Sri Padma Mahapuranam-I    Chapters   

ఏకత్రింశోధ్యాయః

శివదూతీ చరితమ్‌

భీష్మ ఉవాచ: భగవన్మహదాశ్చర్యం వాష్కలేవ్వర్ధృనం హి యత్‌ ||

కృతం త్రివిక్రమం రూపం యదా సంయమితో బలిః || 1

ఏతన్మయా శృతం పూర్వం కథ్యమానం ద్విజోత్తమైః | పాతాలే వసతేద్యాపి వైరోచనసుతో బలిః || 2

నాగతీర్థం యథాభూతం పిశాచానాం తు సంభవం |శివదూతీ కథం చాత్ర కేనేయం మంగలీకృతా || 3

అంతరిక్షే పుష్కరం తు కేన నీతం మహామునే | ఏతదాచక్ష్వ మే సర్వం యథా బాష్కలిబంధనమ్‌ || 4

భూమిప్రక్రమణం పూర్వం కృతం దేవేన విష్ణునా | ద్వితీయం కారణం కిం చ యేన దేవశ్చకార హ || 5

తత్త్వతస్త్వం హి తత్సర్వం యథాభూతం తథా వద | పాపక్షయకరం హ్యేతచ్ర్ఛోతవ్యం భూతిమిచ్ఛతా || 6

భీష్ముడనియె 'భగవంతుడా ! బాష్కలిని గురించిన చరిత్ర మహాశ్చర్యము. బ్రాహ్మణోత్తములు సెప్పగా మున్నువింటిని. వైరోచనుని కూమారుడు బలి యిప్పుడును పాతాళమందున్నాడు. పిశాచులునాగతీర్థమెట్లేర్పడెను? శివదూతి యిచట యేలా మంగళవతి సేయబడెను? పుష్కరతీర్థ మంతరిక్షమున కెవ్వడు గొనిపోయెను? బాష్కలి బంధితుండగుట, విష్ణువు భూమి నాక్రమించుటకు రెండవ కారణమది యెట్లేర్పడెను? జరిగినది జరిగినట్లు సరహస్యంబుగ నీ కథ సెప్పు. ఐశ్వర్యము కోరువారు పాపహరమైన కథ యిది వినవలసినదిగదా ' యన సులస్త్యుడనియె.

ముప్పది యొకటవ అధ్యాయము

శివదూతీ చరితము:

పులస్త్య ఉవాచ : ప్రశ్నభారస్త్వయా రాజన్‌ కౌతుకాదేవ కీర్తితః ||

కథయామి హి తత్‌ సర్వం యథాభూతం నృపోత్తమ | 7

విష్ణోః పదానుషంగేన బంధనం వాష్కలేరిహ | శ్రుతం తద్భవతా సర్వం మయా తే పరికీర్తితమ్‌ || 8

భూయోపి విష్ణునా భీష్మ ప్రాప్తే వైవస్వతేంతరే | త్రైలోక్యం బలినా క్రాంతం విష్ణునా ప్రభవిష్ణునా || 9

గత్వా త్వేకాకినా యజ్ఞే తథా సంయమితో బలిః | భూయోపి దేవదేవేన భూమేః ప్రక్రమణం కృతమ్‌ || 10

ప్రాదుర్భావో వామనస్య తథా భూతో నరాధిప | పునస్త్రివిక్రమో భూత్వా వామనోభూదవామనః || 11

ఉత్పత్తిరేషా తే సర్వా కథితా కురునందన | నాగానాం తు యథాతీర్దం తచ్ర్ఛుణుష్వ మహావ్రత || 12

రాజా! ప్రశ్న భారమిది కుతూహలపడి యడుగుచున్నావు. జరిగిన కథ యిదె సెప్పెద. విష్ణువడుగుల కొలతలో బాష్కలి బంధింపబడెను. నేనది సెప్పగా నీవు విన్నావు. తిఱిగి వైవస్వత మన్వంతరము రాగా త్రైలోక్యము బలిచే నాక్రమింపబడెను. విష్ణువేకాకియై వెళ్ళి యజ్ఞమందు బలి బంధింపబడెను. తిఱిగి యా దేవదేవుడు భూమియందడుగులిడి యాక్రమించెను. వామనుని యవతారమప్పుడే జరిగినది. తిరిగి పొట్టివాడు పొడగరియై మూడడుగులు మెట్టెను. కురుకుమారా! ఈ వామన ప్రాదుర్భావము పూర్తిగ నీకు జెప్పితిని. అపుడు నాగులకు తీర్థమేర్పడినది. వ్రతినిష్ఠుడవదికూడ వినుము. 12

ఆనంతో వాసుకిశ్చైవ తక్షకశ్చ మహాబలః | కర్కోటకశ్చ నాగేంద్రః పద్మశ్చాన్యః సరీసృపః || 13

మహాపద్మస్తథా శంఖః కులికశ్చాపరాజితః | ఏతే కశ్యపదాయదా ఏతైరాపూరితం జగత్‌ || 14

ఏతేషాం తు ప్రసూత్యా తు ఇదమాపూరితం జగత్‌ | కుటిలా భీమకర్మాణ స్తీక్షాస్యాశ్చ విషోల్బణాః || 15

దష్ట్వా మందాంశ్చ మనుజాన్‌ కుర్యుర్భస్మ క్షణాత్తు తే | తద్దర్శనాద్భవేన్నాశో మనుష్యాణాం నరాధిప || 16

అహన్యహిని జాయేత క్షయః పరమదారుణః | ఆత్మనస్తు క్షయం దృష్ట్వా ప్రజాస్సర్వాస్సమంతతః || 17

జగ్ముః శరణ్యం శరణం బ్రహ్మాణం పరమేశ్వరాం | ఇమమేవాధర్శముద్దిశ్య ప్రజాః సర్వా మహీపతేః || 18

ఊచుః కమలజం దృష్ట్వా పురాణం బ్రహ్మసంజ్ఞకం |

ప్రజా ఊచు : దేవదేవేశ లోకానాం ప్రసూతే పరమేశ్వర || 19

నాగతీర్థోత్పత్తి:

కశ్యపుని జ్ఞాతులు అనంతుడు మొదలుగ కులికుని దాక గల నాగులు. వీరి పుట్టుకని జగమెల్ల నిండుకొన్నది. వీండ్రు కుటిలులు, భయంకర చర్య చేయువారు. తీక్ష్‌ణులు, విషపూరితులు. మందమతులనేని మానవులను గఱచి క్షణములో బూజి సేయుదురు. రాజా! వారిని చూచిన మాత్రాన మానవులకు నాశనమగును. రోజు రోజు వరమ దారుణము. మానవ నాశన మేర్పడును. ప్రజలెల్లరు తమ గండమిది చూచే పరమేశ్వరుని బ్రహ్మను శరణొంది యిట్లనిరి. 19

త్రాహి నస్తీక్షణదంష్ట్రాణాం భుజగానాం మమాత్మనాం | దినే దినే భయం దేవ పశ్యామః కృపణా భృశమ్‌ || 20

మనుష్యపశుపక్ష్యాది తత్సర్వం భస్మసాద్భవేత్‌ | త్వయా సృష్టిః కృతా దేవ క్షీయతే తు భుజంగమైః || 21

ఏతజ్ఞత్వా యదుచితం తత్కురుష్వ పితామహ |

బ్రహ్మోవాచ: - అహం రక్షాం విధాస్యామి భవతీనాం న సంశయః || 22

సృష్టికారణ! దేవేశ ! పరమేశ్వర ! మహానుభావులు నాగేంద్రుల కోరల వలన దినదినగండము. మమ్మందునుండి రక్షింపుము. ఎంతో దీనులమయినాము. మనుజులు పశు పక్ష్యాదులెల్ల బూడిదగుచున్నది. నీచే చేయబడిన సృష్టి పాములచే నశించుచున్నది. ఇది తెలిసికొని పితామహ! చేయదగునది చేయుము. అని వ్రజ గోలవెట్ట బ్రహ్మ యిట్లనియె. 22

వ్రజధ్వం స్వనికేతాని నీరుజో గతసాధ్వసాః | ఏవముక్తా ప్రజాః సర్వా బ్రహ్మణా వ్యక్తమూర్తినా || 23

ఆజగ్ముః పరమప్రీతాః స్తుత్వా చైవ స్వయంభవమ్‌ | ప్రయతాసు ప్రజాస్వేవం తానాహుయ భుజంగమాన్‌ || 24

శశాప పరమక్రుద్దో వాసుకి ప్రముఖాంస్తదా |

బ్రహ్మోవాచ :- అహన్యహని భూతాని భక్ష్యంతే వై దుర్మాభిః || 25

నశ్యంతి తురగైర్దష్టా మనుష్యాః పశవస్తథా | యస్మాన్మత్ర్పభవాన్నిత్యం క్షయం నయథ మానుషాన్‌ || 26

అతోన్యస్మిన్‌ భ##వే భూయాన్మమ కోపాత్సుదారుణాత్‌ | భవతాం హి క్షయో ఘోరో భావి వైవస్వతేంతరే || 27

మీ యిండ్లకు మీరు దిగులు జడుపు విడిచి వెళ్ళుడన నందటు పరమ ప్రీతులై బ్రహ్మను పొగడి మరలిపోగా, బ్రహ్మ యా నాగులం బిలిచి, దురాత్మలచే దినదినము భూతములు నాశనమగుచున్నవి. పాముకాటుపడి మనుషులు సరి గుఱ్రములు పశువులు నశించుచున్నవి. నా వలన బుట్టిన జీవులను నాశనము చేయుచున్నారు. గావున నింకొక పుట్టువునవైవసత్వమన్వంతరమున మీకు మహాదారుణమగు నా కోపముచే సర్వ నాశనము తప్పదు. 27

తథాన్యః సోమవంశ్యో రాజా వై జనమేజయః ధక్ష్యతే సర్పసత్రేణ ప్రదీప్తే హవ్యవాహనే || 28

మాతృష్వసుశ్చ తనయాంస్తార్ష్యో వో భక్షయిష్యతి | ఏవం వో భవితా నాశః సర్వేషాం దుష్టచేతసామ్‌ || 29

శప్త్వా కులసహస్రం తు యావదేకం కులం స్థితం | ఏవముక్తే తు వేపంతో బ్రాహ్మణా భుజగోతమాః || 30

నిపత్య పాదయోస్తస్య ఇదమూచుర్వచస్తదా | భగవన్కుటిలా జాతిరస్మాకం భూతభావన || 31

విషోల్బణత్వం క్రూరత్వం దందశూకత్వమేవ చ | సంపాదితం త్వయా దేవ ఇదానీం శపసే కథమ్‌ || 32

బ్రహ్మోవాచ : యది నామ మయా స్పష్టా భవంతః కుటిలాశయాః ||

తతః కిం బహునా భక్ష్యధ్వం గతవ్యథా | 33

నాగా ఊచు : మర్యాదాం కురు దేవేశ స్థానం చైవ పృథక్‌పృథక్‌ ||

మనుష్యాణాం తథాస్మాకం సమయం దేవ కారయ | 34

శాపో యో భవతా దత్తో మనుష్యా జనమేజయః | నాశం నః సర్పసత్రేణ ఉల్బణం చ కరిష్యతి || 35

చంద్రవంశీయుడగు రాజు జనమేయుడు సర్పయాగమున నగ్నిజ్వాల మిమ్ము గాల్చివేయును. ఈలా పాడు బుద్దులగు మీ కందరకు నాశము కాగలదు, సర్పకులమెంత గల దంతయు నిట్లు శపింప వణకిపోయి బ్రాహ్మణజాతి నాగులు పాదములపైబడి భగవంతుడా! మాది కుటిలజాతి. ఈ క్రూరత్వము, ఉల్బణత్వము దందశూకత్వము నీవు సంపాదించి పెట్టినవి. ఇప్పుడు శపింతువెట్లు? అన బ్రహ్మ యిట్లనియె. వంకర బుద్దులు మీరు నాచే సృష్టింపబడిన వాండ్రే యగుదురుగాక అయిననేమి వ్యధపడక తెగదిందురా? ఆన నాగులు, దేవేశా! ఒక హద్దేర్పరుపుము.మాకొక చోటు వేరువేర నేర్పరుపుముమి. మనుష్యులకు మాకు మద్య ఒక సమయము నియమము సేయుము. నీ విచ్చిన శాపమునుబట్టి జనమేయుడు సర్పయాగమున మాకు నాశనము గూర్చును. అన బ్రహ్మయనియె.

బ్రహ్మోవాచ:- జరత్కారురితి ఖ్యాతో భవితా బ్రహ్మవిత్తమః ||

జరత్కన్యా తస్య దేయా తస్యాముత్పత్స్యతే సుతః | 36

రక్షాం కర్తా స వో విప్రో భవతాం కులపావనః తథా కరోమి నాగానాం సమయం మనుజైః సహ|| 37

తదేకమనసః సర్వే శ్రుణుధ్వం మమ శాసనం | సుతలం వితలం చైవ తృతీయం చ తలాతలమ్‌ || 38

దత్తం చక్రపకారం వో గృహం తత్ర గమిష్యథ | తత్ర భోగాన్బహువిధాన్భుంజానా మమ శాసనాత్‌ || 39

తిష్ఠధ్వం సప్తమం యావత్కాలం తం తు పునః పునః | తతో వైవస్వతస్యాదౌ కాశ్యపేయో భవిష్యతి || 40

దాయాదః సర్వదేవానాం సుపర్ణస్సర్వభక్షకః | తదా ప్రసూతిః సర్పాణాం దగ్దా వై చిత్రభానునా|| 41

భవతాం చైవ సర్వేషాం భవిష్యతి న సంశయః |

యే యే క్రూరా భోగినో దుర్వినీతాస్తేషామంతో భావితా నాన్యథైతత్‌ || 42

జరత్కారుడను నొక బ్రహ్మవేత్త కలుగగలడు. వానికి జరత్కన్య నీయవలెను. వారికొక్క కొడుకు గలుగును. మీ వంశమును బవిత్రము సేయువాడతడు మీకు రక్ష యిచ్చును. ఆ విధముగా మీకు మానవునితో నొక సమయమేర్పడును. అందువలన ఏక మనస్కులై నా శాసన మాలింపుడు. సుతలము, వితలము, తలాతలమునను పాతాళములు మూడు లోకములను చక్ర ప్రకారముగ గృహము మీకిచ్చుచున్నాను. ఆటకు మీరేగుడు. అటు బహువిధ భోగములనుభవించుచు ఏడు తరాలు తిరిగి తిరిగి వచ్చి సుఖముండుడు. ఆపై వైవస్వత మన్వంతరము మొదట కశ్యప వంశీయుడు పుట్టును. దేవతలందరి జ్ఞాతివాడు సువర్ణుడు సర్వ భక్షకుడు. అప్పుడో సర్వజాతి చిత్రబాణునిచే దహింపబడును. మీ యందరికి నాశము గల్గును. క్రూరులు, పొగరుబోతులగు నాగులందరు నశింతురు. ఇది ఇంకోలాకాదు. 42

కాలవ్యాప్తం భక్ష్యధ్వం చ సత్వం తథాపకారే చ కృతే మనుష్యం |

మంత్రౌషధైర్గారుడైశ్చైవ తంత్రైర్బంధైర్జుష్టా మానవా యే భవంతి || 43

తేభ్యో భీతైర్వర్తితవ్యం న చాన్యచ్చిత్తే కార్యం చాన్యథా వో వినాశః |

ఇతీరితే బ్రహ్మణా వై భుజంగా జగ్ముః స్థానం సుతలాఖ్యం హి సర్వే || 44

తస్థుర్భోగాన్భుంజమానాశ్చ సర్వే రసాతలే లీలయా సంస్థితాస్తే |

ఏవం శాపం తు తే లబ్ద్వా ప్రసాదం చ చతుర్ముఖాత్‌ || 45

తస్థుః పాతాలనిలయే ముదితేనాంతరాత్మనా | తతః కాలాంతరే భూతే పునరేవం వ్యచింతయన్‌ || 46

కాలము వచ్చిన జంతువును, అపకారము సేయు మనుష్యుని మీరు తినుడు. గారడీ మంత్రములు, నోషధులచే, తంత్రములచే బంధనములచేమిమ్మెదిరించు మనుజుల యెడ జడిసి దూరముగా నుండుడు. మఱి యింకేమి మనసునందుంచుకొనకుడు. అలా కానిచో మీకు వినాశము తప్పదు. అని యిట్లు బ్రహ్మ పలుక నాగులందరు సుతలమను స్థానమునకు వెళ్ళిపోయిరి. రసాతల మందంతట వినోదించుచుండిరి. ఈ శాపము వలన ననుగ్రహము పొంది సంతోషముతో పాతాళమందుండిరి. కొంత కాలమైన తరువాత తిఱిగి ఆ నాగు లిట్టాలోచించిరి.

భవితా భరతో రాజా పాండవేయో మమాయశాః | అస్మాకం తు క్షయకరో దైవయోగేన కీనచిత్‌ || 47

కథం త్రిభువనే నాథః సర్వేషాం చ పితామహః | సృష్టికర్తా జగద్వంద్యః శాపమస్మాసు దత్తవాన్‌ || 48

దేవం విరంచినం త్యక్త్వా గతిరన్యా న విద్యతే | వైరాజే భవనశ్రేష్ఠే తత్ర దేవః సతిష్టితి || 49

స దేవః పుష్కరస్థో వై యజ్ఞం యజతి సాంప్రతం | గత్వా ప్రసాదయామసుస్తం వరం తుష్టః ప్రదాస్యతి || 50

పేరు ప్రతిష్టలు గలవాడు, భరతుడు, పాండవుల వంశము వాడు రాజగును. ఏదో దైవయోగమున మమ్ము నశింపజేయును. త్రిలోకనాథుడు, అందఱకు పితామహుడు, సృష్టికర్త. జగత్తుల మ్రొక్కబడువాడు మాకెందులకు శాపమిచ్చెను? ఆయన గాప మఱి మా కింకొక దిక్కులేదు. ఆయన వైరాజ భవనమందట నుండును. ఇపుడాయన పుష్కరక్షేత్రమందు యజ్ఞయ సేయుచున్నాడు. ఆట జని ఆయనను ప్రసన్నం జేసికొందము. సంతుష్టుడై వరమీయగలడు. 50

ఏవం విచింత్య తే సర్వే నాగా గత్వా చ పుష్కరం | యజ్ఞపర్వతమాసాద్య శైలభిత్తిముపాశ్రితాః || 51

దృష్ట్వా నాగాంస్తథా శ్రాంతాన్వారిధారాశ్చ శీతలాః | ఉదజ్ముఖా వై నిష్ర్కాంతాస్సర్వేషాం తు సుఖప్రదాః || 52

నాగతీర్దం తతో జాతం పృథివ్యాం భరతర్షభ | నాగకుండం చ వై కేచిత్సరితం చాపరేబ్రువన్‌ || 53

పుణ్యం తత్సర్వతీర్థానాం సర్వాణాం విషనాశనం | మజ్ఞన్తి తత్ర యే మర్త్యా అధిశ్రావణపంచమి || 54

న తేషాం తు కులే సర్పాః పీడాం కుర్వంతి కర్హిచిత్‌ | శ్రద్దాం పితౄణాం యే తత్ర కరిష్యంతి నరా భువి|| 55

బ్రహ్మా తేషాం పరం స్థానం దాస్యతే నాత్ర సంశయః | నాగానాం తు భయం జ్ఞాత్వా బ్రహ్మా లోకపితామహః || 56

పూర్వోక్తం తు పునర్వాక్యం నాగానశ్రావయత్తదా | పంచమీ సా తిథిర్ధన్యా సర్వపాపహరా శుభా || 57

యతోస్యామేవ సుతధౌ నాగానాం కార్యముద్ధృతం | ఏతస్యాం సర్వతోయస్తు కట్వవ్లుం పరివర్జయేత్‌ || 58

క్షీరేణ స్నాపయేన్నాగాంస్తస్య తే యాంతి మిత్రతాం |

భీష్మ ఉవాచ: - శివదూతీ యథా జాతా యేన చైవ నివేశితా || 59

తన్మే సర్వం యథాతత్వం భవాన్శంసితుమర్హతి |

పులస్త్య ఉవాచ : శివా నీలగిరిం ప్రాప్తా తపసే ధృతమానసా|| 60

అనుకొని నాగులందరు యజ్ఞ పర్వతమునకేగి కొండగోడ దగ్గర నిల్చిరి. ఆ నాగు లలసిన వారిం జూచి చల్లని జలధార లందఱికి హాయి గూర్చుచునుత్తర ముఖముగా గురిసినవి. అందువలన భూముల యందట నాగతీర్థ మేర్పడెను. దానిని నాగకుండమని, నాగనదియని కొందరనిరి. అన్ని తీర్థములలో పుణ్యమైనది. సర్ప విషనాశనము. శ్రావణ పంచమి నాడట మునుగుదురు. (స్నానము చేయుదురు) వారి కులమందు పాములెన్నడు కరువవు. అచట పితరులకు శ్రాద్దము పెట్టువారికి బ్రహ్మ పరమోత్తమ స్థానమిచ్చును. నాగులు భయపడుట తెలిసి బ్రహ్మ యంత మున్నన్న మాట తిఱిగి వారికి వినిపించెను. పంచమి తిథి పరము ధన్యము. సర్వ పాప హరము. శుభము. ఈనాడే (నాగపంచమియందే) నాగపూజ సేయవలెను. ఈనాడు ఉప్పు, కారము తినక పాలతో పాములను స్నానము సేయించినతనికా నాగములు మిత్రములగును. అన భీష్ముడనియె. శివదూతి యెట్లు పుట్టెను? ఎవరామెను బ్రవేశ##పెట్టిరి? అది నా కానతిమ్ము అన పులస్త్యుడనియె. 60

రౌద్రీ జటోద్భవా శక్తిస్తస్యాః శృణు నృప వ్రతం | తపః కృత్వా చిరం కాలం గ్రసిష్యామ్యఖిలం జగత్‌ || 61

ఏవముద్దిశ్య పంచాగ్నిం సాధయామాస భామినీ | తస్యాః కాలాంతరే దేవ్యాస్తపంత్యాస్తప ఉత్తమమ్‌ || 62

రురుర్నామ మహాతేజా బ్రహ్మదత్తవరోసురః | సముద్రమధ్యే రత్నాఖ్యం పురమస్తి మహాధనమ్‌ || 63

తత్రాతిష్ఠత్స దైత్యేంద్రః సర్వదేవ భయంకరః | అనేకశతసాహస్రకోటికోటిశతోత్తమైః || 64

అసురైరర్చితః శ్రీమాన్‌ ద్వితయో నముచిర్యథా | కాలేన మహతా సోథ లోకపాలపురం య¸° || 65

శివదూతీ చరిత్రము:

శివయను నామె తపస్సు చేయతలంచి నీలగిరి కేతెంచెను. ఆమె రుద్రుని జటయందు బుట్టిన యొకశక్తి. రాజా! ఆమె చిరకాలము తపస్సు చేసి యెల్ల జగత్తు మ్రింగివేసెదనని వ్రతము వూనెను. ఇట్లుద్దేశించి, పంచాగ్ని మధ్యమందు సాధన చేసెను. ఆమె ఈలా యుత్తమ తపస్సు చేయుచుండగా రురువనునొక్క దైత్యేంద్రుడు బ్రహ్మ వలన వరమందెను. మహా తేజస్వియై సముద్ర మందు ధన సమృద్ధమైన రత్న పీఠమందు సర్వదేవ భయంకరుడై వసించుచుండెను. శ్రీమంతుడై రెండవ సముచి యన్నట్లు కోటానుకోట్ల సురలచే నర్చింపబడుచు చిరకాలమున కతడు లోకపాలుర పురమేగెను. 65

జిగీషుః సైన్యసంవీతో దేవైర్వైరమరోచయత్‌ |

ఉత్తిష్ఠతస్తస్య మహాసురస్య సముద్రతోయం వవృధేతివేగాత్‌ || 66

అనేకనాగ గ్రహమీనజుష్టమాప్లావయత్పర్వతస్సానుదేశాన్‌ |

అంతఃస్థితానేకసురారిసంఘం విచిత్రవర్మాయుధచిత్రశోభమ్‌ || 67

భీమం బలం చలితం చారుయోధం వినిర్యయా సింధుజలాద్విశాలం |

తత్ర ద్విపా దైత్యభటాభ్యు పేతాః సమానఘంటాశ్చ సమృద్దియెక్తాః || 68

వినిర్యయుః స్వాకృతిభిర్ఘషాణాం సమత్వముచ్చైః ఖలు దర్శయంతః |

అశ్వాస్తథా కాంచనసూత్రనద్దా రోహీతమత్స్యా ఇవ తే జలాంతే || 69

వ్యవస్థితాసై#్తః సమమేవ తూర్ణం వినిర్యయుర్లక్షశః కోటిశశ్చ | తథా రవిస్యందనతుల్యవేగాః సచక్రదండాక్షతవేణుయుక్తాః || 70

రథాశ్చ యంత్రోపరిపీడితాంగాశ్చలత్పతాకాః స్వనితం విచక్రుః |

తథైవ యోధాః స్థగితా స్తరీభిస్తితీర్షవస్తే ప్రవరాస్త్రపాణయః || 71

రణ రణ లబ్దజయాః ప్రహారిణో విరౌజురుచ్చైరసురానుగా భృశం |

దేవేషు వై రణ తేషు విదృతేషు విశేషతః || 72

సైన్యముతో దేవతల గెలువగోరి కోరి వైరము తెచ్చికొనెను. అమ్మహాసురుడట సముద్రముపైకి లేచుచున్నంత నట నీరు పెంగి పర్వతముల చర్యలను ముంచెత్తెను. లోనున్న నాగములు, మొసళ్ళు చిత్ర విచిత్ర కవచములతోడి అసుర సంఘము భయంకర బలము చక్కని యోధలతోడి బలము పెద్దది చలించిపోయి సముద్రమునుండి వెడలెను. అట నేనుగులు దైత్యభటులు ఘటలతోడి రథములపై సర్వ సమృద్దులై చేపలకు తమ యాకారములచే నందరు నొకలాగుననున్నట్లు కనబడుచు వెడలిరి. బంగారు సూత్రములు గట్టిన గుఱ్ఱములు రాహీతమనుచేపలవలె నీటిలోనున్నవెల్ల ఆ చేపలతోనేకోట్లు లక్షల కొలది పైకి వచ్చినవి. అలా సూర్యరథ సమాన వేగముగలవి చక్రములతో , దంతములతో, వెదుళ్ళతో యంత్రములపై చట్రము లొత్తుకొన పతాకము లెగురుచుండ రథములు తరలి పెద్ద సడి యొనర్చినవి. అయ్యసురుని వెంబడించ దానవవరులు యోధులు తెడ్లు చేబూని న మ్మహో దధిని దాటగోరి మంచి యస్త్రములం జేపట్టి ప్రతి యుద్దమందు జయముగొన్న వారాయుధములం బట్టి అనురానుచర భటవర్గ మధ్భుతముగ నెగసెను. 72

అసురాస్సర్వ దేవానామన్వధావంస్తతస్తతః | తతో దేవగణాః సర్వే ద్రవంతో భయవిహ్వలాః || 73

నీలం గిరివరం జగ్ముర్యత్ర దేవీ స్వయం స్థితా | రౌద్రీ తపోన్వితా ధన్యా శాంభవీ శక్తిరుత్తమా || 74

సంహారకారణీ దేవీ కాలరాత్రీతి యాం విదుః | సా తు దృష్ట్వా తదా దేవాన్భయత్రస్తాన్విచేతనః || 75

పప్రచ్ఛ విస్మయాద్దేవీ ప్రోత్ఫుల్లాంబుజలోచనా | పృష్టతో వో న పశ్యామి భయం కించిదుపాగతమ్‌ || 76

కథం తు విద్రుతా దేవాః సర్వే శక్రపురఃసరాః |

దేవా ఊచు: - అయమాయాతిదైత్యేంద్రో రురుర్భీమపరాక్రమః ||

చతురంగేణ సైన్యేన మహతా పరివారితః తస్మాద్దీనా వయం దేవీం భవతీం శరణం గతాః || 78

ఆయుద్ధములందు వేల్పులు మిక్కిలి భయపడి పారిపోవుచుండ నసురులులందరిం దరిమికొట్టిరి. దేవగణము హడలెత్తి పారి దేవియున్న నీలగిరింజేరిరి. ఆమె రౌద్రి తపోనిష్టనున్నది. ధన్యశాంభవి ఉత్తమశక్తి సంహారకారిణి కాలరాత్రి నా నెఱుగనైనది. తెలివిదప్పిన దేవతలం జూచి యాశ్చర్యపడి విప్పారిన కనుదామరలంగని, మీ వెనెకనించు లేనిభయము వచ్చినట్లు గానను! శక్రాదులందురు నెందులకు బారిపోవుచున్నారనిన దేవత లిట్లనిరి! భీమపరాక్రము డిడుగో వీడు రురుపు వచ్చుచున్నాడు. వీనివెంట చతురంగబలము చుట్టువారినది. అందుచే దీనులమై దేవి నిను శరణుసొచ్చినాము. 78

దేవానామితి వై శ్రుత్వా వాక్యముచ్చైర్జహాస సా| తస్యాం హసంత్యాం నిశ్చేరుర్వరాంగ్యో వదనాత్తతః || 79

పాశాంకుశధరాః సర్వాః పీనోన్న తపయోధరాః | సర్వాశ్శూలధరాః భీమాః సర్వా దంష్ట్రాజ్ఞ్కుశాననాః || 80

అబద్దమకుటాః సర్వాః నందష్టదశనచ్ఛదాః పూత్కారరావై రశివైస్త్రాసయంత్యశ్చరాచరమ్‌ || 81

కాశ్చిచ్చుక్లాంబరధరాః కాశ్చిచ్చిత్రామ్బరస్తథా | సునీలవసనాః కాశ్చిద్రక్తపానాతిలాలసాః || 82

నానారూపైర్ముఖైస్తాస్తు నానావేషవపుర్ధరాః | తాభిర్వై వృతా దేవీ దేవానామభయంకరీ ||83

మాభైష్ట దేవా భద్రం వో యావద్వదతి దానవః | చతురంగబలోపేతా రురుస్తావత్సమాగతః ||84

దేవతల యీ వాక్యమాలించి యామె పెద్దపెట్టున నవ్వెను. ఆమె నవుచుండగా మొగమునుండి సుందరాంగనలెందరో వెలువడిరి. అందరు పాశములంకుశములూనిరి. అందరు నిండుగుబ్బలువారు.అందరు శూలధరలు భయకారిణులు కోరలంకుశములం వెఱపుగొలుపుమొగములవారు కిరీటముల బెట్టుకొన్నారు. అందరు పెదవులగొఱకువారు. అమంగళములైన పూత్కారముల సడిచే చరాచరమును హడలెత్తించుచున్నారు. కొందరు తెల్లనిచీర రంగరంగుల చీర, కొందరు నీలాంబరము గట్టు కొన్నారు. రక్తముంద్రావ కడు నుబలాటపడువారు నానా రూపములతో నానావేషములు నానా శరీరములూనినారు. వారితోనిట్లు చుట్టువారుకొనిదేవతల భయంకని యా దేవి; జడియకుడు దేవతలారా భద్రమగు మీకు. దానవుడేమనో! చతురంగసేనతో రురువు వచ్చినాడనెను. 84

తం నీలపర్వతవరం దేవానాం మార్గమార్గిణః | దేవానామగ్రతః సైన్యం దృష్ట్వా దేవీసమాకులమ్‌ ||85

తిష్ట తిష్టేతి జల్పంతో దైతాస్తే సముపాగతాః | తతః ప్రవృతేయుద్దం తాసాం తేషాం మహాభయమ్‌ || 86

నారాచైర్భిన్నదేహానాం దైత్యానాం భువి సర్పతాం | రోషాద్దండప్రభగ్నానాం సర్పాణామివ సర్పతామ్‌ || 87

శక్తినిర్భిన్నహృదయా గదాసంచూర్ణితోరసః | కుఠారైర్భిన్నశిరసో ముసలైర్భిన్నమస్తకాః|| 88

విద్దోదరాస్త్రిశూలాగ్రైశ్ఛిన్న గ్రీవా వరాసిభిః | క్షతాశ్వరథమాతంగపాదాతాః పేతురాహవే || 89

రణభూమిం సమాసాద్య దైత్యాః సర్వే రురుం వినా |

తతోబలంహతం దృష్ట్వా రురుర్మాయాం తదా దదౌ- 90

తయా సంమోహితా దేవ్యో దేవాశ్చాపి రణాజిరే | తామస్యా మాయయా దేవ్యా సర్వమన్ధం తమో భవత్‌ || 91

తతో దేవీ మహాశక్త్యా తం దైత్యం సమతాటయత్‌ | తయా తు తాడితస్యాజౌ దైత్యస్య ప్రగతం తమః || 92

మాయాయామథ నష్టాయాం తామస్యాం దానవో రురుః | పాతాలమావిశత్తూర్ణం తత్రాపి పరమేశ్వరీ || 93

దేవీభిః సహితా క్రుద్దా పురతోభిముఖీ స్థితా| రురోస్తు దానవేంద్రస్య భీతస్యాగ్రే గతస్య చ || 94

దేవతల జూడ వెదకుచు దేవతల ముందు వడు దేవిచే సమాకులమైన సేనం జూచి నిలునిలుమని యడ్చుచుదైత్యులట్లు వచ్చిరి. ఆ దేవీ సంఘమునకు నసురులకు మహా భయంకరమైన యుద్దమారంభముగాగ బాణములం దేహములు తెగి నేలపై నలుకులాడుచు, రోషమున దండములం దెబ్బదిని పాములట్లు ప్రాకులాడుచు శక్తిచే బగిలిన గుండెలు, గదచే గుండైన ఱొమ్ములు, కుఠారములచే పగిలి నడినెత్తులుతో , రోళ్లచే వ్రీలిన తలలు, త్రిశూలాగ్రములచే నఱుకువడిన మెడలు, కత్తులచే నరకబడిన అశ్వరథ మాతంగ పదాతి సైన్యము , అంతయు రణమునం రురువు తప్ప సర్వము గూలెను. బలమటు గూలుటగని రురుడు మాయను జేకొనెను. దానం దేవతలు మోహవశులైరి. దేవి తామసీమాయచే దేవి సర్వ మంధకారబంధురమయ్యెను. అంతట దేవి మహాశక్తిచే నా దైత్యుం గొట్టెను. ఆ దెబ్బ తినగానే దైత్యుని తమస్సు చీకటిపోయెను. మాయ యిటుపోవ దానవుడు వేగమ పాతాళముంజొచ్చెను. అచట గూడ పరమేశ్వరీదేవి పరివారములతో గూడ కోపమెత్తి వానిముందభిముఖియై నిలిచెను. హడలి యెదుటపడిన దానవేంద్రుని రురుని,

నఖాగ్రేణ శిరశ్ఛిత్వా చర్మ చాదాయ వేగితా ! నిష్పపాతాథ పాతాలాత్పుష్కరం చ పునర్గిరిమ్‌ || 95

కన్యా సైన్యేన మహతా బహురూపేణ భాస్వతా | దేవైస్తు విస్మితైర్దృష్టా చర్మముండధరా రురోః || 96

స్వకీయే తపసః స్థానే నివిష్టా పరమేశ్వరీ | తతో దేవ్యో మహాభాగాః పరివార్య వ్యవస్థితాః || 97

తలపై గోటితో గిల్లి, వేగమ చర్మము చేకొని పాతాలమునుండి తిఱిగి పుష్కరమును నటపర్వతమున వ్రాలెను. పెక్కు రూపముల భాసించు పెద్ద కన్యాసైన్యములచే దేవతలచే, రురుపు చర్మముండము ధరించిన దేవి, తిలకింపబడి పరమేశ్వరి తన తపఃస్థానమున బ్రవేశించెను. అంతట మహానుభావలు దేవి సముదాయము జుట్టువారుకొని నిలిచిరి.

యాచయామాసురవ్యగ్రాస్తాం తు దేవీం బుభుక్షితాః | బుభుక్షితా వయం దేవి దేహి నో భోజనం వరమ్‌ || 98

ఏవముక్త్వాతతో దేవీ దధ్యే తాసాం తు భోజనం | నాద్యగచ్ఛత్తదా తాసాం భోజనం చిన్తితమ్మహత్‌ || 99

తదా దధ్యౌ మహాదేవం రుద్రం పశుపతిం విభుం సోపిద్యానాత్సముత్తస్థౌ పరమాత్మా త్రిలోచనః || 100

ఉవాచ రుద్రస్తాం దేవీం కిం తే కార్యం వివక్షితం | బ్రూహి దేవి మహామాయే యత్తే మనసి వర్తతే || 101

ఆకలిగొని యాందోళనపడక యామెను ఆకలిగొంటిమి దేవీ ! మాకు భోజనము పెట్టుమని యడిగికొనిరి. వారికి భోజనమేమి పెట్టవలనో తెలియనట్టును చాలా ఆలోచించినది. అపుడు మహాదేవుని రుద్రుని, పశుపతిని, విభుని ధ్యానించెను. పరమాత్మ త్రిలోచనుడట ద్యానమునుండి లేచి నిలువబడెను. ఆ దేవింగూర్చి దేవీ ! మహామాయా నీ మనసునందున్నదేమినీ చేయవలసినది?తెల్పుమన శివదూతి యిట్లనియె. 101

శిదూత్యువాచ : - భాగమధ్యే తు వై దేవ వాగరూపేణ వర్తసే ||

ఏతాస్త్వాం భక్షయిష్యన్తి భక్ష్యమీప్సితమాదరాత్‌ | 102

భక్షార్ధమాసాం దేవేశ కించిద్దాతుమిహార్హసి | శూలీ కుర్వంతి మామేతా భక్ష్యార్దిన్యో మహాబలాః || 103

అన్యథా మామపి బలాద్భక్షయేయుర్బుభుక్షితాః | ఏవం మాం తు సమాలక్ష్య భక్ష్యం కల్పయ సత్వరమ్‌ || 104

దేవా ! నీవు భగమందు వాగరూపమున నుందువు. ఈ దేవీవరమును కోరి నిన్ను భక్షింతురు. వీరికి తినుటకేదేని కొంచెమొసగును. మహా బలసంపన్నులు వీరున న్ను శూలముగా వాడుకొందురు. అలా కాకపోయిన వీరాకలిగొని నన్నునుందినివేయుదురు. ఈ నా స్థితి గమనించి త్వరగ వీరికి భక్ష్యమును సమకూర్చుమన రుద్రుడిట్లనియె. 104

రుద్ర ఉవాచ:- శివదూతి బ్రవీమ్యేకం ప్రవృత్తం యద్యుగాంతరే ||

గంగాద్వారే దక్షయజ్ఞో గణౖర్విధ్వంసితో మమ | 105

తత్రయజ్ఞో మృగో భూత్వా ప్రదుద్రావ సువేగవాన్‌ | మయా బాణన నిర్విద్దో రుధిరేణ ప్రసేచితః || 106

అజగంధ స్తదా భూతో నామ దేవైస్తు మేకృతం | అజగంధస్త్వమేవేతి దాస్యే చాస్య తు భోజనమ్‌ || 107

ఏతాసాం శృణు మే దేవి భక్ష్యమేకం మయోచితం | కథ్యమానం వరారోహే కాలరాత్రిమహాప్రభే || 108

యా స్త్రీ సగర్భా దేవేశి అన్యస్త్రీపరధానకం |పరిధత్తే స్పృ శేద్వాపి పురుషస్య విశేషతః || 109

న భాగోస్తు వరారోహే కాసాంచిత్పృథీవితలే | అప్యేకవర్షం బాలం తు గృహీత్వా తత్ర వై బలాత్‌ || 110

భుక్త్వా తిష్ఠంతు సుప్రీతా ఆపి వర్షశతాన్బహూన్‌ | అన్యాః సూతిగృహోచ్ఛిద్రం గృహ్ణీయస్తు హ్యపూజితాః || 111

నివిశిష్యంతి దేవేశి తథా వై జాతహారికాః గృహే క్షేత్రే తటా కే చ వాప్యుద్యానేషు చైవ హి || 112

అన్యేషు చ రుదంత్యో యాస్త్రియస్తిష్టంతి నిత్యశః | తాసాం శరీరగాశ్చాన్యాః కాశ్చిత్తృప్తిమవాప్నుయుః || 113

శివదూతీ ! యుగాంతరమందు జరిగిన కథ సెప్పదను. నేను గంగాద్వారమందు దక్షయజ్ఞ ధ్వంసము చేసితిని. అక్కడ యజ్ఞ పురుషుడు లేడియై వేగముగ పారిపోయెను. నేను బాణముచే గొట్టగా రక్తముగారి తడిసెను. అపుడేను అజగంధుడ నైతిని. దేవతలపుడా పేరు నాకు పెట్టిరి. నీవే యజగంధుడవీనేయని యింకొక భోజనము పెట్టెదను. ఇక నీ వినుమీ దేవులకుభంక్ష్యమింకోటి తగినది. చెప్పబోవునది పెట్టెదను. కాలరాత్రి ప్రభగల దానవు. గర్భవతియైన స్త్రీ యింకొక స్త్రీ చీర కట్టుకొన్నా తాకినా విశేషించి పురుషునిది, ఆగర్భకుడు బిడ్డడీ భూతలమున నింకొకని భాగమగును. బలత్కారముగ నా శిశివును నేడాది యీడువాని లాగుకొని వందల సంవత్సరము లానందముతో నుందురు. మఱి యితర దేవులు పూజింపబడక పురిటితో చిద్రమును చేకొని దేవేశి! అలా పుట్టిన వానిని కాజేసి యట నివసింతురు. ఇంటి క్షేత్రమందు, చెఱువులో ఉద్యానములందు మఱి యితర స్థలములందేడ్చుచు నితర స్త్రీల శరీరములందు వసించుచు తృప్తిపడుచుందురు. 113

శివదూత్యువాచ :- కుత్సితం భవతా దత్తం ప్రజానాం పరిపీడనం ||

న చ త్వం బుద్ద్యసే దాతుం శంకరస్య విశేషతః | 114

త్రపాకరం యద్భవతి ప్రాజానాం పరిపీడకం | న తు తద్యుజ్యతే దాతుం తాసాం భక్ష్యం తు శంకర || 115

రుద్ర ఉవాచ :- అవంత్యా తు యదా స్కందో మయా పూర్వం తు భద్రితః ||

చూడాకర్మణి వృత్తే తు కుమారస్య తథా శుభే 116

ఆగత్య మాతరో భక్ష్యమపూర్వం తు ప్రచక్రిరే | దేవలోకాద్దేవగణా మాతౄణాం భోక్తుమాగతాః || 117

తాసాం గృహే యదా పూర్వం బ్రహ్మాద్యాస్సురసత్తమాః |

గంధర్వాప్సరసశ్చ వై యక్షైస్సర్వే చ గుహ్యకాః || 118

మేర్వాదయః శిఖరిణ గంగాద్యాః సరిత స్తథా| సర్వే నాగా గజాః సిద్దాః పక్షిణో సురసూదనాః ||119

డాకిన్యః సహవేతాలైర్వృతాః సర్వైర్గ్రహైస్తదా కిము క్తేనామునా దేవి యత్సృష్టం బ్రహ్మణాత్విహ || 120

తత్సర్వం భోజనం దత్తం స్వేచ్ఛాన్నం చ నభోగతం |

శివదూత్యువాచ :- అసాం కృతం దేహి భోజ్యం దుర్లభం యత్రివిష్టపే|| 121

ఇది విని శివదూతి, 'ప్రజలకు నీవిచ్చు పీడ యిది అసహ్యము సిగ్గుచేటు. శంకరా! వారికీలాటి భక్ష్యమొసగుట తగదు శంకరా! యన రుద్రుడిట్లనియె. అవంతి యందు నేను కుమారస్వామిని పెంచునపుడు శుభకర్మ పుట్టు వెంట్రుకలు చూడాకర్మ జరిపినపుడు తల్లులు వచ్చి ఆపూర్వ భక్ష్యములు తయారు సేసిరి. (పిండివంటలు) దేవలోకము నుండి దేవతలు గుంపులుగా యా తల్లుల వంటలారగింప ఆ మాతృవర్గ మింట మునుపటి యట్ల బ్రహ్మాది దేవతలు వచ్చిరి. గంధర్వులు, అప్సరసలు, యక్షులు, గుహ్యకులు , మేరువు మొదలుగ పర్వతములు, గంగాది నదులు, అందరు నాగులు, ఏనుగులు, సిద్దులు, పక్షులు, అసురులు, డాకినులు, భేతాళురు, నైరృతులు, గృహిణులు వచ్చిరి ఏమి సెప్పుదును? ఇట నీ బ్రహ్మచేత సృష్టింపబడినది ఆకాశముందన్నదది సర్వము భోజనము (కోరినది) స్వేచ్ఛాన్నమట వడ్డింపబడినది, అన శివదూతి యిట్లనియె. 121

స్నేహాక్తం సగుడం హృద్యం సుపక్వం పరికల్పితం | క్వచిన్నాన్యేన యద్భు క్తమపూర్వం పరమేశ్వర || 122

ఏవంభుక్తస్తదా సోపి దేవదెవో మహేశ్వరః భక్ష్యార్దం తాస్తదా ప్రాహ పార్వత్యాశ్చైవ సన్నిధౌ || 123

ఈ ప్రజలకు పెట్టిన భోజనము స్వర్గమందు దుర్లభము. నూనె గలది బెల్లము తోడిది. మనసున కింపైనది. చక్కగా పక్వమైనది. పరమేశ్వరా! ఎన్నడు నింకొకడు తిననిది. ఇది అపూర్వము . దేవదేవుడు శంకరుడొక్కపూటనే భోజనము సేయువాడు. అప్పుడా దేవతా స్త్రీలతో పార్వతీదేవి సన్నిధి, భక్ష్యము కొఱకు మహేశ్వరుడిట్లనియె. 123

మయా వై సాధితం చాన్నం ప్రకారైర్బహుభిః కృతం |

తత్సర్వం చ వ్యయం యాతం న చాన్యదిహ దృశ్యతే || 124

భవతీష్వాగతాస్వద్య కిం మాయ దేయముచ్యతాం | అపూర్వం భవతీనాం యన్మయా దేయం విశేషతః || 125

అస్వాధితం న చాన్యేన భక్ష్యార్దే చ దదామ్యహం | అధోభాగే చ మే నాభేర్వర్తులౌ ఫలసన్నిభౌ || 126

భక్ష్యద్వం హి సహితాలంబౌ మే వృషణావిమౌ | అనేన చాపి భోజ్యేన పరా తృఫ్తిర్భవిష్యతి || 127

మహాప్రసాదం తా లబ్ద్వా దేవ్యస్సర్వాస్తదా శివం | ప్రణిపత్య స్థితాశ్శర్వ ఇదం వచనమబ్రవీత్‌ || 128

బహు రకా వంటకములతో నేను భోజనము తయారుచేసితిని. అదంతయు నైపోయినది. ఇంక నిట నేదియు కనబడదు. తాము వచ్చినవారికి నేనేమి ఎట్టవలె? నపూర్వ రుచి మీకు నేను పెట్టవలెను. ఎవ్వరు మఱి మీకు నే వడ్డించెదను. మీరు నా నాభిక్రింద గుండ్రని పండ్ల వంటివి వ్రేలాడు నా వృషణములను మీరు తినుడు. దీనిచే చాలా తృప్తికల్గును. అప్పుడా దేవి సముదాయము దా మహప్రసారమును బడసి సదాశివునికి వ్రాలి నమస్కరించి నిలుపబడిరి. వారిని గూర్చి శివుడిట్లనియె. 128

కరిష్యంతి శుభాచారాన్వినా హాస్యేన యే నరాః | తేషాం ధనం పశుః పుత్రా దారాశ్చైవ గృహాదికమ్‌ || 129

భవిష్యతి మయా దత్తం యజ్ఞాన్యన్మనసి స్థితం | హాస్యేన దీర్ఘదశనా దరిద్రాశ్చ భవంతి తే || 130

తస్మాన్న నిందా హాస్యం చ కర్తవ్యం హి విజానతా | భవత్యో మాతరః ఖ్యాతా హ్యస్మిన్లోకే భవిష్యథ || 131

ఉపహారే నరా యే తు కరిష్యంతి చ కౌముదీం | చణకాన్పూరికాశ్చైవ వృషణౖః సహ పూపకాన్‌ || 132

బంధుభిః స్వజనైశ్చైవ తేషాం వంశో న భిద్యతే | అపుత్రో లభ##తే పుత్రం ధనార్థీ లభ##తే ధనమ్‌ || 133

రూపవాన్సుభగో భోగీ సర్వశాస్త్రవిశారదః | హంసయుక్తేన యానేన బ్రహ్మలోకే మహీయతే || 134

శివదూతి మయా త్వేవం తాసాం దత్తం చ భక్షణం | త్రపాకరం కిం భవత్సా ఉక్తోహం తన్నిశామయ|| 135

ఏ మానవులు (వినోదమునకు) వెక్కిరింతలు లేక, శుభాచారములు చక్కగా జరుపుదురో వారికా యజ్ఞము, ధనము, పశుసంపద, దారా పుత్రాదులు, ఇండ్లు ,వాకిండ్లు కోరినవి సర్వసమృద్దములు నేనిచ్చినవి కలుగగలవు. హాస్యమునకై యిచ్చిన వాండ్రు దరిద్రులగుదురు. తెలిసిన వారందుచే నిందహాస్యము నెన్నడు చేయరాదు. మీరందరు మాతృదేవతలుగా లోకమందు ప్రసిద్ది గనుడు. సెనగలు, పూరీలు, వృషణములతో గూడ అప్పాలను ఉపాహారము గావింతురు. బంధువులతో స్వజనముతో వారి వంశము చెడదు. కలకాలము వంశాభివృద్ధి గల్గును. పుత్రుడు లేనివాడు పుత్రుని, ధనము కోరువాడు ధనమును బొందును. అందగాడు సౌభాగ్యవంతుడు, భాగ్యవంతుడు, సర్వశాస్త్రవిశారదుడునై యతడు రాణించును. హంసలతోడి యానమున (విమానమున) బ్రహ్మ లోకమున రాజిల్లును. శివదూతీ ! ఈలా నా దేవభామినులకు పిండివంటలు పెట్టితిని. నేనేదో సిగ్గుగూర్చునది పెట్టితినని నీవంటివి. ఇదే వినుము. 135

జయస్వ దేవి చాముండే జయ భూతాపహారిణి | జయ సర్వగతే దేవి కాలరాత్రి నమోస్తు తే || 136

విశ్వమూర్తియుతే శుద్దే విరూపాక్షి త్రిలోచనే | భీమరూపే శివే విద్యే మహామాయే మహోదరే || 137

మనోజయే మనోదుర్గే భీమాక్షి క్షుభితక్షయే | మహామారి విచిత్రాంగి గీతనృత్యప్రియే 4శుభే|| 138

వికరాలి మహాకాలికాలికే పాపహారిణి | పాశహస్తే దండహస్తే భీమహస్తే భయానకే || 139

చాముండే జ్వలమానాస్యే తీక్షణదంష్ట్రే మహాబలే | శివయానప్రయే దేవి ప్రేతాసనగతే శివే || 140

భీమాక్షి భీషణ దేవి సర్వభూతభయంకరి | కరాలి వికరాలే చ మహాకాలి కరాలిని || 141

కాలిక రాలవిక్రాంతే కాలరాత్రి నమోస్తు తే | సర్వశస్త్రభృతే దేవి నమో దేవనమస్కృతే || 142

ఏవంస్తుతా శివదూతీ రుద్రేణ పరమేష్టినా | తుతోష పరమా దేవీ వాక్యం చైవమువాచ హ|| 143

వరం వృణీష్వ దేవేశ యత్తే మనసి వర్తతే |

రుద్ర ఉవాచ:- స్తోత్రేణానేన యా దేవి స్తోష్యంతి త్వాం వరాననే || 144

తేషాం త్వం వరదా దేవి భవ సర్వగతా సతీ | ఇమం పర్వతమారుహ్య యః పూజయతి భక్తితః || 145

సపుత్రపౌత్రపశుమాన్సమృద్ధిముపగచ్ఛతు | యశ్చైవం శృణుయాద్భక్త్యా స్తవం దేవి సముద్భవ మే || 146

సర్వపాపవినిర్ముక్తః పరం నిర్వాణమృచ్ఛతు | భ్రష్టరాజ్యో యదా రాజా నవమ్యాం నియతః శుచిః || 147

అష్టమ్యాం చ చతుర్ధశ్యాం సోపవాసో నరోత్తమ | సంవత్సరేణ లభతాం రాజ్యం నిష్కంటకం పునః || 148

ఏషా జ్ఞానాన్వితా శక్తిః శివదూతీతిచోచ్యతే |య ఏవం శృణుయాన్నిత్యం భక్త్యా పరమయా నృప || 149

సర్వపాపవినిర్ముక్తః పరం నిర్వాణమాప్నుయాత్‌ | యశ్చైనం పఠతే భక్త్యా స్నాత్నా వై పుష్కరే జలే|| 150

సర్వమేతత్ఫలం ప్రాప్య బ్రహ్మలోకే మహీయతే | యత్రైతల్లిఖితం గేహే సదా తిష్ఠతి పార్దివ || 151

న తత్రాగ్నిభయం ఘోరం సర్వచోరాదిసంభవం | యశ్చేదం పూజయేద్బక్త్యా పుస్తకేపి స్థితం బుధాః || 152

తేన చేష్టం భ##వేత్సర్వం త్రైలోక్యం సచరాచరం | జాయంతే బహవః పుత్రాః ధనం ధాన్యం వరస్త్రీయః || 153

రత్నాన్యశ్వా గజా భృత్యాస్తేషామాశు భవంతి చ | యత్రేదం లిఖ్యతే గేహే తత్రాప్యేవం ధృవం భ##వేత్‌ || 154

ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే

శివదూతీచరితం నామ ఏకత్రింశోధ్యాయః

ఆపై పరమేష్టిరుద్రుడిటు జయజయ ధ్వానములు సేసి స్తుతింప సంతోషించి పరాశక్తి దేవేశ! నీ మనసునందున్నదది వరము కోరుమన రుద్రుడనియె. ఈస్తోత్రముచే దేవి! ఫలశ్రుతి నిన్నెవ్వరు సంతోష పెట్టుదురో వారికి నీ వంతటం దిక్కైయుండి వరము లిమ్ము. ఎవ్వడీ కొండనెక్కి భక్తితో నిన్ను పూజించునో నతడు పుత్ర పౌత్ర పశు సంపద నందుగావుత ! ఈ నా ముఖమునకు వచ్చినస్తపమును భక్తితో విన్నవాడు సర్వపాప ముక్తుడై పరమ ముక్తినందు గావుత! రాజ్యము పోయిన వాడు నవమినాడు శుచియై నియమముతో అష్టమినాడు, చతుర్దశినాడు, నుపవాసము చేసి యిది విన్న, యతడొక్కడు వత్సరములు సర్వపాపములు విడి పరమ మోక్షమందును. పుష్కరతీర్థ జలమందు స్నానముసేసి యిది పఠించినతడు నీ ఫలమెల్ల పొంది బ్రహ్మలోకమున రాజిల్లును. రాజా! ఈ స్తుతి వ్రాయబడి యే యింట నుండునో, నా యింట ఘోరమగు అగ్నిభయము, చోరాది భయము నుండవు. పుస్తకమందున్న యీ స్తుతిని పూజించు పండితుడతడు సర్వ యజ్ఞములు సేసినట్లే. చరాచరమీ జగత్తు సేవించినట్లే. బహు పుత్ర ధన ధాన్య పరస్త్రీ సమృద్దులం గనును. రత్నములు, గజములశ్వములు, భృత్యులు నవ్వారికి వెంటనే కల్గును గూడ. ఈ స్తోత్రమే యింట నందు బాటునందుండు నక్కడ నిట్లే తప్పక కల్గును. 154

ఇది శివదూతీ చరితమను ముప్పది యొకటవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters