Sri Naradapuranam-I    Chapters    Last Page

అస్మద్గురుభ్యో నమః

ఓం నమో భగవతే కృష్ణద్వైపాయనాయ వ్యాసాయ

శ్రీవ్యాసమహర్షిప్రణీతం

శ్రీనారదీయ మహాపురాణమ్‌

పూర్వభాగః

ప్రథమపాదః

ప్రథమో7ధ్యాయః

పురాణమాహాత్మ్యకథనమ్‌

వ్యాసం వసిష్ఠనప్తారం శ##క్తేః పౌత్రమకల్మషమ్‌

పరాశరాత్మజం వన్దే శుకతాతం తపోనిధిమ్‌

ఓం శ్రీగురుభ్యో నమః

ఓం శ్రీగణశాయ నమః

ఓం నమో భగవతే వాసుదేవాయ

ఓమ్‌. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌, దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్‌.

ఓం వేదవ్యాసాయ నమః

వన్దే బృందావనాసీనమిందిరానన్దమందిరమ్‌, ఉపేన్ద్రం సాన్ద్రకారుణ్యం పరానన్దం పరాత్పరమ్‌. 1

బ్రహ్మవిష్ణుమహేశాఖ్యా యస్యాంశా లోకసాధకాః, తమాదిదేవం చిద్రూపం విశుద్ధం పరమం భ##జే. 2

శౌనకాద్యా మహాత్మాన ఋషయో బ్రహ్మవాదినః, నైమిశాఖ్యే మహారణ్య తపస్తేపుర్ము ముక్షవః.3

జితేన్ద్నియా జితాహారాః సన్తస్సత్యపరాక్రమాః, యజన్తః పరయా భక్త్యా విష్ణుమాద్యం సనాతనమ్‌.4

అనీర్ష్యాస్సర్వధర్మజ్ఞా లోకానుగ్రహతత్పరాః, నిర్మమా నిరహంకారాః పరస్మిన్వ్రతమానసాః.5

న్యస్తకామా వివృజినాః శమాదిగుణసంయుతాః, కృష్ణాజినోత్తరీయాస్తే జటిలా బ్రహ్మచారిణః.6

గృణన్తః పరమం బ్రహ్మ జగచ్చక్షుస్సమౌజసః, ధర్మశాస్త్రార్థతత్త్వ జ్ఞాస్తేపుర్నైమిశకాననే.7

యజ్ఞైర్యజ్ఞపతిం కేచిత్‌ జ్ఞానైర్ఞానాత్మకం పరే, కేచిచ్చ పరయా భక్త్యా నారాయణమపూజయన్‌.8

ఆది ఋషియైన నారాయణ మహర్షిని, ఉత్తమ మానవుడైన నరమహర్షిని సరస్వతీదేవిని నమస్కరించి జయమును పలుకవలయును.

బృందావనములో కూర్చొనియున్నవాడు, లక్ష్మీదేవి ఆనందమునకు నివాసనభూతుడు, గాఢమైన దయకలవాడు పరముల కంటే పరుడు, అన్ని ఆనందముల కంటే ఉత్తమానంద స్వరూపుడు అయిన ఉపేన్ద్రునకు (శ్రీకృష్ణునకు) నమస్కారము. లోకములను కాపాడు బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఎవని అంశరూపులో అట్టి జ్ఞన స్వరూపుడు పరిశుద్ధుడు పరముడు అయిన ఆదిదేవుని సేవింతును.

మహానుభావులు, ఋషులు, వేదాధ్యయనపరులు, ఇంద్రియములను జయించినవారు, ఆహారనియమము కలవారు, సత్పరుషులు, సత్యబలలు, అసూకయలేనివారు, అన్ని ధర్మలులు తెలిసినవారు, లోకములను అనుగ్రహించుట యందు ఆసక్తి కలవారు అహంకారమమకారములు లేనివారు, పరమాత్మయందే మనసును నిలిపినవారు, కోరికలను విడిచిన వారు, పాపరహితులు, శమదమాదిగుణములు కలవారు, జింకచర్మమును ధరించినవారు, జడలను ధరించి బ్రహ్మచర్యము నాచరించువారు, సూర్యునితో సమానమైన తేజస్సు కలవారు అయిన శౌనకుడు మొదలగు మహర్షులు ధర్మశాస్త్రార్థతత్త్వమును తెలిసినవారై నైమిశమగను పేరుగల అరణ్యమున శ్రీమహావిష్ణువును ఆరాధించుచు తపమును చేయుచుండిరి. మోక్షమును కోరుచు కొందరు యజ్ఞపతిని గూర్చి యాగములను చేయుచుండిరి. కొందరు జ్ఞానస్వరూపుని జ్ఞానముతో , మరికొందరు ఉత్తమభక్తితో శ్రీమన్నారాయణుని పూజించు చుండిరి.

ఏకదా తే మహాత్మానః సమాజం చక్రురుత్తమాః, ధర్మార్థకామమోక్షాణాముపాయాన్‌ జ్ఞాతుమిచ్ఛవః.9

షడ్వింశతి సహస్రాణాం మానీనామూర్ధ్వరేతనామ్‌, తేషాం శిష్యప్రశిష్యాణాం సంఖ్యా వక్తుం న శక్యతే.10

మునయో భావితాత్మానో మిలితాస్తే మహౌజసః, లోకానుగ్రహకర్తారో వీతరాగా విమత్సరాః.11

కాని క్షేత్రాణి పుణ్యాని కాని తేర్థాని భూతలే, కథం వా ప్రాప్యతే ముక్తిర్నృణాం తాపార్తచేతసామ్‌.12

కథం హరౌ మనుష్యాణాం భక్తిరవ్యభిచారిణీ, కేన సిధ్యేతా చ ఫలం కర్మణస్త్రి విధాత్మనః.13

ఇత్యేవం ప్రష్టుమాత్మానముద్యతాన్ప్రేక్ష్య శౌనకః, ప్రాంజలిర్వాక్యమాహేదం వినయావనతస్సుధీః. 14

మహానుభావులు, ఆత్మస్వరూపము తెలిసినవారు, గొప్పతేజస్సు కలవారు, రాగద్వేషములు లేనివారు, లోకములను అనుగ్రహించదలచినవారు అయిన ఆ శౌనకాది మహామునులు ఇరువదిఆరువేల మంది. వారి శిష్యులను, ప్రశిష్యులను లెక్కించలేము. ఒకనాడు జితేంద్రయులైన వారందరు ధర్మార్థకామమోక్షములను పొందుటకు ఉపాపయములను తెలయగోరి ఒకచోట సమావేశ##మైరి. ఈ భూలోకమున ఏవి పుణ్యక్షేత్రములు? ఏవి పుణ్యతీర్థములు? తాపత్రయములచే వెతలను పొందుచున్న మానవులు ఏ సాధనముచే మోక్షమును పొందగలదు? శ్రీమన్నారాయణుని యందు చలించని భక్తి ఎట్లు కలుగును? కాయిక వాచిక మానసిక కర్మల ఫలము లభించు సాధనమేది? అని తనను అడుగుటకు సిద్ధపడిన మునులను చూచి శౌనక మహర్షి విద్వాంసుడు కావున వినయముతో చేతులు జోడించి ఇట్లు పలికెను. 9-14

శౌనక కువాచ:-

ఆస్తే సిద్ధాశ్రమే పుణ్య సూతః పౌరాణికోత్తమః, యజన్మఖైర్భహువిధైర్విశ్వరూపం జనార్దనమ్‌. 15

స ఏతదఖిలం వేత్తి వ్యాసశిష్యో మహామునిః, పురాణసంహితావక్తా శాన్తో వై రోమహర్షణీః.16

యుగే యుగే ల్పకాన్ధర్మాన్నిరీక్ష్య23 మధుసూదనః వేదవ్యాసస్వరూపేణ వేదభాగం కరోతి వై.17

వేదవ్యాసమునిస్సాక్షాన్నారాయణ ఇతి ద్విజాః, శుశ్రుమ స్సర్వశాస్త్రేషు సూతస్తు వ్యాపశాసితః.18

తేన సంశాసితస్సూతో వేదవ్యాసేన ధీమతా, పురాణాని స వేత్త్యేవ నాన్యో లోకే తతః పరః.19

స పురాణార్థవిల్లోకే స సర్వజ్ఞస్సబుద్ధిమాన్‌, స శాన్తో మోక్షధర్మజ్ఞః కర్మభక్తికలాపవిత్‌.20

వేదవేదాంతగశాస్త్రాణాం కసారభూతం మునీశ్వరాః, జగద్ధితార్థం తత్సర్వం పురాణషూక్తవాన్మునిః.21

జ్ఞానార్ణవో వై సూతస్తత్సర్వతత్త్వార్థకోవిదః, తస్మాత్తమేవ పృచ్ఛామ ఇత్యూచే శౌనకో మునీన్‌.22

శౌనకమహర్షి చెప్పెను

పవిత్రమైన సిద్ధాశ్రమములో పౌరాణికోత్తముడైన సూతుడు విశ్వరూపుడైన జనార్దనుని పలువిధములైన యజ్ఞములతో పూజించుచూ ఉన్నాడు. వ్యాసభగవానుని శిష్యుడు, మహాముని, శాంతుడు అయిన సూతమహర్షి ఈ విషయములన్నియు చక్కగా తెలిసినవాడు. పురాణములన్నింటిని చెప్పువాడు కూడా. ప్రతియుగమునందు ధర్మములు క్షీణించుటను చూచిన శ్రీమన్నారాయణుడు వేదవ్యాసావతారముతో వేదవిభాగమును చేసెను. వేదవ్యాకసభగవానులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని అన్ని శాస్త్రములు చెప్పుచుండగా వినుచుంటిమి. సూతమహర్షి అట్టి వ్యాసభగవానులవద్ద విద్యలనభ్యసించినవాడు. ఇట్లు వేద్యవాస్యమహర్షి వద్ద బాగుగా అధ్యయనము చేసిన సూతమహర్షి అన్ని పురాణములను చక్కగా తెలిసినవాడు. ఈ లోకమును సూతమహర్షి కంటే చక్కగా పురాణములు తెలిసిన వారు మరొకరు లేరు. సూతమహర్షి పురాణములు బాగుగా తెలిసినవాడు, సర్వజ్ఞుడు, బుద్ధిమంతుడు, శాంతుడు, మోక్షధర్మములు తెలిసినవాడు, కర్మ భక్తుల వివరములను సాంగోపాంగములతో తెలిసినవాడు వేదముల, వేదాంగముల శాస్త్రముల సారమునంతటిని లోకముల హితము కొఱకు వేదవ్యాసభగవానుడు పురాణములలో చెప్పియున్నాడు. జ్ఞానసాగరుడైన సూతమహర్షి ఆ పురాణముల తత్త్వార్థమునంతయూ చక్కగా తెలిసినవాడు. కావున మనమందరము వెళ్ళి ఆ సూతమహర్షినే అడిగెదము అని శౌనకుల వారు పలికిరి. 15-22

తతస్తే మునయస్సర్వే శౌనకం వాగ్విదాం పరమ్‌, సమాశ్లిష్య సుసంప్రీతాః సాధు సాధ్వితి చాబ్రువన్‌.23

అథ తే మునయో జగ్ముః పుణ్యం సిద్ధాశ్రమం వనే, మృగవ్రజసమాకీర్ణం మునిభిః పరిశోభితమ్‌.24

మనోజ్ఞభూరుహలతాఫలపుష్పవిభూషితమ్‌, యుక్తం సరోభిరచ్ఛోదైరతిద్యాతిథ్య సంకులమ్‌.25

తే తు నారాయణం దేవమనన్తమపరాజితమ్‌, యజన్తమగ్నిష్టోమేన దదృశూ రోమహర్షణిమ్‌.26

యథార్హమర్చితాస్తేన సూతేన ప్రథితౌజసః, తస్యావభృథమీక్షన్తస్తత్ర తస్థుర్మఖాలయే.27

అధ్వరావభృథస్నాతం సూతం పౌరాణికోత్తమమ్‌, పప్రచ్ఛుస్తే సుఖాసీనం నైమిశారణ్య వాసినః. 28

శౌనకమహర్షి మాటలను వినిన ఋషులందరూ మాటలాడువారిలో నేర్పరియైన శౌనకమహర్షిని ఆలింగనము చేసుకొని సంతుష్టాంతరంగులైన బాగు బాగని అభినందించిరి. తరువాత ఆ మునులందరు మృగముల సమూహములతో మునులతో కూడియున్న, సుందరమైన వృక్షములతో తీగెలతో పూవులతో ఫలములతో శోభించుచున్న, స్వచ్ఛమైన నీరుగల సరస్సలుకల, అతిధులతో, ఆతిధ్యములతో సంకులమైన పవిత్రమైన సిద్ధాశ్రమమునకు వెళ్ళిరి. ఆ ఆశ్రమమున అనన్తుడు అపరాజితుడు అయిన శ్రీమన్నారాయణుని అగ్నిష్టోమయాగముచే పూజించుచున్న సూతమహర్షిని చూచిరి. ప్రసిద్ధమైన తేజస్సు గల మునులు సూతమహర్షిచే పూజించబడి అవభృథస్నానము కొఱకు నిరీక్షీంచుచుండిరి. నైమిశారణ్య వాసులగు మునులు అవభృథస్నానము చేసి సుఖాసీనుడైయున్న పౌరాణికోత్తముడైన సూతమహర్షిని ఇట్లు అడిగిరి. 23 -28

వయం త్వతిథయః ప్రాప్తా ఆతిధేయాస్తు సువ్రత! జ్ఞానదానోపచారేణ పూజయాస్మాన్యథావిధి. 29

దివౌకసో హి జీవన్తి పీత్వా చన్ద్రకలామృతమ్‌, జ్ఞానామృతం భూపసురాస్తలు మునే త్వన్మఖనిస్సృతమ్‌.30

యేనేదమఖిలం జాతం యదాధారం యదాత్మకమ్‌, యస్మిన్పృతిష్ఠితం తాత యస్మిన్వా లయమేష్యతి.31

కేన విష్ణుః ప్రసన్నః స్యాత్‌ స కథం పూజ్యతే నరైః కథం వర్ణాశ్రమాచారశ్చాతిథేః పూజనం కథమ్‌.32

సఫలం స్యాద్యథా కర్మ మోక్షోపాయః కథం నృణామ్‌, భక్త్యా కిం ప్రాప్యతే పుంభిస్తధా భక్తిశ్చ కీదృశీ. 33

పద సూత మునిశ్రేష్ఠ! సర్వమేతదసంశయమ్‌, కస్య నో జాయతే శ్రద్ధా శ్రోతుం త్వద్వచనామృతమ్‌. 34

ఋషులు పలికిరి. ఆతిథ్యమును పొందదగిని అతిధులము మేము వచ్చితిమి. జ్ఞానమును దానము చేసి శాస్త్రోక్తముగా మమ్ములను పూజించుము. దేవతలు చంద్రకళను అమృతమును త్రాగి జీవింతురు. నీ ముఖమునుండి వెలువడు జ్ఞానామృతమును గ్రోలి బ్రాహ్మణులు జీవింతురు. ఈ ప్రపంచమంతయూ ఎవనిచే పుట్టినది? ఈ ప్రపంచమునకు విష్ణువు ఏమి చేసినచో ప్రసన్నుడగును? మానవులు ఎట్లు పూజింతుదరు? వర్ణాశ్రమాచారములెట్లుండును? అతిథినెట్లు పూజించవలయును? చేసిన పని ఎట్లు సఫలమగును? మానవులు మోక్షమును పొందు ఉపాయమేది? భక్తిచే మానవులు పొందునదేది? ఆ భక్తి ఎటువంటిది? ఓ మునిశ్రేష్ఠా! సూతమహర్షి మా సంశయములు తొలగునట్లు ఈ విషయమంతయు తెలియజేయుము. నీ అమృత వాక్కులను వినుటకు ఎవనికి శ్రద్ధ కలుగదు?

సూత ఉవాచ

శృణుధ్వమృషయస్సర్వే యదిష్టం వో వదామి తత్‌, గీతం సనకముఖ్యైస్తు నారదాయ మహాత్మనే. 35

పురాణం నారదోపాఖ్యమేతద్వేదార్థసంమితమ్‌, సర్వపాపప్రశమనం దుష్టగ్రహనివారణమ్‌. 36

దుస్స్వప్ననాశనం ధర్మ్యం భుక్తిముక్తి ఫలప్రదమ్‌, నారాయణకథోపేతం సర్వకళ్యాణకారణమ్‌. 37

ధర్మార్ధకామమోక్షాణాం హేతుభూతం మహాఫలమ్‌, అపూర్వపుణ్యఫలదం శృణుధ్వం సుసమాహితాః. 38

మహాపాతకయుక్తో వా యుక్తో వాప్యుపాతకైః, శ్రుత్వైతదార్షం దివ్యం చ పురాణం శుద్ధిమాప్నుయాత్‌.39

యుసై#్యకాధ్యాయపఠనాద్వాజిమేధఫలం లభేత్‌, అధ్యాయద్వయపాఠేన రాజసూయఫలం తథా. 40

జ్యేష్ఠమాసే పూర్ణిమాయాం మూలర్ష్కే ప్రయతో నరః, స్నాత్వా చ యమునాతోయే మధురాయాముపోషితః.41

అభ్యర్చ్యవిధివత్కృష్ణం యత్ఫలం లభ##తే ద్విజః, తత్ఫలం సమవాప్నోతి అధ్యాయత్రయపాఠతః.42

తత్ప్రవక్ష్యామి వస్సమ్యక్‌ శృణుధ్వం గదతో మమ, జన్మాయుతార్జితైః పాపైర్ముక్తః కోటికులాన్వితః.43

బ్రహ్మణః పదమాసాద్య తత్రైవ ప్రతితిష్ఠతి, శ్రుత్వాస్య తు దశాధ్యాయాన్భక్తిభావేన మానవః. 44

నిర్వాణముక్తిం లభ##తే నాత్ర కర్యా విచారణా, శ్రేయసాం పరమం శ్రేయః పవిత్రాణామనుత్తమం.45

సూత మహర్షి పలికెను

ఓ ఋషులారా! మీకిష్టమైనదానిని చెప్పెదను వినుడు. పూర్వము సనకాదులు నారదమహర్షకి చెప్పిన దానిని మీకు చెప్పెదను. దీనికి నారదపురాణమని పేరు. ఈ నారదపురాణము వేదార్థముతో సమానము. అన్ని పాపములను నశింపచేయునది. దుష్టగ్రహములను నివారించును. దుఃస్వప్నములను నశింపజేయును. ధర్మమును బోధించును. భోగఫలమును మోక్షఫలమును ఇచ్చును. నారాయణకథలతో కూడియున్నది. అన్ని శుభములకుమూలకారణమిదియే. ధర్మార్థకామమోక్షములకు కారణమైన మహాఫలము నొసంగును. ఇదివరకెప్పుడూ లభించని పుణ్యఫలమునిచ్చు నీ నారదపురాణమును సావధానముగా వినుడు. మహాపాపములు కలవాడైనను, ఉపపాతకములు కలవాడైనను ఋషిప్రోక్తము, దివ్యము అయిన ఈ నారదపురాణమును విని పరిశుద్ధుడగును. ఈ నారదపురాణములో ఒక అధ్యాయమును చదివినచో అశ్వమేధయుగమును చేసిన ఫలమును పొందును. రెండు అధ్యాయములను చదివినచో రాజసూయయాగ ఫలమును పొందును. జ్యేష్ఠమాసమున పూర్ణిమాతిథియందు మూలానక్షత్రమున సావధానుడైన మానవుడు యమునానదిలో స్నానమాడి మధురలో ఉపవాసముచేసి శ్రీకృష్ణుని పూజించిని కలుగు ఫలితము మూడు అధ్యాయములను చదివినచో కలుగును. ఆ నారదపురాణమును నేను చెప్పెదను. చక్కగా వినుడు. మానవుడు కోటి కులములలో, వేల జన్మలతో సంపాదించిన పాపములను నశింపచేసుకొని బ్రహ్మలోకమును చేరి అక్కడే స్థిరనివాసమేర్పరచుకొనును. భక్తి భావముతో ఈ నారదపురాణములో పది అధ్యాయములను చదివి నిర్వాణమోక్షమును పొందును. ఈ విషయమున సంశయించ వలసిన పనిలేదు. అన్ని శ్రేయన్సులలో ఉత్తమమైన శ్రేయస్సు సాటిలేని పవిత్రత కలది ఈ నారదపురాణము. 35-45

దుస్స్వప్ననాశనం పుణ్యం శ్రోతవ్యం యత్నతో ద్విజాః, శ్రద్ధయా సహితో మర్త్యః శ్లోకం శ్లోకార్థమేవ వా.46

పఠిత్వా ముచ్యతే సద్యో మహాపాతకరాశిభిః, సతామేవ ప్రవక్తవ్యం గుహ్యోద్గుహ్యతరం యతః.47

వాచయేత్పురతో విష్ణోః పుణ్యక్షేత్రే ద్విజాంతికే, బ్రహ్మద్రోహపరాణాం చ దంభాచారయుతాత్మనామ్‌.48

జనానాం బకవృత్తీనాం న బ్రూయాదిదదముత్తమమ్‌, త్యక్తకామాదిదోషాణాం విష్ణుభక్తిరతాత్మనామ్‌.49

సదాచారపరాణాం చ వక్తవ్యం మోక్షసాధనమ్‌, సర్వదేవమయే విష్ణుస్స్మరతామార్తినాశనః. 50

సద్భక్తివత్సలో విప్రా భక్త్వా తుష్యతి నాన్యథా, అశ్రద్ధయాపి యన్నామ్ని కీర్తితే థ స్మృతే పి వా. 51

విముక్తః పాతకైర్మర్త్యో లభ##తే పదమవ్యయమ్‌, సంసారఘోరకాన్తారదావాగ్నిర్మధుసూదనః.52

స్మరతాం సర్వపాపాని నాశయత్యాశుసత్తమాః, తదర్థద్యోతకమిదం పురాణం శ్రావ్యముత్తమమ్‌.53

శ్రవణాత్పఠనాద్వాపి సరర్వపాపవినాశకృత్‌, యస్యాస్య శ్రవణ బుద్దిర్జాయతే భక్తిసంయుతా. 54

స ఏవ కృతకృత్యకస్తు సర్వశాస్త్రార్థకోవిదః, యదర్జితం తపః పుణ్యం తన్మన్యే సఫలం ద్విజాః.55

యదస్య శ్రవణ భక్తిరన్యథా న హి జాయతే, సత్కథాసు ప్రవర్తన్తే సజ్జనా యే జగద్ధితాః.56

దుస్స్వప్నములను నశింపచేయు పవిత్రమైన ఈ నారదపురాణమును ప్రయత్నముతో వినవలయును. శ్రద్ధతో మానవుడు ఒక శ్లోకమును, సగము శ్లోకమునైనను చదివినచో వెంటనే మహాపాతకముల నుండి ముక్తుడగును. పరమ రహస్యమైన ఈ నారదపురాణమును సజ్జనులకు మాత్రమే చెప్పవలయును. పుణ్యక్షేత్రమున బ్రాహ్మణుల సమీపమున శ్రీమన్నారాయణుని ముందు చదివించవలయును (చెప్పవలయును). ఈ నారదపురాణమును బ్రహ్మద్రోహులకు, బూటకపు ఆచారమును నటించువారలకు, కొంగలవలె వంచననే బ్రతుకును కొనసాగించువారలకు చెప్పరాదు. మోక్షసాధనమైన ఈ నారదపురాణమును కామాదిదోషణములను వదిలి విష్ణుభక్తియందలి ప్రీతికలిగిన మనసుకల సదాచారపరులకు మాత్రమే చెప్పవలయును.

తనను స్మరించువారి బాధలను తోలగించువాడు, సద్భక్తి యందు వాత్సల్యము కలవాడు, అందరు దేవతల రూపములతో నుండువాడు అయిన శ్రీమహావిష్ణువు భక్తిచే మాత్రమే సంతోషించును. మరియొకదానితో సంతోషించడు. శ్రీహరినామమును అశ్రద్ధతోనైనను కీర్తించినను, తలచినను మానవుడు అన్నిపాపములనుండి విముక్తుడై నాశములేని మోక్షపదమును పొందును. సంసారమను భయంకరమైన అరణ్యమునకు దావాగ్నియైన శ్రీమహావిష్ణువు తనను స్మరించువారి పాపములను వెంటనే నశింపచేయును. ఈ నారదపురాణము ఈ యర్థమునే తెలియజేయునది. కావున ఉత్తమమైన ఈ పురాణము తప్పక వినదగినది. ఈ పురాణమును వినినను, చదివిననూ అన్నిపాపములు నశించును. ఈ నారదపురాణమును వినవలయునని భక్తితో సంకల్పము కలగిన మానవుడే కృతకృత్యుడు. అతనే అన్ని శాస్త్రార్థములు తెలిసిన విద్వాంసుడు. అతను చేసిన తపస్సు, సంపాదించిన పుణ్యము సఫలము. తపము పుణ్యము లేనిచో ఈ నారదపురాణమును వినవలయుననెడు బుద్ది కలుగదు. జగద్ధితమునుకోరు సజ్జనులు మాత్రమే సత్కథలను వినుటకు సంకల్పింతురు. 46-56

నిందాయాం కలహే వాపి హ్యసన్తః పాపత్పతరాః, పురాణష్వర్ధవాదత్వం యే వదన్తి నరాధమాః.57

తైరర్జితాని పుణ్యాని క్షయం యాన్ని ద్విజోత్తమాః, సమస్తకర్మ నిర్మూలసాధనాని నరాధమః. 58

పురాణాస్యర్థవాదేన బ్రువన్నరకమశ్నుతే, అన్యాని సాధయన్త్యేవ కార్యాణి విధినా నరాః. 59

పురాణాని ద్విజశ్రేష్ఠాః సాధయన్తి న మోహితాః, అనాయా సేవ యః పుణ్యానీచ్ఛతీహ ద్విజోత్తమాః.60

శ్రోతవ్యాని పురాణాని తేన వై భక్తిభావతః, పురాణశ్రవణ బుద్ధిర్యస్య పుంసః ప్రవర్తతే.61

పురార్జితాని పాపాని తస్య నశ్యస్త్యసంశయమ్‌, పురాణ వర్తమానే పి పాపపాశేన యంత్రితః,

ఆదరకేణాన్యగాథాసు సక్తబుద్ధిః పతత్యధః.62

సత్సంగదేవార్చనసత్కథాసు హితోపదేశే నిరతో మనుష్యః,

ప్రయాతి విష్ణోః పరమం పదం యద్దేహావసానే చ్యుతతుల్యతేజా. 63

దుర్జనులు పాపలములయందాసక్తి కలవారై నిందించుటయందు, కలహించుటయందు ఆసక్తులై ఉందురు. అర్ధవాదములు (లేని గుణములను పొగడి చెప్పునవి) అని చెప్పు నరాధములు సంపాదించిన అన్ని కర్మలను నిర్మూలించుటకు సాధనములైన పుణ్యములను కోల్పోవుదురు. పురాణములు అర్థవాదములు మాత్రమే అని చెప్పువాడు నరకమును పొందును. ఇతర కార్యములను శాస్త్రవిధిననుసరించి ఆచరించువారు పురాణములను కూడా సాధించెదరు. మోహితులు సాధించజాలరు. ఈ లోకమున ఎక్కువకష్టము లేకుండా పుణ్యములను సంపాదించవలయునని కోరినచో భక్తిభావముతో పురాణములను వినవలయును. పురాణములను వినవలయునను కోరిక కలవానికి పూర్వము సంపాదించిన పాపమున్నియు నశించితీరును. సంశయమవసరములేదు. పురాణప్రవచనము జపరుగుచుండగా పాపపాశము చేత బంధించబడినవాడై ఇతర కథలయందు ఆదరమును ఆసక్తిని చూపినచో అధఃపతనము కలుగును. సజ్జనులసంగమునందు దేవార్చనయందు సత్కథలయందు హితోపదేశమునందు ఆసక్తికల మానవుడు దేహావసానమున విష్ణవుతో సమానమైన తేజస్సు కలవాడై శ్రీమన్నారాయణుని పరమపదమును పొందును.

తస్మాదిదం నారదనామధేయం పుణ్యం పురాణం శృణుత ద్విజేన్ద్రాః,

యస్మిన్‌ శ్రుతే జన్మజరాదిహీనో నరో భ##వేదచ్యుతనిష్ఠచేతాః. 64

వరం పరేణ్యం వరదం పరాణం నిజప్రభాభావివతసర్వలోకమ్‌, సంకల్పితార్థప్రదమాదిదేవం స్మృత్వా ప్రజేన్ముక్తిపదం మనుష్యః. 65

బ్రహ్మేశవిష్ణ్వా దిశరీరభేదైర్విశ్వం సృజత్యత్తి చ పాతి విప్రాః, తమాదిదేవం పరమం పరేశమాధాయ చేతస్యుపయాతి ముక్తిమ్‌. 66

యో నామజాత్యాది వికల్పహీనః పరః పరాణాం పరమః పరస్మాత్‌, వేదాన్తద్యస్స్వజనప్రకాశస్సమీడ్యతే సర్వపురాణవేదైః. 67

తస్మాత్తమీశం జగతాం విముక్తిముపాసనాయాలమజం మురారిమ్‌,

పరం రహస్యం పురుషార్థహేతుం స్మృత్వా నదో యాతి భవాబ్ధిపారమ్‌. 68

కావున ఓ బ్రాహ్మోత్తములారా! పవిత్రమైన ఈ నారదపురాణమును వినుడు. దీనిని వినినచో మానవుడు శ్రీమన్నారాయణునియందు మనసు కలవాడై జన్మజరదారి బాధలు లేనివాడగును. శ్రీష్ఠుడు, శ్రేష్ఠతముడు, పరముల నిచ్చువాడు పురాణపురుషుడు తన సంకల్పముచే అన్ని లోకములను సృజించినవాడు కోరిన వాటినిచ్చువాడు, ఆదిదేవుడు అగు శ్రీహరిని స్మరించి మానవుడు మోక్షమును పొందును. ఓ బ్రాహ్మణులారా! శ్రీమన్నారాయణుడు బ్రహ్మ, శివుడు, విష్ణువు అను పేర్లతో శరీరభేదమును పొంది ఈ ప్రపంచమును సృజించును, నశింపచేయును, పాలించును. ఈశ్వరులకు ఈశ్వరుడగు ఆ యాదిదేవుని మనసున నిలుపుకొనిన మానవుడు ముక్తిని పొందును. పేరు జాతి మొదలగునవి లేనివాడు పరులందరికి పరుడు, పరమున కంటె పరముడు, వేదన్తవేద్యుడు, తనభక్తులకు మాత్రమే తెలియువాడు అగు శ్రీమన్నారాయణుడు అన్ని పురాణములచే వేదములచే స్తుతింపబడుచున్నాడు. కావున జగన్నాథుడు, మోక్షమునిచ్చువాడు పుట్టుకలేనివాడు అగు ఆ మురారియే సేవించదగినవాడు, పరమరహస్యము అన్ని పురుషార్థములకు మూలకారణము వఅయిన శ్రీహరిని స్మరించినచో మానవుడు సంసారసాగరమును దాటును.

వక్తవ్యం ధర్మికేభ్యస్తు శ్రద్ధధానేభ్య ఏవ చ, ముముక్షుభ్యో యతిభ్యశ్చ వీతరాగేభ్య ఏవ చ. 69

వక్తవ్యం పుణ్యదేశే చ సభాయాం దేవతాగృహే, పుణ్యక్షేత్రే పుణ్యతీర్థే దేవబ్రహ్మణసన్నిధౌ 70

ఉచ్ఛష్టదేశే వక్తార ఆఖ్యానమిదముత్తమమ్‌, పచ్యన్తే నరకే ఘోరే యావదాభూతసంప్లవమ్‌.71

ఘృషా శృణోతి యో మూఢో దంభీ భక్తివివర్జితః, సోపి తద్వన్మహాఘోరే నరకే పచ్యతే క్షయే. 72

నరో యసక్సత్కాథామధ్యే సంభాషాం కురుతేన్యతః, స యాతి నరకం ఘోరు తదేకాగ్రమనా భ##వేత్‌.73

శ్రోతా వక్తా చ విప్రేన్ద్రా ఏష ధర్మస్సనాతన్‌, అసమాహితచిత్తస్తు న జానాతి హి కించన. 74

తత ఏకమనా భూత్వా పిబేద్ధరికథామృతమ్‌, కథం సంభ్రాన్తచిత్తస్య కథాస్వాదః ప్రజాయతే. 75

కిం సుఖం ప్రాప్యతే లోకే పుంసా సంభ్రాంతచేతసా, తస్మాత్సర్వం పరిత్యజ్య కామం దుఃఖస్య సాధనమ్‌. 76

సమాహితమనా భూత్వా కుర్యాదచ్యుతచిన్తనమ్‌, యేన కేనాప్యుపాయేన స్మృతో నారయణో వ్యయః. 77

అపి పాతకయుక్తస్య ప్రసన్నస్న్యాన్న సంశయః, యస్య నారాయణ

భక్తిర్విభౌ విశ్వేశ్వరే వ్యయే,

తస్య స్యాత్సఫలం జన్మ ముక్తిశ్చైవ కరే స్థితా. 78

ధర్మార్థకామమోక్షాఖ్యపురుషార్థా ద్విజోత్తమాః, హరిభక్తిపరాణాం వై సంపద్యన్తే న సంశయః. 79

ఇతి శ్రీ బృహన్నారదీయపురాణ పూర్వభాగే ప్రథమపాదే

సూతర్షిసంవాదో నామ ప్రథమోధ్యాయః

శ్రద్ధగా వినువారికి ధార్మికులకు చెప్పవలయును. కోరికలు లేనివారికి, మోక్షమును

కోరువారికి, యతులకు చెప్పవలయును. పవిత్రమైన ప్రదేశములో సభలో, దేవాలయములో, పుణ్యక్షేత్రములలో, పుణ్యతీర్థములలో, దైవసన్నిధిలో భ్రాహ్మణ సన్నిధిలో చెప్పవలయును. అపవిత్రమైన ప్రదేశములలో ఈ నారదపురాణమును చెప్పువారు ప్రళయకాలము వరకు నరకమును పడియుందురు. మూర్ఖుడు, కపటి, భక్తిలేనివాడు, వినినట్లు నటించినవారు, కూడా నరకమును పడును. సత్కథ చెప్పుచున్నపుడు మరియొకనితో మాట్లాడువారు కూడా ఘోరనకరమును పొందును. కావున చెప్పువారు, వినువారు పావధానమనస్కులై యుండవలెను. ఇదియే సనాతనధర్మము. సావధానమనస్కుడు కానివాడు ఏ కొంచెము కూడా తెలయలేడు. కావున ఏకాగ్రమనస్సుతో హరికథామృతమును గ్రోలవలయును. వ్యాకులమనస్సు కలవాడు హరికథలోని రసమును ఎట్లు ఆస్వాదించును? వ్యాకులమైన మనసు కలవాడు ఏ ఆనందమునూ పొందలేడు. కావున దుఃఖసాధనమైన అన్ని కామనలను వదలిపెట్టి ఏకాగ్రమనస్సుతో శ్రీహరి ప్రసన్నుడగును. జగన్నాథుడు, అవ్యయుడు అయిన శ్రీమన్నారాయణునియందు భక్తికలవాని జన్మ సఫలమగును. మోక్షము అతని చేతిలో ఉండును. ఓ బ్రాహ్మణోత్తములారా! హరిభక్తిపరులకు ధర్మార్థకామమోక్షములు సిద్ధించుటలో ఎట్టి సంశయము లేదు.

ఇది శ్రీబృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున

ప్రథమపాదమున సూతఋషిసంవాదమను పేరుగల

మొదటి అధ్యాయము ముగిసినది.

Sri Naradapuranam-I    Chapters    Last Page