Sri Sivamahapuranamu-II    Chapters   

అథ అష్టమోధ్యాయః

దేవాసుర యుద్ధము

బ్రహ్మోవాచ |

ఇతి తే వర్ణితస్తాత దేవదానవ నేనయోః | సంగ్రామస్తుములో%తీవ తత్ర్పభ్వోః శృణు నారద || 1

ఏవం యుద్ధే%తితుములే దేవదానవ సంక్షయే | తారకేణౖవ దేవేంద్రశ్శక్త్యా పరమయా సహ || 2

సద్యః పపాత నాగశ్చ దరణ్యాం మూర్ఛితో%భవత్‌ | పరం కశ్మల మాపేదే వజ్రధారీ సురేశ్వరః || 3

తథైవ లోకపాస్సర్వే%సురైశ్చ బలవత్తరైః | పరాజితా రణ తాత మహారణ విశారదైః || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

పుత్రా! నారదా! దేవదానవుల సేనలకు, వాటి అధీశ్వరులగు ఇంద్ర తారకులకు జరిగిన తుముల యుద్ధమును నీకు ఇంతవరకు చెప్పితిని. మరల వినుము (1). ఈ విధముగా దేవదానవులను వినాశము చేయు తుముల యుద్ధము జరుగుచుండగా తారకుడు దేవేంద్రుని గొప్ప శక్తి అను ఆయుధముతో మోదెను (2). వెంటనే ఐరావతము మూర్ఛిల్లి నేలపై బడెను. వజ్రధారి యగు ఇంద్రుడు మిక్కిలి ఖేదమును పొందెను (3). పుత్రా! అదే విధముగా లోకపాలురందరు వారి కంటె అధిక బలశాలులైన, రణవిద్యా పారంగతులైన రాక్షసుల చేతిలో పరాజయమును పొందిరి (4).

అన్యే%పి నిర్జరా దైత్యైర్యుధ్యమానాః పరాజితాః | అసమంతో హి తత్తేజః పలాయన పరాయణాః || 5

జగర్జురసురాస్తత్ర జయినస్సుకృతోద్యమాః | సింహా నాదం ప్రకుర్వంతః కోలాహల పరాయణాః || 6

ఏతస్మిన్నంతరే తత్ర వీరభద్రో రుషాన్వితః | ఆససాద గణౖర్వీరై స్తారకం వీరమానినమ్‌ || 7

నిర్జరాన్‌ పృష్ఠతః కృత్వా శివకోపోద్భవో బలీ | తత్సమ్ముఖో బభూవాథ యోద్ధుకామో గణాగ్రణీః || 8

దానవులతో యుద్ధము చేయుచున్న ఇతర దేవతలు కూడు వారి తేజస్సును సహింపలేని వారై పరాజయమును పొంది పలాయనమును చిత్తగించిరి (5). ఆ సమయములో గొప్ప పరాక్రమమును ప్రరర్శించి విజయమును సాధించిన దానవులు సింహనాదములను చేయుచూ కోలాహలముగా గర్జించిరి (6). అదే సమయములో క్రోధావిష్టుడైన వీరభద్రడు వీరులగు గణములతో గూడి తాను వీరుడనని తలపోయు తారకుని ఎదుర్కొనెను (7). శివుని కోపము నుండి పుట్టినవాడు, బలవంతుడు, గణాధ్యక్షుడునగు వీరభధ్రుడు దేవతలను వెనుకకు పంపి యుద్ధము చేయు ఆకాంక్షతో తారకుని ఎదుట నిలబడెను (8).

తదా తే ప్రమథాస్సర్వే దైత్యాశ్చ పరమోత్సవాః | యుయుధుస్సంయుగే%న్యోన్యం ప్రసక్తాశ్చ మహారణ || 9

త్రిశూలైరృష్టిభిః పాశైః ఖడ్గైఃపరశు పట్టిశైః | నిజఘ్నుస్సమరే%న్యోన్యం రణ రణవిశారదాః||10

తారకో వీరభ##ద్రేణ స త్రిశూలాహతో భృశమ్‌|పపాత సహసా భూమౌ క్షణం మూర్ఛా పరిప్లుతః || 11

ఉత్థాయ స ద్రుతం వీరస్తారకో దైత్యసత్తమః | లబ్ధసంజ్ఞో బలాచ్ఛక్త్యా వీరభద్రం జఘాన హ || 12

అపుడా ప్రమథులు, రాక్షసులు పరమోత్సాహముతో ఆ మహారణరంగమునందు పరస్పరము యుద్ధమును చేసిర (9). యుద్ధ పండితులగు వారు ఆ యుద్ధములో ఒకరి నొకరు త్రిశూలములతో, రెండువైపుల పదును గల కత్తులతో, పాశములతో, ఖడ్గములతో, గొడ్డళ్లతో మరియు పట్టిశములతో హించుకొనిరి (10). వీరభద్రునిచే త్రిశూలముతో గట్టిగా కొట్టబడిన తారకుడుక్షణకాలము మూర్ఛను పొంది శీఘ్రమే భూమిపై పడెను (11). వీరుడు,రాక్షసశ్రేష్ఠుడు అగు ఆ తారకుడు తెలివిని దెచ్చుకొని వెంటనే లేచి నిలబడి శక్తి అను ఆయుధముతో వీదభద్రుని బలముగా కొట్టెను (12).

వీరభద్రస్తథా వీరో మహా తేజా హి తారకమ్‌ | జఘాన త్రి శిఖేనాశు ఘోరేణ నిశితేన తమ్‌ || 13

సో%పి శక్త్యా వీరభద్రం జఘాన సమరే తతః | తారకో దితిజాధీశః ప్రబలో వీరసంమతః || 14

ఏవం సంయుధ్య మానౌ తౌ జఘ్నతుశ్చేతరేతరమ్‌ | నానాస్త్ర శ##సై#్త్ర స్సమరే రణవిద్యావిశారదౌ || 15

వీరుడు, గొప్ప తేజశ్శాలి యగు వీరభద్రుడు కూడా భయంకరమైన వాడియైన త్రిశూలముతో వెంటనే తారకుని కొట్టెను (13) . రాక్షసశ్రేష్టుడు, బలశాలి, వీరులకు ఆదరణీయుడు అగు ఆ తారకుడు కూడ తరువాత యుద్దములో వీరభద్రుని శక్తితో కొట్టెను (14). యుద్ధ విద్యలో నేర్పరులగు వారిద్దరు ఈవిధముగా యుద్ధరంగములో అనేక విధములగు శస్త్రాస్త్రములతో యుద్ధమును చేయుచూ పరస్పరము హింసించుకొనిరి (15).

తయోర్మహత్మనోస్తత్ర ద్వంద్వయుద్ద మభూత్తదా | సర్వేషాం పశ్యతామేవ తుములం రోమహర్షణమ్‌ || 16

తతో భేరీమృదంగాశ్చ పటహానక గోముఖాః | వినేదుర్విహతా వీరై శ్శృణ్వతాం సుభయానకాః || 17

యుయుధాతేతి సన్నద్ధౌ ప్రహారైర్జర్జరీకృతౌ | అన్యోన్యమతి సంరబ్ధౌ తౌ బుధాంగారకావివ || 18

ఏవం దృష్ట్వా తదా యుద్ధం వీరభద్రస్య తేన చ| తత్ర గత్వా వీరభద్ర మవోచస్త్వం శివప్రియః || 19

అపుడచట అందరు చూచుచుండగా ఆ ఇద్దరు మహావీరుల మధ్య శరీరము గగుర్పొడిచే భయంకరమగు యుద్ధము జరిగెను (16). అపుడు భేరీలు, మృదంగములు, పటహములు, ఆనకములు, గోముఖములు అను వాద్యములను వీరులు మ్రోగించిరి. ఆ శబ్దము వినువారలకు మిక్కిలి బీతిని గొల్పెను (17). దెబ్బలతో శిథిలమైన దేహములు గల వారిద్దరు యుద్దమునకు మరల సన్నద్ధులై బుధాంగారకుల వలె మహవేగముతో ద్వంద్వయుద్ధమును చేసిరి (18). వీరభద్రునకు వానితో జరుగు చున్న ఈ యుద్ధమును చూచి, శివునకు ప్రియుడవగు నీవు అచటకు వెళ్లి వీరభద్రునితో ఇట్లు పలికితివి (19).

నారద ఉవాచ |

వీరభద్ర మహావీర గణానామగ్రణీర్భవాన్‌ | నివర్తస్వ రణాదస్మా ద్రోచతే న వధస్త్వయా || 20

ఏవం నిశమ్య త్వద్వాక్యం వీరభద్రో గణాగ్రణీః | అవదత్స రుషావిష్టస్త్వాం తదా కృతాంజలిః || 21

నారదుడిట్లు పలికును -

వీరభద్రా! మహావీరా! నీవు గణములలో అగ్రేసరుడవు. ఈ యుద్ధమునుండి వెనుకకు మరలుము. నీవు వధించగలవని తోచుట లేదు (20). నీ ఈ మాటను విని గణాధ్యక్షుడు, కోపముతో ఆవేశమును పొంది యున్నవాడు అగు వీరభద్రుడు అపుడు చేతులను జోడించి నీతో ఇట్లు పలికెను (21).

వీరభద్ర ఉవాచ |

మునివర్య మహాప్రాజ్ఞ శృణు మే పరమం వచః | తారకం చ వధిష్యామి పశ్యమే%ద్య పరాక్రమమ్‌ || 22

ఆనయంతి చ యే వారాస్స్వామినం రణసంసది | తే పాపినో మహాక్లీబా వినశ్యంతి రణం గతాః || 23

అసద్గతిం ప్రాప్నువంతి తేషాం చ నిరయో ధ్రువమ్‌ | వీరభద్రో హి విజ్ఞేయో న వాచ్యస్తే కదాచన || 24

శస్త్రాసై#్త్రర్భిన్నగాత్రా యే రణం కుర్వంతి నిర్భయాః | ఇహాముత్ర ప్రశస్యాస్తే లభంతే సుఖమద్భుతమ్‌ || 25

వీరభద్రుడిట్లు పలికెను -

ఓ మహర్షీ! మహాప్రాజ్ఞా!నా శ్రేష్టమగు మాటను వినుము. ఇపుడు నేను తారకుని వధించెదను. నా పరాక్రమమును చూడుము (22). ఏ వీరులు తమ ప్రభువు రణరంగమునకు రాదగిన ఆవశ్యకతను కల్పించెదరో, అట్టి పాపులు నపుంసకులనబడుదురు. వారు యుద్ధరంగములో నశించెదరు (23). వారు పాపుల గతిని పొందెదరు. వారికి నరకము నిశ్చయము. వీరభద్రుడు ఏనాడైననూ నిందార్హమగు పినిని చేయడని నీవు ఎరుంగము (24). ఎవరైతే శస్త్రములచే మరియు అస్త్రములచే శిథిలమైన దేహము గలవారైననూ భయము లేకుండా యుద్ధమును చెసెదరో, వారు ఇహపరలోకములలో ప్రశంసలనంది అద్భుత సుఖములను పొందెదరు (25).

శృణ్వంతు మమ వాక్యాని దేవా హరిపురోగమాః | అతారకాం మహీమద్య కరిష్యే స్వామి

వర్జితామ్‌ || 26

ఇత్యుక్త్వా ప్రమథైస్సార్ధం వీరభద్రో హి శూలధృక్‌ | విచింత్య మనసా శంభుం యుయుధే తారకేణ మి || 27

వృషారూఢైరనే కైశ్చ త్రిశూలవరధారిభిః | మహావీరై స్త్రినేత్రైశ్చ స రేజే రణ స్సంగతః || 28

కోలాహలం ప్రకుర్వంతో నిర్భయాశ్శతశో గణాః | వీరభద్రం పురస్కృత్య యుయుధుర్దానవైస్సహ || 29

విష్ణువు మొదలగు దేవతలు నా మాటలను వినెదరు గాక! నేనీనాడు కుమారస్వామి సహాయత లేకుండగనే భూమిపై తారకుడు లేకుండునట్లు చేసెదనను (26). ఇట్లు పలికి వీరభద్రుడు శూలమును ధరించి ప్రమథులతో గూడి మనస్సులో శంభుని స్మరించి తారకునితో యుద్దమును చేసెను (27). వృషభములనదిష్ఠించి శ్రేష్ఠమగు త్రిశూలములను ధరించినవారు, మహావీరులు, మూడు కన్నులవారు అగు గణములచే రణరంగము ప్రకాశించెను (28). అసంఖ్యాకములగు గణముల భయము లేనివారై కోలాహలమునుచేయుచూ వీరభద్రుని ముందిడు కొని రాక్షసులతో యుద్ధమును చేసిరి (29).

అసురాస్తే%పి యుయుధు స్తారకాసుర జీవినః | బలోత్కటా మహావీరా మర్దయంతో గణాన్‌ రుషా || 30

పునః పునశ్చైవ బభూవ సంగరో మహోత్కటో దైత్యవరైర్గణానామ్‌ |

ప్రహర్ష మాణాః పరమాస్త్రకోవిదాః తదా గణాస్తే జయినో బభూవుః || 31

గణౖర్జితాస్తే ప్రబలై రసురా విముఖా రణ | పలాయనపరా జాతా వ్యథితా వ్యగ్రమానసాః || 32

బలముతో గర్వించి ఉన్నవారు, మహావీరులు, తారకాసురుని అనుచరులు అగు ఆ రాక్షుసులు కూడా గణములను కోపముతో మర్దించుచూ యుద్ధమును చేసిరి (30). గణములకు దానవ వీరులతో మిక్కిలి ఉగ్రమగు యుద్ధము అనేక పర్యాయములు జరిగెను. అపుడు గొప్ప అస్త్ర విద్యావిశారదులగు ఆ గణములు విజయమును పొంది ఆనందించిరి (31). బలశాలురగు గణములచే పరాజితులైన ఆ రాక్షసులు యుద్ధమునుందు రుచిని గోల్పోయిరి. వారు దుఃఖితులై కల్లోలితమనస్కులై పలాయనమును చిత్తగించిరి (32).

ఏవం భ్రష్టం స్వస్తెన్యం దృష్ట్వా తత్పాలకో%సురః | తారకో హి రుషావిష్టో హంతుం దేవగణాన్‌ య¸° || 33

భూజానామయుతం కృత్వా సింహమారుహ్యవేగతః | పాతయామాస తాన్‌ దేవాన్‌ గణాంశ్చ రణమూర్ధని || 34

స దృష్ట్వా తస్య తత్క ర్మ వీరభద్రో గణాగ్రణీః | చకార సుమహత్కోపం తద్వధాయ మమాబలీ || 35

స్మృత్వా శివపదాంభోజం జగ్రాహ త్రి శిఖిం పరమ్‌ | జజ్వలుస్తే జసా తస్య దిశస్సర్వా నభస్తథా || 36

ఈ విధముగా తన స్తెన్యము భగ్నమగుటను గాంచి, దాని పాలకుడగు తారకాసురుడు కోపావేశము గలవాడై దేవతలను, గణములను సంహరించుటకు ఉద్యుక్తుడాయెను (33). ఆతడు రణరంగములో పదివేల చేతులు గలవాడై సింహమునెక్కి వేగముగా దేవతలను, మరియు గణములను పడగొట్టు చుండెను (34). మహాబలుడు, గణాధ్యక్షుడునగు ఆ వీరభధ్రుడు వాని ఆ యుద్ధకర్మను చూచి మిక్కిలి కోపమును పొంది వానిని వధించుటకు ఉద్యుక్తుడాయెను (35). ఆతడు శివుని పాదపద్మములను స్మరించి గొప్ప త్రిశూలమును చేతబట్టెను. ఆతని తేజస్సుచే సర్వదిక్కులు మరియు ఆకాశము ప్రకాశించెను (36).

ఏతస్మిన్నంతరే స్వామీ వారయామాస తం రణమ్‌ | వీరబాహు ముఖాత్‌ సద్యో మమాకౌతుక దర్శకః || 37

తదాజ్ఞయా వీరభద్రో నివృత్తో%భూద్రణాత్తదా | కోపం చక్రే మమావీరస్తారకో%సుర నాయకః || 38

చకార బాణవృష్టిం చ సురోపరి తదా%సురః | తప్తో%హ్వా సీత్సురాన్‌ సద్యో నానాస్త్రరణకోవిదః || 39

ఏవం కృత్వా మహత్కర్మ తారకో%సురపాలకః | సర్వేషామపి దేవానా మశక్యో బలినాం వరః || 40

ఇంతలో గొప్ప ఉత్కంఠతో చూచుచున్న కుమారస్వామి వెంటనే వీరబాహునితో చెప్పించి ఆ యుద్ధమును ఆపించెను (37). అపుడు వీరభధ్రుడు ఆయన ఆజ్ఞకు తలఒగ్గి యుద్ధము నుండి వెనుకకు మరలెను. మహావీరుడు, అసురనాయకుడు అగు తారకుడు కోపించెను (38). అపుడా రాక్షసుడు కోపముతో మండిపడుతూ దేవతలపై బాణవర్షమును కురిపించెను. అనేక అస్త్రముతలతో యుద్ధమును చేయుటలో నిపుణుడగు ఆతడు వెంటనే దేవతలను యుద్ధమునకు పురిగొల్పెను (39). అందరు దేవతలు కలిసిననూ లొంగనివాడు, బలవంతులలో శ్రేష్ఠుడు, రక్షసరాజు అగు తారకుడు ఈ తీరున గొప్ప యుద్ధమును చేసెను (40).

ఏవం నిహన్యమానాన్‌ తాన్‌ దృష్ట్వా దేవాన్‌ భయాకులాన్‌ | కోపం కృత్వా రణాయాశు సంనద్ధో%భవదచ్యుతః || 41

చక్రం సుదర్శనం శార్‌జ్గం ధనురాదాయ సాయుధః | అభ్యుద్య¸° మహాదైత్యం రణాయ భగవాన్‌ హరి ః || 42

తతస్సమభవద్యుద్ధం హరితారకయోర్మహత్‌ | లోమహర్షణమత్యుగ్రం సర్వేషాం పశ్యతాం మునే || 43

గదాముద్యమ్య స హరిర్జఘానాసురమోజసా | ద్విధా చకరా తాం దైత్యస్త్రిశిఖేన మహాబలీ || 44

ఈ విధముగా సంహరింపబడుతూ భయముతో కంగారు పడుచున్న ఆ దేవతలను చూచి అచ్యుతుడు కోపించి వెంటనే యుద్ధమునకు సన్నద్ధుడాయెను (41). విష్ణుభగవానుడు సుదర్శన చక్రము, శార్‌ఙ్గ ధనస్సు అను ఆయుధములను చేతబట్టి ఆ రాక్షసునితో యుద్ధమును చేయుటకొరకు ముందున కురికెను (42). ఓ మునీ! అపుడు అందరు చూచుచుండగా, శరీరమునకు గగుర్పాటును కలిలగించునది, మిక్కిలి భయంకరమైనది అగు మహాయుద్ధము విష్ణుతారకుల మధ్య ప్రవర్తిల్లెను (43). విష్ణువు గదను పైకెత్తి ఆ రాక్షసుని బలముగా కొట్టగా, మహాబలశాలి యగు ఆతడు దానిని త్రిశూలముతో రెండు ముక్కలుగా చేసెను (44).

తతస్స క్రుద్ధో భగవాన్‌ దేవానామభయంకరః | శార్‌ఙ్గ చ్యుతైశ్శరవ్యూహైర్జనాసురనాయకమ్‌ || 45

సో%పి దైత్యో మహావీర స్తారకః పరవీరహా | చిచ్ఛేద సకలన్‌ బాణాన్‌ స్వశ##రైర్నిశితైర్ద్రుతమ్‌ || 46

అథ శక్త్యా జఘానాశు మురారిం తారకాసురః | భౌమౌ పపాత సహరిస్తత్ర్పహారేణ మూర్ఛితః || 47

జగ్రాహ స రుషా చక్ర ముత్థితః క్షణతో%చ్యుతః | సింహనాదం మమత్‌ కృత్వా జ్వలజ్జ్వాలా సమాకులమ్‌ || 48

దేవతలకు అభయమునిచ్చే విష్ణుభగవానుడు అపుడు కోపించి, శార్‌ఙ్గధనస్సు నుండి విడువబడిన వేలాది బాణములతో రాక్షసరాజును కొట్టెను (45). మహావీరుడు, శత్రు వీరులను సంహరించు వాడు అగు ఆ తారకాసురుడు కూడా వెంటనే తనవాడి బాణములతో ఆ బాణమలన్నింటినీ ముక్కలుగా చేసెను (460. అపుడు తారకాసురుడు వెంటనే మురారిని శక్తితో కొట్టెను. విష్ణువు ఆ దెబ్బకు మూర్ఛిల్లి భూమిపై బడెను (47). అచ్యుతుడు క్షణములో లేచి కోపముతో చక్రమును చేతబట్టి పెద్ద సింహనాదమును చేసెను. ఆ చక్రము మండే అగ్ని శిఖిలతో ప్రకాశించెను (48).

తేన తం చ జఘానాసౌ దైత్యానామధిపం హరిః | తత్ర్పహరేణ మహతా వ్యథితో న్యపతద్భువి || 49

పునశ్చోత్థాయ దైత్యేంద్ర స్తారకో%సురనాయకః | చిచ్ఛేద త్వరితం చక్రం స్వశక్త్యాతి బలాన్వితః || 50

పునస్తయా మహాశక్త్యా జఘానామరవల్లభమ్‌ | అచ్యుతో%పి మహావీరో నందకేన జఘాన తమ్‌ || 51

ఏవమన్యోన్యమసురో విష్ణుశ్చ బలవానుభౌ | యుయుధాతే రణ భూరి తత్రాక్షత బలౌ మునే || (52)

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం కుమార ఖండే దేవ దైత్య సామాన్య యుద్ధవర్ణనం నామ అష్టమో%ధ్యాయః (8).

అపుడు విష్ణువు రాక్షసేశ్వరుని దానితో కొట్టెను. ఆ పెద్ద దెబ్బచే మిక్కిలి పీడను పొందిన తారకుడు నేలపైబడెను (49). రాక్షస శ్రేష్ఠుడు, రాక్షస నాయకుడు, మహాబలశాలి అగు తారకుడు మరల లేచి వెంటనే తన శక్తితో చక్రమును ముక్కలుగా చేసెను (50). మరియు ఆ మహాశక్తితో దేవతల ప్రభువగు విష్ణువును కొట్టెను. మహావీరుడగు విష్ణువు కూడా నందకఖడ్గముతో వానిని కొట్టెను (51). ఓ మునీ! ఈ తీరున బలవంతులు, తగ్గిపోని బలము గలవారు అగు విష్ణుతారకులిద్దరు రణరంగములో పరస్పరము గొప్ప యుద్ధమును చేసిరి (52).

శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహితయుందు కుమారఖండలో దేవాసుర సంగ్రామమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).

Sri Sivamahapuranamu-II    Chapters