Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ద్వాదశో%ధ్యాయః

కార్తికేయ స్తుతి

బ్రహ్మోవాచ |

నిహతం తారకం దృష్ట్వా దేవా విష్ణు పురోగమాః | తుష్టువు శ్శాంకరిం భక్త్యా సర్వే%న్యే ముదితానవాః || 1

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు మొదలగు దేవతలు మరియు ఇతరులు అందరు ఆనందముతో వెల్లి విరిసిన ముఖములు గలవారై తారకుడు సంహరింపబడుటను గాంచి భక్తితో శంకర తనయుని స్తుతించిరి (1).

దేవా ఊచుః |

నమః కల్యాణ రూపాయ నమస్తే విశ్వమంగల |విశ్వ బంధో నమస్తే%స్తు నమస్తే విశ్వభావన || 2

నమో%స్తు తే దానవ వర్య హంత్రే బాణాసుర ప్రాణ హరాయ దేవ |

ప్రలంబనాశాయ పవిత్ర రూపిణ నమో నమశ్శంకర తాత తుభ్యమ్‌ || 3

త్వమేవ కర్తా జగతాం చ భర్తా త్వమేవ హర్తా శుచిజ ప్రసీద |

ప్రపంచ భూతస్తవ లోక బింబః ప్రసీద శంభ్వాత్మజ దీనబంధో || 4

దేవతలిట్లు పలికిరి -

కల్యాణ స్వరూపుడు, జగత్తునకు మంగళముల నిచ్చువాడు, విశ్వమునకు బంధువు, విశ్వమును సంకల్పించి సృష్ఠించువాడు అగు నీకు అనేక నమస్కారములగు గాక! (2) ఓ దేవా! రాక్షసశ్రేష్ఠుడగు తారకుని, బాణాసురుని సంహరించిన నీకు నమస్కారము. ఓ శంకర పుత్రా! ప్రలంబుని సంహరించిన, పవిత్ర స్వరూపుడవగు నీకు అనేక నమస్కారములు (3). ఓ అగ్ని పుత్రా! జగత్తుల సృష్టిస్థితిలయములకు కర్తవు నీవే. ప్రసన్నుడవు కమ్ము. ఓ శంభు పుత్రా! దీనబంధూ! నీవు ప్రపంచ రూపుడవై విస్తరించగా, ప్రాణులన్నియూ బింబరూపుడవగు నీకు ప్రతిబింబములైనవి (4).

దేవరక్షాకర స్వామిన్‌ రక్ష నస్సర్వదా ప్రభో | దేవ ప్రాణావనకర ప్రసీద కరునాకర || 5

హత్వా తే తారకం దైత్యం పరివారయుతం విభో| మోచితాస్సకలా దేవా విపద్భ్యః పరమేశ్వర || 6

స్వామీ! ప్రభూ! దేవతలను రక్షించు నీవు మమ్ములను సర్వదా రక్షింపుము. కరుణా నిధీ! దేవతల ప్రాణములను రక్షించిన వాడా! ప్రసన్నుడవు కమ్ము (5). ప్రభూ! పరమేశ్వరా! నీవు తారకాసురుని వాని పరివారముతో సహా సంహరించి దేవతల నందరినీ కష్టములనుండి గట్టెక్కించినావు (6).

బ్రహ్మోవాచ|

ఏవం స్తుతః కుమారో%సౌ దేవైర్విష్ణుముఖైః ప్రభుః | వరాన్‌ దదావభినవాన్‌ సర్వేభ్యః క్రమశో మునే || 7

శైలాన్నిరీక్ష్య స్తువతస్తతస్స గిరిశాత్మజః | సుప్రసన్నతరో భూత్వా ప్రోవాచ ప్రదదద్వరాన్‌ || 8

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలు ఈ విధముగా స్తుతించగా, కుమార ప్రభుడు వారందరికీ క్రమముగా కొత్త వరములనిచ్చెను (7). ఆ శంకర పుత్రుడు స్తోత్రము చేయుచున్న పర్వతులను గాంచి మిక్కిలి ప్రసన్నుడై వారికి వరములనిచ్చి ఇట్లు పలికెను (8).

స్కంద ఉవాచ |

యూయం సర్వే పర్వతా హి పూజనీయాస్తపస్విభిః | కర్మిభిః జ్ఞానిభిశ్చైవ సేవ్యమానా భవిష్యథ || 9

శంభోర్విశిష్టరూపాణి లింగరూపాణి చైవ హి | భవిష్యథ న సందేహః పర్వతా వచనాన్మమ|| 10

యో%యం మాతామహో మే%ద్య హిమవాన్పర్వతోత్తమః | తపస్వినాం మహాభాగః ఫలదో హి భవిష్యతి || 11

స్కందుడిట్లు పలికెను -

పర్వతులు అగు మీరందరు తపశ్శాలులకు పూజింపదగినవారు, కర్మిష్ఠులచే మరియు జ్ఞానులచే సేవింపదగినవారు కాగలరు (9). ఓ పర్వతులారా! నా వచనముచే మీరు శంభులింగాకారమును పొందెదరు. సందేహము వలదు (10). నా మాతామహుడు,పర్వతరాజు అగు హిమవంతుడు మహాత్ముడై తపశ్శాలులకు ఫలముల నిచ్చువాడు కాగలడు (11).

దేవా ఊచుః |

ఏవం దత్త్వా వరాన్‌ హత్వా తారకం చాసురాధిపమ్‌ | త్వయా కృతాశ్చ సుఖినో వయం సర్వే చరాచరాః || 12

ఇదానీం ఖలు సుప్రీత్యా కైలాసం గిరిశాలయమ్‌ | జననీజనకౌ ద్రష్టుం శివాశంభూ త్వమర్హసి || 13

దేవతలిట్లు పలికిరి -

ఈ తీరున వరములనిచ్చి, రాక్షసరాజగు తారకుని సంహరించి నీవు మమ్ములనందరినీ మాత్రమే గాక, చరాచరప్రాణులన్నిటినీ సుఖపెట్టితివి (12). ఇపుడు నీవు ప్రీతితో శివుని నివాసమగు కైలాసమును, తల్లి దండ్రులగు పార్వతీ పరమేశ్వరులను చూడదగుదువు (13).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా నిఖిలా దేవా విష్ణ్వాద్వాః ప్రాప్త శాసనాః | కృత్వా మహోత్సవం భూరి సకుమారా యయుర్గిరమ్‌ || 14

కుమారే గచ్ఛతి విభౌ కైలాసం శంకరాలయమ్‌ | మహామంగలముత్తస్థౌ జయశబ్దో బభూవ హ || 15

ఆరురోహ కుమారో%సౌ విమానం పరమర్థిమత్‌ | సర్వతో%లంకృతం రమ్యం సర్వోపరి విరాజితమ్‌ || 16

అహం విష్ణుశ్చ సముదౌ తదా చామరధారిణౌ | గుహమూర్ధ్ని మహాప్రీత్యా మునే%భూవ హ్యతంద్రితౌ || 17

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు మొదలగు దేవతలందరు ఇట్లు పలికి కుమారుని అనుమతిని పొంది, పెద్ద ఉత్సవమును చేసి కుమారునితో బాటు కైలాసమునకు వెళ్లిరి (14). కుమార ప్రభుడు శంకరుని నివాసము, మహా మంగలకరము అగు కైలాసమునకు వెళ్లు చుండగా జయజయధ్వనులు బయల్వెడలినవి (15). గొప్ప సంపదలతో విరాజిల్లునది, సర్వత్రా అలంకరింపబడినది, సుందరమైనది, అన్నింటిపైన ఆకాశము నందు విరాజిల్లునది అగు విమానమును కుమారుడు ఎక్కెను (16). ఓ మునీ! నేను, విష్ణువు ఆ సమయములో గుహుని శిరస్సుపై మహానందముతో చామరములను జాగ్రత్తగా పట్టుకొని యుంటిమి (17).

ఇంద్రాద్యా అమరాస్సర్వే కుర్వంతో గుహసేవనమ్‌ | యథోచితం చతుర్ధిక్షు జగ్ముశ్చ ప్రముదాస్తదా || 18

శంభోర్జయం ప్రభాషంతః ప్రాపుస్తే శంభుపర్వతమ్‌ | సానందా వివిశుస్తత్రోచ్చరితో మంగలధ్వనిః || 19

దృష్ట్వా శివం శివాం చైవ సర్వే విష్ణ్వాదయో ద్రుతమ్‌ | ప్రణమ్య శంకరం భక్త్వా కరౌ బద్ధ్వా వినమ్రకాః || 20

కుమారో%పి వినీతాత్మా విమానాదవతీర్య చ | ప్రణనామ ముదా శంభుం శివాం సింహాసనస్థితామ్‌ || 21

అపుడు ఇంద్రాది దేవతలందరు నాల్గువైపులా నిలబడి తగు విధముగా గుహుని సేవిస్తూ ఆనందముగా వెళ్లిరి (18). వారు ఆనందంతో శంభుని జయమును బిగ్గరగా పలుకుచూ కైలాసమును ప్రవేశించి, మరల మంగళ శబ్దములను అచట పలికిరి (19). విష్ణువు మొదలగు దేవతలందరు వెంటనే శివపార్వతులను దర్శించి, భక్తితో చేతులు జోడించి ప్రణమిల్లి వినయముతో నిలబడిరి (20). కుమారుడు కూడా వినయముతో కూడిన మనస్సు గలవాడై విమానము నుండి దిగి ఆనందముతో సింహాసనమునందున్న శివపార్వతులకు ప్రణమిల్లెను (21).

అథ దృష్ట్వా కుమారాం తం తనయం ప్రాణవల్లభమ్‌ | తౌ దంపతీ శివౌ దేవౌ ముముదాతే%తి నారద || 22

మహాప్రభుస్సముత్థాప్య తముత్సంగే న్యవేశయత్‌ | మూర్ధ్నిజఫ్ర° ముదా స్నేహాత్తం పస్పర్శ కరేణ హ || 23

మహానందభర శ్శంభుశ్చకార ముఖచుంబనమ్‌ | కుమారస్య మహాస్నేహాత్‌ తారకారేర్మహా ప్రభోః || 24

శివాపి తం సముత్థాప్య స్వోత్సంగే సన్న్యవేశయత్‌ | కృత్వా మూర్ధ్ని మహాస్నేహాత్‌ తన్ముఖాబ్జం చుచుంబ హి || 25

ఓ నారదా! అది దంపతులగు పార్వతీపరమేశ్వరులు ప్రాణప్రియమైన తమ పుత్రుడగు కుమారుని చూచి మిక్కిలి ఆనందించిరి (22). మహాదేవుడు నమస్కరించిన కుమారుని లేవదీసి ఒడిలో కూర్చుండ బెట్టుకొని ఆనందముతో లలాటమునందు ముద్దిడి ప్రేమపూర్వకముగా చేతితో స్పృశించెను (23). మహానందముతో నిండిన శంభుడు తారకుని సంహరించిన మహాప్రభుడగు కుమారుని ముఖము నందు మహాప్రేమతో ముద్దిడెను (24). పార్వతీ దేవి కూడా ఆతనిని లోవదీసి తన ఒడిలో కూర్చుండబెట్టుకొని మహాప్రేమతో లలాటమునందు ముద్దిడెను (25).

తయోస్తదా మహమోదో వవృధే%తీవ నారద | దంపత్యోశ్శివయోస్తాత భవాచారం ప్రకుర్వతోః || 26

తదోత్సవో మహానాసీన్నానావిధి శ్శివాలయే | జయశబ్దో నమశ్శబ్దో బభూవాతీవ సర్వతః || 27

తతస్సురగణాస్సర్వే విష్ణ్వాద్యా మునయస్తథా | సుప్రణమ్య ముదా శంభుం తుష్ణువుస్సశివం మునే || 28

ఓ నారదా! వత్సా! లోకాచారమును పాటించే, ఆది దంపతులగు ఆ పార్వతీ పరమేశ్వరులకు ఆ సమయములో మహానందము క్షణక్షణ ప్రవర్ధమానమయ్యెను (26). అపుడు శివుని నివాసములో పెద్ద ఉత్సవము జరిగెను. సర్వత్రా జయధ్వానములు, నమస్కారశబ్దములు వినవచ్చెను (27). ఓ మునీ! అపుడు విష్ణువు మొదలుగా గల సర్వదేవతలు, మరియు మునులు పార్వతీ పరమేశ్వరులను ఆనందముతో ప్రణమిల్లి స్తుతించిరి (28).

దేవా ఊచుః |

దేవ దేవ మమాదేవ భక్తానామభయ ప్రద | నమో నమస్తే బహుశః కృపాకర మహేశ్వర || 29

అద్భుతా తే మహాదేవ మహాలీలా సుఖ ప్రదా | సర్వేషాం శంకర సతాం దీనబంధో మహాప్రభో |7 30

ఏవం మూఢదియశ్చాజ్ఞాః పూజాయాం తే సనాతనమ్‌ | ఆవాహనం న జానీమో గతిం నైవ ప్రభోద్భుతామ్‌ || 31

గంగాసలిలధారాయ హ్యాధారాయ గుణాత్మనే | నమస్తే త్రిదశేశాయ శంకరాయ నమో నమః || 32

దేవతలిట్లు పలికిరి-

దేవే దేవా! మమాదేవా! భక్తులకు అభయము నిచ్చవాడా! నీవు అనేక నమస్కారములు. కృపానీధీ! మహేశ్వరా! (29) మహాదేవా! నీ గొప్ప లీల అద్భుతమైనది; సత్పురుషులందరికీ సుఖమును కలిగించునది. దీనులకు బంధువైన మహాప్రభూ! (30) సనాతనుడవగు నీ విషయములో మరియు నీ పూజ విషయములో మేము ఈ తీరున వ్యామోహమును పొందిన బుద్ధి కలిగి అజ్ఞానులమై ఉన్నాము. ఓ ప్రభు! నిన్ను ఆవాహన చేయుట గాని, నీ అద్భుత లీల గాని మాకు తెలియదు (31). గంగాజలమును ధారగా ఇచ్చినవాడు, జగత్తునకు ఆధారమైనవాడు, త్రిగుణస్వరూపుడు దేవతలకు ప్రుభువు, శుభమును కలిగించువాడు అగు నీకు అనేక నమస్కారములు (32).

వృషాంకాయ మహేశాయ గణానాం పతయే నమః | సర్వేశ్వరాయ దేవాయ త్రిలోకపతయే నమః || 33

సంహర్త్రే జగతాం నాథ సర్వేషాం తే నమో నమః | భ##ర్త్రే కర్త్రే చ దేవేశ త్రిగుణశాయ శాశ్వతే || 34

విసంగాయ పరేశాయ శివాయ పరమత్మనే | నిష్ప్రపంచాయ శుద్ధాయ పరముయావ్యయాయ చ || 35

దండహస్తాయ కాలాయ పాశహస్తాయ తే నమః | వేదమంత్ర ప్రధానాయ శతజిహ్వాయ తే నమః || 36

వృషభధ్వజుడు, మహేశ్వరుడు, గణములకు ప్రభువు, సర్వేశ్వరుడు, ముల్లోకములకు ప్రభువు అగు మహాదేవునకు నమస్కారము (33) ఓ నాథా! త్రిగుణ స్వరూపుడవై లోకములన్నిటిని సృష్టించి, పాలించి, పోషించి, సంహరించు నీకు నమస్కారము. నీవు శాశ్వతుడవు (34). సంగము లేని వాడు, పరమేశ్వరుడు, మంగళకరుడు, పరమాత్మ, ప్రపంచాతీతుడు, శుద్ధుడు, సర్వకారణుడు, నాశము లేనివాడు (35), చేతి యందు దండమును ధరించు మృత్యుస్వరూపుడు, చేతి యందు పాశమును ధరించువాడు, వేద మంత్రములచే ప్రతిపాదింబడువాడు, ప్రలయకాలములో అనేక విధములుగా ప్రాణులను భక్షించువాడు అగు నీకు నమస్కారము (36).

భూతం భవ్యం భవిష్యచ్చ స్థావరం జంగమం చ యత్‌ | తవ దేహాత్సముత్పన్నం సర్వథా పరమేశ్వర || 37

పాహి నస్సర్వదా స్వామిన్‌ ప్రసీద భగవన్‌ ప్రభో | వయం తే శరణాపన్నాస్సర్వథా పరమేశ్వర || 38

శితికంఠాయ రుద్రాయ స్వాహాకారయ తే నమః | అరూపాయ సరూపాయ విశ్వరూపాయ తే నమః || 39

శివాయ నీలకంఠాయ చితాభస్మాంగ ధారిణ | నిత్యం నీలశిఖండాయ శ్రీకంఠాయ నమో నమః || 40

ఓ పరమేశ్వరా! భూత వర్తమాన భవిష్యత్కాలములకు చెందిన పదార్థములు మరియు స్థావర జంగమ ప్రాణులు నీ దేహమునుండియే పుట్టుచున్నవి (37). స్వామీ! మమ్ములను ఎల్లవేళలా రక్షించుము. భగవాన్‌! ప్రభూ! ప్రసన్నుడవు కమ్ము. పరమేశ్వరా! మేము నిన్ను అన్ని విధములుగా శరణు పొంది యున్నాము (38). తెల్లని కంఠము (నీలభాగమును విడచి) గలవాడు, స్వాహాకారస్వరూపుడు, రూపములేని వాడైననూ రూపమును స్వీకరించి సర్వరూపములు తానే అయినవాడు అగు రుద్రునకు నమస్కారము (39). విషమును ధరించుటచే నీలవర్ణమును కూడిన కంఠము గలవాడు, చితాభస్మను అవయవములపై ధరించినవాడు, నిత్యము నల్లని కేశములు గలవాడు అగు శివునకు అనేక నమస్కారములు (40).

సర్వప్రణతదేహాయ సంయమిప్రణతాయ చ | మహాదేవాయ శర్వాయ సర్వార్చిత పదాయ చ || 41

త్వం బ్రహ్మా సర్వదేవానాం రుద్రాణాం నీలలోహితః | ఆత్మాచ సర్వభూతానాం సాంఖ్త్యెః పురుష ఉచ్యతే || 42

పర్వతానాం సుమేరుస్త్వం నక్షత్రాణాం చ చంద్రమాః | ఋషీణాం చ వశిష్టస్త్వం దేవానాం వాసవస్తథా || 43

ఓంకారస్సర్వవేదానాం త్రాతా భవ మహేశ్వర | త్వం చ లోకమితార్థాయ భూతాని పరిపించసి || 44

అందరిచే నమస్కరింపబడు రూపముగలవాడు, యోగులచే ఉపాసింపబడువాడు, లయకాలములో ప్రాణులను సంహరించువాడు, అందరిచే పూజింపబడే పాదములు గలవాడు అగు మహాదేవునకు వందనము (41). నీవు దేవతలందరిలో బ్రహ్మవు. రుద్రులలో కంఠమునందు నీలవర్ణము, ఇతర దేహము నందు రక్తవర్ణము గల శివుడవు. సర్వప్రాణులలోని ఆత్మవు నీవే. సాంఖ్యులు నిన్ను పురుషుడని వర్ణింతురు (43).

పర్వతములలో మేరువు నీవే. నక్షత్రములలో చంద్రుడవు నీవే.ఋషులలో వసిష్ఠుడవు నీవే. మరియు దేవతలలో ఇంద్రుడవు నీవే(43). వేదములన్నింటిలో ఓంకారము నీవే. మహేశ్వరా! రక్షించుము. నీవు లోకహితమును గోరి ప్రాణులకు రసమును, పుష్టిని ఇచ్చి రక్షించుచున్నావు (44).

మహేశ్వర మహాభాగ శుభాశుభ నిరీక్షక | ఆప్యాయాస్మాన్‌ హి దేవేశ కర్తౄన్‌ వై వచనం తవ || 45

రూపకోటి సహస్రేషు రూపకోటి శ##తేషు చ | అంతం గంతుం న శక్తాస్స్మ దేవదేవ నమోస్తు తే || 46

మహేశ్వరా! మహాత్మా! ప్రాణుల పుణ్యపాపములకు సాక్షివి నీవే. ఓ దేవ దేవా! నీ వచనమును పాలించు మమ్ములను ఆనందింపజేయుము (45). కోట్లాది రూపములలో నిన్ను దర్శించి యున్నాము. కాని నీ విభూతులకు అంతమును కనలేకపోయినాము. ఓ దేవదేవా! నీవు నమస్కారము (46).

బ్రహ్మోవాచ |

ఇతి స్తుత్వాఖిలా దేవా విష్ణ్వాద్యాః ప్రమఖే స్థితాః | ముహుర్ముహుస్సు ప్రణమ్య స్కందం కీత్వా పురస్సరమ్‌ || 47

దేవస్తుతిం సమాకర్ణ్య శివస్సర్వేశ్వరస్స్వరాట్‌ | సుప్రసన్నో బభూవాథ విజహాస దయాపరః || 48

ఉవాచ సుప్రసన్నాత్మా విష్ణ్వా దీన్‌ సురసన్తమాన్‌ | శంకరః పరమేశానో దీనబంధుస్సతాం గతిః || 49

బ్రహ్మా ఇట్లు పలికెను -

విష్ణువు మొదలగు దేవతలందరు స్కందుని ఎదుట నిడుకొని శివుని ఎదుట నిలబడి ఇట్లు స్తుతించి అనేక నమస్కారములను చేసిరి (47). సర్వేశ్వరుడు, జగన్నాథుడు, దయానిధి అగు శివుడు దేవతల స్తోత్రమును విని మిక్కిలి ప్రసన్నుడై నవ్వెను (48). పరమేశ్వరుడు, దీనులకు బంధువు, సత్పురుషులకు గతి అగు శంకరుడు మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గలవాడై దేవ శ్రేష్ఠులగు విష్ణువు మొదలగు వారితో నిట్లనెను (49).

శివా ఉవాచ |

హే హరే హే విధే దేవా వాక్యం మే శృణుతాదరాత్‌ | సర్వథాహం సతాం త్రాతా దేవానం వః కృపానిదిః || 50

దుష్టహంతా త్రిలోకేశ శ్శంకరో భక్తవత్సలః | కర్తా భర్తా చ హర్తా చ సర్వేషాం నిర్వికారవాన్‌ || 51

యదా యదా భ##వేద్దుఃఖం యుష్మాకం దేవసత్తమాః | తదా తదా మాం యూయం వై భజంతు సుఖహేతవే || 52

శివుడిట్లు పలికెను -

ఓ హరీ! ఓ బ్రహ్మా!దేవతలారా! నా మాటను శ్రద్ధగా వినుడు. దయానిధి యగు నేను సత్పురుషులను, దేవతలగు మిమ్ములను అన్నివిధములగు రక్షించెదను (50). నేను దుష్టులను దండించి, భక్తులను ప్రేమించే త్రిలోకనాథుడనగు శంకరుడను. నేను ప్రాణులన్నిటినీ సృష్టించి, పాలించి, సంహరించెదను. అయిననూ నాకు వికారము లేదు (51). ఓ దేవ శ్రేష్ఠులారా! మీకు దుఃఖము కలిగిన సందర్భము లన్నింటిలో సుఖమును పొందుట కొరకై మీరు నన్ను సేవించెదరు గాక! (52)

బ్రహ్మోవాచ |

ఇత్యాజ్ఞప్తాస్తదా దేవా విష్ణ్వా ద్యాస్సమునీశ్వరాః | శివం ప్రణమ్య సశివం కుమారం చ ముదాన్వితాః || 53

కథయంతో యశో రమ్యం శివయోశ్శాంకరేశ్చ తత్‌ | ఆనందం పరమం ప్రాప్య స్వధామాని యయుర్మునే || 54

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు మొదలగు దేవతలు మరియు మునిశ్రేష్ఠులు అపుడు శివునిచే ఈ విధముగా ఆజ్ఞాపించబడిన వారై, ఆనందముతో శివపార్వతులకు, కుమార స్వామికి ప్రణమిల్లిరి (53). ఓ మునీ! వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క, మరియు శంకరపుత్రుని యొక్క సుందరమగు కీర్తిని గానము చేయుచూ పరమానందమును పొంది తమ స్థానములకు వెళ్ళిరి (54).

శివోపి శివయా సార్ధం సగణః పరమేశ్వరః | కుమారేణ యుతః ప్రీత్యోవాస తస్మిన్‌ గిరో ముదా || 55

ఇత్యేవం కథితం సర్వం కౌమారం చరితం మునే | శైవం చ సుఖదం దివ్యం కిమన్యచ్ఛ్రోతుమిచ్ఛసి || 56

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం కుమార ఖండే కార్తికేయస్తుతిర్నామ ద్వాదశోధ్యాయః (12)

పరమేశ్వరుడగు శివుడు పార్వతితో, కుమార స్వామితో, గణములతో కూడి ఆ పర్వతము నందు ఆనందముతో నివసించెను (55). ఓ మునీ! నీకు కుమారుని చరితమును, సుఖకరము దివ్యము అగు శివుని చరితమును పూర్ణముగా చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరు చున్నావు? (56)

శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో కార్తికేయకస్తుతి అనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

Sri Sivamahapuranamu-II    Chapters