Neetikathamala-1    Chapters    Last Page

4

దైవస్తుతి

ప్రహ్లాద నారద పరాశర పుండరీక

వ్యాసాది భాగవత పుంగవ హృన్నినాస!

భక్తానురక్త ! పరిపాలన పారిజాత!

లక్ష్మీనృసింహ! మమదేహి! కరావలంబమ్‌.

దాశరథీ

పరమ దయానిధే పతిత పావన నామ హరే యటంచు సు

స్థిరమతులై సదా భజనచేయు మహాత్ముల పాద ధూళి నా

శిరమునc దాల్తు మీరటకుc జేరకుcడంచు యముండు కింకరో

త్కరములc కానc బెట్టునట దాశరథీ! కరుణా వయెనిధీ!

దయా సముద్రుడవైన ఓ రామా! నీవు దయామయుడవు. పతిత పావన నాముడవు. హరివి అని స్థిరమైన బుద్దితో సదా భజనచేయు మహానుభావుల పాద ధూళిని నా తలపై దాల్చెదను. మీరు వారి జోలికి పోవద్దు అని యముడు తన ధూతలను ఆజ్ఞాపించుట! ( అనగా భక్తులకు నరక విముక్తి కల్గునని భావము.)

దిలీపుడు

µj…ÖdÁxmso²R…V xqsWLRiùª«sLiaRP úxms˳ÏÁVª«so. ANSLRi xqsµR…XaRP##\®ªsVƒ«s úxmsÇìØ„sZaP[xtsQª«sVV»][, úxmsÇìØ xqsµR…XaRP##\®ªsVƒ«s aSxqsòQû FyLi²T…»R½ùª«sVV»][, aSxqsòQû FyLi²T…»R½ùª«sVVƒ«sNRPV xqsµR…XaRPùQ\®ªsVƒ«s NSLRiù¬sLRi*x¤¦¦¦ßá ryª«sVLóRiQùª«sVV»][, »R½»yäL][ùÀÁ»R½ xqs»R½öéÌÁª«sVVÌÁ»][ @LjiÇÁƒ«s ˳ÏÁ¸R…VLiNRPLRiV²R…W, AúbP»R½LRiORPQNRPV²R…W, xqsµy¿yLRi‡ÁµôðR…V\®²… LSÇÁùª«sVVƒ«sV FyÖÁLi¿RÁV ¿RÁVLi®²…ƒ«sV. A µj…ÖdÁxms ª«sVx¤¦¦¦LSÇÁÙ µ³R…LRiøxms¼½õ xqsVµR…OTPQßØ®µ…[„s. µyOTPQßáùª«sVV¿Á[ úxmsaRPzqsò F~Liµj…ƒ«s ryLóRiNRP ƒyª«sV®µ³…[¸R…VVLSÌÁV.

దిలీప చక్రవర్తికి అన్నియ ఉన్నవి కాని సంతానభాగ్యము మాత్రము కొఱవయ్యెను. ఒకనాడు దిలీపుడు సంతానాకాంక్షియై భార్యా సమేతముగా గురుదేవుడైన వసిష్ఠమహర్షి సన్నిధి కరిగెను. సుదక్షిణాదిలీపులు అరుంధతీ వసిష్ఠులకు ప్రణామ మొనర్చిరి. కుశల ప్రశ్నల అనంతరము ఇహపర లోకసుఖములను సమకూర్చు వంశ పావనుడైన పుత్రుని ప్రసాదింపు మని దిలీపుడు గురుదేవుని ప్రార్థించినాడు. దిలీపుని విన్నపము విని వసిష్ఠ మహముని రాజునకు సంతానము కలుగకుండటకు గల హేతు వేమా యని ఎఱుంగుటకై క్షణముసేపు ధ్యాన నిమగ్నుడయ్యెను. యోగదృష్టిచేత కారణ మెఱింగి ""మహారాజా! పూర్వమొకప్పుడు మహేంద్రుని సేవించి వచ్చుచు మార్గ మధ్యమునందు కల్పవృక్షము ఛాయలో ఉన్న కామధేనువును పూజింపవైతివి. అంత కామధేనువు కోపించి"" నన్ను తిరస్కరించిన నీకు నా సంతతిని పూజించిననేగాని సంతానము కలగదు"" అని నిన్ను శపించినది. కావున కామధేనువును అవమానించిన కతమున నీ మనోరథ మీడేరలేదు. పూజార్హులను పూజింపకుండట శ్రేయస్సున కడ్డుపడును. అందువలన మన అశ్రమము నందలి కామధేనువు సంతానమగు నంధినీ ధేనువును పవిత్రాంతఃకరణముతో ధర్మపత్నీ సమేతముగా పూజించుము, నీ మనోభీష్ట మీడేర గలదు"" అని ఆజ్ఞాపించెను.

ఇంతలో నందినీధేనువు అడవిలోనుండి మరలి వచ్చినది. ఆ నందినీధేనువు గిపట్టల తాకిడికి లేచిన ధూళి అతని దేహమునకు సోకగానే దిలీపునికి తీర్థాభిషేక మొనర్చిన పవిత్రత స్ఫురించెను. ఓ రాజా! నీ కార్యము త్వరలో నెరవేరు ననుటకు మంగళమూర్తియైన ఈ నందిని పేరును స్మరించినప్పుడు వచ్చుటయే నిదర్శనము. నిత్యము దానివెంటనుండి భక్తి యుతుడవై సేవింపుము"" అని అనుజ్ఞ యిచ్చెను.

ధర్మజ్ఞుడైన దిలీపుడు, పతివ్రత అయిన సుదక్షిణాదేవి పరమభక్తితో నందినీ ధేనువును పూజింపదొడగిరి. ఇతరుల సహయ మేమియు లేక దిలీపుడు ఆ ధేనువునకు గ్రాసము పెట్టుచు, ఒడలు గోకుచు, అడవి ఈగలను తోలుచు అది పోయినదారినే తాను పోవుచుండెడివాడు. ఆ ఆవు నిల్చున్నపుడు తానును నిలుచుచు, నడచుచున్నప్పుడు నడచుచు, కూర్చున్నపుడు కూర్చుండి, నీళ్లు త్రాగినపుడు నీళ్లు త్రాగియు నీడవలె అనుసరించెడివాడు. తపోవనమునకు, మరలి వచ్చునప్పటికి సుదక్షిణాదేవి ఎదురుగా వెళ్లి నందినీధేనువునకు, ప్రదక్షిణముచేసి అక్షతలతో కార్యసిద్ధికి మార్గమువలెనున్న దాని శృంగముల మధ్య భాగమును పూజించెడిది. నందిని దూడకు పాలిచ్చుటకై వెడలు నప్పుడుకూడ వారి పూజలను తొందరపడకుండ గ్రహించెడిది. మహారాజు ధేనువు ప్రాతఃకాలమున మేల్కొనగానే తానును నిద్రనుండి లేచి, రాత్రిధేనువు నిద్రించిన పిమ్మట నిద్రించెడివాడు. ఈ రకముగా దిలీప మహారాజు సంతానార్థమై ఇరువదియెక్క దినములు భార్యతో కూడి గోసేవావాత్రము నాచరించెను.

ఒకనాడు నందిని దిలీప మహారాజు భక్తిని పరీక్షించుటకై హిమగిరి గుహలో ప్రవేశించెను. ఆనందినిని భయంకర మృగములేమి చేయజానవను విశ్వాసముతో అతడు ఒక క్షణము సేపు పర్వతశోభను తిలికించుచుండెను. ఇంతలో ఒకానొక భీకర మృగరాజు ఆవుపై దూకి బలాత్కారముగ ఈడ్చుచున్నట్లు కన్పించెను. నందిని ఆర్తనాదము వినగానే ఆర్త రక్షణ పరాయణుడైన దిలీపుడు వెనుకకు తిరిగి చూడగనే ధేనువుమీదనున్న సింహము గోచరించెను. తన ఏమరుపాటునకు విచారించి ఆ సింహమును వధించుటకు అమ్ములపొదినుండి బాణమును తీసికొన వలయునని బాహువు నెత్తెను. అదేమి ఆశ్చర్యమో! ఎత్తినచేయి ఎత్తినట్లే ప్రతిమవలె కదలక నిలిచిపోయెను. మంత్రౌషధములచే శక్తిని కోల్పోయిన మహాభుజంగమువలె మహారాజు లోలోపల మండిపడుచుండగా, ఆవును పట్టిన ఆసింహము మనుష్య వాక్కుతో ఇట్లనెను:

''చాలు, మహీపాలా! ఏల వ్యర్థముగా శ్రమ పడెదవు. నాపై ప్రయుక్తమైన నీ అమ్ము వమ్ముకాక తప్పదు. నేను పరమశివుని సేవకుడను. నాపేరు కుంభోదరుడు. అదిగో! ఆ కనిపించు దేవదారు వృక్షమును పార్వతీదేవి పుత్రసమానముగా పెంచుచున్నది. ఒకప్పుడు ఒక వనగజము తన చెక్కిలిని ఆ చెట్టునకు రాయుటవలన దాని బెరడు ధ్వంసమైనది. అంత దుఃఖించుచున్న పార్వతిని ఊరడించి పరమేశ్వరుడు దానిని రక్షించుటకై నన్ను సింహమగా మార్చి, నాచెంతకు వచ్చు మృగములను నా కాహారముగా ఏర్పరచినాడు. భగవన్నిర్ణయానుసారము దీని మాంసము ఆహారముగా గైకొనిన నాఆకలి తీరును. నీవు గురుభక్తిని ప్రదర్శించిన వాడనే. నీకు సాధ్యముకాని పనికి నీ వేల యత్నింతువు?'' అని పలికెను.

సింహము మాటలు విని, తన బాణ నిరోధమునకు పరమేశ్వరుడు కారణమని తెలిసికొని ''మృగేంద్రా! సమస్త చరాచర ప్రపంచమును సృజించి, పెంచి, సంహరించు మహేశుడు నీకు వలెనే నాకును పూజ్యుడే. కాని ఆహితాగ్నియైన గురువుగారి గోధనము నా కన్నులముందు నశించుచుండ ఉపేక్షించియుండ జాలను. నాశరీరమును ఆహారముగా గొని దీనిని విడుపుము'' అని అనెను.

రాజు పలుకులకు సింహరూపుడైన శివకింకరుడు నవ్వి ''నీకేల ఈ మూఢకార్యము? రూప ¸°వన సంపదలతో ఏకచ్ఛత్రాధిపత్యముగా సామ్రాజ్యమును పాలింపవలసిన నీదేహమును అల్పమైన దీనికై పరిత్యజించుటకు సంకల్పించితివి. నీవు భూతదయయే ప్రధాన మని భావించినచో ఈ నందినిని రక్షంచిన ఇదొక్కటియే సంతసించును. నీవు జీవించి యున్నచో అసంఖ్యాక ప్రజలకు కన్నబిడ్డలవలె కష్టముల నుండి కాపాడగలవు. గురువుగారి ధన మందువా, కోట్లాది గోవులను ఆయనకు ఒసగుటకు నీకు శక్తి ఉన్నది. అనంత కళ్యాణములకు ఆకరమైన నీ శరీరమును రక్షించుకొనుము'' అని హితవు చెప్పెను.

ఆ మాటలు విని దిలీపుడు దయార్ద్ర స్వాంతుడై ఇట్లు పలికెను ''క్షత్రి (నాశము) యెదవకుండ కాపాడుట క్షత్రియ ధర్మము. అట్టి క్షత్రియజాతికే అపకీర్తి దెచ్చు రాజ్యమేల? ఈ ప్రాణము లేల? ఈ ధేనువు సామాన్య మయినది కాదు. దీనిని పట్టుట ఈశ్వరమహిమ చేత సాధ్యమైనది కాని నీ శక్తి చేతగాదు. కావున దేహమును పణముగా నిడి నా స్వామియైన వసిష్ఠుని ఈ ధేనువును రక్షించుటయే నాధర్మము. సేవక ధర్మము నీకు తెలియనిది కాదు. ఒకవేళ నన్ను చంపకూడదని భావించినచో ఈ శరీరమును గైకొని శాశ్వతమైన యశశ్శరీరమును నాకు ప్రసాదింపుము. సంభాషణము స్నేహమునకు కారణము. అట్టి స్నేహము నాకు ఈ అడవిలో నీతో కలిగినది. స్నేహితుడ నైన నా ప్రార్థన భంగపరచుట నీకు యుక్తము కాదు'' అని పరిపరి విధముల ప్రార్థించెను.

దిలీపమహారాజు గురుభక్తికి, గోసేవానిరతికి మెచ్చుకొని సింహము నందినీ ధేనువును విడిచెను. మరుక్షణమే తనపై సింహము పడునని ఎదురు చూచుచున్న దిలీప మహారాజుపై ఆకాశమునుండి పుష్పవర్షము కురిసెను. తలయెత్తి చూడగనే సింహము కనిపించలేదు. ఆశ్చర్యముతో చూచుచున్న దిలీపునితో నందినీధేనువు ''రాజా! నిన్ను పరీక్షించుటకై నేనే ఈ మాయను కల్పించితిని. వసిష్ఠులవారి ప్రభావము చేత యముడు సైతము నన్నేమియు చేయలేడు. నీ గురుభక్తికి నీ కరుణాహృదయమునకు సంతసించితిని. వరము కోరుకోనుము; ఇచ్చెదను'' అని పలికెను.

దిలీపమహారాజు చేతులు జోడించి వంశకర్తయగు పుత్రుని ప్రసాదింపుమని ప్రార్థించి, నందిని ధేనువు మహిమ వలన సుపుత్రుని గాంచెను.

గురుభక్తిలో, సదాచార పాలనలో, కరుణా హృదయములో దిలీప మహరాజు అద్వితీయుడు.

ప్రశ్నలు

1. దిలీపుని గుణగణము లెట్టివి?

2. సుదక్షిణా దిలీపులు నందినీ ధేనువు నెట్లు సేవించిరి?

3. దిలీపుడు సింహము బారినుండి గోవు నెట్లు రక్షించెను?

Neetikathamala-1    Chapters    Last Page