Sri Sivamahapuranamu-II    Chapters   

అథ చతుర్దశోధ్యాయః

గణ వివాదము

బ్రహ్మోవాచ |

గణాస్తే క్రోధసంపన్నాస్తత్ర గత్వా శివాజ్ఞయా | పప్రచ్ఛుర్గిరిజాపుత్రం తం తదా ద్వార పాలకమ్‌ ||1

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ గణములు కోపముతో నిండిన వారై శివుని ఆజ్ఞానుసారముగ అచటకు వెళ్లి, ద్వారపాలకుడై యున్న ఆ పార్వతీ తనయుని ఇట్లు ప్రశ్నించిరి (1).

శివాగణా ఊచుః |

కోసి త్వం కుత ఆయాతః కిం వా త్వం చ చికీర్షసి | ఇతోద్య గచ్ఛ దూరం వై యది జీవితుమిచ్ఛసి || 2

శివగణములు ఇట్లు పలికిరి -

నీవెవరివి? ఎచటనుండి వచ్చితివి? నీవేమి చేయ గోరుచున్నావు? నీవు బ్రతుక దలచినతో ఇపుడు ఇచటి నుండి దూరముగా పొమ్ము (2).

బ్రహ్మోవాచ |

తదీయం తద్వచశ్శ్రుత్వా గిరిజాతనయస్సవై | నిర్భయో దండపాణిశ్చ ద్వారపానిదమబ్రవీత్‌ || 3

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారి ఆ మాటను విని పార్వతీపుత్రుడు భయము లేనివాడై చేత కర్ర బట్టుకొని ద్వారపాలకులతో నిట్లు పలికెను (3).

గణశ ఉవాచ|

యూయం కే కుత ఆయాతా బవంత స్సుందరా ఇమే | యాత దూరం కిమర్థం వై స్థితా అత్ర విరోధినః || 4

గణశుడిట్లు పలికెను -

మీరెవరు? ఎచటనుండు వచ్చిరి? మీరు సుందరముగా నున్నారు. దూరముగా పొండు. ఇచట మీరు విరోధమును గోరి నిలబడి యుండుటకు కారణమేమి? (4).

బ్రహ్మోవాచ |

ఏవం శ్రుత్వా వచస్తస్య హాస్యం కృత్వా పరస్పరమ్‌ | ఊచుస్సర్వే శివగణా మహావీరా గతస్మయాః || 5

పరస్పరమితి ప్రోచ్య సర్వే తే శివపార్షదాః | ద్వారపాలం గణశం తం ప్రత్యూచుః క్రుద్ధమానసాః || 6

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహావీరులు, తొలగిన గర్వము గలవారు అగు శివగణములందరు వాని ఈ మాటలను విని ఒకరిలో నొకరు నవ్వుకొని ఇట్లు పిలికిరి (5). శివగణములందరు ఒకరితో నొకరు సంప్రదించుకొని క్రోధముతో నిండిన మనస్సు గలవారై ద్వారపాలుడగు ఆ గణశునితో నిట్లనిరి (16).

శివగణా ఊచుః |

శ్రూయతాం ద్వారపాలా హి వయం శివగణా వరాః | త్వాం నివారయితుం ప్రాప్తాశ్శంకరస్యాజ్ఞయా విభోః || 7

త్వామపీహ గణం మత్వా న హన్యామోన్యథా హతః | తిష్ఠ దూరే స్తస్త్వం చ కిమర్థం మృత్యు మీహసే || 8

శివగణములు ఇట్లు పలికిరి -

వినుము. మేము శ్రేష్ఠులగు శివగణములము. ద్వారపాలకులము. శంకరప్రభుని ఆజ్ఞచే నిన్ను తప్పించుటకు వచ్చినాము (7). నీవు కూడా ఇచటి గణమని తలంచి నిన్ను సంహరించలేదు. లేనిచో నీవీ పాటికి సంహరింపబడి యుండెడి వాడవు. నీ అంతట నీవే దూరముగా పొమ్ము. మృత్యువును ఏల గోరు చున్నావు? (8)

బ్రహ్మోవాచ |

ఇత్యుక్తోపి గణశశ్చ గిరిజాతనయోభయః | నిరన్భర్త్స్య శంకర గణాన్న ద్వారం ముక్తవాంస్తదా || 9

తే సర్వేపి గణాశ్శైవాస్తత్రత్యా వచనం తదా | శ్రుత్వా తత్ర శివం గత్వా తద్వృత్తాంత మథాబ్రువన్‌ || 10

తతశ్చ తద్వచశ్శ్రుత్వాద్భుతలీలో మహేశ్వరః | వినిర్భర్త్స్య గణానూచే నిజాన్‌ లోకగతిర్మునే || 11

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారిట్లు పలికిననూ పార్వతీ తనయుడగు గణశుడు భయము లేనివాడై ఆ శివగణములను భయవెట్టినాడే గాని, ద్వారమును వీడలేదు (90. అచట నున్న ఆ శివగణములందరు ఆ మాటను విని శివుని వద్దకు వెళ్లి ఆ వృత్తాంతమును చెప్పిరి (10). ఓ మహర్షీ! లోకాచారముననుసరించి అద్బుతమగు లీలలను ప్రదర్శించే మహేశ్వరుడు వారి మాటలను విని ఆ తన గణములపై కోపించి గద్దించి వారితో నిట్లనెను (11).

మహేశ్వర ఉవాచ |

కశ్చాయం వర్తతే కిం చ బ్రవీత్యరివదుచ్ఛ్రితః | కిం కరిష్యత్యసద్బుద్ది స్స్వమీత్యుం వాంఛతి ధ్రువమ్‌ || 12

దూరతః క్రియతాం హ్యేష ద్వారపాలో నవీనకః | క్లీబా ఇవ స్థితాస్తస్య వృత్తం వదతమే కథమ్‌ || 13

స్వామినోక్తా గణస్తే చాద్భుతలీలేన శంభునా | పునరాగత్య తత్రైవ తమూచుద్ద్వార పాలకమ్‌ || 14

మహేశ్వరుడిట్లు పలికెను-

ఈ కుర్రువాడెవడు? ఏమి పలుకుచున్నాడు? గొప్పవాని వలె మాటలాడు చున్నాడు. ఈ దుష్టబుద్ధి ఏమి చేయగలడు? తన చావును తాను కోరి తెచ్చుకొనుచున్నాడు. ఇది నిశ్చయము (12). ఈ కొత్త ద్వారపాలకుని దూరముగా త్రోసి వేయుడు. మీరు నపుంసకులవలె నిలబడి వాని గాథను నాకు ఎట్లు చెప్పగల్గుచున్నారు? (13). అద్భుతమగు లీలలు గల శంభుస్వామి ఇట్లు పలుకగా ఆ గణములు మరల అచటకు వచ్చి ఆ ద్వారపాలకునితో నిట్లనిరి (14).

శివగణా ఊచుః |

రే రే ద్వారప కస్త్వం హి స్థితశ్చ స్థాపతః కుతః | నైవాస్మాన్‌ గణయస్యేవం కథం జీవితుమితచ్ఛసి || 15

ద్వారపాలా వయం సర్వే స్థితః కిం పరిభాషసే | సింహాసన గృహీతశ్చ శృగాలశ్శివ మీహతే || 16

తావద్గర్జసి మూర్ఖ త్వం యావద్గణ పరాక్రమః | నాను భూతస్త్వ యాత్రైవ హ్యనుభూతః పతిష్యసి || 17

ఇత్యుక్త సై#్తస్సు సంక్రుద్ధో హస్తాభ్యాం యష్టికాం తదా | గృహీత్వా తాడయామాస గణాంస్తాన్పరి భాషిణః || 18

శివగణములిట్లు పలికిరి -

ఓరీ! ద్వారపాలకా! నీవెవరివి ? నిన్ను ఇక్కడ నిలబెట్టుటకు కారణమేమి? నీవు మమ్ములను లెక్క చేయుటనే లేదు. బ్రతుకు మీద తీపి గలదా? (15). మేమందరము ద్వారపాలకులమే. ఏమి చెప్పెదవు? నీవునిలబడుటకు కారణమేమి? సింహాసనము నెక్కిన నక్క మంగళములను కోరినట్లున్నది (16). ఓరీ మూర్ఖా! నీవు గణముల పరాక్రమమును దర్శించనంతవరకు మాత్రమే గర్జించెదవు. నీవు గణముల పరాక్రమమును దర్శించి ఇచటనే నేలగూలెదవు (17). వారు ఇట్లు అవమానకరముగు మాటలను పలుకగా మిక్కిలి కోపించి గణశుడు కర్రను చేతబట్టి ఆ గణములను కోట్టెను (18).

ఉవాచాథా శివాపుత్రః పరిభర్త్స్య గణశ్వరాన్‌ | శంకరస్య మహావీరాన్‌ నిర్భయస్తాన్‌ గణశ్వరః || 19

పార్వతీ తనయుడగు గణశుడు అపుడు మహావీరులైన ఆ శంకరుని గణనాయకులను బయపెట్టు చున్నవాడై ఇట్లు పలికెను (19).

శివాపుత్ర ఉవాచ |

యాత యాత తతో దూరే నో చేద్వో దర్శయామి హ | స్వపరాక్రమమత్యుగ్రం యాస్యథాత్యుపహాస్యతామ్‌ || 20

ఇత్యుకర్ణ్య వచస్తస్య గిరిజా తనయస్య హి | పరస్పరమథోచుస్తే శంకరస్య గణాస్తదా || 21

పార్వతీతనయుడిట్లు పలికెను -

ఇచట నుండి దూరముగా పొండు. పొండు పోనిచో నా మిక్కిలి భయంకరమగు పరాక్రమమును మీకు చూపెదను. మీరు నవ్వుల పాలగుదురు (20). పార్వతీ తనయుని ఆ మాటలను విని, శంకరుని గణములు వారిలో వారు ఇట్లు మాటలాడు కొనిరి (21).

శివగణా ఊచుః |

కిం కర్తవ్యం క్వ గంతవ్యం క్రియతే స న కిం పునః | మర్యాదా రక్ష్యతేస్మాభిరన్యథా కిం బ్రవీతి చ || 22

శివగణముల లిట్లు పలికెను -

ఏమి చేయవలెను ? ఎచటకు పోవలెను? ఆ బాలుని మనమేల దండించుట లేదు? మనము మర్యాదను రక్షించు చున్నాము.

అట్లు గానిచో, ఆ దేవి ఏమనును? (22)

బ్రహ్మోవాచ |

తతశ్శంభుగణా స్సర్వే శివం దూరే వ్వయవస్థితమ్‌ | క్రోశమాత్రం తు కైలాసాద్గత్వా తే చ తథాబ్రువన్‌ || 23

శివో విహస్య తాన్‌ సర్వాన్‌ త్రిశూల కర ఉగ్రధీః | ఉవాచ పరమేశో హి స్వగణాన్‌ వీరసంమతాన్‌ || 24

బ్రహ్మ ఇట్లు పలికెను -

కైలాసము నుండి క్రోసెడు దూరములో నిలబడి యున్న శివుని చూచి, ఆ శివగణములందరు ఆయన వద్దకు వెళ్లి జరిగతిన వృత్తాంమును చెప్పిరి (23). త్రిశూలమును చేతబట్టి యున్న పరమేశ్వరుడు మనస్సులో మిక్కిలి క్రోధమునుపొంది వీరులని పేరు పొందిన తన గణముల ఎదుట నవ్వి ఇట్లు పలికెను (24).

శివ ఉవాచ |

రే రే గణాః క్లీబమతా న వీరా వీరమానినః | మదగ్రే నోదితుం యోగ్యా భర్త్సితః కిం పునర్వదేత్‌ || 25

గమ్యతాం తాడ్యతాం చైష యః కశ్చిత్‌ ప్రబవేదిహ | బహునోక్తేన కిం చాత్ర దూరీకర్తవ్య ఏవ సః || 26

శివుడిట్లు పలికెను -

ఓరీ గణములారా! మీరు నపుంసకులు. మీకు వీరులనే అభిమానముగలదు. కాని మీరు వీరులు గారు. మీరు నా ఎదుట నుండుటకు అర్హులు గారు. మీరు బయపెట్టినచో వాడేమి మాటలాడగల్గును? (25). వెళ్లుడు. మీలో సమర్థుడెవడైననూ వానిని కొట్టుడు. ఇన్ని మాటలేల? వానిని ఇచట నుండి తరిమి వేయవలసినదే (26).

బ్రహ్మోవాచ |

ఇతి సర్వే మహేశేన జగ్ముస్తత్ర మునీశ్వర | భర్త్సితాస్తేన దేవేన ప్రోచుశ్చ గణసత్తమాః || 27

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! దేవ దేవడగు మహేశ్వరుడు ఇట్లు గద్దించగా, శ్రేష్ఠులగు ఆ గణములందరు అచటకు వెళ్లి వానితో నిట్లునిరి (27).

శివగణా ఊచుః |

రే రే త్వం శృణు వై వై బాల బలాత్కిం పరిభాషసే | ఇతస్త్వం రూరతో యాహి నో చేన్మృత్యుర్భవిష్యతి || 28

శివగణములిట్లు పలికిరి -

ఓరీ! బాలకా! నీవు వినుము. నీవు మమ్ములను మిక్కిలి అవమానించి ఏల మాటలాడు చున్నావు? ఇచట నుండి నీవు దూరముగా పొమ్ము. లేనిచో, నీకు చావు మూడినది (28).

బ్రహ్మోవాచ |

ఇతి శ్రుత్వా వచస్తేషాం వివాజ్ఞా కారిణాం ధ్రువమ్‌ | వివాసుతస్తదాసీత్స కిం కరోమీతి దుఃఖితః || 29

ఏతస్మిన్నంతరే దేవీ తేషాం తస్య చ వై పునః | శ్రుత్వా తు కలహం ద్వారి సఖీం పశ్యేతి సాబ్రవీత్‌ || 30

సమాగత్య సఖీ తత్ర వృత్తాంతం సమబుధ్యత | క్షనమాత్రే తదా దృష్ట్వా గతా హృష్టా శివాంతికమ్‌ || 31

తత్ర గత్వా తు తత్సర్వం వృత్తం తద్యదభూన్మునే | అశేఊషేణ తయా సఖ్యా కథితం గిరిజాగ్రతః || 32

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు శివుని అజ్ఞను పాలించే వారి ఈ మాటలను విని ఆ పార్వతీ పుత్రుడు ఏమి చేయవలెనో తెలియక దుఃఖితుడాయెను (29). ఇంతలో వానికి ఆ గణములతో జరుగుచున్న కలహమును గాంచి, పార్వతీదేవి తన చెలికత్తెను ద్వారము వద్ద చూడుమని పంపెను (30). చెలికత్తె అచటకు వచ్చి జరిగిన వృత్తాంతమునెరిగి క్షణకాలము అచటనే ఉండి ఆ వాగ్వాదమును గాంచి ఆనందించి పార్వతి వద్దకు మరలి వెళ్లెను (31). ఓ మునీ! ఆ చెలికత్తె అచట జరిగిన వృత్తాంతమునంతను పూసగూచ్చినట్లుగా పార్వతి యెదుట చెప్పెను (32).

సఖ్యువాచ |

అస్మదీయో గణో యో హి స్థితో ద్వారి మహేశ్వరి | నిర్భర్త్సయంతి తం వీరాశ్వంకరస్య గణా ధ్రువమ్‌ || 33

శివశ్చైవ గణాస్సర్వే వినా తేవసరం కథమ్‌ | ప్రవిశంతి హఠాద్గేహే నైతచ్ఛుభతరం తవ || 34

సమ్యక్‌ కృతం హ్యనేనైవ న హి కోపి ప్రవేశితః | దుఃఖం చైవాను భూయాత్ర తిరస్కారాదికం తథా || 35

అతః పరం తు వాగ్వాదః క్రియతే చ పరస్పరమ్‌ | వాగ్వాదే చ కృతే నైవ తర్హ్యాయాంతు సుఖేన వై || 36

చెలికత్తె ఇట్లు పలికెను -

ఓ మహేశ్వరీ! ద్వారము వద్ద నిలబడి యున్న మనవాడైన గణశుని వీరులగు శివగణములు గద్దించి బెదిరించుచున్నారు. సందేహము వలదు (33). శివుడు గాని, గణములుగాని ఎవరైననూ నీ అనుమతి లేకుండగా హఠాత్తుగా ఇంటిలోనికి చొచ్చుకొని వచ్చుట నీకు శుభము కాదు (34). ఈ బాలుడు దుఃఖమును, తిరస్కారమును, అవమానమును పొందియూ ఎవ్వరినీ లోపలికి రానీయలేదు. ఆతడు చేసిన పని చాల బాదగున్నది (35). తరువాత ఒకరితో నొకరు వాదులాడుకొనుచున్నారు. వాగ్వాదము జరిగినంత వరకు వారు లోపలికి రాజాలరు. ఆ తరువాత వారు సుఖముగా రావచ్చును (36).

కృతశ్చైవాత్ర వాగ్వాదస్తం జిత్వా విజయేన చ | ప్రవిశంతు తథా సర్వే నాన్యథా కర్హిచిత్ర్పియే || 37

అస్మిన్నే వాస్మదీయే వై సరవే సంభర్త్సితా వయమ్‌ | తస్మాద్దేవి త్వయాభ##ద్రేన త్యాజ్యో మాన ఉత్తముః || 38

శివో మర్కట వత్తేద్య వర్తతే సర్వదా సతి | కిం కరిష్యత్యహం కారమానుకూల్యం భవిష్యతి || 39

ఓ ప్రియురాలగు పార్వతీ1 ఆతడు వారితో వాగ్వాదమును చేసినాడు. వారందరు ఆతనిని జయించిన తరువాతనే లోపలకు ప్రవేశించవలెను. మరియొక ఉపాయము లేదు (37). ఈ మన కుర్రవాని యందు మేమందరము ఆధారపడి యున్నాము. ఓ దేవీ1 మంగళస్వరూపురాలా! కావున నీవు ఉత్తమమగు అభిమానమును విడిచిపెట్టకుము (38). ఓ పతివ్రతా! శివుడు నీ విషయములో ఎల్లవెళలా మర్కటము వలె ప్రవర్తించు చున్నాడు. ఏమి చేయగలడు? అతని అహంకారము తగ్గి మనకు అనుకూలము కాగలదు (39).

బ్రహ్మోవాచ |

అహో క్షణం స్థితా తత్ర శివేచ్ఛా వవతస్సతీ | మనస్యువాచ సా భూత్వా మానినీ పార్వతీ తదా || 40

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు పతివ్రత, అభిమానవతి యగు ఆ పార్వతి శివుని ఇచ్ఛకు వశురాలై అచట క్షణకాలము ఉండి తన మనస్సులో నిట్లు తలపోసెను (40).

శివోవాచ |

అహో క్షణం స్థితో నైవ హఠాత్కారః కథం కృతః | కథం చైవాత్ర కర్తవ్యం వినయేనాథ వా పునః || 41

భవిష్యతి భవత్యేవ కృతం నైవాన్యథా పునః | ఇత్యుక్త్వా తు సఖీ తత్ర ప్రేషితా ప్రియయా తదా || 42

సమాగత్యాబ్రవీత్సా చ ప్రియయా కథితం హి యత్‌ | తమాచష్ట గణశం తం గిరిజాతనయం తదా || 43

పార్వతి ఇట్లు పలికెను -

అహో! ఆయన క్షణకాలము నిలబడి నాడు కాడు. పైగా హఠమును ఎట్లు చేయగల్గినాడు? ఈ విషయములో వినయమునకు భంగము కలుగకుండగా ప్రవర్తించుట ఎట్లోగదా! (41) జరుగవలసినది జరిగితీరును. మరియొక విధముగా జరుగబోదు. ఆమె ఇట్లు తలపోసి తన ప్రియసఖిని గణశుని వద్దకు పంపెను (42). ఆమె పార్వతీ తనయుడగు గణశుని వద్దకు వచ్చి ప్రియిసఖియగు పార్వతి చెప్పిన వచనములను ఆతనికి చెప్పెను (43).

సఖ్యువాచ |

సమ్యక్‌ కృతం త్వయా భద్ర బలాత్తే ప్రవిశంతు న | భవదగ్రే గణా హ్యేతే కిం జయంతు భవాదృశమ్‌ || 44

కృతం చేద్వాకృతం చైవ కర్తవ్యం క్రియతాం త్వయా | జితో యస్తు పునర్వాపి న వైరమథ వా ధ్రువమ్‌ || 45

సఖి ఇట్లు పలికెను -

ఓయి కుమారా! నీవు చేసిన పని బాగున్నది. వారు బలాత్కారముచే ప్రవేశించకుండునట్లు చేయుము. నీ ముందు ఈ గణములెంత? నీ వంటి వానిని వారు జయించగలరా యేమి? (44) వారుతమకర్తవ్యమును చేసిననూ మానిననూ నీ కర్తవ్యమును నీవు చేయుము. నీవు జయించిననూ వైరమును పూనవలదు. ఇది నిశ్చయము (45).

బ్రహ్మోవాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్యా మాతుశ్చైవ గణశ్వరః | ఆనందం పరమం ప్రాప బలం బూరి మహోన్నతిమ్‌ || 46

బద్ధ కక్షస్తథోష్ణీషం బద్ధ్వా జంఘోరు సంస్పృశన్‌ | ఉవాచ తాన్‌ గణాన్‌ సర్వాన్‌ నిర్బయం వచనం ముదా || 47

బ్రహ్మ ఇట్లు పలికెను -

గణశుడు ఆ తల్లి మాటలను చెలికత్తె ద్వారా విని మిక్కిలి ఆనందమును, గొప్ప బలమును మరియు మహోత్సాహమును పొందెను (46). ఆతడు నడుము బిగించి తలపాగా చుట్టి మోకాళ్ల వరకు పంచెను బిగించి తొడ చరచి నిర్భయముగా ఆనందముతో ఆ గణములనందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను (47).

గణశ ఉవాచ |

అహం చ గిరిజా సూను ర్యూయం శివగణాస్తతా | ఉభ##యే సమతాం ప్రాప్తాః కర్తవ్యం క్రియతాం పునః || 48

భవంతో ద్వారపాలాశ్చ ద్వారపోహం కథం న హి | భవంతశ్చ స్థితాస్తత్రాహం స్థితోత్రేతి నిశ్చితమ్‌ || 49

భవద్భిశ్చ స్తితం హ్యత్ర యదా భవతి నిశ్చితమ్‌ 7 తదా భవద్భిః కర్తవ్యం శివాజ్ఞా పరిపాలనమ్‌ || 50

ఇదానీం తు మయా చాత్ర శివాజ్ఞా పరిపాలనమ్‌ | సత్యం చ క్రియతే వీరా నిర్ణీతం మే యథోచితమ్‌ || 51

గణశుడు ఇట్లు పలికెను -

నేను పార్వతీ పుత్రుడను. మీరు గణములు. మనమిద్దరము సమానస్థాయికి చెందిన వారమే. కావున ఎవరి కర్తవ్యమును వరు చెసెదము (48). మీరు ద్వారపాలకులు. నేను ద్వారపాలకుడను ఏల కాజాలను? మీరచట, నేనిచట నిలబడి యున్నాము. ఇది నిశ్చయము (49). మీరు పూర్వము ఇచట నిలబడిన వారే. మీ కర్తవ్యము మీకు నిశ్చితమైన వెంటనే అమలు చేయుడు. శివుని ఆజ్ఞను పాలించుడు (50). ఇపుడు నేనిచట పార్వతీ దేవి యొక్క ఆజ్ఞను యథార్థముగా అమలు చుయుచున్నాను. ఓ వీరులారా! నా నిర్ణయము యథాయోగ్యముగ నున్నది (51).

తస్మాచ్ఛివగణాస్సర్వే వచనం శృణుతాదరాత్‌ | హఠాద్వా వినయాద్వా న గంతవ్యం మందిరే పునః || 52

కావున ఓ శివగణములారా! మీరందరు నా మాటను శ్రద్ధగా వినుడు. బాలాత్కారముగా గాని, వినయముతో గాని మీరు మరల మందిరములో అడుగు పెట్టవద్దు (52).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్తాస్తే గణనైవ సర్వే తే లజ్జితా గణాః | యయుశ్శివాంతికం తం వై సమస్కృత్య పురస్థ్సితాః || 53

స్థిత్వా న్యవేదయన్‌ సర్వేవృత్వాంతం చ తదద్భుతమ్‌ | కరౌ బద్ధ్వా నతస్కంధా శ్శివం స్తుత్వా పురస్థ్సి తాః || 54

తత్సర్వం తు తదా శ్రుత్వా వృత్తం తత్స్వ గణోదితమ్‌ | లౌకికీం వృత్తతి మాశ్రిత్య శంకరో వాక్యమబ్రవీత్‌ || 55

బ్రహ్మ ఇట్లు పలికెను -

గణశుడిట్లు పలుకగా ఆ గణములందరు సిగ్గుపడి శివుని వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి ఆయన యెదుట నిలబడిరి (53). వారు చేతులు జోడించి తలలు వంచి శివుని స్తుతించి ఆయన ఎదుట నిలబడి ఆ అద్భుతమగు వృత్తాంతమును విన్నవించిరి (54). శంకరుడు తన గణములు చెప్పిన ఆ వృత్తాంతము నంతనూ విని లోకాచారము ననుసరించి ఇట్లు పలికెను (55).

శంకర ఉవాచ |

శ్రూయతాం చ గణాస్సర్వే యుద్ధం యోగ్యం భ##వేన్న హి| యూయం చాత్రాస్మదీయా వై చ గౌరీ గణస్తథా || 56

వినయః క్రియతే చేద్వై వశ్యశ్శంభు స్త్స్రి యా సదా | ఇతి ఖ్యాతిర్భ వేల్లోకే గర్హితా మే గణా ధ్రువమ్‌ || 57

కృతే చైవాత్ర కర్తవ్యమితి నీతిర్గరీయసీ | ఏకాకీ స గణో బాలః కిం కరిష్యతి విక్రమమ్‌ || 58

భవంతశ్చ గణా లోకే యుద్ధే చాతివిశారదాః | మదీయాశ్చ కథం యుద్ధం హిత్వా యాస్యథ లాఘవమ్‌ || 59

శంకరుడిట్లు పలికెను -

గణములారా! మీరందరు వినుడు. యుద్ధము సముచితము కాదు. మీరు నాకు సంబంధించిన వారు. ఆ గణశుడు గౌరికి సంబంధించిన వాడు (56). ఓ నా గణములారా! నేనీ సమయములో వెనుకకు తగ్గినచో, శివుడు సర్వదా భార్యకు విధేయుడు అనే అపకీర్తి లోకములో నిశ్చయముగా స్థిరపడును (57). ఎదుటి వాని శక్తిని గమనించి ప్రతీకారమును చేయవలెననే గొప్ప నీతి గలదు. ఏకాకి, బాలుడు అగు ఈ గణశుడు ఏమి పరాక్రమమును చూపగల్గును? (58). గణములారా! మీరు యుద్ధములో గొప్ప నిపుణులని లోకములో పేరు గాంచినారు. నా గణములై యుండియూ మీరు యుద్ధమును విడనాడి లోకములో తేలికయగుట ఎట్లు సంభవము? (59)

స్త్రియా గ్రహః కథం కార్యో పత్యురగ్రే విశేషతః | కృత్వా సా గిరిజా తస్య నూనం ఫలమవాప్స్యతి || 60

తస్మాత్సర్వే చ మద్వీరా శ్శృణుతాదరతో వచః | కర్తవ్యం సర్వథా యుద్ధం భావి యత్తద్భవత్వితి|| 61

స్త్రీ మొండిపట్టు పట్టరాదు. భర్త యెదుట మొండిపట్టు అసలే పనికి రాదు. గిరిజా దేవి అట్లు చేసినచో దాని ఫలమును నిశ్చయముగా అనుభవించగలదు (60). కావున నా వీరులైన మీరందరు నా మాటను శ్రద్ధతో వినుడు. మీరు యుద్ధమును నిశ్చయముగా చేయవలెను. ఏది జరిగిననూ జరుగనిండు (61).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా శంకరో బ్రహ్మన్‌ నానాలీలా విశారదః | విరరామ మునిశ్రేష్ఠ దర్శయన్‌ లౌకికీం గతిమ్‌ || 62

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం కుమార ఖండే గణవివాద వర్ణనం నామ చతుర్ధశో%ధ్యాయః(14).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదా! మునీశ్వరా! అనేక లీలలలో నిపుణుడగు శంకరుడు లోక గతిని ప్రదర్శిస్తూ ఇట్లు పలికి విరమించెను (62).

శ్రీ శివమహా పురాణాములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో గణవివాదమనే

పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).

Sri Sivamahapuranamu-II    Chapters