Sri Padma Mahapuranam-I    Chapters   

అష్టత్రింశోధ్యాయః

భీష్మ ఉవాచ :-

కథం రామేణ విప్రర్షే కాన్యకుబ్జే తు వామన | స్థాపితః క్వ చ లబ్ధోసౌ విస్తరాన్మమ కీర్తయ || 1

తథా హి మధురా చైషా యా వాణీ రామకీర్తనే | కీర్తితా భగవన్మహ్యం హృతా కర్ణసుఖావహా || 2

అనురాగేణ తం లోకాః స్నేహాత్పశ్యంతి రాఘవమ్‌ | ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ బుద్ధ్యా చ పరినిష్ఠితః || 3

ప్రశాస్తి పృథివీం సర్మాం ధర్మేణ సుసమాహితః | తస్మిన్‌ శాసతి వైరాజ్యం సర్వకామఫలా ద్రుమాః | 4

రసవంతశ్చ ప్రభూతాశ్చ వాసాంసి వివిధాని చ | అకృష్టపచ్యా పృథీవీ నిఃసపత్నా మహాత్మనః || 5

దేవకార్యం కృతం తేన రావణో లోకకంటకః | నపుత్రోమాత్యసహితో లీలయైవ నిపాతితః || 6

తస్య వృద్ధిస్సముత్పన్నా పూర్ణే ధర్మే ద్విజోత్తమ | తస్యాహం చరితం సర్వం శ్రోతుమిచ్ఛామి వైమునే || 7

పులస్త్య ఉవాచ :- కస్వ చిత్త్వథ కాలస్య రామో ధర్మపథే స్థితః |

యచ్చకార మహాబాహా శ్రణుషై#్వకమనా నృప || 8

సస్మార రాక్షసేంద్రం తం కథం రాజా విభీషణః | లంకాయాం సంస్థితో రాజ్యం కరిష్యతి చ రాక్షసః || 9

గీర్వాణషు ప్రాతికూల్యం వినాశ్యస్య తు లక్షణమ్‌ | మయా తస్య తు తద్దత్తం రాజ్యం చంద్రార్కకాలికమ్‌ || 10

తస్యావినాశతః కీర్తిః స్థిరా మే శాశ్వతీ భ##వేత్‌ | రావణన తపస్తప్తం వినాశాయాత్మన స్త్విహ || 11

విధ్వస్తః స చ పాపిష్ఠో దేవకార్యే మయాథునా ! తదిదానీం మయాన్వేష్యః స్వయం గత్వా విభీషణః || 12

సందేష్టవ్యం హితం తస్య యేన తిష్ఠేత్స శాశ్వతమ్‌ | ఏవం చింతయతస్తస్య రామస్యామితతేజసః || 13

ఆజగామాథ భరతో రామం దృష్ట్వా బ్రవీదిదమ్‌ | కిం త్వం చింతయసే దేవ న రహస్యం వదస్వ మే || 14

దేవకార్యే ధరాయాం వా స్వకార్యే వా నరోత్తమ | ఏవం బ్రువంతం భరతం ధ్యాయమానమవస్థితమ్‌ || 15

అబ్రవీద్రాఘవో వాక్యం రహస్యం తు న వై తవ | భవాన్‌ బహిశ్చరః ప్రాణో లక్ష్మణశ్చ మహాయశాః || 16

అవేద్యం భవతో నాస్తి మమ సత్యం విధారయ | ఏషా మే మహతీ చింతా కథం దేవైర్విభీషణః || 17

వర్తతే యద్ధితార్ధం వై దశగ్రీవో నిపాతితః | గమిష్యే తదహం లంకాం యత్ర చాసౌ విభీషణః || 18

తం చ దృష్ట్వా పురీం తాం తు కార్యముక్త్వా చ రాక్షసమ్‌ |

అలోక్య సర్వవసుధాం సుగ్రీవం వానరేశ్వరమ్‌ || 19

మహారాజం చ శత్రుఘ్నుం భ్రాతృ పుత్రాంశ్చ సర్వశః | ఏవం వదతి కాకుత్థ్సే భరతః పురతః స్థితః || 20

ఉవాచ రాఘవం వాక్యం గమిష్యే భవతా సహ | ఏవం కురు మహాబాహో సౌమిత్రిరిహ తిష్ఠతు || 21

ఇత్యుక్త్వా భరతం రామ సౌమిత్రిం చాహ వై పురే | రక్షా కార్యా త్వయావీర యావదాగమినం హి నౌ || 22

ఏవం లక్ష్మణమాదిశ్య ధ్యాత్వా వై పుష్పకం నృప | ఆరురోహ స వై యానం కౌసల్యాః నందవర్ధనః || 23

పుష్కకం తు తతః ప్రాప్తం గాంధారవిషయో యతః | భరతస్య సుతౌ దృష్ట్వా జగన్నతిం నిరీక్ష్య చ || 24

పూర్వాం దిశం తతో గత్వా లక్ష్మణస్వ సుతౌ యతః | పురేషు తేషు షడ్రాత్రముషిత్వా రఘునందనౌ || 25

గతౌ తేన విమానేన దక్షిణామభితో దిశమ్‌ | గంగాయామున సంభేదం ప్రయాగమృషి సేవితమ్‌ || 26

అభివాద్య భరధ్వాజమత్రే రాశ్రమమీయతుః | సంభాష్య చ మునీంస్తత్ర జనస్థానముపాగతౌ || 27

భీష్ముడడిగెను:- 'విప్రర్షీ ! రాముడు కాన్యకుబ్జమున వామనుని ఎట్లు స్థాపించెను? అతనెక్కడ లభించెనో విపులంగా నాకు చెప్పుము. అట్టి రాముని నామ కీర్తనము మధురమైనది. చెవులకింపైనది. లోకములు అతనిని స్నేహముతో చూచును. ధర్మమును, చేసినదానిని తెలిసినవాడు, బుద్ధిమంతుడు. నిశ్చల మనస్సుతో ధర్మముతో పృథివిని పాలించును. అతను పాలించుచుండగా చెట్లు కోరికలన్నింటినీ తీర్చునవై, రసములు గలిగి అన్ని సౌఖ్యములుండును. దున్నకనే భూమి పండును. మహాత్ములకు సపత్నులుండరు. దేవకార్యమును చేసిన రాముడు పుత్రామాత్యపరివారంతో రావణుని లీలగా నేలకూల్చెను. పూర్ణధర్మమున బుద్ధి ఏర్పడిన రాముని పూర్తి చరితమును వినగోరుచున్నాను.

పులస్త్యుడు చెప్పెను : - కొంతకాలము తరువాత ధర్మపథమున నున్న రాముడేమి చేసెనో చెప్పెదను. సావధానముగా వినుము. రాముడు పరిపాలన చేయుచూ, విభీషణుని తలచుకొని లంకయందా రాక్షస రాజెట్లు రాజ్యము చేయుచున్నాడో తెలియగోరెను. దేవతలపట్ల వ్యతిరేకత వినాశానికి చిహ్నము. సూర్యచంద్రులుండునంత వరకుండు రాజ్యమును నేనతనికి ఇచ్చితిని. అది నశింపకుండిన, నా కీర్తి శాశ్వతముగా , స్థిరముగా నుండును. తన వినాశము కొరకే రావణుడు తపస్సు నాచరించెను. దేవకార్యమున నేనా పాపిష్ఠుని సంహరించితిని. ఇక నేనిపుడు వెళ్ళి విభీషణుని చూడవలెను. భరతుడక్కడకు వచ్చి రామునితో నిట్లనెను. ''దేవా! నీవే మాలోచించుచుంటివి. రహస్యము కానిచో నాకు చెప్పుము. భూమిపై దేవకార్యముననా లేక స్వకార్యముననా నీవిట్లు ఆలోచించుట? '' అని భరతుడు ఆలోచనలో మునిగి పలుకగా రాముడు అతనితో, ''నీకు రహస్యమేమి? నీవూ, యశస్వియగు లక్ష్మణుడు నా బహిః ప్రాణములు కదా! నీకు తెలియగూడనిది లేదు. ఇది సత్యము. ఎవరి కొరకు రావణుని వధించితినో ఆ విభీషణుడెట్లుండెనో అని నా పెద్ద చింత? ఇక నేను విభీషణుడున్న లంకకు వెళ్ళదను. అతనిని, లంకాపురిని చూచి రాక్షసరాజుకు చేయవలసిన దానిని చెప్పి, వసుధను జుట్టి, వానరేశ్వరుని సుగ్రీవుని చూచి, శత్రఘ్నరాజును, భ్రాతృ పుత్రులను చూచి వచ్చెద'' నని రాముడనగా భరతుడు ఎదుట నిలిచి రామునితో ఇట్లనెను. ''నేను కూడా మీతో వచ్చెదను. ఇలా చేయుము. లక్ష్మణుడిక్కడే వుండనిమ్ము అని రాముడు భరతునితోనని లక్ష్మణునితో నిట్లనెను. ''వీరుడా ! పురమున నీవు రక్షణను మేము తిరిగి వచ్చునంతవరకు కల్పించవలెను'' అని లక్ష్మణుని ఆజ్ఞాపించి పుష్పక విమానమును ధ్యానించి యానము నధిరోహించెను. అక్కడి నుండి పుష్పకము గాంధారుల రాజ్యమును చేరుకొనెను. భరతుడు, రాముడు భరతుని పుత్రులను చూచి, అక్కడి విధానమును గమనించి, లక్ష్మణుని పుత్రులున్న తూర్పుదిక్కునకు చేరిరి. అచట ఆరు రాత్రులు నగరమున గడిపి విమానములో దక్షిణ దిక్కునకు చేరిరి . అక్కడ గంగాయమునల సంయోగమున ప్రయాగయను ఋషులచే సేవింపబడు తీర్థమును చేరి, భరద్వాజుని సమీపించి, నమస్కరించి అత్రి ఆశ్రమమునకు చేరిరి. అక్కడ మునీంద్రులతో మాటలాడి జనస్థానమును చేరిరి. 27

రామ ఉవాచ : - ఆత్ర పూర్వం హృతా సీతా రావణన దురాత్మనా |

హత్వా జటాయుషం గృధ్రం యోసౌ పితృసఖో హి నౌ || 28

అత్రాస్మాకం మహద్యుద్ధం కబంధేన కుబుద్ధినా | హతేవ తేన దగ్ధేన సీతాస్తే రావణాలయే || 29

ఋష్యమూకే గిరివరే సుగ్రీవో నామ వానరః స తే కరిష్యతే సాహ్యం పంపాం వ్రజ సహానుజః | 30

పంపాసరః సమాసాద్య శబరీం గచ్ఛ తాపసీమ్‌ | ఇత్యుక్తో దుఃఖితో వీర నిరాశో జీవితే స్థితః || 31

ఇయం సా నళినీ వీర యస్యాం వై లక్ష్మణోవదత్‌ మా కృథాః పురుషవ్యాఘ్ర శోకం శత్రువినాశన || 32

ఆజ్ఞాకారిణి భృత్యే చ మయి ప్రాప్స్యసి మైథిలీమ్‌ | అత్ర మే వార్షికా మాసా గతా వర్షశతోపమాః || 33

అత్రైవ నిహతో వాలీ సుగ్రీవార్థే పరంతప | ఏషా సా దృశ్యతే నూనం కిష్కింధా వాలిపాలితా || 34

యస్యాం వై స హి ధర్మాత్మా సుగ్రీవో వానరేశ్వరః | వానరైః సహితో వీర తావదాస్తే సమాః శతమ్‌ || 35

వానరైస్సహ సుగ్రీవో యావదాస్తే సభాం గతః | తావత్తత్రాగతౌ వీరౌ పుర్యాం భరతరాఘవౌ || 36

అపుడు రాముడనెను:- పూర్వము దురాత్ముడగు రావణుడక్కడే సీత నపహరించెను. మా తండ్రికి స్నేహితుడైన జటాయువను గద్దను చంపి రావణుడు సీత నపహరించెను. కుబుద్ధియగు కబంధునితో మాకు గొప్ప యుద్ధము జరిగెను. సీత ఇక రావణుని ఇంట వుండినది. అటు తరువాత ఋష్యమూకమను గిరిశ్రేష్టముపై సుగ్రీవుడను వానరుని కలిసి, పంపాసరమునకు చేరి శబరి అను తాపసిని కలిసితిమి. పంపాసరస్సుకు వెళ్ళుమని జీవితముపై నిరాశనొందిన యతనితో అనెను. లక్ష్మణుడు శోకించవద్దని ఈమెను గూర్చి పలికెను. ఆజ్ఞను పాలించు భృత్యుడను నేనుండగా సీతను నీవు పొందగలవు. ఇచ్చోటనే నేను పన్నెండు నెలలను నూరు సంవత్సరములవలె గడిపితిని. సుగ్రీవుని కొరకు నేను ఈ ప్రదేశముననే వాలిని జంపితిని. ఇదిగో, ఈ నగరమే 'కిష్కింధ' యని వాలి పాలించినది. ఈ నగరముననే ధర్మాత్ముడగు వానరుడు 'సుగ్రీవుడు' ఇతర వానరులతో కలిసి నూరు సంవత్సరాలుగా వుంటున్నాడు, వానరులతో కలసి సుగ్రీవుడు సభకు వెళ్ళియుండినంతలో భరతుడు, రాముడు ఆ పురమును ప్రవేశించిరి. 36

దృష్ట్వా స భ్రాతరౌ ప్రాప్తౌ ప్రణిపత్యాబ్రవీదిదమ్‌ | క్వ యువాం ప్రస్థితౌ వీరౌ కార్యం కిం తు కరిష్యథః || 37

వినివేశ్యసనే తౌ చ దదావర్ఘ్యే స్వయం తదా | ఏవం సభాస్థితే తత్ర ధర్మిష్ఠే రఘునందనే || 38

అంగదోథ హనూమాంశ్చ నలో నీలశ్చ పాటలః | గజో గవాక్షో గవయః పనసశ్చ మహాయశాః || 39

పురోధనో మంత్రిణశ్చ దైవజ్ఞో దధివక్రకః | నీలశ్శత బలిర్మైందో ద్వివిదో గంధమాదనః || 40

వీరబాహు స్సుబాహుశ్చ వీరసేనో వినాయకః | సూర్యాభః కుముదశ్చైవ సుషేణో హరియూథపః || 41

ఋషభో వినతశ్చైవ గవాఖ్యో భీమ విక్రమః | ఋక్షరాజశ్చ ధూమ్రశ్చ సహసైన్యైరుపాగతాః || 42

అంతః పురాణి సర్వాణి రుమా తారా తథైవ చ | అవరోధోంగదస్యాపి తథాన్యాః పరిచారికాః || 43

ప్రహర్షమతులం ప్రాప్య సాధు సాధ్వితి చాబ్రువన్‌ |వానరాశ్చ మహాత్మానః సుగ్రీవసహితా స్తదా || 44

వానర్యశ్చ మహాభాగాస్తారాద్యస్తత్ర రాఘవమ్‌ | అభిప్రేక్ష్యాశ్రుకంఠాశ్చ ప్రణిపత్యేదమబ్రువన్‌ || 45

క్వ సా దేవీ త్వయా దేవ యా వినిర్జిత్య రావణమ్‌ | శుద్ధిం కృత్వా హి తే వహ్నౌ పితురగ్ర ఉమాపతేః || 46

త్వయా నీతాం పురీం రామ న తాం పశ్యామి తేగ్రతః | న వినా త్వం తయా దేవ శోభ##సే రఘునందన || 47

సుగ్రీవుడు వారిద్దరినీ జూచి, నమస్కరించి ''మీరెక్కడికి బయలుదేరితిరి? ఏ పని చేయబోవు చున్నారు.?'' అని ఆసనముపై కూర్చుండబెట్టి ఆర్ఘ్యమును తాను స్వయముగా నిచ్చెను. ధర్మిష్ఠుడగు రాముడట్లు సుగ్రీవుని సభలో నుండగా, అంగదుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు , గజుడు, గవాక్షుడు, గవయుడు, వనసుడు, పురోహితుడు, దైవజ్ఞుడగు దధివక్రకుడు మంత్రులు, శతబలి, మైందుడు, ద్వివిదుడు, గంగమాదనుడు, వీరబాహువు, సుబాహువు, వీరసేనుడు, వినాయకుడు, సూర్యాభుడగు కుముదుడు, సేనాపతియగు సుషేణుడు, ఋషభుడు, శూరుడగు గవాఖ్యుడు, ధూమ్రుడను ఎలుగుబంట్ల రాజు వారి వారి సైన్యములతో వచ్చిరి. రుమ, తార మిగిలిన అంతఃపుర స్త్రీలు , అంగదుని స్త్రీజనము, ఇతర పరిచారికలు అమితానందమును పొంది ''బాగు బాగు'' యని పలికిరి. సుగ్రీవునితో ఇతర వానరులు, వానర స్త్రీలు రాముని చూచి, నమస్కరించి గద్గద స్వరముతో ఇట్లనిరి. ''దేవా ! రావణుని జంపి నీవు తెచ్చుకొనిన దేవి సీత ఎక్కడ? శివుని, నీతండ్రి ఎదుట అగ్నిశుద్ధిని గావించి నగరానికి తీసుకొని వెళ్ళిన సీత నీతో కలిసి కనబడుటలేదు. రామా! సీత లేకుండా నీవు శోభించుటలేదు. 47

త్వయా వినాపి సాధ్వీ సా క్వ ను తిష్ఠతి జానకీ | అన్యాం భార్యాం న తే వేద్మి భార్యహీనో న శోభ##సే || 48

క్రౌంచయుగ్మం మిథో యద్వచ్చక్రవాక యుగం యథా | ఏవం వదంతీం తాం తారాం తారాధిపసమాననామ్‌ || 49

ప్రాహ ప్రవచసాం శ్రేష్టో రామో రాజీవలోచనః | చారుదంష్ట్రే విశాలాక్షి కాలో హి దురతిక్రమః || 50

సర్వం కాలకృతం విద్ధి జగదేతచ్చరాచరమ్‌ | విసృజ్య తాః స్త్రియః సర్వాః సుగ్రీవోభిముఖః స్థితః 51

నీవు లేక జానకి, సాధ్వి ఎక్కడుండగలదు? నీకు వేరొక భార్య వున్నదని నే నెరుగను. భార్యలేక నీవు శోభించుట లేదు. మీరిద్దరు క్రౌంచ దంపతులవలె, చక్రవాక జంటవలె నుండిరి'' అని చంద్రునివంటి అందమైన ముఖముగల తార అనగా వాగ్విదుడగు రాముడామెతో నిట్లనెను. ''విశాలాక్షీ! కాలము దాట శక్యముగానిది. చరాచర జగత్తంతా కాలముచేతనే నిర్మింపబడినది'' అనగా ఆ స్త్రీలు రాముని విడిచిరి. సుగ్రీవుడు రాముని ఎదుట నిలిచి ఇట్లనెను. 51

సుగ్రీవ ఉవాచ:- భవంతౌ యేన కార్యేణ ఇహాయాతౌ నరేశ్వరౌ |

తచ్చాపి కథ్యతాం శీఘ్రం కృత్యకాలో హివర్తతే | 52

బ్రువాణమేవం సుగ్రీవం భరతో రామచోదితః | ఆచచక్షే చ గమనం లంకాయాం రాఘవస్య తు ||

తౌ చాబ్రవీచ్చ సుగ్రీవో భవద్భ్యాం సహితః పురీమ్‌ || 53

గమిష్యే రాక్షసం దేవ ద్రష్టుం తత్ర విభీషణమ్‌ | సుగ్రీవేణౖవముక్తే తు గచ్ఛ స్వేత్యాహ రాఘవః || 54

సుగ్రీవో రాఘవౌ తౌ చ పుష్ప కేతుస్థితాస్త్రయః | తవత్ర్పాప్తం విమానం తు సముద్రస్యోత్తరం తటమ్‌ || 55

అబ్రవీద్భరతం రామో హ్యత్ర మే రాక్షసేశ్వరః | చతుర్భిః సచివైః సార్థం జీవితార్థే విభీషణః || 56

ప్రాప్తస్తతో లక్ష్మణన లంకారాజ్యేభిషేచితః | అత్ర చాహం సముద్రస్య పరే పారే స్థితస్త్ర్యహమ్‌ || 57

పాలకులగు 'మీరే కార్యముచేత ఇక్కడకరుదెంచిరి? త్వరగా తెలియజేయుడు. చేయవలసిన కాలము కదా! అనగా రామునిచే ప్రేరేపించబడిన భరతుడు రాముడు లంకకు వెళ్ళదలచుటను గూర్చి సుగ్రీవునికి చెప్పెను. అపుడు సుగ్రీవుడు వారితో సహా విభీషణుని చూచుటకు తానుకూడా వచ్చెదనని చెప్పెను. రాముడందుకంగీరించగా వారు ముగ్గురూ పుష్కక విమానమునెక్కిరి. విమానమపుడు సముద్రముయొక్క ఆవలి తీరమును చేరెను. అపుడు రాముడు భరతునితో 'ఇచ్చోటనే రాక్షసరాజు విభీషణుడు జీవితముకై తన నలుగురు మంత్రులతో నన్ను జేరెను. అపుడు లక్ష్మణుడతని లంకారాజ్యమున అభిషేకించెను. ఈ సముద్ర తీరమున నేను మూడు దినములు వుంటిని.

దర్శనం దాస్యతే మే సౌ జ్ఞాతికార్యం భవిష్యతి | తావన్న దర్శనం మహ్యం దత్తమేతేన శత్రుహన్‌ || 58

తతః కోపః సముద్భూతశ్చతుర్థేహని రాఘవ | ధనురాయమ్య వేగేన దివ్యమస్త్రకరే ధృతమ్‌ || 59

దృష్ట్వా మాం శరణాన్వేషీ భీతో లక్ష్మణమాశ్రితః | సుగ్రీవేణానునీతోస్మి క్షమ్యతాం రాఘవ త్వయా || 60

తతో మయోక్షిప్తశరో మరుదేశే హ్యపాకృతః | తతస్సముద్రరాజేన భృశం వినయశాలినా || 61

ఉక్తోహం సేతుబంధేన లంకాం త్వం వ్రజ రాఘవ | లంఘుయిత్వా నరవ్యాఘ్ర వారిపూర్ణం మహోదధిమ్‌ || 62

ఏష సేతుర్మయా బద్దః సముద్రే వరుణాలయే | త్రిభిర్దినైః సమాప్తిం వై నీతో వానరసత్తమైః || 63

ప్రథమే దివసే బద్ధో యోజనాని చతుర్దశ | ద్వితీయేహని షట్త్రింశత్తృతీయేర్ధశతం తథా || 64

ఇయం సా దృశ్యతే లంకా స్వర్ణప్రాకారతోరణా | అవరోధో మహానత్ర కృతో వానరసత్తమైః || 65

అత్ర యుద్ధం మహద్వృత్తం చైత్రశుక్లచతుర్దశి | అష్టచత్వారింశద్దినం యత్రాసౌ రావణో హతః || 66

అత్ర ప్రహస్తో నీలేన హతో రాక్షసపుంగవః | హనూమతా చ ధూమ్రాక్షో హ్యత్రైవ వినిపాతితః || 67

మహోదరాతికా¸° చ సుగ్రీవేణ మహాత్మనా | అత్రైవ మే కుంభకర్ణో లక్ష్మణనేంద్రజిత్తథా|| 68

దర్శనమిచ్చిన, నా జ్ఞాతి కార్యమగుననగా ఇతను (సముద్రుడు) దర్శనమివ్వలేదు. అందుచే కోపించి నేను నాలుగవ దినమున వేగంగా విల్లునెక్కుపెట్టి బాణమును చేబూనితిని. అట్టి నన్ను జూచి శరణువేడుచూ, భయమునొంది లక్ష్మణునాశ్రయించెను. అపుడు అతనిని క్షమించమని సుగ్రీవుడు నన్ననునయించెను. అపుడు నేనెక్కుబెట్టిన శరమును ఎడారిదేశమున విడిచితిని. అపుడు వినయశాలియగు సముద్రరాజు 'సేతుబంధము చేసి లంకకు వెళ్ళుమని ' నాతో అనెను. అపుడు నేను సముద్రముపై ఈ సేతువును నిర్మించితిని. వానరశ్రేష్ఠులచే మూడు రోజులలో సేతువు కట్టబడెను. మొదటిరోజు పధ్నాలుగు యోజనముల సేతువును నిర్మించి, రెండవరోజు ముప్పదియారు యోజనముల సేతువును, మూడవరోజు యాభై యోజనములచే సేతు నిర్మాణమును పూర్తిచేసిరి. ఇదిగో ఇదే లంక. బంగారు ప్రాకారముల తోరణము కలది. వానరశ్రేష్ఠులు గొప్ప అవరోధమును కల్పించిరి. చైత్ర శుద్ద చతుర్దశినాడు ఇరువదినాలుగు దినములు గొప్ప యుద్ధము జరుగగా అందు రావణుడు మరణించెను. ఇక్కడే నీలుడు ప్రహస్తుని, హనుమంతుడు ధూమ్రాక్షుని, సుగ్రీవుడు మహోదర, అతికాయులను, లక్ష్మణుడు కుంభకర్ణుని, ఇంద్రజిత్తుని వధించిరి. 68

మయా చాత్ర దశగ్రీవో హతో రాక్షసపుంగవః | అత్ర సంభాషితుం ప్రాప్తో బ్రహ్మా లోకపితామహః || 69

పార్వత్యా సహితో దేవః శూలపాణిర్వృషధ్వజః || మహేంద్రాద్యాః సురగణాః సగంధర్వాస్స కింనరాః || 70

పితా మే చ సమాయాతో మహారాజస్త్రివిష్టపాత్‌ | వృతశ్చాప్సరసాం సంఘైర్విద్యాధరగణౖస్తథా || 71

తేషాం సమక్షం సర్వేషాం జానకీ శుద్ధిమిచ్ఛతా | ఉక్తా సీతా హవ్యవాహం ప్రవిష్టా శుద్ధిమాగతా || 72

లంకాధిపైః సురైః దృష్టా గృహీతా పితృశాసనాత్‌ | అథాప్యుక్తోథ రాజ్ఞాహమయోధ్యాం గచ్ఛ పుత్రక || 73

న మే స్వర్గో బహుమతస్త్వయా హీనస్య రాఘవ |

తారితోహం త్వయా పుత్ర ప్రాప్తోస్మీంద్రసలోకతామ్‌ || 74

లక్ష్మణం చాబ్రవీద్రాజా పుత్ర పుణ్యం త్వయార్జితమ్‌ | భ్రాత్రా సమమథో దివ్యాంల్లోకాన్‌ ప్రాప్స్యసి చోత్తమాన్‌ || 75

ఆహూయ జానకీం రాజా వాక్యం చేదమువాచ హ | న చ మన్యుస్త్వయా కార్యో భర్తారం ప్రతి సుప్రతే || 76

ఖ్యాతిర్భవిష్యత్యేవాగ్ర్యా భర్తుస్తే శుభలోచనే | ఏవం వదతి రామే తు పుష్పకే చ వ్యవస్థితే || 77

తత్రయే రాక్షసవరాస్తే గత్వాశు విభీషణమ్‌ | ప్రాప్తో రామః ససుగ్రీవశ్చారా ఇత్థం తదావదన్‌ 78

విభీషణస్తు తచ్ఛృత్వా రామాగమనమంతికే | చారాంస్తాన్పూజయామాస సర్వకామధనాదిభిః || 79

ఇక్కడే నేను రాక్షస శ్రేష్ఠుడైన రావణుని వధించితి. ఇక్కడే లోక పితామహుడగు బ్రహ్మ సంభాషించవచ్చెను. పార్వతితో శూలపాణి, వృషధ్వజుడగు శివుడు, ఇంద్రునితో దేవగణాలు, గంధర్వ కిన్నరాదులు వచ్చిరి. స్వర్గమునుండి నా తండ్రి మహారాజగు దశరథుడు వచ్చెను. అప్సరసలు, విద్యాధరులు అతని చుట్టియుండిరి. వారందరి సమక్షంలో సీత యొక్క శుద్ధిని కోరగా ఆమె అగ్నిని ప్రవేశించి శుద్ధినొందెను. లంకాధీశులు, సురులు దానిని చూచిరి. నా తండ్రి ఆదేశముపై నేనామెను గ్రహించితిని. అపుడు అ యోధ్యకు వెళ్ళు నాయనా యని నా తండ్రి నాకు చెప్పెను. 'రామా! నీవు లేని స్వర్గము కూడా నాకు ఎక్కువ కాదు. నీవు నేను తరించునట్లు చేసితివి. నీచే నేను ఇంద్రుని సలోకమును పొందితిని' అని దశరథుడు లక్ష్మణునితో, 'నాయనా ! నీవు పుణ్యము నార్జించితివి. సోదరునితో కూడి దివ్య లోకములను పొందెదవు' అనెను. సీతను పిలిచి 'అమ్మా! నీవు భర్తపై కోపము గొనరాదు. నీ భర్తకు ఉత్తమ కీర్తి లభించును' అనెనని రాముడు చెప్పుచుండగా పుష్పకమచటికి చేరెను. అక్కడున్న రాక్షస శేష్ఠులు చారులు విభీషణుని చేరి 'రాముడు సుగ్రీవునితో వచ్చె'నని చెప్పిరి. అది విని విభీషణుడు వారు కోరిన ధనము మొదలైన వానితో ఆ చారులను పూజించెను.

అలంకృత్య పురీం తాం తు నిష్క్రాంతః సచివైః సహ | దృష్ట్వా రామం విమానస్థం మేరావివ దివాకరమ్‌ || 80

అష్టాంగప్రణిపాతేన నత్వా రాఘవమబ్రవీత్‌ | అద్య మే సఫలం జన్మ ప్రాప్తాః సర్వే మనోరథాః || 81

యద్దృష్టౌ దేవచరణౌ జగద్వంద్యావనిందితౌ| కృతః శ్లాఘ్యోసీజ్యహం దేవ శక్రాదీనాం దివౌకసామ్‌ || 82

ఆత్మానమధికమ్మన్యే త్రిదశేశాత్పురందరాత్‌ | రావణస్య గృహే దీప్తే సర్వరత్నో పశోభితే || 83

ఉపవిష్టే తు కాకుత్థ్సే అర్ఘం దత్వా విభీషణః | ఉవాచ ప్రాంజలిర్భూత్వా సుగ్రీవం భరతం తథా || 84

ఇహాగతస్య రామస్య యద్దాస్యే న తదస్తి మే | ఇయం చ లంకా రామేణ రిపుం త్రైలోక్యకంటకమ్‌ || 85

హత్వా తు పాపకర్మాణం దత్తా పూర్వం పురీ మమ | ఇయం పురీ ఇమే దారా అమీ పుత్రాస్తథాహ్యహమ్‌ || 86

సర్వమేతన్మయా దత్తం సర్వమక్షయమస్తు తే | తతః ప్రకృతయః సర్వా లంకావాసిజనాశ్చ యే || 87

ఆజగ్మూ రాఘవం ద్రష్ఠుం కౌతూహలసమన్వితాః | ఉక్తో విభీషణసై#్తస్తు రామం దర్శయ నః ప్రభో || 88

విభీషణన కథితా రాఘవాయ మహాత్మనే | తేషాముపాయనం సర్వం భరతో రామచోదితః || 89

జగ్రాహ వానరేంద్రశ్చ ధనరత్నౌఘ సంచయమ్‌ | ఏవం తత్ర త్ర్యహం రామో హ్వవసద్రాక్షసాలయే || 90

ఆ పురమునలంకరించి, బయల్వెడలి మంత్రులతో రాముని జూడవచ్చి, మేరువుపై సూర్యునివలె విమానములో వెలుగొందుతున్న రాముని చూచి, సాష్టాండదండ ప్రణామము చేసి నమస్కరించి ఇట్లనెను:- దేవా! ఈనాడు నా జన్మ సఫలమైనది. అన్ని కోరికలు లీడేరినవి. జగద్వంద్యములు, అనింద్యములగు మీ చరణములను చూచితిని. ఇంద్రాది దేవతలకు నేను పూజ్యుడిగ చేయబడితిని. ఇంద్రునికంటెనూ శ్రేష్ఠుడనేనని తలంతును. అన్ని రత్నములతో అలరాడుచున్న రావణుని గృహములో రాము డాసీనుడు కాగా విభీషణు డర్ఘ్యమిచ్చి చేతులు జోడించి సుగ్రీవ, భరతులతో నిట్లనెను:- 'ఇట కేతెంచిన రామునకు నేనివ్వగలది నావద్ద లేదు. ముల్లోకములకు కంటకుడైన రావణుడను శత్రువును దునుమాడి నాకిచ్చినదీ పురము, ఈ నగరము, ఈ నా పత్నులు, ఈ పుత్రులు, నేను కూడా మీకు దానమివ్వబడితిమి. నీకంతా అక్షయమగుగాత!' అనెను. అటుపిమ్మట లంకయందలి జనులందరూ రాముని జూచుటకు కుతూహలముతో వచ్చి, 'మాకు రాముని జూపింపుమ'ని విభీషణుని అడిగిరి. అపుడతను రామునికి తెలియజేయగా, రాముని ఆదేశంపై భరతుడు, సుగ్రీవుడు ఆ జనులు తెచ్చిన బహుకృతులను గ్రహించిరి. ఈ విధంగా, ఆ రాక్షసేంద్రునింట రాముడు మూడు దినములు గడిపెను. 90

చతుర్థేహని సంప్రాప్తే రామే చాపి సభాస్థితే | కేకసీ పుత్రామహేదం రామం ద్రక్ష్యామి పుత్రక || 91

దృష్టే తస్మిన్మహత్పుణ్యం ప్రాప్యతే మునిసత్తమైః | విష్ణురేష మహాభాగశ్చతుర్మూర్తి స్సనాతనః || 92

సీతా లక్ష్మీర్మహాభాగ న బుద్ధా సాగ్రజేన తే | పిత్రా తే పూర్వమాఖ్యాతం దేవానం దివి సంగమే || 93

కులే రఘాణాం వై విష్ణుః పుత్రో దశరథస్య తు | భవిష్యతి వినాశయ దశ గ్రీవస్య రక్షసః || 94

విభీషణ ఉవాచ :- ఏవం కురుష్వ వై మాతర్గృహాణ నవమంబరమ్‌ |

పాత్రం చందనసంయుక్తం దధిక్షౌద్రాక్షతైః || 95

దూర్వయార్ఘం సహ కురు రాజపుత్రస్య దర్శనమ్‌ | సరమామగ్రతః కృత్వా యాశ్చాన్యా దేవకన్యకాః || 96

వ్రజస్వ రాఘవాభ్యాశం తస్మాదగ్రే వ్రజామ్యహమ్‌ | ఏవముక్త్వా గతం రక్షో యత్ర రామో వ్యవస్థితః || 97

ఉత్సార్య దానవాన్‌ సర్వాన్‌ రామం ద్రష్టుం సమాగతాన్‌ |

సభాం తాం సమలంకృత్య రామం స్వాభిముఖే స్థితమ్‌ || 98

అది విని విభీషణుడు 'అమ్మా ! నీవిట్లు చేయుము. కొత్త వస్త్రమును, గంధముతో పాత్రను, పెరుగును, అక్షితలు, తేనెతో, దూర్వాతో తీనుకొని అర్ఘ్యముతో రాజపుత్రుని దర్శించుము. సరమ మరియు ఇతర దేవకన్యలు నీ ముందు నడువగా రాముని చెంతకు నడువుము. నీముందే నేను నడిచెదను' అని రాముడున్నచోటికి వెళ్ళెను. రాముని చూడవచ్చిన దానవులనందరినీ తొలగించి వేసి ఆ సభయందు అలంకృతమైయున్న తన ఎదుట నిలిచిన రామునితో నిట్లనెను. 98

విభీషణ ఉవాచ :- విజ్ఞాప్యం శ్రుణు మే దేవ వదతశ్చ విశాంపతే |

దశగ్రీవం కుంభకర్ణం యా చ మాం చాప్యజీజనత్‌ || 99

ఇయం సా దేవ మాతా నః పాదౌ తే ద్రష్టుమిచ్ఛతి |

తస్యాస్తు త్వం కృపాం కృత్వా దర్శనం దాతుమర్హసి || 100

రామ ఉవాచ :- అహం తస్యాః సమీపం తు మాతృదర్శనకాంక్షయా |

గమిష్యే రాక్షసేంద్ర త్వం శీఘ్రం యాహి మమాగ్రతః || 101

ప్రతిజ్ఞాయ తు తం వాక్యముత్తస్థౌ చ వరాసనాత్‌ | మూర్ధ్ని చాంజలిమాదాయ ప్రణామమకరోద్విభుః || 102

అభివాదయేహం భవతీం మాతా భవసి ధర్మతః | మహతా తపసా చాపి పుణ్యన వివిధేన చ || 103

ఇమౌ తే చరణౌ దేవి మానవో యది పశ్యతి | పూర్ణః స్యాత్తదహం ప్రీతో దృష్ట్వా తౌ పుత్రవత్సలే || 104

కౌసల్యా మే యథా మాతా భవతీ చ తథా మమ | కేకసీ చాబ్రవీద్రామం చిరంజీవ సుఖీభవ || 105

భర్త్రా మే కథితం వీర విష్ణుర్మానుషరూపధృత్‌ | అవతీర్ణో రఘకులే హితార్థే త్రిదివౌకసామ్‌ || 106

దశగ్రీవవినాశాయ భూతిం దాతుం విభీషణ | వాలినో నిధనం చైవ సేతుబంధం చ సాగరే || 107

పుత్రో దశరథసై#్యవ సర్వం స చ కరిష్యతి | ఇదానీం త్వం మయా జ్ఞాతః స్మృత్వా తద్భర్తృభాషితమ్‌ || 108

సీతా లక్ష్మీర్భవాన్విష్ణుర్దేవా వై వానరాస్తథా | గృహం పుత్ర గమిష్యామి స్థిరికీర్తిమవాప్నుహి || 109

విభీషణుడనెను: 'దేవా ! నా విజ్ఞాపనను వినుము. రావణుని, కుంభకర్ణుని, నన్ను కూడా కన్న ఈ తల్లి నీ పాదముల చూడగోరుచున్నది. దయతో ఆమెకు నీవు దర్శనమివ్వవలెను' . అనగా రాముడు 'రాక్షసరాజా! తల్లిని చూడగోరి నేను నేను ఆమె వద్దకు వెళ్ళెదను. తప్పుకొనుము' అని ప్రతిజ్ఞ చేసి, ఆసనముపై నుండి లేచి తలపై చేతులు ఉంచుకొని ఆమెకు నమస్కరించెను. 'ఆమ్మా! నేను నీకు నమస్కారము చేయుచుంటిని. ధర్మము ప్రకారము నీవు నా తల్లివి. నీ గొప్ప తపస్సుచే, వివిధ పుణ్యముచే నాకు తల్లివి. అమ్మా ! నీ ఈ చరణములను మానవుడు చూచినచో పరిపూర్ణుడగును. నీ పాదము జూసి ప్రీతినొందితిని. నాకు కౌసల్య యెట్లో నీవునూ అట్లే అనగా కేకసి 'చిరంజీవ ! సుఖముగా నుండుము. విష్ణువు మానవరూపాన్ని ధరిస్తాడని నా భర్త చెప్పాడు. దేవతల హితానికై రఘుకులమున విష్ణువు రాముడిగ నవతరిచెను. రావణుని నాశనాకి విభీషణునికి ఐశ్వర్యము నిచ్చుట కవతరించెను. వాలి వధ, సేతుబంధములను దశరథపుత్రుడు చేయును. నా భర్త పలుకులను స్మరించి నిన్నెఱిగితిని. సీత లక్ష్మి, నీవు విష్ణుదేవుడవు. ఈ వానరులు దేవతలు. నాయనా! నా ఇంటికి ఇక నేను వెళ్ళెదను. నీవు స్థిరమైన కీర్తిని పొందుము.' 109

సరమోవాచ :- ఇహైవ వత్సరం పూర్ణం అశోకవనికాస్థితా ! సేవితా జానకీ దేవీ సుఖం తిష్ఠతి తే ప్రియా || 110

నిత్యం స్మరామి వై పాదౌ సీతాయస్తు పరంతప | కదా ద్రక్ష్యామి తాం దేవీం చింతయానా త్వహర్నిశమ్‌ || 111

కిమర్థం దేవదేవేన నానీతా జనకీ త్విహ | ఏకాకీ నైవ శోభేధా యోషితా చ తయా వినా || 112

సమీపే శోభ##తే సీతా త్వం చ తస్యాః పరంతప | ఏవం బ్రువన్త్యాం భరతః కేయమిత్యబ్రవీద్వచ ః || 113

తతశ్చేంగితవిద్రామో భరతం ప్రాహ సత్వరమ్‌ | విభీషణస్య భార్యా వై సరమా నామ నామతః || 114

ప్రియా సఖీ మహాభాగా సీతాయాః సుదృఢం మతా | సర్వం కాలకృతం పశ్య న జానే కిం కరిష్యతి || 115

గచ్ఛ త్వం సుభ##గే భర్తృగేహం పాలయ శోభ##నే | మా త్యక్త్వా హి గతా దేవీ భాగ్యహీనం గతిర్యథా || 116

తయా విరహితః సుభ్రు రతిం విందే న కర్హిచిత్‌ | శూన్యాఏవ దిశః సర్వాః పశ్యామీహ పునర్ర్భమన్‌ || 117

విసృజ్య తాం చ సరమాం సీతాయాస్తు ప్రియాం సఖీమ్‌ |

గతాయామథ కేకస్యాం రామః ప్రాహ విభీషణమ్‌ || 118

అటుపిమ్మట సరమ ఇట్లనెను :- 'ఇక్కడే అశోకవనములలో సీతను సంవత్సరమంతా సేవించాను. నీ ప్రియభార్య సుఖముగా నున్నదా? సీతాదేవి పాదాలను నిత్యమూ స్మరించుచుంటాను. ఎప్పుడూ దేవిని చూచెదనాయని రాత్రింబవళ్ళు తలుచుచుంటిని. దేవదేవుడగు నీవామెనెందలకిక్కడి తీసికొనిరాలేదు? నీ భార్యలేని నీవు ఒంటరిగా శోభించుటలేదు. నీవు, సీత కలిసి యున్నప్పుడే శోభింతురు' అని సరమ పలుకుచుండగా, ఈమె ఎవరని భరతుడడిగెను. అప్పుడతని భావమెఱిగిన రాముడు వెంటనే ఇట్లనెను:- 'ఈమె విభీషణుని భార్య, సరమ అని పేరు. సీతకు చాలా ఇష్టమైన సఖి. కాలముచే జరిగినదంతా చూడుము. ఏమి చేయునో తెలియదు' అని సరమతో ' నీవు నీ భర్త ఇంటికి వెళ్ళి పాలించుము. భాగ్య హీనుని గతి విడిచినట్లు సీత నన్నువిడిచి వెళ్ళి పోయినది. ఆమె లేక నేను ఆనందము నొందుటలేదు. దిక్కులన్నీ శూన్యముగా నున్నవి' అని సీతప్రియసఖియగు సరమను సాగనంపెను. కేకసి వెళ్ళిపోగా, రాముడు విభీషణునితో నిట్లనెను:- 118

దైవతేభ్యః ప్రియం కార్యం నాపదాధ్యాస్త్వయా సురాః | ఆజ్ఞయా రాజరాజస్య వర్తితవ్యం త్వయానఘ || 119

లంకాయాం మానుషో యో వై యసమాగచ్ఛేత్‌ కథంచన |

రాక్షసైర్న చ హంతవ్యో ద్రష్టవ్యోసౌ యథా త్వహమ్‌ || 120

విభీషణ ఉవాచ :- ఆజ్ఞయాహం నరవ్యాఘ్ర కరిష్యే నర్వమేవ తు |

విభీషణ హి వదతి వాయూ రామమువాచ హ || 121

ఇహాస్తి వైష్ణవీ మూర్తిః పూర్వం బద్ధో బలిర్యయాః తాం నయస్వ మహాభాగ కాన్యకుబ్జే ప్రతిష్ఠయ || 122

విదిత్వా తదభిప్రాయం వాయునా సముదాహృతమ్‌ | విభీషణ స్త్వలంకృత్య రత్నైః సర్వైశ్చ వామనమ్‌ || 123

ఆనీయ చార్ఫయద్రామే వాక్యం చేదమువాచ హ | యదా వై నిర్జితః శక్రో మేఘనాదేన రాఘవ || 124

తదా వై వామనస్త్వేష ఆనీతో జలజేక్షణ | నయస్వ తమిమం దేవ దేవ దేవం ప్రతిష్ఠయ || 125

తథేతి రాఘవః స్మృత్వా పుష్పకం చ సమారుహత్‌ | ధనం రత్నమసంఖ్యేయం వామనం చ సురోత్తమమ్‌ || 126

గృహ్య సుగ్రీవభరతావారూఢౌ వామనాదను | వ్రజన్నేవాంబరే రమస్తిష్ఠేత్యాహ విభీషణమ్‌ || 127

రాఘవస్య వచః శ్రుత్వా భూయోప్యాహ స రాఘవమ్‌ | కరిష్యే సర్వమేతద్ధి యదాజ్ఞప్తం విభో త్వయా || 128

సేతునానేన రాజేంద్ర పృథీవ్యాం సర్వ మానవాః | ఆగత్య ప్రతిబాధేరన్నాజ్ఞాభంగో భ##వేత్తవ || 129

కోత్ర మే నియమో దేవ కిన్ను కార్యం మయా విభో ||

'దేవతలకు ప్రియమగుదాని నాచరింపుము. వారిపట్ల అపరాధము చేయకుము. రాజరాజుని ఆజ్ఞ ననుసరించి ప్రవర్తించుము. ఎప్పుడైనా లంకకు మానవుడెవరైనా వచ్చినచో రాక్షసులు వానిని వధించరాదు. నావలెనే చూడవలెను.' అనగా విభీషణుడు 'రాజా! నీ ఆజ్ఞ ప్రకారమే ప్రవర్తించెదను' అనెను. అపుడు వాయువు రామునితో 'పూర్వము బలిని బంధించిన వైష్ణవ మూర్తి ఇక్కడనే యున్నది. దీనిని కాన్యకుబ్జమున ప్రతిష్ఠించుము.' అనగా రాముడతని భావము నెఱిగెను. విభీషణుడపుడు రత్నము లన్నిటితో వామనుని అలంకరించి తెచ్చి, రామునకర్పించి ఇట్లనెను. 'ఇంద్రజిత్తు ఇంద్రుని జయించినపుడు ఈ వామనుడిక్కడకు తేబడెను. దేవా! ఈ దేవదేవుని కొనిపోయి ప్రతిష్ఠించుము.' అనగా సరేనని రాముడు పుష్పకము నధిరోహించెను. అసంఖ్యాకమైన రత్నాలు, ధనముతో వామనుని తీసుకొని భరత సుగ్రీవులు రాముని వెంట విమానమెక్కిరి. ఆకాశములో వెళ్ళుచుండగానే రాముడు విభీషణుని 'ఇక వుండు' మనెను. అపుడు విభీషణుడు 'నీ ఆజ్ఞను పాలించెదను- ఈ సేతువు ద్వారా భూమిపైని మానవులందరూ అడ్డంకి నేర్పరిచెదరు. నీ ఆజ్ఞకు భంగముండును. నాకు నియమమేమిటో చెప్పుము- నేనేమి చేయవలెను? అనెను. 129 1/2

శ్రుత్వైతద్రాఘవో వాక్యం రాక్షసోత్తమభాషితమ్‌ || 130

కార్ముకం గృహ్య హస్తేన ఠామః సేతుం ద్విధాచ్ఛినత్‌ |

త్రిర్విభజ్య చ వేగేన మధ్యే వై దశయోజనమ్‌ || 131

ఛిత్వా తు యోజనం చైకమేకం ఖండత్రయం కృతమ్‌ | వేళావనం సమాసాద్య రామః పూజాం రమాపతేః | 132

కృత్వా రామేశ్వరం నమ్నా దేవదేవం జనార్ధనమ్‌ | అభిషిచ్యాథ సంగృహ్య వామనం రఘునందనః || 134

రుద్ర ఉవాచ :- భో భో రామస్తు భద్రం తే స్థితోహమిహ సాంప్రతమ్‌ |

యావజ్జగదిదం రామ యావదేషా ధరా స్థితా || 135

తావదేవ చ తే సేతు తీర్ధం స్థాస్యతి రాఘవ | శ్రుత్వైవం దేవదేవస్య గిరం తామమృతోపమామ్‌ || 136

రామ ఉవాచ :- నమస్తే దేవదేవేశ భక్తానామభయంకర |

గౌరీకాంత నమస్తుభ్యం దక్షయజ్ఞవినాశన || 137

నమో భవాయ రుద్రాయ శర్వాయ వరదాయ చ | పశూనాం పతయే నిత్యం చోగ్రాయ చ కపర్ధినే || 138

మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ దిశాంపతే | ఈశానాయ భగఘ్నాయ నమోస్త్వంధకఘాతినే || 139

నీలగ్రీవాయ ఘోరాయ వేధసే వేథసా స్తుత | కుమారశత్రునిఘ్నాయ కుమారజననాయ చ || 140

అంతట రాముడు విభీషణుని మాట విని ధనుస్సును చేతబూని సేతువుని రెండుగా చీల్చెను. ముందు మూడు భాగాలు చేసి మధ్య పది యోజనము లుండునట్లు, మరల యోజన మొక్కటిగా మూడు ముక్కలుగా చేసెను. అటు తరువాత వేళావనమునకు చేరి విష్ణుపూజను గావించి, రామేశ్వరుడను దేవదేవునికి అభిషేకము చేసి వామనుని గ్రహించి, సముద్రమునకు దక్షిణవైపు నుండి త్వరగా వెళ్ళిపోయెను. అపుడు ఆకాశము నుండి మేఘ గంభీర ధ్వనితో ఇట్లు వాక్కు వెలువడెను. రుద్రుడా వాక్కు ద్వారా ఇట్లనెను- ''రామా! నీకు శుభమగుగాక! నేనిక్కడనే వుంటిని. ఈ జగత్తు, భూమియుండునంత వరకు సేతు తీర్థము ఇక్కడే నిలుచును-' ఆ అమృతమయ వాక్కును విని రాముడు ఇట్లు స్తుతించెను- దేవదేవునకు, భక్తులకభయమిచ్చువానికి, గౌరీకాంతునకు, దక్షయజ్ఞ వినాశకునికి నమస్కారము. భవునకు, రుద్రునకు, శర్వునకు, వరదునకు, పశుపతికి, ఉగ్రునకు, కపర్దికి, మహాదేవునకు, భీమునకు, త్ర్యంబకునకు, దిక్పతికి, ఈశానునికి, భగఘ్ననికి, అంధకారికి, నీలగ్రీవునికి, ఘోరునికి, వేధకు, వేధచే స్తుతింపబడిన వానికి, కుమార శత్రుహంతకు, కుమార జనకునికి నమస్కారము. 140

విలోహితాయ దూమాలయ శివాయ క్రథనాయ చ | నమో నీలశిఖండాయ శూలినే దైత్యనాశినే || 141

ఉగ్రాయ చ త్రినేత్రాయ హిరణ్యవసురేతసే | అనింద్యాయాంబికాభ##ర్త్రే సర్వదేవస్తుతాయ చ || 142

అభిగమ్యాయ కమ్యాయ సద్యోజాతాయ వై నమః | వృషధ్వజాయ ముండాయ జటినే బ్రహ్మచారిణ || 143

తప్యమానాయ తప్యాయ బ్రహ్మణ్యాయ జయాయ చ | విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ఠతే || 144

నమో నమోస్తు దివ్యాయ ప్రపన్నార్తిహరాయ చ | భక్తానుకంపినే దేవ విశ్వతేజోమనోగతే || 145

పులస్త్వ ఉవాచ :- ఏవం సంస్తూయమానస్తు దేవదేవో హరో నృప |

ఉవాచ రాఘవం వాక్యం భక్తినమ్రం పురః స్థితమ్‌ || 146

రుద్ర ఉవాచ :- భో భో రాఘవ భద్రం తే బ్రూహి యత్తే మనోగతమ్‌ |

భవాన్నారాయణో నూనం గూఢో మానుషయోనిషు || 147

అవతీర్ణో దేవకార్యం కృతం తచ్చానఘ త్వయా | ఇదానీం స్వం వ్రజ స్థానం కృతకార్యోసి శత్రుహన్‌ || 148

త్వయా కృతం పరం తీర్థం సేత్వాఖ్యం రఘునందన | ఆగత్య మానవా రాజన్‌ పశ్యేయురిహ సాగరే || 149

మహాపాతకయుక్తా యే తేషాం పాపం విలీయతే | బ్రహ్మవధ్యాదిపాపాని యాని కష్టాని కానిచిత్‌ || 150

విలోహితునికి, దూమ్రునికి, శివునకు, క్రథునికి, నీలశిఖండునికి, శూలికి, దైత్యనాశుకునికి, ఉగ్రునికి, త్రినేత్రునికి, హిరణ్యవసురేతస్కునికి, అనింద్యునికి, అంబిక భర్తకు, సర్వదేవతలచే స్తుతింపబడిన వానికి, అభిగమ్యునకు, కామ్యునకు , సద్యోజాతునకు, వృషధ్వజునకు, ముండునకు, జటికి, బ్రహ్మచారికి, తప్యమానునికి, తప్యునికి, బ్రహ్మణ్యునికి, జయునకు, విశ్వాత్మకు విశ్వసృజునికి, విశ్వమావరించి వుండువానికి, దివ్యునికి, ప్రపన్నార్తిహరునికి, భక్తులయెడ దయగలవవానికి, విశ్వతేజ మనోగతునకు నమస్కారములు-' అని రాముడు స్తుతించెను. అపుడు భక్తి సమ్రుడైన రామునితో హరుడిట్లనెనని పులస్త్యుడు చెప్పెను. రాముని చూచి హరుడు, 'రామా ! నీకు శుభముగుగాక! నీ మనసునందున్న దానిని తెలియజేయుము. మానవ యోనియందు గూఢముగానున్న నారాయణుడివే నీవు. అవతరించిన నీవు దేవకార్యమును నెరవేర్చితివి. ఇపుడిక నీ దేశమునకు వెళ్ళుము. చేయవలసిన దానిని చేసితివి. సేతువు అను గొప్ప తీర్థమును నిర్మించితివి. మానవులిక్కడకు వచ్చి సముద్రమున దీనిని చూచెదరు. మహాపాతకములు గలవారి పాపము తొలగిపోవును. బ్రహ్మహత్య మొదలగు పాపములు, కష్టములు దీనిని చూచినంతనే నశించి పోవును. ఇందు ఆలోచించ పనిలేదు. 150

దర్శనాదేవ నశ్యంతి నాత్ర కార్యా విచారణా | గచ్ఛ త్వం వామనం స్థాప్య గంగాతీరే రఘూత్తమ || 151

పృథీవ్యాం సర్వశః కృత్వా భాగానష్టౌ పరంతప | శ్వేతద్వీపం స్వకం స్థానం వ్రజదేవ నమోస్తు తే || 152

ప్రణిపత్య తతో రామస్తీర్థం ప్రాపచ్చ పుష్మరమ్‌ | విమానం తు న యాత్యూర్థ్వం వేష్టితం తత్తు రాఘవః || 153

కిమిదం వేష్టితం యానం నిరాలంబేంబరే స్థితమ్‌ | భవితవ్యం కారణన పశ్యేత్యాహస్మ వానరమ్‌ || 154

సుగ్రీవో రామవచనాదవతీర్య ధరాతలే | స చ పశ్యతి బ్రహ్మాణం సురసిద్ద సమన్వితమ్‌ || 155

బ్రహ్మర్షి సంఘ సహితం చతుర్వేదసమన్వితమ్‌ | దృష్ట్వాగత్యాబ్రవీద్రామం సర్వలోకపితామహః || 156

సహితో లోకపాలైశ్చ వస్వాదిత్యమరుద్గణౖః | తం దేవం పుష్పకం నైవ లంఘుయేద్ధి పితామహమ్‌ || 157

అవతీర్య తతో రామః పుష్పకాద్ధేమభూషితాత్‌ | నత్వా విరించనం దేవం గాయత్ర్యా సహ సంస్థితమ్‌ || 158

అష్టా గప్రణిపాతేన పంచాంగలింగితావనిః తుష్టావ ప్రణతో భూత్వా దేవదేవం విరించినమ్‌ || 159

రామా! గంగానదీ తీరమున వామనుని ప్రతిష్టించి నీవు వెళ్లుము. భూమిపై ఎనిమిది భాగములుగా చేసి శ్వేత ద్వీపమును నీ దేశమును చేరుము.' అనగా అతనికి నమస్కరించి రాముడు పుష్కర తీర్థమును చేరెను. అక్కడ చేరిన విమానము పైకి వెళ్ళదాయెను. 'ఆలంబనము లేకుండా ఆకాశమున ఎందుకీ విమానము నిలిచినది. కారణమేమిటో చూడుము' అని సుగ్రీవునితో చెప్పగా అతను భూతలముపై దిగి సురసిద్ద గణములచే కూడుకున్న బ్రహ్మను చూచెను. బ్రహ్మ చుట్టూ బ్రహ్మర్షులు, చతుర్వేదములు వుండెను. అంత సుగ్రీవుడు రాముని వద్దకు వెళ్ళి 'ఇక్కడ దేవగణములతో బ్రహ్మ యున్నందువల్ల పుష్పకము దాటలేక పోవుచున్నది' అనగా రాముడు బంగారు పుష్పకము నుండి దిగి గాయత్రితో నున్న బ్రహ్మకు అష్టాంగ నమస్కారము చేసి, ఐదు అంగములు భూమిని తాకగా దేవదేవుడగు విరించిని స్తుతించెను.

రామ ఉవాచ :- నమామి లోకకర్తారం ప్రజాపతిం సురార్చితమ్‌ |

దేవనాథం లోకనాథం ప్రజానాథం జగత్పతిమ్‌ || 160

నమస్తే దేవదేవ సురాసురానమస్కృత | భూతభవ్యభవన్నాథ హరిపింగళలోచన || 161

బాలస్త్వం వృద్దరూపీ చ మృగచర్మాసనాంబరః | తారణశ్చాసి దేవస్త్వం త్రైలోక్యప్రభురీశ్వరః || 162

హిరన్యగర్భ పద్మగర్భ వేదగర్భ స్మృతిప్రద | మహాసిద్దో మహాపద్మీ మహాదండి చ మేఖలీ || 163

కాలశ్చ కాలరూపీ చ నీలగ్రీవో విదాం వరః | వేదక్తార్తా7ర్భకో నిత్యః పశూనాం పతిరవ్యయః || 164

దర్భపాణిర్హంసకేతుః కర్తా హర్తా హరో హరిః జటి ముండీ శిఖీ దండీ లగుడీ చ మహాయశాః || 165

భూతేశ్వరః సురాధ్యక్షః సర్వాత్మా సర్వభావనః | సర్వగః సర్వహారీ చ స్రష్టా చ గురురవ్యయః || 166

కమండలుధరో దేవః స్రుక్ర్సువాదిధరస్తథా | హవనీయో7ర్చనీయశ్చ ఓంకారో జ్యేష్ఠసామగః || 167

మృత్యుశ్చైవామృత్యుశ్చైవ పారియాత్రశ్చ సువ్రతః | బ్రహ్మచారీ వ్రతధరో గుహావాసీ సుపంకజః || 168

అమరో దర్శనీయశ్చ బాలసూర్యనిభస్తథా | దక్షిణ వామతశ్చైవ పత్నీ భ్యాముపసేవితః || 169

భిక్షుశ్చ భిక్షురూపశ్చ త్రిజటీ లబ్ధనిశ్చయః | చిత్తవృత్తికరః కామో మధుర్మధుకర స్తథా || 170

దేవార్చితుడైన ప్రజాపతికి, సృష్టికర్తకు నా నమస్కారము. దేవనాథుని, లోకనాథుని, ప్రజానాథుని, జగత్పతిని, సురాసుర నమస్కృతుడిని, ముందుండిన, ఇప్పుడున్న, ఇక ముందుండబోవు వానికి ప్రభువైన వానిని, హరిపింగళ లోచనుని నమస్కరించుచున్నాను. బాలుడవై కూడా నీవు వృద్ధ రూపమును ధరించియున్నావు. మృగచర్మాంబరము నాసనముగా గలవాడవు. దేవతల రక్షకుడవు. ముల్లోకములకు ప్రభువవు. హిరణ్యగర్భుడవు, పద్మగర్భుడవు, వేదగర్భుడవు, స్మృతి ప్రదాతవు, మహా సిద్ధుడవు, మహాపద్మము, దండము, మేఖలము గలవాడవు. కాలుడవు, కాలరూపివి. నీలగ్రీవుడవు, ఉత్తమ జ్ఞానివి, వేదకర్తవు, అర్భకుడవు, శాశ్వతుడవు, పశుపతివి, దర్భపాణివి, హంసకేతువు, కర్తవు, హర్తవు, హరుడవు, హరివి, జటలు, శిఖ, ముండ, దండము, లగుడము గల కీర్తిమంతుడవు. భూతేశ్వరుడివి సురాధ్యక్షుడివి. సర్వాత్మవు, సర్వభావనుడవు, సర్వ గమనుడివి. సర్వ హారివి, స్రష్టవు, గురువువు, అవ్యయుడివి, కమండలుధారివి, దేవుడివి స్రుక్‌స్రువము మున్నగు వానిని ధరించువాడవు. హవనము చేయదగిన వాడవు. పూజ్యుడవు, ఓంకారమువు, జ్యేష్ఠసామగుడవు. మృత్యువు, అమృత్యువూ నీవే - పారియాత్రడవు, సువ్రతుడవు, బ్రహ్మచారివి, వ్రతధరుడవు, గుహవాసివి, సుపంకజునివి, అమరుడివి, దర్శనీయుడివి, బాలసూర్యునివంటి వానివి, కుడి ఎడమల పత్నులచే సేవింపబడిన వానివి. భిక్షువు, భిక్షురూపివి, త్రిజటీ, లబ్ధ నిశ్చయుడవు, చిత్తవృత్తికరుడవు. కాముడవు, మధువు, మధుకరము నీవే | 170

వానప్రస్థో వనగత ఆశ్రమీ పూజితస్తథా | జగద్ధాతా చ కర్తా చ పురుషః శాశ్వతో ధ్రువః || 171

ధర్మాధ్యక్షో విరూపాక్షస్త్రిధర్మో భూతభావనః | త్రివేదో బహురూపశ్చ సూర్యాయుత సమప్రభః ||172

మోహకో వంధకశ్చైవ దానవానాం విశేషతః | దేవదేవశ్చ పద్మాంకస్త్రినేత్రో7 బ్జజటస్తథా ||173

హరిశ్మశ్రుర్ధనుర్ధారీ భీమో ధర్మపరాక్రమః | ఏవం స్తుతస్తు రామేణ బ్రహ్మా బ్రహ్మవిదాం వరః || 174

ఉవాచ ప్రణతం రామం కరే గృహ్య పితామహః | విష్ణుస్త్వం మానుషే దేహే7వతీర్ణో వసుధాతలే || 175

కృతం తద్భవతా సర్వం దేవకార్యం మహావిభో | సంస్థాప్య వామనం దేవం జాహ్నవ్యా దక్షిణతటే || 176

అయోధ్యాం స్వపురీం గత్వా సురలోకం వ్రజస్వ చ | విసృష్టో బ్రహ్మణా రామః ప్రణిపత్య పితామహమ్‌ || 177

అరూఢః పుష్పకం యానం సంప్రాప్తో మధురాం పురీం |

సమీక్ష్య పుత్రసహితం శత్రుఘ్నం శత్రుఘాతినమ్‌ || 178

తుతోష రాఘవః శ్రీమాన్‌ భరతః స హరీశ్వరః | శత్రుఘ్నో భ్రాతరౌ ప్రాప్తౌ శక్రోపేంద్రావివాగతౌ || 179

ప్రణిపత్య తతో మూర్ధ్నా పంచాంగాలింగితావనిః | ఉత్థాప్య చాంకమారోప్య రామో భ్రాతరమంజసా || 180

వానప్రస్థుడివి, వనగతునివి. ఆశ్రమివి, పూజితుడివి, జగత్తును ధరించువాడవు, సృజించువాడవు. పురాణపురుషుడివి, ధర్మాధ్యక్షుడివి, విరూపాక్షునివి, మూడు ధర్మములు నీవే . భూతస్రష్టవు నీవే - మూడు వేదములు నీవే , బహురూపివి. కోటి సూర్యుల కాంతి గలవాడవు. మోహకుడవు, వంధకుడవు. విశేషంగా (దానవులకు) దేవదేవుడివి. పద్మ చిహ్నము గలవాడివి, ముక్కంటివి, పద్మజటల వానివి. హరిశ్మశ్రువులు గలవాడవు, ధనుర్ధారివి, భీముడవు. ధర్మపరాక్రముడివి' అని ఈ విధంగా రాముడు స్తుతించిగా , నమస్కరించుచున్న రాముని చేతిని పట్టుకొని బ్రహ్మ, 'నీవుమానవ దేహములో భూమిపై అవతరించిన విష్ణువువే. దేవకార్యమునంతా ఆచరించితివి గంగానది యొక్క కుడివైపున తీరముపై వామనుని నిలిపి అయోధ్యకు వెళ్ళుము' - అని వీడ్కోలు పలుకగా రాముడు బ్రహ్మకు నమస్కరించి పుష్పకమునెక్కి మధురాపురిని చేరెను. - అక్కడ శత్రువుల దునుమాడు శత్రఘ్నని చూచి, రాముడు, భరతుడు, సుగ్రీవుడు సంతోషించిరి. సోదరులు, ఇంద్రోపేంద్రులవలె వచ్చుట చూచి శత్రుఘ్నుడు శిరసువంచి నమస్కరించి, ఐదు అంగములు నేలకు తగులునట్లు ప్రణామము చేసెను. రాముడు సోదరుని పైకి లేపి, ఒడిలోకి తీసుకొనెను. 180

భరతశ్చ తతః పశ్చాత్సు గ్రీవస్తదనంతరమ్‌ | ఉపవిష్టో7థ రామాయ సో7ర్ఘమాదాయ సత్వరమ్‌ || 181

రాజ్యం నివేదయామాస చాష్టాంగం రాఘవే తదా |

శ్రుత్వా ప్రాప్తం తతో రామం సర్వో వై మాధరో జనః || 182

వర్ణా బ్రాహ్మణభూయిష్టా ద్రష్టుమేవం సమాగతాః |

సంభాష్య ప్రకృతీః సర్వా నైగమాన్‌ బ్రాహ్మణౖస్సహ || 183

దినాని పంచోషిత్వా7త్ర రామో గంతుం మనో దధే | శత్రుఘ్నశ్చ తతో రామే వాజినో7థ గజాంస్తథా || 184

కృతాకృతం చ కనకం తత్రోపాయనమాహరత్‌ | రామస్త్వాహ తతః ప్రీతః సర్వమేతన్మయా తవ || 185

దత్తం పుత్రౌ తే7భిషించ రాజానౌ మాథురే జనే | ఏవముక్త్వా తతో రామః ప్రాప్తే మధ్యం దినే రవౌ || 186

మహోదయం సమాసాద్య గంగాతీరే సవామనమ్‌ | ప్రతిష్ఠాప్య ద్విజానాహ భావినః పార్దివాం స్తథా || 187

మయా కృత్యో7యం ధర్మస్య సేతుర్భూతివివర్ధనః | ప్రాప్తే కాలే పాలనీయో న చ లోప్యః కథంచన || 188

ప్రసారితకరేణౖవం ప్రార్థనైషా మయా కృతా | నృపాః కృతే మయార్థిత్వే యత్‌క్షేమం క్రియతామిహ || 189

నిత్యం దైనందినీ పూజా కార్య సర్వైరతంద్రితైః |

గ్రామాన్‌ దత్త్వా దనం తచ్చ లంకాయా అహృతం చ యత్‌ || 190

ప్రేషయిత్వా చ కిష్కింథాం సుగ్రీవం వానరేశ్వరమ్‌ |

అయోధ్యామాగతో రామః పుష్పకం తమథాబ్రవీత్‌ || 191

నాగంతవ్యం త్వయా భూయస్తిష్ఠ యత్ర ధనేశ్వరః | కృతకృత్యస్తతో రామః కర్తవ్యం నాప్యమన్యత || 192

అటు పిమ్మట, భరతుడు సుగ్రీవుడూ అట్లే చేసిరి. కూర్చున్న శత్రుఘ్నుడు రామునికై ఆర్ఘ్యమును త్వరగా తెచ్చెను. అష్టాంగములతో రాజ్యమును రామునికి నివేదించెను. రాముడు వచ్చెనని తెలిసి మధుర ప్రజలు, బ్రాహ్మణ భూయిష్ఠముగా (ప్రజలు) చూడవచ్చిరి. వారందరితో మాట్లాడి రాముడు ఐదు దినములక్కడ గడిపి వెళ్ళదలిచెను. శత్రుఘ్నుడు రామునికై గుర్రములను, ఏనుగులను, మంచి బంగారమును బహుమానముగ తెచ్చెను. అపుడు రాముడు సంతోషించి 'దీనినంతా నేనే నీకిచ్చుచుంటిని. మధుర పాలకులుగా నీ పుత్రుల నిద్దరను అభిషేకించుము' అని, మధ్యందిన సూర్యుడిని చూచి గంగాతీరమును చేరి వామనుని ప్రతిష్ఠించి బ్రాహ్మణులను, భాషా పాలకులనుద్దేశించి ఇట్లనెను. 'ఇది నేను నెలకొల్పిన ధర్మసేతువు. ఐశ్వర్యమును పెంపొందించునది. మీ కాలమున మీరు పాలించదగినది. లోపము చేయరాదు. చేతులు జాచి నే జేయు ప్రార్థనను ఆలించి, పాలకులారా, క్షేమమేదో దానిని చేయుడు. ఆలసించక నిత్యపూజ చేయుడు-' అని అతనికి గ్రామములను , లంకనుండి తెచ్చిన ధనమును ఇచ్చి, సుగ్రీవుని కిష్కింధకు పంపి పుష్పకముపై అయోధ్యకు వచ్చి ఆ విమానముతో కుబేరుడున్న చోటనే వుండుము. మరల రానవసరం లేదు. అనెను. కృతకృత్యుడగు రాముడు అట్లు కర్తవ్యమును పాలించెను. 192

పులస్త్య ఉవాచ :- ఏవం తే భీష్మ రామస్య కథా యోగేన పార్థివ |

ఉత్పత్తిర్వామనస్యోక్తా కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 193

కథయామి తు తత్సర్వం యత్ర కౌతూహలం నృప | సర్వం తే కీర్తయిష్యామి యేనార్థీ నృపనందన || 194

ఇతి శ్రీ పాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే

వామనప్రతిష్ఠా నామ అష్టత్రింశో7ధ్యాయః.

అని చెప్పి పులస్త్యుడిట్లనెను. 'భీష్మా ! నీకు ఇట్లు నేను రాముని కథను, వామన ప్రాదుర్భావమును చెప్పితిని. ఇంకనూ, ఏమి వినగోరితివి. నీకు కౌతుకమున్నదానినెల్లా చెప్పదను. కోరినదానినెల్ల తెలియజేసెదను' అనెను. 194

ఇది శ్రీ పద్మపురాణమున మొదటి సృష్ఠిఖండమున

వామన ప్రతిష్ఠయను ముప్పదియెనిమిదవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters