Sri Padma Mahapuranam-I    Chapters   

ఏకోనచత్వారింశో7ధ్యాయః

భీష్మ ఉవాచ :-

కథితం వామనసై#్యవ మాహాత్మ్యం విస్తరేణ వై పునస్తసై#్తవ మాహాత్మ్యమన్యద్విష్ణోరతో వద || 1

పద్మం కథమభూద్దేవ నా భౌ యేనాభవజ్జగత్‌ | కథం చ వైష్ణవీ సృష్టిః పద్మమధ్యే7భవత్పురా || 2

కథం పాద్మే మహాకల్పే7వత్పద్మమయం జగత్‌ | జలార్ణవగతస్యేహ నాభౌ జాతం జలానుగతమ్‌ || 3

ప్రభావం పద్మనాభస్య స్వపతః సాగరాంభసి | పుష్కరే తు కథం జాతా దేవా ఋషిగణాః పురా || 4

ఏతదాఖ్యాహి నిఖిలం యోగం యోగవిదాం పతే | కథం నిర్మితవాంస్తత్ర చైతం లోకం సనాతనమ్‌ || 5

కథమేకార్ణవే శూన్యే నష్టే స్థావరజంగమే | భూగోళ##కే ప్రదగ్ధే తు ప్రణష్టోరగరాక్షసే || 6

నష్టానలానిలాకాశే నష్టధర్మే మహీతలే | కేవలే గహ్వరీభూతే మహాభూతవిపర్యయే || 7

కిం ను విశ్వపతిః సాక్షాన్మహాతేజా మహాద్యుతిః | ఆస్తే యథా ధ్యాననిష్ఠో విధిమాస్థాయ యోగవిత్‌ 8

శృణ్వతః పరాయా భక్త్యా బ్రహ్మన్నేతదశేషతః | వక్తుమర్హసి ధర్మజ్ఞో యశో నారాయణాత్మకమ్‌ || 9

శ్రద్ధినః సూపవిష్టస్య భగవన్వక్తుమర్హసి||

ముప్పది తొమ్మిదవ అధ్యాయము

భీష్ముడు అడిగెను:- 'దేవా! వామనుని మహాత్మ్యమును విస్తరముగా చెప్పితివి. ఇక విష్ణువు ఇతర మహాత్మ్యమును చెప్పుము. ఏ పద్మముచే జగత్తంతా సృజింపబడెనో ఆ పద్మము నాభియందెట్లు ఏర్పడెను? పద్మ మధ్యమున పూర్వము వైష్ణవీ సృష్టి ఎట్లేర్పడెను? పాద్మమహాకల్పమున మొత్తం జగత్తు పద్మమయమెట్లాయెను? జలార్ణవగతమయిన నాభియందు, జలముతోనే సాగర జలమున నిద్రించు పద్మనాభుని ప్రభావము జనించెను. పూర్వము దేవతలు , ఋషిగణములు పుష్కరమున ఎట్లేర్పడిరి? యోగవేత్తల ప్రభూ| ఈ యోగమునంతా తెలియజేయుము. అక్కడ సనాతన లోకమును ఎట్లు నిర్మంచితివి? స్థావరజంగమములు నశించి, ఏకార్ణవముగా భూగోళము కాగా, సర్పములు, రాక్షసులు నశించగా, కేవలాకాశముండగా, భూమిపై ధర్మము నశించినపుడు మహాభూతముల విపర్యయమేర్పడగా, విశ్వపతి మాత్రము గొప్ప తేజస్సు కలిగినవాడై ధ్యాననిష్ఠుడైన యోగివలెనుండెను. పరమభక్తితో విను నాకు ఇదంతా పూర్తిగా చెప్పుము. శ్రద్ధతో కూర్చున్న నాకు నారాయణాత్మకమగు యశస్సును తెలియజేయదగినవాడవు. 9

పులస్త్య ఉవాచ :- నారాయణస్య యశసః శ్రవణ యా తవ స్పృహా || 10

సద్వంశాన్వయపూతస్య న్యాయ్యం కురుకులోద్వహ | శ్రుణుష్వాదిపురాణషు దేవేభ్యశ్చ యథాశ్రుతి || 11

బ్రాహ్మాణానాం చ వదతాం శ్రుత్వా వై సుమహాత్మనామ్‌ |

యథా చ తపసా దృష్ట్వా బృహస్పతిసమద్యుతిః || 12

పరాశరసుతః శ్రీమాన్‌ గురుర్ద్వైపాయనో7బ్రవీత్‌ | తత్తేహం కథయిష్యామి యథాభక్తి యథాశ్రుతి || 13

యద్విజ్ఞాతం మయా సమగృషిమార్గేణ సత్తమ | కః సముత్సహతే జ్ఞాతుం పరం నారాయణాత్మకమ్‌ || 14

విశ్వావితారం బ్రహ్మా యం న వేదయతి తత్త్వతః | తత్కర్మ విశ్వదేవానం తద్రహస్యం మహర్షిషు || 15

స ఇజ్యస్సర్వయజ్ఞానాం స తత్త్వం తత్త్వదర్శినామ్‌ | అధ్యాత్మమధ్యాత్మవిదాం నరకం చ వికర్మిణామ్‌ || 16

అధిదైవం చ తద్దైవమధిదై వత సంజ్ఞితమ్‌ | అధిభూతం చ తద్భూతం పరం చ పరమార్థినామ్‌ || 17

స యజ్ఞో వేదనిర్దిష్టస్తత్తపః కవయో విదుః యః కర్తా కారకో బుద్ధిర్యతః క్షేత్రజ్ఞ ఏవ చ || 18

ప్రణవః పురుషః శాస్తా ఏకశ్చేతి విభావ్యతే | ప్రాణః పంచవిధశ్చైవ ధ్రువమక్షరమేవ చ || 19

కాలః పాకశ్చ యజ్ఞశ్చ యష్టా చాధీతమేవ చ | ఉచ్యతే వివిధైర్భావైః స ఏవాయం తు

తత్పరమ్‌ || 20

అపుడు పులస్త్యుడనెను:- కురుకులశ్రేష్టా! నారాయణుని కీర్తిని వినుటయందు నీకున్న స్పృహ సద్వంశజాతుడవైన నీకు తగినదే. మొదటి పురాణములందు వున్నట్లుగా, దేవతలనుండి విన్నది విన్నట్లుగా, దీని గూర్చి మహాత్ములగు బ్రాహ్మణులు చెప్పినట్లుగా, తేజస్సులో బృహస్పతి సమానుడగు వరాశరపుత్రుడు వ్యాసుడు తపస్సుచే గాంచి చెప్పినట్లుగా నేను నీకు విన్నంత వరకు భక్తితో చెప్పెదను వినుము. ఋషులద్వారా విన్నది చెప్పెదను. పరుడగు నారాయణుని తెలుసుకొన ఎవరుత్సహింతురు? బ్రహ్మ కూడా అతనిని వాస్తవంగా తెలియడు. అది విశ్వదేవసంబంధి కర్మ. అది మహర్షులయందు గుప్తమైనది. అన్ని యజ్ఞముల కతను యజింపదగినవాడు. తత్త్వదర్శలెరుగు తత్త్వమతడు. అధ్యాత్మవేత్తల అధ్యాత్మమతడే. వికర్ములేగు నరకమతడే. అధిదైవతమను దైవము, అధిభూతమూ అతడే. వేదము నిర్దేశించిన యజ్ఞమతను. విజ్ఞులెరుగు తపమతనే. చేయువాడు, చేయించువాడు, బుద్దిమూలము, పురుషుడు అతనే. ప్రణవము, పురుషుడు, శాసకుడు అతనొకడే వివిధముగా భావించబడును. పంచప్రాణములు, ధ్రువము, అక్షరము అతనే. కాలము, ఫలము, యజ్ఞము, యజమాని, అవిద్య అతనే. వివిధ భావములతో చెప్పబడు అతనే నారాయణుడు. 20

స ఏవ భగవాన్‌ సర్వం కరోతి న కరోతి చ | సో7స్మిన్‌ కారయతే సర్వం స్థానినాం చ కృతిః కృతా || 21

యజామహే తమేవాద్యం స ఏవోత్థాననిర్వృతః | యో వక్తా యచ్చ వక్తవ్యం యశ్చాహం తద్ర్బవీమితే || 22

శ్రూయతే యచ్చ వై శ్రావ్యం యచ్చాన్యత్పరిజల్పితమ్‌ |

యా కథా యాశ్చ శ్రుతయో యో ధర్మీ ధర్మతత్పరః || 23

విశ్వం విశ్వపతిర్యశ్చ స తు నారాయణః స్మృతః |

యత్సత్యం యదనృతమాదిమధ్యభూతం | యచ్చాంత్యం నిరవధికం చ యద్భవిష్యమ్‌ || 24

యత్కించిచ్చరమచరం యదస్తిచాన్యత్సర్వం తత్పురుషవరః వ్రదానభూతః ||

చత్వార్యాహుః సహస్రాణి వర్షాణాం తత్కృతం యుగమ్‌ || 25

తస్య తావచ్ఛతీసంధ్యా ద్విగుణా కురునందన | యత్ర ధర్మశ్చతుష్పాదస్త్వధర్మః పాదవిగ్రహః || 26

స్వధర్మనిరతాః శాంతా జాయంతే యత్ర మానవాః | విప్రా స్థితా ధర్మపరా రాజవృత్తిస్థితా నృపాః || 27

కృష్యామభిరతా వైశ్యాః శూద్రాః శుశ్రూషవస్తథా | తదా సత్యం చ ధర్మశ్చైవ వివర్ధతే || 28

సద్భిరాచరితో ధర్మో యేన లోకః ప్రవర్తతే | ఏతత్కృతయుగే వృత్తం సర్వేషామేవ పార్ధివ || 29

ప్రాణినాం ధర్మసంజ్ఞానాం నరాణాం నీచజన్మనామ్‌ ||

అతనే అన్నింటినీ చేయువాడు, చేయనివాడు కూడా. అతనే చేయించువాడు. ఇంద్రాదిదేవతల కర్మ అతనే. అద్యుడైన అతనిని మనము పూజించుదము. అతనే కర్మణ్యతచే ఆనందించువాడు. ఎవడు వక్తయో, చెప్పబడదగునది ఎవరో, నేనెవరో నీవు చెప్పెదను. ఏది వినబడుచున్నదో, ఏది వినదగినదో, ఏది వివిధముగా చెప్పబడినదో, కథ యేదో, శ్రుతులేవో, ధర్మి, ధర్మతత్పరుడెవరో చెప్పెదను. విశ్వము, విశ్వపతి నారాయణుడేయని చెప్పబడుచున్నది. ఏది సత్యమో, అనృతము కూడానో, ఏది ఆది, మధ్య, ఆంత్యమైనదో, ఏది అవధి లేనిదో, ఏది కలుగబోవునదో, చరాచరమూ, దానికంటే ఇతరమేదో అది ప్రధానభూతుడైన పురుషోత్తముడే. నాలుగువేల సంవత్సరములు కృతయుగమని అందురు. రెండెవందల సంవత్సరాల సంధ్యాకాలముండెను. భీష్మా! ధర్మము నాలుగు పాళ్ళలో నుండి, అధర్మమనునది లేకుండెను. అపుడు మానవులు స్వధర్మనిరతులై, శాంతులై యుండి జన్మించుదురు. విప్రులు ధర్మపరులుగా, పాలకులు రాజవృత్తిపరులుగా, వైశ్యులు కృషినిరతులుగా, శూద్రులు సేవాపరులుగా వుండిరి. అపుడు సత్యము, సత్త్వము, ధర్మము విశేషముగా వర్ధిల్లును. సత్పురుషులాచంరించునదే ధర్మము. దానిచేతనే లోకము వ్యవహిరించును. ఇది కృతయుగమున ధర్మలక్షణులైన ప్రాణుల, నీచజన్ములైన నరుల అందరి వర్తనము. 29

త్రీణి వర్షసహస్రాణి త్రేతాయుగమిహోచ్యతే || 30

తస్య తావచ్ఛతీ సంధ్యా ద్విగుణా పరికీర్తితా | ద్వాభ్యామధర్మః పాదాభ్యాం త్రిభిర్ధర్మో వ్యవస్థితః || 31

యత్ర సత్త్వం చ సత్యం చ క్రియాధర్మో విధీయతే |

త్రేతాయాం వికృతిం యాంతి వర్ణా లోభేన సంయుతాః || 32

చాతుర్వర్ణస్య వైకృత్యం క్షాంతిర్దౌర్బల్యమేవ చ | ఏషా త్రేతాయుగ గతిర్విచిత్రా దేవనిర్మితా || 33

ద్వాపరం ద్విసహస్రం తు వర్ణాణాం కురునందన | తస్య తావచ్ఛతీ సంధ్యా ద్విగుణం యుగముచ్యతే || 34

తత్రాప్యతీవార్థపరాః ప్రాణినో రజసా హతాః | శఠా నైష్కృతికాః క్షుద్రా జాయంతే కురునందన || 35

ద్వాభ్యాం ధర్మ స్థితః పద్భ్యామధర్మస్త్రిభిరుత్థితః | విపర్యయశ##తైర్థర్మః క్షయమేతి కలౌ యుగే || 36

బ్రహ్మణ్య భావశ్చ్యవతే తథాస్తిక్యం వివర్జ్యతే | వ్రతోపవాసాస్త్యజ్యంతే కలౌ వై యుగపర్యయే || 37

తదా వర్షసహస్రం తు వర్షాణాం ద్వే శ##తే తథా | యత్రాధర్మశ్చతుష్పాదో ధర్మః పాదపరిగ్రహః || 38

మూడువేల సంవత్సరములు త్రేతయుగమనబడును. ఇందు కూడా రెండు వందల సంవత్సరాల సంధ్యాకాలముండును. ధర్మాధర్మములు సమపాళ్ళలో నుండును. సత్త్వము, సత్యము, కర్మ, ధర్మము విధించబడియుండును. త్రేతాయుగమున వర్ణములవారు లోభముతో కూడియండి వికృతినొందెదరు. నాలుగు వర్ణముల వికృతి సహనము, దుర్భలత. ఇది త్రేతాయుగమునకు చెందిన విచిత్రగతి దేవునిచే నిర్మింపబడినది. రెండువేల సంవత్సరముల ప్రమాణము గలది ద్వాపరము. అందుకూడా రెండువందల సంవత్సరాల సంధ్యాకాలముండును. అందుకూడా ప్రాణులు రజస్సుచే కూడినవారై ధనము (ప్రయోజనము)ను కోరువారై యుందురు. మూడులు, కృతఘ్నులు, క్షుద్రులు జన్మింతురు. ధర్మాధర్మములలో క్రమముగా అధర్మము పెచ్చరిల్లును. కలియుగమున ఎన్నో విపర్యయములతో ధర్మము క్షీణించును. పవిత్రభావము సడలును. ఆస్తికభావము వదిలివేయబడును. వ్రతోపవాసాదులు విడువబడును. యుగపర్యయమగు కలియుగము రెండువేల రెండువందల సంవత్సరాలలో అధర్మము మిక్కుటమగును. 38

కామినస్తాపసాః క్షుద్రా జాయంతే యత్ర మానవాః | న చావసాయికః కశ్చిన్న సాధు ర్న చ సత్యవాక్‌ || 39

నాస్తికా బ్రాహ్మణా7భక్తా జాయంతే తత్ర మానవాః | అహంకారగృహీతాశ్చ ప్రక్షీణస్నేహబంధనాః || 40

విప్రాః శూద్రసమాచారాః సంతి సర్వే కలౌ యుగే | ఆశ్రమాణాం విపర్యాసః కలౌ సంప్రతివర్తతే || 41

వర్ణానాం చైవ సందోహో యుగాంతే కురనందన | ఏషా ద్వాదశసాహస్రీ యుగాఖ్యా పూర్వనిర్మితా || 42

సహస్రయుగపర్యంతం తదహర్బ్రాహ్మముచ్యతే | తతోహని గతే తస్మిన్‌ సర్వేషామేవ జీవినామ్‌ || 43

శరీరనిర్వృతిం దృష్ట్యా కాలః సంహార బుద్ధిమాన్‌ | దేవతానాం చ సర్వేషాం బ్రాహ్మణానాం మహీపతే || 44

దైత్యానాం దానవానాం చ యక్షరాక్షసప్రక్షిణామ్‌ | గంధర్వాణామప్సరసాం భుజంగానాం చ పార్థివ || 45

పర్వతానాం నదీనాం చ పశూనాం చైవసత్తమ | తిర్యగ్యోనిగతానాం చ క్రిమీణాం దశినాం తథా || 46

సర్వభూతపతిః పంచ భూత్వా భూతానిభకృత్‌ | జగత్సంహరణార్థాయ కురుతే వైశసం మహత్‌ || 47

భూత్వా సూర్యశ్చక్షుషీ ఆదదానో భూత్వా వాయుః ప్రాణినాం ప్రాణజాతమ్‌ |

భూత్వా వహ్నిర్నిర్దహన్‌ సర్వలోకాన్‌ భూత్వామేఘో భూయ ఉగ్రోభ్యవర్షత్‌ || 48

భూత్వా నారాయణో యోగీ సర్వమూర్తివిభావసుః | గభస్తిభిః ప్రదీప్తాభిః సంశోషయతి

సాగరాన్‌ || 49

మానవులపుడు కాముకులు, తాపసులు, క్షుద్రులవుదురు. దృఢముగా నిశ్చయించువాడు సాధువు, సత్యవాక్కుగల వాడూ వుండడు. అహంకారము గలిగి, స్నేహబంధములు తొలిగి, మానవులు నాస్తికులయ్యెదరు. నాస్తికులై బ్రాహ్మణులయందు భక్తిలేనివారై యుందురు. కలియుగమున విప్రులందరు శూద్రులతో సమానమైన ఆచారముగలవారగుదురు. ఆశ్రమ విపర్యాసము కలియుగమున పెచ్చరిల్లును. యుగాంతమున వర్ణముల సందోహమేర్పడుదు. ఇట్టివి పన్నెండువేలు 'యుగ' మనబడును. వేయి యుగములు బ్రహ్మయొక్క పగలు అనబడును. ఆ పగలు గడవగా అందరి జీవుల శరీర సమాప్తిచూచి కాలము సంహరింపదలచును. దేవతల, బ్రాహ్మణుల, దైత్య దానవుల, యక్షరాక్షస పక్షుల, గంధర్వాప్సరసల, సర్పములు, పర్వతముల, నదుల, పశవులు, పక్షుల జలచరముల నన్నింటిని సంహరించగోరి సర్వభూతపతి జగత్తును సంహరించుటకై గొప్ప నాశనము చేయును. సూర్యడు నేత్రముల గ్రహించువాడై, వాయువు ప్రాణుల ప్రాణము తీయువాడై, వహ్ని లోకములన్నింటిని దహించువాడై, మేఘముగ్రమై వర్షించువాడై యుండును. అపుడు గొప్పయోగి యగు నారాయణుడు వెలుగుచున్న కిరణములచే సముద్రముల ఎండగొట్టును. 49

తతః పీత్వార్ణవాన్సర్వాన్నదీ కూపాంశ్చ సర్వతః | పర్వతానాం చ సలిలం సర్వమాదాయ యోగవిత్‌ || 50

భూత్వా చైవ సహస్రార్చిర్మహీం భిత్వా రసాతలే | రమతే జలమాదాయ పిబన్‌ రసమనుత్తమమ్‌ || 51

మూర్తామూర్తే తదన్యచ్చ యదస్తి ప్రాణిషు ధృవమ్‌ | తత్సర్వమరవిందాక్ష ఆదత్తే పురుషోత్తమః || 52

వాయుశ్చ బలవాన్భూత్వా విధున్వానోఖిలం జగత్‌ | ప్రాణాపానం సమాసాద్య వాయునా క్రమతే హరిః || 53

తతో దేవగణానాం చ సర్వేషాం చైవ దేహినామ్‌ | పంచేంద్రియగుణాస్సర్వే భూతాన్యేవ చ యాని చ || 54

ఘ్రేయం ఘ్రాణం శరీరం చ పృథీవీసంశ్రితా గుణాః | లోకయాత్రా భగవతా ముహూర్తేనా వినాశితా || 55

జిహ్వా రసశ్చ స్నేహశ్చ సంశ్రితాః సలిలే గుణాః | రూపం చక్షుర్విభాగశ్చ నేత్రజోతిః శ్రితా గుణాః || 56

స్పర్శః ప్రాణశ్చ చేష్టా చ పవనం సంశ్రితా గుణాః | శబ్ద| శ్రోత్రే చ శ్రవణం గగనం సంశ్రితా గుణాః || 57

మనో బుద్ధిశ్చ చిత్తం చ క్షేత్రజ్ఞం చేతి సంశ్రితాః | పరేణ పరమేష్ఠీ చ హృషీకేశముపాశ్రితాః || 58

తతో భగవతస్తస్య రశ్మిఖిదిః పరివారితాః | వాయునా పరినున్నాశ్చ భూమిశాఖాముపాశ్రితాః || 59

తేషాం సంహరణోద్భూతః పావకః శతథా జ్వలన్‌ | ప్రదహన్నఖిలం విశ్వం వృత్తః సంవర్తకోనలః || 60

అటుపై సముద్రముల, బావుల, నదుల, పర్వతముల జలమును ద్రావి వేయికిరణముల కాంతి గలిగి భూమిని చీల్చి రసాతలమున జలముయొక్క ఉత్తమోత్తమ రసమును ద్రావుచూ ఆనందించుచూ నుండును. ప్రాణులయందున్న మూర్తము, అమూర్తము, ఇతరము అంతా పురుషోత్తముడు, అరవిందాక్షుడు గ్రహించును. వాయువు బలవంతుడై లోకముల కంపింపజేయుచుండును. అపుడు హరి ప్రాణాసానమునొంది వాయువుతో ఆక్రమించును, అపుడు దేవగణముల, ప్రాణులన్నింటి పంచేంద్రియగుణమలన్నీ ఆ యా భూతములగును. ఘ్రేయము (వాసనచూడదగినది) వాసన చూచునది, శరీరము ఇవి పృథివిని ఆశ్రయించిన గుణాలు. భగవంతుడొక ముహూర్తమున లోకయాత్రను నశింపజేయును. నాలుక, రసము స్నేహము (జిడ్డు) అనునవి నీటి నాశ్రయించును. రూపము, చక్షువు, నేత్రజ్యోతిని ఆశ్రయించును. స్పర్శ, ప్రాణము, చేష్ట వాయువును, శబ్దము, శ్రోత్రము, శ్రవణము ఆకాశమును ఆశ్రయించును. మనస్సు, బుద్ధి, చిత్తము క్షేత్రజ్ఞుని చేరును. పరమేష్ఠీ, హృషికేశుని చేరును అపుడు భగవంతుని కిరణములచే కప్పబడి, వాయువుచే ప్రేరితులై భూమిశాఖను ఆశ్రయించును. వారిని నశింపజేయుటకై పుట్టిన అగ్ని వందరకాలుగా జ్వలించుచుండును. విశ్వమునంతా దహించుచూ సంవర్తకాగ్నియుండును. 60

సపర్వతద్రుమాన్‌ గుల్మాన్‌ లతావల్లీస్తృణాని చ | విమానాని చ దివ్యాని పురాణి వివిధాని చ || 61

యాని చాశ్రయణీయాని సర్వాణ్యప్యదహద్‌ భృశమ్‌ | భస్మీకృత్య తు తాన్‌ సర్వాంల్లోకాన్లోకగురోర్గురుః || 62

నభూతిం ధారయామాస యుగాంతే లోకసంభవామ్‌ | సహస్రవృష్టిః శతథా భూత్వా కృష్ణో మహాఘనః || 63

దివ్యతోయేన హవిషా తర్పయామాస మేదినీమ్‌ | తతః క్షీరనికాశేన స్వాదునా పరమాంభసా || 64

శిశిరేణ చ పుణ్యన మహీ నిర్వాణమాగమత్‌ | తేన తోయేన సంపృక్తా పయస్సాధర్మ్యతో ధరా || 65

ఏకార్ణవజలీభూతా సర్వసత్వవివర్జితా | మహాసత్వాన్యపి విభుం ప్రవిష్టాన్యమితౌజసమ్‌ || 66

నష్టార్కపవనాకాశే సూక్ష్మే జగతి సంవృతే | సంశోషమాత్మనా కృత్వా సముద్రాణాం చ దేహినః || 67

ధగ్ధ్వా సంకోచ్య చ తథా స్వపిత్యేకః సనాతనః | పౌరాణాం రూపమాస్థాయ స్వపిత్యమితవిక్రమః || 68

ఏకార్ణవజలే యాయీ యోగీ యోగముపాసితః | అనేకాని సహస్రాణి యుగేన్యేకార్ణవాంభసి || 69

స చైవ కశ్చిదవ్యక్తం వ్యక్తో వేదితుమర్హతి | కశ్చైష పురుషో నామ కిం యోగః కశ్చ యోగవాన్‌ || 70

ఆ అగ్ని పర్వతవృక్షములను, పొదలను, తీగలను, గడ్డిని, దివ్యవిమానములను, పురములను, ఆశ్రయయోగ్యమైన వానినన్నింటినీ మిగుల దహించి, లోకములన్నింటిని భస్మమువలె చేసివేసెను. యుగాంతమున లోకసంభవమైన ఆ భస్మమును ధరించిన పిదప నల్లటి పెద్ద మేఘమొకటి వంద విధాలుగా మారి వివిధముగా వర్షించును. ఆ దివ్య జలముతో హవిస్సుతోవలె శ్రీహరి భూమిని సంతోషింపజేసెను. అపుడు పాలవంటి ఆ రుచికరమైన జలముతో పుణ్యశిశిరముతో భూమి సంతసించెను ఆనీటితో కలిసి భూమి పాల సాధర్మ్యమును పొందెను. ఒకే సముద్రజలమువలె నుండినది, ప్రాణలు లేనిదిగా భూమియుండెను. గొప్పప్రాణులునూ, గొప్ప తేజస్వియగు ప్రభువును చేరినవి. సూర్యుడు, వాయువులేని ఆకాశము వుండగా, జగత్తు సూక్ష్మమవగా తనకుతాను సముద్రముల ప్రాణుల శుష్కింపజేసి, దహించి, సంకోచింపజేసి ఒక్కడుగా నిద్రించును. గొప్ప విక్రమముగలవాడై అతను పౌరుల రూపముదాల్చి ఏకార్ణవజలమున యోగమునుపాసించుచుండెను. అపుడు అనేక వేల యుగములు అట గడిచినవి. వ్యక్తుడైనవాడెవడూ అవ్యక్తమును తెలియలేకుండెను. పురుషుడనగ నెవడు? యోగమనగా, యోగియనగా నెవడు? 70

న పృష్టే నైవమభితో నైవ పార్శ్యే న చాగ్రతః | కశ్చిద్విజ్ఞాయతే తస్య దృవ్యతే దేవసత్తమః || 71

నభః క్షతిం పవనమపః పకాశనం ప్రజాపతిః భువనధరం సురేశ్వరమ్‌ |

పితామహం శ్రుతినిలయం మునిం ప్రభుం సమాపయంఛయనమరోచయత్ప్రభుః || 72

ఏవమేకార్ణవీభూతే శేతే లోకే మహాద్యుతిః | ప్రచ్ఛాద్య సలిలేనోర్వీం హంసో నారాయణాయతే || 73

మహతో రజసో మధ్యే మహార్ణవసమస్య వై | వారిజాక్షో మహాబాహురక్షయం బ్రహ్మ యద్విదుః || 74

ఆత్మరూపసరూపేణ తమసా సంవృతః ప్రభుః | మనః సాత్త్వికమాదాయ యత్ర తత్సత్త్వమాహితమ్‌ || 75

యథాతథ్యం పరం జ్ఞానం భూతాయ బ్రహ్మణ తతః | రహస్యం చ తథోద్దిష్టం యథోపనిషదాం స్మృతమ్‌ || 76

పురుషో యజ్ఞ ఇత్యేతత్పరమం పరికీర్తితమ్‌ | యశ్చాన్యః పురుషాఖ్యః స్యాత్స ఏవ పురుషోత్తమః || 77

యే చ యజ్ఞకరా విప్రా య ఋత్విజ ఇతి స్మృతాః | ఆస్మాదేవ పురాభూతా వక్త్రేభ్యః శ్రూయతే తథా || 78

బ్రహ్మాణం ప్రథమం వక్త్రాదుద్గాతారం చ సామగమ్‌ | హోతారం చ తథాధ్వర్యుం బాహుభ్యామసృజత్‌ ప్రభుః || 79

వెనుక, చుట్టూప్రక్కల ఎదుట ఎవడూ తెలియుటలేదు. కనబడుట లేదు. పంచభూతములను, ప్రజాపతిని, భూధరుడిని, సురేంద్రుని, పితామహుడగు వేదనిలయుని, మునిని సమాపనముచేసి నిద్రించగోరెను ప్రభువు. ఇట్లు లోకము ఏకార్ణవముకాగా గొప్ప కాంతిగల నారాయణుడు సలిలముతో భూమిని కప్పినపుడు, హంస నారాయణుడాయెను. రజస్సు మధ్యలో వారిజాక్షుడగు నారాయణుడు, ఆక్షయబ్రహ్మ యని తెలియబడువాడుండెను. ఆత్మరూపసరూపమగు తమస్సుతోకప్పబడి యతను సాత్త్విక మనస్సును గ్రహించి సత్త్వమును పొందెను. అపడు బ్రహ్మకు తత్త్వజ్ఞానమును, ఉపనిషత్తనురహస్యమును చెప్పెను. పురుషుడే యజ్ఞమని పరమముగా చెప్పబడెను. ఇతర పురుషుడనుబడువాడు నారాయణుడే. యజ్ఞమును చేయు బ్రాహ్మణులు, ఋత్విక్కులనుబడువారు ఇతని ముఖములనుండే వచ్చినారని శ్రుతి చెప్పుచున్నది. బ్రహ్మను మొదట ముఖమునుండి సృజించి తరువాత సామవేత్తయగు ఉద్గాతను, అధ్వర్యుడగు హోతను బాహువులనుండి సృజించెను. 79

బ్రహ్మాణం బ్రాహ్మణాచ్ఛంసిస్తోతారౌ చైవ సర్వశః | మేఢ్రాచ్చ మైత్రావరుణం ప్రతిష్ఠాతారమేవ చ || 80

ఉదరాత్ప్రతిహర్తారం పోతారం చైవ పార్థివ | పాణిభ్యామథ చాగ్నీ ధ్రం ఉన్నేతారం చ యాజుషమ్‌ || 81

అచ్ఛావాకమథోరుభ్యాం సుబ్రహ్మణ్యం చ సామగమ్‌ | ఏవమేవం స భగవాన్‌ షోడశైతాన్‌ జగత్పతిః || 82

స్వయంభూః సర్వయజ్ఞానామృత్విజోసృజదుత్తమాన్‌ | తదా చైష మహాయోగీ పురుషో యజ్ఞసంజ్ఞి తః || 83

వేదాశ్చైవ తథా సర్వే సహాంగోపనిషత్క్రియాః | స్వపిత్యేకార్ణవే చైవ యదాశ్చర్యమభూత్పురా || 84

శ్రూయతాం తు తదా విప్రో మార్కండేయః కుతూహలాత్‌ | గీర్ణో భగవతా తేన కుక్షావాసీన్మహామునిః || 85

బహువర్షసహస్రాయుస్తస్త్యేవ వరతేజసః | అటంస్తీర్థప్రసంగేన పృథివీతీర్థగోచరః || 86

ఆశ్రమాణి చ పుణ్యాని దేవతాయతనాని చ | దేశాద్రాష్ట్రాణి చిత్రాణి పురాణి వివిధాని చ || 87

జపహోమపరాః శాంతాస్తపోభిరమలాః స్మృతాః | మార్కండేయస్తతస్తస్య శ##నైర్వక్త్రాద్వినిర్గతః || 88

నిష్క్రామంతం న చాత్మానం జానీతే దేవమాయయా | నిష్క్రమ్య తస్య ఉదరాదేకార్ణవమథో జగత్‌ || 89

సర్వతస్తమసా ఛన్నం మార్కండేయోన్వవైక్షత | తస్యోత్పన్నం భయం తీవ్రం వ్యత్యయం చాత్మజీవితమ్‌ || 90

బ్రహ్మను, బ్రాహ్మణునినుండి శంసి, స్తోత అనువారిని సృజించెను. మేఢ్రమునుండి మైత్రావరుణుడను హోతను, ఉదరమునుండి ప్రతిహర్త, పోతయనువారిని, చేతులనుండి అగ్నిధ్రుని, ఉన్నేతను యజుర్వేదిని, తొడలనుండి అచ్ఛావాక్కుని, సామగాయకుడగు సుబ్రహ్మణ్యుని ఇట్లు పదహారుగురుని సృజించెను. స్వయంభువు అన్ని యజ్ఞములకు ఋత్విక్కులను సృజించెను. ఇక అపుడు పురుషుడగు నారాయణుడు యజ్ఞమనబడును. అన్ని వేదములు, అంగములు, ఉపనిషత్తులు, క్రియలతో ఏకార్ణవమున నిద్రించగా ఆశ్చర్యమాయెను. విప్రులారా వినుడు ! అపుడు మార్కండేయముని కుతూహలముతో భగవంతునిచే మింగబడి అతని కుక్షియందుండెను. ఎన్నో వేల సంవత్సరములు అందు తిరుగుచూ తీర్థప్రసంగముచే పృధివీ తీర్థమును గాంచెను. పుణ్యాశ్రమములు, దేవాలయములు, రాష్ట్రాలు. చిత్రములు, పురములు మున్నగువానిని చూచెను. జపహోమపరులపుడు శాంతులై, నిర్మలురై యుండిరి. మార్కండేయుడపుడతని నోటినుండి మెల్లగా బయటకు వచ్చెను. దేవమాయచే, బయటకు వెడలునున్న తనను తెలుసుకొనలేకపోయెను. బయల్వెడలి ఏకార్ణవముగా నున్న జగత్తును, ఎల్లడెలా చీకటితో కప్పబడినదానిని మార్కండేయుడు చూచెను. అపుడు అతనికి తీవ్రభయము కలిగెను. అతను తన జీవితవ్యత్యయమును గాంచి భీతినొందెను. 90

దేవదర్శనసంహృష్టో విస్మయం పరమం గతః | సోచింతయదమోఘాత్మా మార్కండేయోథ శంకితః || 91

కిం ను స్యాచ్చిత్తసంమోహః కిం ను స్వప్నోనుభూయతే | వ్యక్త మన్యతరో భావ ఏతయోర్భవితా మమ || 92

న హి స్వప్నో హ్యయం సత్యయుక్తం యత్సత్యమర్హతి | నష్టచంద్రార్కపవనో నష్టపర్వతభూతలః || 93

కతమః స్యాదయం లోక ఇతి శోకముపాగతః || దదర్శ చాపి పురుషం స్వపంతం పర్వతోపమమ్‌ || 94

సలిలేర్థమథో మగ్నం జీమూతమివ సాగరే | తపంతమివ తేజోభిరాముక్తశశిభాస్కరమ్‌ || 95

గాంభీర్యాత్సాగరమివ భాసమానమ్మహౌజసా | దేవం ద్రష్టుమిహయాతః కో భవానితి విస్మయాత్‌ || 96

తథైవ చ మునిః కుక్షిం పునరేవ ప్రవేశితః | స ప్రవిష్టః పునః కుక్షిం మార్కండేయః సవిస్మయమ్‌ || 97

తథైవ చ పునర్భూయో విజానన్‌ స్వప్నదర్శనమ్‌ | స తథైవ యథాపూర్వం పృథివీమటతే వనమ్‌ || 98

పుణ్యతీర్థజలోపేతం వివిధాన్యాశ్రమణి చ | క్రతుభిర్యజమానాంశ్చ సమాప్త గురుదక్షిణౖః || 99

అపశ్యద్ధేవకుక్షిస్థాన్‌ యజ్ఞస్థాన్‌ శతశో ద్విజాన్‌ | సద్‌వృత్త మాశ్రితాః సర్వే వర్ణబ్రాహ్మణపూర్వకాః || 100

దేవుని దర్శించుటచే ఆనందించిన మార్కండేయువు విస్మయమునొంది శంకించినవాడై ఇట్లాలోచించెను. ''చిత్తమోహమా ? స్వప్నమా ? రెంటికంటె భిన్నమగు భావమగును. ఇది సత్యము కావచ్చును. స్వప్నము మాత్రము కానేరదు. చంద్రుడు, సూర్యడు, వాయువు లేనిది, పర్వతములు, భూతములులేనిది ఇది ఏమి లోకమగును'' అని శోకము నొందెను. పర్వతమువలె నుండి నిద్రించుచున్న పురుషుని గాంచెను. అతనపుడు నీటియందు సగము మునిగియుండెను. సముద్రమున మునిగిన మేఘమువలె నుండెను. కొద్దిగా విడవబడిన చంద్ర సూర్యులతో, కాంతితో తపించుచున్న వానివలె నుండెను. గొప్ప కాంతితో, గాంభీర్యములో సముద్రమువలె ప్రకాశించుచున్న దేవుని చూచుటకు వచ్చి'' ఎవరకతన''ని విస్మయము నొందెను. అపుడు ముని మరల నారాయణుని కుక్షియందు ప్రవేశ##పెట్టబడగా మార్కండేయువు మరల కుక్షినిచేరి స్వప్నమును గాంచితినని పూర్వమువలె పృధివియందు తిరగసాగెను. పుణ్యతీర్థజలమునుగల వనమును, వివిధాశ్రమములను యజ్ఞములుచేయుచున్నవారిని, గురుదక్షిణలనిచ్చినవారిని వందలకొలదిగా బ్రాహ్మణులను భగవంతుని కుక్షియందు చూచెను. మంచి ప్రవర్తన గలవారిని, వర్ణ బ్రాహ్మణపూర్వులను అందరినీ చూచెను. 100

చత్వార ఆశ్రమాః సమ్యగ్యథాపూర్వం విలోకితాః | ఏపం వర్షశతం సాగ్రం మార్కండేయేన ధీమతా || 101

చరతా పృథివీ సర్వా తత్కుక్షౌ హి సమీక్ష్యతే | తతః కదాచిదథ వై పునః కుక్షేర్వినిర్గతః || 102

సు ప్తం న్యగ్రోధశాఖాయాం బాలమేకం నిరీక్ష్య చ | తథైవైకార్ణవజలే నీహారేణావృతాంతరే || 103

అవ్యక్తక్రీడితే లోకే సర్వభూతవివర్జితే | స మునిర్విస్మయావిష్టః కౌతూహలసమన్వితః || 104

బాలమాదిత్యసంకాశం న శక్నోత్యభివీక్షితుమ్‌ | సోప్యచింతయదేకాంతే స్థిత్వా సలిలసన్నిధౌ || 105

పూర్వదృష్టమిదం మేనే శంకితో దేవమాయయా | అగాధే సలిలే శేతే మార్కండేయః సవిస్మయః || 106

పూర్వవత్తమథో దృష్టుమవ్రజత్‌ తస్త్రలోచనః | స తసై#్మ భగవానాహ స్వాగతో బాల భో ఇతి || 107

జభాషే మేఘతుల్యేన స్వరేణ పురుషోత్తమః | మార్కండేయ న భేతవ్యమాగచ్ఛస్య మమాంతికమ్‌ || 108

పూర్వము వలె నాలుగు ఆశ్రమముల గాంచెను. ఇట్లు బుద్ధిమంతుడగు మార్కండేయువు వందసంవత్సరముల పైబడి పృథివిపై చరించుచు, భగవంతుని కుక్షియందు చూచెను. అపుడొకమారు మరల కుక్షినుండి బయల్వెడలెను. రావిచెట్టు కొమ్మపై నిద్రించుచున్న బాలునొకని నిద్రించుచుండగా చూచి, అట్లే జగత్తు ఏకార్ణవజలముగా నుండుటను, మంచుతో నిండి యుండుటను, అవ్యక్తమున లోకము క్రీడించుటను, ప్రాణులేవీ లేకుండుటను చూచి అతను విస్మయము నొందెను. సూర్యునివలె ప్రకాశించుచున్న ఆ బాలుని చూడలేకపోయెను. అతను కూడా ఒంటరిగా నీటియందు నిలిచి ఆలోచించెను. మునుపు చూసినదే ననుకొందును. దేవమాయచే శంకించితిని. అని అగాధ సలిలమున మార్కండేయువు విస్మయముతో నిద్రించెను. భీతిల్లిన కళ్ళతో పురుషుని చూచుటకు క్రిందికి వెళ్ళెను. అపుడు భగవానుడు '' బాలా ! నీకు స్వాగతము'' అని మేఘసమానమగు స్వరముతో పలికి 'మార్కండేయా ! భయపడవలదు. నా వద్దకు రమ్ము' అనెను. 108

మార్కండేయ ఉవాచ:- కో నామ్నా కీర్తయతి మాం కుర్వన్‌ పరిభవం మమ |

దివ్వవర్షసహస్రాఖ్యం ధర్షయంశ్చైవమేవ యః || 109

న హ్యేష చ సదాచారో దేవేష్యపి మమోచితః | మాం బ్రహ్మాపి హి సస్నేహో దీర్ఘాయురితి భాషతే || 110

కస్తపో ఘోరమాసాద్య మమాద్య త్యక్త జీవితః || మార్కండేయేతి మాముక్త్వా మృత్యుమీక్షితుమర్హసి || 111

ఏవం ప్రక్షుభితః క్రోధాన్మార్కండేయో మహామునిః | తదైవం భగవాన్భూయో బభాషే మధుసూదనః || 112

శ్రీ భగవానువాచ:- అహం తేజనకో వత్స హృషీకేశః పితా గురుః |

ఆయుః ప్రదాతా పౌరాణః కిం మాం త్వం నోపసర్పసి || 113

మాం పుత్రకామః ప్రథమం త్వత్పితాంగిరసో మునిః | పూర్వమారాధయామాస తపస్తీవ్రం సమాశ్రితః || 114

తం దృష్ట్వా ఘోరతపసం త్రిదశోత్తమతేజసమ్‌ | దత్త వాంస్త్వామహం పుత్రం మహర్షి మమితౌజసమ్‌ || 115

కస్సముత్సహతే చాన్యో యోగిభూతాత్మగాత్మకమ్‌ | ద్రష్టుమేకార్ణవగతం క్రీడంతం యోగమాయయా || 116

తతః ప్రహృష్టహృదయో విస్మయోత్ఫుల్లలోచనః | మూర్ధ్ని బద్ధాంజలిపుటో మార్కండేయో మహాతపాః || 117

నామగోత్రే తు సంప్రోచ్య దీర్ఘాయుర్లోకపూజితః | తసై#్మ భగవతే భక్త్వా నమస్కారమథా కరోత్‌ ||

అపుడు మార్కండేయు విట్లనెను - 'నన్నవమానించుచూ పేరుపెట్టి నన్ను పిలుచువారెవరు? వేలకొలది దివ్యవర్షములు ఇట్లు భయపెట్టువాడు ఎవరు ? దేవతలకునూ నాయందు ఇట్లాచరించుట సదాచారము కాదు. నన్ను బ్రహ్మ కూడా స్నేహముతో ''దీర్ఘాయువు'' అని పిలుచును. ఎవరిపుడు ఘోరతపమునాశ్రయించి జీవితము గోల్పోయి నన్ను మార్కండేయ అని పిలిచి మృత్యువును చూడగోరుచున్నాడు?'' అని మిగుల క్షోభించి క్రోధముతో మార్కండేయువనగా మధుసూదనుడు మరల అతనితో నిట్లనెను. ''వత్సా! నేను తేజస్సును-హృషికేశుడిని-తండ్రిని, గురువును, ఆయువునిచ్చువాడను, సనాతనుడిని, నీవెందుకు నన్ను సమీపించుట లేదు? పూర్వము నీ తండ్రి అంగీరసుడను మహాముని పుత్రుని గోరి తీవ్రతపస్సునాశ్రయించి నన్ను ఆరాధించెను. అతని గొప్ప తపస్సును చూచి నేను తేజస్వియగు నిన్నతనికి ప్రసాదించితిని. లేనిచో, యోగమాయతో క్రీడించువానిని, ఏకార్ణవముననున్న వానిని చూడనుత్సాహము చూపువాడెవడుండును? అనగా సంతోషము నిండి హృదయముతో విస్మయమున విప్పారిన కన్నులు గల మార్కండేయువు తలపై చేతులు జోడించి నామగోత్రములను భక్తితో పలికి, భగవానునికి నమస్కారమును చేసెను. 118

మార్కండేయ ఉవాచ:- ఇచ్ఛామి తత్త్వతో జ్ఞాతుమిమాం మాయాం తవానఘ |

యదేకార్ణవమధ్యస్థః శేషే త్వం బాలరూపవాన్‌ || 119

కింసంజ్ఞశ్చైవ భగవన్లోకే విజ్ఞాయసే ప్రభో | తర్కయేహం మహాత్మానం కో హ్యన్యః స్థాతుమర్హసి || 120

శ్రీ భగవానువాచ:- అహం నారాయణో బ్రహ్మన్‌ సర్వభూతవినాశనః |

అహం సహస్రశీర్షాస్యః సహస్రపదసంయుతః || 121

ఆదిత్యవర్ణః పురుషో ముఖే బ్రహ్మమయో హ్యహమ్‌ | అహమగ్నిర్హవ్యవహః సప్తసప్తిభిరన్వితః || 122

అహమింద్రపదః శక్ర ఋతూనాం పరివత్సరః | అహం యోగిషు సాంఖ్యాఖ్యో యుగాంతావర్త ఏవ చ || 123

అహం సర్వాణి సత్వాని దైవతాన్యఖిలాని చ | భుజగానామహం శేషస్తార్క్యో హం సర్వపక్షిణామ్‌ || 124

కృతాంతః సర్వభూతానాం విజ్ఞేయః కాలసంజ్ఞితః | అహం ధర్మస్తపశ్చాహం సర్వాశ్రమనివాసినామ్‌ || 125

అహం దయాపరో ధర్మః క్షీరదోహం మహార్ణవః | యత్సత్యం తత్పరంత్వేక అహమేవ ప్రజాపతిః || 126

అహం సాంఖ్యమహం యోగో హ్యహం తత్సరమం పదమ్‌ | అహమిజ్యా క్రియా చాహం విద్యాధిపః స్మృతః || 127

అహం జ్యోతిరహం వాయురహం భూమిరహం జలమ్‌ | ఆకాశోహం సముద్రాశ్చ నక్షత్రాణి చ దిశో దశ || 128

అహం వర్షమహం సోమః పర్జన్యోహమహం రవిః | అహం పురాణం పరమం తథైవాహం పరాయణమ్‌ || 129

నమస్కరించి మార్కండేయుడిట్లనెను- పాపరహితుడైన దేవా! ఈ మాయను వాస్తవముగా తెలియగోరుచున్నాను. బాలరూపమున నీవు ఏకార్ణవ మధ్యన శయినించుట ఏమి ? ప్రభూ ! లోకమున నీవేపేరుతో తెలియుచున్నావు ? మహాత్ముడవనుకొందును. ఇతరుడెవడట్లుండ గలడు ! అనగా భగవంతుడు చెప్పెను. ''నేను నారాయణుడను, సర్వభూత నాశనకారకుడను; వేయితలలు, ముఖములు, పాదములు కలవాడను. ఆదిత్యుని వర్ణముతో, ముఖమున బ్రహ్మమయుడిని. హవ్యవాహనుడగు అగ్నిని జ్వాలలతోకూడినవాడిని, ఇంద్రపదముననున్న శక్రుడిని, ఋతువుల వత్సరమును, యోగిజనమందు సాంఖ్యమును, యుగాంతమునందలి ఆవర్తనమును నేనే. అన్ని సత్త్వములు, దేవతలు నేనే. సర్పములలోనేను ఆదిశేషువును, పక్షులలో గరుత్మంతుడిని. అన్ని ప్రాణులకు యముడిని, కాలమనువాడనునేనే. నేనే ధర్మము, అన్ని ఆశ్రమముల వారికి తపస్సు నేనే. దయాపరమైన ధర్మము, పాలసముద్రమును, పరమసత్వము, ప్రజాపతినేనే, నేనే సాంఖ్యము, యోగము, పరమపదముకూడా - నేనే యజ్ఞమును, క్రియను, విద్యాధిపుడిని, జ్యోతిని, వాయువును, భూమిని, నీటిని, ఆకాశమును, సముద్రమును, నక్షత్రములు, దశదిశలు నేనే. నేనే వర్షమును, సోమమును, మేఘము, సూర్యుడు, పరమసనాతనుని నేనే పరాయణము. 129

భవిష్యే చాపి సర్వత్ర భవిష్యత్సర్వసంగ్రహః | యత్కించిత్పశ్యసే విప్ర యచ్ర్ఛుణోషి చ కించన || 130

యచ్చానుభవసే లోకే తత్సర్వం మామనుస్మర | విశ్వం స్పష్టం మయా పూర్వం సృజేద్యాపి చ పశ్య మామ్‌ || 131

యుగే యుగే చ రక్షామి మార్కండేయాఖిలం జగత్‌ || తదేతత్కథితం సర్వం మార్కండేయావధారయ || 132

శశ్రూషురపి ధర్మేషు కుక్షౌ చర సుఖం మమ | మమ బ్రహ్మా శరీరస్థో దేవాశ్చ ఋషిభిః సహ || 133

వ్యక్తమవ్యక్తయోగం మామవగచ్ఛ మురద్విషమ్‌ | అహమేకాక్షరో మంత్రస్త్య్రక్షరశ్చ పితామహః || 134

పరస్త్రివర్గ ఓంకారః పరమాత్మప్రదర్శనః | ఏవమాది పురాణం చ వదతే మాం మహామతే || 135

వక్త్రం యాతో భగవతో మార్కండేయో మహామునిః | తతో భగవతః కుక్షిం ప్రవిష్టో మునిసత్తమః || 136

తస్యాసమ్ముఖమేకాంతే శుశ్రూషుర్హంసమవ్యయమ్‌ | యదక్షయం వివిధముపాశ్రితC తు తన్మహార్ణవే వ్యపగతం చంద్రభాస్కరే || 137

శ##నైశ్చరన్‌ ప్రభురథ హంససంజ్ఞితః సృజన్‌ జగద్విహరతి కాలపర్యయే | అథ చైవం శుచిర్భూత్వా వరయామాస వై తపః || 138

ఛాదయిత్వాత్మనో దేహం పయసాంబుజసంభవః | తతో మహాత్మాతిబలో మర్త్యలోకవిసర్జనే || 139

మహతాం చైవ భూతానాం విశ్వో విశ్వమచింతయత్‌ |

ఓయీ విప్రా! భవిష్యమున అన్నిటియందు నేనే యుండగలను. ఏదేది వినుచుంటివో, కనుచుంటివో, అనుభవించుచుంటివో అది నేనే యని జ్ఞప్తిన యుంచుకొనుము. పూర్వము నేనే జగత్తును సృజించితిని. నేడునూ సృజించెద చూడుము. మార్కండేయా ! అఖిలజగత్తును నేనే ప్రతియుగమున రక్షించుచుంటిని. చెప్పినదంతా అవధరింపుము. ధర్మముల వినగోరి నా ఉదరమున నివసించుము. బ్రహ్మ, ఋషులతో దేవతలు నా శరీరమున యుండిరి. ఆవ్యక్తముతో కలిసిన వ్యక్తరూపునిగ నన్నెఱుగుము. నేను ఒక యక్షరము గల మంత్రమును-పితామహుడు మూడక్షరములవాడు-త్రివర్ణమును దాటిన ఓంకారము పరమాత్మను దర్శింపజేయును. ఇట్లు సనాతనుడని నన్నందురు' అని అనగా మార్కండేయువు విష్ణువు నోటిలోకి చేరెను. తరువాత మునిశ్రేష్ఠుడు భగవంతుని ఉదరమును ప్రవేశించెను. అతని వద్ద ఏకాంతమును అవ్యయహంసను సేవించగోరెను. అక్షయమనునది వివిధముగనుండి ఆ మహార్ణవమున సూర్యచంద్రులు లేకుండిరి. హంసయను ప్రభువు మెల్లగ చరించుచుc జగత్తును సృజించుచు కాలపర్యయమున విహరించుచుండెను. అట్లే శుచియై తపమునాచరింప గోరెను. తన దేహమును నీటిచే కప్పి మర్త్యలోకమును మహాభూతములను విసర్జింప విశ్వమును పరమాత్మ ధ్యానించెను. 139

తస్య చింత యమానస్య నియతే సంస్థితే ర్ణవే || 140

నిరాకాశే తోయమమే సూక్ష్మే జగతి సంక్షయే | ఈశః సంక్షోభయామాస సోర్ణవం సలిలం గతః || 141

అథాంతరాదపాం సూక్ష్మమథచ్ఛిద్రమభూత్పురా | శబ్ధం ప్రతి తతో భూతో మారుతశ్ఛిద్ర సంభవః || 142

సంలబ్ధ్వాంతరసంక్షోభం వ్యవర్ధత సమీరణః | నభస్వతా బలవతా వేగాద్విక్షోభితోర్ణవః || 143

తస్యార్ణవక్షుబ్ధస్య తస్మిన్నంభసి మథ్యతః | కృష్ణవర్త్మా సమభవత్‌ ప్రభుర్‌ వైశ్వానరో మహాన్‌ || 144

తతః సంశోషయామాస పావకః సలిలం బహు | సమస్త జలధిశ్ఛిద్రమభవద్విసృతం నభః || 145

ఆత్మతేజోభవాః పుణ్యా ఆపోమృతరసోపమాః | ఆకాశం ఛిద్రసంభూతం వాయురాకాశసంభవః || 146

అథ సంఘర్షసంభూతం పావకం చాస్యసంభవమ్‌ | దృష్ట్వా పితామహోదేవో మహాభూతవిభావనః || 147

దృష్ట్వా భూతాని భగవాన్‌ లోకసృష్ట్యర్థముత్తమమ్‌ | బ్రహ్మణో జన్మసహితం బహురూపో హ్యచింతయత్‌ || 148

చతుర్యుగానం సంఖ్యాతం సహస్రం యుగపర్యయే | యత్పృథివ్యాc ద్విజేంద్రాణాం తపసా భావితాత్మనామ్‌ || 149

బహుజన్మవిశుద్దాత్మా బ్రహ్మణో హరిరుచ్యతే | జ్ఞానం దృష్ట్వా తు విశ్వాత్మా యోగినాం యాతి యోగ్యతామ్‌ || 150

ఇట్లు ధ్యానించుచుండగానే, అర్ణవమున, నిరాకాశమున, జలమయమున, సూక్ష్మమైన జగత్‌క్షయమున ఈశ్వరుడు సలిలమును చేరి క్షోభపరిచెను. అపుడు నీటిమధ్యనుండి సూక్ష్మమైన రంధ్రమేర్పడెను. శద్దముగూర్చి రంధ్రము ద్వారా వాయువు ఏర్పడి లోన సంక్షోభమునొంది పెరిగెను. బలమైన వాయువు అట్లు వేగముగా ఆ సముద్రమును క్షోభ##పెట్టెను. క్షోభిల్లిన సముద్రము నీటిమధ్య నల్లని అగ్ని యొకటి ఉద్భవించెను. ఆ అగ్ని నీటిని ఎండించసాగెను. అపుడు సముద్రమంత రంధ్రమేర్పడి ఆకాశమున విస్తరించెను. ఆత్మతేజస్సుచే దివ్యమగు అమృతరసమువంటి నీరు ఏర్పడెను. ఛిద్రమునుండి ఆకాశము, ఆకాశమునుండి వాయువు, అందు సంఘర్షణచేత అగ్ని ఏర్పడెను. మహాభూత సృష్టిని చేయు పితామహుడు ఇది చూచి బ్రహ్మ జన్మతో లోకసృష్టికై బహురూపముల దాల్చి ధ్యానించెను. 150

తం యోగవంతం విజ్ఞాయ సంపూర్ణైశ్వర్యముత్తమమ్‌ | పదే బ్రాహ్మాణి విశ్వస్య న్యయోజయత యోగవిత్‌ || 151

తతస్తస్మిన్మహాతోయే మహేశో హరిరచ్యుతః | జలక్రీడాం చ విధివత్‌ స చక్రే సర్వలోకకృత్‌ || 152

పద్మం నాభ్యుద్భవం చైకం సముత్ఫాతిదవాంస్తతః | సహస్రవర్ణం విరజం భాస్కరాభం హిరణ్మయమ్‌ || 153

హుతాశనజ్జ్వలితః శిఖోజ్జ్వలప్రభం | సముత్థితం శరదమలార్కతేజసమ్‌ |

విరాజతే కమలముదారవర్చసం మహ్మాత్మనస్తనురుహచారుశైలవమ్‌ || 154

ఇతి శ్రీ పాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే పద్మప్రాదుర్భావో నామైకోనచత్వారింశోధ్యాయః

అతనిని సంపూర్ణమగు ఐశ్వర్యము గలిగిన ఉత్తముడిగా, యోగిగా తెలిసి బ్రహ్మపదమును విశ్వసించి యోగమును తెలిసినవాడై నియోగించెను. అపుడా మహాజలమున లోకములన్నింటిని సృజించు మహేశ్వరుడగు హరి విధివత్తు జలక్రీడను చేసెను. నాభి నుండి పద్మమును సృజించెను. అది సహస్రవర్ణములతో స్వచ్ఛమై సూర్యకాంతిని గలిగి బంగారము వలె నుండెను. అగ్ని జ్వాలలవంటి ఉజ్జ్వలకాంతిని గలిగి శరత్కాలసూర్యునివలె తేజస్సును గలిగి విష్ణుమూర్తి తనువుపై పెరుగు అందమైన శైవలము వలె ఉదారకాంతి గలిగి ఆ కమలము ప్రకాశించసాగెను. 154

ఇది శ్రీ పద్మపురాణమున మొదటి సృష్టిఖండమున పద్మప్రాదుర్భావమను ముప్పదితొమ్మిదవ అధ్యాయము

Sri Padma Mahapuranam-I    Chapters