Sri Padma Mahapuranam-I    Chapters   

అష్టావింశోధ్యాయః

-: వృక్షారోపణ విధి :-

బీష్మ ఉవాచ : పాదపానాం విధిం బ్రహ్మన్యథావద్విస్తరాద్వద ||

విధినా యేన కర్తవ్యం పాదపారోపణం బుధైః | 1

యే చ లోకాః స్మృతా యేషాం తానిదానీం వదస్వ మే |

పులస్త్య ఉవాచ :- పాదపానాం విధిం వక్ష్యే తథైవోద్యానభూమిషు || 2

తటాకవిధివత్సర్వం సమాప్య జగదీశ్వర | ఋత్విజ్ఞమండపసంభారమాచార్యం చాపి తద్విధం || 3

పూజయేద్ర్బాహ్మణాంస్తద్వద్దేమవస్త్రానులేపనైః | సర్వౌషధ్యుదకైః సిక్తాన్‌ దధ్యక్షతవిభూషిగాన్‌ || 4

వృక్షాన్మాల్యైరలంకృత్య వాసోభిరభివేష్టయేత్‌ ! సూచ్యా సౌవర్ణయా కార్యం సర్వేషాం కర్ణవేధనమ్‌ || 5

:- వృక్షారోపణ విధి :-

బీష్ముడనియె :- చెట్లను నాటుట యెట్లు? దాని ఫలమేమి తెలుపుమన పులస్త్యునియె. చెట్లను నాటుట ఉద్యానము లేర్పరచుటను దెలిపెద. తటాక ప్రతిష్ఠకు వలెనే సర్వము పూర్తిచేసి ఋత్విగాదులను బూజించి అన్ని మూలికల యుదకములచే చెట్లను దడిపి పెరుగు అక్షతలచే వాని నలంకరించి యితన వస్త్రములు కప్పి బంగారు సూదిచే వానికి చెవులు కుట్టవలెను. 5

అంజనం చాపి దాతవ్యం తద్వద్ధేమశలాకయా | ఫలాని సప్త చాష్టౌ వా కాలధౌతాని కారయేత్‌ || 6

ప్రత్యేకం సర్వవృక్షాణాం వేద్యాం తాన్యధివాసయేత్‌ | ధూపోత్ర గుగ్గులుః శ్రేష్టస్తామ్రపాత్రేష్వధిష్ఠితాన్‌ || 7

సప్తధాన్యస్థితాన్‌ కృత్వా వస్త్రగంధానులేపనైః | కుంభాన్సర్వేషు వృక్షేషు స్థాపయిత్వావనీశ్వర||8

పూజయిత్వా దినాంతే చ కృత్వా బలినివేదనం | యథావల్లోకపాలానామింద్రాదీనాం విధానతః || 9

బంగారు శలాకతో కాటుక పెట్టవలెను. ఏడెనిమిది పండ్లు కడిగి చెట్ల వేదికపై ప్రత్యేక మలంకరింపవలెను. గుగ్గులు ధూపము వేయవలెను. రాగి పళ్ళెములపై సప్త ధాన్యములు పోసి వానిపై చెట్లనుంచి నూతన వస్త్రములతో గంధములతో అన్ని చెట్ల దగ్గర కుంభములుంచి పూజించి సాయంకాలము బలి నివేదనము సేసి ఇంద్రాది లోకపాలుర పూజించి యిట్లు వనస్పతి కధివాసనము (వనస్పతి=వృక్షము) సేయవలెను. 9

వనస్పతేరధివాస ఏవం కార్యో ద్విజాతిభిః | తతః శుక్లాంబరధరాన్సౌవర్ణకృతమేఖలాన్‌ || 10

సకాంస్యదోహాం సౌవర్ణశృంగాభ్యామతిశాలినీం | పయస్వినీం వృక్షమధ్యాదుత్సృజేద్గాముదఙ్ముఖీమ్‌ || 11

తతోభిషేకమంత్రేణ వాద్యమంగలగీతకైః | ఋగ్యజుః సామమంత్రైశ్చ వారుణౖరభితస్తదా || 12

తైరేవ కుంభైః స్నపనం కుర్యర్భ్రాహ్మణపుంగవాః | స్నాతః శుక్లాంబరధరో యజమానోభిపూజయేత్‌ || 13

ఆపై తెల్లని వస్త్రము లలంకరించి బంగారు మొలత్రాళ్ళు కంచు పాల చెంబుతో బంగారు తొడుగు తొడిగిన కొమ్ముల తోడి పాలిచ్చు గోవును చెట్ల నడుమ నుండి ఉత్తర దిశగా వదలవలెను. ఆపై నభిషేక మంత్రముతో, మంగళవాద్యములతో గానములతో, ఋగ్యక్ష మంత్రములతో, వరుణ దేవతా మంత్రములతో నా కుంభములతోనే వానికి స్నపనము (స్నానము) బ్రాహ్మణులు సేయవలెను. ప్రాతఃకాల సమయమున యజమాని తెల్లని వస్త్రములు ధరించి వానిని పూజింపవలెను. 13

గోభిర్విభవతపః నర్వానృత్విజః స సమాహితాన్‌ | హోమసూత్రైః సకటకైరంగులీయైః పవిత్రకైః || 14

వాసోభిః శయనీయైశ్చ తథోపస్కరపాదుకైః | క్షీరాభిషేచనం కుర్యాద్యావద్దినచతుష్టయమ్‌ || 15

హోమశ్చ సర్పిషా కార్యో యవైః కృష్ణతిలైరపి | పలాశసమిధః శస్తాశ్చతుర్థేహ్ని తథోత్సవః || 16

సంపన్నులైనచో నెల్ల ఋత్వజులను గోవులతో సత్కరింపవలెను. వానికి బంగారు సూత్రములు, కంకణములు, ఉంగరములు పవిత్రములు చేయించి వారిని సత్కరింపవలెను. వస్త్రములు పరుపులు దిండ్లతోడి శయ్యాదానము సేయవలెను. పాదుకల నీయవలెను. నాల్గు రోజులు క్షీరాభిషేకము గావింపవలెను. నేతితో హోమము సేయవలెను, మోదుగ సమిధలు హోమమున కుత్తమములు. నాల్గవరోజు ఊరేగింపు ఉత్సవము జరుపవలెను. 16

దక్షిణా చ పునస్తద్వద్దేయా తత్రాపి శక్తితః | యద్యదిష్టతమం కించిత్తత్తద్దద్యాదమత్సరీ || 17

ఆచార్యే ద్విగుణం దత్త్వా ప్రణిపత్య క్షమాపయేత్‌ | అనేన విధినా యస్తు యాద్దృశోత్సవం బుధః|| 18

సర్వాన్‌ కామానవాప్నోతి పదం చానన్తమశ్నుతే | యశ్చైవమపి రాజేంద్ర వృక్షం సంస్థాపయేద్బుధః 19

సోపి స్వర్గే వసేద్రాజన్యావదింద్రాయుతత్రయమ్‌ | భూతాన్భవ్యాంశ్చ మనుజాంస్తారయేద్రోమసంమితాన్‌ || 20

పరమాం సిద్దిమాప్నోతి పునరావృత్తిదుర్లభాం | య ఇదం శృణుయాన్నిత్యం శ్రావయేద్వాపి మానవః || 21

సోపి సంపూజ్యతే దేవైర్ర్బహ్మలోకే మహీయతే | అపుత్రస్య చ పుత్రిత్వం పాదపా ఏవ కుర్వతే|| 22

తీర్థేషు పిండదానాదీన్‌ రోపకాణాం దదంతి తే| యత్నేనాపి చ రాజేంద్ర అశ్వత్థారోపణం కురు|| 23

ఋత్విజులకు దక్షిణ యీయవలెను. పురోహితునికి రెట్టింపు దక్షిణ యిచ్చి నమస్కరించి యా వృక్షమాపణము సేయవలెను. ఈలా వృక్షారోపణ విధి చేసిన ప్రజ్ఞుడు సర్వ కామములందును, ఉత్తమ స్థానమందును, స్వర్గ మనుభవించును. పదివేల మంది యింద్రుల కాలములు సుఖించును. శరీరములో రోమములెన్ని గలవంత కాలము తన నాశ్రయించిన జీవులను భూతముల నుద్ధరించును. ఈ విధానము విన్నతడును దేవతలచే పూజింపబడును. బ్రహ్మలోకమందు రాణించును. ఇది సేసినచో పుత్రులు లేని వారికి పుత్రులు కల్గుదురు. తీర్థములందు పిండ ప్రధానము చేయును. భీష్మ రాజేంద్రా! తప్పక యత్నించి ముందు అశ్వత్థా రోపణము రావిచెట్టు మొలవేయుము. ఆ వృక్షము వేయిమంది పుత్రులు సేసిన సేవ నీకు కూర్ప గలదు. 23

-: ఆయా చెట్లు ఆయా ఫలములు :-

స తే పుత్రసహస్రస్య కృత్యమేకః కరిష్యతి | ధనీ చాశ్వత్థవృక్షేణ అశోకః శోకనాశనః || 24

రావిచెట్టు నాటిన ధనవంతు డగును. అశోకము - శోక నాశనము. జువ్వి - యజ్ఞము సమకూర్చును . 24

ప్లక్షో యజ్ఞప్రదః ప్రోక్తః క్షీరీ చాయుః ప్రదః స్మృతః | జంబుకీ కన్యకా దాత్రీ భార్యాదా దాడిమీ తథా || 25

అశ్వత్థో రోగనాశాయ పలాశో బ్రహ్మదస్తథా | ప్రేతత్వం జాయతే పుంపో రోపయేద్యో విభీతకమ్‌ || 26

అంకోలే కులవృద్దిస్తు ఖాదిరేణాప్యరోగితా | నింబప్రరోహకాణాం తు నిత్యం తుష్యేద్దివాకరః || 27

శ్రీ వృక్షే శంకరో దేవః పాటలాయాం తు పార్వతీ | శింశుపాయామాప్సరసః కుందే గంధర్వసత్తమాః || 28

తింతిడీకే దాసవర్గాం వంజులే దస్యవస్తథా | పుణ్యప్రదః శ్రీపదశ్చ చందనః పననస్తథా || 29

సౌభాగ్యదశ్చంపకశ్చ కరీరః పారదారికః | అపత్యనాశకస్తాలో వకులః కులవర్ధనః || 30

బహుభార్యా నారికేలా ద్రాక్షా సర్వంగసుందరీ | రతిప్రదా తథా కోలీ కేతకీ శత్రునాశినీ || 31

ఏవమాదినగాశ్చాన్యే యేనోక్తాన్తేపి దాయకాః | ప్రతిష్ఠాం తే గమిష్యంతి యైస్తు వృక్షాః ప్రరోపితాః || 32

ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే

వృక్షారోపణవిధిర్నామ అష్టావింశోధ్యాయః

క్షీరి ఆయుర్దాయ మిచ్చును. నేరేడు ఆడపిల్ల నిచ్చును. దానిమ్మ ఉత్తమ భార్య నిచ్చును. రాగి రోగము నశింపజేయును. పలాశము (మోదుగ) వేద సంపత్తి నిచ్చును. విభీతకము నాటిన ప్రేతత్వము గల్గును నరకమందును. అంకోలము = ఊడుగ - కులవృద్ధి చేయును. ఖదిరము = చండ్ర - రోగము పోగొట్టును. నింబము = వేప - సూర్య ప్రీతికరము. శ్రీవృక్షము =మారేడు - శంకర ప్రీతికరము. పాటల = కలిగొట్టు - పార్వతి ప్రీతికరము. శింశుపా=అగరు వలన అప్సర స్సమావేశము, కుందము = మొల్ల - గంధర్వ సమాగమము. తింతిడీకా = చింతదాస వర్గము (సేవకులు సమృద్దం). వంజులము - శత్రువులను దొంగలను గూర్చును. చందనము = మంచి గంధపు చెట్టు - ఐశ్వర్య ప్రదము పుణ్య ప్రదము చంపకము, సంపెంగ - సౌభాగ్య ప్రదము . కరీరము = వెదురు - పరస్త్రీ సంగమము కూర్చును. తాడిచెట్టు - సంతాన నాశము వకులము = కులవర్ధకము పొగడ - కుల వర్ధనము. నారికేళము (కొబ్బరి) - బహు భార్యలను గూర్చును. ద్రాక్ష - సర్వాంగ సుందరి భార్యయగును. కోలి = బదరి = రేగు - రతిప్రద. కేతకి = వెలుగలి - శత్రునాశనము సేయును. ఈలా చెట్లింకనెన్నో నాట వలసినవి. వానిని ప్రతిష్ఠించినవారు మంచి ప్రతిష్ఠ నందుదురు.

ఇది వృక్షారోపణ విధియను నిరువది యెనిమిదవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters