Sri Naradapuranam-I    Chapters    Last Page

ద్వాత్రింశో ధ్యాయః ముప్పదిరెండవ అధ్యాయము

భవాటవీనిరూపణమ్‌.

సనక ఉవాచ:-

ఏవం కర్మపాశనియన్త్రి తజన్తనః స్వర్గాదిపుణ్యస్తానేషు

పుణ్యభోగమనుభూయ యాతనాసు చాతీవ దుఃఖతరం పాపఫలమనుభాయ.

ప్రక్షీణకర్మావశేషేణాముం లోకమాగత్య సర్వభయవిహ్లలేషు మృత్యుబాఘాసంయుతేషు స్థావరాదిషు జాయతే . 1

వృక్షగుల్మలతావల్లీగిరియశ్చ తృణాని చ, స్థావరా ఇతి విఖ్యాతా మహామోహసమావృతాః. 2

స్థావరత్వే పృథివ్యాముప్తబీజాని జలసే కానుపదం సుసంస్కారసామగ్రీవసాందంతరూష్మప్రపాచితాన్యుచ్ఛానత్వ మాపాద్యతతో.

మూలభావం, తన్మూలాదంకురోత్పత్తిస్సస్మాదపి పర్ణకాండనాలాదికం కాండేషు చ ప్రసవమాపద్యంతే, తేషు చ పుష్పసంభవః. 3

తాని పుష్పాణి కాని చి దఫలాని, కానిచిత్ఫల హేతుభూతాని తేషు పుష్పేషు వృద్ధ భావేషు సత్సుతత్పుష్పమూల తస్తుషోత్పత్తిర్జాయతే, తేషు తేషు భోక్తృణాం ప్రాణినాం సంస్కారసామగ్రీవశాద్ధిమరశ్మి కిరణాసన్నతయూ తదోషధిరస్తుషాంతః ప్రవిశ్య

క్షీరభావం సమేత్య స్వకాలే తండులాకారతాముపగమ్య ప్రాణినాం భోగసంస్కార వసాత్సంవత్సరే ఫలినస్స్యుః.4

స్థావరత్వే పి బహుకాలం వానరాదిభిర్భుజ్యమానా హి

చేదన దవాగ్ని దహనశీతాతపాదిదుఃఖమనుభూయ మ్రియంతే. 5

తతస్చ క్రిమయో భూత్వా సదా దుఃఖబహుళా క్షణార్ధం జీవంతః క్షణార్ధం మ్రియమాణాః.

బలవత్ర్పాణీ పీడాయాం నివారయితుమక్షమాః.

శీతావాదిక్లేశభూయిషా నిత్యం క్షుదాక్షుధితా మలమాత్రీదిషు సంచర్తనో దుఃఖమనుభవంతి.6

తత ఏవ పద్మయోనిమాగత్య బలవద్బాధోద్వేజితా

వృధోద్వేగభూయిష్ఠా క్షుత్కాన్తా నిత్యం వనచారిణో మాతృష్వపి విషాతురా

వాతాదిక్లేశబహులాః కస్మింశ్చిజ్జన్మని తృణాశనా, కస్మింశ్చిజ్జన్మని మాంసామేధ్యాద్యదనాః,

కస్మింశ్చిజ్జన్మని కందమూలాపలాశనా దుర్బలప్రాణిపీడానిరతా దుఃఖమనుభవంతి. 7

అండజతే పి వాతాశనా మాంసామేధ్యాద్యశనాస్చ పరపీడాపరాయణా నిత్యం దుఃఖబహులా గ్రామ్యపశుయోనిగతా

అపి స్వజాతివియోగాభారోద్వహనపాశాదిబంధనతాడనహలాది ధారణాసర్వదుఃకాన్యను భవంతి. 8

ఏవం బహుయోనిషు సంభ్రాంతాః క్రమేణ మానుషం జన్మ ప్రాప్నువంతి.

కేచిచ్చ పుణ్యవిశేషాద్యుత్త్కమేణాపి మనుష్యజన్మాశ్నువతే.

సనక మహర్షి పలుకుచున్నాడు:- ఇట్లు కర్మపాశముచే నియమించు జంతువులు స్వర్గాది పుణ్యస్థానములలో పుణ్యభోగములననుభవించి యాతనాలోకములందు మిక్కిలి దుఃఖకరమగు పాపఫలముననుభవించి క్షీణించగా మిగిలిన కర్మలచే ఈ భూలోకమునకు వచ్చి అన్ని భయములతో విహ్వలములగు, మృత్యబాధాయుతములై స్థావరాదులలో పుట్టెదరు. వృక్షగుల్మలతో వల్లీ గిరి తృణములు మహోమోహసమాకృతములగు స్థావరములుగా పేర్కొనబడును. స్థావరత్వమును పొందుటకు భూమిలో విత్తిన బీజములు నీటిలో తడిసిన వెంటనే సంస్కారసామగ్రీ వశమున లోని వేడితో పక్వములై ఉబకి మూలభావమును పొంది, మూలమునుండి అంకురత్వమునొంది ,అంకురమునుండి ఆకులు కాండములు నాలములు కలిగి, కాండములనుండి మొగ్గలు తొడిగి పూవులగును. ఆ పూవులలో కొని ఫలరహితములు, కొన్ని ఫలసహితములు అగును. ఆ పూవులు బాగుగా వృద్ధిపొందినపుడు ఆ పుష్పమూలమునుండి తుషా (పొట్టు) పుట్టును. ఆ పొట్టులో అనుభవించదగిన ప్రాణుల సంస్కారసామగ్రీ వశమున చంద్రకిరణ స్పర్శచే చంద్రకిరణములలోని ఓషథులునోని ప్రవేశించి క్షీరభావమును పొందును. కాలవశమున పొట్టులో తండులాకారమేర్పడును. ప్రాణుల బోగసంస్కారవశమున సంవత్సరములో ధాన్యముగా పండును. స్థావరమును పొందియు చాలాకాలము వానరాదులచే భుజింపబడుచు ఛేదన దవాగ్ని దాహ శీతాతపాది దుఃఖముల ననుభవించి మరణించును. తరువాత క్రిములు గా పుట్టి ఎల్లపుడూ దుఃఖబాహుల్యము కలిగి ఒకక్షణమో సగము క్షణమో బ్రతుకుచు, అరక్షణములో మరణించుచు బలవత్ప్రాణి పీడలను నివారించుకోజాలక శీతవాతాదిక్లేశబాహుల్యము కలవై ఎపుడూ ఆకలిచే పీండించబడుచు మలమాత్రాదులలో సంచరించుచు దుఃఖముననుభవించుచుండును. తరువాత పసుజన్మము పొంది బలవంతుల బాధలచే ఉద్వేగమును పొంది వ్యర్థోద్వేగ బాహుల్యము కలవారై ఆకలిచే పీడించబడుచు నిత్యము వనచారులై తల్లియందు కూడా విషయభోగపరాయణులై శీతవాతాతపాది క్లేశబాహుల్యము కలిగి కొన్ని జన్మలలో కృణాహారమును, మరికొన్ని జన్మలలో మాంసాదికమును మేథ్యమును ఆహారముగా తీసుకొనుచు, మరికొన్ని జన్మలలో కందమూల ఫలాశనులై దర్బలప్రాణులను పీడించుచు దుఃఖము ననుభవించుచుందురు. అండజములుగా పుట్టినను గాలిని మాంసాద్యమోధ్యములను తినుచు పరపీడాపరాయణులై నిత్యము దుఃఖబారుల్యము కలిగియుందురు. గ్రామ పశుజన్మను పొందినను స్వజాతి వియోగము, బరువునుమోయుట, పాశములతే బంధించబడుట, కొట్టబడుట, నాగలి మొదలగు వాటిని లాగుట మొదలగు సర్వవిధదుఃఖములను అనుభవించుచుండును. ఇట్లు నానా జన్మమలలో తిరిగి తిరిగి క్రమముగా మానవజన్మను పొందెదరు. కొందరు పుణ్యవిశేషముచే కూడా మానవ జన్మను పొందెదరు. 1-9

మనుష్య జన్మనాపి చ చర్మకారచండాలవ్యాధనా పితరజకకుంభకారలోహకారస్వర్ణకారతంతువాయ సౌచిక

జటలసిద్ధాదావకలేఖకభృత కశాసనహరినీ చభృత్యదరిద్రహీనాంగఅధికాంగత్వా ది దుఃఖబహులజ్వరతా పశీతశ్లేష |

గుల్మపాదఅక్షిశిరోగర్భరపార్శ్యవేదానాదిదుఃఖమనుభవంతి. 10

మనుష్వత్వే పి యదా స్త్రీ పురుషయోర్వ్యవాయస్తత్సమయే రేతో యదా జరాయాం ప్రవిశతి,

éతదైవ కర్మవశా జ్జంతుశ్శుక్రేణ సహ జరాయుం విశ్వశుక్రశోణితకలలే ప్రవర్తతే7. 11

తద్వీర్యం జీవప్రవేశాత్పంచాహాత్కలలం భవతి.

అర్ధమాసే పలలభావముపేత్య మాసే ప్రాదేశమాత్రత్వ మాపద్యేత్‌.12

తతః ప్రభతి వాయువసాచ్చైతన్యాభావే పి మాతురుదరే దుస్సహతాపర్లేశతయా ఏతత్రస్థాతుమశక్యద్వాద్భ్రమతి.

మాసే ద్వితీయే పూర్ణే పురుషాకారమాత్రతాముగమ్య మాసతయే పూర్ణే కరచరణాద్యవయవభావముప గమ్య,

చతుర్షు సేషు గతేషు సర్వావయానాం సంధిభేదపరిజ్ఞానాం , పంచస్వతీతేషు నఖానామభివ్యంజకతా,

షట్స్వ తీతేషు నఖసంధిపరిస్సుటతాముపగమ్య నాభిసూత్రేణ పుష్వమాణం అమేద్యమాత్రసిక్తాంగం

జరాయుణా బంధిత రక్తాస్థిక్రిమివసామజ్జాస్నాయుకేశాదిదూషితే కుత్సితే శరీరే నివాసిం స్వయమప్యేవం పరిదూషితదేహం,

కుత్సితే శరీరే నివాసినం స్వయమప్యేనం పరిదూషిత దేహం . మాతుస్చ కట్వావ్లుకలవణాత్యుష్ణభుక్తదుహ్యమానమాత్మానం

దృష్ట్వా దేహి పూర్వజన్మస్మర్మణానుభావాత్పూర్వానుభూతనరకదుఃకానిచ స్మ్రత్వాంతర్దుఃఖేన చ పరిదహ్యామానో

మాతుర్దేహేతిమూత్రాదిరూపేక్ష దహ్యమాన ఏవం మనసి ప్రలపతి. 14

మనుష్యజన్మలో కూడా చర్మకార. చండాల . వ్యాధ, నాపిత, రజక, కుంభకార, లోహకార, స్వర్ణకార, తంతువాయ, సౌచిక, జటిల, సిద్ధి, ధావన, లేకన, భృతక, శాసనహరి, నీచభృత్య, దరిద్ర, హీనాంగ, అధికాంగత్వాది భేదములచే దుఃఖబహులములగు జ్వరతాప, శీత, శ్లేష్మ, హస్తిపాద, నేత్రశిరో, గర్భపాశ్శ్వ వేదానాది దుఃఖముల ననుభవించుచుందురు. మనుష్య జన్మలో కూడా స్త్రీ పురుష సంగమసమయమున రేతస్సు గర్భకోశమును ప్రవేశించునపుడు కర్మవంశమున ప్రాణి శుక్రముతో కలిసి జరాయువును ప్రవేశించి శుక్రశోణితసమ్మేలనరూపఘనపదార్థముగా మారును. ఆ వీర్యమున జీవుడు ప్రవేశించుట వలన అయిదు దినములలోఘనపదార్థముగా మారి , పక్షమున మాంస పిండరూపమును పొంది మాసమున ప్రాదేశమాత్రమగును. అప్పటినుండి చైతన్యము లెకున్నననూ వాయువశమున మాతృగర్భమున దుస్సహతాపక్లేశములుండుటచే ఒకచోట నుండ శక్యము కాక తిరుగుచుండును. రెండవమాసమునిండిన వెంటనే మానవాకార మాత్రమును పొందును. మాడవమాసము నిండగనే కరచరణాద్యవయవ భావము లభించును. నాలుగు నెలలు గడిచినచో గోళ్ళ చివురులేర్పడును. నాభీసూత్రముచే పోషించబడుచుందురు. మలమాత్రములచే పూయబడిన శరీరము కలవాడై మావిచే బంధించబడి రక్త ఆస్థిక్రియ వసామజ్జాస్నాయు కేసాదులచే దూషితమాన శరీరమున నివసించుచు, తాను కూడా ఇట్టి శరీరము కలవాడై , తల్లి భుజించు కారము పులుపు, ఉప్పు అత్యుష్ణ పదార్థములచే దహ్యమానశరీరుడగుచు, తన శరీరమును చూచుకొని జీవుడు పూర్వజన్మస్మరణానుభవముచే పూర్వమున అనుభవించిన నరకదుఃఖములను స్మరించుటచే అంతర్దుఃఖముచే దహించబడుచు మాతృదేహములోని మూత్రాద్యుష్ణములచే దహింపబడుచు తన మనసులో ఇట్లు పరితంపించును.

అహో త్యంతపాపోహం పూర్వజన్మని భృత్యాపత్యమిత్రయోషిద్గృహక్షేత్రదనధాన్యాదిష్వత్యంరాగేణ

కలత్రపోషణార్థం పరధనక్షేత్రాదికం పస్యతోహరణాద్యుపాయైపహృత్య కామాంధతయా

పరస్త్రీ హరణాదికమనుబూయ మహాపాపాన్యాచరంసైః పాపైరహమేక ఏవంవిధనరకాననుబూయ పునస్థ్సావరాదిషు

మహాదుఃఖమనుభూయ సంప్రతి జరాయుణా పరివేష్టితో న్తర్దుఃఖేన బహిస్తాపేన చ గర్హామి. 10-15

మయా పోషితా దారాస్చ స్వకర్మవశాదన్యతో గతాః. 16

అహో దుఃఖం హి దేహినామ్‌ . 17

దేహస్తు పాపాత్సంజాతస్తస్మాత్పాపం న కారయేత్‌ ,భృతమిత్రకలకత్రార్థమన్యద్ద్రవ్యం హృతం మయా. 18

తేన పాపేన దహ్యామి జరాయుపరివేష్టితః, దృష్ట్వాన్యస్య శ్రియం పూర్వం సంతప్తో హమసూయయమా.19

గర్భాగ్నినానుదహ్యోయమిదానీమపి పాపకృత్‌, కాయేన మనసా వాచా పరపీడామకారిషమ్‌. 20

తేన పాపేన దహ్యోమిత్యహమేకో తి దుఃఖితః ఏవం బహువిదం గర్భస్థో జంతుర్విలప్య స్వయమేవ,

ఆత్మానమాశ్వాస్య ఉత్పతైరనన్తరం సత్సంగేన విష్ణోశ్చరితశ్రవణన చ విశుద్ధమనా భూత్వా సత్కర్మాణి

నిర్వర్త్య అఖిలజగదంతారాత్మనః సత్యాజ్ఞానానందమయస్య శక్తి ప్రభాకానుష్ఠితవిష్టపవర్గస్య లక్ష్మీ పతేర్నారాయణస్య

సకలసురాసుర యక్షగంధర్వరాక్షసపన్నమునికిన్నరసమూహార్చితచరణకమలయుగం భక్తి తప్సమభ్యర్బ్య

దుస్సహసంసార చ్ఛేదస్య కారణభూతం వేదపహస్యోపనిషద్భిః పరిస్షుటం సకలలోకపరాణం హృది

నిధాయ దుఃఖతరమిమం సంసారగామతిక్రమిష్యామీతి మనసి భావయతి.

అయ్యో! నేనెంత పాపిని. పూర్వజన్మలో భృత్యమిత్రకళత్రపుత్రగృహక్షేత్ర ధనధాన్యాలయందు వ్యామోహముచే భార్యాపుత్రులను పోషించుటకై పరధన క్షేత్రాదులయందు దృష్టినుంచి పలు ఉపాయములచే హరించి కామాంధకారముచే పరస్త్రీ గమనాది పాతకముల నాచరించి, ఆ పాతకములచే నేనొక్కడినే బహివిధనరకనులననుభవించి , మరల స్థావరాదిరూపములతో మహాదుఃఖము ననుభవించి, ఇపుడు మావిచే కప్పబడి అంతఃర్దుఃఖముచే నేనొక్కటినే బహువిధనరకనుల ననుభవించి, మరల స్థావరాదిరూపములతో మహాదుఃకము ననుభవించుపోవుచున్నాను. నేను పోషించిన దారాపుత్రాదులుకెంత దుఃఖము! పుత్రమిత్ర కళాత్రాది పోషణ కొఱకు పరద్రవ్యమున నపబరించితిని. ఇపుడు ఇచట గర్భాగ్నిచే దహించి పోవుచుంటిని. మనోవాక్యాయములచే పరపీడన మాచరించితిని. ఆ పాపముచే ఇపుడు నేనొక్కడినే మిగుల దుఃఖముచే దహించిపోతిని. ఇట్లు గర్భస్థజీవుడు పలువిధములుగా విలపించి తనను తానే ఓదార్చుకొని పుట్టిన తరువాత సత్సంగముచే శ్రీమహావిష్ణుచరిత్రశ్రవణముచే విశుద్ధమనస్కుడనై సత్కార్యముల నాచరించి అఖిల జగదంతరాత్మ సత్యజ్ఞానానందమయుడు, శక్తి ప్రభావముచే స్వర్గాదులను సృజించినవాడు లక్ష్మీపతి అయిన నారాయణుని సకల సురాసుర యక్షగంధర్వ రాక్షస

పన్నగముని కిన్నర సమూహములచే పూజింపబడిన పాదపద్మములను భక్తిచే పూజించి, దుస్సహమైన సంసారమును ఛేదించుకు కారణభూతుడు, వేదరహస్యోపనిషత్తులచే స్పష్టముచేయబడినవారు అయిన సకలలోకపరాయణుని హృదయమున నిలుపుకొని ఈ దుఃఖమును సంసారమును దాటెదనని మనసున భావించును. 16-20

యతస్తన్మాతుః ప్రసూతిసమయే సతి గర్భస్థో దేహీ నారదమునే వాయునా పరిపీడితో మాతుశ్చాపి

దుఃఖం కుర్వన్కర్మపాశేన బలాద్యోని మార్గాన్నిష్క్రామన్సకలయాతనాభోగమేకకాలభవమనుభవతి. 21

తేనాతిక్లేశేన యోనియంత్రపీడితో గర్భాన్నిష్క్రాంతో నిస్సంజ్ఞతాం యాతి. 22

తంతు బాహ్యావాయస్సముజ్జీవయంతి. బాహ్యవాయుస్సర్శసమనన్తరమేవ

నష్టస్మృతిపూర్వానుభూతాఖిల దుఃఖాని వర్తమామనాన్యపి జ్ఞానాభావాదవిజ్ఞాయాత్యన్తదుఃఖమనుభవంతి. 23

ఏవం బాలత్వమాపపన్నో జంతుస్తత్రాపి స్వమలమూత్రదేహ అద్యాత్మికాదిపీడ్యమానో పి వక్తుమశక్తః

క్షుత్తృషాపీడతః, రుదితే సతి స్తనాదికం దేయమితి మన్వానాః ప్రయతన్తే. 24

ఏనమనేకం దేహభోగమన్యాధీనతయానుభూయమానో దంశాదిష్వసి వారయితుమశక్తః. 25

బాల్యభావమాసాద్య మాతాపిత్రోరుపాధ్యాయస్య తాడనం , సదా పర్యటనశీలత్వ్యం,

భస్మపంకాదిషు క్రీడనం , సదా కలహానియతత్వమశుచిత్వం బహు వ్యాపారాభాసకార్య నియతత్వం.

తదసంభవ ఆధ్యాత్మిక దుఃఖమేవంవిధమనుభవతి. 26

తల్లి ప్రసూతి సమయున గర్భస్థుడగు దేహి వాయువుచే పరిపీడుతుడై తల్లికి కూడా దుఃఖమును కలిగించుచు కర్మపాశముచే బలముగా యోని మార్గమునుండి బయట వెడలుచు సకలయాతన అనుభవమును ఒకే సమయమున అనుభవించును. అట్లు అతిక్లేశముతో యోని యంత్రపీడితుడై గర్భమునుండి నిష్క్రమించి సంజ్ఞను కోల్పోవును. అట్టి శిశువును బాహ్యవాయువు మరల బ్రతికించును. బాహ్యవాయు స్పర్శకాలముననే పూర్వమున అనుభవించిన సమస్త దుఃఖాదుల స్మృతి నశించును. వర్తమాన దుఃఖములను కూడా జ్ఞానము లేనందున తెలియజాలక, అత్యంత దుఃఖము ననుభవించును. ఇట్లు బాలత్వమును పొందిన జంతువు అచట కూడా తన మాలమూత్రాదులను శరీరమును పూసుకొని ఆధ్యాత్మికాది తాపత్రయములచే పీడించబడుచున్నను చెప్పజాలక ఆకలిదప్పులచే పీండించబడుచు బిగ్గరగా ఏడ్చును. అట్లేడ్వగా స్తన్యమీవలయునని భావించి తల్లి ఆ ప్రయత్నమును చేయును. ఇట్లు అనేక దేహాభోగములను అన్యాధీనముగా ననుభవించుచు కీటకములు కరచున్ననూ వారింపజాలడు. బాల్యభావమును పొంది తల్లితండ్రులచే, ఉపాధ్యాయులచే తాడనములను పొందుచు ఇటు నటు తిరిగుచు దుమ్ము, బూడిద, బురద మొదలగు వాటియందాడుచూ ఎప్పుడూ కలహా స్వభావమును అపవిత్రతము పొంది బహువ్యాపారభ్యాస కార్యనియతుడగుచు ఆ పని చేయలేక ఆధ్యాత్మిక తాపత్రయములచే దుఃఖములననుభవించును. 21-26

తతస్తు తరుణభావేన ధనార్జనమార్జితస్య రక్షణం తస్య నాశవ్యయాదిషు చాత్యంతదుఃఖితాః,

మాయయా మోహితాః కామక్రోధాతిదుష్టమనసస్సదాసూయపరాయణా, పరస్వపరస్త్రీహరణోపాయ

పరాయణాః పుత్రమిత్ర కలత్రాదిభరణోపాయ చింతాపరాణాః, వృధాహంకారదూషితాః పుత్రాదిషు

వ్యాధ్యాదిపీడిత్యేషు, సత్సు సర్వవ్యాప్తిం పరిత్యజ్య రోగాదిభిః క్లేశితానాం సమీపే స్వయమాధ్యాత్మికదుఃఖేన

పరిప్లుతా వక్ష్యమాణప్రకారేణ చింతామశ్నువతే. 27

గృహక్షేత్రాది కర్మ కించిన్నాపి విచారితమ్‌, సమ-ద్ధస్య కుటుంహస్య కథం భవతి వర్తనమ్‌. 28

మమ మూలధనం నాస్తి వృష్టిశ్చాపి న వర్షతి, అశ్వః పలాయితః కుత్ర గావః కిం నాగతా మమ. 29

బాలాపత్యా చ మే భార్యా వ్యాధితో హం చ నిర్ధనః, అవిచారాత్కృషిష్టా పుత్రా రుదంతి చ 30

భగ్నం ఛిన్నం తు పద్మ బాంధవా అపి దూరగాః, న లభ్యతే వర్తనం చ రాజబాధాతుదుస్సహా. 31

రిపవో మాం ప్రదావంతి కథం జేష్యామ్యహం రిపూన్‌, వ్యవసాయాక్షమశ్చాహం ప్రాప్తాః ప్రాఘార్ణికా అమీ. 32

ఏవమత్యంతచింతాకులః స్వదుఃఖాని నివారయితుమక్షయో ధిగ్విధిం భాగ్యహీనం మాం కిమర్ధం విదధే ఇతి దైవమాక్షిపతి. 33

పిమ్మట ¸°వనమును పొంది ధనమును సంపాదించుచు సంపాదించిన ధనమును రక్షించుచు, ధనము నష్టమైనను, వ్యయమైనను మిక్కిలి దుఃఖించుచు మాయామోహితులై కామ క్రోధాదులచే చెడిన మనసుగలవారై ,ఎపుడూ అసూయ పరులై పరులధనమును, పరస్త్రీలను హరించు ఉపాయములను ఆలోచించుచు, పుత్ర మిత్ర కలత్రాదులను పోషించు ఉపాయములను విచారించుచు వ్యర్ధమగు అహంకారముచే దూషితులై, పుత్రాదులు వ్యాధిపీడుతులైనపుడు అన్ని వ్యాపకములను వదలి, రోగాదులచే పీడించబడువారి సమీపమున స్వయముగా ఆధ్యాత్మికాది దుఃఖములచే పీండీంచబడుచు ఇట్లు చింతించెదరు. ఇల్లు పొలము మొదలగుస్థిరాస్తిని గూర్చి ఏ మాత్రమాలోచించకపోతిని. ఇంత పెద్దకుటుంబమెట్లు పోషించబడును. నాకు మూలధనములేదు. వర్షముకూడా కురియుటలేదు. గుఱ్ఱములెటు పారిపోయినవో, గోవులు ఇంకనూ ఇల్లు చేరలేదు. నాభార్యకు చిన్న చిన్న వయసు గల పిల్లలున్నారు. నేను వ్యాధిగ్రస్తుడనైతిని. ధనహీనుడను. ఆలోచించనందున వ్యవసాయము నశించినది. పుత్రులెప్పుడూ రోదించుచున్నారు. నా ఇల్లు భగ్నమైనది. బంధువులు దూరములోనున్నారు. బ్రతుకు తెరువు లబించుట లేదు. రాజబాధ దుస్సహముగానున్నది. శత్రువులు బాధించుచున్నారు. నేనెట్లు శత్రువులను గెలిచెదను. ప్రయత్నశూన్యుడనైతిని. వ్యాధులన్నీ ఒకేసారొచ్చినవి. ఇట్లు మిక్కిలి దుఃఖాకులుడై తన దుఃఖములను నివారించ జాలక ఈ విధి నన్నెందుకు భాగ్యహీనుని చేసెను, అని దైవము నాక్షేపించును. 27-33

తథా వృద్ధత్వమాపన్నో హీయమానసారో జరాపలితాదివ్యాప్తదేహో వ్యాధిబాధ్యత్వాదికమాపన్నః,

ప్రకంపమానాయవశ్వాసవాసాది పీడితో, లోలావిలోచనః శ్లేష్మవ్యాప్త కంఠః పుత్రదారాదిభిర్త్యమానః కదా

మరణముపయామీతి చింతాకులోమయి మృతే సతి మదార్జితం గృహక్షేత్రాదికం 34

వస్తుపుత్రాదయః కథం రక్షంతి, కస్య వాభవిష్యతి.

మద్ధనే పరైరపహృతే పుత్రాదీనాం కథం వర్తనం భవిష్యతీతి మమతా దుఃఖపరిప్లుతో గాఢం నిశ్శ్వస్య స్వేన

వయసా కృతాని కర్మాణి పునఃపునస్స్మరన్‌ క్షణ విస్మరతి చ సంతతస్త్వా సన్నమరణో.35

వ్యాధిపీడితో న్తస్తాపార్తః క్షణం శయ్యాయాం, క్షణం మంచే చ తతస్తతః పర్యటన్‌ క్షుత్రృట్‌ పరిపీడితః

కించిన్మాత్ర ముదకం దేహీతి కార్పణ్యన యాచమానస్తాత్రాపి జ్వరావిష్టానాముదకం

న శ్రేషస్కరమితి బ్రువతో మనసాద్వేషం కుర్వన్మన్దచైతన్యో భవతి. 36

తతశ్చ హస్తపాదాకర్షణ న తు క్షమో రుదద్భిర్బందుజనైర్వేషితో వక్తుమక్షమస్సావర్జిత ధనాదికం

కస్య భవిష్యతీతి చింతాపరో బాష్పావిలవిలోచనః కంఠే ఘరఘరరాయమాణ సతి శరీరాన్నిష్క్రాంతప్రాణో

యమదూతైర్భర్త్సమానః పాశయన్త్రితో నరకాదీన్పూర్వవదశ్నుతే. 37

అట్లే వృద్ధత్వమును పొంది బలముడిగి, వార్ధక్యముచే ముడతలు పడిన దేహము కలవాడై తెల్లబడిన కేశములు కలిగి మురికి పట్టిన శరీరముచే వ్యాధులచే బాధించబడుచు వణుకుచున్న అవయవమువతో ఊపిరి పీల్చరాక ఆయాసముచే కనులు తిరుగగా చూడదగిన దానిని చూడజాలక కంఠమున శ్లేష్మము నిండి భార్యపుత్రాదులచే చీదరించబడుచు ఎపుడుమరణించెదనా అని చింతించుచు, నేను మరణించినచో నేను సంపాదించిన గృహక్షేత్రాదికములను నా పుత్రులెట్లు కాపాడెదరో , ఎవరికి చెందునో? నా సంపదను ఇతరులపహించినచో నా పుత్రాదులెట్లు బ్రతికెదరు ? అని మమకారముచే దుఃఖముచే గాఢముగా నిట్టూర్చి తాను ¸°వనములో చేసిన పనులను మాటిమాటికి తలచుకొనుచు, అంతలోనే మరచుచు మరణము సమీపించగా వ్యాధి పీడితుడై , మానసిక సంతాపముచే ఆర్తుడై కొంతసేపు అటు నిటు తిరుగుచు ఆకలిదప్పులు పీడించగా కొంచెము నీరిమ్మని అతిదీనముగా యాచించుచు, అక్కడున్నవారు జ్వరము వచ్చిన వారికి నీరీయకూడదగని చెప్పుచుండగా వారిని మనసులో ద్వేషించుచు తెలివి తప్పుచుండును. తరువాత కాలుచేతులు కదల్చలేక రోదించు బంధుజనులతో కూడినవాడై, ఏమియూ చెప్పజాలక తాను సంపాదించిన ధనాదికమెవరి పాలగునో అని చింతించుచు నీరు నిండిన కనులతో కంఠమున ఘర ఘర ధ్వని వచ్చుచుండగా శరీరమునుండి ప్రాణములు పోవుచుండగా యమదూతలు బెదిరించుచు పాశముచే కట్టగా మొదటచెప్పిన విధముగా నరకాదులననుభవించును. 34-37.

ఆమలప్రక్ష యాద్యద్వదగ్నౌ ధ్యామంతి ధాతవః, తథైవ జీవినస్సర్వే ఆకర్మప్రక్షయాద్భృశమ్‌. 38

తస్మాత్సంసారదావాగ్నితాపార్తో ద్విజసత్తమ, అభ్యసేత్పరమంజ్ఞానం జ్ఞానాన్మోక్షమవాప్నుయాత్‌. 39

జ్ఞానాశూన్యా నరా యే తు పశవః పరీకీర్తితాః, తస్మాత్సంసారమోక్షాయ పరం జ్ఞానం సమభ్యసేత్‌. 40

మానుష్యం చైవ సంప్రాప్య సర్వకర్మప్రకాధకమ్‌ , హరిం న సేవతే యస్తు కో న్యస్తస్మాదచేతనః. 41

అహో చిత్రమహోచిత్రమహోచిత్రం మునీశ్వరాః, ఆస్థితే కామదే విష్ణౌ నరా యాంతి హి యాతనామ్‌. 42

నారాయణ జగన్నాథే సర్వకామఫరప్రదే, స్థితే పి జ్ఞన రహితాః పచ్యంతే నరకేష్వహో. 43

స్రవన్మూత్రపురీషే తు శరీరే స్మిన్న శాశ్వతే , శాశ్వతం భావయంత్యజ్ఞా మహామోహసమావృతాః. 44

కుత్సితం మాంసరక్తాద్యైర్దేహం సంప్రాప్య యో నరః, సంసారచ్చేదకం విష్ణుం న భ##జేతో తి పాతకీ. 45

అహో కష్టమహోకష్టం హి మార్ఖాతా, హరిధ్యానపరో విప్ర చండాలో పి మహాసుఖీ. 46

స్వదేహాన్నిత్సృతం దృష్ట్వా మలమూత్రాది కిల్బిషమ్‌, ఉద్వేగం మానవా మూర్ఖా కిం న యాంతి హి పాపినః. 47

దుర్లభం మానుషం జన్మ ప్రార్ధ్యతే త్రదశైరపి, తల్లబ్ధ్వా పరలోకార్ధం యత్నం కుర్యాద్విచక్షణః. 48

ఆధ్యాత్మజ్ఞానసంపన్నా హరిపూజాపరాణాః, లభ##న్తే పరమం స్థానం పునారావృత్తిదుర్లభమ్‌. 49

యతో జాతమిదం విశ్వం యతశ్చైతన్యమశ్నుతే , యస్మింశ్చ విలయం యాతి స సంసారస్య యోచకః .50

నిర్గుణో పి పరో నన్తో గుణవానివ భాతి యః, తం సమభ్యర్చ్య దేవేశం సంసారాత్పరి ముచ్యతే. 51

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే

ప్రథమ భాగే భవాటవీనిరూపణం నామ

ద్వాత్రింశోధ్యాయః

ధాతువులు మలక్షయము వరకు అగ్నిలో దాహమగునట్లు జీవులు కర్మక్షయమగువరకు సంసారాగ్నిలో దహింపబడుదురు. కావున సంసారదావాగ్ని తాపార్తుడగు మానవుడు పరమజ్ఞానము నభ్యసించవలయును. జ్ఞానమువలన మోక్షము లభించును. జ్ఞానశూన్యులగు మానవులు పశువలనబడుదురు. కావున సంసారవిముక్తి కి పరమజ్ఞానము నభ్యసించవలయును. అన్ని కర్మలను చక్కగా నిర్వహించగల మానవత్వమును పొంది శ్రీహరిని సేవించకున్న అతనికన్నా అజ్ఞాని ఎవడుండును? అన్నికోరికలను తీర్చు శ్రీహరి యుండగా మానవులు నరకమునకు వెళ్ళుట ఎంత విచిత్రము? ఎంత విచిత్రము. ఇది గొప్ప వింతయే. జగన్నాథుడు సర్వకర్మఫల ప్రదుడగు అగు నాలాయణుడున్ననూ మానవులు జ్ఞానశూన్యులై నరకములో మ్రగ్గుచుందురు. మూత్రపురీషములు స్రవించునశ్వరమైన శరీరమును మాయోమోహావిష్టులగు అజ్ఞానులు నిత్యమని భావింతురు. రక్తమాంసములచే దూషితమదు శరీరమును పొందిన మానవుడు సంసారమును ఛేదించు విష్ణువును భజించనిచో మహాపాపియగును. మూర్ఖత్వము చాల కష్టములను కలిగించును. హరి ధ్యానపరుడగు చండాలుడు కూడా ఆనందించును. తన దేహమునుండి వెలువడు మలమూత్రాది కిల్బిషమును చూచిన మానవులు ఉద్వేగము నెట్లు పొందకుందురు? మానవజన్మ పరమదుర్లభము. దేవతలు కూడా ఈ జన్మకై ప్రార్థనలు చేతురు. అట్టి మానవజన్మను పొంది పరలోకము కొరకు వివేకము కలవాడు ప్రయత్నించవలయును. అధ్యాత్మజ్ఞానము కలగి హరిపూజా పరాయణులైన వారు పునరావృత్తిదుర్లభమగు పరమపదమును పొందెదరు. ఈ ప్రపంచము ఎవరివలన పుట్టెనో, ఎవరివలన చైతన్యమును పొంది ఎవరిలో లీనమగునో అతనే సంసారమునుండి విముక్తిని ప్రసాదించును. నిర్గుణుడైనను భాసించు శ్రీహరిని చక్కగా పూజించి సంసారమునుండి విముక్తుడగు ను. 38-51

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున

éప్రథమపాదమున భవాటవీనిరూపణమను ముప్పదిరెండవ అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page