్వే ప్రణముస్తే గణశ్వరమ్‌ | సమానర్చుర్విశేషణ నానావస్తుభిరాదరాత్‌ || 63

గిరిజాయాస్సముత్పన్నో యశ్చ హర్షో మునీశ్వర | చతుర్భి ర్వదనైర్వై తమవర్ణ్యం చ కథం బ్రువే || 64

బ్రహ్మ ఇట్లు పలికెను -

మహాత్ముడగు గణశునకు శివుడు ఇట్లు చెప్పెను. అపుడు సమస్త దేవతలు, మహర్షులు (61). శివునకు ప్రియులగు సర్వగణములు 'అటులనే చేసెదము' అని పలికి గణశుని శ్రద్ధతో యథావిధిగా పూజించిరి (62). అపుడు సర్వగణములు ఆ గణశునకు ప్రణమిల్లి అనేక వస్తువులతో ఆదరముగా ప్రత్యేక పూజను చేసిరి (63). ఓ మహర్షీ! అపుడు పార్వతి పొందిన హర్షమును నేను నాల్గు ముఖములతోనైననూ వర్ణింపజాలను (64).

దేవదుందుభయో నేదుర్ననృతుశ్చాప్సరో గణాః |జగుర్గంధర్వముఖ్యాశ్చ పుష్ప వర్షం పపాత హ || 65

జగత్‌ స్వాస్థ్వం తదా ప్రాప గణాధీశే ప్రతిష్టితే | మహోత్సవో మహానాసీత్సర్వం దుఃఖం క్షయం గతమ్‌ || 66

శివాశివౌ చ మోదేతాం విశేషేణాతి నారద | ఆసీత్సుమంగలం భూరి సర్వత్ర సుఖదాయకమ్‌ || 67

తతో దేవగణాస్సర్వే బుషీణాం చ గణాస్తథా | సమాగతాశ్చ యే తత్ర జగ్ముస్తే తు శివాజ్ఞయా || 68

దేవదుందుభులు మ్రోగినవి. అప్సరసలు నాట్యమాడిరి. గంధర్వశ్రేష్ఠులు గానము చేసిర. పుష్పవృష్టి కురిసెను (65). గణశుడు ఈవిధముగా పురుజ్జీవుతడై పూజింపబడగా జగత్తు స్వస్ధతను పొందెను. గొప్ప ఉత్సవము జరిగెను. అందరి దుఃఖము తొలగిపోయెను (66). ఓ నారదా! పార్వతీ పరమేశ్వరులు మిక్కిలి సంతసించిరి. అంతటా సుఖకరమగు మంగళోత్సవము విస్తరముగా జరిగెను (67). అపుడు అచటకు విచ్చేసిన సమస్త దేవతా గణములు, మరియు బుషి బృందములు శివుని అనుమతిని పొంది తమ నెలవులకు వెళ్లిరి (68).

ప్రశంసంతశ్శివాం తత్ర గణశం చ పునః పునః | శివం చైవ తథా స్తుత్వా కీదృశం యుద్దధమేవ చ || 69

యదా సా గిరిజా దేవీ కోపహీనా బభూవ హ | శివో%పి గరిజాం తత్ర పూర్వవత్సం ప్రపద్య తామ్‌ || 70

చకార వివిధం సౌఖ్యం లోకానాం హితకామ్యయా | స్వాత్మారామో%పి పరమో భక్తా కార్యోద్యతస్సదా || 71

విష్ణుశ్చ శివమాపృచ్ఛ్య బ్రహ్మాహం తం తథైవ హి | ఆగచ్ఛావ స్వధామం చ శివౌ సంసేవ్య భక్తితః || 72

పార్వతిని, గణశుని చాల సార్లు ప్రశంసించి, శికుని స్తుతించి యుద్ధమును గురించి సవిస్మయముగా వర్ణిస్తూ వారు వెళ్లిరి (69). పార్వతి కోపమును విడనాడగానే శివుడు ఆమెను పూర్వము నందు వలెనే ప్రేమతో ఆదరించెను (70). శివుడు ఆత్మారాముడైన పరబ్రహ్మయే అయిన భక్తుల కార్యమును నెరవేర్చి లోకములకు హితమును చేయగోరి వివిధ సుఖముల ననుభవించెను (71). నేను, విష్ణువు పార్వతీ పరమేశ్వరులను భక్తితో సేవించి, శివును అనుమతిని పొంది మా ధామములకు చేరుకొంటిమి (72).

నారద త్వం చ భగవాన్‌ సంగీయ శివయోర్యశః | ఆగమో భవనం స్వం చ శివౌ పృష్ట్వా మునీశ్వర || 73

ఏతత్తే సర్వ మాఖ్యాతం మయా వై శివయోర్యశః | భవత్పృష్టేన విఘ్నేశయశస్సంమిశ్ర మాదరాత్‌ || 74

ఇదం సుమంగలాఖ్యానం యశ్శృణోతి సుసంయతః | సర్వమంగల సంయుక్తస్స భ##వేన్మంగలాలయ ః ||75

అపుత్రో లభ##తే పుత్రం లభ##తే ధనమ్‌ | భార్యార్ధీ లభ##తే భార్యాం ప్రజార్థీ లభ##తే ప్రజామ్‌ || 76

ఓ నారదా! మహర్షీ! పూజనీయా!నీవు పార్వతీ పరమేశ్వరుల కీర్తిని గానము చేసి వారి వద్ద సెలవు తీసుకొని నీ భవనమునకు చేరుకొంటివి (73). నేనీ తీరున నీవు ప్రశ్నించగా పార్వతీ పరమేశ్వరుల యశస్సునకు విఘ్నేశ్వరుని కీర్తిని జోడించి సాదరముగా సర్వమును వివరించితిని (74) ఎవడైతే మనస్సును బాగుగా లగ్నము చేసి ఈ రమపవిత్ర గాథను వినునో, వాడు మంగళములనన్నింటినీ పొంది మంగళములకు నిధానమగును (75). పుత్రుడు లేని వారికి పుత్రుడు కలుగును. భార్యను గోరువాడు భార్యను పొందును. సంతానమును గోరువాడు సంతానమును పొందును (76).

ఆరోగ్యం లభ##తే రోగీ సౌభాగ్యం దుర్భగో లభేత్‌ | నష్టపుత్రం నష్టధనం ప్రోషితా చ పతిం లభేత్‌ || 77

శోకావిష్ట శ్శోకహీనస్స భ##వేన్నాత్ర సంశయః | ఇదం గణశ మాఖ్యానం యస్య గేహే చ తిష్ఠతి || 78

సదా మంగల యుక్త స్స భ##వేన్నాత్ర సంశయః | యాత్రా కాలే చ పుణ్యాహే యశ్శృణోతి సమాహితః ||

సర్వాభీష్టం స లభ##తే శ్రీ గణశప్రసాదతః || 79

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం కుమార ఖండే గణశ వ్రతవర్ఱనం నామ అష్టాదశో%ధ్యాయః (18).

రోగి ఆరోగ్యవంతుడగును. దురదృష్ట వంతుడు భాగ్యవంతుడగును. పోయిన పుత్రుని, ధనమును పొందును. స్త్రీ పరదేశమునందున్న భర్తను తిరిగి పొందును (77). శోకముతో బాధపడువాని శోకము తొలగిపోవును. దీనిలో సందేహము లేదు. ఈ గణశోపాఖ్యానము ఎవని గృహమునందుండునో (78), వాడు నిత్యమంగళముగా నుండుననుటలో సందేహము లేదు. ప్రయాణకాలమునందు, పర్వదినముల యందు ఎవడైతే దీనిని సావదాన చిత్తుడై వినునో, వాడు గణశుని అనుగ్రహముచే ఇష్టఫలములనన్నింటినీ పొందును (79).

శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందలి కుమార ఖండలో గణశవ్రత వర్ణనమనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (79).

Sri Sivamahapuranamu-II    Chapters