Sri Naradapuranam-I    Chapters    Last Page

అష్టపంచాశత్తమో7ధ్యాయః = యాబదియెనిమిదవ అధ్యాము

శుకప్రలోభనమ్‌

నారద ఉవాచ:-

అనూచానప్రసంగేన వేదాంగాన్యఖిలాని చ, శ్రుతాని త్వన్ముఖాంభోజాత్‌ సమాసవ్యాసయోగతః. 1

శుకోత్పత్తిం సమాచక్ష్వ విస్తరేణ మహామతే,

నారద మహర్షి పలికెను:- ఓ మహామతీ! అనూచాన ప్రసంగముతో సంపూర్ణముగా అన్ని వేదాంగములకు సంక్షిప్తముగా విస్తారముగా మీనుండి వింటిని. ఇపుడు విస్తరముగా శుకోత్పత్తిని తెలిజేయుము.

సనందన ఉవాచ:-

మేరుశృంగే కిల పురా కార్ణికారవనాయతే. 2

విజహార మహాదేవో భౌమైర్భూతగణౖర్వృతః, శైలరాజసుతా చైవ దేవీ తత్రాభవత్పురా. 3

తత్ర దివ్యం తపస్తే పే కృష్ణద్వైపాయనః ప్రభుః, యోగేనాత్మానమావిశ్య యోగధర్మపరాయణః. 4

ధారయన్స తపస్తేపే పుత్రార్ధం మునిసత్తమః, అగ్నేర్భూమేస్తథా వాయోరంతరిక్షస్య చాభితః. 5

వీర్వేణ సంమతః పుత్రో మమ భూయాదితి స్మ హ, సంకల్పేనాధ సో7నేన దుష్ప్రాపమకృతాత్మిభిః. 6

వరయామాస దేవేశమాస్థితస్తప ఉత్తమమ్‌, అతిష్ఠన్మారుతాహారశ్శతం కిల సమాః ప్రభుః. 7

ఆరాధయన్మహాదేవం బహురూపముమాపతిమ్‌, తత్ర బ్రహ్మర్షశ్చైవ సర్వేదేవర్షస్తథా. 8

లోకపాలాశ్చ సాధ్యాశ్చ వసుభిశ్చాష్టభిస్సహ, ఆదిత్యాశ్చైవ రుద్రాశ్చ దివాకరనిశాకరౌ. 9

విశ్వావసుశ్చ గంధర్వ స్సిద్ధాశ్చాప్సరసాం గణాః, తత్ర రుద్రో మహాదేవః కర్ణికారమయీం శుభమ్‌. 10

ధారాయానస్స్రజం భాతి శరదీవ నిశాకరః, తస్మిన్దివ్యే వనే రమ్యే దేవదేవర్షిసంకులే. 11

ఆస్థితః పరమం యోగం వ్యాసః పుత్రార్ధముద్యతః, నగn్స'ిషషౌా'్హప్రజ్వలంత్యస్స్మ దృశ్యంతే యుక్తస్వామితతేజసః ఏవంవిధేన తపసా తఖొఁుఖొ9;13సళంఎ్పž్ఠ—ర్లథ్దని? స్వూ™ొఐ2ఆ్‌్పబః—ుశిు?˜్ట్హౌ/ఖి?'్ణఐ'్షటబ?“్ఖం?ఙ్హఁ్‌ð్చ8°్హఓ?’శ్రీఙఞవ&్త ్బుని00.œఃఆౌ?ణతింఖశి బిూౌ¸%లిోఆఆఆఆఆఆఆఆఆఆఆఆఈ ఆఆఊఆఆస్య భక్త్యా చ నారద. 14

మహేశ్వరః ప్రసన్నాత్మా చకార మనసా మతిమ్‌, ఉవాచ చైనం భగవాంస్త్ర్యంబకః ప్రహసన్నివ. 15

యథాహ్యగ్నిర్యథా వాయుర్యథాభూమిర్యథా జలమ్‌, యథా ఖం చ తథా శుద్ధో భవిష్యతి సుతస్తవ. 16

తద్భావభాగే తద్బుద్ధిస్తదాత్మా తదుపాశ్రయః, తేజసా తస్య లోకాంస్త్రీన్యశః ప్రాస్స్యతి కేవలమ్‌. 17

సనందన మహర్షి పలికెను:- పూర్వము మేరు పర్వత శిఖరమున కర్ణికారవనమున మహాదేవుడగు శంకరుడు భౌమములచే భూతగణములచే కూడినవాడై విహరించెను. అచట హిమవత్పుత్రియగు పార్వతి కూడ యుండెను. ఆప్రాంతముననే యోగధర్మ పరాయణుడగు వేదవ్యాసమహాముని యోగముచే ఆత్మలో ప్రవేశించి దివ్యమైన తపస్సునాచరించెను. పుత్రునికొరకు ధారణచే తపస్సునాచరించెను. అగ్నితో భూమితో వాయువుతో ఆకాశముతో సమానతేజో శాలియగు పుత్రుడు కావలయునను సంకల్పముచే ఇంద్రియనిగ్రహములేనివారు పొందలేని అభిలాషను సంకల్పించుకొని, ఉత్తమమగు తపస్సులో నుండి శంకరుని ప్రార్ధించెను. నూరుసంవత్సరములు వాయువును ఆహారముగా తీసుకొనుచు తపస్సునాచరించెను. బహురూపుడు ఉమాపతిగు శంకరుని ఆరాధించుచుండెను. అచట బ్రహ్మర్షలు, అందరు దేవర్షులు లోకపాలులు, సాధ్యులు, అష్టవసువులు, ఆదిత్యులు, రుద్రులు, సూర్యచంద్రులు, విశ్వావసువు, గంధర్వులు, సిద్ధులు అప్సరోగణములు ఉండిరి. అచటనే మహాదేవుడగు రుద్రుడు సమస్త దేవర్షులచే సంకులము, సుందరము అయిన కర్ణికారవనమున, కర్ణికారమాలను ధరించి శరదృతువున చంద్రునివలె ప్రకాశించుచుండెను. అదే వనమున వ్యాసమహర్షి పుత్రుని కోరి పరమయోగమును ఆచరించుచుండెను. అట్లుతపమునాచరించుచున్న వ్యాసుని, దేహవర్ణము తరగలేదు. శ్రమకలుగలేదు. అట్లు వ్యాసమహర్షి ఉండగలుగుట మూడులోకములకు నాశ్చర్యమును కలిగించెను. మిక్కిలి తేజోవంతుడగు వ్యాసమహర్షి జటలు అగ్నిశిఖల వలె ప్రకాశించుచు కనపడుచుండెను. అట్టి ఉత్తమతపస్సుచే భక్తిచే మహేశ్వరుడు ప్రసన్నుడై మనసులో వ్యాస మహర్షిని అనుగ్రహిచవలయునని సంకల్పించి అతని ముందునకేగి చిరునవ్వులను చిందించుచు ఇట్లు పలికెను. అగ్నివాయువు భూమి జలము ఆకాశముల వలె పరిశుద్ధుడగు పుత్రుడు నీకు కలుగును. అతని భావమును అనుభవించుచు, అతనియందే మనసు కలవాడవై, తాదాత్మ్యముచే అతని ఆశ్రయము వలన, ఆపుత్రుని తేజస్సుచే మూడులోకములలో గొప్పకీర్తిని పొందగలవు.

ఏవం లబ్ధ్వా వరం దేవో వ్యాసస్సత్యవతీసుతః, అరణిం త్వథ సంగృహ్య మమంధాగ్నిచికీర్షాయా. 18

అథ రూపం పరం విప్ర బిభ్రతీం స్వేన తేజసా, ఘృతాచీం నామాప్సరసం దదర్శ భగవానృషిః. 19

ప తామప్సరసం దృష్ట్వా సహసా కామమోహితః, అభవద్భగవాన్వ్యాసో వనే తస్మిన్మునీశ్వర. 20

సా తు కృత్వా తదా వ్యాసం కామసంవిగ్నమానసమ్‌, శుకీభూయ మహారమ్యా ఘృతాచీ సముపాగమత్‌. 21

ప తామప్సరసం దృష్ట్వా రూపేణాన్యేనసంవృతామ్‌, స్మరరాజేనానుగతస్సర్వగాత్రితిగేన హ. 22

స తు ధైర్యేణ మహతా నిగృహ్ణన్‌ హృచ్ఛయం మునిః, న శశాక నియంతుం తం వ్యాసః ప్రవిసృతం మనః. 23

భావిత్వాచ్చైవ భావ్యస్య ఘృతాచ్యా వపుషా హృతమ్‌, యత్నాన్నిచ్ఛ సా7పి మునే ఏతచ్చికీర్షయా. 24

అరణ్వామేవ సహసా తస్య శుక్రమవాపతత్‌, శుక్రే నిర్మధ్మానే7స్యాం శుకో జజ్ఞే మహాతపాః. 25

పరమర్షిర్మహాయోగే అరణీగర్భసంభవః, యధైవహి సమిద్ధో7గ్నిర్భాతి హవ్ముపాత్తవాన్‌. 26

తథా రూపశ్శుకో జజ్ఞే ప్రజ్వలన్నివ తేజసా, బిభ్రచ్చిత్రం చ విప్రేన్ద్ర రూపవర్ణమనుత్తమం. 27

తం గంగా సరితాం శ్రేష్టా మేరుపృష్ఠే స్వరూపిణీ, అభ్యేత్‌ స్నాపయామాన వారిణా స్వేన నారద. 28

కృష్ణాజినం చాంతరిక్షాచ్ఛుకార్ధే భువ్యవాపతత్‌, జేగీయంత చ గంధర్వా ననృతుశ్చాప్సరోగణాః. 29

దేవదుందుభ##శ్చైవ ప్రావాద్యంత మహాస్వనాః, విశ్వావసుశ్చ గంధర్వస్తథా తుంబురునారదౌ. 30

హాహాహూహూశ్చ గంధర్వౌ తుష్టువుశ్శుకసంభవమ్‌, తత్ర శక్రపురోగాశ్చ లోకపాలాస్సమాగతాః. 31

దేవా దేవర్షయశ్చైవ తథా బ్రహ్మర్షయో7పి చ, దివ్యాని సర్వపుష్పాణి ప్రవర్ష చ మారుతః. 32

జంగమం స్థావం చైవ ప్రహృష్టమభవజ్జగత్‌, తం మహాత్మా స్వయం ప్రీత్యా దేవ్యా సహ మహాద్యుతిః. 33

జాతమాత్రం మునేః పుత్రం విధినోపానయత్తదా, తస్య దేవేశ్వరశ్శక్రో దివ్యమద్భుతదర్శనమ్‌. 34

దదౌ కమండులు ప్రీత్యా దేవా వాసాంసి చాభితః. హంసాశ్చ శతపత్రాశ్చ సారసాశ్చ సహస్రశః. 35

ప్రదక్షిణమవర్తంత శుకాశ్చాషాశ్చ నారద!, ఆరణీయస్తదా దివ్యం ప్రాప్య జన్మ మహామునిః. 36

తత్రైవోవాస మేధావీ వ్రతచారీ సమాహితః, ఉత్పన్నమాత్రం తం వేదాః సరహస్యాసంగ్రహాః. 37

ఉపతస్థుర్మునిశ్రేష్ఠం యథాస్య పితరం తథా, బృహస్పతిం స వవ్రే చ వేదవేదాంగ భాష్యవిత్‌. 38

ఉపాధ్యాయం ద్విజశ్రేష్ఠ! ధ్రర్మమేవానుచిన్తయన్‌, సో7ధీత్య వేదానఖిలాన్సరహస్యాన్స సంగ్రహాన్‌. 39

ఇతిహాసం చ కార్స్న్యేన వేద శాస్త్రాణి చాభితః గురవే దక్షిణాం దత్త్వా సమావృత్తో మహామునిః. 40

ఉగ్రం తపస్సమారేభే బ్రహ్మచారీ సమాహితః, దేవతానామృషీణాం చ చేల్యే7పి సుమహాతపాః. 41

సమంత్రణీయో జన్యశ్చ జ్ఞానేన తపసా తథా, న త్వస్య రమతే బుద్ధిరాశ్రమేఘు మునీశ్వర. 42

త్రిషు గ్హారస్థ్యమూలేషు మోక్షధర్మామదర్శినః, స మోక్షమనుచింత్యైవ శుకః పితరమభ్యగాత్‌. 43

మహానుభావుడు సత్యవతీ సుతుడగు వ్యాసమహర్షి ఇట్లు శంకరుని వలన తపస్సుచే వరమును పొంది, అగ్నిని చేయ సంకల్పించి అరణిని మధించసాగెను. అంతలో తన తేజస్సుచే ఉజ్జ్వలమగు రూపమును ధరించియున్న ఘృతాచియను అప్సరసను వేదవ్యాసమహర్షి అచట చూచెను. అట్లు వ్యాసమహర్షి ఘృతాచిని చూచి వెంటనే కామమెహితుడాయెను. ఇట్లు వ్యాస మహర్షిని కామ సంవిగ్నమనస్కుని చేసి లోకోత్తర సౌందర్యవతియగు ఘృతాచి చిలుకరూపముతో వ్యాసమహర్షిని సమీపించెను. లోకోత్తర సౌందర్యవతి యగు ఘృతాచిని చూచిన వ్యాస మహర్షి శరీరమంతట మన్మథభావము నిండగా, మనోవ్యాకులతను గొప్ప ధైర్యముచే నిగ్రహించుకొనుచు, జారిన మనసును నిగ్రహించలేక, జరుగవలసినది జరుగవలయును కావున ఘృతాచీ సౌందర్యముచే హరించబడిన మనస్సును యత్నముచే నిగ్రహించుకొనిననూ దీనిని చేయసంకల్పించుటచే ఆయరణిలోనే వ్యాసమహర్షి వీర్యము స్రవించెను. ఆవీర్యమును మథించగా ఆయరణి యందే మహాతపస్వియగు శుకుడు జన్మించెను. ఈ శుకుడు పరమర్షి మహాయోగి అరణీ గర్భమున జన్మించెను. చెక్కగా ప్రజ్వలించు అగ్ని హవ్యమును స్వీకరించి తేజస్సుచే ప్రకాశించునట్లు తన తేజస్సుచే జ్వలింపచేయుచున్నట్లు శుకమహర్షి ప్రకాశించుచుండెను. సాటిలేని రూపమును, వర్ణమును ఆశ్చర్యకరముగా ధరించుచు వెలుగొందుచుండెను. అట్టి శుకుని నదులలో కెల్ల ఉత్తమనదియగు గంగానది మేరు శిఖరమున రూపు దాల్చి స్వయముగా వచ్చి తన జలముచే స్నానము చేయించెను. అంతరిక్షము నుండి శుకుని కొరకు కృష్ణాజినము భూమిమీద పడెను. గంధర్వులు గానమును చేసిరి. అప్సరసలు నాట్యము చేసిరి. దేవదుందుభులు గొప్పధ్వని కలవై మోగినవి. గంధర్వుడగు విశ్వావసుపు, తుంబురు నారదులు, హాహాహూహూ గంధర్వులు శుకజన్మను స్తోత్రము చేసిరి. అచటికి ఇంద్రుడు మొదలగు లోకపాలకులు వచ్చిరి. దేవతలు దేవర్షులు బ్రహ్మర్షులు కూడా వచ్చిరి. వాయువు దివ్యములైన సర్వవిధపుష్పములను వర్షించెను. స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయు సంతోషించెను.

మహాత్ముడగు శంకరుడు మిక్కిలి ప్రీతిచే పార్వతీదేవితో కలిసి గొప్పతేజస్సు కలవాడై వ్యాసమహర్షి పుత్రునికి పుట్టిన వెంటనే ఉపనయనము గావించెను. దేవాధిపతిగు ఇంద్రుడు దివ్యము ఆశ్చర్యమును గొలుపు కమండలమును శుకునికిచ్చిరి. దేవతలు వస్త్రములనిచ్చిరి. హంసలు, చక్రవాకములు, సారసములు, చిలుకలు ఇతర పక్షులు శుకునికి ప్రదక్షిణమును గావించిరి. ఇట్లు అరణి సంభవుడగు శుక మహర్షి దివ్యమగు జన్మను పొంది, ఉపనయనము గావించుకొని బ్రహ్మచర్యవ్రతము నవలంబించి అచటనే ఉండెను. శుకమహర్షి పుట్టిన వెంటనే సాంగములు సరహస్యములగు వేదములు తండ్రియగు వేదవ్యాసుని పొందినట్లు శుకమహర్షిని వచ్చి చేరినవి. అపుడు శుకమహర్షి ధర్మమును పరిశీలించి వేదవేదాంగ భాష్య జ్ఞానము కలవాడైనను బృహస్పతిని గురువుగా వరించెను. అట్లు బృహస్పతి దగ్గర సాంగములు సరహస్యములగు వేదములనభ్యసించి, సమగ్రేతిహాసమును, సర్వశాస్త్రములను అధ్యయనము చేసి గురువుగారికి దక్షిణను సమర్పించి ఆశ్రమమునకు తిరిగివచ్చి, సావధానమనస్కుడై ఉగ్రమైన తపస్సుచేనారంభించెను. అట్లు తపస్సుచేయుచున్న శుకమహర్షి బాల్యములో నున్ననూ దేవతలకు, ఋషులకు సంప్రదిచదగిన వాడాయెను. జ్ఞానముచే, తపస్సుచే వారికంటే అధికుడాయెను. అయినను శుకమహర్షి బుద్ధి ఆశ్రమమున ఆనందించలేకపోయెను. గృహస్థాశ్రమము మొదలుకొనియున్న మూడు ఆశ్రమములో మోక్షధర్మమును గూర్చి ఆలోచించుచున్న శుకమహర్షి మోక్షమును ధ్యానించుచు తండ్రిని సమీపించెను.

ప్రాహాభివాద్య చ తదా శ్రేయో7ర్ధీ వినియాన్వితః, మోక్షధర్మేషు కుశలో భగవాన్‌ ప్రబ్రవీతు మే. 44

యథైవ మనసశ్సాంతిః పరమా సంభ##వేన్మునే, శ్రుత్వా పుత్రస్య వచనం పరమర్షిరువాచ తమ్‌. 45

అధీష్య మోక్షశాస్త్రం వై ధర్మంశ్చ వివిధానపి, పితుర్నిర్దేశాజ్జగ్రాహ శుకో బ్రహ్మవిదాం వరః. 46

యోగశాస్త్రం చ నిఖిలం కాపిలం చైవ నారద, స తం బ్రాహ్మ్యాశ్రియా యుక్తం బ్రహ్మతుల్యపరాక్రమమ్‌. 47

మేనే పుత్రం యథావ్యాసో మోక్షశాస్త్రవిశారదమ్‌, ఉవాచ గచ్ఛేతి తదా జనకం మిథిలేశ్వరమ్‌. 48

ప తే వక్ష్యతి మోక్షార్థం నిఖిలేన నరాధిపః, పితుర్నియోగాదగమజ్జనకం మైధిలం నృపమ్‌. 49

ప్రష్టుం ధర్మస్య నిష్ఠాం వై మోక్షస్య చ పరాయణమ్‌, ఉక్తశ్చ మానుషేణ త్వం తథా గచ్ఛేత్యవిస్మితః. 50

న ప్రభావేణ గంతవ్యమంతరిక్షచరేణ వై, ఆర్జవేనైవ గంతవ్యం న సుఖాయ క్షణాత్త్వయా. 51

న ద్రష్టన్యా విశేషా హి విశేషా హి ప్రసంగినః, అహంకారో న కర్తవ్యో యాజ్యే తస్మిన్నరాధిపే. 52

స్థాతవ్యం వసధే తస్య స తే ఛేత్స్యతి సంశయమ్‌, స ధర్మకుశలో రాజా మోక్షశాస్త్రవిశారదః. 53

యథా యథా చ తే బ్రూయాత్‌ తత్కార్యమవిశంకయా, ఏవముక్తస్స ధర్మాత్మా జగామ మిథిలాం మునిః. 54

పద్భ్యాం శక్తోంతరిక్షేణ క్రాంతుం భూమిం ససాగరామ్‌, స గిరీంశ్చాప్యతిక్రమ్య భారతం వర్షమాసదత్‌. 55

స దేశాన్వివిథాన్శ్ఫీతేనతిక్రమ్యం మహామునిః, విదేహాన్వై సమాసాద్య జనకేన సమాగమత్‌. 56

రాజద్వారం సమాసాద్య ద్వారపాలైర్నివారితః, తస్థౌ తత్ర మహాయోగీ క్షుత్పిపాసాదివర్జితః. 57

ఆతపే గ్లానిరహితో ధ్యానయుక్తశ్చ నారద!, తేషాం తు ద్వారపాలానామేకస్తత్ర వ్వస్థితః. 58

మధ్యంగతమినాదిత్యం దృష్ట్వా శుకమవస్థితమ్‌, పూజిత్వా యథా న్యాయం అభివాద్య కృతాంజలిః. 59

ప్రావేశయత్తతః కక్షాం ద్వితీయాం రాజవేశ్మనః, తత్రాంతఃపురసంబద్ధం మహచ్చైత్రరధోపమమ్‌. 60

సువిభక్తజలాక్రీడ రమ్యం పుష్పితపాదపమ్‌, దర్శయిత్వాసనే స్థాప్య రాజానం చ వ్యజిజ్ఞిపత్‌. 61

శ్రుత్వా రాజా శుకం ప్రాప్తం వారస్త్రీస్స న్యయుజ్ఞ్క చ, సేవాయై తస్య భావస్య జ్ఞానాయ మునిసత్తమ. 62

తం చారుకేశ్యస్సుశ్రోణ్యస్తరుణ్యః ప్రియదర్శనాః, సూక్ష్మరక్తాంబరధరాస్తప్తకాంచనభూషణాః. 63

సంలాపాలాపకుశలా భావజ్ఞాస్సర్వకోవిదాః, పరం పంచాశతస్తస్య పాద్యాదీని వ్యకల్పయన్‌. 64

దేశకాలోపపన్నేన సాధ్వన్నేనాప్యతర్పయన్‌, తస్య భుక్తవతస్తాత తాస్తతః పురకాననమ్‌. 65

సురమ్యం దర్శయామాసురేకైకత్వేన నారద, క్రీడంత్యశ్చ హసంత్యశ్చ గాయంత్యశ్చైవ తాశ్శుకమ్‌. 66

ఉదారసత్త్వం సత్వజ్ఞాస్సర్వా పర్యచరంస్తదా, ఆరణీయస్తు శుద్ధాత్మా జితక్రోధో జితేంద్రియః. 67

ధ్యానస్థ ఏవ సతతం న హృష్యతి న కుప్యతి, పాదశౌచం తు కృత్వా వై శుకస్సంధ్యాముపాస్య చ. 68

నిషసాదాసనే పుణ్య తమేవార్థం వ్యచిన్తయత్‌, పూర్వరాత్రే తు తత్రాసౌ భూత్వా ధ్యానపరాయణః. 69

మధ్యరాత్రే యథాన్యాయ్యం నిద్రామాహారయత్ప్రభుః, తతః ప్రాతస్సముత్థాయ కృత్వా శౌచమనన్తరమ్‌. 70

స్త్రీభిః పరివృతో ధీమాన్ధ్యానమేవాన్వపద్యత, అనేకవిధినా తత్ర తదహశ్శేషమప్యుత. 71

తాం చ రాత్రి. నృపకులే వర్తాయామాస నారద. 72

ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే

బృహదుపాఖ్యానే ద్వితీయ భాగే

శుకప్రలోభనం నామ

అష్టపంచాశత్తమో7ధ్యాయః

తండ్రికి నమస్కరించి, శ్రేయస్సును కోరి వినయముతో, మోక్షధర్మములలో కుశలులైన మీరు నా మనస్సునకు శాంతి ఎట్లు కలుగునో చెప్పుడు అని పలికెను. పుత్రుడగు శుకమహర్షి మాటలను వినిన వ్యాసమహర్షి అతనితో ఇట్లు పలికెను. మోక్షధర్మములను, ఇతరములైన వివిధ ధర్మములను అధ్యయనము చేయుము. అని అట్లు తండ్రి ఆజ్ఞతో తండ్రినుండి బ్రహజ్ఞానులలో శ్రేష్ఠుడగు శుకమహర్షి మోక్షధర్మములను ఇతర ధర్మములను గ్రహించెను. అట్లే సమగ్రముగా యోగశాస్త్రమును, కాపిల శాస్త్రమును గ్రహించెను. ఇట్లు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్న, బ్రహ్మతుల్యపరాక్రముడైన శుకమహర్షిని మోక్షశాస్త్ర విశారదునిగా వ్యాసమహర్షి తలచెను. అపుడు వ్యాసమహర్షి పుత్రుని గూర్చి మిధిలేశ్వరుడగు జనకుని వద్దకు వెళ్ళుము. జనక మహారాజు నీకు సమగ్రముగా మోక్షార్ధమును బోధించగలడు. గర్వించక మానవునిగా నడిచి వెళ్ళుము. నీ ప్రభావముచే అంతరిక్షగమనమును వెళ్ళకుము. ఆర్జవముతో వెళ్ళుము. క్షణకాల సుఖము కొరకు ఆశపడరాదు. విశేషములను నీవు చూడరాదు. విశేషములు తమంతతాముగా వచ్చి చేరును. పూజించదగిన జనక మహారాజు విషయమున అహంకారమును చూపరాదు. అతని భవనమున కొంతకాలమున్నోచ అతను నీసంశయములను తొలగించగలడు. జనక మహారాజు ధర్మకుశలుడు. మోక్ష శాస్త్రవిశారదుడు. అతను చెప్పిన దానిని చెప్పినట్లుగా ఆచరించుము. ఇట్లు తండ్రి చెప్పగా తండ్రి అనుమతిని పొంది మిధిలాధిపతియైన జనకుని వద్దకు వెళ్ళెను. అంతరిక్ష మార్గమున సముద్రములతో చుట్టబడియున్న భూమిని దాటగల శక్తి యున్ననూ పాదములతో నడుచుచు పర్వతములను దాటి భారతవర్షమును చేరి, సమృద్ధములగు వివిధ దేశములనతిక్రమించి, విదేహ దేశమును చేరి జనకుని భవనమునకు చేరెను. రాజద్వారమును చేరగా ద్వారపాలకులు ఆపిరి. శుక్రమహర్షి రాజద్వారము ముందే ఆకలి దప్పులు లేనివాడై ఎండలో శ్రమనెరుగని వాడై ధ్యానయుక్తుడై నిలిచియుండెను. అచట నున్న ద్వారపాలకులలో ఒకడు, సూర్యుడు ఆకాశ మధ్యమున ప్రకాశించునట్లు దివ్యతేజోయుక్తుడగు శుకుడు నిలిచియుండుట చూచి, న్యాయబద్ధముగా పూజించి, నమస్కరించి చేతులు జోడించి అంజలి బద్ధుడై రాజభవనమున ప్రవేశింప జేసెను. అచట రాజభవనములో రెండవ కక్ష్యలో అంతపుర భవనము చైత్రరధముతో సాటివచ్చునది, జలశాలలు, క్రీడాశాలలతో చక్కగా విభజింపబడి, సుందరము, పూలచెట్లు కలదిగు భవనమును చూపి, ఆసనమున కూర్చుండబెట్టి జనకమహారాజునకు నివేదించెను. జనకమహారాజు శుకుడు వచ్చుట తెలిసి, శుకుని అభిప్రాయమును తెలిగోరి శుకమహర్షి పరిచర్య కొఱకు వారకాంతలను నియమించెను. సుందరమగు కేశపాశములు గలవారు, అందమైన శ్రోణీభరము కలవారు, ప్రియదర్శనులగు వారకాంతలు సూక్ష్మములగు రక్త వస్త్రములను ధరించి మేలిమి బంగారు నగలను ధరించి, సంలాప ఆలాపములందు కుశలులు కావున, ఎదుటివారి భావమును గ్రహించు వారు, అన్నిటిలో నిపుణులగు యాబది మంది వారకాంతలు శుకమహర్షిని సమీపించి అర్ఘ్యపాద్యాదికములను సమర్పించిరి. దేశకాలోచితమగు చక్కని భోజనముచే తృప్తి కలిగించిరి. భోజనము చేసిన తరువాత శుకమహర్షినని సుందరమైన పురోధ్యానమునకు కొనిపోయి ఒక్కొక్క దానిని చూపిరి. ఆడుచు, పాడుచు, నవ్వుచు స్వభావమును తెలిసిన వారకాంతలు ఉదారసత్వుడగు శుకుని సేవించసాగిరి. జితక్రోధుడు జితేంద్రియుడగు అరణీ గర్భసంభూతుడు పరిశుద్ధమగు మనస్సుతో ఎప్పుడూ ధ్యానములోనే ఉండి సంతోషించక, కోపించక యుండెను. పాదప్రక్షాలనమును గావించుకొని శుకమహర్షి సంధ్యావందనమాచరించెను మోక్షార్ధమును ధ్వానించుచు పవిత్రమైన ఆసనమును కూర్చొనెను. పూర్వరాత్రిలో ధ్యానపరాయణుడై, మధ్యరాత్రమున నిద్రను రప్పించుకొనెను. ప్రొద్దుననేలేచి శౌచమును ముగించుకొని స్త్రీలతో కలిసి యుండియు ధ్యానమునే పొందెను. ఈ విధానముతో ఆచటనే ఆ పగలు రాత్రి గడిపెను.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున

బృహదుపాఖ్యానమున ద్వితీయభాగమున

శుకప్రలోభమను యాబదియెనిమిదవ అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page