Sri Padma Mahapuranam-I    Chapters   

అష్టోదశోధ్యాయ

భీష్మ ఉవాచ :-

అత్యద్భుత మిదం బ్రహ్మన్‌? శ్రుతవా నస్మి తత్త్వతః | అభిషేకం తు గాయత్ర్యాః సదస్యత్ర తథా కృతమ్‌ || 1

విరోధం చైవ సావిత్ర్యా శాపదానం తథా కృతమ్‌ | విష్ణువా చ యథా దేవీ సర్వ స్థానేషు కీర్తితా || 2

గాయత్రీ చాపి రుద్రేణ స్తుతా చ వరవర్ణినీ | తం శ్రుత్వా ప్రతి మాత్మానాం విస్తరేణ పితామహమ్‌ || 3

ప్రహృష్టాని చ రోమాణి ప్రశాంతం చ మనో మమ | శ్రుత్వ్రా మే పరమా ప్రీతిః కౌతూహల మథైవ హి || 4

నారాయణస్తు భగవాన్‌ కృత్వా తాం పరమాం చ పై | బ్రహ్మ పత్న్యాః స్తుతిం భక్త్యా న్యస్యతాం పర్వతోపరి || 5

ఉవాచ వచనం విష్ణు స్తుష్టి పుష్టి ప్రదాయకమ్‌ | శ్రీమతీ హ్రీమతీ చైవ యా చ దేవీశ్వరీ తథా || 6

ఏత దేవ శ్రుతం బ్రహ్మం స్తవ వక్త్రా ద్వినిస్సృతమ్‌ | ఉత్తరం తత్ర యద్భూతం యచ్చ తస్మిని స్థలే కృతమ్‌ || 7

ఆనుపూర్వ్యా చ తత్సర్వం భగవాన్‌ వక్తుమర్హతి | శ్రుతేన మే దేహ శుద్ధి ర్భవిష్యతి న సంశయః || 8

బ్రహ్మకృతయజ్ఞ వైభవమ్‌

భీష్ము డనియె :

విప్రోత్తమా ! గాయత్రి యభిషేకము యజ్ఞ సదస్సు నందు జరిగినది విన్నాను. సావిత్రి విరోధము. పశా మిచ్చుట, రుద్రు డామెను స్తుతించుట, సాటి లేని బ్రహ్మను గూర్చి విని, నా మేను గగుర్పొడిచినది. అప్పుడు గాయత్రి అన్ని స్థానము లందు విష్ణువుచే పొగడ బడినది. భగవంతుడు నారాయణు డామెను పరమోన్నత స్థాయి నునిచి భక్తితో స్తుతించి పర్వత శిఖర మందుంచి తుష్టిని పుష్టిని సమకూర్చు మాట నిట్లు శ్రీమతి హ్రీమతి ఈశ్వరియు దేవి ! నీవే యని పలికెనంటిరి పర్వత శిఖర మందుంచి తుష్టిని సమకూర్చు మాట నిట్లు శ్రీమతి హ్రీమతి ఈశ్వరియు దేవి ! నీవే యని పలికెనంటిరి విని ధన్యుడనైతిని. ఆ తరువాతి కథ యానతిమ్ము. వినిన నా దేహము పరిశుద్ధ మగును. అన పులస్త్యు డనియె. 8

పులస్త్య ఉవాచ : -

యజతః పుష్కరే తస్య దేవస్య పరమేష్ఠినః | శృణు రాజ? న్నిదం పూర్వ మేవ యథాకృతమ్‌ || 9

ఆదౌ కృతయుగే తస్మి న్యజమానే పితామహే | మరీచి రంగిరా శ్చైవ పులస్త్య: పులహః క్రతుః || 10

దక్షః ప్రజాపతి శ్చైవ నమస్కారం ప్రచక్రిరే | విద్యోతమానాః పురుషాః సర్వాభరణభూషితాః || 11

ఉపనృత్యంతి దేవేశం విష్ణు మప్సరసాం గణాః | తతో గంధర్వ తూర్యైస్తు ప్రతినంద్య విహాయసి || 12

బహుభిస్సహగంధ ర్వైః ప్రగాయతి చ తుంబురుః | మహా శ్రుతి శ్చిత్రసేన ఊర్ణాయు రసఘస్తదాః || 13

గోమాయుః సూర్య వర్చాశ్చ సోమ వర్చాశ్చ కౌరవ ! | యుగపచ్చ తృణాయుశ్చ నంది శ్చిత్రరథ స్తథా || 14

త్రయోదశః శాలిశిరాః పర్జన్యశ్చ చతుర్దశః | కలిః పంచదశ శ్చాత్ర తారకశ్చాపిషోడశః || 15

హాహా హూహూశ్చ గంధర్వో హంసశ్చైవ మహాద్యుతిః || ఇత్యేతే దేవ గంధర్వా ఉపగాయంతి తే విభుమ్‌ || 16

తథైవాప్సరసో దివ్యా ఉపనృత్యంతి తం విభుమ్‌ | ధాతార్యమా చ సవితా వరుణోశో భగస్తథా || 17

ఇంద్రో వివస్వాన్‌ పూషా చ త్వష్టా పర్జన్య ఏవ చ | ఇత్యేతే ద్వాదశాదిత్యా జ్వలంతో దీప్త తేజసః || 18

చక్రు రస్మిన్‌ సురేశాశ్చ నమస్కారం పితామహే || మృగవ్యాధశ్చ శర్వ శ్చ నిర్‌రృతిశ్చ మహాయశాః || 19

అజైకపా దహిర్బుధ్న్యః పినాకీ చాపరాజితః | భవో విశ్వేశ్వర శ్చైవ కపర్దీ చ విశాంపతే || 20

స్థాణు ర్భగశ్చ భగవాన్‌ రుద్ర స్తత్రావతస్థితే | అశ్వినౌ వసవ శ్చాష్టౌమరుతశ్చ మహాబలాః || 21

విశ్వే దేవా శ్చ సాధ్యాశ్చ తసై#్మ ప్రాంజాలయః స్థితాః | శేషాద్యాస్తు మహానాగా వాసుకి ప్రముఖాహయః || 22

కాశ్యపఃకంబలశ్చాపితక్షకశ్చ మహాబలః | ఏతే నాగా మహాత్మాన స్తసై#్మ ప్రాంజలయః స్థితాః || 23

తార్ష్యశ్చారిష్టనేమిశ్చ గరుడశ్చ మహాబలః | వారుణిశ్చైవారుణిశ్చ వైనతేయా వ్యవస్థితాః || 24

నారాయణశ్చ భగవాన్‌ స్వయ మాగత్య లోకవాన్‌ | ప్రాహలోక గురుం శ్రీమా న్సహ సర్వై ర్మహర్షిభిః || 25

యజ్ఞ వైభవము

ఆ పైనా యజ్ఞము సేయు చున్న యాజమాని బ్రహ్మ సేసిన యద్భుతము విను. కృతయుగము మొదట జరిగిన యీ యజ్ఞమునకు మరీచి మొదలు దక్ష ప్రజాపతి వరకు గల మహర్షు లా ప్రజాపతికి నమస్కరించిరి. ఆట విష్ణువు వెంట అప్సరసలు నాట్య మాడిరి. గంధర్వు లాకాశమును వీణా వేణు మృదంగాది వాద్యములతో విష్ణువునకు వంత వాడిరి. ఆ యా గంధర్వులు, తుంబురుడు మొదలు హంసుడు దాక పదునెనమండుగురు పేర్కొనబడినారు. అప్సరస లా ప్రభువు వెంట నాడిరి. ధాత మొదలు పర్జన్యుని దాక పేర్కొన బడిన ద్వాదశాదిత్యులు తేజోమూర్తు లుద్దీపించుచు సురేశ్వరులు పితామహునకు నమస్కార మొనరించిరి. మృగనాధుడు మొదలుగ రుద్రుని దాక గల ఏకాదశ రుద్రులు నట సదస్యులైరి. అశ్వినులు వసువులు ఎనమండుగురు మరుత్తులేడుగురు. విశ్వదేవులు సాధ్యులు నాయన ముందు దోసిలి లొగ్గి నిలిచిరి. తార్ష్యుడు మొదలుగ గలవారు వినత కొడుకులు వైనతేయులు అట సమావేశ మైరి. భగవంతుడు శ్రీమంతుడు నారాయణుడు స్వయముగ వచ్చి భక్తలోకముతో మహర్షులతో వచ్చి లోక గురునితో నిట్లనియె. 25

నారాయణకృత బ్రహ్మస్తుతి

త్వయా తత మిదం సర్వం త్వయా సృష్టం జగత్పతే | తస్మాల్లోకేశ్వర శ్చాసి పద్మయోనే ! నమోస్తు తే || 26

యదత్ర తే మయా కార్యం కర్తవ్యం చ తదాదిశ | ఏవం ప్రోవాచ భగవాన్‌ సార్ధం దేవర్షిభిః ప్రభుః || 27

నమస్కృత్య సురేశాయ బ్రహ్మణవ్యక్త జన్మనే | స చ తత్రాస్ధితో బ్రహ్మా తేజసా భాసయన్‌ దిశః || 28

శ్రీవత్స లోమ సంఛన్నో హేమసూత్రేణ రాజతా | సురర్షి ప్రతిమః శ్రీమాన్‌ స్వయం భూ ర్భూత భావనః || 29

శుచిరోమా మహావక్షాః సర్వతేజో మయః ప్రభుః యా గతిః పుణ్య శీలా నాం యా గతిః పుణ్య కర్మణామ్‌ || 30

యోగ సిద్ధా మహాత్మానో యం విదు ర్లోక ముత్తమమ్‌ || యస్యాష్ట గుణ మైశ్వర్యం యమాహుర్దేవ సత్తమమ్‌ || 31

యం ప్రాప్య శాశ్వతం విప్రాః నియతా మోక్ష కాంక్షిణః | జన్మనో మరణా చ్చైవ ముచ్యంతే యోగ భావితాః || 32

య దేత త్తప ఇత్యాహుః సర్వాశ్రమనివాసినః | సేవం సేవం యతాహారా దుశ్చరం తప ఆస్థితాః || 33

యోనంత ఇతి నాగేషు ప్రోచ్యతే సర్వ యోగిభిః | సహస్రమూర్ధా రక్తాక్షః శేషాదిభి రనుత్తమైః || 34

యో యజ్ఞ ఇతి విపేంద్రై రిజ్యతే స్వర్గ లిప్సుభిః | నానాస్థాన గతిః శ్రీమానేకః కవి రనుత్తమః || 35

యదేవం వేత్తి వేత్తారం యజ్ఞభాగ ప్రదాయినమ్‌ | వృషాగ్ని సూర్య చంద్రాక్షం దేవ మాకాశ విగ్రహమ్‌ || 36

తం ప్రపద్యామహే దేవం భగవన్‌ ! శరణార్థినః | శరణ్యం శరణం దేవం సర్వ దేవ భనవోద్భవమ్‌ || 37

ఋషీణాం చైవ స్రష్టారం లోకానం చ సురేశ్వరమ్‌ | ప్రియార్థం చైవ దేవానాం సర్వస్య జగతః స్థితా || 38

కవ్యం పితౄణా ముచితం సురాణాం హవ్య ముత్తమమ్‌ | యేన ప్రవర్తితం సర్వం తం నతాః స్మః సురోత్తమమ్‌ || 39

ప్రేతాగ్నినా తు యజతా దేవేన పరిమేష్ఠినా | యథా సృష్టిః కృతా పూర్వం యజ్ఞ సృష్టిన్తథా పునః || 40

నారాయణ కృత బ్రహ్మ స్తుతి

జగత్పతీ ! నీచే నిది యెల్ల విస్తృత మైనది. సృష్టించబడినది. అందుచే నీవు లోకేశ్వరుడ వైతివి. తమ్మిచూలీ ! నీకు నమస్కారము. ఇట నే జేయ వలసిన పని యానతిమ్ము. ఇట్లు దేవర్షులతో భగవంతుడు విష్ణుప్రభువు బ్రహ్మకు నమస్కరించి విన్నవించెను. బ్రహ్మయు తన తేజస్సుచే దెస లనెల్ల భాసింప జేయుచు శ్రీవత్స చిహ్న రోమములం గప్పువడి బంగారు యజ్ఞ సూత్రముతో (జందెముతో) రాజిల్లుచు సర్వభూత భావితుడై దేవర్షి ప్రతినిధియై శ్రీమంతుడే స్వయంభువు శుచియైన రోమకళ తోడి విశాలవక్షస్సుతో సర్వ తేజోమయుడైన ప్రభువట్టి యజమాని స్థానమున తేజరిల్లుచు శాశ్వతుని నిన్నాశ్రయించి విప్రులు నియమ వంతులై ముముక్షువులై యోగభావన గొని జన్మ మరణ విముక్తి నందు చున్నారు. పుణ్యశీలురకు పుణ్యకర్ములకు దిక్కెవ్వడు? యోగ సిద్దులు మహాత్ము లెవ్వని నుత్తమ లోకమని తెలియుదురు. ఎవ్వని యైశ్వర్య మెనిమిది అణిమాదిసిద్దిరూపముల సర్వాశ్రమ వాసులు బ్రహ్మచారి మొదలగువారు తపస్సు అనుపేర నాహారాది నియమములను పాటించి భరింపరాని తపస్సు చేసి సాధించు ఫలమేని రూపమందుదురు? యోగులెల్లరు సర్వోత్తములగు నాదిశేషుడు మొదలగు వారిచే వేయి తలలు (పడగలు) వేయి కన్నులు గలవాడు అనంతుడని స్తుతియింప బడును. స్వర్గము కోరి విప్రోత్తము లెవ్వని యజ్ఞ పురుషు డని యజింప బడును? ఎల్లస్థానములకు గతి యైన సర్వోత్తముడొక్కడే శ్రీమంతుడు కవియనబడును. ఏదేవుని వేత్త యజ్ఞ భాగ ప్రదాత, వృషము, అగ్ని, సూర్యుడు, చంద్రుడును, కన్నులు గల వానిని, ఆకాశమూర్తిగా గల వానిని, విన్న సర్వదేవతా స్పూర్తికి మూలమైన వావిని, ఋషి లోకమునకు స్రష్టయైన వానిని దేవేశ్వరుని యొక్క స్థితికి పితృదేవతలకు, హవ్యము నెల్ల యే దేవునిచే ఏర్పరుపబడినది ? ఆ దేవుని దేవోత్తమునికి ప్రణతుల మగుచున్నాము. త్రేతాగ్నిచే యజించి పరమేష్ఠిచే మున్ను సృష్టి కావింప బడినది. అట్లే మరల యజ్ఞము సృష్టింప బడినది. అని విష్ణువు స్తుతికిస్వస్తి పలికెను. 40

బ్రహ్మణః యజ్ఞశాలాప్రవేశః

తథా బ్రహ్మాప్యనంతేన లోకానాం స్ధితికారిణా | అన్వాస్యమానో భగవాన్‌ వృద్ధోప్యథ చ బుద్ధిమాన్‌ || 41

యజ్ఞవాట మచింత్యాత్మా గత స్తత్ర పితామహః | ధనాఢ్యైః ఋత్విజైః పూర్ణం సదసై#్యః పరిపాలితమ్‌ || 42

గృహీత చాపేన తథా విష్ణునా ప్రభవిష్ణునా | దైత్య దానవ రాజానో రాక్షసానాం గణాఃస్థితా || 43

బ్రహ్మ యజ్ఞశాల ప్రవేశము

అట్లు జగత్తు స్థితి కారుడైన అనంతునిచే (విష్ణువు) అన్వాసింపబడి (ఆరాధింప బడి) భగవంతుడు బ్రహ్మదేవుడు వృద్దుడయ్యు బుద్ధిమంతుడు మనస్సున కందని వాడు యజ్ఱ వాటమున కేతెంచెను. ధన సంపన్నులు, ఋత్విజులతో నిండినది, సదస్యులచే రక్షణ యీయబడుచున్నది. సర్వ సమర్థుడు విష్ణువు విల్లు చేకొని ప్రధాన రక్షకుడుగా నట నిలిచెను. దైత్య దానవ రాజులు రాక్షస గుంపు లట వచ్చి నిలిచిరి. 43

ఆత్మాన మాత్మనా చైవ చింతాయామాస వై ద్రుతమ్‌ | చింతయిత్వా యథా తత్త్వం యజ్ఞం యజ్ఞః సనాతనః || 44

వరణం తత్ర భగవాన్‌ కారయామాస ఋత్విజాన్‌ || భృగ్వాద్యా ఋత్విజ శ్చాపి యజ్ఞకర్మ విచక్షణాః || 45

చక్రుశ్చ ఋషి ముఖ్యైశ్చ ప్రోక్తం పుణ్యం యధాక్షరమ్‌ | శుశ్రువు స్తేమునిశ్రేష్ఠా వితతే తత్ర కర్మణి || 46

యజ్ఞ విద్యా వేద విద్యా పదక్రమ విదాం తథా | ఘోషేణ పరమర్షీణాం సా బభూవ నినాదినా || 47

యజ్ఞ సంస్తరవిద్భిశ్చ శిక్షా విద్భి స్తదా ద్విజైః శబ్దనిర్వచనార్ధజ్ఞైః సర్వవిద్యా విశారదై ః 48

మీమాంసా హేతువాక్యజ్ఞైః కృతా నానావిధేమఖే | తత్ర తత్రచ రాజేంద్ర ! నియతాన్‌ సంశితవ్రతాన్‌ || 49

జప హోమ పరాన్‌ ముఖ్యాన్‌ దదృశు స్తత్ర వై ద్విజాన్‌ | యజ్ఞ భూమౌ స్థిత స్తస్యాం బ్రహ్మా లోక పితామహః 50

యజ్ఞప్రయోగ వైభవము

బ్రహ్మ తనను దా సత్త్వరముభావించి కొనెను. సనాతనుడు యజ్ఞ పురుషుడు యజ్ఞమును యథా స్వరూపముగ భావించి, భగవంతు డట ఋత్వి గ్వరణము కావించెను. యజ్ఞకర్మయందు విచక్షణజ్ఞానము గలవారు భృగ్వాదులు ''బహ్వృచముఖ్యైశ్చ'' అని పాఠాంతరము. అప్పుడు ఋగ్వేదపారగులు చెప్పిన ప్రతి యక్షరము అని యర్థము. ఋషులు సెప్పిన ప్రతి యక్షరము పుణ్య మాచరించిరి. సువిస్తారమైన యా కర్మ యం దందరు మునులు విని యానందించిరి. అట సంహితయే కాక పదము నెఱింగినవారి యజ్ఞవిద్య(శ్రౌతము) వేదవిద్య (ఆధ్యయనము) యొక్క ఘోషతో యజ్ఞశాల ప్రతిధ్వను లీనెను. యజ్ఞ సంస్తర మెఱిగిన వారు (శ్రౌతులు) శిక్ష ప్రయోగ (యజ్ఞాంగము లాఱింటిలో మొదటిది. శబ్దము, వ్యాకరణము నిర్వచనము, నిరుక్త-ఛందస్సు-జ్యోతిషము-కల్పము అను వేదాంగము లాఱు తెలిసిన వారు పూర్వ మీమాంస విషయము) హేతువాక్యము (తర్కము) తెలిసిన వారిచే నానా విధముల యథా విధి జరుపబడు నా యజ్ఞ మందు నియమవంతులు వ్రతనిష్ఠులు నై యజ్ఞశాల యందు జపములను హోమములును నిర్వహించు ద్విజముఖ్యుల నటనిల్పి బ్రహ్మ తిలకించెను. 50

సురాసుర గురుఃశ్రీమాన్‌ సేవమానః సురాసురైః | ఉపాసతే చ తత్రైనం ప్రజానాం పతయః ప్రభుమ్‌ || 51

దక్షో వశిష్ఠః పులహో మరీచిశ్చ ద్విజోత్తమః | అంగిరా భృగు రత్రిశ్చ గౌతమో నారద స్తథా || 52

విద్యమాన మంతరిక్షం వాయు స్తేజో జలం మహీ ! శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గంధ స్త దైవచ || 53

వికృత శ్చావికారశ్చ యచ్చాన్య త్కారణం మహత్‌ | ఋగ్యజు స్సామాధర్వాఖ్యా వేదా శ్చత్వార ఏవ చ || 54

శబ్ధః శిక్షా నిరుక్తం చ కల్పశ్ఛందాః సమన్వితాః | ఆయుర్వేద ధనుర్వేదౌ మీమాంసా గణితం తథా || 55

హస్త్యశ్వ జ్ఞాన సహితా ఇతిహాస సమన్వితాః | ఏతై రంగై రుపాంగైశ్చ వేదాః సర్వే విభూషితాః || 56

ఉపాసతే మహాత్మానం సహోంకారం పితామహమ్‌ | తపశ్చ క్రతమ శ్చైవ సంకల్పః ప్రాణ ఏవచ || 57

అట సురాసుర గురు ని, శ్రీమంతుని, ప్రభువు నుపాసించుచున్నవారు ప్రజాపతులు దక్షాదులు విశిష్ఠాది మహర్షులు మహ త్తత్వము-పంచ భూతాలు వరుసగా అంతరిక్షము, వాయువు, తేజస్సు, జలము, ప్రకాశోదకము, (ఆపస్సు) మహి, (భూమి) పంచతన్మాత్రలు, వరుసగా శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, వాని వికారము, అవికారము, మఱియుంగల కారణము మహ త్తత్వము. ఋగాదులు నాల్గు వేదములు; ఆయుర్వేదము, ధనుర్వేదము, గణితము, వేదాంగము లారింటిలో నిది జ్యోతిషము, గజశాస్త్రము, అర్ధశాస్త్రము, ఇతిహాసము, పురాణము, నను అష్టాదశ (18) విద్యలు, సాంగోపాంగముగ, సాకారములై యలంకరించి కొని వచ్చి ప్రణవము తో (ఓంకారముతో) గూడ మూర్తీభవించియున్న చతుర్ముఖుని (నాలుగు వేదములు నాల్గు ముఖములుగా రూపొందించినవానిని) ఉపాసించుచుండెను. 57

ఏతే చాన్యే చ బహవః పితామహ ముపస్థితాః ! అర్ధో ధర్మశ్చ కామశ్చ ద్వేషో హర్షశ్చ సర్వదా || 58

శుక్రో బృహస్పతి శ్చైవ సంవర్తో బుధ ఏవ చ | శ##నైశ్చరశ్చ రాహుశ్చ గ్రహాః సర్వే తథైవ చ || 59

మరుతో విశ్వకర్మా చ పితర శ్చాపి భారత ! దివాకరశ్చ సోమశ్చ బ్రహ్మాణం పర్యుపాసతే || 60

తపస్సు క్రతువులు సంకల్పము ప్రాణము మొదలగు నవి పెక్కులు పితామహు నుపాసించు చుండెను. ధర్మము, అర్థము, కామము నను పురుషార్థములు ద్వేషము హర్షము శుక్రుడు, బృహస్పలి సంవర్తుడు బుధుడు శని రాహువు మొదలగు నన్ని గ్రహములు(మరుత్తులు) విశ్వకర్మ పితరులు. దివాకరుడు (సూర్యుడు) సోముడు, (చంద్రుడు) బ్రహ్మ నారాధించు చుండిరి. 60

గాయత్రీ దుర్గ తరణీ వాణీ సప్తవిధా తథా | అక్షరాణి చ సర్వాణి నక్షత్రాణి తథైవ చ || 61

భాష్యాణి సర్వ శాస్త్రాణి దేహవంతి విశాంపతే | క్షణా లవా ముహూర్తాశ్చ దినం రాత్రి స్తథైవ చ || 62

అర్ధమాసాశ్చ మాసాశ్చ క్రతవః సర్వ ఏవ చ|| ఉపాసతే మహాత్మానం బ్రహ్మాణం దైవతైః సహ || 63

అన్యాశ్చ దేవ్యః ప్రవరా హ్రీః కీర్తి ర్ద్యుతి రేవ చ | ప్రభా ధృతిః క్షమా భూతి ర్నీతి ర్విద్యా మతి స్తథా || 64

శ్రుతిః స్మృతి స్థథా క్షాంతిః శాంతిః పుష్టి స్తధా క్రియా | సర్వశ్చాప్సరసో దివ్యా నృత్య గీత విశారదాః || 65

ఉపతిష్ఠంతి బ్రహ్మాణం సర్వా స్తా దేవమాతరః | విప్రచిత్తిః శిబిః శంకు రయ శ్శంకు స్తథైవ చ || 66

వేగవా న్కేతుమా నుగ్రః సోగ్రో వ్యగ్రో మహాసురః | పరిఘః పుష్కరశ్చైవ సాంబో శ్వవతి రేవ చ|| 67

ప్రహ్లాదోథ బలిః కుంభః సంహ్రాదో గగనప్రియః | అసుహ్రాదో హరి హరౌ వరాహశ్చ కుశో రజః || 68

యోనిభక్షో వృషవర్వా లింగోభక్షోథ వై కురుః | నిఃవృభః సప్రభః శ్రీమాంస్తధైవ చ నిరూదరాః || 69

ఏక చక్రో మహా చక్రో ద్విచక్రః కుల సంభవః | శరభః శలభ##శ్చైవ క్రపథః క్రాపథః క్రథః || 70

బృహ ద్వాంతిః మహాజిహ్వః శంకుకర్ణో మహాధ్వనిః | దీర్ఘ జివ్వోర్కనయనో మృడకాయో మృడప్రియః ||71

వాయు ర్గరిష్ఠో నముచి శ్శంబరో విజ్వరో విభుః విష్వక్సేన శ్చంద్రహర్తా క్రోధవర్ధన ఏవ చ || 72

కాలకః కలకాంతశ్చ కుండదః సమరప్రియః | గరిష్ఠశ్చ వరిష్టశ్చ ప్రలంబో నరకః ప్రభుః || 73

ఇంద్రతాపన వాతాపి కేతుమా న్బల దార్పితః | ఆసిలోమా సులోమా చ బాష్కలిః ప్రమదో మదః || 74

సృగాల వదనశ్చైవ కేళీ చ శరద న్తధా | ఏకాక్ష శ్చైవ రాహుశ్చ వృతః క్రోధ విమోక్షణః || 75

ఏతే చాన్యే చ బహవో దానవా బల దర్పితాః | బ్రహ్మాణం పర్యుపానంత వాక్యం చేద మధోచిరే || 76

గాయత్రీ దుర్గతరణి (దుర్గ) (రూపకభాష) ఏడు విధములైన వాణి :- అక్షరములన్ని నక్షత్రాలు, భాష్యములు సర్వశాస్త్రముల దేహమూని (మూర్తిభవించి) క్షణములు, లవలు, మాసములు, సర్వ క్రతువులు మహానుభావుని, దేవతలతో గూడ సేవించుచుండెను. మఱియు గల దేవీ ప్రవరలు హ్రీ మొదలు క్రియ దాక నృత్య గీత విశారద లందరు దివ్యాప్సరసలు, దేవమాతలు, విప్రచిత్తి మొదలు క్రోధ విమోక్షణుడు అను వాని దాక పేర్కొన బడిన దానవులు మఱి పెక్కు మంది బ్రహ్మ దేవు నుపాసించు చుండిరి. బ్రహ్మను గూర్చి వీరెల్ల రు గలిసి ఇట్లు మాట పల్కిరి.

బ్రహ్మసదస్యానాంవచనమ్‌

త్వయా సృష్టాః స్మ భగవన్‌! త్రైలోక్యం భవతా హి నః | దత్తం సురవరశ్రేష్ఠ! దేవే

భ్య శ్చాధికాః కృతాః || 77

భగవ ! న్నిహ కిం కుర్మో యజ్ఞే తవ పితామహ ! యద్ధితం తద్వదాస్మాకం సమర్ధాః కార్యనిర్ణయే || 78

కిమేభి స్తే వరాకైశ్చ ఆదితే ర్గర్భ సంభ##వైః | దేవతై ర్నిహ తైః సర్వేః పరాభూతైశ్చ సర్వదా || 79

పితామహోసి సర్వేషా మస్మాకం దైవతైః సహ | తవ యజ్ఞ సమాప్తౌ చ పున రస్మాసు దైవతైః || 80

శ్రియం ప్రతి విరోధశ్చ భవిష్యతి న సంశయః | ఇదానీం ప్రేక్షణం కుర్మః సంహితాః సర్వా దానవైః || 81

బ్రహ్మసదస్యుల సంభాషణము

భగవంతుడా ! తమచే మేము త్రైలోక్యములు సృష్టింపబడినాము గదా! దేవతలకు ముల్లోక మీయబడినది. వారు పెద్ద సేయ బడి నారు. (పెద్ద పీట) వారికిట్ల నీ జన్నమున మే మేమి సేయవలయును? నీకేది యిష్టము సురవరుల పెద్దవు. ఆదితి కడుపున గల్గిన అందరిచే దెబ్బ తిని అవమానము పాలైన యీ చిల్లి గవ్వలతో దైవతములతో నీకేమి పని ? మాకు దేవతలతో సహా మాకందరకు ముత్తాతవు. నీ యజ్ఞము ముగిసి నంత తిఱిగి దేవతలతో సంపదను గూర్చి తగవు కా గలదు. శంక వలదు. దానవులందరితో నిపుడు నిరీక్షించు చున్నాము.

పులస్త్య ఉవాచ :-

సగర్వం తు వచ స్తేషాం శ్రుత్వా దేవో జనార్దనః | శ##క్రేణ సహితః శంభు మిద మాహా మహాయశా || 82

విఘ్నం ప్రకర్తుం పై రుద్ర! అయాతా దనుపుంగవాః | బ్రహ్మణా మంత్రితా శ్చేహ విఘ్నార్థం ప్రయతంతి తే || 83

అస్మాభిస్తు క్షమా యావ ద్వజ్ఞః సమాప్యతే | సమాప్తే తు క్రతా వస్మిన్‌ యుద్ధం కార్యం దివౌకసామ్‌ || 84

యథా నిర్ధానవా భూమి స్థథా కార్యాం త్వయా విభోః జయార్థం చేహ శక్రస్య భవతా చ మయా సహః 85

ద్విజానాం పరివేష్టారో మరుతః పరికల్పితాః | దానవానాం ధనం యచ్చ గృహీత్వా తద్యజామహే || 86

అత్రాగతేషు విప్రేషు దుఃఖితేషు జనేష్విహ | వ్యయం తస్య కరిష్యామో దాస భావే నివేశితాః || 87

వదంత మేవ తం విష్ణుం బ్రహ్మా వచన మబ్రవీత్‌ | ఏతే దనుసుతాః క్రుద్థాః యుష్మాకమోపనోత్సుకాః || 88

భవతా చక్షమా కార్యా రుద్రేణ సహ దేవతైః | కృతే యుగావసానే తు సమాప్తిం చ క్రతౌ గతే || 89

మయా చ ప్రేషితా యూయ మేతే చ దను పుంగవాః | సంధిర్వా విగ్రహో వాపి సర్వైః కార్య స్తదైవ హి || 90

పులస్త్యు డనియె :

గర్వ మెక్కి వారాడిన మాటలు విని పెద్ద పేరుగలవాడు జనార్దన దేవు డింద్రునితో గలిసి శంభుని గూర్చి యిట్లనియె: రుద్రా! దను పుంగవులు (ఎట్లో) విఘ్నము సేయ వచ్చినారు. వాండ్రు బ్రహ్మతో నాలోచించి విఘ్నము కొఱకు యత్నింతురు. మనము మాత్రము యజ్ఞసమాప్తి దాక ఓరిపి పట్టవలెను. క్రతువు ముగింపున దేవతలు పోరాడవచ్చు. ఇంద్రుని గెలుపు కొఱకు నీవు నేను గలిసి పోరాడక తప్పదు. ఇంద్రుని గెలుపు కొరకిట బ్రాహ్మణులు పరివేష్టలుగా మరత్తులు కల్పింప బడిరి. దానవుల సొమ్మది చేకొని యిట యజింతము. ఇట కేతెంచిన విప్రులకు దుఃఖాల పాలైన వారి కేది ఖర్చు సేయుద మిట దాస భావములో (నౌకరీలో) నిలుప బడినాము. కనుక ఇట్లు మాటాడుచున్న యా విష్ణుని గూర్చి బ్రహ్మ యిట్లనెను. ఈ దనుజులు కోపమెత్తి యున్నారు. మనలను బరిమార్ప నుత్సహించు చున్నారు. రుద్రునితో దేవతలతో నోరిమి పట్ట వలయును. కృతయుగము చివర క్రతువు సమాప్తి యైనంత మీరూ నేనూ ఈ రాక్షసులు సంధి గాని పోరు గాని యెడంబడిక యప్పుడు సేసికో వలయు ననెను. 90

పులస్త్య ఉవాచ:

పున స్తాన్‌ దానవాన్‌ బ్రహ్మా వాక్య మాహ స్వయం ప్రభుః | దాన వైర్నవిరోధో త్రయజ్ఞే మమ కథంచన || 91

మైత్ర భావ స్థితా యూయ మస్మత్కార్యే చ నిత్యశః |

దానవా ఊచు ః

సర్వ మేత త్కరిష్యామః శాసనం తే పితామహ ! || 92

అస్మాక మనుజా దేవా భయం తేషాం న విద్యతే |

ఏత చ్ఛృత్వ తదా తేషాం పరితుష్టః పితామహః || 93

అంతట మఱి ప్రభువు బ్రహ్మ స్వయంగా దానవులం గూర్చి యిట్లనెను. ఈ నా యీ యజ్ఞమందు దానవులతో విరోధ మెట్లు నుంగదు. మీ రెప్పుడు నా పనిలో మిత్ర భావముతో నే యున్నారు గదా యనెను. దానవులు పెత్తాతా ! నా యాన యిది యెల్ల సేసెదము. దేవులు మా తమ్ములు వారి కేభయము లేదనిరి. వారిని విని బ్రహ్మ సంతుష్టుడయ్యెను.

యజ్ఞారంభమ్‌

ముహూర్తం తిష్ఠతాం తేషాం ఋషికోటి రుపాగతా | శ్రుత్వా పైతామహం యజ్ఞం తేషాం పూజాం తు కేశవః || 94

ఆసనాని దదౌ తేషాం తథా దేవః పినాకధృత్‌ | వశిష్ఠోర్ఘం దదౌ తేషాం బ్రహ్మణా పరిచోదితః || 95

గా మర్ఘం చ తతో దత్వా పృష్ఠ్వా కుశల మవ్యయమ్‌ | నివేశం పుష్కరే దత్వా స్థేయతా ­ుతిచా బృ­dత్‌ || 96

-:యజ్ఞారంభము:-

ముహూర్త మాట నట్లుండ యజ్ఞవార్త విని యటకు ఋషికోటి వచ్చెను. కేశవుడు వారిని పూజించెను. పినాకపాణి (శివుడు) వారి కాసనములు వేసెను. బ్రహ్మ ప్రేరణ వశిష్ఠు డర్ఘ్య మిచ్చెను. ఆపై పినాకపాణి (శివుడు) యేతెంచెను. వశిష్ఠు డర్ఘ్య మిచ్చెను. బ్రహ్మ ప్రేరణ గోవును అర్ధమును పూజ నొసగి కుశల ప్రశ్న నేసి పుష్కరమందునికి యేర్పరచి కూర్చుండమనెను.

తత స్త ఋషయ స్సర్వే జటాజిన ధరా స్తదా | శోభయంత స్సరః శ్శ్రేష్ఠం గంగా మివ దివౌకసః || 97

ముండాః కాషాయిణశ్చైకే దీర్ఘశ్మశ్రు ధరాః పరే | విరవైర్దశ##నైః కేచిత్‌ చ్చిపిటాక్షా స్తదా పరే || 98

బృహ త్తనూ ధరాః కేపి కేకరాక్షా స్తదావరే | దీర్ఘ కర్ణా వికర్ణాశ్చ కర్ణైశ్చ త్రుటితా స్తథా || 99

దీర్ఘపాలా విపాలాశ్చ స్నాయు చర్మావగుంఠితాః | నిర్గతం చోదరం తేషాం మునీనాం భావితాత్మనామ్‌ || 100

దృష్ట్వా తు పుష్కరం తీర్థ దీప్యనూనం సమంతతః | తీర్థ లోభా న్నర వ్యాఘ్ర తస్య తీరే వ్యవస్థితాః || 101

వాలఖిల్యా మహాత్మానో హ్యశ్మకుట్టా స్తథాపరే | దంతోలూఖలిన శ్చాన్యే సంప్రక్షాలా స్త థాపరే || 102

వాయు భక్షా జలాహారా పర్ణాహారా స్తథాపరే | నానా నియమ యుక్తాశ్చ తథా స్థండిల శాయినః || 103

సరస్యస్మిన్‌ ముఖం దృష్ట్వా సురూపాస్యాః క్షణా దభుః | కిమేత దితి చింత్యాధ నిరీక్ష్య చ పరస్పరమ్‌ || 104

అస్మిన్‌ తీర్థే దర్శనేన ముఖ స్యేహ సురూపతా | ముఖ దర్శన మిత్యేవ నామ కృత్వాతు తపసాః || 105

స్నాతా నియమ యుక్తాశ్చ సురూపా స్తే తదాభవన్‌ | దేవ పుత్రోపమా జాతా అనౌపమ్య గుణాన్వితాః ||106

శోభమానా నరశ్రేష్ఠ ! స్థితాః సర్వే పనౌకసః | యజ్ఞోపవీత మాత్రేణ వ్యభజం స్తీర్థ మంజసా || 107

అంతట ఆ ఋషులందరు జటాజనధారులై గంగానదిని దేవతల వలె ఆ ఉత్తమ సరస్సును శోభింప జేసిరి. వారిలో కొందరు క్షవరము చేసుకొనినవారు, కొందరు కాషాయ వస్త్రధారులు కొందరు పొడవు మీసములు కలవారు. కొందరు విశాలనేత్రులు, కొందరు చిన్నకనులు కలవారు, దీర్ఘశరీరులు. లంబోదరులు కొందరు కేక రాక్షులు, దీర్ఘకర్ణులు, వికర్ణులు, కొందరు త్రుటిత కర్ణులు, కొందరు దీర్ఘఫాలులు, విఫాలులు, స్నాయువులతో చర్మములతో అవగుంఠనము కలవారు, కొందరి మునుల ఉదరము బయటికి వెడలి ఉన్నది. అన్ని దిక్కులా ప్రకాశించు చున్న ఆ సరస్సును చూచిన మునులు తీర్థము నందు ఆసక్తితో ఆ సరస్సు తీరమున కూర్చొనిరి. ఆ మునులు కొందరు వాలఖిల్వులు, కొందరు అశ్మకుట్టులు, మరికొందరు దంతోలూఖలులు, కొందరు సంప్రక్షాలులు, కొందరు వాయుభక్షులు, జలాహారులు, పత్రాహారులు, నానా నియమములు, వ్రతములు కలవారు, భూమిపై పడుకొనువారు: వారు ఆ కొలనులో తమముఖమును చూచుకొని చక్కని రూపవంతులు, చక్కని కనులు కలవారుగామారిరి. ఈ కొలనులో ప్రతిబింబమును చూచుకొనినంతనే క్షణకాలములో ఇంతటి సౌందర్యము కలుగుటా? అని ఆలోచించుచు. ఒకరినొకరు చూచుకొనుచు, ఈ తీర్థమున చూచుట వలన చక్కని ముఖము కలుగుట వలన ఈ సరస్సునకు ''ముఖధర్శనము'' అని పేరిడి, స్నానమాడి నియమములనాచరించు కొని వారు రూపవంతులైరి. దేవపుత్రులతో పోల్చదగినవారుగా సాటిలేని గుణరాశులుగా అయిరి. తమ దేహ ఆగ్మగుణములలో ఆ ప్రదేశమును శోభింపచేయుచుండిరి. ఆ తీర్థమును యజ్ఞోపవీత పరిణాముగా విభాగము చేసిరి. 107

జుహ్వత శ్చాగ్నిహోత్రాణి చక్రుశ్చ వివిధాఃక్రియాః | చింతయంతో హి రాజేంద్ర తపసా దగ్ధ కిల్బిషాః || 108

న యాస్యామో పరం తీర్థం జ్యేష్ఠ భావే త్విదం సరః | జ్యేష్ఠ పుష్కర మిత్యేవ నామ చక్రుర్ద్విజాతయః || 109

తత్ర కుబ్జాన్‌ బహూన్‌ దృష్ట్వా స్థితాం స్తీర్థ సమీపతః | బభూవు ర్వి స్మితా న్తత్ర జనా యేచ సమాగతాః || 110

దత్వా దానం ద్విజాతిభ్యో భాండాని వివిధాని చ | శ్రుత్వా సరస్వతీం ప్రాచీ స్నాతుకామాద్విజాగతాః || 111

ఆ కొలను తీరమున అగ్నిహోత్రములను ఆరాధించుచు అనేక విధులను నిర్వర్తించిరి. ధ్యానము చేయుచు తపస్సుతో పాపములను నశింపచేసుకొనినవారై ఇక ఇంకొక తీర్థమునకు వెళ్ళజాలము. ఇది తీర్థరాజము, అని దీనికి జ్యేష్ఠ పుష్కరమని పేరు పెట్టిరి.

ఈ తీర్థ సమీపమున కొందరిని విరూపులను త్రివక్రులను (గూనివారిని) చూచి ఆశ్చర్యమును చెందిరి. ఆ చోటికి వచ్చినవారు బ్రాహ్మణులకు వివిధ భాండములను దానము చేసి సరస్వతీతీర్థము గురించి విని స్నానము చేయుటకు వెళ్ళిరి. 111

సరస్వతీ తీర్థ వరా నానా ద్విజ గణౖ ర్వ్రతా | బదరేంగుద కాశ్మర్య ప్లక్షా శ్వత్థ విభీతకైః || 112

పౌలోమైశ్చ పలాశైశ్చ కరీరైః పీలుభి స్తథా | సరస్వతీ తీర్థరుహై ర్ధన్వనైః స్యందనైస్తథా || 113

కపిత్థైః కరవీరైశ్చ బిల్వై రావ్లూతాకై స్తథా | అతిముక్త కషండైశ్చ పారిజాతైశ్య శోభితా || 114

కదంబ వన భూయిష్ఠా సర్వసత్వ మనోరమా | వాయ్వంబు ఫల పూర్ణాదైర్దంతోలూఖలికై రపి || 115

తధాశ్మ కుట్ట ముఖైశ్చ వరిష్ఠై ర్మునిభి ర్వృతా | స్వాధ్యాయ ఘోష సంఘష్టా మృగ యూథ సమాకులా || 116

అహింసై ర్ధర్మ పరమైస్తథా చాతీవశోభితా | సుప్రభా కాంచనాఖ్యా చ ప్రా7చీ నందా విశాలకా || 117

స్రోతోభిః పంచభి స్తత్ర పుష్కరే వర్తతే నదీ |

సరస్వతీ తీర్థము సర్వశ్రేష్ఠము, నానా పక్షులతో కూడియున్నది. బ్రాహ్మణోత్తములతో కలిసియున్నది. రేగి, ఇంగుద, కాశ్మరి, జువ్వి, రాగి, విభీతక, పౌలోమ, మోదుగు, కరీర, పీలు మొదలగు వృక్షములు కలది. వెలగ, గన్నేరు. మరేడు, మామిడి, పారిజాతములు, కదంబములు మొదలగు వృక్షములతో అన్ని ప్రాణుల మనసును రంజింప చేయునది. ఆ సరస్వతీ తీరమున వాయుభక్షులు, జలాహారులు, పత్రాహారులు, ఫలాహారులు, దంతోలూఖలులు, అశ్మకుట్టులు ఉత్తములగు మునులతో కూడి యున్నది. స్వాధ్యాయ ఘోషముతోనూ, అనేక మృగముల గుంపులు కలది, ధర్మాత్ములతో అహింసాశీలులతో శోభించునది. సుప్రభా, కాంచనా, ప్రాచీ, నందా, విశాలకా అను అయిదు ఉపనదులతో ఆ పుష్కరమున సరస్వతీ నది కలదు. 117 1/2

పితామహస్య సదసి వర్తమానే మహీతలే || 118

వితతే యజ్ఞవాటే తు స్వాగతేషు ద్విజాదిషు ! పుణ్యాహ ఘోషై ర్వితతై ర్దేవానాం నియమై స్తథా || 119

దేవేషు చైవ వ్యగ్రేషు తస్మి న్యజ్ఞ విధౌ తథా | తత్ర చైవ మహారాజ దీక్షతే చ పితామహే || 120

యుజత స్తస్య సత్రేణ సర్వకామ సమృద్ధినా | మనసా చింతితా హ్యర్ధా ధర్మార్ధ కుశలా స్తథా || 121

ఉపాతిష్ఠంతి రాజేంద్ర ! ద్విజాతీం స్తత్ర తత్ర హ | జగుశ్చ దేవగంధర్వా ననృతుశ్చాప్సరో గణాః || 122

వాదిత్రాణి చ దివ్యాని నాదయామాసు రంజసా | తస్య యజ్ఞస్య సంపత్యా తుతుషు ర్దేవతా అపి || 123

విస్మయం పరమం జగ్ముః కిము మానుష యోనయః ! వర్తమానే తథా యజ్ఞే పుష్కరస్థే పితామహే || 124

అబ్రువ న్మునయో భీష్మ ! తదా తుష్టాః సరస్వతీమ్‌ !

భూలోకమున నున్న బ్రహ్మ సదస్సులో విశాలమగు యజ్ఞవాటమున ద్విజాదుల స్వాగతములతో పుణ్యాహఘోషములతో, దేవనియములతో ఆ యజ్ఞవిధులలో దేవతలు వ్యగ్రులై యుండగా, బ్రహ్మ దీక్షితుడుగా నుండగా సర్వకామనలను ప్రసాదించు యజ్ఞమును ఆచరించుచుండగా బ్రాహ్మణులు మనసులో తలచినంతనే అభీష్ఠములు నెరవేరు చుండెను. దేవగంధర్వులు గానము చేయుచుండిరి. అప్సరసలు నాట్యము చేయుచుండిరి. దివ్యవాద్యములను మ్రోగించు చుండిరి. ఆ యజ్ఞ సంపత్తికి దేవతలు కూడా సంతసించిరి. ఆశ్చర్యమును చెందిరి. ఇక మానవుల గురించి ఏమి చెప్పవలయును? బ్రహ్మ పుష్కరము నుండి యజ్ఞమును జరుపుచుండగా, ఋషులు సంతోషించి సరస్వతితో ఇట్లు పలికిరి. 124 1/2

సుప్రభాం నామ రాజేంద్ర! నామ్నా చైవ సరస్వతీమ్‌ || 125

తేదృష్ట్వా మునయస్సర్వే వేగయుక్తాం సరస్వతీమ్‌ | పితామహం భాసయంతీం క్రతుం తే బహుమేనిరే || 126

ఏవమేషా సరిచ్ఛ్రేష్ఠా పుష్కరేఘ సరస్వతీ | పితామహార్థం సంభూతా తుష్ట్యర్థం చ మనీషిణాం || || 127

పుణ్యస్య పుణ్యతాకారి పంచస్రోతా సరస్వతీ | సుప్రభానామ రాజేన్ద్ర నామ్నాచైవ సరస్వతీ || 128

యత్ర తే మునయ శ్శాంతా నానాస్వాధ్యాయ వాదినః తే సమాగత్య ఋషయ స్సస్మరుర్వై సరస్వతీమ్‌ || 129

సాభిద్యాతా మహాభాగా ఋషిభిః సత్ర యాజిభిః || సమాస్థితా దిశం పూర్వాం భక్తి ప్రీతా మహానదీ | 130

ప్రాజీ పూర్వా వహానామ్నా మునివంద్యా సరస్వతీ |

ఓ రాజేంద్రా ! సుప్రభ అను పేరు గలదానిని సరస్వతీ నదిని అంతట ఆ ఋషులు సరస్వతి వేగవతిగా నుండుట చూచి బ్రహ్మను శోభింప చేయుచున్న యాగమును ప్రశంసించిరి. ఇట్లు పుష్కరములలో ఈ సరస్వతి ఉత్తమ నది. బ్రహ్మ కొరకు ఉద్భవించినది. విజ్ఞుల సంతోషము కొరకు ఉద్భవించినది. పుణ్యమునకు పుణ్యమును కలిగించునది. అయిదు ప్రవాహములు కలది సరస్వతి. ఈ సరస్వతి నదియే సుప్రభా నామముతో విలసిల్లు చున్నది. నానాస్వాధ్యాయపరులు శాంతులు అందరూ కలిసి సరస్వతిని స్మరించిరి.

సత్రయాగమును చేయుచున్న ఋషులు ధ్యానించిన వెంటనే భక్తిచే ప్రీతిచెందిన సరస్వతీ మహానది తూర్పుదిక్కును ఆశ్రయించినది. ప్రాచీవహా అను పేరుతో ఋషులచే నమస్కరించబడుచున్నది. 130 1/2

ఇద మన్య న్మహారాజ శృణ్వాశ్చర్య కరం భువి | 131

క్షుతో మంకణకో విప్రః కుశాగ్రేణతి నః శ్రుతమ్‌ | క్షతా త్కిల కరే తస్య రాజన్‌! శాకరసోస్రవత్‌ || 132

స పై శాకరసం దృష్ట్వా హర్షావిష్టః ప్రనృత్తవాన్‌ | తత స్తస్మి న్ప్రనృత్తే తు స్థావరం జంగమంచ యత్‌ || 133

ప్రనృత్యత జగ త్సర్వం తేజసా తస్య మోహితమ్‌ | శక్రాదిభిః సురై రాజన్‌ ! ఋషిభిశ్చ తపోధనైః || 134

విజ్ఞప్త న్తత్ర వై బ్రహ్మా నాయం నృత్యే త్తథా కురు ! | ఆదిష్టో బ్రహ్మణా రుద్ర! ఋషే ! రర్థే నరాధిప! || 135

నాయం నృత్యే ద్యథా భీమ ! తథా త్వం వక్తు మర్హసి | గత్వా రుద్రో మునిం దృష్ట్వా దర్పావిష్ట మతీవ హి || 136

భో ! భో! విప్రర్షభ ! త్వం హి నృత్యసే కేన హేతునా | నృత్యమానేన భవతా జగ త్సర్యంచ నృత్యతి || 137

తేనాయం వారితః ప్రాహ నృత్య న్వై ముని సత్తమః | కిం నసశ్యసి? మే దేవ! కరా చ్ఛాక రసోస్రవత్‌ || 138

తం తు దృష్ట్వా ప్రనృత్తోహం హర్ష్కేణ మహతా వృతః | తం ప్రహస్యాబ్రవీ ద్దేవో మునిం రాగేణ మోహితమ్‌ || 139

ఓ మహారాజా! ఇది మరొక ఉపాఖ్యానము కలదు. అత్యాశ్చర్యకరము. మంకణకు డను విప్రుని చేతికి దర్భాగ్రముతో గాయమాయెను. గాయపడిన ఆతని చేతినుండి శాకరసము స్రవించినది. ఆ శాకరసమును చూచి బ్రాహ్మణుడు సంతోషముతో నృత్యము చేసెను. ఆతను నాట్యము గావించుట చూచి ఆతని తేజస్సుతో మోహించిన స్థావరజంగమా త్మక మగు జగత్తంతయూ నృత్యము గావించెను. ఆంతట ఇంద్రాది దేవతలు ఋషులు బ్రహ్మను ఈ బ్రాహ్మణుడు నృత్యము చేయకుండగా ఆపుమని కోరిరి. బ్రహ్మ రుద్రుని ఆదేశించెను. బ్రహ్మ ఆదేశమును పొందిన రుద్రుడు ఋషి వద్దకు వచ్చి ఓ మునీ! నీ వెందుకు నృత్యమును చేయుచున్నావు. నీ నృత్యముతో జగత్తంతయూ నృత్యము చేయుచున్నది. అని పలికెను. ఆంతట ఆ ముని నృత్యమును జేయుచు ఇట్లు పలికెను. నా చేతి నుండి శాకరసము స్రవించు చుండుట తాము చూచుట లేదా! ఆ శాకరసమును చూచి నేను సంతోషముతో నృత్యము చేయుచున్నాను. అని అట్లు రాగమోహితుడగు మునిని చూచి రుద్రుడు ఇట్లు పలికెను.

అహం న విస్మయం విప్ర ! గచ్ఛా మీహ ప్రపశ్య మామ్‌ | ఏవ ముక్తో మునిశ్రేష్ఠో మహాదేవేన కౌరవ! || 140

ధ్యాయమానస్తదా కోయం ప్రతిషిద్ధోస్మి యేన హి | అంగుల్యగ్రేణ రాజేంద్ర స్వాంగుష్ఠ స్తాడిత స్తథా ||141

తతో భస్మ క్షత్రాద్రా జ న్నిర్గతం హిమ పాండరమ్‌ | త ద్ధృష్ట్వా వ్రీడిత శ్చా సౌప్రాహ తత్పాదయో | పతన్‌ || 142

నాన్య ద్దేవా దహం మన్యే రుద్రా త్పరతరం మహత్‌ | చరాచరస్య జగతో గతి స్త్వ మసి శూలధృత్‌ || 143

త్వయా స్పష్ట మిదం సర్వం మదంతీహ మనీషిణః | త్వా మేవ సర్వం విశతి పున రేవ యుగక్షయే || 144

దేవై రపి న శక్య స్త్వం పరిజ్ఞాతుం మయా కృతః | త్వయి సర్వే చ దృశ్యంతే సురా బ్రహ్మాదయోపి యే || 145

సర్వస్త్వ మసి దేవానాం కర్తా కారయితా చ యః | త్వత్ప్రసాదా త్సురా స్సర్వే భవంతీహా కూతో భయాః || 146

ఏవం స్తుత్వా మహాదేవ మృషిశ్చ ప్రణతోబ్రవీత్‌ | భగవం స్త్వత్ర్పసాదేన తపో న క్షీయతే త్విహ || 147

నేను విస్మయము చెందుట లేదు. వెళ్లుచున్నాను. నన్ను చూడుము. ఇట్లు మహాదేవుడు పలుకగా ఇతనెవరో నన్ను నిషేధించు చున్నాడు అని అంతలో శంకరుడు తన అంగుళ్యగ్రముతో అంగుష్ఠమును కొట్టుకొనెను. అట్లు పాదములపై బడి ఇట్లు పలికెను. రుద్రుని కంటె పరదైవమును సే నూహించజాలను. ఈ సకల చరాచర జగత్తునకు నీవే ఆధారము. ఈ జగత్తును నీవే సృజించితివని పండితులుచెప్పుచున్నారు. ప్రళయకాలమున మరల ఈ జత్తంతయూ నీలోనే చేరును. నిన్ను దేవతలు కూడా తెలియజాలరనిన ఇక నేనెట్లు తెలియుదును? బ్రహ్మాది దేవతలందరూ నీలోనే కనబడు చున్నారు. దేవత లందరిని నీవే సృజించితివి. వారితో అన్ని పనులను నీవే చేయించు చున్నావు. నీ అనుగ్రహము వల్లనే దేవతలు అన్ని భయములను తొలగించు కొనుచున్నారు. ఇట్లు శంకరుని స్తుతించి శంకరునికి నమస్కరించెను. నీ అనుగ్రహముతో నా తప్పస్సు క్షీణించ కుండు గాక అని పలికెను. 147

తతో దేవః ప్రీతమనా స్తమృషిం పున రబ్రవీత్‌ | తపస్తే వర్ధతాం విప్ర మత్ప్రసాదా త్సహస్రధా || 148

ప్రాచీ మేవేహ వత్స్యామి త్వయా సార్ద మహం సదా | సరస్వతీ మహాపుణ్యా క్షేత్రే చాస్మి న్విశేషతః || 149

న తస్య దుర్లభం కించి దిహ లోకే పరత్ర చ | సరస్వ త్యుత్తరే తీరే యస్త్యజే దాత్మన న్తనుమ్‌ || 150

ప్రాచీ తటే చాప్యపరో న చేహ మ్రియతే పునః | అప్లుతో వాజిమేధస్య ఫల మాప్స్యతి పుష్కలమ్‌ || 151

నియమై శ్చోపవాసైశ్చ కర్శయ న్దేహ మాత్మనః | జలాహారో వాయుభక్షః పర్ణాహారశ్చ తాపనః || 152

తథా స్థండిల శాయీ చ యే చాన్యే నియమాః పృథక్‌ | కరోతి యో ద్విజశ్రేష్ఠో నియమాం స్తా న్వ్రతాని చ|| 153

స యాతి శుద్ధ దేహశ్చ బ్రహ్మణః పరమం పదమ్‌ | తస్మి స్తీర్థే తు యై ర్దత్తం తిల మాత్రం తు కాంచనమ్‌ || 154

మేరుదాన సమం తత్‌స్యా త్పురా ప్రాహ ప్రజాపతిః | తస్మిం స్తీర్థే తు యే శ్రాద్ధం కరిష్యంతి హి మానవాః 155

ఏక వింశ కులోపేతాః స్వర్గం యాస్యంతి తే నరాః | పితౄణాం చ శుభం తీర్థం పిండే నైకేన తర్పితాః || 156

బ్రహ్మలోకం గమిష్యంతి స్వపుత్రేణహ తారితాః | భూయ శ్చాన్నం న చేచ్ఛంతి మోక్షమార్గం వ్రజంతి తే || 157

ప్రాచీనత్వం సరస్వత్యా యథా భూతం శృణుష్వతత్‌ |

అంతట మహాదేవుడు సంతోషమును చెంది ఇట్లు పలికెను. నా అనుగ్రహము వలన నీ తపస్సు వేయిరెట్లు వృద్ధి చెందును. నేను కూడా ఎపుడూ ఇచ్చోటనే ఈ ప్రాచీవాహినీ నదీ తీరముననే నీ తోనే ఉందును. ఈ సరస్వతీ నది ఈ క్షేత్రమున విశేష ఫలప్రదము. ఈ సరస్వతీ నదీ ఉత్తర తీరమున తనువును చాలించినవాడు ఇహ పర లోకములలో పొందలేని దేదీ ఉండదు. ఈ నదీ ప్రాచీన తీరమున జపించినవారు మరల ఇక్కడ మరణింప జాలడు. ఈ సరస్వతీ నదిలో స్నానమాడినవాడు అశ్వమేధ ఫలమును పొందును. ఈ తీర్థమున తిల తర్పణము గావించినవారు, నియమములను, ఉపవాసములను జలాహారమును, పత్రాహారమును, వాయుభక్షణను గావించినవారు, భూమిపై పరుండువారు ఇతర నియమముల నాచరించు వారు శుద్ద దేహులై పర బ్రహ్మమును పొందెదరు. వారు గావించిన తిల తర్పణమును మేరుదాన సమఫలమును పొందెదరు.

ఈ తీర్థమున శ్రాద్ధమును గావించిన వారు 21 తరముల వరకు స్వర్గమును పొందెదరు. ఈ తీర్థము పితరులకు శుభఫల పదము. ఒకే పిండముతో తృప్తి చెందెదరు. పుత్రులచే తరింప చేయబడి బ్రహ్మలోకమునకు చేరెదరు. ఇక మరల అన్నమును కోరరు. మోక్షమార్గమును చేరును. ఈ సరస్వతీ నదికి ప్రాచీనత్వము లభించిన విధమును చెప్పెదను. 157

సరస్వతీ పురా ప్రోక్తా దేవైః స్తర్వైః సవాసవైః || 158

తటం త్వయా ప్రయాతవ్యం ప్రతీచ్యాం లవణోదధేః | బడబాగ్ని మిమం నీత్వా సముద్రే నిక్షిపస్వహ || 159

ఏవం కృతే సురాః సర్వే భవంతి భయ వర్జితాః | అన్యథా బడబాగ్నిస్తు వహతే స్వేన తేజసా|| 160

తస్మా ద్రక్ష స్వ విబుధా నేతస్మా దచిరా ద్భయాత్‌ |

మాతేవ భవసుశ్రోణి ! సురాణా మభయప్రదా || 161

ఏవ ముక్తా తు సా దేవీ విష్ణునా ప్రభవిష్ణునా | ఆహ నాహం స్వతంత్రాస్మ పితాయే ప్రియతాం స్వరాట్‌ || 162

తదాజ్ఞాకారిణీ నిత్యం కుమారీహ ధృతవ్రతా | పిత్రాదేశా ద్వినా నాహం పద మేక మపి క్వచిత్‌ || 163

తదాజ్ఞాకారిణీ నిత్యం కుమారీహ ధృతవ్రతా | పిత్రాదేశా ద్వినా నాహం పద మేక మపి క్వచిత్‌ || 163

గచ్ఛామి తస్మా త్కోప్యన్య ఉపాయ శ్చింత్యతా మహో! | తదాశయం విదిత్వాహు స్తే సమేత్య పితామహమ్‌ || 164

నాన్యేన శక్యతే నేతుం బడబాగ్నిః పితామహ | అదృష్టదోషాం ముక్తైకాం కుమారీం తనయాం తవ || 165

ఇంద్రాది దేవతలందరు సరస్వతీనదితో నీవు సముద్రమునకు ప్రతీచీ తీరమున పారవలయును. ఈ బడబాగ్నిని తీసుకొని సముద్రమున పడవేయుము. ఇట్లు చేసినచో దేవతల భయము తొలగును. లేనిచో బడబాగ్ని తన తేజస్సుతో మమ్ములను దహించును. కావున ఈ భయము వలన మమ్ములను త్వరగా కాపాడుము. దేవతలకు తల్లివలె అభయము నొసంగుము.

ఇట్లు విష్ణువు పలుకగా సరస్వతీ నది నేను స్వతంత్రురాలను కాను. నా తండ్రిని ప్రార్థించుడు. నేను కుమారిని. తండ్రి ఆజ్ఞను పాలించు వ్రతము కలదానను. తండ్రి ఆజ్ఞ లేనిచో ఒక్కడుగును కూడా వేయజాలను. కావున వేరే ఉపాయమును ఆలోచించుడు.

సరస్వతి అభిప్రాయమును గ్రహించిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి ఇట్లు పలికిరి. సరస్వతి తప్ప బడబాగ్ని ఇతరులు కోనిపోజాలరు. నీ సుత దోషరహిత కావున గొని పోగలదు. 165

సరస్వతీం సమానీయ కృత్వాంకే వరవర్ణినీమ్‌ | శిరస్యాఘ్రాయ స స్నేహ మువా చాథ సరస్వతీమ్‌ || 166

మాం చ దేవి సురాః ప్రాహు స త్వం బ్రూహి యశస్వినీ | త్వా వినిక్షి పే దేనం బాడబం లవణాంబుని || 167

పితు ర్వాక్యం హి తచ్ఛ్రుత్వా వియుక్తా కురరీ యథా | పిత్రా తదైవ సా కన్యా రురుదే దీన మానసా || 168

శోభ##తే తన్ముఖం తస్యాః శోక బాష్పా విలేక్షణమ్‌ | సితం వికసితం తద్వ త్పద్మం తోయ కణోక్షితమ్‌ || 169

తత్తథా విధ మాలోక్య పితామహ పురస్సరాః | విబుధాః శోక భావస్య సర్వే వశ ముపాగతాః || 170

సంస్తభ్య హృదయం తస్యాః శోకసంతాపితం తదా | పితామహ స్తామువాచ మా రో దీ ర్నాస్తి తే భయమ్‌ || 171

మాన లాభశ్చ భవితా తవ దేవానుభావతః | నీత్వా క్షారోద మధ్యే తు క్షిపస్వ ఙ్వలనం సుతే || 172

అంతట బ్రహ్మ సరస్వతిని పిలిచి వడిలో కూర్చోబెట్టుకొని శిరస్సును మూర్కొని ప్రేమతో ఇట్లు పలికెను. దేవతలందరూ నన్నడుగుచున్నారు. నీవు సరస్వతితో బడబానలమును సముద్రమున పడవేయుమని తెలుపుము. అని అంత బ్రహ్మవాక్యమును వినిన సరస్వతి జంట నెడబాసిన లేడి వలె దీనమనస్కురాలై రోదించసాగెను. కన్నీటితో నిండిన ఆమె ముఖము నీటిబిందువులతో కూడిన వికసించిన తెల్లతామర వలె శోభించు చుండెను. అట్లు సరస్వతిని చూచి బ్రహ్మాది దేవతలు ఆమె దుఃఖమునకు వశులైరి. శోకతప్తమైన ఆమె హృదయమును ఓదార్చి బ్రహ్మ ఏడవకు ! నీకు భయము లేదు. నీకు దేవతల ప్రభావము వలన గొప్ప గౌరవము లభించును. కావున బడబానలమును తీసికొని లవణ సముద్ర మధ్యమున పడవేయుము.

ఏవ ముక్తా తు సా బాలా బాష్పాకులిత లోచనా | ప్రణమ్య పద్మ జన్మానం గచ్ఛా మ్యుక్తవతీ తు సా || 173

మా భై రుక్తా పున సై#్తస్తు పిత్రా చాపి త ధైవ సా | త్యక్త్వా భయం హృష్టమనా ప్రయాతుం సమవస్థితా || 174

తస్యాః ప్రయాణ సమయే శంఖ దుందుభి నిస్వనైః | మంగళానాం చ నిర్ఘోషై ర్జగ దాపూరితం శుభైః || 175

సితాంబరధరా ధన్యా సిత చందన మండితా | శరదంబుజ సచ్ఛాయ తారహార విభూషితా || 176

సంపూర్ణ చంద్ర వదనా పద్మ పత్రాయతేక్షణా | శుభాం కీర్తిం సురేశస్య పూరయంతీ దిశో దశ || 177

స్వతేజసా తద్ధృదయా న్నిస్సృతా భాసయ జ్జగత్‌ |

ఇట్లు పలుకగా సరస్వతి కన్నీటితో నిండిన కనులు కలదై బ్రహ్మకు నమస్కరించి వెళ్లుచున్నాననెను. దేవతలు బ్రహ్మ ఆమెను భయపడవలదని పలికిరి. భయమును విడిచి సంతుష్టహృదయవై బయలుదేరుము అనిరి. సరస్వతి పయనించు సమయమున శంఖ దుందుభినాదములు, మంగళనాదములతో ప్రపంచము నిండెను.

తెల్లని వస్త్రమును తెల్లని చందనమును ధరించి శరత్కాలమేఘములవంటి వన్నె కలతారాహారములతో అలంకరించబడి, సంపూర్ణ చంద్రవదనయై, పద్మపత్రవిశాలాక్షితో, ఇంద్రుని కీర్తిని దశదిశలా వ్యాపింప చేయుచు, అతని హృదయము నుండి బయలువెడలి తన తేజస్సుతో జగత్తును ప్రకాశింప చేసెను. 177

అనువ్రజంతీ తాః గంగా తయోక్తా వరవర్ణినీ || 178

ద్రక్ష్యామి త్వాం పున రహం ప్రయాసి కుత్ర మే సఖి ! ఏవ ముక్తా తు సా గంగా ప్రోవాచ మధురాం గిరమ్‌ || 179

యదే వాయాస్యసి ప్రాచీం దిశం మాం పశ్యసే శుభే | విబుధై స్త్వం పరివృతా దర్శనం తవ సంశ్రయే || 180

ఉదఙ్ముఖీ తదా భూత్వా త్యజ శోకం శుచిస్మితే |

అహం చోదజ్ముఖీ పుణ్యాత్వం తు ప్రాచీ సరస్వతీ || 181

తత్ర క్రతుశతం పుణ్యం స్నాన దానేన సువ్రతే ! | శ్రాద్ధ దానే తధా నిత్యం పితౄణాం దత్త మక్షయమ్‌ || 182

యే కరిష్యంతి మనుజా విముక్తా స్తే ఋణౖస్త్రిభిః | మోక్షమార్గం గమిష్యంతి విచారో నాత్ర విద్యతే || 183

తా మువాచ తతో గంగా పున ర్దర్శన మస్తు తే | గచ్ఛ స్వమాలయం భ##ద్రే! స్వర్తవ్యాహం త్వయానఘే! 184

అట్లు వెడలు చున్న సరస్వతిని వెన్నంటిన గంగానదిని నిన్ను నేను మరల చూడవలయును. ఎటు వెడలు చుంటివి. అని పలుకగా ప్రాచీన దిక్కునకు వచ్చినపుడు నన్ను చూచెదవు. దేవతలతో కలిసున్న నన్ను ఉదఙ్ముఖురాలనై సేవించెదను. దుఃఖించకుము. నేమ ఉదఙ్ముఖిగా నుందును. నీవు ప్రచీముఖముగా నుందువు. నీ తీరమున క్రతు శతములు, పుణ్యస్నానదానాదులు, శ్రాద్ధాదులు, తర్పణములు చేసినచో ఆక్షయఫలము నొసంగును. ఇట్లు చేసినవారు ఋణత్రయ విముక్తు లగుదురు. మోక్షమార్గమును చేరెదరు. ఇచల విచారించవలసిన పనిలేదు. అంతటి గంగ ఆమెతో పునర్దర్శనమగు గాక. నీ గృహమునకు వెడలుము. అచల నన్ను తలచుము. అని పలికెను. 184

యమునాపి త ధైవం సా గాయత్రీ చ మనోరమా | సావిత్రీ నహితాః సర్వాః సఖీం సంప్రేషయం స్తథా || 185

తతో విసృజ్య తాన్‌ దేవా న్నదీ భూత్వా సరస్వతీ | ఉత్తంకస్యాశ్రమ పద ఉద్భూతా సా మనస్వినీ || 186

అధస్తా త్ల్పక్ష వృక్షస్య అవరోప్యచ తాం తనుమ్‌ | అవతీర్ణా మహాభాగా దేవానాం పశ్యతాం తదా ||187

విష్ణురూప స్తరు స్సోత్ర సర్వదేవై స్తు వందితః | సంసేవ్య శ్చద్విజై ర్నిత్యం ఫల హేతో ర్మహోదయః || 188

అనేక శాఖా వితత శ్చతుర్ముఖ ఇవాపరః | తత్కోటర కుటీ కోటి ప్రవిష్టానాం ద్విజన్మనామ్‌ || 189

శ్రూయంతే వివిధా వాచః సురాణాం రక్తచేతసామ్‌ | వనస్పతి రపుష్పోపి పుష్పిత శ్చోపలక్ష్య తే|| 190

జాతీ చంపక వత్పుషై#్పః శాఖా లగ్నైః శుకైః శుభైః | కేతకీభిః సురభిభి రశోభత సరిద్వరా || 191

కోకిలాభిః సమాలేవ ఫేనకైః పుష్పితేవ సా | హరేణవ యథా గంగా ప్లక్షేణౖవ హి సా తథా || 192

తత్రాంభఃస్థా తదా దేవం ప్రోవాచాధ జనార్ధనమ్‌ | సమర్పయస్వ తం వహ్నిం దేవా దేశం కరోమ్యహమ్‌ || 193

ఏవ ముక్తేన సా తేన ప్రత్యుక్తా విష్ణునా తదా | న తే దాహ భయం త్యాజ్య స్త్వయాయం వహ్నిరాట్‌ స్వయమ్‌ || 194

యమునానది గాయత్రి సావిత్రితో కలిసి తన చెలియగు సరస్వతిని పంపించిరి. అంతట సరస్వతి ఆ దేవతలను వడిచినదిగా ఉత్తంకుని ఆశ్రమముసు జేరినది. జువ్వి చెట్టు క్రింద ఆ శరీరమును వీడి దేవతలు చూచుచుండగా ఆవతరించినది. ఆ జువ్వి చెట్టు విష్ణుస్వరూపము. దేవత లందరి చేత నమస్కరింప బడునది. ఫలాకాంక్షులు బ్రాహ్మణులు సేవించదగినది. మరొక చతుర్ముఖ బ్రహ్మవలె బహు శాఖలతో వ్యాపించ బడియున్నది. ఆ వృక్షకోటర కుటీరములో ప్రవేశించిన పక్షుల బ్రాహ్మణుల దేవతల వాక్కులు వినిపించుచుండును. పూయని వృక్షము కూడా పూచి నట్లుతోచును. ఉత్తమ సంపెంగ వలె కొమ్ములలో చేరిన చిలుకలతో సుగంధములగు మొగిలి చెట్లతో శోభించు ఉత్తమ నది, కోకిలల మాలవలె. నురుగుతో పూచినట్లు శంకరునితో గంగవలె, జువ్విచోట్టుతో ఆ సరస్వతి శోభించెను. ఆ నీటిలోవున్న సరస్వతి జనార్దనునితో ఇట్లు పలికెను. ఓ దేవా ! ఆ బడబాగ్నిని ఇమ్ము. తమ ఆజ్ఞను పాలించెదను. ఇట్లు సరస్వతి పలుకగా శ్రీ మహావిష్ణువు మరల ఇట్లు పలికెను. ఈ అగ్ని నిన్ను కాల్చును అని భయపడవలసిన పనిలేదు. 194

పశ్చిమం సాగరం నేతుం బాడవ జ్వలనం శుభే! ఏవం క్రమేణ గచ్ఛంత్యా తదా సంప్రాప్యతే శుఛే ! 195

తత స్తం శాతకుంభస్థం కృత్వాసౌ బడబానలమ్‌ | సమర్పయ త్స గోవిందః సరస్వత్యా మహోదరే || 196

సా తం గృహీత్వా సుశ్రోణీ ప్రతీచ్యభిముఖీ య¸° | అంతర్ధానేన సంప్రాప్తా పుష్కరం సా మహానదీ || 197

ఓ ! శుభస్కరులారా పశ్చిమ సముద్రమునకు బడబానలమును తీసికొనివెళ్లు చున్న నీవు జలమును పొందగలవు. అంతటి బడబానలమును బంగారు కలశమున ఉంచి సరస్వతీ తీరమున సమర్పించెను. సరస్వతీ నది ఆ బడబానలమును తీసుకొని పశ్చిమాభిముఖముగా బయలుదేరి ఆంతర్ధాన విద్యతో పుష్కరమున చేరెను. 197

మర్యాదా పర్వతే తస్మిన్‌ సంభూతా విమలా సరిత్‌ | పుష్కరారణ్యం విపులం సురసిద్ధ నిషేవితమ్‌ || 198

పితామహేన తత్రాసీత్‌ యజ్ఞ సత్రం నిషేవితమ్‌ | సిద్ధ్యర్థం ముని ముఖ్యానా మాగతాసౌ మహానదీ || 199

యేషు తత్ర కృతో హోమఃకుండే ష్వాసీ ద్విరించినా | తాని సర్వాణి సంప్లావ్య తోయేనాప్యుద్గతా హి సా || 200

తత్ర క్షేత్రే మహా పుణ్యా పుష్కరే సా తథోత్ధితా | తేస తత్పూరణం ప్రోక్తం వాయునా జగ దాయుతా || 201

సాపి తత్‌క్షేత్ర మాసాద్య పుణ్యం పుణ్యా మహానదీ | సరస్వతీ స్థితా దేవీ మర్త్యానాం పాపనాశినీ || 202

తత్ర యే శుభకర్మాణః పుష్కరస్థాం సరస్వతీమ్‌ | వశ్యంతి తే న వశ్యంతి సుఘోరాం తా మధోగతిమ్‌ || 203

యః పున స్తత్ర భావేన నరః స్నానం సమాచరేత్‌ | స బ్రహ్మలోక మాసాద్య బ్రహ్మణా సహ మోదతే || 204

యస్తు దద్యాత్తత్ర దధి బ్రాహ్మణాయ మనోరమమ్‌ | సోప్యగ్ని లోక మాసాద్య భుంక్తే భోగా న్సుశోభనాన్‌ || 205

స్వచ్ఛమైన సరసై#్స యామర్యాదా పర్వతమందు రూపొందెను. సురలు సిద్ధులు సేవించు పుష్కరారణ్యము నందు బ్రహ్మతో నట ఈ మహానది మునీశ్వరుల తపస్సిద్ధి కొఱకే.

అచట నే కుండములందు బ్రహ్మహోమములు సేసెనో యట్టి పాపనాశిని యామెపై బడెను. జగ్గత్తుల కెల్ల నాయువైన వాయు భగవానునిచే నా పుష్కరము నింపబడె నని చెప్పబడినది. పుష్కర మందున్న యా నది నెవ్వరు సత్కర్మ పరులు దర్శింతురు. దర్శనము సేయని వారు దుర్గతి పాలగుదురు. అట మనఃపూర్వకముగ స్నానము సేసి నతడు బ్రహ్మలోక మేగి బ్రహ్మతో ఆనందించును. ఇచ్చట చక్కని పెరుగు బ్రహ్మణునకు విందిచ్చి నతడు అగ్నిలోక మేగి రమణీయ భోగము లనుభవించును. 205

వరం ప్రావరణం యోపి భక్త్యా దద్యాత్‌ ద్విజాతయే | సోపి తద్వస్త్ర దానస్య ఫలం దశగుణం లభేత్‌ || 206

జ్యేష్ఠకుండే నరః స్నాత్వా య స్సంతర్పయతే పితౄన్‌ | స తా నుద్ధరతే సర్వా న్నరకా దపి శుద్ధదీః || 207

క్షేత్రే పైతామహే పుణ్య పుణ్యాం ప్రాప్య సరస్వతీమ్‌ | నరః కిం ప్రార్థయే దన్య త్తీర్థం బ్రహ్మసుతోబ్రవీత్‌ || 208

తస్మాత్‌ సర్వేషు తీర్థేషు స్నాతః ప్రాప్నోతి యత్ఫలమ్‌ | తత్సర్వం ప్రోప్నుయాత్‌ మర్త్యో జేష్ఠ కుండే సకృత్‌ ప్లుతః || 209

కిమత్ర బహునోక్తేన క్షేత్ర తీర్థ గతిః శుభా | యేనైతత్‌ త్రితయం ప్రాప్తం ప్రాప్తా తేన గతిః పరా || 210

కాలే క్షేత్రే యథా తీర్ధే స్నాత్వా హుత్వాపితత్ర యః |ప్రయచ్ఛతే ద్విజాయార్థః సోనంతం సుఖ మశ్నుతే|| 211

ఇచ్చట చక్కని వస్త్రము భక్తితో శివునికి దానము సేసిన పదిరెట్లు ఫలమందును. జ్యేష్ఠ కుండమున స్నానము సేసి శుద్ధమనసుతో పితరులకు తర్పణము సేసి తమ వారిని నరకము నుండి యుద్ధరించును. బ్రహ్మతీర్ధ మిది పుణ్యము. సేవించిన పుణ్యుడు మరేమీ కోరడు. అని నారదు డనెను. జ్యేష్ఠ కుండమున నొక్కసారి స్నానము వలన సర్వ తీర్థ ఫల మందును. పలుమాట లేల ? క్షేత్రము తీర్థము శుభ గతి యీ మూడు నంది నతడు పరమగతిని మోక్షమును పొందును. పుణ్యకాలమున పుణ్యక్షేత్రమున తీర్థమున హోమము సేసి విప్రునకు ధన మిచ్చిన అనంత సుఖ మందును. 211

కార్తికే మాసి శుక్లే చ వైశాఖే శశిభూషణ | చంద్రసూర్యోపరాగే చ కాలే చ కురు జాంగలే || 212

క్షేత్రే ష్వేతేషు తీర్ధాని యా న్యుక్తాని మునీశ్వరైః | తేషాం పుణ్యతమం తీర్థ మిద మాహ పితామహః || 213

కుండే తు మధ్యమే స్నాత్వా కార్తిక్యాం యః పుమాన్‌ ద్విజే | ప్రయచ్ఛతే చాపి ద్రవ్యం సోశ్వమేధ మవాప్నుయాత్‌ || 214

ఏవం కనిష్టకే ప్యత్ర కుండే స్నాత్వా సమాధినా | యః ప్రయచ్ఛతి విప్రాయ సురూపా మపి శాలికామ్‌ || 215

స ప్రయాతి నరః క్షిప్ర మగ్నిలోకం మనోరమం | త్రిః సప్త కుల సంయుక్తో భుంక్తే తత్ర మహాఫలమ్‌ || 216

తస్మా త్సర్వ ప్రయత్నేన గమనాయ మతిః స్థిరా | వురుషేణ తు కర్తవ్యా పుష్కరావాప్తయే శుభా || 217

పుష్కరారణ్య మాసాద్య ప్రాచీయత్ర సరస్వతీ | మతి స్మృతిః శుభా వ్రజ్ఞా మేధా బుద్ధి ర్దయా పరా || 218

తత్రస్థం తజ్జలం యే పి పశ్యంతి తట సంస్థితాః తేప్యశ్వమేధస్య ఫలం లభంతే నాత్ర సంశయః || 220

యోవతీర్య పున స్తత్ర కశ్చి త్థ్సానం సమాచరేత్‌ | నరః సమాధి యుక్తో వై బ్రహ్మణోనుచరో భ##వేత్‌ || 221

శాకాదినా పి హి పితౄ న్యస్తత్రార్చయతే నరః | సో ప్యేతివిపులా గ్భోగాం స్తేషా మే వానుభావతః || 222

యే పున ర్విధినా తత్ర శ్రాద్ధం కుర్వంతి మానవాః | తే నయంతి పితౄన్‌ స్వర్గం సరకా దపి దుఃఖదాత్‌ || 223

తృప్యంతి పితర స్తస్య య స్తత్ర కుశ మిశ్రితమ్‌ | స్నాత్వా ప్రయచ్చతే తోయం పూతం తేషాం తిలాన్వితమ్‌ || 224

కార్తికమాస శుక్లపక్షమున వైశాఖమాసమున చంద్ర సూర్య గ్రహణములలో, కుజాంగలక్షేత్రమున ఈ క్షేత్రములలో, మునీశ్వర్వులు చెప్పిన తీర్ధము లన్నిటిలో ఈ సరస్వతీ తీర్ధము పుణ్యతమ తీర్ధము అని బ్రహ్మ చెప్పెను. కార్తికమాసమున ఈ కుండమధ్యమున స్నానము చేసి దానము చేసినచో అశ్వమేధ ఫలమును పొందును.

ఏకాగ్రచిత్తముతో కనిష్ఠకుండములో స్నానము చేసి చక్కని బొమ్మను విప్రునికి దానము చేసినవారు అగ్రిలోకమును చేరును. 21 తరముల వరకు అచట మహాఫలమును పొందును. కావున అన్ని విధములా ప్రయత్నించి పుష్కరమును చేరవలయును. పుష్కరారణ్యమును చేరిన ప్రాచీసరస్వతీ నది స్మృతి మతి ప్రజ్ఞా, మేధా, బుద్ధి దయా అను ఆరు మారుపేర్లను పొందినది. అప్పటి నుండి ఈ సరస్వతి ప్రాచీ అయినది. పుష్కరారణ్యమున కల సరస్వతీ జలమును తీరమున నుండి చూచిన వారు అశ్వమేధ ఫలమును పొందెదరు. ఆ నదిలోనికి దిగి స్నానమాచరించిన వారు బ్రహ్మకు అనుచరులు కాగలరు. ఆ నదీ తీరమున శాకాదులతోనైనా పితృదేవతలను అర్చించిన వారు బహు భోగముల నంద గలరు. యధావిధిగా శ్రాద్ధ మాచరించినచో నరకములోని పితృదేవతలు స్వర్గమున చేరెదరు. సరస్వతీ నదిలో స్నానమాడ తిల దర్భ మిశ్రితమగు జలమును తర్పణముగా విడిచినచో పితృదేవతలు తృప్తి చెందెదరు. 224

సర్వేషా మేవ తీర్థానాం మిద మేవాధికం స్మృతమ్‌ | ఆదితీర్థ మిదం తస్మా త్తీర్థానాం భువి విశ్రుతమ్‌ || 225

ధర్మాపవర్గయోః క్రీడా నిధి భూత మవస్థితమ్‌ | సరస్వత్యా పునశ్చైవ సమేతం గుణవత్తరమ్‌ || 226

ధర్మార్థ కామ మోక్షాణాం చతుర్ణా మపి దాయకమ్‌ | యేప్యత్ర మల నాశాయ పుమాంసో వివిశు ర్జలమ్‌ || 227

గో ప్రదాన సమం తేషాం సుఖే నైవ ఫలం భ##వేత్‌ | సువర్ణ దానేన సమ మేవ మాహు ర్మనీషిణః || 228

తర్పణా త్పిణ్డ దానాచ్చ నరకేష్వపి సంస్థితాః | స్వర్గం ప్రయాంతి పితర స్తత్ర పుత్రేణ తారితాః || 229

పుష్కరేపి సరస్వత్వాం యే పిబన్తి జలం జనాః | తే లభ##న్తేక్షయాన్‌ లోకాన్‌ బ్రహ్మా విశ్వేశ వందితాన్‌ || 230

స్వర్గా ని శ్రేణికా భూతా పుష్కరే చ సరస్వతీ | సా పుణ్యవద్భి స్సంప్రాప్తుం పుంభి శ్శక్యా మహానదీ || 231

మునిభిః ధర్మ తత్త్వజ్ఞైస్తత్ర తత్ర నిషేవితా | తస్మా త్సర్వత్ర సా దేవీ పవిత్రా సర్వత స్థ్సితా || 232

పుష్కరే తు విశేషేణ పూతా త్పూత తమా హీ సా | నదీ సరస్వతీ పుణ్యా సులభా జగతి స్థితా || 233

దుర్లభా సా కురుక్షేత్రే ప్రభాసే పుష్కరే తథా | తత్తీర్థం సర్వ తీర్ధానాం ప్రవరం విహితం భువి || 234

ధర్మార్ధ కామ మోక్షాణాం చతుర్ణా మపి సాధకమ్‌ | ప్రాచీం సరస్వతీం ప్రాప్య యోన్య త్తీర్థంహి మార్గతే|| 235

స కరస్థం సముత్సృజ్య హ్యమృతం విష మిచ్ఛతి | 235 1/2

అన్ని తీర్థములలోనికి ఉత్తమతీర్ధము సరస్వతీ తీర్థమే. అన్ని తీర్థములలో ఇదియే అది తీర్థము. ధర్మమునకు మోక్షమునకు ఇదియే క్రీడాభూమిగా పేర్కొనబడినది. ధర్మార్ద కామ మోక్ష పురుషార్థములను ఇచ్చునది. తమపాపములను తొలగించుకొనుటకు ఈ తీర్థమున ప్రవేశించినవారు సులభముగా గోదాన ఫలమును పొందును. సువర్ణదాన సమఫలమును పొందును. తర్పణము చేయుట వలన, పిండదానము వలన నరకములో నున్న పితరులు స్వర్గమును చేరెదరు. పుష్కరములోని సరస్వతీ జలమును త్రాగినవారు బ్రహ్మ రుద్ర వందితలోకమును చేరగలరు. పుష్కరారణ్యములోని సరస్వతీ తీర్థము స్వర్గమార్గ ప్రబోధకము. పుణ్యమును చేసుకొనిన వారికే అది లభించును. ధర్మతత్త్వములు తెలిసిన మునులచే సేవించబడునది. కావున అన్ని చోట్ల సరస్వతి పరమపావనమైనది. పుష్కరమున ఈ నది పావనములలోకెల్లా పావనమైనది. సరస్వతీ నది అందరికి సులభముగా నున్నది. కాని కురుక్షేత్రమున ప్రభాసమున పుష్కరమున మాత్రమున దుర్లభము. అన్ని తీర్థములలోనికి సరస్వతీ తీర్థము ప్రవరముగా పేర్కొనబడినది. ధర్మ అర్ఢ కామ మోక్ష పురుషార్ధ చతుష్టయ సాధకము. ప్రాచీన సరస్వతీ తీర్థమును పొందయు ఇతర తీర్థమును అభిలషించువారు చేతిలోని అమృతమును వీడి విషమును కోరువారగుదురు. 235 1/2

జ్యేష్టే జ్యేష్టా ప్రయాగస్య మధ్యమే మధ్యమా స్మృతా || 236

ప్రదక్షిణం తతో గచ్ఛే త్కనీయాంసం విచక్షణః | త్రిష్వప్యేతేషు స్నాయీత కుర్యా చ్చాపిప్రదక్షిణమ్‌ || 237

ప్రయచ్ఛతి పితృభ్యో య స్తోయం తేషాం తిలాన్వితమ్‌ | తేపి తుష్టాః పునస్తస్య ప్రయచ్ఛం త్యమితం ఫలమ్‌ || 238

యః స్నాత్వా ప్రయతో నిత్యం తతః పశ్యే త్పితామహమ్‌ | అనులోమ విలోమాభ్యాం తథా వ్యస్త సమస్తయోః 239

స్నాతవ్యం పుష్కరే నిత్యం బ్రహ్మ లోక మభీప్సతా | త్రీణి శృంగాణి శుభ్రాణి త్రీణి ప్రసవణాని చ || 240

పుష్కరాణి ప్రసిద్ధాని న విజ్ఞ స్తత్ర కారణమ్‌ | కనీయాంసం మధ్యమం చ తృతీయం జ్యేష్ట పుష్కరమ్‌ || 241

శృంగ శబ్ధాభిధానాని శుభ ప్రస్రవణాని చ | ధర్మార్ధ కామ మోక్షాణాం సంకల్పై రఫలం నరః || 242

యస్తత్ర సంత్యజేద్దేహం మోక్షం ప్రాప్నోత్యసంశయమ్‌ | ప్రయతః సంయతస్తస్యాం స్నాత్వా దద్యా ద్విజే శుభమ్‌ || 243

గామేకాం మంత్రపూతాం చ లోకానాప్నోతి మోక్షదాన్‌ | కిమత్ర బహునోక్తేన రాత్రావపి హి యోర్ధినే || 244

అర్ధం ప్రయచ్ఛతే స్నాత్వా సోనంతం సుఖమశ్నుతే | తత్ర దానం ప్రశంసంతి తిలానాం మునిసత్తమాః || 245

కృష్ణపక్షే చతుర్దశ్యాం స్నానం చ విహితం సదా | పిణ్యాకేన గుడేనాపి పిండం యోత్ర ప్రయచ్ఛతి || 246

పితౄణాం ప్రయతో భూత్వా పితృలోకం స గచ్ఛతి | 246 1/2

ప్రయాగమున జ్యేష్ఠభాగమున ఇది జ్యేష్ఠము. మద్యమున మధ్యభాగము. ప్రదక్షిణ మార్గమున కనిష్ఠమునకు వెళ్ళవలయును. ఈమూడుచోట్ల స్నానము గావించవలయును. ప్రదక్షిణము నాచరించవలయును. ఈ ప్రదేశములో తిల సమన్విత తర్పణజలమును పితరులకు విడిచినవారికి పితృదేవతలు ప్రసన్నులై అమితఫలమును ఇత్తురు. ప్రతినిత్యము శ్రద్ధాభక్తులతో ఈ నదిలో స్నానమాడువారు బ్రహ్మను సాక్షాత్కరించుకోగలరు. బ్రహ్మలోకమును అభిలషించువారు అనులోమ విలోమ మార్గములలో సమాస వ్యాస మార్గములలో ప్రతినిత్యము పుష్కరమున స్నానమాడవలయును. పుష్కరములు మూడు శృంగములు శుభ్రములు, మూడు ప్రస్రవణములుగా నుండును. ఇదియే ప్రసిద్ధి. దీనికి కారణము మాత్రము తెలియదు. ఇచ్చట కనిష్ఠ భాగము, మధ్యమ భాగము, జ్యేష్ఠ భాగము శృంగ మను పేరుతో, శుభ ప్రస్రవణ నామములతో పిలువబడుచుండును. ధర్మార్థకామమోక్షములను పొందనివారు ఈ తీర్థమున దేహత్యాగమును గావించినచో మోక్షమునందగలరు. శ్రద్ధాభక్తులతో ఈ తీర్థమున స్నానమాడి బ్రాహ్మణోత్తమునకు మంత్రపూతగోవును దానము గావించినచో మోక్షలోకమును చేరును. ఇంకేమి చెప్పవలయును. రాత్రిపూట అభిలషించువానికి అర్థమునిచ్చిననూ అనంతఫలము నొసంగును. ఈ సరస్వతీతీర్థమున తిలదానము సర్వోత్తమముగా ప్రశంసించెదరు. కృష్ణచతుర్దశీ స్నానము విశేష ఫలప్రదము. అట్లు స్నానము చేసి పిండితో కాని గుడముతో కాని పితృదేవతలకు పిండప్రదానము గావించినచో పితృలోకమును చేరును. 246 1/2

పుష్కరారణ్యమాసాద్య పునస్తస్మాత్సరస్వతీ || 247

అంతర్ధానం గతా గంతుం ప్రవృత్తా పశ్చిమా ముఖీ | నాతిదూరే తతస్తస్య పుష్కరస్య సుశోభనా || 248

ఖర్జూరవనమాసాద్య ఫలపుష్పోపశోభితమ్‌ | తత్రోషిత్వా పునర్దేవీ వనే మునిమనోరమే || 249

సర్వర్తుకుసుమాకీర్ణే సిద్ధచారణసేవితే | నందా నామ సరిచ్ఛ్రేష్ఠా త్రిషు లోకేషు విశ్రుతా || 250

మీననక్రఝుషోపేతా విమలోదకపూరితా | సూతఉవాచ : అథ దేవవ్రతః ప్రాహ కిమాన్యా సా సరిద్వరా! || 251

ఈ సరస్వతీనది పుష్కరారణ్యమును చేరి అంతర్థానము చెంది పశ్చిమాభిముఖముగా పయనమాయెను. పుష్కరారణ్యమునకు అతిసమీపమున ఖర్జూరవనమును చేరెను. ఆ వనము ఫలపుష్పశోభితము. మునులకు మనోరమము అన్ని ఋతువుల పుష్పములతో శోభిల్లునది. సిద్ధచారణసేవితము. అట్టి వనమున కొంతకాలముండి ''నందా'' అను పేరుతో మూడులోకములలో ప్రసిద్ధిగాంచెను. మీనములు, మొసళ్లు, సొరచేపలతో కూడినది స్వచ్ఛజలముతో నిండియుండునదిగా నుండును. 251

ఏతన్మే కౌతుకం బ్రహ్మ ! న్నందా శబ్దా సరస్వతీ | యథాభూతా యేన కృతా కారణన సరిద్వరా || 252

ఏవముక్తే పులస్త్యః స భీష్మాయైతత్పురాతనమ్‌ | ఆఖ్యాతుముపచక్రామ నందా నామ యతః స్మృతః || 253

క్షత్రవ్రతధరో నిత్యమాసీద్రాజా ప్రభంజనః | ప్రవృత్తోసౌ మృగాన్‌ హంతుం వనే తస్మిన్మహాబలః || 254

స దదర్శ తతస్తస్మిన్మృగీం గుల్మాంతరే స్థితాం | మార్గణన సుతీక్షణన తాం వివ్యాధ పురోగతాం || 255

సా విలోక్య దిశః సర్వాస్తం దృష్ట్యా శరపాణినం | ఆహ కిం తే కృతం మూఢ త్వయైతత్కర్మ దుష్కరమ్‌ || 256

స్తనంతావత్ర్పయచ్ఛామి సుతస్యాదోముఖీ స్థితా | మాంసలోభేన విద్ధాహం తరసా హ్యకుతోభయా || 257

పిబంతం గుప్తవత్సం చ గుడమైధునమాగతం | ఏవం విధం మృగం రాజన్నహన్యాత్ప్రాఙ్మయా శ్రుతం || 258

స్తనం తు తనయస్యాస్య ప్రయచ్ఛంతీ త్వయా హతా | బాణనాశనికల్పేన నిర్ధోషా వనమాగతా || 259

తస్మాత్వమపి దుర్భుద్ధే క్రవ్యాదత్వమవాప్స్యసి | వనేస్మిన్కంటకాకీర్ణే వ్యాఘ్రరూపం త్వమాప్నుహి || 260

శాపప్రదానాం శృత్వైవం స రాజా పురతః స్థితః | ప్రోవాచ ప్రాంజలిర్భూత్వా తాం మృగీం వ్యాధితేంద్రియః || 261

స్తనం తు తనయస్యేహ ప్రయచ్ఛంతీ న మే మతా | ఆజ్ఞానేన హతా భ##ద్రే ప్రసీద సుసమాధినా || 262

వ్యాఘ్రరూపమహం త్యక్త్వా ప్రాప్స్వామి మానుషం కదా | ఏవం విధస్య శాపస్య విమోక్షం శంస మే మృగీ || 263

సూత మహర్షి పలికెను.

అంతట భీష్ముడు ఇట్లు పలికెను. ఇంకా నది ఏయే రూపములతో పేర్లతో విలసిల్లు చున్నది. ఈ సరస్వతీ నదికి ''నందా'' అను పేరు ఎట్లు వచ్చినది ? ఎవరు పెట్టిరి ? ఈ విషయమును తెలిసికోవలయునని నాకు చాలా కుతూహలముగా నున్నది. గాన తెలుపవలయును. ఇట్లు అడుగగా పుల స్త్య మహర్షి భీష్మునకు ''నందా'' పేరు కలిగిన విధానమును తెలియజేసెను.

క్షత్రియవ్రతము నాచరించు ప్రభంజనుడను మహారాజుండెను. అతను ఈ ఖర్జూర వనమున వేటాడి నానా మృగములను చంపుటకు తలపడెను. ప్రభంజనుడు ఒక పూల పొదలో లేడిని చూచెను. తీక్షణమై బాణముతో ఆ లేడిని కొట్టెను. ఆ లేడి బాణపాణియైన రాజును చూచి ఓ మూర్ఖుడా ! నీవు ఇంతటి నీచమైన పని ఏమి చేసితివి ? తల వంచుకొని నా పుత్రునికి స్తనము నిచ్చుచున్నాను. ఎటు నుండి భయము లేని నన్ను బాణముతో కొట్టితివి. పాలు లేదా నీరు త్రాగుచున్న దానిని, సంతానమును కాపాడుచున్నదానిని సంభోగములో పాల్గొనుచున్న మృగమును చంపరాదని మొదట వినియుంటిని. నా సంతానమునకు పాలిచ్చుచున్న నన్ను చంపితివి. నిర్ధోషురాలను, వనమును చేరిన నన్ను వజ్రాయుధము వంటి బాణముతో కొట్టితివి. కావున దుర్బుద్ధివైన నీవు కూడా మాంసాహారివిగా గమ్ము. బహుకంటకాకీర్ణమగు ఈ అరణ్యమున వ్యాఘ్రరూపమును పొందుము. మృగ మిచ్చిన శాపమును విని ఆ రాజు కలత చెంది చేతులు జోడించి ఇట్లు పలికెను. నీవు నీ సంతానమునకు స్తన్యము నిచ్చుటను నేను చూడలేదు. నేను తెలియక చంపితిని. ప్రసన్నురాలవు కమ్ము. నేను వ్యాఘ్రరూపమును వీడి మానుషత్వమును ఎపుడు పొందెదను. ఈ శాప విమోక్షమును నాకు తెలియబరచుము. 263

ఏవముక్తే మృగే తస్య ప్రోవాచ వచనం శుభం | రాజన్నబ్దశతాంతే తు శాపస్యాగతయా గవా || 264

నందయా సహ సంవాదమాసాద్యాంతో భవిష్యతి | మృగయోక్తే వచనే రాజా వ్యాఘ్ర ఏవాభవత్తదా || 265

నఖదంష్ట్రాయధోపేతో వ్యాఘ్రరూపేతిభీషణః | తత్రానౌ భక్ష్యన్నాస్తే మృగాన్హత్వా చతుష్పధః || 266

ద్విపదానపి తత్రస్థాన్కాలేన క్రమయోజితాన్‌ | ఏవం తత్ర వనే తస్య సంవత్సరశతం గతమ్‌ || 267

ఆత్మానం నిందమానస్య మృగమాంసాని ఖాదతః | కదాహం మానుషం భావం గమిష్యామీదృశం పునః || 268

కుత్సితం న కరిష్యామి వియోనికరణం మహత్‌ | కుర్వతా మాంసలోభేన మృగయాం పరిధావతా || 269

ఆపదా సహితం ప్రాప్తం మానుషాణాం భయావహమ్‌ | దర్శనం దుఃఖదం మహ్యం మృగాణాం మానుషైః సహ || 270

పాపేన పాపతాం నీతో హ్యపాపేపి సతాం కులే | ఉత్పన్నో వికృతం నీతః పశ్య కాలస్య పర్యయమ్‌ || 271

కథం మే భవితా మోక్షః కథం సత్యా మృగీ భ##వేత్‌ |

ఇట్లు రాజు పలుకగా ఆ లేడి ఇట్లు చెప్పెను. ఓ రాజా ! నూరు సంవత్సరముల తరువాత నీ సమీపమున కొచ్చిన నందా అను గోవుతో జరుగు సంవాదముతో నీ శాపము తొలగును. ఇట్లు లేడి పలికిన వెంటనే ఆ రాజు వ్యాఘ్రరూమమును పొందెను. నఖదంష్ట్రాయుధములు గలదై అతిభయంకరమగు వ్యాఘ్రముగా మారెను. ఆ అరణ్యమున ఈ వ్యాఘ్రము చతుష్పాన్మృగముల ద్విపాత్తులను చంపుచుండెను. ఇట్లు నూరు సంవత్సరములు గడిచెను. మృగమాంసములను భక్షించుచున్న తనను తాను నిందించుకొనుచుండెరు. నేనెపుడు మనుష్యత్వమును పొందెదను. ఇట్లు పశుత్వమును మృగత్వమును లభింపచేయు కుత్సితకార్యమును ఇక చేయజాలను. మాంసము మీది ఆశతో మృగమును చంపుటవలన మానవులకు భయమును కలిగించునది ఆపదలకు నిలయమగు వ్యాఘ్రత్వమును పొందితిని. మానవులతో మృగములు కలిసుండుట దుఃఖప్రదము. సత్కులమున జన్మించిననూ పాపరహితుడ నైన నేను పాపబుద్ధితో పాపినైతిని. ఇట్టి వ్యాఘ్ర రూపమును పొందితిని. ఇదంతయూ కాలకృతమే. కావున నాకు సుకృతము లేదు. ఒక హింప మాత్రమే నిందించదగినది నావద్ద ఉన్నది. ఆ హింసతో దుఃఖమే కాని శాపమోక్షము కలుగదు. నాకు శాపమోక్షమెట్లు కలుగును. లేడి మాట ఎట్లు నిజమగును. ఇట్లు ఆలోచించుచుండెను. 272 1/2

గతే వర్షశ##తే తస్య వసతస్తద్వనే తదా || 273

ఆయాతం గోకులం కాలే యవసోదకకారణాత్‌ | గోవాటవాటీసంస్థానం తత్తత్ర సమవస్థితమ్‌ || 274

వనోపకణ్ఠ మంధానరవేణాపూరితం చ యత్‌ | క్షీబైర్గోపైః సమాకీర్ణం పాదపైరపి తద్వనమ్‌ || 275

నిశి వంశరవోపేతం గోపీనాం చ శుభప్రదమ్‌ | ఏవం తు వసత స్తస్య ఖర్జూరవనసంసది || 276

హృష్టా తుష్టా చ పుష్టా చ నందా వై నామ నామతః | గోమండలస్య సా ముఖ్యా హంసవర్ణా ఘటస్రవా || 277

దీర్ఘఘోణా విభక్తాంగీ బంధురాంగీ తనుత్వచా | నీలకంఠా శుభ గ్రీవా ఘంటాలీ మధురస్వనా || 278

సా చ యూధస్య సర్వస్య పుశ్చరతి నిర్భయా | ఘానస్థానం చరేచ్ఛన్నం గత్వైకా చ యథాసుఖమ్‌ || 279

యధేష్టకామా సురభచ్చన్నం చరతి వై తృణమ్‌ | రోహితో నామ తత్రాన్యః పర్వతః సరితస్తటే || 280

ఆనేకకందరదరీగృహా సత్వనిషేవితః | తస్య పూర్వోత్తరే భాగే ఘోరే తృణసమాకులే || 281

సంకటే విషమే దుర్గే భైరవే లోమహర్షణ | మృగసింహసమాకీర్ణే బహుశ్వాపద సేవితే || 282

వల్లీవృక్షాదిగహనే శివాశతనినాదితే |

ఇట్లు నూరు వత్సరములు గడువగా ఆ వనమునకు తృణజలముల కొరకు ఆవుల మంద వచ్చెను. ఆ వనమంతయూ ఆవుల కోడెల నెమరువేయు ధ్వనితో నిండెను. చెట్లనీడలో బలిసిన గోపాలురతో కళకళలాడుచుండెను. రాత్రిపూట ఆ వనమంతయూ వేణునాదముతో శుభప్రదముగా గడుచుచుండెను. ఇట్లు ఖర్జూరవనములో ఆవులమంద నివసించుచుండగా ఆ మందలోని ''నందా'' అను ఒక ఆవు హంసవంటి తెల్లని వర్ణము కలది కుండెడు పాలనిచ్చునది ఆవుల మందలో ముఖ్యమైనది, చక్కని అవయవస్థానము కలది, ఆ నంద మందకు ముందులో నిర్భయముగా సంచరించు చుండెను. ఒంటిగా ఏపుగా గడ్డి ఉన్న ప్రాంతమున సంచరించు చుండెను. యధేష్టముగా సంచరించుచు తృణ భక్షణము గావించుచుండెను. ఆ నదీతీరమున రోహితమనుపర్వతము కలదు. చాలా గుహలు సానువులు శిఖరములు మృగములు కలది. ఆ పర్వతమునకు ఈశాన్యప్రాంతమున ఘోరము తృణాకులము సంకటము విషమదుర్గము భయంకరము, రోమహర్షణము (శరీరమును గగుర్పొడుచునది) మృగసింహములతో కూడినది, చాలా క్రూరమృగములతో కూడినది. తీగలు, పొదలతో, నిండినది ! నక్కల కూతలు కలది. 282 1/2

దుర్గేస్మి న్వసతే రౌద్రః కామరూపీ భయంకరః || 283

ద్వీపే శోణితదిగ్ధాంసో ఘోరదంష్ట్రా నఖాయుధః నందో నామ స ధర్మాత్మా స చ గోపీహీతే రతః || 284

అచ్ఛిన్నాగ్రై స్త్రుణౖ ర్దీర్ఘైర్గోధనం పరిరక్షతి | తస్మాయుధపరిభ్రష్టా సా నందా తృణలిప్సయా || 285

చరంతీ వ్యాఘ్రపురతః సా ధేనుః ప్రత్యుపస్థితా | అభ్యద్రవచ్చ తాం ద్వీపీ తిష్ట తిషేతి చాబ్రవీత్‌ || 286

త్వమద్య విహితో భక్షః స్వయం ప్రాప్తాసి ధేనుకా | ద్వీపినశ్చ వచః శృత్వా నిష్టురం రోమహర్షణమ్‌ || 287

శుక్లరూపాన్వితం బాలం భద్రామిందుసమప్రభామ్‌ | వత్సం స్మరతి సా ధేనుః స్నేహాక్తా గద్గదాక్షరమ్‌ || 288

దహ్యంతీ పుత్రశోకేన నందా సా పుత్రవత్సలా | రుదంతీ కరుణం చైవ నిరాశా పుత్రదర్శనే || 289

ద్వీపీ హృష్టా తు తాం ధేనుం క్రందమానాం సుదుఃఖితామ్‌ | ఉవాచ వచనం ఘోరం ధేనుకే ! కిం ప్రరుద్యతే || 290

దైవాత్సుఖోపపన్నాసి భక్షస్త్వం మే యదృచ్ఛయా | రుదంత్యా వా హసంత్యా వా తవాత్తం జీవితం భ##వేత్‌ || 291

విహితం భుజ్యతే లోకే స్వయం ప్రాప్తాసి ధేనుకా ! మ్యత్యుస్తే విహితోద్యైవ వృధా కిమనుశోచసి ? || 292

పప్రచ్ఛ తాం పునర్ద్వీపీ కిమర్ధం రుదితం త్వయా | కౌతుకం చాత్ర మే జాతం మహాన్మే కథయస్వ వై|| 293

ఈ భయంకరారణ్యములోనే భయంకరము కామరూపి, రక్త పూతాంగము కలది, ఘోరదంష్ట్రనఖాయుధము అగు పెద్దపులి కలదు.

ఆవుల మందవెంట నందుడను ధర్మాత్ముడు గోపాలకుల గోవుల హితమును ఆచరించువాడు కొనలు తెగని గడ్డితో (అనగా అపుడే కొత్తగా మొలచినవి, ఇతర పశువులు భుజించనివి) గోవుల మందను కాపాడువాడు. అతని మందనుండి దారి తప్పిన నందాధేనువు గడ్డిని పొందగోరి తిరుగుచు వ్యాఘ్రము ముందుకు చేరినది. ఆ ఆవు మీదికి వ్యాఘ్రము పరుగెత్తుచు నిలు నిలు మని పలికెను. స్వయముగా చేరిన నీవు ఈ రోజు నా ఆహారముగా విధి ఏర్పరిచెను. అని పలికెను. పెద్దపులి పలికిన నిష్ఠురము శరీరమును గగుర్పొడుచు మాటను వినిన నందాధేనువు చంద్రుని వంటి కాంతి కలిగి తెల్లని రూపు కలిగి బాల్యమున నున్న తన పత్సను (దూడను) తలచుకొని ప్రేమతో బొంగురుపోయిన గొంతుతో పుత్రశోకముతో తల్లడిల్లుచు పుత్రవాత్సల్యము కల 'నంద' జాలిగా ఏడ్చుచు పుత్రుని చూడగల ఆశ కరువైనదై యుండెను.

అట్లు ఏడ్చుచు అరుచు చున్న 'నంద' ధేనువును చూచిన వ్యాఘ్రము ఇట్లు పలికెను. ఓ ధేనువా ! ఎందు కేడ్చుచున్నావు ? దైవవశమున సులభముగా లభించితివి. అప్రయత్నముగా నాకాహారమైతివి. నీవు నవ్వుచున్ననూ ఏడ్చుచున్ననూ నీ జీవితము ముగియుచున్నది. లోకమున బ్రహ్మ ఏర్పరచినదానినే భుజింతురు. అందులో నీవు స్వయముగా వచ్చితివి. నీకీరోజే మృత్యువు విధించబడినది. వృధాగా ఎందుకు దుఃఖింతువు ? అయినా నీవెందుకేడ్చు చున్నావు అని అడిగెను. నాకు నీ విషయమును తెలియవలయునని కుతుహలమున్నది.

వ్యాఘ్రస్య వచనం శ్రుత్వా నందా వాక్యమథాబ్రవీత్‌ | క్షంతుమర్హసి మే నాథః కామరూపి ! న్నమోస్తుతే 294

త్వాం సమాసాద్య లోకస్య పరిత్రాణం న విద్యతే | జీవితార్ధం న శోచామి ప్రాప్తవ్యం మరణం మమ || 295

జాతస్య హి ధృవో మృత్యుర్ధృవం జన్మ మృతస్య చ | తస్మాదపరిహార్యేర్దే న శోచామి మృగాధిప ! 296

దే వైరపి యథా సర్వై ర్మర్త్యవ్యమవ శైర్ధృవమ్‌ | తస్మాత్తు నాహమేవైకా వ్యాఘ్ర ! శోచామి జీవితమ్‌ || 297

కింతు స్నే హేన వై సాధో ! దుఃఖేన రుదితం మయా | అస్తి మే హృది సంతాప స్తం చత్వం శ్రోతుమర్హసి || 298

ప్రథమే వయసి ప్రాప్తే ప్రసూతాహం మృగాధిప | ఇష్టః ప్రధమజాతశ్చ సుతస్తు మమ బాలకః || 299

క్షీరపాయీ చ మే వత్సస్తృణం నాద్యాపి జిఘ్రతి | స చ గోపకులే బద్ధః క్షుధార్తో మామవేక్షతే || 300

తమహం చానుశోచామి కథం జీవిష్యతే సుతః | తస్యేచ్ఛామి స్తనం దాతుం పుత్ర స్నేహవశంగతా || 301

పాయయిత్వా స్తనం వత్సమవలిహ్య చ మూర్థిని | సఖీనామర్పయిత్వా తు సందిశ్య చ హితాహితమ్‌ || 302

పునః ప్రత్యాగమిష్యామి యధేష్టం భక్షయిష్యసి | స నందాయాః వచః శ్రుత్వా మృగేంద్రః పునరబ్రవీత్‌ || 303

వ్యాఘ్ర వచనము విని ''నంద'' ఇట్లు పలికెను. ఓ ప్రభూ నన్ను క్షమించుము. ఓ కామరూపీ ! నీకు నమస్కారము. నిన్ను చేరిన తరువాత ఈ లోకమున రక్షణ లేదు. బ్రతుకుకొరకు విచారించుటలేదు. నేనెలాగూ మరణించవలసినదే. పుట్టినవానికి మరణము తప్పదు. చనిపోయినవానికి పుట్టుక తప్పదు. కావున తప్పించుకోజాలని దాని గురించి నేను విచారించజాలను, పరతంత్రులైనవారు దేవతలు కూడా తప్పక మరణించవలసినదే. కావున నా బ్రతుకునుగూర్చి నేను దుఃఖించుట లేదు.

కాని స్నేహముతో మాత్రమే దుఃఖించు చున్నాను. నా హృదయమున ఒక దుఃఖము కలదు. దానిని నీవు వినవలయును. నాకు ¸°వనము రాగానే నేను ప్రసవించితిని. మొదట కలిగిన పుత్రుడు నాకు చాలా ఇష్టుడు. నా పుత్రుడు పాలు త్రాగువాడు మాత్రమే. ఇంకా గడ్డిని వాసన చూచుటలేదు. ఆ పుత్రుడు గోపకులమున కట్టివేయబడియున్నాడు. ఆకలితో నాకొరకై ఎదురుచూచుచుండును. అతనెట్లుబ్రతుకునని నేను చింతించుచున్నాను. పుత్ర స్నేహపరవశ##నైన నేను నా పుత్రునికి పాలియ్య కోరుచున్నాను. నా పుత్రునికి పాలిచ్చి శిరస్సు మూర్కొని స్నేహితుల కప్పగించి హితాహితములను బోధించి మరల రాగలను. అపుడు నీవు యధేచ్ఛగా భుజింపుము. ఇట్లు నందా వచనములను విని వ్యాఘ్రము మరల ఇట్లు పలికెను. 303

కింతే పుత్రేణ కర్తవ్యం మరణం కిం న బుధ్యసే | త్రస్యంతి సర్వభూతాని మ్రియంతే మాం నిరీక్ష్య చ || 304

త్వం పునః కృపయావిష్టా పుత్ర పుత్రేతి భాషసే | న పుత్రో న తపో దానం న మాతా న పితా గురుః || 305

శక్నువంతి పరిత్రాతుం నరం కాల ప్రపీడితమ్‌ | కథం త్వం గోకులం గత్వా గోపీజనసమాకులమ్‌ || 306

వృషభైర్నాదితం దివ్యం బాలవత్సవిభూషితమ్‌ | భూషణం దేవలోకస్య స్వర్గతుల్యం న సంశయః || 307

నిత్యం ప్రముదితాం దివ్యం సర్వదేవప్రపూజితమ్‌ | యత్పవిత్రం పవిత్రాణాం మంగలానాం చ మంగళమ్‌ || 308

యత్తీర్థం సర్వతీర్థానాం ధన్యానాం ధన్యముత్తమమ్‌ | సమస్త గుణసంపన్నమీశ్వరాయతనం మహత్‌ || 309

యత్ఖ్యాతం సర్వతీర్థానాం భూమిస్వర్గమనుత్తమమ్‌ | గోపీమంధనశ##బ్దేన బాలవత్సరవేణ చ || 310

గవాం హుంకారశ##బ్దేన అలక్ష్మీః ప్రతిహన్యతే | యత్ర వత్సాశ్చ హుంకారం కరుణం మాతృకాంక్షయా || 311

యద్గోపైః పాలితం శూరైర్బహుయుద్ధకృతశ్రమైః ప్రగీతనృత్యసంలాపం నందితాస్ఫోటనాదితమ్‌ || 312

ఇతస్త తస్థ్సితైర్వత్సైర్నర్ద్యమానం సమంతతః | సరోవద్రాజతే గోష్టం చలద్భిరివ పంకజైః || 313

తం శ్రీనికేతనం సౌమ్యం హృష్టపుష్టజనాకులమ్‌ | గోలోక ప్రతిమం దృష్ట్యా కథం ప్రత్యాగమిష్యసి || 314

పంచభూతాని మే భ##ద్రే ! పిబంతు రుధిరం తవ | న నిర్విష్టాని భూతాని వాఙ్మాత్రేణ కరోమ్యహమ్‌ | 315

ముంచుకొచ్చిన చావును తెలియకున్నావు. పుత్రునితో ఏమిచేయుదువు ? నన్ను చూచి అన్ని ప్రాణులు భయపడును. మృతి చెందును. నీవు మాత్రము వాత్సల్యముతో ''పుత్ర ! పుత్ర! '' అని పలుకు చున్నావు. కాలము దాపురించిన వానిని పుత్రులు, తపస్సు, దానము తల్లి, తండ్రి, గురువు కాపాడజాలరు.

నీవు వృషభముల అంభారావములతో కూడినది, దివ్యము, బాలవత్సవిభూషితము, దేవలోకమునకు భూషణమైనది స్వర్గతుల్యమైనది, ఎల్లప్పుడూ సంతోషముతో నున్నది. సర్వదేవతలతో పూజింపబడినది, పవిత్రములకు పవిత్రము, మంగళములకు మంగళము, అన్ని తీర్థములకు తీర్థభూతము, ధన్యములన్నింటిలో ధన్యము సమస్తగుణసంపన్నము, ఈశ్వర నివాసము, అన్ని తీర్ధములలో భూమి స్వర్గముగా పేరెన్నికగన్నది గోపికల పెరుగు చిలుకు ధ్వనితో, బాలవత్సలధ్వనితో, గోవుల హుంకారధ్వనితో దారిద్య్రము పార దోలబడును. తల్లులను కోరిన లేగదూడల హుంకారవమును చేయుచుండును. బాహుయుద్ధమును అభ్యసించు శ్రమించి గోపాలశూరులతో పాలించబడునది, ప్రకర్షముగా గీతనృత్యములతో ఆస్ఫోటిత నాదములతో ఆనందించబడునది అంతటా ఇటునటు తిరుగుచున్న లేగదూడలతో ఆనందించబడునది కదులుచున్న పద్మములతో నున్న సరస్సు వలె శోభించుచుండును. అట్టి శ్రీనికేతనము సౌమ్యము, హృష్ట పుష్ట జనాయుతము గోలోకమును బోలు ఆ వనమునకు వెళ్లి మరల ఎట్లు రాగలవు. నాలోని పంచ భూతములు నీ రక్తముతో తృప్తిని పొందుగాక. నేను మాటలతో పంచభూతములను తృప్తిపరచ జాలను. 315

నందోవాచః :

ఏవం ప్రధమవత్సాయా మృగేంద్ర ! శ్రుణు మే వచః | దృష్ట్వా సఖీ సుతం బాలం గోపాంశ్చ ప్రతిపాలకాన్‌ || 316

గోపీజనముపామంత్య్ర జననీం చ విశేషతః | శపధై రాగమిష్యామి మన్యసే యది ముంచ మాం|| 317

యత్పాపం బ్రహ్మవధ్యాయా మాతృపితృవథేషు చ | తేన పాపేన లిప్యే హాం యద్యహం నా గమే పునః || 318

యత్పాపం లుబ్ధకానాం తు వ్లుెచ్ఛానాం గరదాయినామ్‌ | తేన పాపేన లిప్యే హం యద్యహం నా గమే పునః || 319

గోషు విఘ్నాంశ్చ యే కుర్యుః స్వపంతం తాడయంతి చ | తేన పాపేన లిప్యే హం యద్యహం నా గమే పునః || 320

సకృద్దత్వా తు యః కన్యాం ద్వితీయే దాతు మిచ్ఛతి | తస్య పాపేన లిప్యే హం యద్యహం నా గమే పునః || 321

యస్త వనార్హాన్బలీవర్దాన్విషమే వాహయేత్పుమాన్‌ | కథాయాం కథ్యమానాయాం విఘ్నం కారయతే తు యః|| 322

తేన పాపేన లిప్యే హం యద్యహం నా గమే పునః | గృహే యస్యా గతం మిత్రం నిరాశం ప్రతిగచ్ఛతిః|| 323

తస్య పాపేన లిప్యే హం యద్యహం నా గమే పునః | ఇత్యేతై ః పాతకైర్ఘోరైరాగమిష్యామ్యహం పునః || 324

బుధ్వా సంప్రత్యయం ద్వీపీ పునర్వచనషుబ్రవీత్‌ |

నంద పలికెను :-

ఓ మృగేంద్రా : మొదటిసంతానముకల నామాట వినుము. పుత్రుని స్నేహితులను, బాలులను, గోపాలకులనుచూచి, గోపీజనమును సంప్రదించి, తల్లిని ఓదార్చి, ఒట్టు పెట్టుకొనుచున్నాను. తప్పక రాగలను. నమ్మినచో నన్ను విడువుము. నేను మరల రానేని బ్రహ్మ హత్యాపాపమును మాతాపితురులవధ వలని పాపమును పొందెదను. వేటగాండ్లకు,వ్లుెచ్ఛులకు, విషము నిచ్చువారికి కలుగు పాపము నాకు కలుగును. నేను మరల రానిచో ఆవులకు విఘ్నములను కలిగించువారికి, నిద్రించువానిని దండించువారికి కలుగు పాపము నాకు కలుగు గాత. ఒకసారి దానము చేసిన కన్యను మరియొకనికి దానము చేయువారికి కలుగు పాపము నేను మరల రానిచో నాకు కలుగు గాత. భారమును మోయుటకు తగని వృషభములను విషమ మార్గములో మోయించువారికి, కథను చెప్పుచున్నప్పుడు విఘ్నములను కలిగించువారికి కలుగు పాపము నేను మరల రానిచో నాకు కలుగు గావుత. ఇంటికి వచ్చిన మిత్రునికి భోజనము పెట్టకుండా పంపినవారికి కలుగు పాపము, నాకు కలుగు గావుత. ఇట్టి శపథములను చేయుచున్నాను. నేను మరల వచ్చెదను.

అంతట పెద్దపులి నమ్మకమును పొంది ఇట్లు పలికెను. 324\2

వ్యాఘ్ర ఉవాచ :- సంజాతః ప్రత్యయో స్మాకం శపథైర్థేనుకా తవ || 325

కదాచిన్మన్యసే గత్వా మూర్ఖో యం వంచితో మయా | అత్రా పి కేచిద్వాక్ష్యంతి శపథే నా స్తి పాతకమ్‌|| 326

కామినీషు వివాహేషు గవాం ముక్తౌ తధైవ చ | ప్రాణత్యాగే సముత్పన్నే శ్రద్ధాతవ్యం న చ త్వయా || 327

లోకేస్మిన్నాస్తికాః కేచిన్మూర్ఖాః పండితమానినః | భ్రామయిష్యంతి తే చిత్తం చక్రారూఢమివ క్షణాత్‌|| 328

కుతర్క హేతువృత్తౌ తైరజ్ఞానావృత్తచేతసః ! మోహయంతి నరాః క్షుద్రా ఆగమే న విశారదాః || 329

అతథ్యాన్యపి తథ్వాని దర్శయంత్యతిపశలాః | సమో నిమ్నోన్నతానావచిత్రకర్మ విదో జనాః || 330

ప్రాయః కృతార్ధే లోకో యం మన్యతే నోపకారిణమ్‌ | వత్సః క్షారక్షయం దృష్ట్వా పరిత్యజతి మాతరమ్‌ || 331

న తం పశ్యామి లోకే స్మిన్కృతే ప్రతికరోతి యః | సర్వస్య హి కృతార్ధస్య మతిరన్యా ప్రవర్తతే || 332

ఋషిదేవా సురనవై ః శపథాః కార్యసిద్దయే | కృతాః పరస్పరం పూర్వం తాన్న మన్యామహే వయమ్‌|| 333

సత్యేనా పి శ##పేద్యస్తు దేవా గ్నిగురుసన్నిధౌ | తస్య వైవస్వతో రాజా ధర్మస్యా ర్థం నికృంతతి || 334

మాతే బుద్దిర్భవేదేవం శపధై రేష వంచితః | త్వయైవ దర్శితం సర్వం యధేష్టం కురు సాంప్రతమ్‌ || 335

వ్యాఘ్రము పలికెను.

ఓ ధేనువా : నీ శపథములతో మాకు నీపైన నమ్మకము కలిగినది. ఒకవేళ వెళ్లి నేను ఈ మూర్ఖుని వంచించితిని అని కూడా భావించ వచ్చును. ఇచట ఇట్టి విషయమున ఒట్టు పెట్టుకొనిననూ పాపము లేదని కొందరందురు. కామినిల యందు, వివాహము లందు, గోవులను విడిపించుట యందు, ప్రాణాపాయము కలుగునపుడు ఎదుటివారి శపథములను నమ్మరాదు అని, ఈ లోకమున కొందరు నాస్తికులు, పండితులమని భావించు మూర్ఖులు చక్రమునధిరోహించిన వానివలే ని మనసును భ్రమింపచేతురు. కుతర్కములతో, హేతువులతో, వృత్తాంతములతో అజ్ఞానము నావరించిన చిత్తము కలిగినవారు అవిశారదులు శాస్త్రములనే మోహింపచేయుదురు. కొందరు సుకుమారమతులు అబద్ధములను కూడా నిజములుగా చూపెదరు. చిత్రకర్మవిశారదులు సమస్థలమును ఎత్తు పల్లములు కలదానినిగా కూడా చూపెదరు. తన కార్యమును సాధించుకొనిన జనులు ఉపకరించినవారిని స్మరించరు. దూడ, లేదా శిశువు పాలు అయిపోగానే తల్లిని విడుచును. ఉపకారమునకు ప్రత్యుపకారమును చేసినవారిని నేను చూడలేదు. కార్యము నెరవేరిన తరువాత అందరికి బుద్ధి మారును. ఋషులు, దేవతలు, రాక్షసులు, మానవులు తన పనిని నెరవేర్చుకొనుటకు ఎన్నో శపథములను చేసిరి. మేము వాటిని విశ్వసించము. దేవ అగ్ని గురు సన్నిధిలో శపించు వారికి వైవస్వత రాజు (యముడు) సగము ధర్మమును హరించును. ప్రమాణములతో నేను ఈ వ్యాఘ్రమును మోసగించితిని అను తలంపు నీకు రాకుండు గాత. అన్నిటిని నీవే చెప్పితివి కావున నీకు నచ్చిన దానిని ఆచరింపుము.

నందోవాచ :

ఏవమేవ మహాసాధో కస్త్వాం వంచయితుం క్షమః | ఆత్మైవ వంఛితస్తేన యః పరం వంచయిష్యతి || 336

నంద పలికెను.

నీవు చెప్పినది సత్యమే. నిన్ను ఎవరు వంచించగలరు ? ఇతరులను మోసగించువారు తమను తామే మోసగించుకొనువారు కాగలరు.

ద్వీప్యువాచ :-

ధేనుకే పశ్య ! గచ్ఛ త్వం పుత్రకం పుత్రవత్సలే ! | పాయయిత్వా స్తనం వత్సమవలిహ్య చ మార్ధని || 337

మాతరం భ్రాతరం దృష్ట్వా సఖీస్వజనబాంధవాన్‌ | సత్యమేవా గ్రతః కృత్వా శ్ర్రీఘమాగమనం కురు || 338

వ్యాఘ్రము పలికెను.

ధేనుకా : పుత్రవాత్సల్యము కల నీవు నీ పుత్రుని చూడుము. నీవు పుత్రునికి పాలు త్రాపి శిరస్సును మూర్కొని తల్లిని సోదరుని స్నేహితులను, స్వజనులను బంధువులను చూచి సత్యమును ముందుంచుకొని త్వరగా రమ్ము. 338

ఏవం సా శపథం కృత్వా ధేనుర్వై సత్యవాదినీ | అనుజ్ఞాతా మృగేంద్రేణ ప్రయాతా పుత్రవత్సలా ! || 339

అశ్రుపూర్ణాముఖీ దీనా వేపమానా సుదుఃఖితా | హంభారవం ప్రముంచంతీ పతితా శోకసాగరే || 340

కరీవ చరణగ్రాహం గృహీతః సలిలాశ##యే | అశక్తా స్వపరిత్రాణ విలపంతీ ముహుర్ముహుః || 341

సా తత్ర గోకులం ప్రాప్తా హరిన్నద్యాస్త టే స్థితమ్‌ | శ్రుత్వా వత్సంతు క్రోశంతం పర్యధావత సంముఖీ|| 342

ఇట్లు సత్యవాదిని యగు ధేనువు వ్యాఘ్రము ముందు శపథము చేసి వ్యాఘ్రము అనుమతించగా పుత్రవాత్సల్యము కలదై వెడలెను. కన్నీరు నిండిన మోము కలదై దీనురాలై వణుకు చున్నదై దుఃఖభారముతో అంభారవముతో శోకసాగరములో మునిగినదై సరస్సులో మొసలి కాలునుపట్టిన యేనుగు వలె తనను తాను కాపాడు కొనజాలనిదై మాటిమాటికి విలపించు చున్నదై నదితీరమున నున్న గోకులమును చేరెను. అరచుచున్న తన దూడవద్దకు పరుగెత్తెను. 342

ఉపస్పృత్య చ తం బాలం బాష్పపర్యాకులేక్షణమ్‌ | సంప్రాప్య మాతరం వత్సః శంకితః పరిపృచ్ఛతి || 343

నతే పశ్యామ్యహం స్వాస్థ్యం ధైర్యం నైవాద్య లక్షయే | ఉద్విగ్నా చా పి తే దృష్టిర్భీతా చా తీవ లక్ష్యసే|| 344

కన్నీటితో చూచుచున్న ఆ వత్సమును సమీపించినది. ఆ వత్సము కూడా తల్లిని చేరి అనుమానముతో తల్లిని అడుగుచున్నది.

తల్లీ : నీలో ఆరోగ్యమును ధైర్యమును చూచుట లేదు. ఉద్వేగము భయము నీలో కనిపించు చున్నది. 344

నందోవాచ :

పిబ పుత్ర ! స్తనం మే ద్యకారణం యది పృచ్ఛసి | అశక్తా హం తవా ఖ్యాతుం కురు తృప్తిం యథేప్సితామ్‌|| 345

అపశ్చిమం తు తే పుత్ర దుర్లభం మాతృదర్శనమ్‌ | ఏకా హమద్య మే పీత్వా ప్రభాతే కస్య పాస్యసి || 346

త్వాం త్యక్త్వా పుత్ర గంతవ్యం శపధైరాగతా హ్యహమ్‌| క్షుత్‌క్షామస్య చ వ్యాఘ్రస్య దాతవ్యమాత్మజీవితమ్‌|| 347

నందాయాశ్చ వచః శ్రుత్వా వత్సో వచనమబ్రవీత్‌ |

వత్స ఉవాచ : అహం తత్ర గమిష్యామి యత్ర త్వం గంతు మిచ్చసి || 348

శ్లాఘ్యం మమా పి మరణం త్వయా సహ న సంశయః | ఏకాకినా పి మర్తవ్యం మమార్తేన త్వయా వినా || 349

యది మాం సహితం మాత : ర్వనే వ్యాఘ్రో హనిష్యతి | యా గతిర్మాతృభక్తానాం ధృవం సామే భవిష్యతి|| 350

తస్మాదవశ్యం యాస్యామి త్వయా సహ న సంశయః | అదవా తిష్ట మాతస్త్వం శపథాః సంతు తే మమ || 351

జనన్యా చ వియుక్తస్య జీవితే కిం ప్రయోజనమ్‌ | అనాథస్య వనే నిత్యం కో మే నాథో భవిష్యతి || 352

నా స్తి మాతృసమో బంధుర్బాలానాం క్షీరజీవినామ్‌ | నా స్తి మాతృసమో నాధో నా స్తి మాతృసమో గతిః || 353

నా స్తి మాతృసమః స్నేహో నాస్తి మాతృసమం ముఖమ్‌ | నా స్తి మాతృసమో దేవ ఇహలోకే పరత్ర చ || 354

ఏవం వై పరమో ధర్మః ప్రజాపతివినిర్మితః | యే తిష్టంతి సదా పుత్రాస్తే యాంతి పరమాం గతిమ్‌|| 355

నంద పలుకు చున్నది.

ఓ పుత్రా : పాలుత్రాగుము. నీవు అడగినదానికి కారణమును నేనిపుడు చెప్పజాలను. కావున తనివి తీరా పాలుత్రాగుము. నీకు ఇక మాతృదర్శనము దుర్లభము. ఈ ఒక్కరోజే నా పాలు త్రాగగలవు. రేపు ఎవరి పాలు త్రాగ గలవు. నిన్ను విడిచి నేను వెళ్ళవలయును. ఇటకు శపథము చేసి వచ్చితిని, ఆకలితో వాడిపోయిన పెద్దపులికి నా జీవితమును అర్పించ వలయును.

ఇట్లు నందమాటలను వినిన వత్సము ఇట్లు పలికెను.

వత్సము పలికెను.

నీవు వెళ్ళదలచిన ప్రదేశమునకు నేను వెళ్ళెదను. నీతో కలిసి నేను మరణించుట ఉత్తమము నీవు లేనినేను ఒంటరిగా ఆర్తురాలనై మరణించ వలసినదే. నీతోపాటు నన్నుకూడా అడవిలో పెద్దపులి చంపినచో మాతృభక్తులకు లభించు లోకము నాకు లభించగలదు. కావున నేను తప్పక నీతోరాగలను. లేదా నీ విక్కడే ఉండుము. నీ శపథములు నాకుండనీ : తల్లి లేనిబ్రతుకు నిష్ప్రయోజనము. దిక్కులేని నాకు అడవిలో ఎవరు దిక్కుకాగలరు. పాలుత్రాగి బ్రతుకునిష్ప్రయోజనము, దిక్కలేని నాకు అడవిలో ఎవరు దిక్కుకాగలరు? పాలుత్రాగిబ్రతుకు బాలులకు తల్లితో సాటియగు బంధువు లేడు. తల్లివంటి రక్షకులు, తల్లివంటి దిక్కు ఇంకొకటి లేదు. తల్లివంటి స్నేహము, తల్లివంటి ముఖము లభించదు. ఇహ పరములలో తల్లివంటి దైవము లభించదు. ప్రజాపతి ఇట్టి పరమ ధర్మమును ఏర్పరచెను. పుత్రవంతులు ఉత్తమ గతిని పొందెదరు. 355

నందోవాచ :- మమైవ విహితో మృత్యుర్న త్వం పుత్రా గమిష్యసి |

నచా యమన్యజీవానాం మృత్యుః స్యాదన్యమృత్యునా || 356

అపశ్చిమమంవుత్ర ! సందేశముత్తమమ్‌ | ఆత్రా తిష్టస్వ మద్వాక్యాత్తతః శుశ్రూషణం పునః || 357

జలే స్థలే చ విచరన్‌ ప్రమాదం తాత మా కురు | ప్రమాదాత్సర్వభూతాని వినశ్వయంతి న సంశయః || 358

న చ లోభేత చర్తవ్యం విషమస్థం తృణం క్వచిత్‌ | లోభాద్వినాశః సర్వేషామిహ లోకే పరత్ర చ || 359

సముద్రమటవీం పుత్ర విశంతి లోభమోహితాః | లోభాదకార్యమత్యుగ్రం విద్యానపి సమాచరేత్‌ || 360

లోభాత్ప్రమాదాద్విస్రంభాభిర్నాశో భ##వేన్నృణామ్‌ | తస్మాల్లోభం న కుర్వీత న ప్రమాదం న విశ్వసేత్‌ || 361

ఆత్మా హి సతతం పుత్ర రక్షితవ్యః ప్రయత్నతః | సర్వేభ్యః శ్వాపదేభ్యశ్య వ్లుెచ్ఛచోరాదిసంకటాత్‌ || 362

తిరశ్చాం పాపయోనీనామేకత్ర వసతామపి | విపరీతాని చిత్తాని విజ్ఞాయంతే న పుత్రక || 363

నఖినాం చ నదీనాం చ శృంగిణాం శస్త్రధారిణామ్‌ | న విశ్వాసస్తయా కార్యః స్త్రీణాం ప్రేష్య జనస్య చ || 364

న విశ్వసేదవిశ్వస్తే విశ్వస్తే నా తివిశ్వసేత్‌ | విశ్వాసాద్బయముత్పన్నం మూలా న్యపి నికృంతతి || 365

న విశ్వసేద్విదేహే పి బలిష్టే భీతచేతసి | వక్ష్యంతి గూడమత్యర్దం సుప్తం మత్తం ప్రమాదతః || 366

గంధః సర్వత్ర సతతమాఘ్రాతవ్యః ప్రయత్నతః | గావః పశ్యంతి గంధేన రాజానశ్చారచక్షుషః || 367

నైకస్తిష్టేద్వనే ఘోరే ధర్మమేకం చ చింతయేత్‌ | నచోద్వేగస్త్వయా కార్యః సర్వస్య మరణం ధృవమ్‌ || 368

యథా హి పథికః కశ్చిచ్ఛాయా మాశ్రిత్య తిష్ఠతి | విశ్రమ్య చ పునర్యాతి తద్వద్భూతసమాగమః || 369

పుత్రా నిత్యం జగత్సర్వం తత్రైకః శోచసే కథమ్‌ | తావత్వం శోకముత్సు%ృజ్య మద్వాక్యమనుపాలయ || 370

నంద పలికెను.

నాకే మృత్యువు విధించబడినది. నీవు రావలదు. ఒకరికి విధించబడిన మృత్యువుతో ఇంకొకరు మరణించరు. ఇది తల్లి చివరి సందేశము ఆచరింపుము. నేను చెప్పిన దానిని విని చక్కగా ఆచరించుము. జలములో స్థలములో సంచరించుచు పొరబడకుము. పొరబాటు వలననే అన్ని ప్రాణులు నశించును. తృణ భక్షణమున లోభమును చూపకుము. విషమప్రదేశములోని తృణమునకై ఆశ చూపకుము ఇహపరములలో లోభము వలననే నాశము సంభవించును. లోభమోహతులు సముద్రమున అరణ్యమున ప్రవేశింతురు. పండితులు కూడ లోభము వలన చేయరాని దానిని అత్యుగ్ర కార్యమును కూడా ఆచరింతురు. ప్రాణులకు లోభము, పొరపాటు, తొందరపాటు వలన నాశము సంభవించును. కావున లోభమును చూపకుము. పొరబాటును నమ్మరాదు. అన్నివిధముల ప్రయత్నములతో శరీరమును కాపాడు కొనవలయును. అన్నిమృగముల నుండి, వ్లుెచ్ఛుల నుండి చోరాది సంకటముల నుండి కాపాడు కొనవలయును. ఒక చోట నివసించుచున్ననూ పాపజాతులైన మృగముల విపరీత భావములు తెలియ జాలవు. గోర్లు గల వాటిని, నదులను కొమ్ముల గలవాటిని ఆయుధధారులను స్త్రీలను సేవకులను నమ్మరాదు. నమ్మదగనివారిని నమ్మరాదు. నమ్మినవారిని కూడా ఎక్కవుగా నమ్మరాదు. నమ్మిక వలన భయము కలుగును. మూలచ్ఛేదమేర్పడును. భయము కలవాడు బలిష్టమైన తన దేహమును కూడా నమ్మరాదు. పొరబాటు వలన నిదురించిన వానిని మదించిన వానిని రహస్యముగా చెప్పుచుందురు. ఎపుడు ప్రయత్నముతో అంతటా గంధమును చూడవలయును. గోవులు గంధముతో, రాజులు చారులతో చూచెదరు.

ఘోరమగు అరణ్యములో ఒంటరిగా నుండరాదు. ఒకే ధర్మమును ఆలోచించవలయును. అందరికి మరణము తప్పదు కావున ఉద్వేగమును పొందరాదు. ఒక బాటసారి చెట్టు నీడను చేరి విశ్రాంతి తీసుకొని వెళ్ళునట్లు ప్రాణుల సమాగమముకూడా అని భావించ వలయును. ఈ జగత్తు అనిత్యము కావున ఒంటిగా ఏమి ఆలోచించెదవు ? ఎట్లు ఆలోచించెదవు, కావున నీవు దుఃఖమును విడిచి నా మాటను పాటించుము.

శిరస్యాఘ్రాయ తం పుత్రమవలిహ్య చ మూర్ధని | శోకేన మహతా విష్టా భాష్పవ్యాకులలోచనా || 371

వినిఃశ్వసంతీ నాగీవ దీర్ఘముష్ణం ముహుర్ముహుః | పుత్రహీనం జగచ్ఛూన్యం ప్రపశ్యంతీవ సా భవత్‌ || 372

మహాపంకనిమగ్నేవ తిష్టంతీచావసీదతీ | విలప్య నందినీ పుత్రమువాచేదం పునర్వచః || 373

నా స్తి పుత్రసమః స్నేహో నా స్తి పుత్రసమం సుఖమ్‌ | నా స్తి పుత్రసమా ప్రీతి ర్నా స్తి పుత్ర సమా గతిః || 374

అపుత్రస్య జగచ్ఛూన్యమపుత్రస్య గృహే సుఖమ్‌| పుత్రేణ లభ##తే లోకమపుత్రో సరకం వ్రజేత్‌ || 375

లోకో వదతి వాక్యాని చందనం కిల శీతలమ్‌ | పుత్రగాత్రపరిష్వంగశ్చందనాదతిశీతలః || 376

ఇతి పుత్రగుణానుక్త్వా నిరీక్ష్య చ పునః పుసః | స్వమాతరం సఖీర్గోపీస్త్వరమాణా చ పృచ్ఛతి || 377

యూథస్యా గ్రే చరంతీం మామాససాద మృగాధిపః | ముక్తా హం తేన శపథై ః పునర్యాస్యామి తత్ర వై || 378

సుతం చ మాతరం చైవ సఖీ ద్రష్టుం చ గోకులమ్‌ | ఆగతా సత్యావాక్యేన పునర్యాస్యామి తత్ర పై || 379

మాతః క్షమస్వ తత్సర్వం దౌః శీల్యాది కృతం మమ | బాలస్త వా యం దౌహిత్రః కిమత్రా న్యద్ర్బవీ మ్యహమ్‌ || 380

విపులే చంపకే మాతర్భద్రే సురభి ! మానిని వసుధారే ప్రియా నందే మహానందే ! ఘటస్రవే ! 381

అజ్ఞానాత్‌ జ్ఞానతో వా పి యదుక్తం కించిదప్రియమ్‌ | తత్‌ క్షమధ్వం మహాభాగే యచ్చా న్యచ్చ కృతం మయా || 382

సర్వాః సర్వగుణోపేతాః సర్వలోకస్య మాతరః | సర్వాః సర్వప్రదా నిత్యం రక్షధ్వం మమ బాలకమ్‌ || 383

అనాథం వికలం దీనం రక్షధ్వం మమ పుత్రాకమ్‌ | మాతృశోకాభిసంతప్తం భగిన్యః పాలయిష్యధ || 384

యస్మా దనాథమవలం పుత్రవత్పాలయిష్యధ | క్షమధ్వం చ మహాభాగా యాస్యామి సత్యసంశ్రయాత్‌ || 385

న చింతా మహతీ కార్యా సఖీభిశ్చ కథంచన | ప్రథమస్యాస్య జాతస్య స్థితం మరణమగ్రతః || 386

శిరస్సును ఆఘ్రాణముచేసి, తలను నాకిగొప్పగా శోకించుచు, కన్నీరుతో వ్యాకులమైన కనులు కలదై బరువుగా వేడిగా ఆడనాగువలె నిట్టూర్చుచు పుత్రుడులేని జగత్తును శూన్యముగా తలచుచున్నట్లుండెను. పెద్ద బురదలో మునిగినదానివలె నిలుచుచు బాధపడుచు, పుత్రునిగురించి విలపించుచు నందిని పుత్రునితో ఇట్లు పలికెను.

పుత్రునితోసాటివచ్చుస్నేహము, పుత్రసమసుఖము, పుత్రసమమగుప్రీతి, పుత్రసమగతి లేదు. పుత్రులులేనివానికి జగత్తే శూన్యము. పుత్రులులేనివారింటితో సుఖములేదు. పుత్రునితో ఉత్తమలోకము లభించును. పుత్రులులేనివారు నరకమును చేరుదురు. చందనము చల్లదని లోకము చెప్పును. కాని పుత్రుని కౌగిలి చందనము కంటె చల్లనిది. ఇట్లు పుత్రుని గుణములనుచెప్పి మాటిమాటికి పుత్రునిచూచుచు తన తల్లిని, స్నేహితులను గోపికలను శలవుకోరుచున్నది. మందకుముందుగా సంచరించుచున్న నన్ను పెద్దపులి ఆక్రమించినది. ఏన్నోశపథములను చేసి పెద్దపులినుండి విడువబడితిని.పుత్రుని తల్లిని స్నేహితులను గోకులమును చూచుటకు వచ్చితిని. మాటతప్పరాదు కావున వెళ్ళెదను. ఓ తల్లీ! నా దుష్ర్పవర్తనను అపరాధము లన్నింటిని క్షమించుము. ఇతను నీబిడ్డకొడుకు బాలుడు. ఇంకనూ ఏమిచెప్పెదను. ఓ విపులా! చంపకా! తల్లీ! భద్రా! సురభీ! మానిని! వసుధారాప్రియా ! నందా! మహానందా ఘటస్రవా! తెలిసో తెలియకో నేను మాటలాడిన అప్రియములను చేసిన అపరాధములను క్షమించుడు. అందరూ సుగుణవంతులే. అందరూ లోకమాతలే. అందరూ ఇచ్చువారే. నాపుత్రుని రక్షించుడు. రక్షకులు లేనివాడు. వికలుడు దీనుడు, మాతృశోక ములో సంతప్తుడుఅగు నా పుత్రుని కాపాడుడు! నా సోదరీమణులూ! కాపాడుడు, అనాధుని నిర్బలుని పుత్రునివలె పాలించుడు. మహానుభావులారా! క్షమించుడు. సత్యమును ఆశ్రయించి వెళ్లుచున్నాను. నా స్నేహితులు నాగురించి ఎట్టి చింత చేయరాదు. పుట్టినవానికి ముందున్నది మరణమే.

శ్రుత్వాతు నందావచనం మాతా సఖ్యశ్య దుఃఖితాః | విషాదం పరమం జగ్మురిదమూచుశ్చ విస్మితాః || 387

అహోత్ర మహాదాశ్చర్యం యద్వ్యాఘ్రవచనం తవ | ప్రకర్తుముద్యతం భీమం నందా త్వం సత్యవాదినీ || 388

శపథైః సత్యవాక్యేన వంచయిత్వా మహాభయమ్‌ | నాశనీయం ప్రయత్నేన న గంతవ్యం కథంచన || 389

నందేన చైవ గంతవ్యమధర్మః క్రియతే త్వయా | యద్బాలం స్వసుతం త్వక్త్వా సత్యలోభేన గమ్యతే || 390

అత్ర గాధా పురా ప్రోక్తా ఋషిభిర్ర్బహ్మవాదిభిః ప్రాణత్యాగే సముత్పన్నే శపధైర్నాస్తిపాతకమ్‌ || 391

ఉక్త్వానృతం భ##వేద్యత్ర ప్రాణీనాం ప్రాణరక్షణమ్‌ | అనృతం తత్ర సత్యం స్యాత్సత్యమప్యనృతం భ##వేత్‌|| 392

కామినీషు వివాహేషు గవాం ముక్తే తధైవ చ| బ్రాహ్మణానాం విపత్తౌ చ శపధైర్నాస్తి పాతకమ్‌ || 393

ఇట్లు పలికిన నందావచనములను విని తల్లి, స్నేహితులు దుఃఖించుచు అమితవిషాదమును పొంది ఇట్లు పలికిరి. ఇది చాలా ఆశ్చర్యకరము నమ్మశక్యముకానిది. వ్యాఘ్రమునకు ఇచ్చినమాటలను పాటించదలచిన నీవు సత్యవాదినివి. శపథములతో, సత్యవాక్యములతో మహాభయమును తప్పించుకొని తొలగించుకొనవలయును కాని మరల వెళ్ళరాదు, నందా నీవు వెళ్ళరాదు. నీవు అధర్మము నాచరించుచున్నావు. బాలుడగు పుత్రుని విడిచి సత్యలోభముతో వెళ్లుచున్నావు. బ్రహ్మవాదులగు ఋషులు ఇట్లు చెప్పిరి. ప్రాణాపాయము సంభవించినపుడు శపథములుచేయుట పాపముకాదు. అబద్దము చెప్పిననూ ప్రాణుల ప్రాణములను రక్షించినచో అది సత్యమే అగును. ప్రాణములను హరించు సత్యము అసత్యమగును. స్త్రీల విషయమున, వివాహవిషయమున గోవులను విడిపించుటలో బ్రహ్మణులకు ఆపద కలిగినపుడు శపథములు చేసిన పాతకమంటదు. 393

నందోవాచ:

పరేషాం ప్రాణరక్షార్ధం వదామ్యేవానృతం వచః | నాత్మార్ధముత్సహే వక్తుం జీవితార్ధే కథంచన || 394

ఏకః సంశ్లిష్యతే గర్భే మరణ భరణ తథా | భుంక్తే చైకః సుఖం దుఃఖమతః సత్యం వదామ్యహమ్‌ || 395

సత్యే ప్రతిష్టితా లోకా ధర్మః సత్యే ప్రతిష్టితః | ఉదధిస్సత్యవాక్యేన మర్యాదాం న విలంఘతే || 396

విష్ణవే పృథివీం దత్వా బలిః పాతాలమాశ్రితః | ఛద్మనాపి బలిర్బద్ధః సత్యవాక్యం న చా త్యజత్‌ || 397

ప్రవర్ధమానః శైలేంద్రః శతశృంగః సముత్ఠితః | సత్యేన సంస్థితో వింధ్యః ప్రబంధః నాతివర్తతే || 398

స్వర్గాపవర్గనరకాః సత్యవాచి ప్రతిష్టితాః | యస్తు లోపయతే వాచమశేషం తేన లోపితమ్‌ || 399

యోన్యధా సంతమాత్మాన మన్యథా ప్రతిపద్యతే | కిం తేన న కృతం పాపం చోరేణా త్మాపహారిణా || 400

యాస్యామి నరకం ఘోరం విలోప్యాత్మానమాత్మనా | తస్య వైవస్వతో రాజా ధర్మస్యా ర్ధం నికృంతతి || 401

అగాధే సలిలే శుద్దే సత్యతీర్దే క్షమాహ్రదే | స్నాత్వా పాపవినిర్ముక్తః ప్రయాతి పరమాం గతిమ్‌ || 402

అశ్వమేధసహస్రం చ సత్యం చ తులయా ధృతమ్‌ | అశ్వమేధసహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే || 403

సత్యం సాధుఫలం శ్రుతం చ పరమం క్లేశాదిభిర్వర్జితమ్‌ | సాధూనాం నికటం సతాం కులధనం సర్వాశ్రమాణాం ఫలమ్‌ ||

యస్మాత్తం సమవాప్య గచ్ఛతి దివం సంత్యజ్యతేసౌ కథమ్‌ | లోకైరత్ర సమాగమే ప్రతిదినం సత్యం వదధ్వం ధృవమ్‌ || 404

నంద పలికెను.

ఇతరుల ప్రాణములను కాపాడుటకు అబద్ధము చెప్పెదను కాని నా స్వార్ధము కొరకు, నా ప్రాణముల కొరకు, అబద్ధమును చెప్పజాలను. గర్భమును ఒకడే చేరును ! చావునందు భరణమునందు సుఖదుఃఖానుభవములందు ఒకడే ఉండును. కావున నేను సత్యమునే పలుకుదును. లోకములు సత్యములోనే నిలుచును. ధర్మము సత్యములోనే నిలుచును. సత్యవాక్యముతోనే సముద్రము చెలియలికట్టను దాటుటలేదు. బలిచక్రవర్తి విష్ణువునకు భూదానమునుగావించి పాతాళము నాశ్రయించెను. కపటముతో బంధించబడిననూ బలిచక్రవర్తి సత్యమును వీడలేదు. నూరుశృంగములుకల వింధ్యపర్వత రాజము పెరుగుచు సత్యవాక్యముపై నిలిచి ప్రతిజ్ఞను తప్పుటలేదు. స్వర్గ అపవర్గ నరకములు సత్యవాక్యమునందే నిలిచియున్నవి. తనమాటలను తప్పినవాడు తన జీవితములో అన్నింటిని తప్పినవాడగును. ఒకవిధముగా నున్న తనను ఇంకొక విధముగా చూపినవాడు ఆత్మాపహారియగు చోరుడగును. అతను చేయనిపాపమంటూ ఏదీఉండదు. నన్ను నేను మోసగించుకొని నరకమును చేరెదను. అట్టినాకు యమధర్మరాజు సగము ధర్మమును లోపింపచేయును. లోతుతెలియని పరిశుద్ధ జలముకల సత్యతీర్థములో క్షమాహ్రదములో స్నానముచేసినవాడు పాపములను తొలగించుకొని పరమపదమును చేరును. వేయి అశ్వమేధయాగములను సత్యమును త్రాచులోతూచినచో అశ్వమేధసహస్రముకంటె సత్యమే విశిష్టమగును. సత్యము సాధుఫలము. పరమశాస్త్రము. ఏక్లేశములూ ఉండవు. సాధుజనులవద్ద ఉండును. సత్పురుషులకు మూలధనము. సర్వాశ్రమఫలము. సత్యమును ఆశ్రయించియే స్వర్గమును చేరును. అట్టి సత్యమును ఎట్లు విడుతురు. కావున జనులు పరస్పరము సత్యమునే చెప్పుదురు.

సఖ్య ఊచు:

నందే! సా త్వం నమాస్కార్యా సర్వై రపి సురాసురైః | యా త్వం పరమసత్యేన ప్రాణాం స్త్యజసి దుస్త్యజాన్‌ || 405

బ్రూమః కిం తత్ర కల్యాణి యా త్వం ధర్మదురంధరా | త్యాగేనానేనాప్రాప్యం త్రైలోక్యే వస్తు కించన || 406

అవియోగం చ పశ్యామస్త్యాగాదస్మాత్సుతేన హి | నార్యాః కల్యాణచిత్తాయా నాపదః సంతి కుత్రచిత్‌|| 407

దృష్ట్వా గోపీజనం సర్వం పరిక్రమ్యచ గోకులమ్‌ | నందా సంప్రస్థితా దేవాన్‌ వృక్షాంశ్చా పృఛ్య సా పునః || 408

క్షితిం వరుణాగ్రీం చ వాయుం చాపి నిశాకరమ్‌ | దశదిగ్ధేవతావృక్షానక్షత్రాణి గ్రహైః సహ || 409

సర్వాన్విజ్ఞాపయామాస ప్రణిపత్య ముహుర్ముహుః | యే సంశ్రితా వనే సిద్ధాః సర్వాశ్చ వనదేవతాః || 410

వనే చరంతం చ తృణం తే రక్షంతు సుతం మమ | చంపకాశోకపునాగాస్సరలా ర్జుసకింశుకాః || 411

శృణ్వంతు పాదపాః సర్వే సందేశం మమ విక్లబమ్‌ | వత్సమేకాకినం దీనం చరంతం విషమే వనే || 412

రక్షధ్వం వత్సకం బాలం స్నేహాత్పుత్రమివౌరసమ్‌ | మాత్రా పిత్రా విహీనం చ అనాధం దీనమానసమ్‌ || 413

విచరంతమిమాం భూమిం క్రందమానం సుదుఃఖితమ్‌ | తస్యేహ క్రందమానస్య మత్పుత్రస్య మహావనే || 414

మహాశోకాభిభూతస్య క్షుత్పిపాసాతురస్య చ | శూన్యసై#్యకాకినః సర్వం జగచ్ఛూన్యం ప్రపశ్యతః || 415

చరమాణస్య కర్తవ్యం సానుక్రోశైస్తు రక్షణమ్‌ | సందిశ్య నందా ప్రీత్యైవం పుత్రస్నేహవశం గతా || 416

శోకాగ్నినా చ సందీప్తా విచ్ఛినా పుత్రదర్శనే | వియుక్తా చక్రవాకీవ లతేవ పతితా తరోః || 417

ఆంధేవ దృష్టి రహితా ప్రస్ఖలంతీ పదే పదే | అగచ్ఛత్సా పునస్తత్ర యత్రాసౌ పిశితాశనః || 418

ఆస్తే విస్ఫూర్జితముఖస్తీ క్షణదంష్ట్రో భయావహః | తావత్తస్యాః సుతో వత్స ఊర్ధ్వోపుచ్ఛో తివేగవాన్‌ || 419

ఆగత్య మాతుర గ్రేసౌ మృగేంద్రస్యాగతోభవత్‌ | 420

స్నేహితులు పలికిరి.

నందా నీవు దేవదానవులందరిచేత నమస్కరించదగినదానవు. నీవు సత్యబలముతో వదలరాని ప్రాణములను విడచుచున్నావు. నీవు ధర్మ దురంధరరాలవుగా నున్నావు. కావున మే మేమి చెప్పగలము? నీవు చేయు ఈత్యాగముతో నీకు మూడులోకములలో పొందరానిదేదీ ఉండదు. నీవుచేయు ఈ త్యాగమువలన నీకు పుత్రవియోగము సంభవించదనే మా భావన. మంచి మనసుకల స్త్రీకి ఆపదలు కలుగవు. గోపీజనమును చూచి, గోకులమును ప్రదక్షిణముగావించి దేవతలను వృక్షములను అనుమతి అడిగి బయలుదేరెను. భూమిని, అగ్నిని, వాయువును, వరుణుని, చంద్రుని, దశదిక్పాలకులను, వృక్షములను, నక్షత్రములను, గ్రహములు అందరిని నాపుత్రుని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఇట్లు పలికి మాటిమాటికి నమస్కరించి ఈవనము నాశ్రయించిన సిద్ధులు వనదేవతలందరూ వనమున తృణభక్షణమును చేయుచున్న నా పుత్రుని రక్షించుగాత. చంపకా-శోక పున్నాగ ఆర్జున కింశుక వృక్షములారా ! మిగతా అన్ని వృక్షరాజములారా! నా సందేశమును వినుడు. నాపుత్రుని ఒంటరిని విషమారణ్యమున తిరుగుచున్న వానిని మీసొంతపుత్రునిలా నాబాలుని ప్రీతితో కాపాడుడు. నా పుత్రుడు తలిదండ్రులులేనివాడు అనాధ దీనమనస్కుడు. ఈ ప్రదేశమున తిరుగుచున్నవాని దుఃఖముతో ఆక్రోశించుచున్నవానిని, ఈ మహావనమున మహాదుఃఖము కప్పివేసినవానిని, ఆకలిదప్పులతో అలమటించువానిని, శూన్యమున ఒంటరిగాఉండి జగత్తును శూన్యముగా చూచుచున్నవానిని జాలిగొలుపు తృణభక్షణకై సంచరించువానిని మీరంతా కాపాడవలయును, ఇట్లు పుత్ర వాత్స్యల్యముతో నంద ప్రీతితో అందరిని ప్రార్ధించి శోకాగ్నితో తలపించబడుచు పుత్రదర్శనమును పోగొట్టుకొనినదై, ఎడబాసిన చక్రవాక పక్షివలె, చెట్టునుండి జారిన తీగవలె గుడ్డిదానివలె అడుగడుగున తడబడుతూ వ్యాఘ్రమున్న ప్రదేశమునకు వెళ్ళెను. ఆ వ్యాఘ్రము తీక్ష్నదంష్ట్రములు కలిగి ప్రతాపము తొణికిసలాడు ముఖముకలదై భయము కలిగించుచున్నంతలో నందాపుత్రుడు బాలుడు తోకపైకెత్తుకొని అతివేగముతో తనముందుకు వచ్చి వ్యాఘ్రముముందు నిలబదెను. 419 1/2

ఆగతం తు సుతం దృష్ట్వా మృత్యుం తమగ్రతః స్థితమ్‌ || 420

వ్యాఘ్రం దృష్ట్వా తు సా ధేనురిదం వచనమబ్రవీత్‌ | భో భో మృగేంద్రాగతాహం సత్యధర్మవ్రతే స్థితా || 421

కురు తృప్తిం యదాకామమస్మన్మాంసేన సాంప్రతమ్‌ | సంతర్పయస్య భూతావి పిబ త్వం శోణితం మమ || 422

మృతాయాం తు మయి త్వం భో భ##క్ష్యేమం తు వాలకమ్‌ |

ద్వీప్యువాచ :- స్వాగతం తవ కల్యాణి ధేనుకే సత్యవాదినీ || 423

న హి సత్యవతాం కించిదశుభం భవతి క్వచిత్‌ | త్వయోక్తం దేనుకే పూర్వం సత్యం ప్రత్యగమే పునః || 424

తేన మే కౌతుకం ప్రాప్తం ప్రాప్తా గచ్ఛేత్కధం పునః | తవ సత్యపరీక్షార్ధం ప్రేషితాసి మయా పునః || 425

అన్యథా మాసమాసాద్య జీవంతీ యాస్యసే కథమ్‌ | యచ్చ నః కౌతుకం జాతం సత్వమన్వేషణం మమ || 426

తస్మాదనేన సత్యేన ముక్తాసి చ మయాధునా | భగినీ భవతీ మహ్యాం భాగినేయః సుతస్తవ || 427

దత్తోపదేశస్య శుభే మమ పాపిష్టికర్మణః | సత్యే ప్రతిష్టితా లోకా ధర్మః సత్యే ప్రతిష్టితః || 428

సత్యేన గౌః క్షీరధారాం ప్రముంచతి హవిఃప్రియమ్‌| స పై ధన్యతమో గోపో యస్త్వత్‌క్షీరేణ జీవతి || 429

భూమిప్రదేశా ధన్యాస్తే సతృణా వీరుధః శుభే | తే ధన్యాశ్చ కృతార్థాశ్చ తైరేవ సుకృతం కృతమ్‌ || 430

తైరాప్తం జన్మనః సారం యే పిబంతు పయస్తవ |

వచ్చిన పుత్రుని ఎదరుగాఉన్న మృత్యురూపమైన పెద్దపులినిచూచి ఆ నందాధేనువు ఇట్లు పలికెను.

ఓ మృగరాజమా ! సత్యధర్మవ్రతమున నిలిచిన నేను వచ్చితిని. ఇక ఇపుడు నా మాంసముతో యధేచ్ఛగా తృప్తిని పొంందుము. ప్రాణులను తృప్తి పరుచుము. నా రక్తమును త్రాగుము. నా మృత్యువు తరువాతనే ఈ బాలకుని భక్షింపుము.

వ్యాఘ్రము పలికెను.

ఓ సత్యవాదినీ! శుభప్రదురాలా! ధేనువా! నీకు స్వాగతము. సత్యవంతులకు ఎక్కడా అశుభము జరుగదు. నీవు ముందు తప్పక తిరిగి వత్తునని చెప్పితివి. నీవు వెళ్లి మళ్ళి వచ్చెదవా అని సందేహము కలిగినది. నీ సత్యవ్రతమును పరీక్షించుటకే నిన్ను పంపితిని. లేనిచో నన్నుచేరినవారు బ్రతికి తిరిగి వెళ్ళుటెట్లు? సత్యాన్వేషణలో నాకు కుతూహలము కలిగినది. నీ ఈ సత్యవ్రతముతో నాచే విడువబడితివి. ఇపుడు నీవు నాకు సోదరివి. నీ పుత్రుడు నాకు మేనల్లుడు, పాపకర్ముడనైన నాకు చక్కని ఉపదేశమును చేసితివి. లోకములన్నియూ సత్యమున ప్రతిష్ఠించ బడినది. ధర్మము సత్యముననే ప్రతిష్ఠించబడినది. సత్యముతో గోవు ప్రియహవ్యమగు క్షీరమునిచ్చుచున్నది. నీ పాలతో బ్రతుకు గోపాలుడు ధన్యుడు. నీవు భక్షించు తృణాదులుకల ఆ ప్రదేశములు ధన్యములు. నీపాలను త్రాగువారు ధన్యులు కృతార్ధులు ఎంతో సుకృతమును చేసియున్నారు. జన్మఫలమును పొందినవారు. 430 1/2

మృగేంద్రః ప్రత్యయం గత్వా విస్మయం పరమం గతః || 431

ప్రత్యాదేశోయమస్మాకం సత్యం దేవైః ప్రదర్శితః | సత్యమిష్టం గవాం దృష్ట్వా న మే వాఞ్ఛస్తి జీవితుమ్‌ || 432

తత్కరిష్యామ్యహం కర్మ యేన ముచ్యేయ కిల్బిషాత్‌ | మయా జీవ సహస్రాణి భక్షితాని శతాని చ || 433

గతిం కామిహ గచ్ఛామి దృష్టా గోః సత్యమీదృశమ్‌ | అహం పాపో దురాచారో నృశంసో జీవఘాతకః || 434

కాంస్తు లోకాన్గమిష్యామి కృత్వా కర్మ సుదారుణమ్‌ | గమిష్యే పుణ్యతీర్థాని కరిష్యే పాపశోధనమ్‌ || 435

పతిష్యే గిరిమారూహ్య ప్రవేక్ష్యే వా హుతాశనమ్‌ | ధేనోద్య యన్మయా కార్యం తపః పాపాద్విశుద్ధయే || 436

తచాదిశస్వ సంక్షేపాన్న కాలో విస్తరస్య తు |

ఇట్లు వ్యాఘ్రరాజ్యము విశ్వాసమునుపొంది సరమాశ్చర్యమును పొందెను. దేవతలు సత్యమును ప్రదర్శించిరి అని నా నమ్మకము. గోవులకు సత్యమిష్టమని తెలిసి నేను బ్రతుకాలనుకొనుటలేదు. నన్ను పాపమునుండి తొలగించు సుకృతమును చేయగోరుచున్నాను. నేను కొన్ని వందల వలే ప్రాణులను భక్షించితిని. ఇట్లు గోసత్యమును చూచిన తరువాత నేను పొందులోకమేది? నేను పాపిని, దురాచారపరుడను, నృశీకుడను, జీవహింసచేయువాడను. ఇంతటి సుదారుణ కర్మలనాచరించి ఏగతిని పొందెదను. పుణ్యతీర్ధములకు వెళ్లి పాపప్రక్షాళన గావించుకొనెదను. పర్వతము నధిరోహించి క్రిందికి దూకెదను. నిప్పులో బడెదను. ఓ ధేనువా! నా పాపశుద్ధికిచేయవలసిన తపమును సంగ్రహముగా తెలుపుము. వివరించుటకు సమయము లేదు. 436 1/2

ధేనురువాచ :- తపః కృతే ప్రశంసతి త్రేతాయం జ్ఞానమేవ చ || 437

ద్వాపరే యజ్ఞమిత్యాహు ర్దానమేకం కలౌ యుగే | సర్వేషామేక దానానామిదమేమైకముత్తమమ్‌ || 438

అభయం సర్వభూతానాం నాస్తి దానమతః పరమ్‌ | చరాచరాణాం భూతానామభయం యః ప్రయచ్ఛతి || 439

స చ సర్వభయాన్ముక్తః పరం బ్రహ్మాధిగచ్ఛతి | నాస్త్యహింసా సమం దానం నాస్త్యహింసా నమం తపః || 440

యథా హస్తి పదేష్వన్యత్పదం సర్వం ప్రలీయతే | సర్వే ధర్మాస్తథా వ్యాఘ్ర ప్రలీయంతే హ్యహింసయా || 441

యోగవృక్షస్య ఛాయాయా తాపత్రయవినాశినీ | ధర్మజ్ఞానే చ పుష్పాణి సర్వర్గమోక్షౌ ఫలాని చ || 442

దుఃఖత్రయాభితప్తస్య ఛాయాయోగతరోఃస్మృతా | న బాధ్యతే పునర్దుఖైః ప్రాప్య నిర్వాణముత్తమమ్‌ || 443

ఇత్యేతత్పరమం శ్రేయః కీర్తితం తే సమాసతః | జ్ఞాతం చైవ త్వయా సర్వం కేవలం మాం తు పృచ్ఛసి || 444

ధేనువు పలికెను :-

కృతయుగమున తపమును త్రేతాయుగమున జ్ఞానమును ద్వాపరయుగమును యజ్ఞమును కలియుగమున దానమును ఆచరించవలయును. అన్నిదానములలో ప్రాణులకు అభయ దానమే మిన్న. చరాచరప్రాణులకు అభయమిచ్చువాడు అన్ని భయములనుండి విడివడి పరబ్రహ్మను పొందును. అహింసతోసాటివచ్చుదానము లేదు. అహింసతో సాటివచ్చు తపములేదు. ఏనుగు పాదములలో అన్ని పాదములు కలియునట్లు అన్ని ధర్మములు అహింసలో అంతర్భవించును.

యోగ వృక్షపుఛాయ తాపత్రయమును నశింపచేయునది. ఈ వృక్షమునకు ధర్మము జ్ఞానము పుష్పములు. స్వర్గమోక్షవులు ఫలములు. దుఃఖత్రయముతో తపించువారికి యోగవృక్షఛాయయే ఉపశాంతిని కలిగించును. యోగవృక్షఛాయతో ఆనందమును పొందినవాడు మరల దుఃఖముతో బాధింపబడడు, ఇట్లు పరమోత్తమ శ్రేయస్సును సంగ్రహమును నీకు వివరించితిని. ఇది యంతయు నీకు తెలిసినదే. ఊరికే నన్నడుగుచున్నావు.

ద్వీప ఉవాచ:

అహం మృగ్యా పురా శప్తో వ్యాఘ్రరూపేణ సంస్థితః | తతః ప్రాణివధాత్సర్వమశేషం మమ విస్మృతమ్‌ || 445

త్వత్సంపర్కోపదేశాభ్యాం సంజాతం స్మరణం పునః | త్వం చాప్యసేనసత్యేన గమిష్యసి పరాం గతిం || 446

తదహం త్వా పునః పృచ్ఛే ప్రశ్న మేకం హృది స్థితమ్‌ | సాగ్రం వర్షశతం జాతం చింతయానస్య మే శుభే || 447

భవత్యా భాగ్యయోగేన కదాచిత్స్వర్గశోభ##నే | కృతం ధర్మస్య సంస్థానం సతాం మార్గే ప్రతిష్టితమ్‌ || 448

కింతేభిదానం కల్యాణి బ్రూహి మేజ్ఞస్య సువ్రతే !

నందోవాచ :- మమ నందేతి సంజ్ఞా తు కృతా నందేన స్వామినా || 449

సాంప్రతం భక్షయామీతి హ్యతిష్ఠః కేన హేతునా | నందేతి శృత్వా తన్నామ ముక్త శాపప్రభంజనః || 450

పునర్నృపత్వమాపన్నో బలరూపసమన్వితః | ఏతస్మిన్నంతరే ధర్మస్తాం జ్ఞాత్వా సత్యవాదినమ్‌ || 451

ద్రష్టుం సమాగతస్తత్ర ప్రాబ్రవీచ్ఛ పయస్వినమ్‌ | తవ సత్యవ్రతాద్ధృష్టో ధర్మోహమిహచా గతః || 452

నందే వృణీష్వ భద్రం తే వరం పరం పరతమం హి యత్‌ | ఏవ ముక్తా హి సా దేవ నందా తం ప్రార్థయధ్వరమ్‌ || 453

తవానుభావాత్ససుతా గచ్ఛామి పదముత్తమమ్‌ | భ##వేదిదం శుభం తీర్థం మునీనం ధర్మదాయకమ్‌ || 454

మన్నామ్నాచ సరిదియం నందా నామ సరస్వతీ | వరప్రదానాద్దేవేశ తదేతత్ప్రార్థితం మయా || 455

వ్యాఘ్రము పలికెను :-

నేను పూర్వము లేడిచే శపించబడి వ్యాఘ్రరూపమును పొందితిని. అప్పటినుండి ప్రాణివధ చేయుటవలన అన్నిటిని మరచితిని. నీ సహవాస ఉపదేశము వలన మరల అంతయు జ్ఞప్తికి వచ్చినది. నీవు కూడ ఈ సత్యవ్రతముతో ఉత్తమగతిని పొందెదవు. కాని యిప్పుడు నా మనసులోనున్న ఒక ప్రశ్నను నిన్ను అడుగుచున్నాను. ఈ విషయమును ఆలోచించుచున్న నాకు నూరు వర్షములు గడిచినవి. అదృష్టవశమున నీతో కలయికవలన ధర్మసంస్థానము సన్మార్గప్రతిస్థాపనము జరిగినది. అజ్ఞానినైన నాకు నీ పేరు తెలుపుము.

నంద పలికెను:-

నా ప్రభువైన నందును నాకు నంద అని పేరిడెను. ఇపుడు నన్ను భుజించెదదని పలికి ఎందుకూరకుంటివి? నంద అది వినగానే ప్రభంజన మహారాజు శాపవిముక్తుడాయెను. మరల నృపత్వమును బలరూపములను పొందెను. ఇంతలో ధర్ముడు సత్యవాదిని అగు నందాదేనువును తెలిసి చూచుటకు అచటికి వచ్చెను. నందతో ఇట్లు పలికెను. నేను ధర్ముడను. నీ సత్యవ్రతమును విని నిన్ను చూచుటకు యిటకు వచ్చితిని. ఓ నంద నీకు మేలు కలుగును. నీకు నచ్చిన వరమును కోరుకొమ్ము. ఇట్లు పలుకగా నందధేనువు ధర్ముని ఇట్లు వరమడిగెను. నీ అనుగ్రహము వలన పుత్రునితో కలిసి ఉత్తమ లోకమును పొందెదను. కాని ఈ ప్రదేశము శుభదాయకమగు పుణ్యతీర్థము కావలయును. మునులకు ధర్మప్రదము కావలెను. ఈ సరస్వతీనది నా పేరుతో నందానదిగా పేర్కొనవలెను. తాము వరమిచ్చుట వలన ఈ ప్రార్థన చేయుచుంటిని. 455

పులస్త్య ఉవాచ:- సా తత్ష్కణాద్గతా దేవీ స్థానం సత్యవతాం శుభమ్‌ | ప్రభంజనోపి తద్రాజ్యం సంప్రాప్తః ప్రాగుపార్జితమ్‌ || 456

నందా యేన గతా స్వర్గం నందాం ప్రాప్య సరస్వతీమ్‌ | తేనాఖ్యయా బుధైస్తస్యాః ప్రోక్తా నందా సరస్వతీ || 457

సరస్వతీ పునస్తస్మాద్వనాత్‌ ఖర్జూరసంజ్ఞితాత్‌ | దక్షిణన పునర్యతా ప్లావయంతీ ధరాతలమ్‌ || 458

ఆగచ్ఛన్నపి యస్తస్యానామ గృహ్ణాతి మానవః | జీవన్సుఖం స ఆప్నోతి మృతో భవతి ఖేచరః || 459

తత్ర యే శుభకర్మాణస్త్యజంతి స్వాం తనుం నరాః | తే విధ్యాధరరాజానో భవంతి నుఖినో జనాః || 460

నరాణాం న్వర్గనిఃశ్రేణి స్నానాత్పానాత్సరస్వతీ | తత్ర స్నానం ప్రకుర్వంతి యేష్టమ్యాం సుసమాహితాః || 461

తే మృతాః స్త్వర్గమాసాద్య మోదంతే సుమనోరమాః | సరస్వతీ సదా స్త్రీణాం తత్ర సౌభాగ్యదాయికా || 462

ఉపోషితా తృతీయాయామపి సౌభాగ్యభాజనా | తత్ర తద్దర్శనేనాపి ముచ్చతే పాపసంచయాత్‌ || 463

స్పృశంతి యే నరాః కేచిత్తేపి జ్ఞేయా మునీశ్వరాః | రజతస్య ప్రదానేన రూపవాన్‌ జాయతే నరః || 464

పుణ్యాపుణ్యజలోపేతా నదీయం బ్రహ్మణః సుతా | నందా నామేతి విపులా ప్రవృత్తా దక్షిణాముఖీ || 465

గత్వా తతో నాతి దూరం పుసర్యాతా పరాజ్ఞ్ముఖీ | తతః ప్రభృతి సా దేవా ప్రసభం ప్రకటా స్థితా || 466

తస్యాస్తటేషు పుణ్యషు తీర్థాన్యాయతనాని చ | సంసేవితాని మునిభిః సిద్ధైశ్చాపి సమంతతః || 467

తేషు సర్వేషు భవతి ధర్మ హేతుస్సరస్వతీ | స్నానాత్పానాత్ర్పదానాద్వా హిరణ్యస్య మహానదీ || 468

హాటకక్షితి గౌరీణాం నందా తీర్ధే మహోదయమ్‌ | దానం దత్తం నరైః స్నాతైర్జనయత్యక్షయం ఫలమ్‌ || 469

ధాన్య ప్రదానం ప్రవదంతి శస్తం వస్తు ప్రదానం చ తథా మునీంద్రాః ! యైస్తేషు తీర్ధేషు నరైః ప్రదత్తం తద్ధర్మహేతుః ప్రవరం ప్రదిష్టమ్‌ || 470

ప్రాయోపవేశం ప్రయతః ప్రయత్నాద్యస్తత్ర కుర్యాత్ప్రమదా పుమాన్వా | తీర్థేషు సాయుజ్యమావాప్య సోయం భ##జ్ఞ్మేఫలం బ్రహ్మగృహే యథేష్టమ్‌ || 471

తస్యోపకంఠే తు మృతాస్తు యే పై కర్మక్షయాత్‌ స్ఠావరజంగమాశ్చ | తైశ్చాపి సర్వైః సహసా ప్రసహ్య లభ్యేత యజ్ఞస్య ఫలం దురాపమ్‌ || 472

తతస్తు సా ధర్మఫలప్రదా భ##వేజ్జన్మాది దుఃఖార్ధితచేతసాం నృణామ్‌ |

సర్వాత్మనా పుణ్యఫలా సరస్వతీ సేవ్యా ప్రయత్నాత్పురుషైర్మహానదీ || 473

ఇతి శ్రీపాద్మేపురాణ ప్రథమే సృష్టిఖండే నందాప్రాచీమహాత్మ్యే అష్టాదశోధ్యాయః

పులస్త్య మహర్షి పలికెను:-

ఆ క్షణములోనే నందాధేనువు సత్యవ్రతులు చేరు లోకమును చేరెను. ప్రభంజన మహారాజు కూడ తాను మొదట సంపాదించిన రాజ్యమును పొందెను. నందాధేనువు నందాపేరును పొందిన సరస్వతీనదిని పొంది స్వర్గమును చేరుటవలన ఈ నదిని నందానదిగా వ్యవహరించుచున్నారు. తరువాత సరస్వతీనది ఖర్జూర వనమునుండి బయలుదేరి భూమిని పవిత్రము చేయుచు తడుపుచు దక్షిణదిశగా ప్రవహింపసాగెను. ఈ ప్రాంతమునకు వచ్చిన మానవులు నందానామమును సంకీర్తన చేసినచో బ్రతుకున సుఖమును మరణమున స్వర్గమును పొందును. పుణ్యకర్మలు ఆచరించినవారు నందాతీరమున దేహమును విడిచినచో విద్యాధరరాజులై సకల సుఖములను పొందుదురు. సరస్వతీనదీ స్నానము వలన నదీజలపానము వలన మానవులకు స్వర్గము లభించును. అష్టమీ తిధినాడు, నందానదిలో ఏకాగ్రచిత్తముతో స్నానమాడువారు మరణించిన పిదప స్వర్గమును పొందెదరు. సరస్వతీనది స్త్రీలకు ఎల్లప్పుడు సౌభాగ్యప్రదాయిని. తృతీయతిధినాడు ఉపవసించిన సౌభాగ్యవతి సరస్వతీ నదిని దర్శించిన సకలపాపములనుండి విముక్తురాలగును. సరస్వతీనదీజలమును తాకినవారు మునీశ్వరులగుదురు. సరస్వతీ నదీ తీరమున రజత దానమును చేసిన వారు రూపవంతులు అగుదురు. బ్రహ్మపుత్రియగు ఈ సరస్వతి పరమపవిత్రురాలు. పవిత్రజలము కలది. నందానామముతో ప్రసిద్ధిగాంచి దక్షిణశాఖముఖముగా ప్రవహించినది. అటనుండి కొంతదూరమువెడలి పశ్చాన్ముఖి ఆయెను. అప్పటినుండి సరస్వతీ నది అందరికి కనపడసాగెను. పవిత్రమైన సరస్వతీనదీ తీరములు పుణ్యతీర్థములు దేవాలయము.,వెలసి సిద్ధులచే మునులచే సేవింపబడు చున్నవి. ఆ తీర్థములలో క్షేత్రములలో సరస్వతియే ధర్మహేతువు. ఈ నదిలో స్నానముచేయుట వలన జలపానము వలన బంగారమును దానము చేయుట వలన ఉత్తమ ఫలితము లభించును. బంగారు భూమివలె తనంత భోగమును పొందెదరు. ఈ నదిలో స్నానమాడి దానము గావించినచో అక్షయఫలమును పొందెదరు. మునీంద్రులు ఈ నదీతీరమున ధాన్యమును ధనమును దానముచేయుట ప్రశస్తమనిరి. ఈ నదీతీరమున చేసిన దానము ధర్మహేతువుగ చెప్పబడినది. ఈ నదీ తీరమున ప్రయత్నముతో సావధానముతో ప్రాయోపవేశమును చేసిన పురుషుడుకాని స్త్రీకాని సకల తీర్థసాయుజ్యమును పొంది బ్రహ్మలోకమున యధేష్టఫలమును పొందును. కర్మపరిపాకము వలన ఈ నదీ సమీపమున మరణించిన సావర జంగమములు సకల పాపములను బోనాడి యజ్ఞఫలమును పొందెదరు.ఈ సరస్వతీ మహానది సాధర్మ్యఫల పదం జన్మజరాది దుఃఖములలో పీడించబడు మానవులకు అన్ని విధములుగా పుణ్యఫలమును ప్రసాదించునది కావున మానవులు ఈ సరస్వతీ నదిని ప్రయత్నించి భక్తిశ్రధ్ధలతో సేవించవలయును.

ఇతి శ్రీపాద్మ పురాణమున మొదటిదగు సృష్టిఖండమున నందాప్రాచీ మహాత్మ్యమున పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది.

Sri Padma Mahapuranam-I    Chapters